
2014 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ త్రయం కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే.. అప్పటికే కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన ప్రజలు కేంద్రంలో మోడీకి అధికార పగ్గాలు ఇచ్చాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయిన రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు నడిపిస్తారని చంద్రబాబు నాయుడికి పట్టం కట్టారు ఏపీ ప్రజలు. ఆ విధంగా రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
ఎన్నికల్లో రెండు పార్టీలు ఘన విజయం సొంతం చేసుకున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానన్న మోడీ రాష్ట్రానికి మొండి చేయి చూపించారు. నాటి ముఖ్యమంత్రి కూడా ఈ విషయంపై పెద్దగా స్పందించలేదు. ఎప్పుడూ కూడా ప్రత్యేక హోదాపై బీజేపీని నిలదీయలేదు. అదేతరహాలో 5సంవత్సరాలు కాలయాపన చేసిన చంద్రబాబు 2019 ఎన్నికల సమయానికి బీజేపీపై ఫైర్ అయ్యారు.
5 సంవత్సరాలు మౌనంగా ఉన్న బాబు ఒక్కసారిగా బీజేపీపై మండి పడటం ఏమిటా.. అని అందురు ఒకింత ఆశ్చర్యానికి గురైయ్యారు. ప్రజలు మరీ.. బుర్రలులేని గొర్రెలనుకున్నారో ఏమో కానీ బాబు ఎన్నికల సమయంలో బీజేపీ పై తన విశ్వరూపం చూపించారు. కానీ ప్రజలు అటు బీజేపీని, ఇటు చంద్రబాబును నమ్మలేదు. జగన్ కి పట్టం కట్టిన విషయం తెలిసిందే..
2014 నుంచి జరుగుతున్న తంతు మొత్తాన్ని చూసిన పవన్ కూడా బీజేపీ, టీడీపీపై విమర్శల దాడి చేశారు. కానీ మరలా టీడీపీ చేసిన తప్పే జనసేన చేయడం ఆశ్చర్యం. బీజేపీని నమ్మిన టీడీపీ 2019లో తగిన మూల్యం చెల్లించుకున్న విషయం తెలిసందే. మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీ కలవడం మంచిది కాదు అనేది విశ్లేషకుల అభిప్రాయం.