Home Blog Page 8607

భీష్మ సాధించిన వసూళ్లపై ఓ లుక్కేయండి..

నితిన్ తాజా చిత్రం ‘భీష్మ’ ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మహాశివరాత్రి కానుకగా(ఫిబ్రవరి 21) ‘భీష్మ’ మూవీ రిలీజైంది. నితిన్-రష్మిక జోడికి ప్రేక్షకులు ఫిదా అయి కలెక్షన్ల వర్షం కురిపించారు. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ హిట్టు నిలిచిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతి బరిలో నిలిచిన ‘సరిలేరునికెవ్వరు’, ‘అల..వైకుంఠపురములో’ తర్వాత భీష్మ ఆ రేంజ్ హిట్టు దక్కించుకుందన్న టాక్ విన్పిస్తుంది.

భీష్మ సాధించిన పది రోజుల కలెక్షన్స్ పరిశీలిస్తే నితిన్ కెరీర్లో ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిందని చెప్పొచ్చు.

నైజాంలో రూ.8.57కోట్లు
సీడెడ్లో రూ.3.13కోట్లు
ఉత్తరాంధ్రలో రూ.2.86 కోట్లు
ఈస్ట్ రూ.1.64 కోట్లు
వెస్ట్ రూ.1.21కోట్లు
గుంటూరులో 1.73కోట్లు
నెల్లూరులో రూ.0.72 కోట్లు
కృష్ణాలో రూ.1.44 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.1.88 కోట్లు
ఓవర్సీస్ రూ.3.10 కోట్లు
ప్రపంచ వ్యాప్తంగా రూ.26.28 కోట్లు కలెక్ట్ చేసినట్లు సమాచారం. అదేవిధంగా ‘బీష్మ’ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 22.7 కోట్ల బిజినెస్ జరిగింది.

భీష్మ చిత్రం కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు మంచి లాభాల బాట పట్టినట్లు తెలుస్తోంది. నితిన్ కెరీర్లో ‘భీష్మ’ బిగ్గెస్ట్ హిట్ నిలిచింది. ఈ మూవీకి దర్శకత్వం వహించిన వెంకీ కుడుములకు మంచి గుర్తింపు తెచ్చింది. ఈ మూవీ తర్వాత వెంకీ కుడుములకు భారీ ఆఫర్లు వస్తున్నాయి. ఈ మూవీ తర్వాత నితిన్ ‘అంధాదున్’ రీమేక్లో నటిస్తున్నాడు. ఈమూవీని నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఇక హీరోయిన్ రష్మిక జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ నటించే మూవీల్లో ఎంపికైనట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా ‘భీష్మ’ మూవీ డిస్ట్రిబ్యూటర్లకు కాసులవర్షం కురిపించడంతోపాటు నటీనటులకు మంచి అవకాశాలను తెచ్చిపెట్టింది.

‘HIT ‘ మూవీ సీక్వెల్ పై నాని ఆసక్తికర మాటలు!

హీరో నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మాతలుగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్, రుహానీ శర్మ జంటగా రూపొందిన థ్రిల్లర్ మూవీ ‘HIT’ 28వ తేదీ రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. కమర్షియల్ గా సక్సెస్ అవ్వడంతో మార్చి 2వ తేదీ ‘HIT’ మూవీ సక్సెస్ మీట్ జరిగింది.

‘HIT’ మూవీ సక్సెస్ మీట్ లో నాని మాట్లాడుతూ ..’HIT’ మూవీ రిలీజ్ అయినరోజు హిట్ అని ప్రేక్షకులు నిర్ణయించారని, వసూళ్ళ పరంగా హిట్ అయ్యిందని విశ్లేషకులు తెలిపారని, డబ్బు సంపాదించాలని తాను సినిమాలు నిర్మించడం లేదని, మంచి కంటెంట్ ను ప్రోత్సహించడమే తన కోరికని, ‘HIT’ మూవీ కొరకు పనిచేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలని, ‘HIT’ మూవీ సీక్వెల్ 2021 సంవత్సరంలో రాబోతుందని నాని ప్రకటించారు.

