Home Blog Page 8631

టీడీపీ భరతం పడుతున్న వైసీపీ

ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానుల ప్రతిపాదన తెరపైకి వచ్చినప్పటినుంచి టీడీపీ హయాంలో రాజధాని విషయంలో లొసుగులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అమరావతిలో మనీల్యాండరింగ్ బాగోతం టీడీపీ నేతలను మరీ ఇబ్బంది పెడుతుంది. చంద్రబాబు హయాంలో ఏపీ రాజధాని ఏర్పాటు పథకం ప్రకారమే జరిగిందని అందులో భాగంగానే ఇన్ సైడర్ ట్రేడింగ్ లో మనీల్యాండరింగ్ జరిగిందని ఈడీ ప్రివెన్షన్ అఫ్ మనీ ల్యాండరింగ్ ఆక్ట్ (పిఎంఎల్ఏ)కేసు నమోదు చేసింది.

ఒకవైపు మంత్రి ఉపసంఘం నివేదిక మరోవైపు సిబిఐ ఇచ్చిన ఆధారాలతో టీడీపీపై కేసు పెట్టడం జరిగింది. 797మంది తెల్లరేషన్ కార్డు ఉన్న పేదల పేర్ల పై వందల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఉన్నట్లు సిబిఐ గుర్తించి, తగిన నివేదికను ఆధారాలతో సహా ఈడీకి అందజేసింది.

2014 జూన్ నుంచి డిశంబర్ మధ్య కాలంలో కృష్ణా, గుంటూరు జిల్లాలలో దాదాపు 4వేల ఎకరాల భూ కుంభకోణం జరిగినట్టు మంత్రి వర్గం నిగ్గుతేల్చింది. అందులో తెల్లరేషన్ కార్డు దారులు దాదాపు 760 ఎకరాల స్థలం కొనుగోలు చేసినట్లు ఏసిబిఐ ఆధారాలు స్వీకరించింది.

వైజాగ్ వద్దు, ఈసారికి విజయవాడ: జగన్ సర్కార్

 

అమరావతి ప్రాంతమంతా నిరసనలతో హోరెత్తిపోతుంది. ఎక్కడ చూసినా పోలీసులు కనిపిస్తున్నారు. మరోపక్క మూడు రాజధానుల విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్‌ వేగంగా ముందుకు వెళ్తోంది… ఇప్పటికే అసెంబ్లీలో దీనికి సంబంధిచిన బిల్లు ఆమోదం లభించింది… ఇక, ఇవాళ శాసన మండలి ముందుకు బిల్లు వెళ్లింది.

 

చూస్తుంటే … విశాఖ నుంచి ఈ నెలలోనే పాలన ప్రారంభించాలని వైసీపీ సర్కార్ ప్రణాళికగా ఉందేమో అనిపిస్తుంది . అందులో భాగంగా… జనవరి 26న రిపబ్లిక్ డేను వైజాగ్‌లోనే నిర్వహించేందుకు సిద్ధమైందని సమాచారం . దీనికి సంబంధించిన రిహార్సల్‌ కూడా వేగంగా జరిగిపోతున్నాయి

 

.

అయితే.. జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఇప్పుడు ప్రభుత్వం మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది… ఈసారికి విజయవాడలోనే రిపబ్లిక్ డే నిర్వహించాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. వైజాగ్‌లో నిర్వహించాలని మొదట నిర్ణయించిన వైఎస్ జగన్ సర్కార్.. తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలుస్తుంది. విజయవాడలో రిపబ్లిక్ డే నిర్వహించడం వల్ల అక్కడ ప్రజల్లో ఉన్న అభద్రతాభావాన్ని తొలగించాలనే యోచనలో సర్కార్ పెద్దలు ఉన్నట్టు సమాచారం.

కరోనా దెబ్బతో.. 10లక్షల కోట్లు నష్టం!

