Home Blog Page 8620

దూకుడుగా ఎన్‌పిఆర్‌ అమలుకు జగన్ ప్రభుత్వం సిద్ధం!


రాష్ట్రంలో ఎన్‌పిఆర్‌ను అమలు చేయబోమని కడప సభలో సిఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించినా ఆచరణలో అధికారులు మాత్రం దాన్ని అమల్లోకి తెచ్చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారికంగా మూడు మండలాల్లో ప్రయోగాత్మకంగా ఎన్‌పిఆర్‌ వివరాల నమోదు పూర్తి చేశారు. ఇదంతా రాష్ట్రంలో ఎన్‌పిఆర్‌ జరగదని సిఎం సహా మంత్రులు, ప్రభుత్వ సలహాదారులందరూ ప్రకటి స్తున్న సమయంలోనే అమలు చేయడం విశేషం.

ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యవహారాల సలహాదారు తాము ఎన్‌పిఆర్‌ను అమలు చేయబోమని చెప్పిన సమయంలోనే మరోవైపు దానికి సంబంధించిన ఏర్పాట్లు జరిగిపోయాయి. అధికారులు, సిబ్బంది విధులు ఏమిటి?, ఎలా చేయాలనే అంశంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు, అన్ని జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. అధికారికంగా విధివిధానాలపై చర్చించారు.

దీనిలో భాగంగా పలు కీలక ప్రశ్నలు వేయనున్నారు. ఆన్‌లైన్‌ పద్దతిలో ఈ సర్వే జరగనుంది. దీనికోసం సాధారణ పరిపాలన శాఖ నోడల్‌ ఏజన్సీగా వ్యవహరించనుంది. ఈ సర్వేలో ముఖ్యంగా ప్రజల జీవన విధానంతోపాటు వారి ఆహార అలవాట్లపైనా వివరాలు నమోదు చేయనున్నారు. మొత్తం 34 ప్రశ్నల్లో మీ ఆహార అలవాట్లు ఏమిటి? అనేది కూడా కీలకమైన ప్రశ్నగా పొందుపరిచారు.

ముఖ్యంగా కులం, మతం, వారెక్కడ నుండి
వలసొచ్చారు అనే అంశాలు ప్రశ్నోత్తరాల్లో ప్రధానంగా ఉన్నాయి. ఎన్‌ఆర్‌సికి సంబంధించిన ప్రక్రియ మొత్తం ఉపాధ్యాయులు చేపట్టనున్నారు. తొలుత ఇంటి యజమానికి సంబంధించిన పూర్తి వివరాలు తీసుకుంటారు. వ్యక్తిగత ఆస్తులు, వాహనాల వివివరాలకు ఒక ప్రశ్నాపత్రం ఇవ్వనున్నారు.

ఇంట్లో మౌలిక సదుపాయాల గురించి మరో ప్రశ్నాపత్రం ఈ రెండిటికీ కలిపి 34 ప్రశ్నలు ఉండనున్నాయి. వీటిల్లో ముఖ్యంగా ఆహారం ఏమి తింటారు, ఇంట్లో గదులెన్ని, సొంత ఇళ్లా, అద్దె ఇళ్లా, ఆస్తులు, మతం, ఎస్‌సి, ఎస్‌టి, భాష, సాహిత్యం, విద్య, ఆర్థిక కార్యకలాపాలు ఏమిటి, వలసలు, సాంతన సాఫల్యత తదితర అంశాలన్నీ ఉండనున్నాయి. వీటితోపాటు వారసత్వ వివరాలనూ వెల్లడించాల్సి ఉంటుంది.

జాతీయ జనాభా పట్టికను ఏడాది కాలంలోనే పూర్తి చేయనున్నారు. ఎన్‌పిఆర్‌ విషయంలో ఎటువంటి లోపాలూ లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. అలాగే మానసికంగా ధృడత్వంగానూ ఉండేలా ఎన్యూమరేటర్లకు తగు శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు.

జనగణన, ఎన్‌పిఆర్‌కు సంబంధించిన వివరాలను తీసుకునేందుకు ఆరు భాషల్లో పత్రాలు రూపొందించినట్లు సెన్సస్‌ డైరెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. దీనికోసం పట్టణాలను బ్లాకులుగా నిర్ణయించారు.