https://www.youtube.com/watch?v=9SLPbKKpYKI

ఏపీ బెల్ట్ షాప్ లలో తెలంగాణ మద్యం హల్ చల్

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య నెలకొన్న రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజనకు సంబంధించిన వివాదాల పరిష్కారంలో ఒక్కడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నా తెలంగాణ నుండి మద్యం అక్రమంగా ఏపీలో విస్తృతంగా అమ్మడానికి మాత్రం దోహదపడుతున్నది. ఎక్సైజ్ శాఖకు ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఉన్నా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త ఎక్సైజ్‌‌ పాలసీ తీసుకొచ్చింది. ప్రభుత్వమే మద్యం షాప్స్ నడిపిస్తోంది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే మద్యం అమ్ముతున్నారు. గరిష్ట అమ్మకాలపై పరిమితి విధించారు. దీంతో మందుబాబులకు ఇబ్బందులు తప్పలేదు. కానీ బెల్ట్‌‌ షాపుల నిర్వాహకులకు ఫుల్‌‌ గిరాకీ ఉంటోంది. బ్లాక్‌‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు.

అక్రమంగా అమ్ముడవుతున్న మద్యం మొత్తం తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి ఏపీకి అక్రమంగా తరలించిందేనని ఇటీవల తనిఖీల్లో బయటపడుతోంది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న షాపులతో కుమ్మక్కై ఆంధ్రప్రదేశ్‌‌లో యథేచ్ఛగా తెలంగాణ లిక్కర్ను అమ్ముతున్నారు.

రాష్ట్రంలోని కొన్ని ఏపీ సరిహద్దు జిల్లాల వైన్స్‌‌లకు ఫుల్ గిరాకీ ఉంటోంది. నల్లగొండ, సూర్యాపేట, గద్వాల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌‌కర్నూల్‌‌, వనపర్తి జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో అమ్మకాలు పెరిగాయి. ఆయా దుకాణాల్లో గతంలో రోజుకు లక్ష వరకు విక్రయాలు జరగ్గా, ప్రస్తుతం 5 లక్షల నుంచి 10 లక్షల దాకా పెరగడం గమనార్హం.

రాష్ట్రంలో మద్యం అక్రమ తరలింపు అడ్డుకట్ట కోసం ప్రత్యేకంగా ఎక్సైజ్‌‌ చెక్‌‌పోస్టులు ఉన్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల సరిహద్దులకు చెక్‌‌పోస్టులు ఏర్పాటు చేశారు. మద్యం తరలించాలంటే ఈ చెక్‌‌పోస్ట్‌‌లను దాటుకుని వెళ్లాలి.

అయితే ఎక్సైజ్ అధికారులు కూడా పట్టించుకోపోవడం, చూసిచూడనట్లు వదిలేయడంతో రాత్రికి రాత్రే వాహనాల్లో అక్రమ మద్యాన్ని బెల్ట్ షాపులకు విచ్చలవిడిగా సరఫరా చేస్తున్నారు. కొన్ని చోట్ల అధికారులు కుమ్మక్కై మద్యాన్ని ఏపీకి చేరుస్తున్నారు. తెలంగాణ ఎక్సైజ్‌‌ శాఖ తీరు ఇలా ఉండగా, ఏపీలో ఎక్కడికక్కడ తనిఖీల్లో తెలంగాణ మద్యం పట్టుబడుతోంది.

Bhanu Sree Photo Stills

కారణం ఇదా…! సోషల్ మీడియా కి మోడీ గుడ్ బై


సోషల్ మీడియాను నుండి వైదొలుగుతున్నట్లు ట్వీట్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు మరో ట్విస్ట్ ఇచ్చారు. తాను ఒక మంచి పనికోసమే ఆ నిర్ణయం తీసుకున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లను  ఎందుకు వదిలేస్తానన్నది స్పష్టం చేశారు. ఓ మంచి కార్యక్రమం కోసం ఆదివారం ఒక్కరోజే తన సోషల్ మీడియా అకౌంట్లను వదిలేస్తున్నట్లు ప్రకటించారు.

‘ఆదివారం రోజు.. మహిళా దినోత్సవం. మనల్ని ఇన్‌స్పైర్ చేస్తున్న మహిళలకు నేను నా సోషల్ మీడియా అకౌంట్లను వాళ్లకు అప్పగిస్తా. అలా చేయడం వల్ల వాళ్లు లక్షలాది మందిని ఉత్సాహపరిచినట్లు అవుతుంది. మీరు అలాంటి మహిళేనా? లేదా అలాంటి మహిళలు మీకు తెలుసా? అయితే అలాంటి మహిళల స్టోరీస్ #SheInspireUs‌తో ట్యాగ్ చేయండి’ అని ట్వీట్ ప్రధాని చేశారు.

