Home Blog Page 8606

కరోనా భయాన్ని క్యాష్ చేసుకుంటున్న వ్యాపారులు

దేశంలో కరోనా ప్రకంపనలు సృష్టిస్తుంది. ప్రజలు భయాందోళనలకు గురౌతున్నారు. దింతో ప్రజల భయాలను కొంతమంది వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. కరోనా సోకకుండా ఉండేందుకు మొట్టమొదటి జాగ్రత్తగా ప్రజలు మాస్క్ లను ధరిస్తారు. ఈ మాస్క్ ధరని ఏకంగా 200రేట్లు పెంచారు వ్యాపారులు.

గతంలో 100 మాస్క్ లు కలిగిన ఒక ప్యాకెట్ ధర రూ.150 నుంచి రూ.200గా ఉండేది కానీ ప్రస్తుతం ఒక్క మాస్క్ ధర రూ.30 నుంచి రూ 50 అంటే 100 మాస్క్ లు గల ఒక ప్యాకెట్ ధర రూ.3000 నుంచి రూ.5000 కావడం విశేషం. ప్రస్తుతం కరోనా భయం వల్ల ధరతో సంబంధం లేకుండా ప్రజలు ఈ మాస్క్ లను కొంటున్నారు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే సామాన్య ప్రజలపై మరింత ఆర్ధికభారం పడే అవకాశాలున్నాయని ప్రజలు వాపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం కలుగజేసుకొని సత్వర పరిస్కారం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.

భారతీయ సంప్రదాయంతో కరోనాకు చెక్

భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను తూచతప్పకుండా పాటిస్తే కరోనా(కొవిడ్-19) నివారించవచ్చు. భారతదేశం పల్లెలకు పుట్టినిల్లు. పల్లెల్లోని పరిశుభ్రత వాతావరణం, అక్కడి ఆచారాలు ఈ వైరస్ ను గ్రామాల్లోకి రానివ్వకుండా చేయగలవు అనేది తాజాగా వెల్లడైంది. ప్రపంచ దేశాలు వైరస్ నివారణ చేపడున్న చర్యలు గమనించినట్లయితే ఈ చర్యలన్నీ భారతీయులు నిత్యం పాటించే అలవాట్లేనని చెప్పక తప్పదు. అయితే భారతదేశం పాశ్చత్య ధోరణిలో పడిపోవడంతో గతంలో పెద్దలు ఆచరించిన అలవాట్లను మరిచిపోయి కొత్త అలవాట్లను నేర్చుకుంటున్నారు. ఈ పాశ్చత్య అలవాట్లే భారతదేశంలోకి కరోనా ఎంట్రీ మార్గం సుగమం చేశాయి.

భారతదేశం కర్మభూమిగా పేరొందింది. అయితే కొన్ని సంవత్సరాల నుంచి పాశ్చత్య సంప్రదాయ మోజులో భారతీయులు పడిపోయారు. వివిధ దేశాల సంస్కృతిని అరువు తెచ్చుకొని మరీ జబ్బులు తెచ్చుకోవాల్సిన కర్మ పట్టింది. భారతదేశంలోని పల్లెల సంస్కృతి మాయమై పట్టణీకరణ దిశగా పరుగులు పెడుతుంది. పట్టణీకరణ పేరుతో పచ్చని చెట్లను నాశనం చేస్తున్నారు. పారిశ్రామీకీకరణ పేరుతో పొగ గొట్టాలను ప్రజల మధ్యల్లో పెట్టి కాలుష్యాన్ని పెంచి పోషిస్తున్నారు. ప్లాస్టిక్ ను, రకరకాలైన రసాయానలతో చేసే వస్తువులను, పదార్ధాలను విచ్చలవిడిగా వాడటం వలన కూడా  ప్రజలు కొత్తకొత్త వైరస్ ల వలన  జబ్బులు బారిన పడటానికి కారణమవుతున్నాయి.

ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా తాజాగా ఇండియాకు చేరుకుంది. ఇప్పటికే భారతదేశంలో 18 కరోనా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. చైనాలో ముగ్గురు కేరళ వైద్య విద్యార్థులకు కరోనా వైరస్ సోకగా వారిని తిరిగి భారత్ కు పంపించారు. అయితే వీరిని కేరళ వైద్యబృందం ప్రత్యేక వైద్యం అందించింది. తాజాగా వీరు కరోనా వైరస్ నుంచి కోలుకున్నట్లు ప్రకటించింది. కేరళ వైద్యం కరోనాను కట్టడి చేసినట్లయింది.

