Home Blog Page 8605

కరోనాకు వార్నింగ్ ఇస్తున్న ఆర్జీవీ

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్శ తన దైన శైలిలో కరోనా వైరస్ పై స్పందించాడు. ‘డియర్ కరోనా వైరస్ అంటూ మొదలెట్టిన రాంగోపాల్ వర్శ.. ఏకంగా వార్నింగ్ ఇచ్చినంత పని చేశాడు. ‘మూగదానిలా అందరినీ చంపుకుంటూ పోతున్న డియర్ కరోనా నువ్వొక విషయం గుర్తించుకో.. నీవు ఒక పరాన్నజీవివి. మాతోపాటే నీవు కూడా చస్తావ్.. నీవు నా మాటలను నమ్మకపోతే.. వైరాలజీలో ఒక క్రాష్ కోర్సు తీసుకో.. నీకు ఇదే నా విన్నపం.. నువ్వు బ్రతుకు.. అందరినీ బతికించు.. నీకు జ్ఞానం కలుగుతుందని ఆశిస్తున్నా’ అంటూ ట్వీట్‌ చేశాడు. ఈ సెటైరికల్ ట్వీట్ ప్రస్తుతం వైరల్గా మారింది.

కాగా కొందరు సెలబెట్రీలు కరోనాపై కుళ్లు జోకులేస్తూ విమర్శలపాలవుతోన్నారు. తాజాగా కరోనాకు వెల్‌కమ్‌ అని చార్మి నిన్న టిక్‌టాక్‌ చేయగా నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెటిజన్లు ఆమెను ట్రోల్ చేయడంతో వెంటనే ఆ వీడియోను తొలగించింది. చివరి చార్మి చెప్పాల్సి వచ్చింది. అయితే కరోనా ప్రభావంతో ప్రజలు భయాందోళన చెందుతుంటే కొందరు వ్యాపారులు మాత్రం సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు. మెడికల్ షాప్‌ల యజమానులు మాస్క్‌ల ధరలను రూ.5 నుంచి ఏకంగా రూ.40కి పెంచారు. అయినప్పటికీ మెడికల్ షాపులకు మాస్కుల కోసం ప్రజలు క్యూ కడుతున్నారు. అయినప్పటికీ మాస్కులు దొరకని పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ప్రతీఒక్కరికి ఉచితంగా మాస్కులు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ముందే చేతులెత్తేసిన చంద్రబాబు నాయుడు

ఏపీ లో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగబోతుంది. అదీ ఈ నెలలోనే ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ ఎన్నికలను వైస్సార్సీపీ 9 నెలల పాలనకు రెఫరెండం గా భావిస్తుంది. ఈ ఎన్నికతో మీడియా లో జరుగుతున్న ప్రచారానికి తెర పెట్టాలని జగన్ భావిస్తున్నాడు. రాజధానిపై రగులుతున్న రగడ కూడా ఈ ఎన్నికల ఫలితాల తర్వాత సద్దుమణుగుతుందని వైస్సార్సీపీ అంచనా వేస్తుంది. దానితో తెలుగు మీడియాలో , జాతీయ మీడియా లో జరుగుతున్న ప్రచారానికి కూడా ఫులుస్టాప్ పెట్టొచ్చని పార్టీ వ్యూహకర్తలు భావిస్తున్నారు.