ఇటీవల కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ప్రబలుతున్న విషయం తెలిసిందే.. అయితే ఈ కరోనా దెబ్బతో ఇప్పటివరకు 426మంది చనిపోగా.. దాదాపు 20వేల మంది కంటే ఎక్కువే ఈ వైరస్ సోకడం వల్ల ఇబ్బందులు పడుకుతున్నారు.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తున్న కరోనా.. 26దేశాలలోకి విస్తరించింది. అదే సమయంలో చైనాలో అపారమైన నష్టాన్ని రుచిచూపించింది. ఇప్పటికే చైనా వృద్ధిరేటు 1 శాతం తగ్గొచ్చని ఆర్థిక నిపుణులు తెలిపారు మరియు దాదాపు 10లక్షల కోట్లు నష్టం వాటిల్లినట్లు సమాచారం.

Read More: థాయిలాండ్ చికిత్సతో ‘కరోనా’ మాయం

చైనాలో 3.5 కోట్లమంది ప్రజలు బయటకు రావడం లేదు అదే సమయంలో చైనా విమానాలను పలు దేశాలు రద్దు చేశాయి. భారత్ ఒకడుగు ముందుకేసి. చైనా వెళ్లిన వారి వీసాను కూడా రద్దు చేసింది.

2002-03 సమయంలో సార్స్ (సివియర్ అక్యూట్ రెస్పిటరేటరీ సిండ్రోమ్) ప్రబలినప్పుడు చైనా 18బిలియన్ డాల్లర్లు నష్టపోయింది. కానీ ప్రస్తుతం కరోనా దెబ్బతో 136బిలియన్ డాలర్లు నష్టపోయే అవకాశాలు ఉన్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

Read More: రోజు రోజుకు పెరుగుతున్న కరోనా మరణాలు.. ఒంటరౌతున్న డ్రాగెన్ దేశం

అప్పుడు చంద్రబాబు.. ఇప్పుడు జగన్.. రియల్ ఎస్టేట్ మాఫియా

 

అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు సంయుక్తంగా తీసుకున్న నిర్ణయం ఇది. బీజేపీ అగ్ర నాయకత్వం ఒకటే చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే అది ఎక్కడికీ పోదని భరోసా ఇచ్చారు. రాయలసీమ ప్రాంతంలో హైకోర్టు నిర్మించడాన్ని సమర్ధిస్తున్నాం. కానీ వైసీపీ ప్రతిపాదించిన మూడు రాజధానులకు జనసేన పార్టీ వ్యతిరేకం. మూడు రాజధానుల అంశం అచరణీయం కాదు.

 

రాజధాని వికేంద్రీకరణపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఆ పార్టీ వినాశనానికి పునాది అని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. 5 కోట్ల మంది ఆంధ్రులు ఆమోదంతో ఏర్పడిన రాజధాని అమరావతి అని .. దానిని ఇక్కడ నుంచి కదిలించడం అసాధ్యమని అన్నారు. కాదు కూడదని కదిలించినా అది తాత్కాలికమేనని అన్నారు. ఈ విషయాన్ని గ్రామ గ్రామానికీ తీసుకువెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.

 

రాజధాని అంటే టీడీపీ, వైసీపీ పార్టీలకు ఆటైపోయింది. రాజధాని పేరుతో ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే ఇప్పుడు రాజధానిని మార్చి వైసీపీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. రెండు పార్టీలను బలంగా ఎదుర్కొంటాం అన్నారు పవన్ కల్యాణ్. ఇంతపెద్ద రాజధాని అవసరం లేదని ఆనాడే చెప్పాను.

గాంధీనగర్ తరహాలో 10 నుంచి 14 వేల ఎకరాలు చాలన్నాను. టీడీపీ ప్రభుత్వం నా మాటలు పట్టించుకోలేదు. ఇప్పుడు ఇన్‌సైడ్ ట్రేడింగ్ జ

రిగిందన్న నెపంతో ఏకంగా రాజధానినే వైసీపీ ప్రభుత్వం వైజాగ్‌కు తరలిస్తుంది. ప్రశాంతంగా ఉన్న విశాఖపట్నంలో ఫ్యాక్షన్ కల్చర్, రియల్ ఎస్టేట్ మాఫియా చేయాలని చూస్తున్నారు. ఇలాంటి రియల్ ఎస్టేట్ దందాలు తెలంగాణలో చేస్తే ఛీకొట్టారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం చేయాలని అనుకుంటున్నారు అని విమర్శించారు పవన్ కళ్యాణ్.