భారతీయ సంస్కృతిని ప్రతీఒక్కరూ అలవాటు చేసుకుంటే కరోనా మహమ్మారి నుంచి బయటపడవచ్చు. భారతీయులు ఎవరైన పలకరించేటప్పుడు రెండు చేతుల నమస్కారం పెట్టడం అలవాటు. కరోనా నివారణకు ఒకరి నుంచి మరొకరికి సోకకుండా ఉండేందుకు ఈ అలవాటు దోహదపడుతుంది. అలాగే ఏవరైనా ఇంటికి మన ఇంటికి వచ్చినపుడు కాళ్లు కడుక్కునేందుకు నీళ్ల ఇస్తాం. వాళ్లు ఇంటి బయటనే కాళ్లు, చేతులు కడుక్కొని ఇంట్లోకి వస్తారు. ఈ అలవాటు వల్ల కరోనా వైరస్ ఇంటి లోపలికి వచ్చే అవకాశం లేదు. అలాగే ఇంటి ముందే మహిళలు కల్లకు చల్లి, ముగ్గులు పెడుతుంటారు. వీటివల్ల సూక్ష్మ క్రిములు ఇంటి బయటే నాశిస్తాయి.

అలాగే మన ఆహార అలవాట్లలో పసుపును వాడుతుంటారు. పసుపు లేకుండా ఏ వంటను భారతీయులు వాడరు. ఇది మన శరీరానికి యాంటీ బయోటిక్ గా పని చేస్తుంది. అలాగే మన వంటల్లో అల్లం, మిరియాలు వాడుతుంటారు. ఇవి కూడా కరోనాకు మంచి యాంటీ బయోటిక్ గా పనిచేస్తాయని వెల్లడైంది. భారతీయలు దేవుడిని ఎక్కువగా నమ్ముతుంటారు. దీంతో వ్యక్తిగతంగా పరిశుభ్రతను పాటిస్తుంటారు. ఇవన్నీ కూడా కరోనా కట్టడికి ఎంతగానో దోహదపడుతాయి. అయితే గత కొన్నాళ్లుగా మనం పాశ్చత్య ముసుగులో పడిపోవడంతో కరోనాకు భారతదేశంలోకి ఎంట్రీ దొరికింది.

కరోనా లాంటి మహమ్మరిని తరిమివేయడం భారతీయులకు ఎంతో తేలిక. మన ఆచారాలను  తూచ తప్పకుండా పాటిస్తే కరోనా వైరసే కాదు.. ఎలాంటి వైరస్ అయిన భారతీయులను ఏమి చేయలేదనేది  అక్షర సత్యం. భారతీయులు మరోక్కసారి ప్రపంచానికి మన సంస్కృతి గొప్పతనం గురించి తెలియజేయాల్సిన సమయం వచ్చింది. ఎప్పటి నుంచో మన పూర్వీకులు ఆచరిస్తున్న ఆచారాలను మన భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనపైనే ఉంది.

రాత్రికి రాత్రి 10 నిముషాల్లో 10 జీవోలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత అర్ధరాత్రి పది నిమిషాల వ్యవధిలో పది జీవోలను రహస్యంగా విడుదల చేసి రికార్డు నెలకొల్పింది. వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కీలకమైన జీవోలు ఎక్కువగా అర్ధరాత్రి బైటకు వస్తుండటం తెలిసిందే. అయితే వాటి వివరాలు బైటకు రాలేదు.

రాత్రి 11:45 గంటల నుంచి 11:55 మధ్య పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఈ జీవోలను విడుదల చేసింది. యాభై శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం అర్ధరాత్రి ఈ జీవోలను విడుదల చేయడం గమనార్హం.

59.85 శాతంగా ఉన్న రిజర్వేషన్లను 50 శాతానికి కుదిస్తూ ఎన్నికలకు వెళ్లేందుకు వీలుగా ఆర్డినెన్స్ లేదంటే జీవోలలో ఏదో ఒకటి తెచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రహస్యంగా ఈ జీవోలను తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది.

మున్ముందు న్యాయపరమైన ఇబ్బందులు ఎదురుకాకూడదన్న ఉద్దేశంతో వీటిని విడుదల చేసినట్టు చెబుతున్నారు. నేటి మంత్రి వర్గ సమావేశంలో రిజర్వేషన్లపై చర్చించి, ఆమోదించే అవకాశం ఉన్న నేపథ్యంలో రిజర్వేషన్లను 50 శాతానికి కుదించి జీవోలు తెచ్చి ఉంటారన్న ప్రచారం జరుగుతోంది.