‘మెగా’ ఆఫర్ వదులుకున్న గబ్బర్ సింగ్ డైరెక్టర్

సినిమా ఇండస్ట్రీలో దర్శకులు ఒక్క సినిమా అయినా మెగాస్టార్ చిరంజీవితో చేయాలని కలలు కంటుంటున్నారు. మెగాస్టార్ పిలుపు కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తుంటారు. కొందరు డైరెక్టర్లకు ఆ అవకాశం వెంటనే వస్తే మరికొందరికీ చాలా ఏళ్లకు అవకాశం వస్తుంది. మరికొందరు డైరెక్టర్లు తమ కల నెరవేరకుండానే ఇండస్ట్రీని నుంచి తిరుగుముఖం పట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తాజాగా గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కు మెగాస్టార్ తో మూవీ చేసే అవకాశంచేసే అవకాశం వచ్చింది. అయితే ఈ డైరెక్టర్ తనకు దొరికిన బంపర్ ఆఫర్ ను వదలుకోవడం చర్చనీయాంశంగా మారింది.

మలయాళం సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ హక్కులను మెగా పవర్ స్టార్ రాంచరణ్ దక్కించుకున్నాడు. ఈ మూవీని తన తండ్రితో నిర్మించాలని చరణ్ భావిస్తున్నాడు. ఈ మూవీ రీమేక్ బాధ్యతలను హరీష్ కు అప్పగిస్తారని మొదట్లో వార్తలు వచ్చాయి. ఈ మూవీ స్క్రీప్ట్ పనులు మొదలు పెడుతుండగానే హరీష్ శంకర్ కు పవన్ కల్యాణ్ మూవీ ఆఫర్ వచ్చింది. పవన్-హరీష్ శంకర్ కాంబినేషన్లలో గతంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెల్సిందే. మళ్లీ ఈ కాంబినేషన్ రిపిట్ కానుండటంతో హరీష్ శంకర్ మెగాస్టార్ ను వ్యక్తిగతంగా కలిసి పవన్ సినిమా గురించి చెప్పి రికెస్ట్ చేసినట్లు తెల్సింది. ఈ మూవీ తర్వాత మీతో చేయడానికి రెడీగా ఉంటానని చెప్పడంతో మెగాస్టార్ ఒకే అన్నారని ప్రచారం జరుగుతుంది.

పవన్ కల్యాణ్ ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ మూవీలో, క్రిష్ దర్శకత్వంలో మరో సినిమాలోను నటిస్తున్నాడు. ఈ మూవీల తర్వాత హరీష్ తన ప్రాజెక్ట్ సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. పవన్ నటించిన ‘వకీల్ సాబ్’ ఫస్టులుక్ నిన్నటి రిలీజై అభిమానులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. హరీష్ మెగాస్టార్ మూవీ నుంచి తప్పుకోవడంతో వీవీ వినాయక్ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం చిరంజీవి ‘ఆచార్య’ మూవీ షూటింగ్లో బీజీగా ఉన్నాడు. ఈ మూవీ తర్వాతే ‘లూసీఫర్’ తెరకెక్కనుంది. అప్పటిగానీ డైరెక్టర్ విషయంలో ఒక క్లారిటీ రాదు- అందాక వేచి చూడాల్సిదే..

బీజేపీ సీనియర్ నేతల ముందస్తు వ్యూహం ఫలిస్తుందా?

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక త్వరలోనే జరుగనుంది. బీజేపీ అధిష్టానం పార్టీ అధ్యక్షుడి ఎన్నికపై ఫోకస్ పెట్టడంతో స్థానిక సీనియర్ నేతలు సరికొత్త స్ట్రాటజీని అవలంబిస్తున్నారు. అధ్యక్ష పదవీ రేసులో ఉన్నవాళ్లతోపాటు పదవులపై ఆశలు పెట్టుకున్న వాళ్లంతా ఒకేవిధంగా ఆలోచిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎంపిక చివరి అంకానికి చేరుకుంది. దీంతో పార్టీలోని సీనియర్లంతా ఏకమవుతున్నారు. బీజేపీ అధిష్టానం ఇటీవల అధ్యక్ష ఎంపిక కోసం చేపట్టింది. ఇందులో పార్టీ ఇన్ చార్జి రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న లక్ష్మణ్‌నే కొనసాగించాలని మెజార్టీ నేతలు ప్రతిపాదన తెచ్చినట్లు సమాచారం. ఒకవేళ అధ్యక్షుడిని మార్చాల్సి వస్తే మాత్రం తమకు అవకాశం ఇవ్వాలని అధిష్టానంలోని పెద్దలను కోరుతున్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో డీకే అరుణ, ఎంపీ అర్వింద్, అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు లాంటి నేతల పేర్లు విన్పిస్తున్నాయి. వీరిని అధ్యక్ష పదవికి ఎంపిక చేస్తే, తమ పెత్తనం సాగదని పార్టీలోని సీనియర్ నేతలు అభద్రతాలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్ నే తిరిగి ఎన్నుకోవాలని సీనియర్లు భావిస్తున్నారు. ఆయనకు అంగ బలం లేదు, అర్ధబలం అంతకన్నా లేదు. దీంతో భవిష్యత్తులో తమకు ప్రమాదం కాడనే ముందుజాగ్రత్తతో వ్యవహరిస్తున్నారు. లక్ష్మణ్ కు జిల్లాలో ఫాలోవర్స్ తక్కువగా ఉన్నారు. దీంతో తమకు ఢోకా ఉందని సీనియర్లు భావిస్తున్నారు.

