Home Blog Page 8609

విజయ్ దేవరకొండ ‘ఫైటర్’ మూవీ ఫోటొస్ లీక్

ఇటీవల విడుదలైన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా విజయ్ దేవరకొండకు నిరాశనే మిగిలించింది. ప్రస్తుతం ఆయన పూరి జగన్నాధ్ డైరెక్షన్‌లో ‘ఫైటర్’ అనే సినిమా చేస్తున్నాడు. తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ కానున్న ఈ సినిమా ప్యాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కనుంది. రేర్ కాంబినేషన్ ఈ మూవీ వస్తుండటంతో అభిమానులలో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ ఫైటర్ స్టిల్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ముంబైలో జరుగుతోంది. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా తెలుగులో అరంగేట్రం చేయనుంది. అంతేకాక ఈ సినిమా కోసమే విజయ్ ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్‌ను కూడా నేర్చుకున్నాడు. హీరో హీరోయిన్లు ఒక బైక్ సీక్వెన్స్ సీన్‌కు సంబంధించిన స్టిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అడివి శేష్ ‘మేజర్’ సినిమాలో శోభిత ధూలిపాళ

యంగ్ హీరో అడివి శేష్ ‘మేజర్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో ఆయన నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్.ఎస్.జి.) కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రను పోషిస్తున్నారు. ముంబైలోని తాజ్ మహల్ హోటల్లో 2008 నవంబర్ 26న జరిగిన ఉగ్రవాద దాడిలో పలువురి ప్రాణాల్ని కాపాడి, ఆ క్రమంలో తన ప్రాణాల్ని త్యాగం చేసిన సైనికుడు మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ‘మేజర్’ చిత్రం రూపొందిస్తున్నారు.

తెలుగు, హిందీ – ద్విభాషా చిత్రంగా మహేష్ బాబు నిర్మాణ సంస్థ ఘట్టమనేని మహేష్ బాబు (జి.ఎం.బి.) ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సోనీ పిక్చర్స్ ప్రొడక్షన్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సంస్థలు నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు.

తాజాగా శోభిత ధూలిపాళ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుందని చిత్ర బృందం తెలిపింది. హీరో అడివి శేష్ తన ట్విట్టర్ పేజీలో స్పందిస్తూ, “మా మునుపటి ఫిల్మ్ ‘గూఢచారి’ తర్వాత ‘మేజర్’ సినిమా కోసం శోభితతో మరోసారి కలిసి పనిచేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ మూవీలో ఆమె భావోద్వేగపరమైన మంచి డెప్త్ ఉన్న డైనమైట్ లాంటి రోల్ ఆమె చేస్తోంది.

ప్రస్తుతం, ‘మేజర్’ సినిమా షూటింగ్ హిమాచల్ ప్రదేశ్ లో జరుగుతోంది. అక్కడ ముఖ్య తారాగణంపై ప్రధాన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

HIT Success Meet Photos

ఢిల్లీ అల్లర్ల వెనుక హైద్రాబాద్ హ్యాష్ ట్యాగ్స్ ఇవే..!

ఢిల్లీలో 4రోజుల పాటు జరిగిన అల్లర్లలో హైదరాబాద్ యువత పాత్ర ఉందంటున్నారు కేంద్ర ఇంటలిజెన్స్ విభాగం అధికారులు. హైదరాబాద్ కి చెందిన కొందరు విద్యార్థులు ఉద్యేశపూర్వకంగా సోషల్ మీడియాలో వదంతులను వ్యాప్తి చేయడం ద్వార ఢిల్లీలో అల్లర్లకు ఆజ్యం పోశారని తాజాగా కేంద్ర ఇంటలిజెన్స్ విభాగం అధికారులు కేంద్ర హోంమంత్రిత్వశాఖకు సమర్పించిన రహస్య నివేదికలో వెల్లడించారు.