ఇదంతా సాఫీగా జరిగిపోతుందనుకున్న సమయంలో హైకోర్టు ఇప్పుడున్న రిజర్వేషన్లను 50 శాతానికి కుదిస్తూ తీర్పిచ్చింది. దీనివలన బీసీ రిజర్వేషన్లు ఇప్పటికన్నా తగ్గుతాయి. ఓ విధంగా ఈ తీర్పు ఊహించిందే. దేశవ్యాప్తంగా ఇటీవలికాలంలో రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా అనేక తీర్పులు వెలువడ్డాయి. చివరగా తెలుగురాష్ట్రమైన తెలంగాణ విషయం లోనూ సుప్రీమ్ కోర్టు ఇదే తీర్పిచ్చింది. ఆ నేపథ్యంలో తిరిగి సుప్రీం కోర్టు కెళ్ళినా ఇంతకుమించి ఒరిగేమీలేదని అందరికీ తెలుసు. కాకపోతే జనంకోసం ఒక ప్రయత్నం చేసినట్లు నటించటం మించి ప్రయోజనమేమీలేదని ఏమాత్రం న్యాయపరిజ్ఞానం వున్న అందరికీ తెలుసు. జగన్ మోహన రెడ్డి , చంద్రబాబు నాయుడుతో సహా. ఈలోపల కేంద్రం స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన డబ్బులు ఎన్నికలు జరగలేదు కాబట్టి పక్కన పెట్టేసింది. ఈ సంవత్సరం 15వ ఆర్ధిక సంఘం స్థానిక సంస్థలకు నిధులు బాగానే కేటాయించింది. ఆ ప్రయోజనం రాష్ట్రం పొందాలంటే ఎన్నికైన సంస్థలు ఉండాలి. అందుకనే ఆంధ్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లకుండా ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకుంది. దీనివలన రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు రావటంతో పాటు రాజకీయ లబ్ది పొందాలనేది కూడా జగన్ ఆలోచనగా వుంది.

మరి దీనికి మిగతా పార్టీలు సన్నద్ధంగా ఉన్నాయా? ప్రజారంగంలో బలాబలాలు తేల్చుకోవటం కంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రత్యామ్నాయమేముంది? కానీ తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు కి భయం పట్టుకుంది. ఇప్పటిదాకా పొరపాటున ఒకసారి జగన్ కి ఓటేసి చింతిస్తున్నారని, ప్రస్తుతం రాజధాని వ్యవహారంతో ప్రజలు జగన్ని వ్యతిరేకిస్తున్నారని అనేక వేదికలపై, పత్రికా సమావేశాల్లో చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో గనుక అసెంబ్లీ ఎన్నికల తీర్పేవస్తే చంద్రబాబు నాయుడుకి నైతికంగా దెబ్బే . అందుకే దీనిపై ఎలాగైనా ప్రతివ్యూహం వెయ్యాలని ఆలోచిస్తున్నాడు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పు అందివచ్చిన అవకాశంగా భావిస్తున్నాడు. జగన్ ప్రభుత్వం బీసీ వ్యతిరేకి కాబట్టే సుప్రీం కోర్టు కి వెళ్లకుండా 50 శాతం రిజర్వేషన్ తోనే ఎన్నికలకు వెళ్తున్నాడని ఎదురుదాడి ప్రారంభించాడు. ప్రభుత్వం వెళ్లకపోయినా మా తరఫున సుప్రీం కోర్టుకి వెళ్తామని ప్రకటించాడు. ఎలాగైనా తిరిగి బీసీ లను తమ వైపుకి తిప్పుకోవాలనే తాపత్రయం కనబడుతుంది. దానితోపాటు సుప్రీం కోర్టు గనక స్టే ఇస్తే బీసీ ల అభిమానాన్ని చూరగొనటంతోపాటు ప్రస్తుతానికి ఎన్నికల్ని ఎదుర్కోవాల్సిన పనివుండదని భావిస్తున్నాడు. అప్పుడు జగన్ పై ఇప్పుడుచేస్తున్న ప్రచారాన్ని ఇంకా గట్టిగా చేయొచ్చనేది ఆలోచన. అదే ఎన్నికలు జరిగితే ఇప్పటిదాకా మీడియా అండతో చేస్తున్న ప్రచారానికి తెరపడినట్లే కాబట్టి ఎలాగైనా ఎన్నికలు జరగకుండా చూడాలనేదే చంద్రబాబు వ్యూహం.

