ట్రంప్ భారత్ పర్యటన.. మరో భారీ ఒప్పందం

2020 ఫిబ్రవరి 24, 25 తేదీల్లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన సతీమణి మెలానియాతో కలిసి భారత్ పర్యటనకు వస్తున్నారు. ఇవాంకా కూడా తన తండ్రితో పాటు ఇండియాకు రానున్నారు. ట్రంప్ దంపతులు,అమెరికా దేశ అందాల రాశి ఇవాంకా ఢిల్లీ, ఆగ్రా అహ్మదాబాద్ ప్రాంతాలలో పర్యటించనున్నారు.
అగ్రరాజ్యం అధ్యక్షుడు భారత పర్యటనకు వస్తున్నారంటే ఇది దేశానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాబట్టి ఈ పర్యటనలో భారత్-అమెరికా దేశాల మధ్య పలు వాణిజ్య ఒప్పందాలు జరుగుతాయనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అందుకు తగినట్లుగానే ఒప్పందాల విషయమై ట్రంప్ స్పందించారు. లాస్ వెగాస్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ “భారత పర్యటనలో ఇరు దేశాల మధ్య ఎవరూ వూహించని ఒక భారీ ఒప్పందం కుదుర్చుకుంటాం” అని వ్యాఖ్యానించారు. ఈ మాటతో ఆ ఒప్పందం ఏమైఉంటుందా.. అని యావత్ భారతావని ఆసక్తిగా ఎదురుచూస్తుంది.
గతంలో మాజీ భారత ప్రధాని మన్మోహన్‌సింగ్, మాజీ అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ ల మధ్య జరిగిన అణుఒప్పందం తర్వాత ఇప్పటి వరకు భారీ ఒప్పందం భారత్-అమెరికాల మధ్య ఏవీ జరగలేదు. అంతేకాకుండా భారత్-అమెరికాల మధ్య అణుఒప్పందం జరగడంతో ప్రపంచదేశాలకు భారత్ అణుశక్తిగా ఎదుగుతోందన్న సంకేతాలు వెళ్లాయి. కానీ అలా జరుగలేదు. కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ (సీఎఫ్‌ఆర్) విడుదల చేసిన వాస్తవిక పట్టిక ప్రకారం భారత్ అమెరికా దేశాల మధ్య వస్తు సేవా రంగంలో 1999 నుంచి 2018వరకు వృద్ధి గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. 1999లో 16 బిలియన్ అమెరికన్ డాలర్లు ఉండగా 2018 నాటికి అది 142 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం వస్తువులు సేవల రంగంలో అమెరికా భారత్‌ల భాగస్వామ్యం ఎనిమిదో స్థానంలో నిలిచింది.
గతంలో జరిగిన అణు ఒప్పందాలకు భిన్నంగా కొత్తగా ఇరు దేశాల మధ్య జరుగబోయే ఒప్పందానికి అమెరికా, భారత్ లు స్పందించి సత్ఫలితాలను ఇవ్వాలని కోరుకుందాం..
ఎగ్జయిటింగ్ లొకేషన్‌లో ‘రెడ్’ సినిమా షూటింగ్
యూరప్‌లో చాలా ఎగ్జయిటింగ్ లొకేషన్ ‘డొలమైట్స్’. ఇటలీకి చెందిన ఈ పర్వత తీరప్రాంతంలో చాలా హాలీవుడ్ సినిమాల షూటింగ్‌లు జరిగాయి. లేటెస్ట్ గా ‘రెడ్’ సినిమా షూటింగ్ ఇక్కడ జరిగింది.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న చిత్రం ‘రెడ్’. కిశోర్ తిరుమల దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మి స్తున్న’రెడ్’ చిత్రం కోసం రెండు పాటలను ఇటలీలో చిత్రీకరించారు. ఆ రెండు పాటల్లో ఒకదాన్నిడోలమైట్స్ లో షూట్ చేయడం విశేషం.
