క్యాస్టింగ్ కౌచ్ పై వరలక్ష్మి చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా రాధికా శరత్ కుమార్ మద్దుతు నిలిచారు. సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న క్యాస్టింగ్ కౌచ్ విషయంలో వరలక్ష్మి కరెక్టుగానే రియాక్టయిందని రాధిక అన్నారు. ఈ విషయంలో తన కూతురుకు మరింత బలం చేకూరాలని ఆశిస్తున్నానని రాధిక ట్విట్టర్లో పేర్కొంది.
వరలక్ష్మి 25సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానుల కోసం ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇండస్ట్రీలో తనకు ఎదురైన అనుభవాలను వెల్లడించింది. స్టార్ కిడ్ అయిన తనకు కూడా క్యాస్టించ్ కౌచ్ సంఘటనలు ఎదురైనట్లు చెప్పింది. అలాంటి వారు మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డింగ్స్ తన వద్ద ఉన్నాయని చెప్పింది. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
అలాంటి వారి సినిమాల్లో తాను నటించాల్సి అవసరం లేదనిపించిందని చెప్పింది. అందుకే తనను బ్యాన్ చేశారని చెప్పింది. అయినా నేడు ఎవరికీ భయపడకుండా తన కాళ్లపై నేను నిలబడిగలిగానని చెప్పింది. ఇలాంటి విషయాలపై మహిళలు ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని సూచించారు. ప్రస్తుతం వరలక్ష్మి ‘కన్నిరాశి’, ‘వెల్వెట్ నగరం’, ‘డాని’ తదితర చిత్రాలతో బిజీగా ఉన్నారు.
గతంలో కాంగ్రెస్ ఎమ్యెల్యేలను `ఆకర్ష్ కమల్’ పేరుతో ఆకట్టుకొని కాంగ్రెస్ – జేడీఎస్ కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించి, కర్ణాటకలో అధికారం చేపట్టిన బిజెపి తీరులో గుజరాత్ లో బిజెపి ప్రభుత్వాన్ని పడగొట్టి, అధికారం చేపట్టడం కోసం కాంగ్రెస్ పావులు కడుపుతున్నది.
ప్రస్తుతం అక్కడ బీజేపీ బొటా బొటా ఆధిక్యతలో అధికారమలో కొనసాగుతున్నది. పైగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా లకు సొంత రాష్ట్రం కావడం; వారిద్దరికీ ఇష్టుడైన ముఖ్యమంత్రి విజయ్ రూపాని పట్ల బిజెపి ఎమ్యెల్యేలలోనే తీవ్ర వ్యతిరేకంగా నెలకొనడంతో `ఆకర్ష్’ రాజకీయాలకు పాల్పడుతున్నట్లు కధనాలు వెలువడ్డాయి.
ఈ సందర్భంగా కాంగ్రెస్ బంపర్ ఆఫర్ చేస్తున్నది. 20 మంది ఎమ్యెల్యేలతో బిజెపి నుండి వస్తే, వారికి ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెబుతున్నది. త్వరలో జరుగనున్న రాజ్యసభ ఎన్నికల ముందు గుజరాత్‌లో బీజేపీ ఎమ్మెల్యేలపై గాలం వేసేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ సభ్యుడు ఒకరు ఈ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఇరవై మంది ఎమ్మెల్యేలను తన వెంట తీసుకుని కాంగ్రెస్ పార్టీలో చేరితో ముఖ్యమంత్రి పదవిని అప్పగిస్తామని ప్రకటించారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో లాథీ నియోజకవర్గ ఎమ్మెల్యే విర్జీ తుమారానే ఈ ప్రకటన చేశారు. ఆయన ప్రకటనపై అధికార పార్టీలో ఒక్కసారిగా కలవరం మొదలైంది.
కాగా ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లో 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 182 స్థానాలకు గాను బీజేపీ 99 స్థానాల్లో మాత్రమే విజయం సాధించిన విషయం తెలిసిందే. ఉత్కంఠ పోరులో కాంగ్రెస్ కూటమికి 77 స్థానాలు దక్కాయి.
అయితే మరికొద్ది రోజుల్లో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుజరాత్ కీలకంగా మారింది. ఈ తరుణంలో బీజేపీ ఎమ్మెల్యేలకు తమ పార్టీలోకి లాగేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
భారత్ ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా నుండి వైదొలగాలని భావిస్తున్నట్లు తేలుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నాయకులలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న నేత మోడీ. ప్రస్తుతం మోడీకి ఫేస్ బుక్ లో 4కోట్ల 40లక్షల ఫాలోయర్స్ ఉన్నారు. ట్విటర్ లో 5కోట్ల 33లక్షల మంది, ఇన్ స్ట్రాగ్రామ్ లో 3కోట్ల 50లక్షల 20వేల మంది మోడీని ఫాలో అవుతున్నారు.
అయితే ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్ట్రాగ్రామ్ వంటి అన్ని సోషల్ మీడియా నుండి ఆయన వైదొలగుతున్నట్లు ట్వీట్ చేశారు. వచ్చే ఆదివారం నుంచి ఆయన సోషల్ మీడియా నుండి తప్పుకుంటున్నట్లు పెట్టిన ట్వీట్ చూసిన ఫాలోయర్స్, అభిమానుల ఆశ్చర్యానికి గురౌతున్నారు.