ఢిల్లీ అల్లర్లు జరుగుతున్న సమయంలో హైదరాబాద్ లో కొందరు విద్యార్థులు ప్రత్యేక హాష్ ట్యాగ్‌లతో కూడిన మెసేజ్ లను పోస్టు చేశారని ఇంటలిజెన్స్ పేర్కొంది. ముఖ్యంగా ఢిల్లీ క్లాషెస్, ఢిల్లీ క్లాషెస్2020, ఢిల్లీ రియోట్స్, ఢిల్లీజెనోసిడ్, షహీన్‌బాగ్, ఢిల్లీ పోలీసు, మర్డర్స్, జస్టిస్ ఫర్ ఫైజాన్, ఆప్ షరం కరో, అమిత్ షా రిజైన్, అమిత్ షా ఇస్తేఫా దో, గోబ్యాక్ అమిత్ షా తదితర హ్యాష్ ట్యాగులతో సోషల్ మీడియాలో వదంతులను వ్యాప్తి చేశారని ఇంటలిజెన్స్ తన నివేదికలో వెల్లడించింది.

తప్పుడు, ఫొటోస్, తప్పుడు వీడియోలు, వదంతులు, తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసి వ్యాప్తి చేయడం ద్వార ఢిల్లీలో అల్లర్లు జరిగాయని గూఢాచారి విభాగం తన నివేదికలో తెలిపింది. అల్లర్ల వ్యాప్తికి హైదరాబాద్ విద్యార్థులను ఉపయోగించారని తేల్చారు.

ఢిల్లీలో అల్లర్లు చెలరేగాడు పాకిస్థాన్ అధికారిక ట్విట్టర్ కూడా ఉపయోగపడింది అని గూఢాచారి వర్గాలు తెలిపాయి. ఢిల్లీ పోలీసుల చేతిలో ఫైజాన్ మరణించాడని, జస్టిస్ ఫర్ ఫైజాన్ అని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. వైద్యచికిత్స చేయించకుండా పోలీసు కస్టడీలో ఉంచినందునే ఫైజాన్ మరణించాడని పోస్టు చేశారు. ఢిల్లీ పోలీసులు హంతకులని పోస్టులు పెట్టారు.కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని, ఢిల్లీలో ముస్లిములు అధికంగా ఉన్న ప్రాంతాల్లో దాడులపై దర్యాప్తు చేయాలని కోరుతున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ద్వేషపూరిత ప్రసంగాలు చేసిన బీజేపీ నేతలు అనురాగ్ ఠాకూర్, కపిల్ మిశ్రాలను పోలీసులు అరెస్టు చేయాలని కూడా కొందరు పోస్టులు పెట్టారు. క్రూరమైన, రాజ్యాంగ విరుద్ధమైన సీఏఏను వెనక్కి తీసుకోండి అంటూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. హైదరాబాద్ విద్యార్థులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులే ఢిల్లీలో అల్లర్లకు కారణమైందని కేంద్ర ఇంటలిజెన్స్ తన రహస్య నివేదికలో పేర్కొనడం హైదరాబాద్ లో సంచలనం రేపింది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా యాప్ లైన వాట్సాప్, ట్విట్టర్, టిక్ టాక్ లపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

హిజ్రాల కోసం ఆ స్టార్ హీరో విరాళం…

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్… రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లో కూడా హీరోయేనని మరోసారి నిరూపించుకున్నాడు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో అక్షయ్ కుమార్ ఎప్పుడు ముందుంటాడు. ఇప్పటికే చాలా మందికి సహాయం చేసిన అక్షయ్ కుమార్ ఇప్పుడు దర్శకుడు రాఘవ లారెన్స్ తో కలిసి చెన్నైలో హిజ్రాల కోసం భవనాన్ని నిర్మించడానికి రూ.కోటిన్నర విరాళమిచ్చారు.

