
మన దేశంలోని యువకులలో దాదాపుగా అందరు సోషల్ మీడియా లో ఎక్కువ కలం గడుపుతున్నారు. 70 శాతం యువతీ యువకులు పేస్ బుక్ ను వినియోగిస్తున్నారు. ఇంతక ముందు రోజుల్లో మెసేజ్ ఫోన్ కాల్స్ ద్వారా సైబర్ హ్యాకింగ్స్ జరిగేవి. ఇప్పుడు సైబర్ నేరగాళ్లు ఫేసుబుక్ లో మహిళలకు ఎర వేశారు,తాము విదేశీయలుగా చెప్పుకుంటూ ఆడవారికి మెసేజ్ చేస్తూ వారిని మోసం చేస్తున్నారు. ఆడవారి పేర్లతో అకౌంట్స్ క్రియేట్ చేసి ఫ్రెండ్ రిక్వెస్ట్ లను ఆక్సిప్ట్ చేసి ముందుగా మంచిగా మాట్లాడుతూ చనువు పెంచుకొని తమ పై నమ్మకాన్ని కలిగిస్తున్నారు. ఒకరి ఫోన్ నెంబర్ లు ఒకరు మార్చుకున్న తరుత వాట్సాప్ చాటింగ్ లో తమ వాళ్లకు విదేశీ బ్యాంకుల్లో చాలా మొత్తంలో లో డబ్బులు ఉన్నట్లు వాళ్ళకి నమ్మకం కలిగించడం కోసం నకిలీ పాత్రలని పంపే వారు. ఆ డబ్బును సొంతం చేసుకోడానికి ఓ ఫోన్ నెంబర్ కు కాల్ చేయాలని ఓ నెంబర్ ను ఇస్తున్నారు . అవతలి వ్యక్తి కి కాల్ చేసిన
తరువాత బ్యాంకు లో డబ్బు పంపించడానికి ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేయించడానికై కొంత డబ్బు ఖర్చు అవుతుందని చెప్తూ డబ్బును దోచుకుంటున్నారు. ఫేసుబుక్ వాడడంలో ఎంతైనా జాగ్రత్త వహించాల్సి ఉంది…