ఎన్టీఆర్ సరసన మ‌రోసారి పూజా హెగ్డే..?

ప్రస్తుతం ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా తరువాత ఎన్టీఆర్, త్రివిక్ర‌మ్ కాంబినేషన్ లో మ‌రో సినిమా రాబోతున్న విష‌యం విదిత‌మే.. ఈ సినిమా మే నెల‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నుంది.గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘అరవింద సమేత’ సినిమా మంచి హిట్ గా నిలిచింది.

ఇదిలా ఉంటే…కొత్త సినిమాలో కూడా త్రివిక్ర‌మ్ పూజా హెగ్డేను హీరోయిన్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది.‘అరవింద సమేత’, ‘అల వైకుంఠపురములో’ వంటి సినిమాల తరువాత ముచ్చటగా మూడవసారి త్రివిక్రమ్ సినిమాలో నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. త్వ‌ర‌లోనే పూజ ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది.ప్ర‌స్తుతం పూజ ఖాతాలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్`, `ప్ర‌భాస్ 20` చిత్రాలు ఉన్నాయి.

Palasa team at SRK College Vijayawada

రెండు ఎగువ సీట్లు ఆ ఇద్దరికే ఫిక్స్? ఎందుకంటే..?

ఈ ఏడాది ఏప్రిల్ 9న తెలంగాణకి చెందిన ఇద్దరు ఎగువ సభ సభ్యులు వారి పదవీ కాలన్ని పూర్తి చేసుకొని రిటైర్ అవుతున్నారు. అందులో ఒకరు టీడీపీ నుంచి ఎన్నికై బీజేపీలో ఉన్న గరికపాటి మెహన్ రావు, మరొకరు కాంగ్రెస్ కి చెందిన కేవీపీ రామచంద్రరావు. ఖాళీ అవుతున్న ఆ రెండు రాజ్యసభ సీట్లపై తెలంగాణలో హాట్‌హాట్‌గా చర్చ జరుగుతోంది.

అయితే ఏపీ కోటాలో రిటైర్ అవుతున్న, టీఆర్ఎస్‌ జనరల్ సెక్రటరి కేకే, మరోసారి తనకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. కానీ
కేకే కి అవకాశాలు తక్కువనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఎందుకంటే కొత్తవారికి అవకాశాలు ఇవ్వాలని కెసిఆర్ భావిస్తున్నారు. అలాగే నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత, పొంగులేటి శ్రీనివాసుల పేర్లు రేస్ లో ఉన్నాయి. కాబట్టి కేకే కి అవకాశాలు తక్కువ.

అలాగే వివిధ కారణాల వల్ల కవిత లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిజమాబాద్‌తో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు కవిత. పంచాయతీ, పురపోరు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. దీంతో పాటు పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో కవితను రాజ్యసభకు పంపడం దాదాపు ఖాయమని తెలుస్తోంది.

ఖమ్మం ఎంపీ టికెట్ నిరాకరించినా..పొంగులేటి పార్టీకి విధేయులుగానే ఉన్నారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తూ.. పార్టీ అభ్యర్ధుల విజయం కోసం పనిచేశారు. దీంతో రెండో సీట్, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ విషయమై ఇప్పటికే హమీ లభించినట్టు పార్టీలో చర్చ జరుగుతోంది.

సల్మాన్ ఖాన్ తో మైత్రి మూవీ మేకర్స్..

తెలుగు సినీ పరిశ్రమకు శ్రీమంతుడు, జనత గ్యారేజ్, రంగస్థలం వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్. ఈ నిర్మాణ సంస్థ అధినేతలు నవీన్ యర్నేని, రవిశంకర్ యలమంచిలి మరియు మోహన్ చెరుకూరి క‌లిసి నడుపుతున్నారు. తెలుగు లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

మైత్రి మూవీ మేకర్స్ బాలీవుడ్ లోకి అడుగు పెట్టనున్నారు. కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో సినిమా తియ్యనునట్లు సమాచారం. సల్మాన్‌తో చర్చలు కూడా పుర్తియ్యాయని ఇందుస్త్రి లో టాక్. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన వివరాలు తెలియనున్నాయి. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ప్రభుదేవా దర్శకత్వంలో ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్‘ సినిమాతో బిజీ గా ఉన్నారు.