ఇటీవల విశాఖ విమానాశ్రయం వద్ద ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడి అరెస్ట్ కోసం సిఆర్‌పిసి సెక్షన్ 151 కింద పోలీసులు నోటీసు ఇవ్వడం ఏపీ పోలీస్ ను ఆత్మరక్షణలో పడవేసిన్నట్లు కనిపిస్తున్నది.
ఒక వంక ప్రదర్శకులను నిలిపే ప్రయత్నం చేయకుండా పోలీసులు ప్రేక్షకుల వలే చోద్యం చూస్తూ నిలుచున్నారని అంటూ ఏపీ పోలీస్ పై ఎస్పీజీ కమాండ్లు కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేయడం, వారు రాష్ట్ర పోలీస్ సంజాయిషిని కోరడం జరిగింది.
మరో వంక ఏపీ హై కోర్ట్ ఇప్పటికి రెండు సార్లు ఈ విషయమై డిజిపిని నిలదీసింది. స్వయంగా హైకోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలని డిజిపిని డివిజన్ బెంచ్ తాజాగా ఆదేశించింది. ఈ నెల 12న జరిగే విచారణకు హాజరుకావాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జికె.మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ ఎన్.జయసూర్యలతో కూడిన డివిజన్ బెంచ్ ఉత్తర్వులిచ్చింది.
సాంకేతికత వినియోగంతో పాటు చురుకుగా వ్యవహరించడంలో దేశ వ్యాప్తంగా మంచి పేరున్న ఏపీ పోలీస్ ఈ విధంగా గతంలో ఎన్నడూ దోషిగా నిలబడలేదని ఉన్నత పోలీస్ వర్గాలు వాపోతున్నాయి. రెండు వారాల వ్యవధిలోనే రాష్ట్ర పోలీస్ అధిపతి హైకోర్టు స్వయంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేయడం మొత్తం ఏపీ పోలీస్ కె అప్రదిష్టగా భావిస్తున్నారు.
మితిమీరిన రాజకీయ జోక్యాలతో పోలీసులు నిస్సహాయులుగా మిగులుతున్నారనే ఆందోళన వ్యక్తం అవుతున్నది. సెక్షన్ 151 కింద నోటీసు ఇచ్చి చంద్రబాబును అరెస్ట్ చేయడాన్ని సవాలు చేస్తూ తాడికొండ మాజీ ఎమ్మెల్యే శ్రవణ్‌కుమార్ ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
కాగజబుల్ అఫెన్స్ (తీవ్ర నేరాలు) కేసుల్లోనే సిఆర్‌పిసి సెక్షన్ 151 వినియోగిస్తారని, నిరసన కార్యక్రమాలు, ధర్నాలు వంటి వ్యవహారాల్లో పోలీస్ యాక్ట్‌లోని సెక్షన్ 30 లేదా సెక్షన్ 144 వినియోగిస్తారని పిటిషనర్ లాయర్ వాదించారు.
ఇలా ఉండగా, విశాఖపట్నం పోలీసులు ఏదో వ్యవహారంలో ఫిబ్రవరిలో గౌతమ్, లోచిని అనే దంపతులను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని బయటకు ప్రకటించలేదు. గౌతమ్ తండ్రి పోలీసు స్టేషన్‌కు వెళ్లినా వారిని చూపించలేదు. తన కుమారుడు, కోడలిని పోలీసులు ఏమి చేస్తారోనన్న భయంతో కోర్టులో ఆయన హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ వ్యవహారంలో డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను ఫిబ్రవరి 14న స్వయంగా హాజరు కావాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలతో పోలీసుశాఖ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఇంతలోనే సోమవారం మరోసారి డీజీపీకి తాఖీదులందాయి.
జగన్ మోహన రెడ్డి భవిత్యం ఎలా ఉండబోతుంది? మూడు రాజధానుల వ్యవహారం జగన్ కి ముప్పు తెస్తుందా? దిగజారుతున్న ఆర్ధిక పరిస్థితి చేటు తెస్తుందా? ఇవి ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాలపై నడుస్తున్న చర్చ. ఆంధ్ర లో గ్రామాల్లో ఏ ఇద్దరూ కలిసినా రాజకీయ చర్చ జరగకుండా ముగింపుకాదు. ఈ ఒరవడి ఆంధ్రాలో ఎప్పట్నుంచో వుంది. అదే తెలంగాణాలో అయితే అంతగా ఉండదు. అలాగే సినిమాలపై కూడా. తెలంగాణాలో సినిమా వాళ్ళ జీవితంలో భాగం కాదు, అదే ఆంధ్రాలో సినిమాలేకపోతే లైఫే లేదన్నట్లు వుంటారు. ఇంకో తేడా కూడా వుంది. ఆంధ్రాలో కుల సమీకరణలు ఎక్కువ. కులాల చుట్టే రాజకీయాలు తిరుగుతుంటాయి. ఆ పరిస్థితి తెలంగాణాలో లేదు. ఇదంతా ఎందుకు చెప్పాల్సివచ్చిందంటే ఆంధ్రాలో రాజకీయాల్ని విశ్లేషించేటప్పుడు ఈ నేపధ్యం ఉండటం వలన తప్పులను ఎత్తిచూపటం, ఒప్పులను ప్రశ్నించటం కూడా పెద్ద చిక్కే. వెంటనే ఆ విశ్లేషణను రంగుటద్దాలతో పరిశీలించటంతో ఏదో వర్గం అభిమానాన్నో, దురభిమానాన్నో ఎదుర్కోకతప్పదు.