ఒకప్పుడు ఈ నేతను అధక్ష్య పదవీ నుంచి తొలగించాలనుకున్న నేతలే ప్రస్తుతం ఆయనకే మద్దతు తెలుతుడం విశేషం. అధిష్టానం కూడా లక్ష్మణ్ విషయంలో సానుకూలంగా ఉంది. దీంతో ఆయనకే తిరిగి అధ్యక్ష పదవీ దక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి. ముందస్తు వ్యూహంలో భాగంగానే సీనియర్లంతా లక్ష్మణ్ కే రాష్ట్రంలో పట్టాభిషేకం చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ జిల్లాల్లో అధ్యక్షుల నియామకంపై దృష్టిపెట్టింది. జిల్లా అధ్యక్షుల ఎన్నికల అనంతరం రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ఉండబోతుంది. ఈ దిశగా అధిష్టానం ముందస్తుగా అభిప్రాయ సేకరణ చేపట్టింది.

ఇందులో మెజార్టీ నేతలు లక్ష్మణ్ కే మద్దుతు పలుకుతున్నారు. లక్ష్మణ్ పార్టీ అధ్యక్షుడిగా ఉంటే తమ ఆటలు సాగించవచ్చని భావిస్తున్నారు. ఒకవేళ వీరంతా అనుకున్నట్లు లక్ష్మణ్ కే పట్టంకట్టిన తర్వాత ఆయన తనకంటూ ఫాలోవర్స్ పెంచుకుంటే మాత్రం సీనియర్ల ముందస్తు వ్యూహం బెడిసికొట్టడం ఖాయంగా కన్పిస్తుంది. రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక విషయంలో బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే..

‘ఒరేయ్ బుజ్జిగా’ మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో యంగ్ హీరో రాజ్ తరుణ్ , మాళవిక నాయర్ జంటగా రూపొందిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘ఒరేయ్ బుజ్జిగా’ మూవీ మార్చి 25 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ సినిమాలో హీరోయిన్ హెబ్బా పటేల్ ఒక కీలక పాత్రలో నటించగా అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.

లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందిన ఈ మూవీ లో వాణీ విశ్వనాధ్, నరేష్, పోసాని, అనీష్ కురువిల్లా , సప్తగిరి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఇటీవల చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రీ లుక్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది. ‘ఒరేయ్ బుజ్జిగా’ మూవీ టీజర్
మార్చి 4వ తేదీ 05:04 PM కు రిలీజ్ కానుంది.

ఆసక్తిని రేపుతున్న చిరంజీవి-రఘువీరా కలయిక

మెగాస్టార్ చిరంజీవిని ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తాజాగా కలుసుకోవడం ఆసక్తిని రేపుతుంది. వీరిద్దరూ చాలాకాలం తర్వాత భేటి కావడం రాజకీయ, సీని వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చిరంజీవి, రఘువీరారెడ్డిలు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. కానీ అంత యాక్టివ్ గా కనిపించడంలేదు. ఈ క్రమంలోనే వారిద్దరు మళ్లీ రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్లోని చిరంజీవి నివాసానికి కుటుంబ సభ్యులతో కలిసి రఘువీరారెడ్డి వెళ్లారు. తన స్వగ్రామమైన నీలకంఠాపురంలో నిర్వహించే ఓ కార్యక్రమానికి ఆహ్వానించారు. మే 29న తన గ్రామంలో ఏర్పాటు చేసిన 52అడుగుల ఎత్తున్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆవిష్కరణకు రావాలని కోరారు. ఈ సందర్భంగా కొంత రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