పెరుగుతున్న కరోనా మరణాలు.. ఒంటరౌతున్న డ్రాగెన్ దేశం

వుహాన్ లో పుట్టిన ‘కరోనా’ ప్రస్తుతం ప్రపంచంలో అనేక దేశాలలో సంచరిస్తుంది. చైనాలో దాదాపు అన్ని ప్రాంతాలలో వ్యాపించింది. ఈ వైరస్ భారిన పడ్డ అనేక వందలమంది చనిపోగా.. వేల మంది ఇబ్బందులు పడుతున్నారు.

చైనాలో నిన్న ఒక్కరోజే 64మంది చనిపోవడం గమనార్హం. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. మొదట రోజు 15మంది మరణించగా.. ఈ సంఖ్య భారీగా పెరిగిపోతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురౌతున్నారు.

Read More: థాయిలాండ్ చికిత్సతో ‘కరోనా’ మాయం

రోజు రోజుకు వైరస్ భారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో ప్రపంచదేశాలు అప్రమత్తం అవుతున్నాయి. ఈ కరోనా వైరస్ ను అంతం చేయడానికి తగిన మెడిసిన్ ను తయారు చేయడం కోసం అన్ని దేశాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఫ్లూ, హెచ్ఐవీ చికిత్సల్లో అందించే మందులను వివిధ మోతాదులలో కరోనా వైరస్ ను కంట్రోల్ చేయొచ్చని థాయిలాండ్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇండియాలో ఇప్పటివరకు 21మంది కరోనా వైరస్ సోకిన వారిని గుర్తించారు. దీంతో ప్రజలలో మరింత కలవరం మొదలైంది.

ఫిబ్రవరి 3, 2020వరకు కరోనా కేసులు, మరణించిన వారి సంఖ్య

రాపాక ప్రసంగానికి.. బల్లలు చరిచిన వైకాపా

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 3 రాజధానులను కోరుకుంటున్నారనీ, తను 13 జిల్లాల వ్యాప్తంగా చూసినప్పుడు ఏ ప్రాంతంలోనూ వ్యతిరేకత లేనే లేదని జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వెల్లడించారు. 3 రాజధానులపై అసెంబ్లీలో జరిగిన చర్చలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అహర్నిశలు కష్టపడుతున్నారంటూ ఆయన చెప్పుకొచ్చారు.

 

రాష్ట్రాభివృద్ధికి సీఎం తీసుకున్న నిర్ణయం బ్రహ్మాండమైనదని చెప్పగానే వైకాపా ఎమ్మెల్యేలంతా సభలో పెద్దపెట్టున బల్లలు చరిచి తమ మద్దతు తెలిపారు. చూడండీ రాపాక ప్రసంగం …

 

కొత్త రెవిన్యూ చట్టంతో కొత్త కష్టాలు.. ఎందుకంటే..

పూర్వం పటేల్, పట్వారీ వ్యవస్థ అమలులో ఉండేది.. ఆ వ్యవస్థను రద్దు చేసి ఇప్పుడున్న తహసీల్ధార్, వి ఆర్ ఓ వ్యవస్థను తీసుకొచ్చారు. దింతో భూ పరిపాలన వ్యవస్థ, రెవిన్యూ శాఖతో ముడిపడి పనిచేయాల్సి వచ్చింది. అందువల్ల రైతులు వారి భూముల రిజిస్ట్రేషన్ విషయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులను తొలగించడానికే “భూ పరిపాలన వ్యవస్థ” ను “రెవిన్యూ శాఖా” నుంచి వేరు చేయాలన్నదే.. కెసిఆర్ సర్కార్ ఆలోచన.

వివరాల్లోకి వెళ్తే.. కెసిఆర్ మొదటిసారి అధికార పీఠం ఎక్కిన తరవాత కొత్త పంచాయితీ వ్యవస్థను తీసుకొచ్చి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.. అయితే ఈసారి మరో కీలక నిర్ణయం తీసుకోనుంది తెరాస సర్కార్. “భూ పరిపాలన వ్యవస్థను రెవిన్యూ శాఖ నుండి వేరు చేసి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థకు అప్పగించాల”ని కెసిఆర్ సర్కార్ యోచిస్తోంది.