ఈ పరిస్థితుల్లో ఒక వ్యక్తి మంచి చెడులను మాట్లాడుకోవటం కూడా ఇబ్బందే. అయినా తప్పదు మరి. ఇవ్వాళ కాకపోయినా ముందు ముందు వర్గాల దృక్పధం నుండి బయటపడి స్వతంత్రంగా ఆలోచించేటట్లు చేయగలగాలి. అది ప్రజలకి మంచిది. ఏ పార్టీ అధికారంలో వున్నా ఆయా పరిస్థితుల్ని బట్టి ప్రజలకు కొంత మంచి, కొంత చేదు జరుగుతుంది. అయితే ప్రజలు ఈ రెండింటిని బేరీజు వేసుకొని ఏది ఎక్కువగా ఉందని అనుకుంటారో దాన్నిబట్టి అభిప్రాయాలు ఏర్పరుచుకొని ఓట్లు వేస్తారు. పోయిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓడిపోయి జగన్ గెలవటానికి కూడా ఇదే కారణం.
జగన్ మోహన రెడ్డి అధికారంలోకి వచ్చి 9 నెలలయింది. ఈ 9 నెలల్లో జగన్ ప్రభుత్వం ఎన్నో నిర్ణయాలు తీసుకుంది. అవి రాజకీయరంగంలో, ఆర్ధిక రంగం లో, పరిపాలనా రంగంలో ప్రభావం చూపేవి. రాజకీయంగా చూస్తే చంద్రబాబు నాయుడుని , తెలుగు దేశం పార్టీని దెబ్బతీయటానికి అనేక నిర్ణయాలు తీసుకున్నాడు. అందులో ముఖ్యమైనది, రాజధాని మార్పు. పేరుకు పరిపాలనా సంస్కరణ కిందకి వచ్చినా నిర్ణయం రాజకీయమే. ఇందులో తెలుగుదేశం పార్టీ వ్యతిరేక కోణంతో పాటు సామాజిక వర్గ కోణం కూడా వుంది. ఎవరేమిచెప్పినా ఇది వాస్తవం. అలాగే ఆర్ధిక రంగంలో చూస్తే ఇప్పుడున్న పరిస్థితికి మైనస్ మార్కులే వేయాల్సి ఉంటుంది. దీని నిర్వహణలో ఇప్పటివరకు చూస్తే చంద్రబాబు నాయుడే మెరుగనిపించాడు.
ఇకపోతే మూడోది, పరిపాలనా రంగం. ఇందులో మాత్రం జగన్ మోహన రెడ్డి ఎక్కువ మార్కులు సంపాదించాడు. ముఖ్యంగా గ్రామ సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల వ్యవస్థ విన్నూత్నమైన ఆలోచన. ఇది సక్రమంగా అమలు జరిగితే ప్రజలకు చాలా మేలు జరుగుతుంది. దీని విజయం పకడ్బందీ అమలు, అవినీతి రహిత జవాబుదారీతనం పై ఆధారపడి ఉంటుంది. దానికి తగ్గ మెకానిజం తయారు చేసుకోగలిగితే అద్భుతాలు సృషించవచ్చు.
ఇక నాలుగోది , ముఖ్యమైనది సామాజిక రంగం. ఇందులో జగన్ పాత ప్రభుత్వం కన్నా చాలా ముందంజ లో ఉన్నాడనే చెప్పాలి. మద్యపాన నియంత్రణ, విద్య, ఆరోగ్య రంగాల్లో నాడు-నేడు , సంక్షేమ కార్యక్రమాలు సామాజిక మార్పుకు, మెరుగుదలకు దోహదం చేస్తాయనడంలో సందేహం లేదు. అదే సమయం లో జగన్ కి పెద్ద ఓటు బ్యాంకుగా కూడా ఉంటాయి. అందుకనే జగన్ వీటిపై దృష్టి సారించాడు. ఈ రంగాల్లో వాళ్ల నాన్ననే మించిపోయాడని వ్యాఖ్యానిస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలపై మేధావులకు, ఆర్ధిక వేత్తలకు కొన్ని సందేహాలూ, అభ్యంతరాలూ వున్నా మద్యపాన నియంత్రణ , నాడు-నేడు పై ఎటువంటి అభ్యంతారాలూ లేవనే చెప్పాలి. ప్రభుత్వ స్కూళ్ళు, ప్రభుత్వ ఆసుపత్రులు బాగుపడాలని కోరుకోనివాడు వుండడు. వాటికి మూడు దఫాల్లో డబ్బులు కేటాయించటం ఆహ్వానించదగ్గ పరిణామం. జగన్ మోహన రెడ్డి అనేక సందర్భాల్లో వీటిపై మాట్లాడటం వీటికి తను ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తుంది. అలాగే వైన్ షాపుల్ని నియంత్రించటం కూడా ఆహ్వానించదగ్గ పరిణామం.