చిరంజీవితో రఘువీరారెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయి. త్వరలోనే రాజ్యసభ ఎన్నికలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ నుంచి చిరంజీవికి లేదా రఘువీరారెడ్డికి రాజ్యసభ అవకాశం ఉందని పుకార్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే రఘువీరారెడ్డి చిరంజీవితో మళ్లీ రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం చిరంజీవి సినిమాలతో బీజీగా ఉన్నారు. వైసీపీ ఇచ్చే రాజ్యసభ ఆఫర్ చిరంజీవి ఇప్పటికే సున్నితంగా తిరస్కరించినట్లు ప్రచారం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో చిరంజీవి సన్నిహిత్యంగానే ఉంటున్నారు. దీంతో వీరిద్దరు భేటీ కావడం అటూ రాజకీయ, ఇటూ సీనీ ప్రముఖుల్లో ఒకింత ఆసక్తిని రేపుతోంది.

కరోనాపై అవగాహన కల్పిస్తున్న మెగా కోడలు

కరోనా పేరు చెబితేనే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. కరోనా దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుండగా మరోవైపు వేల సంఖ్యలో ప్రజలు తమ ప్రాణాలను పొగొట్టుకుంటున్నాయి. చైనాలో సోకిన కరోనా వైరస్ క్రమంగా 60దేశాలకు విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా 90వేలకు పైగా కేసులు నమోదు కాగా 3వేలమంది మృత్యువాత పడినట్లు ప్రాథమిక సమాచారం. తాజాగా కరోనా వైరస్ ఇండియాకు చేరింది.

తెలుగు రాష్ట్రాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నాయి. దుబాయ్ వెళ్లొచ్చిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కరోనా వైరస్ బారినపడ్డాడు. ప్రస్తుతం అతడు హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తెలంగాణలో నమోదైన తొలి కేసు ఇదేకావడం గమనార్హం. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. దీనిపై మెగాస్టార్ చిరంజీవి కోడలు రాంచరణ్ భార్య ఉపాసన తాజాగా సోషల్ మీడియాలో స్పందించారు. కరోనా వైరస్ సోకకుండా ముందస్తు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.

జ్వరం, దగ్గు, జలుబు చాతిలో నొప్పి వంటివి కరోనా ప్రాథమిక లక్షణాలని ఉపాసన పేర్కొన్నారు. ఈ లక్షణాలుంటే వైద్యుడిని సంప్రదించాలని సూచించారు. చేతులు శుభ్రంగా కడుక్కొని మాస్కులు ధరించాలన్నారు. మాంసాహరం తినడం వల్ల కరోనా సోకదన్నారు. మాంసాన్ని బాగా ఉడికించి తినాలని సూచించారు. వ్యాధి లక్షణాలుంటే బయట తిరగనీయవద్దన్నారు.

కరోనాకు ప్రస్తుతానికి మందు కనుగోనలేదని చెప్పారు. వ్యాధి లక్షణాలున్న వాళ్లు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆసుప్రతిలో చేరాలని సూచించారు. అపోలో హాస్పిటల్స్ యజమానులైన ఉపాసన వైద్య సేవల్లో పాలుపంచుకుంటారు. ఈ క్రమంలోనే మెగా కోడలు కరోనాపై తనవంతు బాధ్యతగా అవగాహన కల్పిస్తుంది. ఉపాసన కరోనాపై అవగాహన కల్పిస్తుండటంపై మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ట్విట్టర్ లో పవర్ చూపించిన వకీల్ సాబ్..

pawan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్సకత్వంలో రాబోతున్న బాలీవుడ్ రీమేక్ సినిమా ‘పింక్’ కు సంబంధించి పవన్ కళ్యాణ్ మొదటి లుక్ , టైటిల్ ను నిన్న విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టర్ విడుదల చేసిన కొన్ని క్షణాలలోనే ట్విట్టర్ ఇండియా ట్రేండింగ్ గా మారింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విట్టర్ ద్వారా పోస్టర్ విడుదల చేయగా ఇప్పటి వరకు 24.7 వేల రీట్విట్స్ రావడం విశేషం.

మరోసారి పవన్ కళ్యాణ్ పవర్ చూపించడంతో ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా తియ్యనున్నాడు. ‘వకీల్ సాబ్’ సినిమా కోసం పవన్ కళ్యాణ్ 30 రోజులు కేటాయించి 50 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.