రష్మిపై అత్యాచారయత్నం

బాలీవుడ్ హీరోయిన్ రష్మి దేశాయ్ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్ ప్రస్తుతం సంచలనంగా మారాయి. తనకు సినిమా ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవాన్ని వెల్లడించింది. ‘నాపై ఓ వ్యక్తి అత్యాచారయత్నం చేయబోయాడు’ అని ఆరోపించింది. అయితే అతడి ప్రయత్నం నుంచి తప్పించుకోని పారిపోయినని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సీని ఇండస్ట్రీలో సంచలనం రేపుతుంది.

ఇటీవలే వరలక్ష్మి శరత్ కుమార్ తనకు ఇండస్ట్రీలో ఎదురైన అనుభవాలను వివరించింది. స్టార్ కిడ్ అయిన తనను కూడా లైగింగ వేధింపు తప్పలేదని వాపోయింది. అవకాశాలు కావాలంటే కమిట్ కావాలని కొందరు యత్నించారని, వారి వాయిస్ రికార్డులు తన వద్ద భద్రంగా ఉన్నట్లు చెప్పింది. అయితే తాను వారి సినిమాల్లో నటించే అవకాశం లేదని చెప్పింది. అందుకే తనను సినిమాల నుంచి బ్యాన్ చేశారని చెప్పింది. వీటిని తాను ధైర్యంగా ఎదుర్కొన్నట్లు చెప్పింది.

రష్మీ దేశాయ్ బాలీవుడ్లో కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత ఆమెకు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ఇటీవల బిగ్ బాస్ షో ద్వారా రష్మీ దేశాయ్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మి దేశాయ్ తనపై అత్యాచారయత్నం జరిగిందని ఆరోపించింది. యశ్రాజ్ పేరుతో సురజ్ అనే వ్యక్తి తనను మోసం చేసేందుకు యత్నించినట్లు చెప్పింది. యశ్రాజ్ వద్ద తాను పని చేస్తున్నానని చెప్పి ఒక రోజు ఆడిషన్ కు పిలిచాడని చెప్పింది. ఈ సందర్భంగా అతడు తనను రేప్ చేయబోయాడని చెప్పింది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు వైరలవుతోన్నాయి.

తెలంగాణ బిజెపి అధ్యక్షుడి మార్పుపై కిషన్ రెడ్డి మోకాలడ్డు!

తెలంగాణలో నూతన బిజెపి అధ్యక్షుడి నియామకంలో జరుగుతున్న అసాధారణ జాప్యానికి కేంద్ర సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. బలమైన నాయుడుని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా చేస్తే తన ప్రాధాన్యత తగ్గిపోతుందని అడ్డు పడుతున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకనే ఎటువంటి ప్రభావం చూపలేకపోతున్న ప్రస్తుత అధ్యక్షుడు డా. కె లక్ష్మణ్ కొనసాగింపు కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది.

ముఖ్యంగా తన సామాజిక వర్గం నుండి ఈ పదవి కోసం ప్రయత్నం చేస్తున్న మాజీ మంత్రి డి కె అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి లకు పార్టీ సారధ్యం లభించకుండా జాగ్రత్త పడుతున్నారు. వీరిద్దరిలో ఎవరైనా మంచి వనరులు ఉన్నవారు కావడంతో తెలంగాణలో బలమైన నాయకులుగా ఎదిగి, భవిష్యత్ లో తన మంత్రి పదవికీ కూడా ఎసరు పెట్టవచ్చని జంకుతున్నట్లు చెబుతున్నారు.
ను సుదీర్ఘకాలం ఉమ్మడి ఏపీకి, తెలంగాణకు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ కిషన్ రెడ్డి తాను ఎమ్యెల్యేగా గెలుపొందిన అంబర్ పెట్ కె పరిమితమయ్యేవారనే ఆరోపణలున్నాయి.

పైగా కోమటిరెడ్డి వెంకట రెడ్డి వంటి బలమైన కాంగ్రెస్ నాయకులు పార్టీలో చేరకుండా అడ్డుపడుతూ వస్తున్నారు. మాజీ మంత్రి నాగం జనార్ధనరెడ్డి పార్టీ నుండి వెళ్లిపోవాలని కిషన్ రెడ్డి `సహాయ నిరాకరణే’ కారణం అని తెలుస్తున్నది. ఇక. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ను రాష్ట్ర అధ్యక్షుడిగా చేసే ప్రయత్నాలకు కూడా అడ్డు పడుతున్నట్లు తెలుస్తున్నది.

రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా లక్ష్మణ్ గత అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ సీట్లు అమ్ముకున్నారని ఆరోపణలు నేరుగా పార్టీ అధ్యక్షుడుగా ఉన్న అమిత్ షా వద్దకే వెళ్లాయి. మీడియా సమావేశాలకు తప్పా ప్రజలలోకి పార్టీని తీసుకు వెళ్లడంలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ విఫలం అవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

కరోనా ఎఫెక్ట్: హైటెక్ సిటీని ఖాళీ చేయిస్తున్న అధికారులు


రెండు రోజుల క్రితం తెలంగాణాలో వెలుగు చూసిన కరోనా కేసు ఇప్పుడు హైదరాబాద్ ని వణికిస్తోంది. హైటెక్ సిటీ లో ఉన్న మైండ్ స్పేస్ భవనం లో కరోనా వైరస్ సోకిన వ్యక్తులున్నారని వార్తలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ భవనం లో ఉన్న ఉద్యోగస్థులను ఖాళీ చేయిస్తున్నారు.

ఈ మైండ్ స్పేస్ భవనంలో 100కు పైగా సాఫ్ట్ వెర్ కంపెనీలలో ఉన్న ఉద్యోగస్థులందరిని వారి వారి గృహాలకు పంపిస్తున్నారు. ఇదే తరహాలో హై టెక్ సిటీలో ఉన్న మిగిలిన కంపెనీలలో ఉద్యోగస్తులను కూడా ఖాళీ చేయించే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పటివరకు భారత్ లో మొత్తం 28 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి హర్ష వర్ధన్ ప్రకటించారు. ఢిల్లీలో 6 కేసులు, జైపూర్‌లో ఒకటి, హైదరాబాద్ లో ఒకటి, కేరళలో 3 కేసులు నమోదైనట్లు మంత్రి తెలియజేసారు.

‘నేను ఈ పనులు చేయను, మీరు చేయొద్దు’ మోడీ సూచనలు


భారత్ లో రోజురోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సంవత్సర హోలీ పండుగ వేడుకల్లో తాను పాల్గొనటంలేదని మోడీ వెల్లడించారు. కరోనా వైరస్ తో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని, ఈ క్రమంలో సామూహిక సమావేశాలకు కూడా తాను హాజరుకావటంలేదని ట్విట్టర్ వేదికగా తెలిపారు.

అంతేకాకుండా కరోనా భయం వెన్నాడుతున్న క్రమంలో ప్రజలు కూడా సామూహికంగా జరిగే కార్యక్రమాలను దూరంగా ఉండాలని మోడీ
సూచించారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండటానికి ప్రజలంతా హోలీ వంటి వేడుకలకు దూరంగా ఉండాలని, బహిరంగ సమావేశాలను తగ్గించి ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని మోడీ తెలిపారు.

భారత్ కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి.. ఇప్పటిదాకా 6 కేసులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా జైపూర్‌లో ఇటాలియన్‌ టారిస్ట్‌ కు వైరస్‌ సోకినట్లు తేలింది. దీంతో అతడ్ని ఐసోలేటెడ్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

‘బాహుబలి’ని భయపెట్టిన కరోనా!

చైనాలో సోకిన కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంది. కరోనా పేరు చెబితేనే ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. 60కిపైగా దేశాల్లో విస్తరించిన కరోనా వైరస్ తాజాగా ఇండియాకు రావడంతో భారతీయులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కేంద్రం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నారు. ప్రత్యేకంగా రూ.100 కోట్ల నిధులు కూడా కేటాయించింది. దేశంలో 18 కరోనా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.

కరోనా వైరస్ దెబ్బతో అన్నిరంగాలపై ప్రభావం చూపుతుంది. ఈ వైరస్ భయంతో ఇప్పటికే విదేశాల్లో చేయాల్సిన షూటింగ్ లు ఆగిపోయాయి. తాజాగా కరోనా వైరస్ ‘బహుబలి’ ప్రభాస్ ను కూడా భయపెటింది. కరోనా వైరస్ పై ముందస్తుగా జాగ్రత్తగా డార్లింగ్ ప్రభాస్ మాస్క్ వేసుకొని బయటకు వస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ మాస్క్ తో ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో ప్రభాస్ జోడీగా ఫూజా హెగ్డే నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా సందర్భంగా ప్రభాస్ మాస్క్ లు ధరించి షూటింగ్లో పాల్గొన్నట్లు సమాచారం. ఈ మూవీ పూర్తయిన తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్ చేయనున్నాడు. ఇందులో ప్రభాష్ బాలీవుడ్ మూవీ ‘క్రిష్’ తరహా మాదిరిగా సూపర్ హీరో పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. వైజయంతీ మూవీస్ బ్యానర్లలో భారీ బడ్జెట్లో ఈ మూవీని తెరకెక్కించనున్నారు. ఇటీవలే చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ అధికారికంగా ఈ మూవీని ప్రకటించాడు. త్వరలోనే షూటింగ్ ప్రారంభించేందుకు చిత్రబృందం సన్నహాలు మొదలుపెట్టింది.

