Home Blog Page 8621

ఆర్ధిక సంక్షోభంలో అట్టడుగు స్థాయికి కృష్ణ, గుంటూరు


డిసెంబరు 17, 2019న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రకటనతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తీవ్ర ఆర్ధిక సంక్షోభకర పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పూర్తిగా స్తంభించి పోవడంతో పలు రంగాలలో ఆర్ధిక వ్యవహారాలు సహితం నిలిచి పోయాయి.

ఈ రెండు జిల్లాల్లో స్థలాలు, పొలాలు, అపార్టుమెంట్ల క్రయవిక్రయాలు నిలిచిపోవడంతో వ్యాపారులు, నిర్మాణదారులు, రియల్‌ ఎస్టేట్‌ దళారులు, భూముల యజమానులు మరింత ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నారు. గత ఆరు నెలలుగా వివిధ రంగాల్లో ఏర్పడిన ఆర్థిక మాంద్యం ప్రభావంతో సామాన్యుల నుంచి ఎగువ తరగతి వరకూ నగదు చలామణి లేక తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.

ఈ తరుణంలో తాజాగా రాజధాని మారనున్నట్లు వచ్చిన ప్రభుత్వ ప్రకటనతో ఈ జిల్లాల ప్రజలల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది.
రాజధాని జిల్లాలో తమకు ఒక స్థలం ఉండాలనే ఆకాంక్షతో ఇతర జిల్లాల వారు గత ఐదేళ్ల కాలంలో ఇళ్ల స్థలాలు కొనుగోలు చేశారు. మంచి ధర ఉన్నప్పుడు విక్రయించవచ్చని చాలా మంది భావించారు. ప్రస్తుతం వీరంతా తీవ్ర నిరాశలో ఉన్నారు.

అమరావతి పరిధిలోని నిర్మాణాలు నిలిచిపోవడంతో రాజధానిలోని 29 గ్రామాల్లో ఆరు నెలలుగా భూమి క్రయ విక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి. తుళ్లూరు జిల్లా రిజిస్ట్రార్‌, అనంతవరం, మందడం, తుళ్లూరు సబ్‌ రిజిస్ట్రార్‌ల పరిధిలో కనీసం రోజుకు ఒక్క రిజిస్ట్రేషన్‌ అయినా జరగడం లేదు.

గుంటూరు జిల్లాలో 2019-20లో మొత్తంగా రూ.1003 కోట్ల ఆదాయం సాధించాలని జిల్లా రిజిస్ట్రేషన్‌ శాఖకు ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. ఇప్పటి వరకూ వచ్చిన ఆదాయం రూ.610 కోట్లే. మరో 45 రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుంది.

భూముల ధరలు మార్కెట్‌లో 2019 ఎన్నికల ముందున్న దానికంటే ఈ ఏడాది 30 నుంచి 50 శాతం వరకూ పడిపోయాయి. గుంటూరు-విజయవాడ మార్గంలో నిర్మించిన దాదాపు 20 వేల అపార్టుమెంటు ప్లాట్ల విక్రయాలు నిలిచిపోయాయి. గుంటూరు నగర పరిసరాల్లో దాదాపు ఆరువేల వేల ప్లాట్లను కోనేవారు లేక బిల్డర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Celebs at Vijaya Nirmala Statue Inauguration-1

భీష్మ సినిమా పేరు మార్చాలి

భీష్మ సినిమా పేరును, సినిమా లోని హీరో పేరును మార్చాలి, లేని పక్షంలో తెలుగు రాష్ట్రాల్లో సినిమాను అడ్డుకుంటామని తెలంగాణ బెస్తగూండ్ల చైతన్య సమితి హెచ్చరించింది. భీష్మ పితామహుడు మహాభారతానికి మూలం, ఆయన బ్రహ్మచారిగా ఉన్నారని, సినిమాలో అసభ్యకరమైన సీన్లు, వెకిలిచేష్టలు ఉన్నాయని వెంటనేఆ సినిమా పేరు,హీరో క్యారెక్టర్ పేరు మార్చాలని, మార్చని యెడల జరిగే పరిణామాలకు వారి బాధ్యులు అవుతారని హెచ్చరించారు .