 

https://www.youtube.com/watch?v=UqH_EZd6RX4

కరోనా అలెర్ట్:మంత్రుల సమీక్ష…పలు కీలక నిర్ణయాలు


తెలంగాణాలో ఒక వ్యక్తికి కరోనా వైరస్ సోకడంతో కెసిఆర్ సర్కార్ అలెర్ట్ అయింది. కొవిడ్‌-19 నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వ సమన్వయ కమిటీ ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో సమావేశం అయింది. కొవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై మంత్రులు సమీక్ష చేపట్టారు. ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యలపై అదేవిధంగా ప్రజల్లో అవగాహన పెంచడం సహా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రులు చర్చిస్తున్నారు.

ఈ సందర్బంగా వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేంద్ర మాట్లాడుతూ.. కరోనా వైరస్ చికిత్స కోసం ప్రత్యేక ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వైరస్‌ నియంత్రణకు ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోకి ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు, నర్సులను సరిపోయేంత మందిని తీసుకుంటామన్నారు. ప్రయివేటు ఆస్పత్రులను కూడా అప్రమత్తం చేస్తున్నామని మంత్రి చెప్పారు. కరోనా అనుమానితులను ప్రభుత్వ ఆస్పత్రులకు పంపాలని కోరామని ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. ప్రజలకు విశ్వాసం కలిగించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. 9 ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేస్తాయి. ప్రతి శాఖకు ఒక నోడల్‌ అధికారి ఉంటారని మంత్రి తెలిపారు.

ఈ సమావేశానికి మంత్రి ఈటెలతో పాటు, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఆయా శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు హాజరయ్యారు.

జగన్ కి షాకిచ్చిన హైకోర్టు!

గ్రామ పంచాయతీ, మండల, జిల్లాపరిషత్‌, మున్సిపల్‌ సంస్థల ఎన్నికలలో 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని హైకోర్టు స్పష్టం చేసింది.

స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ల గూర్చి గత ఏడాది జనవరి నుండి హైకోర్టులో చర్చ జరుగుతుంది. న్యాయవాదులు తిరుమలశెట్టి కిరణ్‌, కేఎస్‌ మూర్తితోపాటు పలువురు వేర్వేరుగా ఈ రిజర్వేషన్ల పై పిటిషన్లు దాఖలు చేశారు. దింతో అప్పటి నుంచి హైకోర్టులో విచారణ జరిగింది. స్థానిక ఎన్నికల కోసం 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జగన్‌ ప్రభుత్వం జారీ చేసిన జీఓఎంఎస్‌ నంబరు 176ను న్యాయ స్థానం రద్దు చేసింది.

బీసీలకు కేటాయించిన 34 శాతం రిజర్వేషన్లను తోసిపుచ్చింది. దీనికి సంబంధించిన పంచాయతీరాజ్‌ చట్టం 1994లోని సెక్షన్‌ 9, 15, 152, 180ను రద్దు చేసింది. నెల రోజుల్లోగా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెలువరించింది.

స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లలో బీసీ జనాభాను పరిగణనలోకి తీసుకోకుండా రిజర్వేషన్లు ఖరారు చేయడంపై ధర్మాసనం స్పష్టత ఇచ్చింది. నెల రోజుల్లోగా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మార్చిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయాలని ఫిబ్రవరిలోనే ప్రభుత్వం భావించింది. ఇప్పటికే గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు, ఎంపీపీ, జడ్పీ చైర్‌పర్సన్ల రిజర్వేషన్లను ఖరారు చేసింది. మార్చిలోగా స్థానిక ఎన్నికల సమరాన్ని పూర్తి చేయాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ భావించగా, హైకోర్టు తీర్పుతో అది బెడిసి కొట్టింది.

ఈ శుక్రవారం విడుదల కాబోయే 7 సినిమాలివే…

మార్చి 6 వ తేదీ శుక్రవారం ఏడు సినిమాలు రిలీజ్ అవ్వనున్నాయి. గత శుక్రవారం ఐదు సినిమాలు  విడుదల కాగా అందులో HIT మూవీ పేక్షకులను అలరించి మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. అయితే ఈ వారంలో విడుదల కానున్న ఏడు సినిమాలలో ఏది బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధిస్తుందో వేచి చూడాలి…

ఈ శుక్రవారం రిలీజ్ కాబోయే ఏడు సినిమాల వివరాలు…

‘పలాస 1978 ‘మార్చి 6

‘లండన్‌ బాబులు’ సినిమా ఫేమ్‌ రక్షిత్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘పలాస 1978’. ఈ సినిమాకు కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పాటలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రెయిలర్ విడుదల చేశారు.