కాబట్టి జగన్ మోహన రెడ్డి ఆర్ధిక, రాజకీయరంగాల్లో మైనస్ మార్కులు తెచ్చుకున్నా సామాజిక రంగం, పరిపాలనా రంగంలో మంచి మార్కులు కొట్టేసి ప్లస్ లోనే వున్నాడనిపిస్తుంది. త్వరలోనే జరగబోయే స్థానిక ఎన్నికల్లో వీటిపై ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. మీడియా తీర్పులకన్నా ప్రజా తీర్పు ఉన్నతం కదా. అప్పటిదాకా వేచి చూద్దాం.
బ్రహ్మాజీ కుమారుడు విశ్వనాథ్ నటించిన “ఓ పిట్టకథ” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు . ఈ ఈవెంట్ లో అనసూయను ఉద్దేశించి చిరంజీవి “రంగమ్మత్త గెస్ట్‌గా వచ్చినందుకు సంతోషం. మొన్న టెస్ట్ చేయించుకున్నాను.. నా గుండె చాలా స్ట్రాంగ్‌గా ఉందని అన్నారు. కానీ, ఇప్పుడు ఎందుకో చాలా పెయిన్ వచ్చింది అర్థం కావట్లే.. కొంచెం చిన్న వాయిస్ తో రామ్ చరణ్‌కి చెప్పకమ్మా!” అంటూ చేసిన వ్యాఖ్యలు అక్కడ ఉన్నవారందరిని నవ్వులలో ముంచెత్తింది.
దీని గురించి అనసూయ ట్వీట్ చేస్తూ “హాహాహా… చాలా క్యూట్.. చాలా వినయం.. మెగా లెజెండ్‌ను చూసి చాలా నేర్చుకోవాల్సి ఉంది” అని మెగాస్టార్ పొగడ్తలతో ముంచెత్తింది . ఎప్పటికి తాను చిరంజీవి ఫ్యాన్ అంటూ ఒక హాష్ ట్యాగ్ కూడా జోడించింది. సోషల్ మీడియాలో ఈ ట్వీట్ చక్కర్లు కొడుతుంది.
ప్రస్తుతం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో #ప్రభాస్20 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.. తన 20వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రభాస్ మరొక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి ” మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా సైన్స్ ఫిక్షన్ మూవీ #ప్రభాస్21 రూపొందనుంది. ఈ మూవీ లో ప్రభాస్ కు జోడీ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పడుకొనే ను ఎంపిక చెయ్యాలని మేకర్స్ ప్లాన్ చేసినట్టు , దీపిక ను సంప్రదించినట్టు సమాచారం. దీపిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే #ప్రభాస్21 మూవీ ఆమెకు ఫస్ట్ టాలీవుడ్ మూవీ అవుతుంది.దీని గురించి అధికార ప్రకటన రావలిసి ఉంది.
అనేక మలుపులు తిరుగుతున్న నిర్భయ దోషులకు ఉరిశిక్ష మళ్లీ వాయిదా పడింది. నలుగురు దోషుల ఉరిశిక్ష అమలుపై ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాల వరకు వారిని ఉరితీయకూడదని తీహార్ జైలు అధికారులను జారీ చేసింది.
2012 ఢిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతం యావత్ భారతదేశాన్ని కదిలించి వేసింది. డిసెంబర్ 16, 2012 న భారత రాజధాని ఢిల్లీలో ఒక వైద్యవిద్యార్థినిని కదులుతున్న బస్సులో ఆరుగురు కర్కశంగా, దారుణంగా ఇనుప కడ్డీతో కొట్టి అత్యాచారం చేశారు. ఆ సంఘటనలో తల మరియు పేగులకు తగిలిన గాయాలతో 13 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు 29 డిసెంబర్ 2012 న ఆమె తుదిశ్వాస విడిచారు.
ఈ కేసులోని ఆరుగురు దోషుల్లో ఒకడు తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరో దోషి… మైనర్ కావడంతో… మూడేళ్ల శిక్ష తర్వాత 2015లో విడుదలయ్యాడు. మిగతా నలుగురు ముకేష్ కుమార్ సింగ్ (32), పవన్ కుమార్ గుప్తా (25), వినయ్ కుమార్ శర్మ (26), అక్షయ్ సింగ్ (31)కి ఉరిశిక్ష పడింది. ఐతే చట్టంలో లొసుగులును ఉపయోగించుకొని.. ఉరిశిక్షను వాయిదాపడేలా చేస్తున్నారు దోషులు.
చాలా కాలం తరువాత సినిమాలోకి అడుగుపెట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘ఎంసిఎ’ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో హిందీలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన ‘పింక్’ సినిమా తెలుగు రీమేక్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘వకీల్ సాబ్’ అనే టైటిల్‌ను ఖరారు చేసారు. ఈ సినిమా అప్‌డేట్స్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న తరుణంలో ఈ చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది.
వకీల్ సాబ్‌గా ఒక చెయిర్‌లో కూర్చొని కేసు స్డడీ చేస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ లుక్ అదిరిపోయింది. ఈ చిత్రంలో నివేదా థామస్, అనన్య ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తోందని సమాచారం. ప్రకాష్ రాజ్ ఓ కీలక రోల్ చేస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రాన్ని మే 15న సమ్మర్ కానుకగా రిలీజ్ చేస్తు్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్‌కల్యాణ్ 26వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో ఎంతో ఆసక్తి నెలకొని ఉంది.
ఈ సినిమా చిత్ర సంగీత దర్శకుడు థమన్.. ఫస్ట్ సింగిల్‌ను త్వరలోనే విడుదల చేస్తామని ఇటీవల ప్రకటించాడు. మరోవైపు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 8న ఫస్ట్‌సాంగ్‌ను విడుదల చేయనున్నారని సమాచారం.
ఢిల్లీ అల్లర్లపై ఇవాళ పార్లమెంట్‌లో దుమారం చెలరేగింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా .. తమ పదవులకు రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. విపక్ష సభ్యుల ఆందోళన నడుమ.. ఉభయసభలను రేపటికి వాయిదా వేశారు.
ఉదయం ప్రారంభమైన రెండు సభలు.. విపక్షాల నిరసనలతో హోరెత్తాయి. ఆ తర్వాత సభలను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అయితే 2 గంటలకు సమావేశమైన ఉభయసభల్లో మళ్లీ అదే సీన్ రిపీటైంది. దీంతో సభలను రేపటికి వాయిదా వేశారు.
లోక్‌సభలో విపక్షాలు.. ప్రధాని మోదీ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశాయి. ఆ సమయంలో స్పీకర్ ఓం బిర్లా వారిని అడ్డుకున్నారు. ఢిల్లీ అల్లర్లపై చర్చ చేపట్టలేమని స్పష్టం చేశారు. ఇది చర్చలకు అనువైన సమయం కాదని చెప్పారు . పరిస్థితి మెరుగుపడ్డాక, చర్చలు చేపడుతామని బిర్లా తెలిపారు.
రాజ్యసభలోనూ కాంగ్రెస్, లెఫ్ట్, టీఎంసీ, ఎస్పీ, బీఎస్పీ, డీఎంకే సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. దీంతో చైర్మన్ వెంకయ్యనాయుడు సభను రేపటికి వాయిదా వేశారు. ఢిల్లీలో హింస చెలరేగుతుంటే.. ప్రభుత్వం మూడు రోజుల పాటు నిద్రపోయిందని విపక్షనేత గులాం నబీ ఆజాద్ ధ్వజమెత్తారు.
ఢిల్లీ ఈజ్ బర్నింగ్ అంటూ కొంత మంది సభ్యులు నినాదాలు చేశారు. టీఎంసీ సభ్యులు తమ కండ్లకు నల్లబ్యాడ్జీలు ధరించిన ప్రదర్శనలో పాల్గొన్నారు. నల్లబ్యాడీలు ధరించిన సభకు రావద్దు అంటూ వెంకయ్య వారిని ఆదేశించారు. అయినా విపక్ష సభ్యులు వినలేదు. దీంతో సభను వాయిదా వేశారు. ఢిల్లీ అల్లర్లలో మృతిచెందిన వారి సంఖ్య 46కు చేరుకున్నది.
దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన నిర్భయ అత్యాచార హత్యా కేసుకి సంబంధించి తుది తీర్పు మరి కాసేపట్లో వెలువడనుంది. నిర్భయ దోషులకు మార్చి 3న ఉరిశిక్ష అమలుచేయాలంటూ ఢిల్లీ పాటియాలా కోర్టు మూడోసారి డెత్ వారెంట్ జారీచేసిన విషయం తెలిసిందే. అయితే, దోషులు మాత్రం మరోసారి ఉరిని వాయిదా వేయించుకోవాలని చేసిన ప్రయత్నం ఫలించలేదు లేదు. తమకు ఉన్న న్యాయపరమైన అంశాలను దోషులు వినియోగించుకున్నారు. తాజాగా, నిర్భయ దోషి పవన్ గుప్తా దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం సోమవారం తిరస్కరించింది. దీంతో రేపు(మార్చి 3) ఉదయం 6గంటలకు నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు చేయనున్నారు. పవన్ గుప్తా పిటిషన్‌ను తిరస్కరించిన జస్టిస్ ఎన్ వి రమణ ఐదుగురు ధర్మాసనం. జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్‌ల ధర్మాసనం తుది తీర్పు వెల్లడించింది. దోషికి కింది కోర్టు ఉరిశిక్ష విధించడంలో ఎలాంటి తప్పులేదని అభిప్రాయపడింది.
ఒకప్పుడు టాలీవుడ్ లో మార్చి నెలలో సినిమాలు రిలీజ్ చేయాలంటే వెనుకడుగు వేసేవారు నిర్మాతలు. మార్చి అన్ సీజన్ అనే ఫీలింగ్ అందరిలో ఉండేది. కానీ ఇప్పుడు ఈ సెంటిమెంట్ కు బ్రేక్ పెట్టి మార్చి నెలలో సినిమాలు రిలీజ్ చేసేందుకు మేకర్స్ ముందుకొస్తున్నారు. ముందుగా మార్చి 6న 3 సినిమాలు విడుదల కానున్నాయి అవి ‘పలాస 1978 ‘,’ఓ పిట్ట కథ’,’అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’. మార్చి 25న ‘వి’ సినిమాతో నాని అలరించనున్నాడు.
మార్చి లో రిలీజ్ కానున్న 8 సినిమాల వివరాలు…
‘పలాస 1978 ‘మార్చి 6
‘లండన్ బాబులు’ సినిమా ఫేమ్ రక్షిత్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘పలాస 1978’. ఈ సినిమాకు కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పాటలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రెయిలర్ విడుదల చేశారు.
‘పలాస 1978’ సినిమాతో కరుణ కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా బిక్రమ్ కృష్ణ ఫిలింస్ పతాకంపై అప్పారావు బెల్లన, అట్లూరి వరప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా మార్చి 6 విడుదల విడుదల కానున్నట్టు చిత్రబృందం వెల్లడించింది. ఈ సినిమాకు రఘు కుంచె సంగీత దర్శకత్వం వహించడమే కాకుండా సినిమాలో ఓ కీలక పాత్ర కూడా పోషిస్తున్నారు.
‘ఓ పిట్ట కథ’ మార్చి 6
ప్రముఖ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ నిర్మిస్తున్న తాజా చిత్రం ఓ పిట్ట కథ.. కొత్తవాళ్ళతో తెరకెక్కుతున్న ఈ సినిమాకి చెందు ముద్దు దర్శకత్వం వహించారు. విశ్వంత్ దుద్దుంపూడి, సంజయ్‌రావు, నిత్యా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించారు. బ్రహ్మాజీ ఓ కీలకపాత్రలో నటించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మార్చ్ 6 న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’ మార్చి 6
ధన్య బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కనున్న చిత్రం ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’. ఈ సినిమాకి బాలు అడుసుమిల్లి దర్శకత్వం వహించగా బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్, పూర్వీ పిక్చర్స్ పతాకాలపై హిమబిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్ నిర్మించారు. నలుగురు అమ్మాయిల చుట్టూ అల్లుకున్న ఈ చిత్రం మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.
https://www.youtube.com/watch?v=UgdB2r8x07Y
‘వి’ (నాని) మార్చి 25
నేచురల్ స్టార్ నాని హీరోగా, మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘వి’. ఈ సినిమా ప్రారంభమన నాటి నుంచి చిత్రంపై భారీ అంచనాలున్నాయి. వి చిత్రంలో నాని నెగెటివ్ షేడ్స్ ఉండే కిల్లర్ కిల్లర్ రోల్ చేస్తున్నాడని తెలియడంతో మరింత ఆసక్తి రేగింది. ఇక ఇప్పటికే విడుదలైన వి మూవీ ట్రైలర్ యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది.వి మూవీ ఉగాది కానుకగా మార్చి 25 గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. నివేదా థామస్, అదితి రావ్ హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం అమిత్ త్రివేది అందిస్తున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
కాలేజ్ కుమార్ (మార్చి 6)
లక్ష్మణ గౌడ సమర్పణలో ఎమ్ ఆర్ పిక్చర్స్ బ్యానర్ పై హరి సంతోష్ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “కాలేజ్ కుమార్ ” మూవీ రూపొందింది.ఇందులో సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న మూవీ మార్చి 6వ తేదీ రిలీజ్ కానున్నది.
అర్జున (మార్చి 6)
నట్టి ఎంటర్ టైన్ మెంట్స్, క్విటీ ఎంటర్ టైన్ మెంట్స్ సమర్పణ లో AA ఆర్ట్స్ బ్యానర్ పై కన్మణి దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా రాజకీయాల నేపథ్యం లో “అర్జున ” మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమాలో హీరో రాజశేఖర్ తండ్రీకొడుకులు గా నటించడం విశేషం. ఈ మూవీ మార్చి 6వ తేదీ విడుదల కానున్నది.
స్క్రీన్ ప్లే (మార్చి 6)
బుజ్జి బుడుగు ఫిల్మ్స్ బ్యానర్ పై కె ఎల్ ప్రసాద్ దర్శకత్వంలో “స్క్రీన్ ప్లే ” మూవీ తెరకెక్కనుంది. “స్క్రీన్ ప్లే ” మూవీ పలు ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కు ఎంపిక అయిన ఈ మూవీ మార్చి 6వ తేదీ రిలీజ్ కానున్నది.
కృష్ణ మనోహర్ IPS (మార్చి 6)
యనమల సుధాకర్ నాయుడు సమర్పణ లో పవన పుత్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై ముగిల్ చెల్లప్పన్ దర్శకత్వంలో ప్రభుదేవా, నివేత పేతురాజ్ జంటగా “కృష్ణ మనోహర్ IPS” మూవీ రూపొందింది. ప్రభు దేవా 50 వ మూవీ గా రూపొందిన ఈ మూవీ తమిళ , తెలుగు వెర్షన్స్ 6వ తేదీ రిలీజ్ కానున్నాయి.
మహారాష్ట్రాలో కాంగ్రెస్, ఎన్సీపీ లతో కలసి అధికారం పంచుకొంటున్న శివసేనతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే భార్య రశ్మి ఠాక్రే ఇప్పుడు కీలక అధికార కేంద్రంగా మారారు. చాలాకాలంగా తెర వెనుక ఉండే పార్టీ వ్యవహారాలు నడిపిస్తున్న ఆమె తొలిసారిగా ప్రత్యక్ష పాత్ర వహింపబోతున్నారు.
శివసేన అధికార పత్రిక సామ్నా ఎడిటర్‌గా ఆమె నియమితులయ్యారు. ఆదివారం వెలువడిన సామ్నా పేపర్‌లో రశ్మిని ఎడిటర్‌గా పేర్కొన్నారు . సామ్నా ఎడిటర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ రశ్మినే కావడం విశేషం.
కాగా, ఉద్ధవ్ రాజకీయాల్లో రాణించడానికి రశ్మి పాత్ర కూడా ఉందని ఆయన సన్నిహితులు చెబుతారు. మహా అసెంబ్లీ ఎన్నికల్లో వర్లీ నియోజకవర్గం నుంచి తమ కుమారుడు ఆదిత్య ఠాక్రేని గెలిపించుకోవడంలో ఉద్ధవ్ కంటే కూడా రశ్మినే కీలక పాత్రను పోషించారు.
శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే ఎన్నడూ కుటుంభం సభ్యులను అధికార రాజకీయాలలోకి దింపలేదు. తాను ఎప్పుడు ఎన్నికలలో పోటీ చేయక పోవడమే కాకుండా, తన కుటుంభం సభ్యులను కూడా పోటీ చేయనీయలేదు. తొలిసారిగా ఆదిత్య ఠాక్రే పోటీ చేయడానికి ఆమె వత్తిడియే కారణం అని చెబుతారు.
పైగా సుదీర్ఘకాలం బిజెపితో ఉన్న బంధాన్ని తెంపుకొని, రాజకీయంగానే కాకుండా, సైద్ధాంతికంగా కూడా బద్ద విరోధులైన కాంగ్రెస్, శివసేన లతో చేతులు కలిపి భర్త ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు ఆమె పట్టుదలే కారణమని చాలామంది భావిస్తున్నారు. భర్తతో పాటు కుమారుడిని కూడా ఆమె మంత్రివర్గంలో చేర్పించారు.
ఇప్పుడు పార్టీ పత్రిక సంపాదక బాధ్యతలు చేపట్టడం ద్వారా ఇక నుండి ప్రత్యక్ష రాజకీయాలలో నిర్ణయాత్మక పాత్ర వహించనున్నట్లు అర్ధం అవుతుంది. ఇక శివసేన సీనియర్ నాయకులు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ యథావిథిగా సామ్నా కార్యనిర్వహక ఎడిటర్‌గా కొనసాగనున్నారు.
1989 డిసెంబర్ 13న రశ్మి, ఉద్ధవ్‌ల పెళ్లి జరిగింది. బాల్ ఠాక్రే ఉన్నంతకాలం ఆయనకు, పార్టీకీ అండగా ఉన్నారు రశ్మి. బాల్ ఠాక్రే జబ్బన పడినప్పుడు ఆయన్ని చూడ్డానికి వచ్చే శివసైనికులకు భోజనం పెట్టకుండా పంపించలేదు రశ్మి!
ఠాక్రే వార్థక్యంలో శివసేనకు వారసుడెవరన్న ప్రశ్న వచ్చింది. వాస్తవానికి ఆ ప్రశ్న అప్పటికి ఆరేళ్ల ముందరే తలెత్తింది. ఉద్ధవ్‌కి రాజకీయాలంటే ఆసక్తి లేదు. రాజ్‌కి రాజకీయాలు తప్ప వేరే ఆసక్తి లేదు. పెద్దయాన తల కూడా రాజ్ వైపే తిరిగింది. సరిగ్గా ఆ సమయంలో రశ్మి రంగంలోకి దిగారు. మామగారిని, భర్తను ఒప్పించి పార్టీ ఇల్లుదాటిపోకుండా చేయగలిగారు.
వ్యవసాయ భీమా పధకంలో ప్రైవేట్ భీమా కంపెనీ ప్రమేయం లేకుండా చేయడం కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సొంతంగా నెలకొల్పదలిచిన బీమా సంస్థకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ (ఐఆర్‌డిఎ) నుంచి అనుమతులిచ్చే విషయంలో కేంద్రం మోకాలొడ్డినట్లు తెలుస్తున్నది. అలాగే రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే ప్రీమియం వాటా పైనా సందిగ్ధం నెలకొన్నట్లు చెబుతున్నారు.
పంటల బీమా పథకాల అమలు కోసం కేంద్రంలో మోడీ సర్కారు వచ్చాక 2016 ఖరీఫ్ నుంచి సమూల మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పటి వరకు పంటల బీమా స్కీంలన్నింటినీ ప్రభుత్వరంగంలోని జాతీయ వ్యవసాయ పంటల బీమా సంస్థ (ఎఐసి) నిర్వహించేది.
బిజెపి సర్కారు పంటల బీమాలో ప్రైవేటు కంపెనీలను ప్రవేశపెట్టి ఎఐసి పాత్రను కుదించింది. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పిఎంఎఫ్‌బివై), పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా (ఆర్‌డబ్ల్యుబిసిఐఎస్) పథకాలను తీసుకొచ్చింది. వీటి వలన రైతులకు కలిగే మేలు కంటే ప్రైవేటు కంపెనీలు అధిక లాభాలు పోగేసుకుంటున్నాయి.
రాష్ట్రంలో అధికారం చేపట్టిన వైసిపి ప్రభుత్వం రైతుల ప్రీమియం వాటాను తానే చెల్లించేందుకు ముందుకొచ్చింది. రైతులు ఒక్క రూపాయి చెల్లించి మీ-సేవా కేంద్రాల్లో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రీమియం వాటాను చెల్లిస్తుందని కొత్త పథకం ప్రవేశపెట్టింది. 2019 ఖరీఫ్‌లో ఆ పథకాన్ని అమలు చేసింది.
రబీ నుంచి కేంద్ర పథకాలతో సంబంధం లేకుండా రాష్ట్రమే ఒక ఇన్సూరెన్స్ కంపెనీని నెలకొల్పి ప్రైవేటు కంపెనీలను పంటల బీమా నుంచి తప్పించాలని ఆలోచన చేసింది. డిసెంబర్ 12న మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్న మీదట పంటల బీమా అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం స్వంతంగా ఎపి జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్‌ను రూ.101 కోట్లతో ఏర్పాటు చేసేందుకు నిరుడు డిసెంబర్ 20న జిఒనెం.157 జారీ చేసింది.
ఏదైనా బీమా సంస్థ నెలకొల్పాలంటే జాతీయ స్థాయిలోని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ (ఐఆర్‌డిఎ) అనుమతి కావాలి. ఎపి సర్కారు నెలకొల్పదలిచిన జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వ్యవహారం ఐఆర్‌డిఎవద్ద పెండింగ్‌లో ఉంది.
ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు నష్టం కలిగించేలా, అదీ తన నిర్ణయాలను కాదని, వైసిపి సర్కారు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో స్వంత ఇన్సూరెన్స్ కంపెనీ ఏర్పాటుకు యత్నించడంపై కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తున్నది. అనుమతులు ఇవ్వకుండా ఐఆర్‌డిఎ వద్ద కేంద్రం మోకాలొడ్డినట్లు ఆరోపణలొస్తున్నాయి
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్, భారత్ లో కూడా అడుగపెట్టింది. దేశంలో కొత్తగా రెండు కరోనావైరస్ కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. రోగిలో ఒకరు న్యూ ఢిల్లీకి చెందినవారు, మరొకరు తెలంగాణకు చెందినవారు అని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. రోగులు ఇద్దరూ స్థిరంగా ఉన్నారని, నిశితంగా పరిశీలిస్తున్నారని తెలిపింది.
ఢిల్లీకి చెందిన వ్యక్తి ఇటలీ నుండి వచ్చాడు. తెలంగాణకు చెందిన వ్యక్తి దుబాయ్ నుండి వచ్చాడని అధికారులు తెలిపారు.
ఢిల్లీ, తెలంగాణ వాసులకు ఈ కరోనావైరస్ సోకడంతో దేశ వ్యాప్తంగా ప్రజలు ఆందోళనలు చెందుతున్నారు. ఏపీ తెలంగాణ వాసులకు కూడా ఈ కరోనా భయం పట్టుకుంది.
కరోనావైరస్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 90,000 మందికి సోకింది మరియు 3,000 మందికి పైగా మరణాలకు కారణమైంది, అందులో చైనాలోనే 2,912 మంది చనిపోవడం గమనార్హం.
చిరంజీవి చాలా క్యూట్ అంటున్న అనసూయ
బ్రహ్మాజీ కుమారుడు విశ్వనాథ్ నటించిన “ఓ పిట్టకథ” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు . ఈ ఈవెంట్ లో అనసూయను ఉద్దేశించి చిరంజీవి “రంగమ్మత్త గెస్ట్‌గా వచ్చినందుకు సంతోషం. మొన్న టెస్ట్ చేయించుకున్నాను.. నా గుండె చాలా స్ట్రాంగ్‌గా ఉందని అన్నారు. కానీ, ఇప్పుడు ఎందుకో చాలా పెయిన్ వచ్చింది అర్థం కావట్లే.. కొంచెం చిన్న వాయిస్ తో రామ్ చరణ్‌కి చెప్పకమ్మా!” అంటూ చేసిన వ్యాఖ్యలు అక్కడ ఉన్నవారందరిని నవ్వులలో ముంచెత్తింది.
దీని గురించి అనసూయ ట్వీట్ చేస్తూ “హాహాహా… చాలా క్యూట్.. చాలా వినయం.. మెగా లెజెండ్‌ను చూసి చాలా నేర్చుకోవాల్సి ఉంది” అని మెగాస్టార్ పొగడ్తలతో ముంచెత్తింది . ఎప్పటికి తాను చిరంజీవి ఫ్యాన్ అంటూ ఒక హాష్ ట్యాగ్ కూడా జోడించింది. సోషల్ మీడియాలో ఈ ట్వీట్ చక్కర్లు కొడుతుంది.