‘గద్దలకొండ గణేష్’ తరువాత హీరో వరుణ్ తేజ్ ఒక స్పోర్ట్స్ డ్రామా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బ్లూ వాటర్ క్రియేటివ్స్, రినైసెన్స్ పిక్చర్స్ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో ఈ మూవీ రూపొందనుంది. ఈ మూవీ లో బాక్సర్ గా నటించనున్న వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ సినిమాకి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.
ఫిబ్రవరి 24 వ తేదీ నుండి షూటింగ్ ప్రారంభం కానున్న ఈ మూవీ లో హీరోయిన్ గా బాలీవుడ్ భామ ను ఎంపిక చేశారని సమాచారం. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన “దబంగ్ 3 ” మూవీ తో బాలీవుడ్ లో ప్రవేశించిన సాయి మంజ్రేకర్. ఇప్పుడు #VT10 మూవీ లో వరుణ్ తేజ్ కు జోడీగా ఎంపిక చేసారు అని సమాచారం. #VT10 మూవీ తో సాయీ టాలీవుడ్ కు ఎంటర్ కానున్నారు.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Varun tej to romance bollywood beauty
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com