‘పలాస 1978’ సినిమాతో కరుణ కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా బిక్రమ్ కృష్ణ ఫిలింస్ పతాకంపై అప్పారావు బెల్లన, అట్లూరి వరప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. ప్రస్తుతం  పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా మార్చి 6 విడుదల విడుదల కానున్నట్టు చిత్రబృందం వెల్లడించింది. ఈ సినిమాకు రఘు కుంచె సంగీత దర్శకత్వం వహించడమే కాకుండా సినిమాలో ఓ కీలక పాత్ర కూడా పోషిస్తున్నారు.

‘ఓ పిట్ట క‌థ’ మార్చి 6

ప్రముఖ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్‌ నిర్మిస్తున్న తాజా చిత్రం ఓ పిట్ట కథ.. కొత్తవాళ్ళతో తెరకెక్కుతున్న ఈ సినిమాకి చెందు ముద్దు దర్శకత్వం వహించారు. విశ్వంత్‌ దుద్దుంపూడి, సంజయ్‌రావు, నిత్యా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించారు. బ్రహ్మాజీ ఓ కీలకపాత్రలో నటించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మార్చ్ 6 న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’ మార్చి 6

ధన్య బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కనున్న చిత్రం ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’. ఈ సినిమాకి బాలు అడుసుమిల్లి దర్శకత్వం వహించగా బ్లాక్‌ అండ్‌ వైట్‌ పిక్చర్స్‌, పూర్వీ పిక్చర్స్‌ పతాకాలపై హిమబిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్‌ నిర్మించారు. నలుగురు అమ్మాయిల చుట్టూ అల్లుకున్న ఈ చిత్రం మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.

https://www.youtube.com/watch?v=UgdB2r8x07Y&feature=emb_title

కాలేజ్ కుమార్ (మార్చి 6)

లక్ష్మణ గౌడ సమర్పణలో ఎమ్ ఆర్ పిక్చర్స్ బ్యానర్ పై హరి సంతోష్ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “కాలేజ్ కుమార్ ” మూవీ రూపొందింది.ఇందులో సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న మూవీ మార్చి 6వ తేదీ రిలీజ్ కానున్నది.

అర్జున (మార్చి 6)

నట్టి ఎంటర్ టైన్ మెంట్స్, క్విటీ ఎంటర్ టైన్ మెంట్స్ సమర్పణ లో AA ఆర్ట్స్ బ్యానర్ పై కన్మణి దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా రాజకీయాల నేపథ్యం లో “అర్జున ” మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమాలో హీరో రాజశేఖర్ తండ్రీకొడుకులు గా నటించడం విశేషం. ఈ మూవీ మార్చి 6వ తేదీ విడుదల కానున్నది.

స్క్రీన్ ప్లే (మార్చి 6)

బుజ్జి బుడుగు ఫిల్మ్స్ బ్యానర్ పై కె ఎల్ ప్రసాద్ దర్శకత్వంలో “స్క్రీన్ ప్లే ” మూవీ తెరకెక్కనుంది. “స్క్రీన్ ప్లే ” మూవీ పలు ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కు ఎంపిక అయిన ఈ మూవీ మార్చి 6వ తేదీ రిలీజ్ కానున్నది.

కృష్ణ మనోహర్ IPS (మార్చి 6)

యనమల సుధాకర్ నాయుడు సమర్పణ లో పవన పుత్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై ముగిల్ చెల్లప్పన్ దర్శకత్వంలో ప్రభుదేవా, నివేత పేతురాజ్ జంటగా “కృష్ణ మనోహర్ IPS” మూవీ రూపొందింది. ప్రభు దేవా 50 వ మూవీ గా రూపొందిన ఈ మూవీ తమిళ , తెలుగు వెర్షన్స్ 6వ తేదీ రిలీజ్ కానున్నాయి.

ప్రభుదేవా ‘కృష్ణమనోహర్ ఐ.పి.ఎస్’ విడుదల తేదీ ఖరారు..