 

 

 

త్రీ పాత్రాభినయం లో హీరో నితిన్..!

వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, రష్మిక జంటగా రూపొందిన రొమాంటిక్ చిత్రం ‘భీష్మ’ మూవీ ఈ నెల 21 వ తేదీ రిలీజ్ కానుంది. ప్రస్తుతం నితిన్ హీరోగా, యేలేటి చంద్ర శేఖర్ దర్శకత్వంలో ఒక మూవీ, వెంకీ అట్లూరి దర్శకత్వంలో మరో మూవీ (రంగ్ దే ) చిత్రాలతో బిజీగా ఉన్నాడు.

అయితే ‘భీష్మ’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన మీడియా సమావేశంలో హీరో నితిన్ ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో “పవర్ పేట” మూవీ రూపొందనుందని, ఈ మూవీ లో తాను 18, 40, 60 వయస్సు ఉన్న త్రీ డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తానని, ఈ మూవీ ని మూడు భాగాలుగా తమ స్వంత బ్యానర్ లోనే రూపొందిస్తామని నితిన్ తెలిపారు, ఆగస్ట్ లో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ మూవీ తన కెరీర్ లో అరుదైన సినిమా అని, తన లైఫ్ లో స్పెషల్ సినిమా అవుతుందని నితిన్ చెప్పారు.

ఇంగ్లీషులో ఇరగదీసిన పవన్..యువతకు రాజకీయ పిలుపు


జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రెండు ముఖ్యమైన కారక్రమాలలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే.. అమర సైనికల కుటుంబాల కోసం కేంద్రీయ సైనిక్ బోర్డ్ కు జనసేనాని కోటి రూపాయల విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. అదే విధంగా.. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన సద్ధస్సులో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంటరీ సద్ధస్సులో పవన్ ప్రసంగించారు. అయితే ఆయన స్పీచ్ అంతా ఇంగ్లీషులోనే సాగింది. ఆయన స్పీచ్ అది నుండి అంతం వరకు చాలా ఆసక్తికరంగా ఉంది. దేశ యువత రాజకీయాలలో రావడానికి గల ప్రాముఖ్యతను వివరించారు.రానున్న తరాలకు రోత రాజకీయకాలను దూరం చేయాలని, భావితరాలకు అవినీతి రహిత రాజకీయాలను పరిచయం చేయడం మన బాధ్యత అని పవన్ అన్నారు. అందుకే 2014లో జనసేన పార్టీని స్థాపించినట్లు వివరించారు.

ఒకవైపు విద్యార్థులుగా మీరు నాలెడ్జి ని పెంచుకుంటేనే మరోవైపు ప్రజల తరుపున, ప్రజల కోసం పోరాడే పార్టీలకు మద్దతివ్వాలని పవన్ సూచించారు. “నా దేశం నా ప్రజలు” అనే ధోరణిలో ప్రజలకు, మన దేశానికి చేతనైన సహాయం చేయాలనీ పవన్ పిలునిచ్చారు. మధ్య మధ్యలో స్వామీ వివేకానంద కొటేషన్స్ తో విద్యార్థుల్లో ఉత్సాహం నింపె ప్రయత్నం చేశారు పవన్.
“సముద్రం ఒకడి కాళ్ళ దగ్గర కూర్చొని మురవదు,
తుఫాన్ గొంతు చిత్తం ఎరుగదు,
పర్వతం ఎవడికి వంగి సలాం చేయదు,
నేను పిడికిది మాట్టే కావొచ్చు కానీ, గొంతెత్తితే.. ఒక దేశపు జండాకు ఉన్నంత పొగరున్నదని” పవన్ తెలుగులో చెప్పిన ఈ మాటకు యువత కేరింతలు కొట్టారు. ఈ విధంగా జనసేనాని ఆది నుండి అంతం వరకు ఇంగ్లీషులో అద్భుతమైన స్పీచ్ తో ఇరగదేశాడని చెప్పొచ్చు.

మెగాస్టార్ మూవీలో సూపర్ స్టార్?