ఇక లారెన్స్ కూడా ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవ కార్యక్రమాలు చేసాడు.. లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద చిన్నపిల్లలకి గుండె ఆపరేషన్స్ చేయడమే కాకుండా వికలాంగులకు విద్య, వసతి, ఆరోగ్యం వంటి సదుపాయలు కల్పించాడు.. తన చారిటబుల్ ట్రస్ట్ 15వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా చెన్నైలోని ట్రాన్స్ జెండర్స్ వసతికోసం ఓ భవనాన్ని నిర్మించాలని అనుకున్నాడు.ఈ విషయాన్నీ లారెన్స్ తన ఫేస్ బుక్ ద్వారా ప్రకటించాడు.

‘హాయ్ ఫ్రెండ్స్, ఫ్యాన్స్, నేను ఒక శుభవార్త పంచుకోవాలనుకుంటున్నాను.. లక్ష్మీబాంబ్’ షూటింగ్ సందర్భంగా మా ట్రస్ట్ ప్రాజెక్టుల గురించి, హిజ్రాలకు ఇళ్ల నిర్మాణం గురించి అక్షయ్ సార్‌తో మాట్లాడాగా అయన మరో మారు ఆలోచించకుండా కోటిన్నర రూపాయలు విరాళం ఇచ్చారు. ఆయనకి మా కృతజ్ఞతలు.. ప్రస్తుతం మా ట్రస్ట్ ద్వారా భూమిని సేకరిస్తాం. ఇళ్ల నిర్మాణం కోసం మరిన్ని నిధులు సేకరిస్తున్నామని లారెన్స్ పేర్కొన్నారు.

బాలకృష్ణ – బోయపాటి మూవీ షూటింగ్ షురూ..

నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. గతంలో బాలయ్య , బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజండ్ సినిమాలు మంచి విజయాలను సాధించాయి. ఈ సినిమాని ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఈ రోజు ఉదయం రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలుపెట్టారు. మొదటి షెడ్యూల్ లోనే భారీ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు. దీనికి రామ్ – లక్ష్మణ్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం, ప్రేక్షకులు, అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్న స్థాయిలో మోస్ట్ పవర్ఫుల్ గా మంచి కథా బలం తో పాటుగా చాలా గ్రాండియర్ గా తెరకెక్కనుంది. ఈ సినిమా కు థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ‘బాలయ్య బోయపాటి 3’ కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియల్సివుంది.

 

Karthikeya 2 Movie Opening Photos

షారుక్ ఖాన్ కుమారుడి స్కెచ్ వైరల్..

అగ్ర హీరోల పిల్లలు చేసే చిలిపి చేష్టలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి. ఇటీవల కాలంలో ఈ ట్రెండ్ రోజురోజుకు పెరిగిపోతుంది. టాలీవుడ్, బాలీవుడ్ తేడా లేకుండా అగ్రహీరోల పిల్లలు చిన్నతనం నుంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. టాలీవుడ్లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఈ విషయంలో ముందుంటుంది. సితార వంశీపైడిపల్లి కూతురు ఆద్యాతో కలిసి ఏ అండ్ ఎస్ యూట్యూబ్ ప్రారంభించిన సంగతి తెల్సిందే. ఈ ఛానల్లో ఆమె చేసే చిలిపి పనులు ట్రెండింగ్ అవుతుంటాయి. అదేవిధంగా అల్లు అర్జున్ కూతురు తండ్రి చేసే పనులు వైరల్ అయిన సంఘటనలు ఉన్నాయి. తాజాగా ఓ బాలీవుడ్ అగ్రహీరో కుమారుడు ఈ కోవాలో చేరాడు.

బాలీవుడ్ అగ్రహీరో షారూఖ్‌ఖాన్ తన కుమారుడు అబ్రామ్ ప్రతిభను చూసి మురిసిపోతున్నాడు. తన స్కెచ్ వేసిన కుమారుడిని మెచ్చుకుంటూ షారూఖ్ ఖాన్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. తాను ముగ్గురు పిల్లలకు తండ్రి అయినందుకు గర్వంగా ఉందన్నాడు. ఇది తనకు పెద్ద అఛీవ్‌మెంట్‌లా అనిపిస్తుందని షారుక్ పేర్కొన్నాడు.

తన చిన్న కుమారుడు నా చిత్రాన్ని ఎంతో సుందరంగా గీశాడంటూ మురిసిపోతున్నాడు. ఈ స్కెచ్ చూడగానే చెప్పలేని ఆనందం కలిగిందని చెప్పుకొచ్చాడు. షారూఖ్ ఖాన్ ‘జీరో’ సినిమా తరువాత మరే సినిమా చేయలేదు. ప్రస్తుతం ఫ్యామిలీతో సంతోషంగా గడుపుతున్నారు. జీవితంలో బాల్యం అద్భుతమైనది చెప్పాడు. ప్రస్తుతం అబ్రామ్ వేసిన స్కెచ్ వైరల్ అవుతుంది. బాలీవుడ్ అగ్ర నటులు సినిమాలతో ఫ్యాన్స్ ను అలరిస్తే వాళ్ల పిల్లలు చిలిపి పనులతో ఆకట్టుకుంటున్నారు.

క్యాస్టింగ్ కౌచ్‌పై వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ సంచ‌ల‌న కామెంట్

సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సంఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి. అగ్రహీరోయిన్లకు సైతం ఈ క్యాస్టింగ్ కౌచ్ లో మినహాయింపేమీ లేదు. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్నింటా మహిళలపై వేధింపులు కొనసాగుతున్నాయి. అయితే సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా ఉంటున్న స్టార్ల వారసురాళ్లు సైతం ఇలాంటి వేధింపులు ఎదుర్కొంటున్నామని చెప్పడం గమనార్హం. స్టార్ కిడ్లకు కూడా కమిట్ మెంట్ విషయంలో మినహాయింపులేదని వరలక్ష్మి శరత్ కుమార్ సంచలన కామెంట్ చేశారు.

తమిళ హీరో శ‌ర‌త్‌కుమార్ కూతురు వ‌ర‌ల‌క్ష్మి ఇండ‌స్ట్రీలోకి వచ్చి చాలా కాల‌మైంది. 25 సినిమాల్లో వివిధ‌ పాత్ర‌ల్లో నటించి మెప్పించింది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ పై ఆమె మాట్లాడారు. క్యాస్టింగ్ కౌచ్ ఇండస్ట్రీలోని అమ్మాయిలు మాట్లాడితే వారు అవ‌కాశాలు తగ్గుతాయా అని ప్రశ్నిస్తే సమాధానం ఇచ్చారు. ఇలాంటి వారికి అమ్మాయిలు నో చెప్ప‌డం నేర్చుకోవాలని ఆమె సూచించారు.

స్టార్ కిడ్ అయిన తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొన్నానని వాపోయారు. అలాంటి వారు మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డింగ్స్ తన వద్ద ఉన్నాయని చెప్పారు. అలాంటి వారి సినిమాల్లో తాను న‌టించాల్సి అవ‌స‌రం లేదనిపించిందని చెప్పుకొచ్చింది. అందుకే తనను బ్యాన్ చేశారని చెప్పింది. కాగా నేడు తన కాళ్ల‌పై నేను నిల‌బ‌డిగ‌లిగానని చెప్పింది. కౌస్టింగ్ క్యాచ్ సినిమా ఇండస్ట్రీలోనే కాదు అన్ని రంగాల్లో ఉందని తెలిపింది. ఇలాంటి వాటిపట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలంది. మహిళలు ఇలాంటి వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని సూచించారు. అప్పుడే అనుకున్న లక్ష్యం సాధించగలుగుతారని చెప్పింది.

College Kumar Pre Release Event Photos

కెసిఆర్, జగన్ ని కూడా వాడుకొని వదిలేస్తారు..!

తెలంగాణ సీఎం కెసిఆర్ పై బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకట్ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనది వాడుకొని వదిలేసే మనస్తత్వమని విమర్శించారు. జగన్-కెసిఆర్ లు మంచి స్నేహితులని అందరూ అనుకుంటున్నారు కానీ జగన్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలిని, కెసిఆర్ కి ఎవరూ స్నేహితులు ఉండరని, ఆయన తన అవసరానికి మాత్రమే వాడుకుంటున్నారని అన్నారు. కమిషన్ల కోసమే కెసిఆర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, లింక్ ప్రాజెక్టులు కడుతున్నారని మండిపడ్డారు. కెసిఆర్ తన రాజకీయ లబ్ధికోసం సందర్భానుసారంగా అందర్నీ వాడుకుంటారని వెంకట స్వామి అన్నారు.

గతంలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్రలు పోషించిన కొంతమందిని కెసిఆర్ వాడుకొని, తెలంగాణ స్వతంత్ర రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత వారిని వదిలేసి, కొత్త వారితో జత కట్టి ఉద్యమ కారులకు తీవ్ర అన్యాయం చేశారని వెంకట్ స్వామి ధ్వజమెత్తారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న వివేక్ వెంకట స్వామి. తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. పై విధంగా స్పందించారు.

‘సింగం’ డైరెక్టర్ తో సూర్య మరోసారి

తమిళ హీరో సూర్య వరుస సినిమాలతో బీజీగా ఉన్నాడు. తాజాగా సూర్య నటిస్తున్న మూవీ ‘ఆకాశం నీ హద్దురా’. ఈ మూవీని తెలుగు, తమిళంలో ఒకేసారి షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన సాంగ్స్, పోస్టర్లు ఆకట్టుకున్నాయి. సూర్యకి జోడిగా అపర్ణ బాలమురళి నటిస్తోంది. ఇందులో మోహన్ బాబు కీలక రోల్స్ చేస్తున్నాడు. ఈ మూలోని ‘పిల్ల పులి.. పోరగాడే నీకు బలి’ సాంగ్స్ యూట్యూబ్లో ట్రెండింగ్ మారిన సంగతి తెల్సింది. ఈ మూవీ చేస్తూనే సూర్య తన 39వ మూవీని లైన్లో పెట్టారు. ఈ మూవీని ‘సింగం’ మూవీ డైరెక్టర్ హరి తెరకెక్కించనున్నాడు.

సూర్య‌కు తెలుగుతోపాటు తమిళంలో మంచి మార్కెట్ ఉంది. అందుక‌నే ఆయ‌న సినిమాల‌ను తమిళంతోపాటు తెలుగులోనూ డబ్బింగ్ అవుతుంటాయి. దర్శకుడు హ‌రి- సూర్య కాంబినేషన్లలో ఇప్ప‌టికే ఐదు మూవీలు తెరకెక్కాయి. ఇందులో ‘సింగం’ సీక్వెల్స్ భారీ విజ‌యాల‌ను సాధించాయి. అయితే తాజాగా మరోసారి వీరిద్ద‌రి కాంబినేషన్లో ఓ మూవీ రాబోతుంది.

సూర్య 39వ మూవీకి ‘అరువా’ అనే టైటిల్‌ను ఖ‌రారైంది. ‘అరువా’ అంటే క‌త్తి అని అర్థం. ఈ మూవీ షూటింగ్ ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుంది. ఈ ఏడాది దీపావ‌ళికి సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. స్టూడియో గ్రీన్ బ్యాన‌ర్‌పై జ్ఞాన‌వేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ ఫస్ట్ సాంగ్…

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై బ‌న్నివాసు, వాసువ‌ర్మ తో క‌లిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం యొక్క మొద‌టి పాట‌ను విడుద‌ల చేశారు. “మ‌న‌సా…. మ‌నసా… మ‌న‌సారా… బ్ర‌తిమాలా… త‌న‌వ‌క‌వడిలో ప‌డ‌బొకే మ‌న‌సా అంటూ సాగే ఈ సాంగ్ ప్ర‌స్తుతం సెన్సేష‌న్ గా ట్రెండ్ అవ్వడం విశేషం.

జీఏ 2 బ్యాన‌ర్ నుంచి గ‌తంలో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ గీత‌గోవిందం ఆడియో ఒక సంచ‌ల‌న‌మే అని చెప్పాలి. మ్యూజిక‌ల్ హిట్స్ కొంత గ్యాప్ వ‌చ్చిన స‌మ‌యంలో ఈ చిత్రం మ్యాజిక‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌టం విశేషం. మళ్ళి అదే కాంబినేష‌న్ లో వస్తున్న ఈసినిమా ఆడియో కూడా అదే రేంజి విజ‌యం సాధిస్తుంద‌నే న‌మ్మ‌కం అంద‌రిలో వుంది. గోపీసుంద‌ర్ కంపోజ్ చేసిన ఈ ఆల్బ‌మ్ లో సిడ్ శ్రీరామ్ పాడిన‌ ఈ పాట మ‌నసు దోచుకుంది. ఈపాట‌ని ఎన్నో మంచి పాట‌ల‌కి సాహిత్యాన్ని అందించిన సురేంద‌ర్ కృష్ణ ఈ సాంగ్ కి లిరిక్స్ అందించారు.

కన్న తండ్రిని ‘బే’ అంటోన్న అర్హ..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన పిల్లలు అయాన్, అర్హలతో కలిసి ఎంజాయ్ చేస్తూ తీసిన వీడియోలను అభిమానులతో పంచుకుంటారు.ఎక్కువగా గారాలపట్టి అర్హ ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నప్పుడు తీసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు.అయన తాజా చిత్రం అల వైకుంఠపురములోకి ముందు తన ముద్దుల కూతురు అర్హతో చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘నాన్న చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పు అని బన్నీ అర్హను అడిగితే.. ‘నేను చేసుకోను’ అని అర్హ ముద్దుగా చెప్పగా దొంగ అంటూ తన కూతురుని చక్కిలిగింతలు పెట్టాడు బన్నీ. అప్పట్లో ఈ వీడియో చాలా వైరల్ గా అయింది.

ఇప్పుడు తాజాగా తన కూతురుతో మరో వీడియోను చేశాడు బన్నీ.. ‘నీ ఫేవరేట్ కలరేంటి బే’ అని అర్హను బన్నీ అడగగా .. ‘పింక్ బే’ అని బదులిచ్చింది అర్హ. ‘నన్ను బే అంటావా బే’ అంటే ‘అవును బే’ అంటూ అర్హ నోటితో నాలుగు సార్లు ‘బే’ అన్న బూతును పలికేలా చేసాడు బన్నీ. అయితే బన్నీ అభిమానులు దీనిని సరదాగా తీసుకున్నప్పటికీ కొందరు నేటిజన్స్ మాత్రం ఫైర్ అవుతున్నారు. ఇప్పటినుంచే బూతులు నేర్పిస్తే పెద్దయ్యాక బూతులే వస్తాయ్ బాలసమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఇక తాజగా అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం భారీ విజయం సాధించింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరిని అలరించింది .ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హేగ్దే కథానాయకగా నటించింది. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు. ఆర్య, ఆర్య 2 చిత్రాల తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. సమ్మర్ లో సినిమాని రిలీజ్ చేయనున్నారు.

https://www.instagram.com/p/B9MrLU4nLkD/?utm_source=ig_web_copy_link

O Pitta Katha Movie Pre Release Event Photos

Kajal Aggarwal Beautiful Pictures