ఈ చట్టం ప్రకారం భూ యజమానికే సర్వ హక్కులు ఉంటాయి. రిజిస్ట్రేషన్ కంటే ముందే భూ వివాదాలు ఏమైనా ఉంటే స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న వ్యవస్థ తో మాట్లాడి ఆ గొడవలను సరిచేసుకోవాలి. అలాగే రిజిస్ట్రేషన్ చేసే సమయంలో తహసీల్ధార్ కు సబ్ రిజిస్టార్ కు సంబంధం ఉండదు. రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు ఆ భూమి కి రక్షణ కల్పించడానికి వీలుగా ప్రత్యేక రుసుమును ప్రభుత్వమే చూసుకుంటుంది. ఆ రుసుమును భీమా రూపంలో జమ చేస్తారు. ఈ చట్టం ఏర్పాటు అమలు కోసం ఈ నెల 11 న కలెక్టర్ల తో సమావేశమై వారి సలహాలు తీసుకోవాలనుకుంటున్నారు కెసిఆర్.

అయితే ఈ కొత్త రెవిన్యూ చట్టం తెలంగాణాలో అమలుపరచడం అంత సులువు కాదు. ఎందుకంటే తెలంగాణాలో అరెకరం, ఎకరం భూమి కలిగిన రైతులే ఎక్కువుగాఉన్నారు. ప్రస్తుతం ఉన్న తహసీల్ధార్, వి ఆర్ ఓ వ్యవస్థను పక్కన పెడితే మరిన్ని కష్టాలు వచ్చే అవకాశాలు ఎక్కువ.

వైరల్ అవుతున్న ఫోటో : వైస్సార్ విగ్రహాన్ని తగలబెట్టిన వైనం

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజధాని మార్పు విషయంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఈ నేపధ్యంలో కార్యకర్తలకు మధ్య అనేక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అందులో ఒకటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహనికి తగలబడటం. ఇది సోషల్ మీడియా లో వైరల్ అయింది

Read More:
జగన్ కి షాక్ ఇచ్చిన ప్రధాని మోడీ నిర్ణయం

అసెంబ్లీలో జగన్ పక్కన రాపాక… చూసినవారందకీ షాక్..

 

జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు తొలిరోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ పక్కన కూర్చున్నారు. ఈ ఆసక్తికర సన్నివేశం చుసిన అసెంబ్లీ నాయకులందరూ ఆశ్చర్యపోయారు. ఎమ్మెల్యే రాపాక సీఎం జగన్ తో కొద్దిసేపు మాట్లాడారు.. ఇద్దరూ సీరియస్‌గా ఏదో చర్చించినట్లు కనిపించింది. సభ జరుగుతున్న సమయంలో జరిగిన ఈ సన్నివేశం చర్చనీయాంశమయ్యింది. సీఎంతో ముచ్చటించిన తర్వాత మళ్లీ వెళ్లి.. ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు తన స్థానంలో కూర్చున్నారు.

 

ఇప్పటికే ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు జగన్ పరిపాలన బాగుందని… అంటూ , జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయానికి తన మద్దతు ప్రకటిస్తూ.. జనసేనకి ఒక ప్రశ్నలాగా తయారయ్యాడు. జనసేన వ్యతిరేకిస్తున్న అత్యంత కీలకమైన మూడు రాజధానుల నిర్ణయానికి కూడా మద్దతు పలికారు. అసెంబ్లీకి బిల్లు వస్తే అనుకూలంగా ఓటు వేస్తానని చెప్పుకొచ్చారు. ఆయన నిర్ణయం అలా ఉంటే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎమ్మెల్యేకు షాకిచ్చారు.. ఆయనకు లేఖ రాశారు. ఆ లేఖలో.. రాజధాని నిర్మాణం అమరావతిలోనే కొనసాగాలని, ప్రభుత్వ పాలన సంపూర్ణముగా అమరావతి నుంచే కొనసాగాలని, అభివృద్ధి వికేంద్రీకరణ బరగాలని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందాలని జనసేన పార్టీలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది అన్నారు.

 

జనసేన పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఎమ్మెల్యే రాపాక శాసనసభ సమావేశాలకు హాజరై.. ఏపీ అసెంబ్లీలో ఏపీ డిసెంట్రలైజేషన్‌ అండ్‌ ఈక్వల్‌ డెవలప్‌మెంట్ రీజియన్‌ యాక్ట్‌ 2020, అమరావతి మెట్రో డెవలప్‌మెంట్ యాక్ట్ 2020 బిల్లుల్ని ప్రవేశపెట్టే సమయంలో.. ఓటింగ్ సమయంలో వ్యతిరేకించవలసిందిగా కోరుతున్నాను అన్నారు. మరి అసెంబ్లీలో ఎమ్మెల్యే రాపాక బిల్లకు మద్దతుగా ఓటు వేస్తారా.. పార్టీ అభిప్రాయాన్ని గౌరవిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.

థాయిలాండ్ చికిత్సతో ‘కరోనా’ మాయం

గత కొంతకాలంగా.. కరోనా వైరస్ భయంతో ప్రపంచ దేశాలు గడగడ లాడుతున్న విషయం తెలిసిందే.. అయితే థాయిలాండ్ ప్రభుత్వం కరోనా ని నిర్ములించడానికి చికిత్సని కనుగొన్నామని ప్రకటించింది. దీంతో అన్ని దేశాలు షాక్ అవుతున్నాయి.

ఈ మధ్య థాయిలాండ్ లో ఒక ముసలావిడ కరోనా వైరస్ సోకడంతో ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ ముసలావిడ శరీరం నుంచి కరోనా వైరస్ ను పూర్తిగా నిర్మూలించేశామని ప్రకటించింది థాయిలాండ్. చైనా తరువాత అత్యధికంగా కరోనా బాధితులున్న దేశం థాయిలాండ్. ఫ్లూ, హెచ్ఐవీ చికిత్సల్లో అందించే మందులను వివిధ మోతాదులలో కరోనా వైరస్ ను కంట్రోల్ చేయడానికి వినియోగించారట. అంతే ఈ చికిత్స సక్సస్ అయింది.

మాటలతో మాయ చేసిన బుగ్గన రాజేంద్రనాథ్!

 

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ప్రారంభమైన నేపథ్యంలో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ… తన మాటలతో అందరిని ఆకట్టుకున్నాడు. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయం ముగ్గింపుకు తెచ్చే ఉద్దెశంతో ప్రభుత్వం మూడు రోజుల పటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది.

 

పోయిన అసెంబ్లీ సమావేశాలలో చివరి రోజు జగన్ చేసిన ఒక ప్రకటన రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఒక పధకం ప్రకారం వైసీపీ ప్రభుత్వం రాజధానిని తరలించే ప్రయత్నంలో విజయం సాధించిందనే చెప్పవచ్చు. ఇందులో భాగంగా ఇవ్వాళా ప్రభుత్వం రెండు కీలక బిల్లులని సభలో ప్రవేశ పెట్టింది.

 

మొదట బుగ్గన బిల్లుని ప్రవేశ పెడుతు తన ప్రసంగం మొదలుపెట్టాడు. బిల్లు విషయమై మాట్లాడుతు తన వాక్ చాతుర్యంతో అందరిని ఆలోచింప చేసాడు. గడచిన కాలంలో ఉత్తరాంధ్ర ఇంకా రాయలసీమ ప్రాంతాలకి జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించాడు. చరిత్రని ప్రస్తావిస్తూ అధికార వికేంధ్రీకరణ ఎందుకు అవసరమో తెలియచేసాడు. శ్రీ బాగ్ ఒడంబడిక, శివ రామ కృష్ణన్ కమిటీ చేసిన సూచనలని ప్రస్తావిస్తూ…ఇటీవల కాలంలో చేసిన జిఎన్ రావు ఇంకా బీసీజీ సర్వేలను బట్టబయలు చేసాడు. తన మాటలు వింటున్న అందరూ గుట్టుచప్పుడు చేయకుండా కూర్చున్నారు.

 

ఇక ఇన్సైడర్ ట్రేడింగ్ విషయమై టీడీపీ నాయకులకి చమటలు పట్టించాడు. చంద్రబాబుతో మొదలు పెట్టి బినామీల దాక అందరి పేర్లు చదివి వినిపించాడు. దీంతొ టీడీపీ నాయకులు తమ అభ్యంతరం వ్యక్త పరిచారు. బుగ్గన మాటలు విన్న ఎవరైనా సరే వాటిని ఒప్పుకోక తప్పదు… ఆలా ఉంది మరి తాను చేసిన ప్రసంగం.

జేడీ దెబ్బతో.. జనసేన స్పీడ్ కి బ్రేక్?

మొన్న ఆలివర్ రాయ్, నిన్న రాజు రవితేజ్, ఇప్పుడు జేడీ లక్ష్మి నారాయణ, (రేపు రాపాకా అవ్వొచ్చు) ఇలా వరసగా జనసేన పార్టీని విడిచిపెట్టి కీలక నేతలు వెళ్లడంతో జనసేన కార్యకర్తలు ఆందోళన చెందటం సహజం. ఇటీవల కాలంలో ప్రజలకోసం, ప్రజల పక్షాన నిలబడే పార్టీగా “జనసేన” మంచి పేరునే గడించింది. అయితే వరుస పరిణామాలతో జడ్ స్పీడ్ తో దూసుకుపోతున్న పార్టీలో నుంచి కొంతమంది నేతలు బయటకు వెళ్తున్నారు..అందుకు గల కారణాలను విశ్లేషిద్దాం..

Read More: జనసేన-బీజేపీ:తాటి చెట్టు క్రింద మజ్జిగ తాగుతున్న పవన్..!?

పవన్ కళ్యాణ్ బీజేపీ తో కలవడం, తరవాత సినిమాల పై మొగ్గుచూపడంతో జేడీ జనసేన పార్టీ ని విడిచి వెళ్లారు. వ్యక్తిగతంగా ఏదో ఆశించి అది నెరవేరక పార్టీని విడిచే వాళ్ళు కొంతమంది, బలమైన జగన్ సర్కార్ ని ఎదిరించలేక వైసీపీ ప్రలోభాలకు లోబడి వెళ్లే వాళ్ళు మరికొంతమంది కాగా పవన్ కళ్యాణ్ ప్రవర్తన నచ్చక వెళ్ళే వాళ్ళు ఇంకొంతమంది. మొదటి రెండు కారణాల వల్ల పార్టీని విడిచిపోయే వాళ్ళ గూర్చి జనసేన పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు కానీ పవన్ ప్రవర్తన వల్ల పార్టీని విడిచిపెడితే కొంచం ఆలోచించాలి. ఎందుకంటే నాయకుడు అన్ని కోణాలలో నాయకత్వ లక్షణాలను కనపర్చాలి. ఒక ప్రాంతానికో, కులానికో, మతానికో, కొంతమంది వ్యక్తులకో కొమ్ము కాసినట్లయితే.. పార్టీ భవిష్యత్ ప్రశాంర్ధకం అవుతుంది.

Read More: జనసేనాని రాజకీయ ప్రస్థానంపై విశ్లేషణ

పవన్ కళ్యాణ్ విధి విధానాలు, ఆయన సిద్ధాంతాలను అర్థం చేసుకోలేక పార్టీని విడిచిపెడుతున్నారు అని జనసేన ఆరోపిస్తోంది.. ఒకవేళ అదే నిజమైతే.. కలిసి పని చేసిన వాళ్ళకే అర్థం కాకపోతే ప్రజలకు ఎలా అర్థమౌతుంది..? పవన్ విధి విధానాలు గొప్పవే కావొచ్చు కానీ వాటిని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి. క్షేత్రస్థాయిలోకి పవన్ విధి విధానాలను తీసుకెళ్లడంలో జనసేన విఫలమైతే.. మరి కొంత మంది నేతలు కూడా పార్టీని వీడే అవకాశాలు లేకపొలేదు. ఎమ్మెల్యే రాపాక కి కూడా పార్టీలో తగిన స్థానం, గౌరవం దక్కకపోవడంతో ఆతను కూడా జనసేనని విడిచి పెడుతున్నారు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీ నుంచి ఎంతమంది వెళ్ళిపోయినా పర్వాలేదు కానీ పవన్ పై నమ్మకం, పార్టీ నుంచి ప్రజలు వెళ్లిపోకుండా జాగ్రత్త పడితే మంచిది.

Read More: సినిమాలు-రాజకీయాలు..బ్యాలన్స్ అవుతాయా?

తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసేది మేమే: పవన్‌ కళ్యాణ్

 

కాకినాడ సభలో అభిమానులను , పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన “16న బీజేపీ – జనసేన సమావేశం ఉంటుందని , కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నామని ” తర్వాత అటు అభిమానుల్లోనూ , ప్రజల్లోనూ సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆ ఉత్కంఠకు తెలదించుతూ ఈ రోజు జరిగిన సమావేశం తర్వాత పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలు ఇలా ఉన్నాయి.

 

ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు, ప్రయోజనాల కోసం బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ స్పష్టం చేశారు. విజయవాడలో సమావేశమైన ఇరు పార్టీల నేతలు సమావేశం అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. తాము అన్ని అంశాలపై చర్చించామని అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ-జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయన్న దృఢ విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

 

రాష్ట్రంలో పాలెగాళ్ల రాజ్యం నడుస్తుందని విమర్శించారు. ఏపీ ప్రయోజనాల కోసమే బీజేపీతో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. బీజేపీతో పొత్తు స్థానిక ఎన్నకల నుంచి సార్వత్రిక ఎన్నికల వరకు ఉంటుందని పవన్‌ చెప్పారు. ఏపీలో అవినీతి రహిత సుస్థిర పాలన అందించే లక్ష్యంతో పనిచేస్తామని పవన్‌ స్పష్టం చేశారు. బీజేపీతో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందని, దాన్ని సరిచేసుకున్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. వామపక్షాల కంటే ముందే తాను బీజేపీతో కలిసి పనిచేశానని, వామపక్షాలకు తానేమీ బాకీలేనని ప్రకటించారు.

జనసేనకి జేడీ గుడ్ బై.. కారణం ఇదే..!

జనసేన పార్టీ కీలక నేత జెడి లక్ష్మి నారాయణ ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి పంపారు లక్ష్మి నారాయణ.. గత ఏడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అయన జనసేన పార్టీ నుంచి పోటి చేసి ఓడిపోయారు. ఇక గత కొద్ది రోజులుగా పార్టీకి, పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటున్న అయన ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం.

Read More: ఎమోషనల్ అయిన పవన్.. జేడీకి రాసిన లెటర్ చూస్తే మీరు కూడా…

పవన్ సినిమాల్లో నటిస్తున్నందునే.. పవన్ కళ్యాణ్ కు రాజీనామా లేఖ రాసిన జేడీ లక్ష్మీ నారాయణ తన లేఖలో పవన్ సినిమాల్లో తిరిగి నటించడాన్ని తీవరంగా వ్యతిరేకించారు. పూర్తిగా ప్రజా సేవకే అంకితమన్న పవన్ తిరిగి సినిమాల్లో నటించడాన్ని విబేధించి రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు. పవన్ తిరిగి సినిమాల్లో నటిస్తుండడం బాధించిందని జేడీ ఆ లేఖలో వివరించారు. ప్రజలకు సినిమాల్లో నటించానని ఇచ్చిన హామీని తప్పారాని ఆక్షేపించారు. పవన్ కళ్యాన్ కు విధి విధానాలు లేవని అయన తీవ్ర వ్యఖ్యలు చేశారు.

జెడి లక్ష్మి నారాయణ రాజీనామా లేఖ ఇదే…

Read More: జనసేన-బీజేపీ:తాటి చెట్టు క్రింద మజ్జిగ తాగుతున్న పవన్..!?

ఎన్నిసినిమాలు వచ్చినా … పవన్ కళ్యాణ్ రికార్డుని టచ్ చేయలేకపోతున్నారు!

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… రాజకీయాలలోకి రాక ముందు … అబ్బ .. ఆ ఫాన్స్ .. ఆహా … ఆ క్రేజ్. ఆ రోజుల్లో మన తెలుగు యువత పవన్ కళ్యాణ్ కి ఇస్తున్న క్రేజ్ చూసి భారతదేశంలో ఉన్న తక్కిన భాషల సినిమా రంగాలకు సంబందించిన ప్రముఖ హీరోలు కూడా ఒకింత ఫీలయ్యేవారు… ఆఆ … ఏమి చేస్తాం .. అవన్నీ అప్పట్లో ..

 

మరి ఇప్పడు .. ఏమో.. ఒకవేళ పవన్ కళ్యాణ్ గనుక.. ‘పింక్’ అనే రీమేక్ సినిమాలో నటించబోతున్నాడు అని వస్తున్న వార్త నిజమై దిల్ రాజు ప్రొడక్షన్ లో పవన్ కళ్యాణ్ మళ్ళీ నటిస్తే … ఫాన్స్ కి పండగే. ఇప్పటికే ఈ వార్తపై సంగీత దర్శకుడు థమన్ పెట్టిన ట్వీట్ తో క్లారిటీ వచ్చినట్టే ఉంది .. కానీ , జనసేనాని నిర్ణయం ఎవరికి తెలుసు ?

 

అసలు విషయమేమిటంటే … రెండేళ్లక్రితం పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం ‘అజ్ఞాతవాసి’, అప్పట్లో ఈ సినిమాకు వచ్చిన హైప్ అంతా ఇంతా కాదు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన మూడవ చిత్రం కావడంతో ఆ సమయంలో ఈ చిత్రానికి ఏర్పడ్డ అంచనాలు చూసి అదే ఊపులో కానీ హిట్టయ్యి ఉంటే ఎక్కడ ఆగేదో కూడా ఊహించలేకపోయారు.కానీ ఎన్ని అంచనాలు అయితే ఈ చిత్రం నెలకొల్పుకుందో అంతే స్థాయిలో దారుణాతి దారుణమైన పరాజయాన్ని చవి చూసింది.

 

అయితే అప్పట్లో ఈ చిత్రం ఓవర్సీస్ లో నెలకొల్పిన రికార్డులు మాత్రం ఇంకా చెక్కు చెదరలేదు. ఓవర్సీస్ మార్కెట్ లో “అజ్ఞాతవాసి” చిత్రానికి కేవలం ప్రీమియర్స్ తోనే 1 మిలియన్ డాలర్స్ కు పైగా వచ్చేసింది.అప్పుడు పవన్ నెలకొల్పిన రికార్డులు ఈ రోజు వరకూ విడుదల కాబడిన ఏ భారీ చిత్రం కూడా కొట్టలేకపోయింది. అయితే అప్పుడు సినిమా టికెట్ రేట్లు ఎక్కువ అది ఇది అని ఇప్పుడు కొంత మంది అనొచ్చు అప్పుడు రేట్ ఎక్కువయినా సరే టికెట్ తెగింది కదా అలా తెగితేనే ఈ ఫీట్ సాధించిన చిత్రంగా “అజ్ఞ్యాతవాసి” ఇప్పటికీ హాట్ టాపిక్ గానే నిలిచింది. మరి ముందు రాబోయే చిత్రాల్లో ఏ చిత్రం ఈ ఫీట్ ను అందుకుంటుందో.. లేక రాబోయే పవన్ కళ్యాణ్ సినిమాతో ‘తన రికార్డుని తానే బీట్ చేస్తాడో ‘ వేచి చూడాలి.

 

విజయవాడలో బీజేపీ, జనసేన కీలక మీటింగ్.. వేడెక్కుతున్న ఫాన్స్…

దేశం బాగుండాలంటే కెసిఆర్, ప్రధాని అవ్వాలంట!

తెరాస మంత్రి గంగుల కమలాకర్ సీఎం కేసిఆర్, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “మంత్రి కేటీఆర్ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడని, ఆయన వల్లే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ విజయాన్ని నమోదు చేసుకున్నామని కమలాకర్ కొనియాడారు.

Read More: కేటీఆర్‌ కి అద్భుతమైన బహుమానం సిద్ధంచేసిన కేసీఆర్‌?

సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ పనితీరు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ కరీంనగర్‌లో గల్లంతైందన్నారు. వచ్చే 40 ఏళ్లపాటు తెలంగాణలో తెరాస నే అధికారంలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాబోయే 40 ఏళ్లు టీఆర్‌ఎస్‌ అధికారంలో ఉంటుందన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ ప్రధాని కావాలన్నారు. రాష్ట్రంలో కేటీఆర్ సీఎం కావాలని పేర్కొన్నారు.

Read More:
సారూ.. అప్పుడు గెలిచారు.. హామీలు మరిచారు..ఇప్పుడైనా జర దెఖో..