
ప్రస్తుతం ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా తరువాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న విషయం విదితమే.. ఈ సినిమా మే నెలలో సెట్స్ పైకి వెళ్ళనుంది.గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘అరవింద సమేత’ సినిమా మంచి హిట్ గా నిలిచింది.
ఇదిలా ఉంటే…కొత్త సినిమాలో కూడా త్రివిక్రమ్ పూజా హెగ్డేను హీరోయిన్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది.‘అరవింద సమేత’, ‘అల వైకుంఠపురములో’ వంటి సినిమాల తరువాత ముచ్చటగా మూడవసారి త్రివిక్రమ్ సినిమాలో నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. త్వరలోనే పూజ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.ప్రస్తుతం పూజ ఖాతాలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్`, `ప్రభాస్ 20` చిత్రాలు ఉన్నాయి.