వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, రష్మిక జంటగా రూపొందిన రొమాంటిక్ చిత్రం ‘భీష్మ’ మూవీ ఈ నెల 21 వ తేదీ రిలీజ్ కానుంది. ప్రస్తుతం నితిన్ హీరోగా, యేలేటి చంద్ర శేఖర్ దర్శకత్వంలో ఒక మూవీ, వెంకీ అట్లూరి దర్శకత్వంలో మరో మూవీ (రంగ్ దే ) చిత్రాలతో బిజీగా ఉన్నాడు.
అయితే ‘భీష్మ’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన మీడియా సమావేశంలో హీరో నితిన్ ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో “పవర్ పేట” మూవీ రూపొందనుందని, ఈ మూవీ లో తాను 18, 40, 60 వయస్సు ఉన్న త్రీ డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తానని, ఈ మూవీ ని మూడు భాగాలుగా తమ స్వంత బ్యానర్ లోనే రూపొందిస్తామని నితిన్ తెలిపారు, ఆగస్ట్ లో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ మూవీ తన కెరీర్ లో అరుదైన సినిమా అని, తన లైఫ్ లో స్పెషల్ సినిమా అవుతుందని నితిన్ చెప్పారు.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Nithin to do a triple role in his upcoming film
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com