ఆ ముచ్చట్లను ‘స్రవంతి’ రవికిశోర్ వివరిస్తూ – ”ఈ నెల 12 నుంచి 18 వరకూ ఇటలీలోని బ్యూటీఫుల్ లొకేషన్స్ లో రామ్, మాళవికా శర్మలపై రెండు పాటలు చిత్రీకరించాం. శోభిమాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఇటలీలోని టుస్కాన్ ,ఫ్లారెన్స్, డోలమైట్స్ ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. డోలమైట్స్ అనేది సముద్ర తీర పర్వత ప్రాంతం. సముద్ర తీరానికి 10 వేలఅడుగుల ఎత్తులో మైనస్ ఐదు డిగ్రీల వాతావరణంలో ఒక పాటను చిత్రీకరించాం. డోలమైట్స్ లో షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు చిత్రం ఇదే! ఈ రెండు పాటలూ చాలా బాగా వచ్చాయి. అలాగే ఇటలీలో ప్రతి ఏటా సూపర్బ్ గా జరిగే వెనీడియా కార్నివాల్‌లో కూడా అనుమతి తీసుకుని పాటలో కొంత భాగాన్ని చిత్రీకరించాం. దీంతో ఒక పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ నెలాఖరున హైదరాబాద్‌లో ఆ పాట చిత్రీ కరిస్తాం” అని తెలిపారు.
చిత్ర సమర్పకులు కృష్ణ పోతినేని మాట్లాడుతూ ”ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాతరామ్ నుంచి వస్తున్న ఈ చిత్రం క్లాస్‌నీ, మాస్‌నీ ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ఓపెనింగ్‌రోజున ప్రకటించినట్టుగానే ఏప్రిల్ 9న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నాం” అని చెప్పారు.
ఎన్పిఆర్ అమలు కోసం కేంద్రం కొత్త డ్రామా..!

దేశవ్యాప్తంగా ఎన్పిఆర్ ని అమలు చేయడానికి బీజేపీ ప్రభుత్వం సిద్దమౌతుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించడానికి కేంద్రం సన్నద్ధమౌతుంది. అయితే ఎన్పిఆర్ ప్రక్రియలో ఎన్యూమరేటర్లు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వవద్దని సిపిఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ విషయంలో ఎన్పిఆర్ ను ధిక్కరించాలని ప్రజలను కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించాలని ఆయన కోరారు.
నేషనల్ పీపుల్ రిజిస్టర్ (ఎన్పిఆర్) మరియు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్సి)ల మధ్య అంతర్గత సంబంధం గురించి
ఏచూరి వివరంగా వివరించాడు, ఇది ఇటీవల ఆమోదించిన సిఎఎతో అనుసంధానించబడి ఉందని, పార్లమెంటు, ప్రధాని, నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాతో సహా వివిధ వేదికలలో ప్రభుత్వం ఎన్‌ఆర్‌సిని అమలు చేయబోవడం లేదని, ఇది ఎన్‌పిఆర్‌ను ముందస్తుగా మాత్రమే తీసుకుంటుందని అబద్ధాలు వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ప్రజలకు గుర్తు చేశారు.
దేశంలో ప్రతి పదేళ్ళకు ఒకసారి జనాభా లెక్కల ప్రక్రియ జరుగుతోంది మరియు తదుపరి జనాభా లెక్కలు 2021 లో జరగనున్నాయి. ప్రజల నుండి డేటాను సేకరించడానికి ఎన్పిఆర్ ఇప్పుడు చేపట్టబడుతుంది. జనాభా లెక్కల కోసం సాధారణ ప్రశ్నపత్రంతో పాటు, ప్రజల నుండి సమాధానాలు తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్యూమరేటర్లకు ప్రత్యేక ఫారమ్‌ను పంపుతోంది.
ఈ క్రొత్త రూపం చాలా ప్రశ్నలను కలిగి ఉంది; తల్లిదండ్రుల పుట్టిన తేదీ మరియు ప్రదేశం మరియు దానిపై పత్రాల లభ్యత వంటివి. వాస్తవమేమిటంటే, మెజారిటీ ప్రజలు అలాంటి వివరాలను అందించలేరు. తనను తాను ఒక ఉదాహరణగా పేర్కొంటూ, 1952 లో చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించినప్పటికీ, పిల్లలకు జనన ధృవీకరణ పత్రాలు ఇచ్చే విధానం లేదని చెప్పారు. అందుకని ఆయనకు జనన ధృవీకరణ పత్రం లేదు. ఇప్పుడు వారు అతని తల్లిదండ్రుల జనన ధృవీకరణ పత్రాలను అడుగుతున్నారు, అది ఉత్పత్తి చేయడం అసాధ్యం. పుట్టిన తేదీ వివరాలు పాస్‌పోర్ట్‌లో లభిస్తాయి, కాని వారు (ఎన్యూమరేటర్లు) పుట్టుకకు డాక్యుమెంటరీ రుజువు కోరితే, దానిని పొందడం కూడా అతనికి అసాధ్యమని ఏచూరి వ్యాఖ్యానించారు.