మెగాస్టార్ చిరంజీవి తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నాడు. చిరంజీవి 152వ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీకి ‘గోవింద ఆచార్య’, లేదా ‘ఆచార్య’ అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తాజాగా ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తారని ప్రచారం జరుగుతుంది. చిరంజీవి-మహేష్ బాబుల మధ్య ఎంతో సన్నిహిత్యం ఉంది. అంతేకాకుండా కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ ‘భరత్ అనే నేను’లో నటించి బాక్సాఫీస్ అందుకున్నాడు. దీంతో ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాలని దర్శకుడు కోరగా మహేష్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. చిరంజీవి-మహేష్ బాబు మధ్య కొన్ని సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది.

చిరంజీవి-152 మూవీలో మెగాస్టార్ డ్యూయల్ రోల్స్ చేయనున్నారు. పవర్ ఫుల్ ఎండోన్మెంట్ అధికారిగా కనిపించబోతున్నాడు. అదేవిధంగా ప్లాష్ బ్యాక్లో యంగ్ చిరంజీవి కనిపించనున్నారు. ఈ మూవీలో చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ నక్సలైట్ పాత్రలో నటిస్తారని ప్రచారం జరిగింది. అయితే ‘ఆర్ఆర్ఆర్’ మూవీ షూటింగ్ బీజీగా ఉండటం వల్ల రాంచరణ్ ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. రాంచరణ్ చేయాల్సిన క్యారక్టర్లో అల్లు అర్జున్ నటిస్తారని ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ మూవీలో మహేష్ గెస్ట్ అప్పిరెన్స్ కనిపిస్తారని ప్రచారం జరుగుతుండటంతో మెగా ఫ్యాన్స్ తోపాటు మహేష్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ మూవీలో చిరంజీవికి జోడి త్రిష నటిస్తుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లలో వచ్చిన ‘స్టాలీన్’ బ్లాక్ బస్టర్ హిట్టు అందుకుంది. చిరంజీవి-152లో రెజీనా ఓ స్పెషల్ సాంగ్లో నటిస్తుంది. అలాగే తెలుగమ్మాయి ఈషారెబ్బా ఓ కీలక పాత్రలో నటిస్తుంది. ఈ మూవీని రాంచరణ్ కొణిదల ప్రొడక్షన్లో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ తో కలిసి నిర్మిస్తున్నాడు. చాలా రోజుల తర్వాత చిరంజీవి మూవీకి మణిశర్మ అదిరిపోయే బాణీలను సమకూరుస్తున్నారు. మెగాస్టార్ కు తోడుగా సూపర్ స్టార్, స్టైలీష్ స్టార్ నటిస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టాలీవుడ్లోని బిగ్ స్టార్లను ఒక్క టిక్కెట్ పైనే చూడనుండటంతో అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు.

వరుణ్ తేజ్ కు జోడీగా బాలీవుడ్ భామ ?

‘గద్దలకొండ గణేష్’ తరువాత హీరో వరుణ్ తేజ్ ఒక స్పోర్ట్స్ డ్రామా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బ్లూ వాటర్ క్రియేటివ్స్, రినైసెన్స్ పిక్చర్స్ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో ఈ మూవీ రూపొందనుంది. ఈ మూవీ లో బాక్సర్ గా నటించనున్న వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ సినిమాకి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

ఫిబ్రవరి 24 వ తేదీ నుండి షూటింగ్ ప్రారంభం కానున్న ఈ మూవీ లో హీరోయిన్ గా బాలీవుడ్ భామ ను ఎంపిక చేశారని సమాచారం. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన “దబంగ్ 3 ” మూవీ తో బాలీవుడ్ లో ప్రవేశించిన సాయి మంజ్రేకర్. ఇప్పుడు #VT10 మూవీ లో వరుణ్ తేజ్ కు జోడీగా ఎంపిక చేసారు అని సమాచారం. #VT10 మూవీ తో సాయీ టాలీవుడ్ కు ఎంటర్ కానున్నారు.

‘ఫైటర్’ కు జోడి కుదిరింది

విజయ్ దేవరకొండ తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఫైటర్’. పూరి జగన్మాథ్ దర్మకత్వంలో విజయ్ దేవరకొండ తొలిసారి నటిస్తున్నాడు. ‘ఫైటర్’ మూవీలో విజయ్ సరసన నటించిన హీరోయిన్ల విషయంలో చాలా పేర్లు విన్పించాయి. ముఖ్యంగా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించనున్నట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే తాజాగా చిత్రబృందం హీరోయిన్ పేరు ఖారారు చేసింది. ‘ఫైటర్’ మూలో విజయ్ దేవరకొండకు జోడిగా బాలీవుడ్ భామ అనన్యా పాండే నటించనుంది. ఈ మేరకు విజయ్ దేవరకొండ, పూరి జగన్మాథ్, చార్మి, అనన్యా పాండే షూటింగ్లో పాల్గొన్న ఫొటోను చిత్రబృందం సోషల్ మీడియాలో విడుదల చేసింది.

‘ఫైటర్’ తెలుగు, హిందీ, ఇతర భాషల్లో తెరకెక్కుతుంది. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్ హిందీలో ‘ఫైటర్’ మూవీని దర్మ ప్రొడక్షన్లో నిర్మిస్తున్నాడు. తెలుగులో పూరి జగన్మాథ్ టూరింగ్ టాకీస్, పూని కనెక్ట్ బ్యానర్లో చార్మి, పూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీతో విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మూవీలో జాన్వీకపూర్ నటిస్తుందని ప్రచారం జరిగిన ఆమె డేట్స్ దొరకకపోవడంతో ఆ ఛాన్స్ అనన్యా పాండే దక్కించుకుంది. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2’ మూవీతో పరిచమైన అనన్యా పాండే బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకొంది.

ఇటీవల విజయ్ దేవరకొండ నటించిన ‘వరల్డ్ ఫేమస్’ విడుదలైంది. ఈ చిత్రం అనుకున్నంత విజయం సాధించకపోవడంతో విజయ్ దేవరకొండ ‘ఫైటర్’ మీదే ఫోకస్ పెట్టాడు. అదేవిధంగా పూరి జగన్మాథ్ ఇటీవలే ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. వీరిద్దరి కాంబినేషన్లలో తొలిసారి ‘ఫైటర్’ మూవీ వస్తుంటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎట్టకేలకు విజయ్ దేవరకొండ పక్కన బాలీవుడ్ భామ సెట్టవడంతో షూటింగ్ శరవేగంగా పూర్తి జరుపుకుంటుంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నహాలు చేస్తుంది.

తస్మాత్ జాగ్రత్త:ఫేసుబుక్ లో బుక్కైపోవ్వదు!

మన దేశంలోని యువకులలో దాదాపుగా అందరు సోషల్ మీడియా లో ఎక్కువ కలం గడుపుతున్నారు. 70 శాతం యువతీ యువకులు పేస్ బుక్ ను వినియోగిస్తున్నారు. ఇంతక ముందు రోజుల్లో మెసేజ్ ఫోన్ కాల్స్ ద్వారా సైబర్ హ్యాకింగ్స్ జరిగేవి. ఇప్పుడు సైబర్ నేరగాళ్లు ఫేసుబుక్ లో మహిళలకు ఎర వేశారు,తాము విదేశీయలుగా చెప్పుకుంటూ ఆడవారికి మెసేజ్ చేస్తూ వారిని మోసం చేస్తున్నారు.  ఆడవారి పేర్లతో అకౌంట్స్ క్రియేట్ చేసి ఫ్రెండ్ రిక్వెస్ట్ లను ఆక్సిప్ట్ చేసి ముందుగా మంచిగా మాట్లాడుతూ చనువు పెంచుకొని తమ పై నమ్మకాన్ని కలిగిస్తున్నారు. ఒకరి ఫోన్ నెంబర్ లు ఒకరు మార్చుకున్న తరుత వాట్సాప్ చాటింగ్ లో తమ వాళ్లకు విదేశీ బ్యాంకుల్లో చాలా మొత్తంలో లో డబ్బులు ఉన్నట్లు వాళ్ళకి నమ్మకం కలిగించడం కోసం నకిలీ పాత్రలని పంపే వారు. ఆ డబ్బును సొంతం చేసుకోడానికి ఓ ఫోన్ నెంబర్ కు కాల్ చేయాలని ఓ నెంబర్ ను ఇస్తున్నారు . అవతలి వ్యక్తి కి కాల్ చేసిన
తరువాత బ్యాంకు లో డబ్బు పంపించడానికి ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేయించడానికై కొంత డబ్బు ఖర్చు అవుతుందని చెప్తూ డబ్బును దోచుకుంటున్నారు. ఫేసుబుక్ వాడడంలో ఎంతైనా జాగ్రత్త వహించాల్సి ఉంది…

చంద్రబాబు ఆస్తుల విలువ ఇంత తక్కువ..?


విజయవాడలో జరిగిన సమావేశంలో నారాలోకేష్ వారి కుటుంబ ఆస్తుల వివరాలు తెలియజేసారు.గత తొమ్మిదేళ్ళలో వారు సంపాదించిన ఆస్తుల, అప్పుల వివరాలను తెలియజేసారు. ఆయన తెలిపిన ఆస్తుల అప్పుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

నారా లోకేష్ ఆస్తులు 24.70 కోట్లు
అప్పులు రూ.5.70 కోట్లు
నికర ఆస్తులు రూ.19 కోట్లు

నారా బ్రాహ్మణి ఆస్తులు 15.68 కోట్లు
అప్పులు రూ.4.17 కోట్లు
నికర ఆస్తులు రూ.11.51 కోట్లు

నారా దేవాన్ష్ (లోకేష్ కుమ్మరుని) ఆస్తులు 19.42 కోట్లు

నారా దేవాన్ష్‌కు చంద్రబాబు హెరిటేజ్‌‌లో తన వాటాలో ఉన్న 26440 షేర్లను గిఫ్ట్ ఇచ్చారు.

నారా భువనేశ్వరి ఆస్తులు 50.62 కోట్లు
అప్పులు రూ.11.04 కోట్లు
నికర ఆస్తులు రూ.39.58 కోట్లు

చంద్రబాబు ఆస్తుల 9కోట్లు
అప్పులు 5.13 కోట్లు
నికర ఆస్తులు 3.87కోట్లు

నారా వారి కుటుంబం మొత్తం ఆస్తులు రూ.119.42 కోట్లు, అప్పులు రూ.26.04 కోట్లు కాగా నికర ఆస్తుల విలువ రూ.93.38 కోట్లుగా లోకేష్ తెలియజేసారు.

భీష్మ ప్రీమియర్ షో AUS/NUZ థియేటర్స్ లిస్ట్

నితిన్, రష్మిక మందన జంటగా నటించిన చిత్రం ‘భీష్మ’. ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ వారసుడు మహతి స్వర సాగర్ సంగీతం సమకూర్చారు. ఫిబ్రవరి 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

భీష్మ ప్రీమియర్ షో AUS/NUZ థియేటర్స్ లిస్ట్ కింద చూడవచ్చు..

విశాఖకు రాజధానిని ఉగాదికే తరలింపు!

AP Cabinet Meeting


అమరావతి నుండి విశాఖకు రాజధానిని ఉగాదికే తరలించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఉగాది రోజున నిర్ణయించిన ముహర్తానికి కొన్ని శాఖలను తరలించి. ఆ తరువాత దశలవారిగా మిగిలిన శాఖలను విశాఖకు మార్చడానికి ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసినట్టు తెలిసింది.

‘ఉగాదికి వెళ్ళాలని ఎప్పుడో అనుకున్నాం. అలాగే వెళ్లాలని భావిస్తున్నాం.’ అని మంత్రి బొత్స సత్యనారాయణ కూడా పేర్కొనడం గమనార్హం. సంక్రాంత్రి తర్వాతే ఈ పక్రియ ప్రారంభించాలని తొలుత అనుకున్నప్పటికీ న్యాయస్థానంలో ఇబ్బందులు తలెత్తడంతో వెనుకడుగు వేయవలసి వచ్చింది.

ప్రసతుతం రాష్ట్ర హై కోర్ట్ లో దీనిపై వాదనలు జరుగుతున్న నేపథ్యంలోనే తరలింపుపై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగానే ఉగాదికి కొన్ని శాఖలను విశాఖకు తరలించనున్నారు. మరోవైపు ప్రస్తుతం అమరావతిలో నిర్మాణంలో ఉన్న కట్టడాలను పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది.

ఎమ్మెల్యేలు, మంత్రుల నివాసాలను పూర్తిచేసి, వారికి అమరావతిలోనే వసతి కల్పించాలని నిర్ణయించారు. మంత్రులకు సంబంధించినంత వరకు విశాఖలో కూడా వసతి ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. సచివాలయం విశాఖలో ఉండటంతో మంత్రులకు శాశ్వత నివాసాలు విశాఖలోనే ఉండే అవకాశం ఉంది.

అదే సమయంలో ఐఏఎస్‌, ఐపిఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారులకు అమరావతిలో ఇచ్చిన స్థలాలను వెనుకకు తీసుకుని, వారికి విశాఖలో కొత్తగా స్థలాలను ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలిసిరది. ప్రతి అధికారి అమరావతిలో స్థలానికి పాతిక రూ 25 లక్షల చొప్పున చెల్లించి స్థలాలను రిజిస్టర్‌ చేయించుకున్నారు. దీరతో ఆ స్థలాలను ప్రభుత్వం పేరిట మళ్లీ బదలాయించుకుని, విశాఖలో అదే మొత్తానికి కొత్తగా స్థలాలను ఇవ్వాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.

భీష్మ ప్రీమియర్ షో USA థియేటర్స్ లిస్ట్

నితిన్, రష్మిక మందన జంటగా నటించిన చిత్రం ‘భీష్మ’. ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ వారసుడు మహతి స్వర సాగర్ సంగీతం సమకూర్చారు. ఫిబ్రవరి 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

భీష్మ ప్రీమియర్ షో USA థియేటర్స్ లిస్ట్ కింద చూడవచ్చు..

 

Celebs at Vijaya Nirmala Statue Inauguration-2

బాలీవుడ్ పై కన్నేసిన త్రివిక్రమ్?

టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇటీవలే ‘అల.. వైకుంఠపురములో’ మూవీతో బాక్సాఫీసు రికార్డులు సృష్టించాడు. అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్లలో సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టించింది. మహేష్ బాబు నటించిన ‘సరిలేరునికెవ్వరు’, రజనీకాంత్ ‘దర్బార్’లను తట్టుకొని పాజిటివ్ దక్కించుకుంది. తెలుగు, మళయాళంతోపాటు యూకేలోనూ మంచి కలెక్షన్లు రాబట్టింది. తెలుగులో నాన్ బహుబలి రికార్డు దక్కించుకుంది. దీంతో ఈ మూవీని బాలీవుడ్లో తీసేందుకు సన్నహాలు జరుగుతున్నాయి. ఈ మూవీని బాలీవుడ్లోనూ త్రివిక్రమ్ దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జరుగుతుంది.

తెలుగులో హిట్టయిన సినిమాలన్నీ బాలీవుడ్లో రీమేక్ అవుతుంటాయి. తెలుగు రీమేక్ మూవీలకు బాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంది. ఈ కోవలోనే ‘అల.. వైకుంఠపురములో’ మూవీ బాలీవుడ్ బాటపట్టనుంది. బాలీవుడ్ కు చెందిన ఓ నిర్మాణ సంస్థ ఏకంగా ఏడుకోట్ల చెల్లించేందుకు ముందుకొచ్చినట్లు సమాచారం. అయితే ఈ సినిమాను బాలీవుడ్లో నిర్మించేందుకు అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ నిర్మాణంలో త్రివిక్రమ్, రాధాకృష్ణ భాగస్వాములుగా ఉంటారని సమాచారం. ఈ మూవీతో త్రివిక్రమ్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కన్పిస్తుంది.

ప్రస్తుతం అల్లు అరవింద్ తెలుగులో ఘనవిజయం సాధించిన ‘జెర్సీ’ మూవీని బాలీవుడ్లో నిర్మిస్తున్నారు. ఈ మూవీ పూర్తయిన వెంటనే ‘అల..వైకుంఠపురములో’ పట్టాలెక్కించేందుకు అల్లు అరవింద్ సన్నహాలు చేస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ నటిస్తారని ప్రచారం జరుగుతుంది. అలాగే ఈ మూవీని అదిరిపోయే బాణీలు సమకూర్చిన థమన్ బాలీవుడ్లోనూ మ్యూజిక్ అందించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు తన మాటలతో, దర్శకత్వ ప్రతిభతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ త్వరలోనే బాలీవుడ్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు.