విజయ్ దేవరకొండ తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఫైటర్’. పూరి జగన్మాథ్ దర్మకత్వంలో విజయ్ దేవరకొండ తొలిసారి నటిస్తున్నాడు. ‘ఫైటర్’ మూవీలో విజయ్ సరసన నటించిన హీరోయిన్ల విషయంలో చాలా పేర్లు విన్పించాయి. ముఖ్యంగా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించనున్నట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే తాజాగా చిత్రబృందం హీరోయిన్ పేరు ఖారారు చేసింది. ‘ఫైటర్’ మూలో విజయ్ దేవరకొండకు జోడిగా బాలీవుడ్ భామ అనన్యా పాండే నటించనుంది. ఈ మేరకు విజయ్ దేవరకొండ, పూరి జగన్మాథ్, చార్మి, అనన్యా పాండే షూటింగ్లో పాల్గొన్న ఫొటోను చిత్రబృందం సోషల్ మీడియాలో విడుదల చేసింది.
‘ఫైటర్’ తెలుగు, హిందీ, ఇతర భాషల్లో తెరకెక్కుతుంది. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్ హిందీలో ‘ఫైటర్’ మూవీని దర్మ ప్రొడక్షన్లో నిర్మిస్తున్నాడు. తెలుగులో పూరి జగన్మాథ్ టూరింగ్ టాకీస్, పూని కనెక్ట్ బ్యానర్లో చార్మి, పూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీతో విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మూవీలో జాన్వీకపూర్ నటిస్తుందని ప్రచారం జరిగిన ఆమె డేట్స్ దొరకకపోవడంతో ఆ ఛాన్స్ అనన్యా పాండే దక్కించుకుంది. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2’ మూవీతో పరిచమైన అనన్యా పాండే బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకొంది.
ఇటీవల విజయ్ దేవరకొండ నటించిన ‘వరల్డ్ ఫేమస్’ విడుదలైంది. ఈ చిత్రం అనుకున్నంత విజయం సాధించకపోవడంతో విజయ్ దేవరకొండ ‘ఫైటర్’ మీదే ఫోకస్ పెట్టాడు. అదేవిధంగా పూరి జగన్మాథ్ ఇటీవలే ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. వీరిద్దరి కాంబినేషన్లలో తొలిసారి ‘ఫైటర్’ మూవీ వస్తుంటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎట్టకేలకు విజయ్ దేవరకొండ పక్కన బాలీవుడ్ భామ సెట్టవడంతో షూటింగ్ శరవేగంగా పూర్తి జరుపుకుంటుంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నహాలు చేస్తుంది.