Eesha Rebba Latest Photos

‘ఆర్ఆర్ఆర్’ టైటిల్ ఇదేనంటా..?

మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో వస్తున్నా మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ఈ మూవీ ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు, ఈ మూవీ టైటిల్ ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టైటిల్ గా ‘రఘుపతి రాఘవ రాజారాం’ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ టైటిల్ ను రాజమౌళి కూడా ఓకే చేశారని సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఈ మూవీకి ఈ టైటిల్‌ కచ్చితంగా సరిపోతుందని భావిస్తున్నారాంట. ఈ మూవీ టైటిల్‌ను చిత్ర బృందం త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సినిమా  ఫస్ట్‌ లుక్‌లను మార్చి 27, మే 20 తేదీల్లో చరణ్‌, తారక్‌ల పుట్టిన రోజున రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం.

ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో, రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ నటి అలియా భట్, హాలీవుడ్ నటి ఓలియా ఈ మూవీ లో కథానాయికలుగా నటిస్తున్నారు. కీలక పాత్రలో సీనియర్ నటి శ్రియ, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ నటిస్తున్నారు. భారీ పీరియాడిక్ విజువల్ వండర్ గా ‘ఆర్ఆర్ఆర్’ మూవీ తెరకెక్కుతుంది. వీఎఫ్‌ఎక్స్‌కు ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉండటంతో ఇప్పటికే ఈ మూవీ విడుదల తేదీని వచ్చే ఏడాది జనవరి 8కి వాయిదా వేశారు.

రామ్ కు ‘ఐటమ్’గా మారిన హెబ్బా పటేల్

రామ్ నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ భారీ విజయం సాధించిన సంగతి తెల్సిందే. పూరి జగన్మాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’తో హీరో రామ్, దర్శకుడు పూరి మళ్లీ హిట్టు బాటపట్టారు. పూరి జగన్మాథ్, చార్మిలకు ‘ఇస్మార్ట్ శంకర్’ మంచి లాభాలను మిగిల్చింది. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత రామ్ చేస్తున్న మూవీ ‘రెడ్’. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది.

‘రెడ్’ మూవీలో రామ్ సరసన నివేదా పేతురాజ్, మాళవిక శర్మ, అమృతా అయ్యర్ నటిస్తున్నారు. తాజాగా మరో హాట్ బ్యూటీ ఒక స్పెషల్ సాంగ్లో కనిపించబోతుంది. ‘కుమారి 21ఎఫ్’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు హెబ్బా పటేల్ పరిచమైంది. ఈ మూవీలో హెబ్బా పటేల్ నటనకు కుర్రకారు ఫిదా అయ్యారు. యువతలో హెబ్బా పటేల్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. హబ్బా పటేల్ కు ఇటీవల నుంచి హీరోయిన్ గా అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో స్పెషల్ సాంగ్స్ పై దృష్టిసారించింది. దీంతో ‘రెడ్’ మూవీలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రామ్-హెబ్బాపటేల్ పై ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో తాజాగా పాటను చిత్రీకరిస్తున్నారు.

‘రెడ్’ చిత్రానికి తిరుమల కిషోర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్‌ ‘రెడ్’ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇటీవల ‘రెడ్’ చిత్రంలోని పాటలను ఇటలీలో చిత్రీకరించారు. హీరోయిన్ మాళవిక, రామ్ లపై అందమైన లోకేషన్లలో పాటలను చిత్రీకరించారు. మణిశర్మ అదిరిపోయే బాణీలను సమకూరుస్తున్నాడు. ‘రెడ్’ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఏప్రిల్ 9న సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తుంది.

సచివాలయం కూల్చివేతపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

సచివాలయం కూల్చివేతను సవాల్ చేస్తూ ప్రొఫెసర్ విశ్వేశ్వరావు, ఎంపీ రేవంత్ రెడ్డ్లు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ కొనసాగింది. ప్రస్తుత భవనాలు మరమ్మతులకు వీలు లేకుండా ఉన్నాయని ఇలానే కొనసాగిస్తే నిర్వాణకే ఏటా రూ.5కోట్ల వరకు ఖర్చువుతుందని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఈ విషయం పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ ఎ అనిషేక్‌రెడ్డిల ధర్మాసనం విచారణ కొనసాగించింది. ప్రభుత్వం విధాన నిర్ణయాలను తీసుకున్నపుడు అవి చట్టబద్ధంగా, సహేతుకంగా ఉన్నపుడు ఆ అంశాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను గుర్తుచేసింది.

ప్రస్తుతమున్న భవనాన్ని నవీకరించడానికి అవకాశం లేదని, కొత్తవి నిర్మించాలని నలుగురు ఇంజనీరింగ్ నిపుణులతో కూడిన కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ పేర్కొన్నారు. ఇంజనీర్ల కమిటీ ఆధారంగానే నూతన సచివాలయం నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళిక వేసిందని ఏజీ పేర్కొనగా, ఇంజనీర్ల కమిటీ ప్రభుత్వం చెప్పినట్టే నివేదిక ఇస్తుందని పిటిషనర్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తరఫున న్యాయవాది సత్యంరెడ్డి వాదించారు. ప్రభుత్వ ఆదేశాలతో నిపుణుల కమిటీ వారికి కావల్సినట్టే నివేదిక ఇచ్చిందని పిటిషనర్ పేర్కొన్నారు. సచివాలయం యథాతథ స్థితిని పరిశీలించి నివేదిక ఇచ్చేందుకు స్వతంత్ర కమిటీని నియమించాలని న్యాయస్థానాన్ని కోరారు. భవనాల మరమ్మతులకు, విద్యుత్ సౌకర్యానికి, అగ్నిమాపక ప్రమాదాలు జరగకుండా చూడాలంటే అందుకు సంబంధించిన సాంకేతిక అంశాల జోలికి తాము పోలేమని, నిపుణుల కమిటీ నివేదికను తాము పరిగణనలోకి తీసుకుంటామని న్యాయమూర్తులు పేర్కొన్నారు. నివేదిక ఎంత వరకూ వాస్తవం అనే అంశాల జోలికి తాము వెళ్లమని ఆ పని తమది కాదని పేర్కొన్నారు. సాంకేతిక అంశాల జోలికి తామెలా వెళ్తామని, తాము సాంకేతిక నిపుణులం కాదని ధర్మాసనం పేర్కొంది. ప్రతివాదుల వాదనలపై కౌంటర్ దాఖలుచేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

భారీ ధరకు అమ్ముడైన ‘ఆర్ఆర్ఆర్’

దర్శక దిగ్గజం రాజమౌళి భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ‘బహుబలి’ సీరీస్ తర్వాత దర్శకుడు రాజమౌళి సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. ‘బహుబలి’ సృష్టించిన కలెక్షన్ల దాటేలా రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ మూవీని తెరకెక్కిస్తున్నాడు. భారీ తారాగాణంతో ఈ మూవీని నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ తేదిని ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది. ‘ఆర్ఆర్ఆర్’ మూవీపై మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.

మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి నటిస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి తాజాగా సీడెడ్ ప్రాంతంలో భారీ ధర పలికినట్లు సమాచారం. ఈ చిత్రానికి సీడెడ్లో 35 కోట్ల మేర బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఓ చిత్రానికి భారీ మొత్తం పలుకడం తొలిసారట. ‘ఆర్ఆర్ఆర్’ మూవీకి కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

భారీ పీరియాడిక్ విజువల్ వండర్ గా ‘ఆర్ఆర్ఆర్’ మూవీ తెరకెక్కుతుంది. ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో, రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు. రాంచరణ్ కు జోడీగా అలియా భట్ నటిస్తుంది. ఎన్టీఆర్ కు జోడీగా హాలీవుడ్ నటి ఓలియా నటిస్తుంది. కీలక పాత్రలో సీనియర్ నటి శ్రియ, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ నటిస్తున్నారు. నిర్మాత డీవీవీ దానయ్య ఖర్చుకు ఏమాత్రం వెనుకడకుండా ‘ఆర్ఆర్ఆర్’ మూవీని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నట్లు తెల్సింది. ఒక్క సీడెడ్లోనే రూ.35కోట్ల ధర లభిస్తే ఇక వరల్డ్ వైజ్ గా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. ‘బహుబలి’ సినిమాలను మించేలా ‘ఆర్ఆర్ఆర్’ మూవీ బిజినెస్ చేయడం ఖాయంగా కన్పిస్తోంది.