అటు ద‌ర్శ‌కుడిగా ఇటు కొరియోగ్రాఫర్ గా అలానే హీరోగా కూడా మ‌ల్టీటాలెంట్స్ తో దూసుకుపోతున్న ‘ప్రభుదేవా’ తొలిసారిగా ఓ పోలీస్ గెటెప్ లో నటించిన పొన్ మానిక‌వ‌ల్ అనే‌ తమిళ చిత్రాన్ని తెలుగులో ‘కృష్ణమనోహర్ ఐ.పి.ఎస్’ పేరుతో మార్చి 6న‌ విడుదల కానున్నది. ఈ చిత్రాన్ని పవనపుత్ర ప్రొడక్షన్స్ పతాకంపై యనమల సుధాకర్ నాయుడు సమర్పణలో ఆర్. సీతారామరాజు నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ప్ర‌భుదేవ‌కు జోడీగా డ‌స్కీ బ్యూటీ నివేదా పేతురాజ్ న‌టిస్తోంది. ఇటీవ‌లే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ మూవీ అల వైకుంఠ‌పుర‌ములో నివేదా న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో హీరో హీరోయిన్ తో పాటు బాహుబలి ప్రభాకర్, సురేష్ మీనన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 6న తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మధ్య ప్రదేశ్ లో బిజెపి ‘ఆకర్ష్ కమల్’

మధ్య ప్రదేశ్ లో చాలా తక్కువ ఆధిక్యతతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం బిజెపి కర్ణాటకలో వలే `ఆకర్ష్ కమల్’ చేపట్టిందా? అవుననే అంటున్నారు మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్.

బీజేపీ నాయకులు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.25కోట్ల నుంచి రూ.45కోట్ల లంచం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని దిగ్విజయ్‌సింగ్‌ తీవ్రమైన ఆరోపణ చేశారు. రాష్ట్రంలో కమల్‌నాథ్‌ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి మాజీ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, నరోత్తమ్‌ మిశ్రా వ్యూహాలు పన్నుతున్నారని చెప్పారు.

ప్రతిపక్షంలో ఉండడం ఇష్టం లేక బహిరంగంగానే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని దిగ్విజయ్‌ ధ్వజమెత్తారు. అయితే ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తే ఇప్పటికిప్పుడు రూ.5కోట్లు.. బలనిరూపణ సమయంలో మిగిలిన డబ్బును అందించనున్నట్లు బీజేపీ సంప్రదింపులు జరిపిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని దిగ్విజయ్‌ తెలిపారు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో 230 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ 109, కాంగ్రెస్‌ 114 స్థానాలను గెలుచుకోగా.. కాంగ్రెస్‌ పార్టీ నలుగురు స్వతంత్రులు, ఇద్దరు బీఎస్పీ, ఒక ఎస్పీ ఎమ్మెల్యే సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

చార్మి వెకిలి చేష్టలు.. తిట్టిపోస్తున్న నెటిజన్లు

హీరోయిన్ చార్మి భారత్ లో కరోనా వైరస్ కేసులు నమోదవడాన్ని స్వాగతిస్తూ ఒక వీడియో పోస్టు చేసింది. దీంతో నెటిజిన్లు ఆమెపై మండిపడుతున్నారు. చార్మి వెకిలి చేష్టలపై నెటిజన్లు ట్రోల్ చేశారు. దీంతో తప్పు తెలుసుకున్న చార్మి వెంటనే వీడియోను డిలీట్ చేసింది. అప్పటికే చార్మికి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది.

చైనాలో పుట్టిన కరోనా వైరస్ నెమ్మది నెమ్మదిగా అన్ని దేశాలకు వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ వల్ల ఇప్పటికే చైనాలో చాలామంది మృత్యువాతపడ్డారు. ఈ మహమ్మారి దేశ రాజధాని ఢిల్లీతోపాటు హైదరాబాద్‌లో ప్రవేశించడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవడంతో కేంద్రంతోపాటు తెలంగాణ ప్రభుత్వం హెల్త్ ఎమర్జన్సీని ప్రకటించాయి.

హైదరాబాద్‌లో కరోనా వైరస్ కేసు నమోదయింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేగింది. మరోవైపు ‘కరోనా’ను నియంత్రించేందుకు వైద్యులు నానా కష్టాలు పడుతున్నారు. ప్రపంచ జనాభా అంతా భయంతో వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనాపై ఛార్మి చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు తప్పుపడుతున్నారు. దీంతో వీడియోను డిలీట్ చేయడంతోపాటు నెటిజన్లకు క్షమాపణ చెప్పింది.