Ramya Pasupuleti Latest Photos

వినాయకుడి పెళ్లి.. నిర్భయ దోషుల ఉరి.. రేపే!


మార్చి 3న ఉదయం 6గంటలకు నిర్భయ దోషులను ఉరి తీయాలని కొత్త డెత్ వారెంట్ ను విడుదల చేస్తూ పాటియాలా కోర్ట్ సంచలన తీర్పును వెలువరించిన విషయం తెలిసందే.. అయితే గతంలో కూడా దోషుల ఉరికి అనేక పర్యాయాలు కోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ ఆ శిక్ష అమలు కాలేదు. వాయిదాల మీద వాయిదాలు వేస్తూ.. కొత్త ఉరి కి డేట్ ఫిక్స్ చేయడం మరలా ఆ శిక్షకు స్టే విధించడం వంటివి అనేక పర్యాయాలు జరిగాయి.ఈ నేపధ్యలో దోషులకు ఉరి అమలు కాదని నిందితుల తరుపు న్యాయవాది సంచలన వ్యాఖ్యలు చేశారు.

మర్చి 3 న అమలు కావాల్సిన ఉరి శిక్ష కూడా వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. జైలులో నిర్భయ దోషులు ఆడుతున్న నాటకాలే అందుకు కారణం. ఇప్పుడు కూడా మరో కొత్త నాటకానికి తెరలేపారు. దోషి వినయ్ శర్మ తీహార్ జైలులో హల్‌ చల్ చేశాడు. జైలులో గోడకు తలను గట్టిగా కొట్టుకొని.. తనను తాను గాయపరుచుకునే ప్రయత్నం చేశాడు. అక్కడే ఉన్న సిబ్బంది ఈ ఘటనను అడ్డుకున్నారు. ఈ క్రమంలో వినయ్‌ కు స్వల్ప గాయాలైనట్లు జైలు అధికారులు చెబుతున్నారు. ఉరి శిక్ష అమలులో మరోసారి ఉరికి స్టే రావాలనే ఉద్దేశంతో కావాలనే వినయ్ గాయపచుకున్నాడని.. జైలు అధికారులు చెబుతున్నారు.

ప్రభుత్వ ఉద్యోగులకు కెసిఆర్ శుభవార్త


గత అసెంబ్లీ ఎన్నికలలో హామీ ఇచ్చిన విధంగా ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సును 58 ఏళ్ళ నుండి 61 ఏళ్లకు పెంచేందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కసరత్తు చేస్తున్నారు. వచ్చే ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ 1 నుండి దీనిని అమలు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది.

గతవారం ఆర్థిక శాఖ సమీక్షలో సీఎం కేసీఆర్ ఆ మేరకు గ్రీన్సిగ్నల్ కూడా ఇచ్చినట్లు చెబుతున్నారు. ఉద్యోగ విరమణ వయస్సు పెంచితే ఖజానాకు ఎంత వరకు రిలీఫ్ ఉంటుందనే దానిపై అధికారులు లెక్కలు తీశారు. రెండేండ్లుగా పీఆర్సీ రాకపోవడంతో ఆగ్రహంగా ఉన్న ఉద్యోగుల్లో కొందరినైనా సంతృప్తి పరచాలంటే ఉద్యోగ విరమణ వయస్సును పెంచడమే మార్గమని కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.

రాష్ట్ర విభజన జరిగిన వెంటనే ఆంధ్ర ప్రదేశ్ లో కొత్తగా అధికారమలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగ విరమణ వయస్సును 60 సంవత్సరాలకు పెంచారు. కానీ తెలంగాణలో కేసీఆర్ ఆ మేరకు పెంచక పోవడంతో ప్రభుత్వ ఉద్యోగులలో అసంతృప్తి నెలకొంది. దానిని గ్రహించిన కేసీఆర్ 60 ఏళ్లకు కాకుండా 61 ఏళ్లకు పెంచుతామని అంటూ గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రణాళికలో భరోసా ఇచ్చారు.

అయితే ఎన్నికలు ముగిసి సంవత్సరం దాటినా ఇంకా ఆ ప్రసక్తి తీసుకు రాకపోవడం, మరోవంక వేతన సవరణ గురించి మాట్లాడక పోవడంతో ఉద్యోగ వర్గాలు అసహనంగా ఉన్నాయి. ఈ అంశంపై త్వరలో ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ సమావేశంలోనే ఉద్యోగ విరమణ వయస్సు పెంపుతో పాటు పీఆర్సీపై కూడా కీలక ప్రకటన చేయవచ్చని చెబుతున్నారు.