Rakul Preet Singh Beautiful Pics

మహారాణిగా రెజీనా.. లుక్ అదిరింది..

‘నేనానా..?’ మూవీ ఫస్టు లుక్కును మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ విడుదల చేశారు. ఈ మూవీని రెజీనా కసండ్ర పాత్రను రిలీవ్ చేసేలా ఉన్న పోస్టర్ ఆకట్టుకుంది. ఇనుప చువ్వ‌ల మ‌ధ్యలో బంధీగా ఉన్న మ‌హారాణి పాత్ర‌ధారిగా రెజీనా కనబడుతుంది. మహారాణి గెటప్ లో రెజీనా లుక్ అదిరిపోయింది. రెజీనా న్యూ అవతారానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు..

రెజీనా కసండ్ర ప్రధాన పాత్రలో ‘నేనే నా..?’ మూవీ తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. ‘నిను వీడ‌ని నీడ‌ను నేనే’ మూవీతో ద‌ర్శ‌కుడు కార్తీక్ రాజు సూపర్ హిట్టు సాధించాడు. ఈ మూవీనే కార్తీక్ రాజు సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నాడు. యాపిల్‌ ట్రీ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నిర్మాత రాజ‌శేఖ‌ర్ వ‌ర్మ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

‘నేనా నా..? మూవీ ఫస్టు లుక్ విడుదల చేసిన వరుణ్ తేజ్ కు యూనిట్ త‌ర‌పున నిర్మాత రాజ‌శేఖ‌ర్ వ‌ర్మ స్పెష‌ల్ థాంక్స్‌ చెప్పారు. రెజీనా ఆర్కియాల‌జిస్ట్‌గా నటించనుంది. రెజీనాలోని కొత్త యాంగిల్‌ ను ఈ చిత్రంలో కనబడనుంది. సినిమా కోసం ఆమె స్పెష‌ల్‌గా ట్రైనింగ్ తీసుకుని యాక్ష‌న్ స‌న్నివేశాల్లో న‌టిస్తున్నారని దర్శకుడు కార్తీక్ రాజు తెలిపారు. ప్రస్తుతం ఈ చిత్రం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. త్వరలోనే షూటింగ్ పూర్తి చేయనున్నట్లు తెలిపారు.

కాంగ్రెస్ కు భారంగా మారిన రాహుల్ బ్రిగేడ్

`రాహుల్ బ్రిగేడ్’ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్ కు ఆశాదీపాలుగా చూసేవారు. దేశానికి ఆధునిక, యువ నాయకత్వం అందించే నేతలుగా గుర్తింపు పొందారు. ఇప్పుడు వారే పార్టీకి భారంగా మారారు. పార్టీ గురించి వారి నుండే విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి.

వివిధ రాష్ట్రాలలో సొంత పార్టీ ప్రభుత్వాలను, నాయకత్వాలు అస్థిర పరచడంలో వారే ముందుంటున్నారు. వారి కారణంగా రాహుల్ గాంధీ నాయకత్వం పట్ల పార్టీలో గుసగుసలు చెలరేగుతున్నాయి. 2004లో కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్ళ వ్యవధి అనంతరం తిరిగి అధికారమలోకి వచ్చినప్పుడు రాహుల్ గాంధీ వలే కుటుంభం వారసత్వం కారణంగా ఎంపీలుగా ఎన్నికైన పలువురు దేశ దృష్టిని ఆకట్టుకున్నారు.

సచిన్ పైలట్, జ్యోతిరాదిత్య సింధియా, మిలింద్ దేవర, సందీప్ దీక్షిత్, జితిన్ ప్రసాద వంటి వారు ఈ బ్రిగేడ్ లో ఉన్నారు. పార్లమెంట్ లో వారంతా ఎప్పుడు రాహుల్ గాంధీ చుట్టూ తిరుగుతూ ఉండేవారు. 2009లో వారిలో పలువురికి మంత్రి పదవులు లభించాయి. వారిని ఒకొక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పంపాలని కూడా రాహుల్ ప్రయత్నం చేశారు.

ఇప్పుడు వీరే పార్టీ నాయకత్వం పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడంలో ముందుంటున్నారు. రాహుల్ గాంధీ తమ ప్రయోజనాలను కాపాడటం లేదని అంటి నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీ నాయకత్వం పట్ల పార్టీలో, ప్రజలలో అనుమానాలు వ్యక్తం కావడానికి వీరే ప్రధాన కారకులవుతున్నాయి.

విచిత్రం ఏమిటంటే వారసత్వ రాజకీయాల నుండి పార్టీ బైట పడాలని వీరే కోరుతున్నారు. పార్టీకి సంస్థాగత ఎన్నికలు వెంటనే జరపాలని దీక్షిత్ కోరితే, ఆయనకు శశి థరూర్ మద్దతుగా నిలిచారు. ఢిల్లీలో పార్టీ పరాజయాన్ని కరోనా వైరస్ తో జైరాం రమేష్ పోల్చారు. ఢిల్లీలో ఆప్ విజయాన్ని మిలింద్ దేవర హర్షించారు.

మధ్య ప్రదేశ్ లో కమల్ నాథ్ నాయకత్వంలోని పార్టీ ప్రభుత్వంపై వీధి పోరాటాలకు సిద్ధం అంటూ సింధియా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రాజస్థాన్ లో అశోక్ గేహలోట్ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతే అప్పుడు ముఖ్యమంత్రి పదవి చేపట్టాల్నయి పైలట్ కలలు కంటున్నారు. గత లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమికి ఉప ముఖ్యమంత్రిగా ఉంది స్వయంగా పాటుపడ్డారు.

‘పిడికిళ్ల పలకరింపు’.. క్రికెట్ లో కరోనా రూల్..!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రకంపనల నేపథ్యంలో క్రికెట్ లోకి “ఫిస్ట్ బంప్ (పిడికిళ్ల పలకరింపు)” అనే కొత్త రూల్ రాబోతున్నట్లు తెలుస్తుంది. మొదటిగా ఈ రూల్ ని ఇంగ్లండ్ క్రికెట్ జట్టు అమలుపరచనుంది. మిగిలిన అన్ని క్రికెట్ జట్లు కూడా క్రికెట్ మైదానంలో అదే రూల్ ని ఫాలో అయినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు.

విషయం ఏమిటంటే.. ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆట ప్రారంభంలో కెప్టెన్ ల మధ్య కరచాలనం, ముగింపులో రెండు జట్ల మధ్య కరచాలనం ఇవ్వకూడదని ఆ క్రికెట్ జట్టు ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. దీనిని శ్రీలంక పర్యటనలో అమలు చేయనున్నట్లు ఆ జట్టు కెప్టెన్ జో రూట్ వెల్లడించాడు.

ఇంగ్లాండ్ జట్టు ఇటీవల దక్షిణాప్రికాలో పర్యటించిన క్రమంలో ఆ జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. ఇంగ్లండ్ జట్టు గాస్ట్రోఎంటరైటిస్, ఫ్లూతో బాధపడిందని జో రూట్ తెలిపారు. దక్షిణాఫ్రికాలో జట్టంతా అనారోగ్యం బారిన పడిన తరువాత తక్కువగా కాంటాక్ట్ కావాల్సిన అవసరాన్ని తాము గుర్తించామని రూట్ చెప్పారు. ఇప్పుడు శ్రీలంక పర్యటనలో తాము షేక్‌ హ్యాండ్‌ లకు బదులు పిడికిళ్లతో పలకరించుకుంటామని(ఫిస్ట్ బంప్) జో రూట్ తెలియజేసారు.

ముందు అనుకున్న ప్రకారం ఈ పర్యటన పూర్తిగా కొనసాగుతుందని అనుకుంటున్నామని.. అయితే, తమ జట్టు అధికారుల సలహా, సూచనల ప్రకారం ముందుకుసాగుతామని చెప్పారాయన. ఇంగ్లాండ్-శ్రీలంక రెండు టెస్టుల సిరీస్‌ కు ముందు నిర్వహించనున్న రెండు వార్మప్ మ్యాచుల్లో మొదటిది శనివారం కటునాయకే స్టేడియంలో జరగబోతోంది.

శ్రీలంకలో ఇంగ్లండ్ టూర్ షెడ్యూల్

  • మార్చ్ 7 – 9 : ఇంగ్లండ్ వర్సెస్ శ్రీలంక బోర్డ్ ప్రెసిడెంట్ XI, కటునాయకె స్టేడియం
  • మార్చ్ 12 -15 : ఇంగ్లండ్ వర్సెస్ శ్రీలంక బోర్డ్ ప్రెసిడెంట్ XI, కొలంబోలోని పీ సారా ఓవల్ మైదానం
  • మార్చ్ 19 – 23 : మొదటి టెస్ట్, గాలె
  • మార్చ్ 27 – 31 : రెండో టెస్ట్, కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియం