
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… రాజకీయాలలోకి రాక ముందు … అబ్బ .. ఆ ఫాన్స్ .. ఆహా … ఆ క్రేజ్. ఆ రోజుల్లో మన తెలుగు యువత పవన్ కళ్యాణ్ కి ఇస్తున్న క్రేజ్ చూసి భారతదేశంలో ఉన్న తక్కిన భాషల సినిమా రంగాలకు సంబందించిన ప్రముఖ హీరోలు కూడా ఒకింత ఫీలయ్యేవారు… ఆఆ … ఏమి చేస్తాం .. అవన్నీ అప్పట్లో ..
మరి ఇప్పడు .. ఏమో.. ఒకవేళ పవన్ కళ్యాణ్ గనుక.. ‘పింక్’ అనే రీమేక్ సినిమాలో నటించబోతున్నాడు అని వస్తున్న వార్త నిజమై దిల్ రాజు ప్రొడక్షన్ లో పవన్ కళ్యాణ్ మళ్ళీ నటిస్తే … ఫాన్స్ కి పండగే. ఇప్పటికే ఈ వార్తపై సంగీత దర్శకుడు థమన్ పెట్టిన ట్వీట్ తో క్లారిటీ వచ్చినట్టే ఉంది .. కానీ , జనసేనాని నిర్ణయం ఎవరికి తెలుసు ?
అసలు విషయమేమిటంటే … రెండేళ్లక్రితం పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం ‘అజ్ఞాతవాసి’, అప్పట్లో ఈ సినిమాకు వచ్చిన హైప్ అంతా ఇంతా కాదు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన మూడవ చిత్రం కావడంతో ఆ సమయంలో ఈ చిత్రానికి ఏర్పడ్డ అంచనాలు చూసి అదే ఊపులో కానీ హిట్టయ్యి ఉంటే ఎక్కడ ఆగేదో కూడా ఊహించలేకపోయారు.కానీ ఎన్ని అంచనాలు అయితే ఈ చిత్రం నెలకొల్పుకుందో అంతే స్థాయిలో దారుణాతి దారుణమైన పరాజయాన్ని చవి చూసింది.
అయితే అప్పట్లో ఈ చిత్రం ఓవర్సీస్ లో నెలకొల్పిన రికార్డులు మాత్రం ఇంకా చెక్కు చెదరలేదు. ఓవర్సీస్ మార్కెట్ లో “అజ్ఞాతవాసి” చిత్రానికి కేవలం ప్రీమియర్స్ తోనే 1 మిలియన్ డాలర్స్ కు పైగా వచ్చేసింది.అప్పుడు పవన్ నెలకొల్పిన రికార్డులు ఈ రోజు వరకూ విడుదల కాబడిన ఏ భారీ చిత్రం కూడా కొట్టలేకపోయింది. అయితే అప్పుడు సినిమా టికెట్ రేట్లు ఎక్కువ అది ఇది అని ఇప్పుడు కొంత మంది అనొచ్చు అప్పుడు రేట్ ఎక్కువయినా సరే టికెట్ తెగింది కదా అలా తెగితేనే ఈ ఫీట్ సాధించిన చిత్రంగా “అజ్ఞ్యాతవాసి” ఇప్పటికీ హాట్ టాపిక్ గానే నిలిచింది. మరి ముందు రాబోయే చిత్రాల్లో ఏ చిత్రం ఈ ఫీట్ ను అందుకుంటుందో.. లేక రాబోయే పవన్ కళ్యాణ్ సినిమాతో ‘తన రికార్డుని తానే బీట్ చేస్తాడో ‘ వేచి చూడాలి.