ఉద్యోగ విరమణ వయసును పెంచితే ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ఖజానాపై భారం తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మూడేండ్ల పెంపుతో దాదాపు రూ. 9 వేల కోట్ల వరకు రిలీఫ్ ఉంటుందని వారు లెక్కలు గట్టారు. ఆర్థిక పరిస్థితి ఆశించినట్టుగా లేకపోవడంతో పీఆర్సీ అమలు కంటే ముందు ఉద్యోగ విరమణ వయసును పెంచాలనే నిర్ణయానికి సీఎం వచ్చినట్టు తెలుస్తున్నది.

రాజధాని నుండి మున్సిపాలిటీకి చేరిన అమరావతి ప్రస్థానం..


రాజధానిని విశాఖకు తరలించే ప్రయత్నాలు జరుగుతూ ఉండడంతో అమరావతి భవిష్యత్ పై నీలి నీడలు క్రమ్ముకున్న సమయంలో రాజధాని పరిధిలోని తుళ్లూరు మండలంలోని గ్రామాలన్నింటిని కలిపి అమరావతి పేరుతో మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాజధాని స్థాయి నుండి మునిసిపల్ స్థాయికి అమరావతి ప్రాధాన్యతను కుదించిన్నట్లు కానున్నది.

ఇప్పటికే తాడేపల్లి, మంగళగిరి మండల పరిధిలోని గ్రామాలను స్థానిక పురపాలక సంస్థల్లో కలుపుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా తుళ్లూరు మండల పరిధిలోని గ్రామాలన్నీంటిని కలిపి మున్సిపాలిటీ ఏర్పాటు చేసే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేస్తోంది.

గతంలో అమరావతి కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తారని ప్రచారం జరిగినా, జనాభా రీత్యా కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడం సాధ్యం కాదనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలిసింది. మున్సిపాల్టీగా ఏర్పాటు చేయాలన్న తాజా నిర్ణయంతో పట్టణాభివృద్దిశాఖ ద్వారానే అక్కడ పనులు జరగనున్నాయి.

గతంలో తుళ్లూరు మండలంలో కొన్ని గ్రామాలను రాజధాని పరిధి నుండి మినహాయించారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే మున్సిపాలిటీలో వాటినీ కలపనున్నారు.

ఇటీవల స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలనే చర్చ మొదలైన అనంతరం రాజధాని పరిధిలోని గ్రామాలన్నీ పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలోకి వచ్చిన నేపథ్యంలో అక్కడ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని లేఖలో పేర్కొన్నారు. అదే సమయంలో రాజధాని పరిధిలోకి వచ్చిన తాడేపల్లి, మంగళగిరి మండలాల పరిధిలోని గ్రామాలను మాస్టర్‌ప్లాను నుండి విడదీసి కొత్తగా ఏర్పాటు చేయనున్న మున్సిపాలిటీల పరిధిలో కలిపేశారు.

దీంతో రాజధాని పరిధి నామమాత్రంగా మారింది. అయితే ఇది తమను మోసం చేయడ మవుతుందని పేర్కొంటూ పలువురు రైతులు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో మిగిలిన ప్రాంతాన్ని మున్సిపాలిటీగా మార్చడానికి అవసరమైన ప్రక్రియ చేపట్టాలని ఇటీవల పట్టణాభివృద్ధిశాఖకు ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది.

దుబాయ్ లో ‘ల‌వ్ స్టోరి’

అక్కినేని నాగ‌చైత‌న్య‌ నటించిన ఏమాయ చేసావె, 100% ల‌వ్, ప్రేమ‌మ్, మ‌జిలీ.. ఇలా ప‌లు ప్రేమ‌క‌థా చిత్రాలు విజయవంతం కావడంతో.. ఇప్పుడు ఏకంగా ‘ల‌వ్ స్టోర’` పేరుతో ఓ సినిమా చేస్తున్నాడీ యంగ్ హీరో.

 

సెన్సిబుల్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల రూపొందిస్తున్న ఈ చిత్రంలో సాయిప‌ల్ల‌వి నాయిక‌గా న‌టిస్తోంది. ఇప్ప‌టికే సింహ‌భాగం చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న ఈ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ కొత్త షెడ్యూల్ ఈ నెల 21 నుంచి దుబాయ్ లో జ‌రుగ‌నుంది. ఈ షెడ్యూల్ లో ఒక పాట‌తో పాటు కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను కూడా చిత్రీక‌రించనున్నార‌ని స‌మాచారం. ప‌వ‌న్ సంగీత‌మందిస్తున్న `ల‌వ్ స్టోరి` వేస‌వి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

100 ఎకరాలు కొన్న యాంకర్ రష్మీ..

తెలుగులో బుల్లితెర యాంకర్ గా రాణిస్తూ మంచి జోరు మీదుంది రష్మీ. జబర్దస్త్ షో తో తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది. రష్మీ అడపాదడపా సినిమాలోను నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా రష్మీకి సంబందించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. 100 ఎకరాలను కొనుగోలు చేసి వ్యవసాయం చెయ్యాలనుకుంటుందని వార్తలు వస్తున్నాయి.

Read More:‘ఇండియన్-2’ షూటింగ్లో ప్రమాదం.. ముగ్గురి మృతి

రష్మీ సంపాదించిన డబ్బుతో ఆంధ్రా ఒడిశా సరిహద్దులో తన సొంత ఊరైన బెహ్రాంపూర్ అనే ప్రదేశంలో రష్మీ 100 ఎకరాల భూమిని కొనుగోలు చేసిందని వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం దాదాపు రూ.5కోట్లకు డీల్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ 100ఎకరాల్లో కోకా, యూకలిప్టస్‌, మామిడి, నేరేడు వంటి పంటలను పెంచాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం మరి ఈ వార్తలపై రష్మీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

 

పవన్ ఢిల్లీ పర్యటన.. జగన్ తో స్నేహానికి బాటలు?


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీ గా గడపబోతున్నారు. మొన్నటికి మొన్న ఏపీ సీఎం జగన్, ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోడీని, హోమ్ శాఖా మంత్రి అమిత్ షా ని కలిసారు . ఫస్ట్ జగన్, తర్వాత పవన్, ఢిల్లీ పర్యటనకి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. వరుస నేతలు ఢిల్లీ పర్యటనపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఆసక్తికర చర్చ నడుస్తుంది.

గతవారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన అనేక విషయాలను సీఎం జగన్, మోడీతో చర్చినట్లు సమాచారం. అలాగే అమిత్ షా తో మండలి రద్దు, రాజధాని మార్పు పై చర్చించారు. ఈ వారం పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి ఎవరెవరిని కలవబోతున్నారు, ఏయే నిర్ణయాలు తీసుకోబోతున్నారు? అనేవి ఆసక్తిగా మారాయి.

ఇప్పటికే ఏపీ లో బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే.. ఆ తర్వాత జగన్, ఢిల్లీ వెళ్ళి వైసీపీ-బీజేపీ కూటమిని ఖరారు చేసినట్లు సమాచారం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి జనసేన-బీజేపీ-వైసీపీ కూటమికి పచ్చ జెండా ఊపే అవకాశాలు లేకపోలేదు. ఒకవేళ ఇదే జరిగితే ఏపీ లో జగన్, పవన్ కలిసి పనిచేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వైసీపీతో పొత్తు నిమిత్తమే.. పవన్ కళ్యాణ్ ని ఒప్పించడానికి పవన్ కి ఢిల్లీ నుండి పిలుపు వచ్చినట్లు సమాచారం.

‘ఇండియన్-2’ షూటింగ్లో ప్రమాదం.. ముగ్గురి మృతి

‘ఇండియన్-2’ షూటింగ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.. ఈ సంఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలుస్తోంది. అదేవిధంగా 10మందికి తీవ్రగాయాలైనట్లు సమాచారం. ఇందులో దర్శకుడు శంకర్ కూడా ఉన్నారని తెలుస్తోంది. ఈ ప్రమాద సంఘటన తెలుసుకున్న పలువురు సీని ప్రముఖులు షాక్ గురయ్యారు.

దర్శకుడు శంకర్, విశ్వనటుడు కమలహాసన్ కాంబినేషన్లలో తాజాగా తెరకెక్కుతున్న మూవీ ‘ఇండియన్2’. చెన్నై సమీపంలోని ఈవీపీ ఫిల్మ్ సిటీలో ‘ఇండియన్2’ షూటింగ్ చేస్తుండగా భారీ క్రేన్ విరిగిపడటంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పొడక్షన్ అసిస్టెంట్స్ మధు(29), చంద్రన్ (60), సహాయ దర్శకుడు కృష్ణ(34) మృతిచెందగా 10మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై కమలహాసన్ ట్వీట్లర్లో స్పందించారు. ఈ ప్రమాదం తనను తీవ్రంగా కలిచివేసిందని భావోద్వేగానికి గురయ్యాడు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

‘ఇండియన్-2’ మూవీ తెలుగులో ‘భారతీయుడు-2’ పేరుతో తెరకెక్కుతుంది. ఈ మూవీలో కమలహాసన్ కు జోడీగా కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీతీసింగ్ నటిస్తున్నారు. కాజల్ ఇందులో 60ఏళ్ల భామగా కనిపించనుందని సమాచారం. కాగా ప్రమాద విషయం తెలుసుకున్న నజరేత్ పేట్ పోలీసులు అక్కడి చేరుకొని కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Ruhani Sharma Photo Shoot Stills

12వేల ఎకరాలలో నారప్ప యాక్షన్ సీన్…!

‘ఎఫ్ 2’, ‘వెంకీమామ’ వరుస హిట్లతో జోరు మీద ఉన్న విక్టరీ వెంకటేష్.. ప్రస్తుతం తమిళ్‌లో సంచలన విజయాన్ని నమోదు చేసిన అసురన్… తెలుగు రీమేక్‌ ‘నారప్ప’లో నటిస్తున్న విషయం తెలిసిందే… ఈ సినిమా ఫస్ట్ లుక్ తో అలరించిన వెంకటేష్ ప్రస్తుతం షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నాడు.

అయితే షూటింగ్ లో భాగంగా కీలక యాక్షన్ సీన్ చిత్రీకరించేందుకు తమిళ్‌నాడులో తెరికాడు రెడ్ డెజర్ట్ లో సుమారు 12,000 ఎకరాల స్థలాన్ని ఉపోయోగిస్తునట్టు చిత్ర బృందం తెలిపింది.

ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్  మాట్లాడుతూ – ” తమిళనాడులోని రెడ్ డెసర్ట్ లో 10 రోజులు తీసిన యాక్షన్ సీక్వెన్స్ చిత్రానికి హైలెట్ అవుతుంది. వెంకటేష్ గారికి, నాకు ‘నారప్ప’ ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తోంది.” అన్నారు.

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ, ” నారప్ప మోస్ట్ పవర్ఫుల్, ఎమోషనల్ కేరక్టర్. ప్రేక్షకులు నారప్పగా కొత్త వెంకటేష్ గారిని చూస్తారు” అన్నారు.

కో- ప్రొడ్యూసర్ దేవి శ్రీదేవి సతీష్ మాట్లాడుతూ – “తమిళనాడులోని తిరిచందూర్ సమీపంలో ఉన్న తెరికాడు లో నారప్ప యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశాము. 12,000 ఎకరాల్లో ఉండే ఈ ప్రదేశాన్ని రెడ్ డెసర్ట్ ఆఫ్ తమిళనాడు అంటారు.  ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ నేతృత్వంలో ‘నారప్ప’ కి సంబంధించిన కీలక యాక్షన్ సన్నివేశాలు షూట్ చేశాము” అన్నారు.

ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ విజయ్‌ శంకర్‌ దొంకాడ మాట్లాడుతూ – ” ఇప్పటికే  27 రోజులు షూటింగ్ పూర్తి చేశాం. ఇంకా నాన్ స్టాప్ గా షెడ్యూల్ జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం” అన్నారు.

మురికివాడని మూసేసిన ట్రంప్ గోడ

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ నెల చివరిలో భారత్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.. ట్రంప్ కి ఘన స్వాగతం చెప్పేందుకు బీజేపీ ప్రభుత్వం సిద్ధమౌతోంది. నమస్తే ట్రంప్(కేమ్ ఛో ట్రంప్) పేరుతో రాజస్థాన్ లోని “మోటేర స్టేడియం” లో ఘన స్వాగతం పలకనుంది మోడీ సర్కార్.

అయితే ట్రంప్ ప్రయాణించే.. మార్గంలో మోడీ గవర్నమెంట్ ఒక వినూత్నమైన పనిని తలపెట్టింది. రోడ్డుకి రెండువైపులా పెద్ద పెద్ద బ్యానర్స్ తో స్వాగత బోర్డులను ఏర్పాటు చేస్తుంది. అలాగే కొన్ని ప్రదేశాలలో ఉన్న గోడలకు రంగులతో ముస్తాబు చేస్తుంది. మరి కొన్ని చోట్ల మూరికి వాడలు కనిపించకుండా ఏకంగా గోడ కట్టి, సర్వాంగ హంగులతో ముస్తాబు చేస్తుంది.

మురికి వాడలు కనిపించకుండ గోడలు కట్టడాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఆ గోడకి ఉపయోగించే డబ్బుతో.. అక్కడున్న ప్రజలకు నివాసాలను ఏర్పాటు చేయవచ్చనేది అనేకమంది విశ్లేషకుల అభిప్రాయం.

New Groom Nithin Photoshoot

‘మిస్ ఇండియా’ రిలీజ్ డేట్ ఫిక్స్

మహారాష్ట్ర కూటమిలో సిఏఏ మంటలు!


మహారాష్ట్రలో ఏర్పాటైన అఘాడీ కూటమి ప్రభుత్వంలో మూడు నెలలకే లుకలుకలు మొదలయ్యాయి. సీఏఏ, ఎన్పీఆర్ విషయంలో శివసేన, ఎన్సీపీ మధ్య విభేదాలు బయటికొచ్చాయి. సీఏఏకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే జై అంటే.. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ నై అంటున్నారు. మద్దతిస్తామని ఉద్ధవ్ అంటే.. వ్యతిరేకిస్తామని పవర్ స్పష్టం చేస్తున్నారు.

దీంతో కొన్నినెలలుగా సైలెంట్ మోడ్లో ఉన్న మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడి పుట్టిస్తున్నాయి. మహారాష్ట్రలో కొన్ని నెలల కిందట కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కలిసి ‘మహావికాస్ అఘాడీ’ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.

ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్పీఆర్)పై శివసేన తమ వైఖరి తెలిపింది. ఆ రెండింటికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది.

సింధుదుర్గ్లో మీడియాతో మాట్లాడిన ఉద్ధవ్ థాక్రే.. సీఏఏతో ఎలాంటి ప్రమాదం లేదని ప్రకటించారు. తమ రాష్ట్రంలో ఎన్పీఆర్ అమలును అడ్డుకోబోమని తెలిపారు. శివసేన, కాంగ్రెస్‌‌ను ఏకతాటిపైకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన శరద్ పవార్ మాత్రం భిన్నంగా స్పందించారు.

సీఏఏను వ్యతిరేకిస్తామని గతంలో చెప్పామని స్పష్టం చేశారు. అయితే దీనిపై శివసేనతో చర్చిస్తామని, ఆ పార్టీని ఒప్పిస్తామని చెప్పారు.

అయితే, భీమా–కోరెగావ్ కేసు దర్యాప్తును కేంద్రానికి అప్పగించబోమని ప్రకటించడం ద్వారా ఈ విషయంలో పవర్ ను ప్రసన్నపరచే ప్రయత్నం ఉద్ధవ్ చేశారు. ఎల్గర్ పరిషద్ కేసు దర్యాప్తును ఈ మధ్య ఎన్ఐఏకి మహా ప్రభుత్వం అప్పగించింది. దీనిపై శరద్ పవార్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో స్పందించిన ఉద్ధవ్.. ‘‘ఎల్గర్, భీమా–కోరెగావ్ కేసులు రెండూ వేర్వేరు. భీమా–కోరెగావ్ దర్యాప్తును కేంద్రానికి అప్పగించబోం. దళిత సోదరులకు అన్యాయం జరగనివ్వం”అని చెప్పారు.