అదేవిధంగా, కొన్ని స్థిరమైన ఆస్తులు ఉన్నవారు తప్ప, దేశంలో చాలా మంది ప్రజలు విద్య, ఉపాధి మొదలైన వాటి కోసం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళే అలవాటులో ఉన్నారు. అలాంటి వారు తమ రికార్డులను భద్రంగా ఉంచుతారని ప్రభుత్వం ఎలా ఆశించగలదని ఏచూరి అడిగారు ? అటువంటి పరిస్థితిలో, ఇలాంటి హాస్యాస్పదమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం మినహా ప్రజలకు వేరే మార్గం లేదు. ఈ ప్రక్రియ తరువాత, నియమించబడిన ఎన్పిఆర్ అధికారులు ప్రజలు ఇచ్చిన సమాధానాలను పరిశీలిస్తారని ఏచూరి మరింత వివరించాడు.
అందువల్ల, ఎన్పిఆర్ ఎన్యూమరేటర్ల నుండి సంబంధం లేని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి నిరాకరించాలని ఏచూరి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సమస్యపై ప్రజలలో ఇంటింటికీ ప్రచారం చేపట్టాలని పార్టీ కార్యకర్తలను ప్రోత్సహించారు.
వైభవంగా ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డుల ప్రధానోత్సవం
ప్రతియేటా జరిగే దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డుల ప్రధానోత్సవం అట్టహాసంగా కొనసాగింది. ముంబాయిలో గురువారం సాయంత్రం నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమం వైభవంగా సాగింది. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ తారలు, టెలివిజన్ నటీనటులు పాల్గొని సందడి చేశారు. బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ కు ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. ఉత్తమ చిత్రంగా ‘సూపర్ 30’, మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ అవార్డును కిచ్చా సుదీప్, ఉత్తమ రియాలిటీ షోగా బిగ్ బాస్ సీజన్-13 అవార్డులను దక్కించుకున్నాయి.
విజేతలు వీరే..
ఉత్తమ చిత్రం: సూపర్ 30
ఉత్తమ నటుడు: హృతిక్ రోషన్
బెస్ట్ రియాల్టీ షో: బిగ్ బాస్ సీజన్-13
బెస్ట్ టెలివిజన్ సిరీస్: కుంకుమ భాగ్య
బెస్ట్ యాక్టర్ ఇన్ టెలివిజన్ సిరీస్: ధీరజ్ ధూపర్
బెస్ట్ యాక్టర్స్ ఇన్ టెలివిజన్: దివ్యాంకా త్రిపాఠి
బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్: అర్మాన్ మాలిక్
మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ : కిచ్చా సుదీప్
మెస్ట్ ఫేవరేట్ టెలివిజన్ యాక్టర్: హర్షద్ చోప్డా
మోస్ట్ ఫేవరేట్ జోడి ఇన్ టెలివిజన్ సిరీస్: శృతి ఝా, షబ్బీర్(కుంకుమ భాగ్య)
ఒరేయ్ బుజ్జిగా ఫస్ట్ సింగిల్.. కురిసెన..
https://www.youtube.com/watch?v=iU548GP_4a0
‘విలవిలలాడే నిన్నే చూసి ప్రాణం.. కాలవాంది సొంతం.. పెరిగిందే ఇష్టం..’ ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న ఈ సాహిత్యానికి అనూప్ రూబెన్స్ అందించిన స్వరాలు తోడైతే.. ఓ అద్భుతమైన రొమాంటిక్ సాంగ్ ఆవిష్కృతం అవుతుంది. ‘ఒరేయ్ బుజ్జిగా..’ చిత్రం కోసం అలాంటి ఓ అందమైన ప్రేమగీతాన్ని రచయిత కె.కె., సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ సమకూర్చారు. అంతే అద్భుతంగా ఈ పాటను ఆలపించి వీనుల విందు కలిగించారు అర్మాన్ మాలిక్, పి.మేఘన. ‘కురిసెన.. కురిసెన.. తొలకరి వలపులె మనసున..మురిసెన.. మురిసెన.. కలలకి కనులకి కలిసెన..’ అంటూ సాగే ఈ పాటను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ విడుదల చేసారు.
యంగ్ హీరో రాజ్‌తరుణ్‌తో కొండా విజయ్‌కుమార్ రూపొందిస్తున్న ‘ఒరేయ్ బుజ్జిగా..’ చిత్రంలో ఓ మంచి సిట్యుయేషన్‌లో వచ్చే పాట ఇది. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. మ్యాంగో మ్యూజిక్ ద్వారా ఈ చిత్రంలోని పాటలు విడులదవుతున్నాయి. శ్రీమతి క్ష్మీ రాధామోహన్ సమర్పణలో సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న యూత్‌పుల్ ఎంటర్‌టైనర్ ‘ఒరేయ్ బుజ్జిగా..’ ఈ పాటను అందమైన లొకేషన్లలో రాజ్‌తరుణ్, మాళవిక నాయర్‌పై చిత్రీకరించారు. ముఖ్యంగా ఐ.ఆండ్రూ ఫోటోగ్రఫీ ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్ అవుతుందని ఈ పాటలోని కొన్ని ఫ్రేమ్స్ చూస్తేనే అర్థమైపోతుంది.
ఈ ఫస్ట్ సింగిల్ విడుదలైన సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ ‘‘వరుణ్‌తేజ్‌గారు మా సినిమాలోని మొదటి పాటను విడుదల చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఆయనకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ పాట విడుదలైన కొద్దిసేపట్లోనే చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ పాటకు కె.కె. ఎంతో అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. దానికి తగ్గట్టుగానే అనూప్ రూబెన్స్ మంచి మ్యూజిక్ చేశారు. మా సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైనప్పటి నుంచి అన్నీ పాజిటివ్ వైబ్రేషన్సే కనిపిస్తున్నాయి. ఫస్ట్‌లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మొదటి పాటకు సెకన్ల వ్యవధిలోనే మంచి వ్యూస్ వచ్చాయి. పాట ఎంతో బాగుందంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు. మిగతా పాటలు కూడా బాగా కుదిరాయి. తప్పకుండా మ్యూజికల్‌గా పెద్ద హిట్ అవుతుంది. ప్రస్తుతం మా సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఉగాది కానుకగా మార్చి 25న సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. మా బేనర్‌లో తప్పకుండా ‘ఒరేయ్ బుజ్జిగా..’ మరో సూపర్‌హిట్ మూవీ అవుతుంది.’’ అన్నారు.
2020 మేలో ప్రజలు, సీఎంని వధించడం ఖాయం…!

బీహార్ అసెంబ్లీకి ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ), జనతా దళ్ (యునైటెడ్)(జేడీయూ) పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని బీహార్‌లోని వైశాలి జిల్లాలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆర్జేడీ నాయకుడు తేజ్ ప్రతాప్ యాదవ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తేజ్ ప్రతాప్ యాదవ్ మాట్లాడుతూ..2020లో ఎవర్ని వధిస్తారు? (2020 మే కిస్‌కా వధ్ హోగా?) అని ఆయన ప్రశ్నించారు. తేజ్ ప్రతాప్ యాదవ్ ప్రశ్నకు స్పందించిన ప్రజలు.. నితీష్‌ను అని బదులిచ్చారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం నితీష్ కుమార్ ఓడిపోవడం ఖాయమన్నారు.
కంసుని వధించినట్టే ప్రజలు ఈసారి నితీష్‌ను ఓడిస్తారని ప్రతాప్ యాదవ్ పేర్కొన్నారు. ఆర్జేడీ కార్యకర్తలు, మద్దతుదారులు నిబద్దతతో పని చేస్తున్నారని తెలిపారు. అంతకుముందు ఇదే వేడుకలో తేజ్ ప్రతాప్ యాదవ్ వేణుగానం చేసి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు.
తేజ్ పరమ శివుడి భక్తుడు. గతంలో శివుని అవతారంలో తేజ్ ప్రతాప్ దర్శనమిచ్చారు. శివుని మాదిరిగా నడుముకు పులి చర్మం తరహా వస్త్రాన్ని చుట్టుకున్నారు. ఈ వేషధారణతోనే శివభక్తులతో పాటు ఆయన ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా తేజ్‌ప్రతాప్ రెండుసార్లు శంఖం పూరించారు. కాగా గతంలో తేజ్ ప్రతాప్ కృష్ణుడి వేషధారణతోనూ పూజలు నిర్వహంచి అందరినీ ఆకట్టుకున్నారు.
బోల్డ్ హీరోయిన్ భలేగా బోల్తా కొట్టించింది!
బోల్డ్ హీరోయిన్ సన్నీలియోన్ చేసిన పనికి ప్రతిఒక్కరూ ఫిదా అవుతున్నారు. ఇటీవల ముంబైలో ప్రముఖ దబ్బో రత్నాని క్యాలెండర్ షూట్లో సన్నీలియోన్ పాల్గొంది. ఈ కార్యక్రమానికి సీనియర్ నటుడు కబీర్ బేడీ హాజరయ్యాడు. సన్నిలియోన్ ఫొటో షూట్ చూసిన కబీర్ బేడీ స్వయంగా ఆమెతో మాట్లాడారు. తన ఫొటోలు అద్భుతంగా వచ్చాయని పొగిడి తన పర్సనల్ ఫోన్ నెంబర్ అడిగారట. సీనియర్ నటుడు ఫోన్ నెంబర్ అడగటంతో కాదనలేక తెలివిగా తన భర్త నెంబర్ ఇచ్చి తప్పించుకుంది. సన్నిలియోన్ సీనినటుడిని బోల్తా కొట్టించిన తీరును పలువురు మెప్పించుకుంటున్నారు.
దబ్బో రత్నాని కాల్యెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సన్నీ లియోన్ తోపాటు కియారా అద్వానీ, అనన్య పాండే, ఐశ్వర్యరాయ్, భూమి పడ్నేకర్, జాక్విలిన్ వంటి తారలు పాల్గొన్నారు. ఫోటో షూట్లో పాల్గొని హాట్ హాట్ ఫోజులిచ్చారు. పాపులర్ హీరోయిన్లు సెమి న్యూడ్ గా ఫోజులిచ్చారు. కొన్ని పిక్స్ మాత్రం న్యూడ్ ఫొటోలకు ఏమాత్రం తీసిపోవు అన్నట్లుగా ఉన్నాయి. కియారా అడ్వాణీ తన అందాలను ఆకుచాటున దాచగా, సన్నీలియోన్ ఓ పుస్తకం చాటున అందాలను దాచిపెట్టింది. ఇప్పటికే ఈ ఫొటోలు సోషల్ మీడియాలో సెగలు రేపుతున్నాయి. అదేవిధంగా కబీర్ బేడి, సన్నీ లియోన్ మధ్య జరిగిన సంఘటన బయటికి పొక్కడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అచ్చెన్నాయుడు మెడకు చుట్టుకున్న ఈఎస్ఐ కుంభకోణం

ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణంలో మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత, అచ్చెన్నాయుడు పాత్ర ఉందనే వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ భారీ కుంభకోణాన్ని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బయటపెట్టింది. నామినేషన్ పద్ధతిలో అచ్చెన్నాయుడు టెండర్లు ఇప్పించారని రిపోర్ట్‌లో ప్రస్తావించారు. టెలీ హెల్త్ సర్వీసుల పేరుతో ఆర్డర్స్ ఇవ్వడంలో అచ్చెన్నాయుడు ఒత్తిడి తెచ్చారని…అధికారులు తెలిపారు.
బోగస్ కంపెనీల నుంచి నకిలీ కొటేషన్లు తీసుకుని ఆర్డర్లు ఇచ్చి గత ఆరేళ్లలో కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని అధికారులు గుర్తించారు. స్కామ్‌లో ఈఎస్ఐ డైరెక్టర్లకు ఆరుగురు జాయింట్ డైరెక్టర్లు సహకరించారని పేర్కొన్నరు. ఈఎస్ఐ డైరెక్టర్లుకు దాదాపు రూ. 51 కోట్ల చెల్లించినట్లు తేలింది. ఈ మొత్తం వ్యవహారానికి ఈఎస్ఐ డైరెక్టర్లు రవికుమార్, రమేశ్, విజయ్‌ను బాధ్యులుగా గుర్తించారు. మందులు, పరికరాలను వాస్తవ ధరకంటే…136 శాతం అధికారంగా సంస్థలు టెండర్లలో చూపించాయి. లెజెండ్ ఎంటర్ ప్రైజెస్, ఓమ్మిమేడి ఎన్వెంటర్ ఫెర్ఫామెన్స్ సంస్థలకు డైరెక్టర్లు అక్రమంగా రూ. 85 కోట్లు చెల్లించినట్టు అధికారులు వివరించారు.
వివేకా హత్యలో రాజకీయ ప్రముఖుల హస్తం

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది… ఈ కేసును సిబిఐ కి అప్పగించాలని కుటుంబసభ్యులు హైకోర్టుని కోరడంతో గురువారం విచారణ జరిగింది. ఈ విచారణంలో పలువురు ప్రముఖ రాజకీయ నేతల జోక్యం ఉందని పలు అనుమానాలు వచ్చాయి.
వైఎస్ జగన్ గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు సీబీఐకి కేసు అప్పగించాలని హైకోర్టు ను కోరిన సంగతి అందరికి తెలిసిందే కానీ ఇప్పుడు సీఎం అయిన తరువాత వివేకా హత్యా కేసులో జగన్ మౌనం వహించారు ఈ మౌనం వెనుక ఉన్న అర్ధం ఏమిటోమరి తెలియాల్సి ఉంది ..!
పోలీసు యంత్రాంగమంతా జగన్ చేతుల్లో ఉందని దీంతోనే ఆయన కేసును తారుమారు చేసే అవకాశం ఉందని వివేకా కుటుంబ సభ్యలు ఆరోపించారు. ఈ దర్యాప్తు సాఫీగా సాగుతోందని, రెండు నెలల్లో ఈ కేసు దర్యాప్తు పూర్తవుతుందని ,ఎలాంటి అనుమానాలకు తావు లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
సొంత కుటుంబసభ్యుడిని హత్య చేసి రాజకీయానికి వాడుకున్నారని టీడీపీ నాయకులు జగన్ పై ఆరో పిస్తున్నారు. ఈ కేసులో ప్రధానంగా ఎంపీ అవినాశ్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి తో పాటు మరో ముగ్గురి కీలక పాత్ర ఉందని , అందుకే సీబీఐ కి ఈ కేసు అప్పగించడానికి జగన్ అంగీకరించడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
అదిరిపోయిన కాజల్ న్యూ లుక్
యంగ్ హీరో మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ క్రైమ్ మూవీ మోసగాళ్లు.. ఈ మూవీ ప్రపంచలోనే బిగ్గెస్ట్ ఐటీ స్కా్‌మ్ నేపథ్యంలో యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కనుంది. మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే కాజల్ ఈ సినిమాకి సంబంధించిన తన న్యూ లుక్ ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.









టాలీవుడ్లో ‘అర్జున్ రెడ్డి’ మూవీ సెన్సెషన్ సృష్టించిన సంగతి తెల్సిందే. విజయ్ దేవరకొండ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్టుగా ‘అర్జున్ రెడ్డి’ నిలిచింది. సందీప్ వంగా ఈ సినిమా తెరకెక్కించిన విధానానికి యువత ఫిదా అయ్యారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ మూవీని సందీప్ వంగా హిందీలో ‘కబీర్ సింగ్’ పేరిట తెరకక్కించాడు. హిందీలోనూ ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులను సృష్టించింది. తాజాగా మరోసారి విజయ్ దేవరకొండ-సందీప్ వంగా కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కనుందని సమాచారం.