ఇంతకీ ఎన్నికలు జరిగితే ఫలితం ఎలావుండబోతుంది? ఇదే అందరి మెదడుల్లో తొలుస్తున్న బిలియన్ డాలర్ల ప్రశ్న. రాజధాని రైతుల ఆందోళనలతో ఆంధ్రా రైతాంగం జగన్ కి వ్యతిరేకంగా నిలుస్తారా? లేక విశాఖ పరిపాలనా రాజధానితో ఉత్తరాంధ్ర మొత్తం తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉప్పెనలాగా జగన్ వైపు నిలబడతారా? రాయలసీమ కు విశాఖ దూరం కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రచారానికి మద్దత్తు తెలుపుతారా? అసలు గుండెకాయలాంటి గోదావరి జిల్లాల ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు? ఇవి అందరి మనస్సుల్లో వున్న సందేహాలు. జగన్ కి ఈ 9 నెలల్లో తాను తీసుకున్న సంక్షేమ కార్యక్రమాలు, గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభం, మద్యపాన నియంత్రణ , ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనలాంటి పనులే గెలిపిస్తాయనే నమ్మకంలో వున్నాడు. అదే సమయంలో గుంటూరు, కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రాజధాని మార్పు ప్రభావం ఉంటుందని కూడా లోలోపల భయపడుతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద చూస్తే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాల్లో జగన్ కి పూర్తి అనుకూలంగా ఉండొచ్చునని ఆ పార్టీ వ్యూహకర్తలు అంచనా. అందుకనే చంద్రబాబు నాయుడు ఎన్నికలపై ఆందోళనగా వున్నాడని అర్ధమవుతుంది. ప్రజలు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి పై అంచనాలతో ఓట్లు వేయరని అందరికీ తెలుసు. ఇంకా అంత పరిణితి ప్రజల్లో లేదనేది వాస్తవం. ఆ విషయం చంద్రబాబు నాయుడు కి కూడా తెలుసు.

ఇకపోతే మిగతా పార్టీల అవకాశాలు ఎలా ఉంటాయి? మూడో ప్రత్యామ్నాయంగా బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రకటించాయి. కానీ ఇప్పుడున్న అంచనాల ప్రకారం ఈ కూటమి ఈ ఎన్నికల్లో అంత ప్రభావం చూపించే అవకాశంలేదు. ఇప్పటికీ ఈ కూటమి తెలుగుదేశం బి టీం అని వైస్సార్సీపీ చేసిన ప్రచారం నుండి బయటపడలేకపోతుందనేది వాస్తవం. రాజధాని వ్యవహారంలో ద్వంద వైఖరితో ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిందని చెప్పొచ్చు. ఇప్పట్నించీ వచ్చే నాలుగు సంవత్సరాల్లో వుమ్మడి కార్యక్రమాలు తీసుకొని ప్రజలదగ్గరకు వెళ్తే సాధారణ ఎన్నికల్లో ఫలితం ఉండొచ్చు. అంతేగానీ ఈ స్థానిక ఎన్నికలవరకు దీని ప్రభావం అంతగా ఉండదు. ఇక వామపక్షాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఘనచరిత్రకు వారసులుగా మిగిలిన ప్రస్తుత నాయకత్వం పూర్తిగా కనుమరుగైపోయింది చెప్పొచ్చు. ప్రజలు ఈ రెండు పార్టీలను విస్మరించారు. అందుకనే ప్రస్తుతానికి జగన్ కి తిరుగులేదని అనిపిస్తుంది. అదే జగన్ వ్యుహంకూడా. ఈ స్థానిక ఎన్నికలతో అటు తెలుగుదేశాన్ని, ఇటు రాజధాని సమస్యని ఒక కొలిక్కి తేవొచ్చని గట్టిగా నమ్ముతున్నాడు. అలాగే చంద్రబాబు అనుకూల మీడియా పై , మేధావి వర్గంపై ఏమాత్రం విశ్వసనీయత వున్నా అదికూడా ఈ ఫలితంతో పూర్తిగా జీరో అవుతుందని నమ్ముతున్నాడు. అదేసమయంలో చంద్రబాబు నాయుడు ప్రచారశైలి చూస్తే బరిలో ముందే చేతులెత్తేసి ఓటమిని పరోక్షంగా అంగీకరించాడని అర్ధమవుతుంది.

Payal Rajput Latest Photos

Kajal as Brand Ambassador for PriyaGold Oils

Kanulu Kanulanu Dochayante Succes Meet Photos

ఒరేయ్‌ బుజ్జిగా.. టీజ‌ర్

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న యూత్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా…`. అనూప్‌ రూబెన్స్ సంగీత సార‌థ్యంలో ఇటీవ‌ల విడుద‌లైన `కురిసెన.. కురిసెన..`పాట‌కి ట్రెమండ‌స్ రెస్పాన్ వచ్చింది. తాజాగా ఈ చిత్ర టీజ‌ర్ ను ప‌వ‌ర్‌ఫుల్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ విడుద‌ల చేశారు.

అమ్మాయిలు బాగా ముదుర్లబ్బా..రిక్వెస్ట్ పెట్టగానే చూస్తారు.. యాక్సెప్ట్ చేయడానికి మాత్రం రెండు రోజులు చేతులు పిసుక్కుంటారు అని రాజ్ తరుణ్ చెప్పే డైలాగ్ తో ప్రారంభ‌మ‌య్యే ఈ టీజ‌ర్ ఆద్యంతం హిలేరియ‌స్ గా ఆక‌ట్టుకుంది.

గవర్నర్ తో కెసిఆర్ భేటీ .. రెండు కీలక అంశాలపై చర్చ


తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఈ రోజు గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ ను రాజ్‌భవన్‌ లో మర్యాదపూర్వకంగా కలిశారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలకు మంత్రి మండలి ఆమోదం పొందిన ప్రతిని గవర్నర్ కి అందజేశారు కెసిఆర్. గవర్నర్‌ను సీఎం కేసీఆర్‌ కలిసి బడ్జెట్‌ సమావేశాలకు ఆహ్వానించారు.

ఈ నెల 6 నుంచి ప్రారంభం కానున్న శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై ప్రసంగించనున్నారు. కరోనా నియంత్రణ చర్యలను గవర్నర్‌ దృష్టికి సీఎం కేసీఆర్‌ తీసుకెళ్లారు.

ఈ నెల 6 (శుక్రవారం) ఉదయం 11 గంటలకు అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు మొదలవుతాయి. ఉభయసభల సంయుక్త సమావేశంలో గవర్నర్‌ ప్రసంగించిన తర్వాత బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశమవుతుంది. సభను ఎన్నిరోజులు నిర్వహించాలనే విషయాన్ని బీఏసీ సమావేశంలో ఖరారుచేస్తారు.

ఐపీఎల్‌ ప్రైజ్‌మనీ సగానికి సగంగా తగ్గింపు

బీసీసీఐ ఖర్చు తగ్గించుకోవడానికి కఠిన నిర్ణయం తీసుకుంది. మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న 13వ ఐపీఎల్‌ సీజన్‌ ప్రైజ్‌మనీని భారీగా తగ్గించింది. గత సీజన్‌తో పోలిస్తే సగానికి సగం తగ్గించడం గమనార్హం. ఈ విషయాన్ని బీసీసీఐ అన్ని ఫ్రాంఛైజీలకు తెలియజేసింది.

ఛాంపియన్‌గా నిలిచే జట్టుకు రూ.20 కోట్లకు బదులుగా రూ.10 కోట్లు మాత్రమే అందిస్తున్నట్లు తెలిపింది. ఖర్చులు తగ్గించే చర్యల్లో భాగంగా నగదు బహుమతిలో మార్పులు చేశాం. ఛాంపియన్‌గా నిలిచే జట్టుకు రూ.20 కోట్లకు బదులుగా రూ.10 కోట్లు లభిస్తాయి. రన్నరప్‌కు రూ.12.5 కోట్లకు బదులుగా రూ.6.25 కోట్లు దక్కుతాయి అని బీసీసీఐ వెల్లడించింది.

ఇక క్వాలిఫయిర్స్‌కు అర్హత సాధించిన మిగిలిన రెండు జట్లకు రూ.4.37 కోట్లు అందిస్తామని బీసీసీఐ పేర్కొంది. ప్రస్తుతం అన్ని ఫ్రాంఛైజీలు ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉన్నాయి. తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి స్పాన్సర్‌షిప్స్‌ వంటి మార్గాలు వారికి ఎన్నో ఉన్నాయి. అందుకే ప్రైజ్‌మనీపై ఈ నిర్ణయం తీసుకున్నాం అని బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు.

తమన్నాపై సమంత హాట్ కామెంట్

మిల్కీ బ్యూటీ తమన్నాపై అక్కినేని సమంత హాట్ కామెంట్ చేసింది. తమన్నా తెరపై ఉంటే అభిమానులు చూపు తిప్పుకోలేరని, ఆమె ఓ టపాకయ్.. కంగ్రాట్స్ డార్లింగ్ అంటూ సమంత ట్వీట్ చేసింది. తమన్నా వెండితెరకు పరిచయమై 15వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తమన్నాకు హీరోయిన్ సమంత ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఓ స్పెషల్ పోస్టు పెట్టింది.

ఓ బాలీవుడ్ సినిమాతో తమన్నా సినీరంగంలోకి ప్రవేశించింది. బుధవారంతో తమన్నా 15ఏళ్ల సినీ కెరీర్‌ను పూర్తి చేసుకుంది. తమన్నా తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో నటించింది మెప్పించింది. ‘శ్రీ’ మూవీతో తమన్నా తెలుగు ప్రేక్షకులకు పరిచమైంది. ఈ మూవీలో మంచు మనోజ్ కు జోడీగా నటించి మెప్పింది. ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శత్వంలో వచ్చిన ‘హ్యాపీ డేస్’ మూవీ తమన్నా కెరీర్ ను మలుపు తిప్పింది. ఈ సినిమా విజయంతో తమన్నా వరుస అవకాశాలు వచ్చాయి. వరుసగా అగ్రహీరోల సరసన నటించి మెప్పించింది. ఇటీవల మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్టు ‘సైరా’లో ‘లక్ష్మీ’ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది.

తమన్నాకు కుర్రకారులో భారీ ఫ్యాన్ పాలోయింగ్ ఉంది. అందం, అభినయంతోపాటు మాస్ స్టెప్పులతో తమన్నా అగ్ర కథానాయికగా ఎదిగింది. తమన్నాపై మరో హీరోయిన్ సమంత తన ప్రేమను చాటుకుంది. ‘15 అద్భుతమైన సంవత్సరాలు.. అందం, కష్టించేతత్వం, నిజాయితీ ఉన్న అతికొద్ది మంది వ్యక్తుల్లో తమన్నా ఒకరని కితాబిచ్చింది. స్క్రీన్‌పై ఆమె ఓ టపాకాయ్.. ఆమె నుంచి మీ చూపును తిప్పుకోలేరు.. కంగ్రాట్స్ డార్లింగ్` అంటూ సమంత ట్వీట్ చేసింది.

ఈ ట్వీట్‌కు తమన్నా స్పందిస్తూ `సమంత నా ప్రతి పనిలోనూ నువ్వే నాకు స్ఫూర్తి. పాత్రలను నువ్వు ఎంచుకునే విధానం, వాటిని తెరపై పోషించే తీరు నాకెంతో స్ఫూర్తిని కలిగిస్తాయి` అంటూ తమన్నా రీట్వీట్ చేసింది. ఇలా ఒకరిపై ఒకరు తమ ఇష్టాన్ని, ప్రేమను చాటుకోవడం వారి మధ్య ఉన్న స్నేహానికి అద్దం పడుతుంది.

‘బ్రాండ్‌ తెలంగాణ’:రైతులకు శుభవార్త చెప్పిన కెసిఆర్

తెలంగాణ అన్నదాతలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కెసిఆర్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బ్రాండ్‌ తెలంగాణ పేరుతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ (కల్తీలేని ఆహార పదార్థాల తయారీ) యూనిట్లును ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాల్లో పరిశ్రమలు స్థాపించి మహిళా సంఘాల ఆధ్వర్యంలో క్రయ విక్రయాలు జరుపుతారు. దీంతో రైతులకు గిట్టుబాటు ధరతో పాటు.. యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ మేరకు ప్రాథమిక నివేదికలు, ప్రణాళికలు జిల్లాల కలెక్టర్లు ప్రణాళికలు సిద్ధం చేశారు.

“బ్రాండ్‌ తెలంగాణ”తో చేకూరే ప్రయోజనాలు

  • అంతర్జాతీయ ప్రమాణాలతో సరుకుల తయారీ
  • కల్తీలేని ఆహార పదార్థాల తయారీ కేంద్రాల ఏర్పాటు
  • దేశ, విదేశాలకు ఎగుమతి
  • రేషన్‌ డీలర్ల ద్వారా రాష్ట్రంలో సరఫరా
  • పంటలవారీగా జిల్లాల్లో పరిశ్రమల స్థాపన
  • మహిళా సంఘాల ఆధ్వర్యంలో క్రయవిక్రయాలు
  • యువతకు ఉపాధి అవకాశాలు

బీరుపై ప్రేమను చాటుకున్న మళయాళ బ్యూటీ

మళయాళ బ్యూటీ వీణా నందకుమార్ అభిమానులకు బీరు పాఠాలను చెబుతుంది. బీరుపై తనకున్న ఇష్టం, ప్రేమను ఓ ఇంటర్వ్యూలో వ్యక్తం చేశారు. ‘చాలామంది యువతకు ఈ రోజుల్లో బీరు తాగడం అలవాటుగా మారిందని’ చెప్పింది. బీరు తాగడం నేరమేమీ కాదని.. తాను బీరు తాగతానని చెప్పడానికి ఎందుకు భయపడాలి? అంటూ ఎదురు ప్రశ్నిస్తుంది ఈ ముద్దుగుమ్మ. వీణా కామెంట్లపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తుంది.

వీణా నందకూమార్ తాజాగా నటించిన చిత్రం ‘కెట్టోయ్ లాన్ ఎంటె మాలఖా’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలో ‘వీణా రిన్సీ’ అనే పాత్రలో నటించి విమర్శకులు ప్రశంసలు అందుకుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్య్వూలో ఆమె తనకున్న డ్రింకింగ్ అలవాటును వెల్లడించారు. ‘బీరు తాగడమంటే నాకెంతో ఇష్టం’ అంటూ బీరుపై తన ప్రేమను చాటుకుంది. ‘బీరు తాగి నేనేవరినీ ఇబ్బంది పెట్టలేదని.. నా వ్యక్తిగత అవసరాల కోసం నేను బీరుతాగుతున్నా’ అంటూ వివరించింది. ఈ కామెంట్లపై ఆమెకు కొందరు మద్దతు ఇస్తుండగా మరికొందరు విమర్శిస్తున్నారు.

సెలబెట్రీలు తమకున్న చెడ్డ అలవాట్లను అభిమానులు చెబితే వాళ్లు చెడిపోయే ప్రమాదం ఉందని పలువురు అంటున్నారు. అయితే ఇలాంటి విషయాల గురించి సినీతారలు చెప్పడం ఇదే మొదటిసారి కాదు. గతంలో శృతిహాసన్ కూడా తనకు వైన్ అంటే బాగా ఇష్టమని చెప్పింది.. ఆ తర్వాత ఆరోగ్యం దృష్ట్యా మానేసినట్లు శృతిహాసన్ చెప్పింది. బీరు తాగే యువత మాత్రం వీణా నందకుమార్ కు సపోర్ట్ చేస్తున్నారు. వీరి సంఖ్య బాగానే ఉంది. ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఎవరికీ ఇష్టమైన అలవాట్లు పాటించడంలో తప్పేమీ లేదని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఆ ఒక్క విషయంలో జగన్ కి మద్దతిచ్చిన చంద్రబాబు!


ఏపీ సీఎం జగన్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకించే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక విషయంలో ఆయనకు మద్దతిస్తున్నట్లు తెలిపారు. అదే విషయాన్ని చంద్రబాబు లేఖ రాసి మరీ జగన్ కి తెలియజేసారు. ఎన్నికల రిజర్వేషన్ లలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టుకు వెళ్లాలని జగన్ ని కోరారు. అందుకు టీడీపీ కూడా మద్దతిస్తుందని హామీ ఇచ్చారు.

గ్రామ పంచాయతీ, మండల, జిల్లాపరిషత్‌, మున్సిపల్‌ సంస్థల ఎన్నికలలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జగన్‌ ప్రభుత్వం జారీ చేసిన జీఓఎంఎస్‌ నంబరు 176ను హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే.. అదే విధంగా బీసీలకు కేటాయించిన 34 శాతం రిజర్వేషన్లను కూడా న్యాయస్థానం తోసిపుచ్చింది. దీనికి సంబంధించిన పంచాయతీరాజ్‌ చట్టం 1994లోని సెక్షన్‌ 9, 15, 152, 180ను రద్దు చేసింది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెలువరించింది.

ఇదే విషయాన్ని చంద్రబాబు తన లేఖలో ప్రస్తావిస్తూ..అన్ని రాజకీయ పార్టీలు, బీసీ సంఘాల నాయకులతో సంప్రదింపులు జరిపి 34% రిజర్వేషన్లను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. బీసీ సాధికారత కాపాడటం ముఖ్యమంత్రిగా ధర్మమని.. ఇప్పటికైనా తక్షణమే స్పందించి 34% బీసీ రిజర్వేషన్ల పరిరక్షణకి రాష్ట్ర ప్రభుత్వం తరుపున సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వెంటనే వేయాలని, ఇందుకు తెలుగుదేశం పార్టీ నుంచి అన్ని రకాలుగా మద్దతు ఇస్తామని చంద్రబాబు తెలిపారు.

Ritu Varma Photo Stills

ఐపీఎల్‌ పై కరోనా నీడ… హోలికి ప్రధాని దూరం

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ (కొవిడ్‌-19) భారత్‌ను కూడా కలవరపెడుతోంది. భారత్‌లో కరోనా కేసులు నమోదు కావడంతో మార్చి 29 నుంచి ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ నిర్వహణపై సందేహాలు మొదలయ్యాయి. అయితే ఐపీఎల్‌కు కరోనా ప్రభావం లేదని, షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహిస్తామని ఐపీఎల్‌ ఛైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ తెలిపారు.

ఇప్పటివరకు ఐపీఎల్‌కు ఎటువంటి కరోనా ముప్పులేదు. అయితే దానిపై దృష్టిసారిస్తాం అని వెల్లడించారు. షెడ్యూల్‌ ప్రకారంకూడా ఐపీఎల్‌ 13వ సీజన్‌ మార్చి 29 నుంచి మే 24 వరకు జరుగుతుంది.

బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ కూడా ఈ విషయంపై స్పందించాడు. దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌, ఐపీఎల్‌ యథావిధిగా జరుగుతాయని చెప్పారు. భారత్‌లో ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పటివరకు కరోనా వైరస్‌ గురించి చర్చించలేదు అని తెలిపాడు.

మరోవంక, కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు సామూహిక సమావేశాలు తక్కువగా చేయాలని ప్రపంచ దేశాలు సూచిస్తూ ఉండడంతో ఈ ఏడాది హోలీ వేడుకల్లో పాల్గొనడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు. ఒకే ప్రదేశంలో వేలాది మంది సామూహికంగా హోలీ వేడుకలను నిర్వహించుకుంటున్న విషయం విదితమే.
ఉత్తర భారతదేశంలో హోలీని ఘనంగా నిర్వహిస్తారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న క్రమంలో హోలీ వేడుకల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని ప్రధాని కోరారు.

భారత్ లో కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య 21కి చేరింది. 21 మందిలో 14 మంది ఇటలీ పర్యాటకులు, ఒక ఇండియన్‌ (ఇటలీ పర్యాటకుల గ్రూపులో ఉన్న వ్యక్తి), ముగ్గురు కేరళ వాసులు, ఒకరు ఢిల్లీ, ఒకరు ఆగ్రా, మరొకరు హైదరాబాద్‌కు చెందిన వారు ఉన్నారు. కేరళలోని ముగ్గురు వ్యక్తులు కరోనా వైరస్‌ నుంచి ఉపశమనం పొంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.

సుకుమార్-నిఖిల్ మూవీ టైటిల్ రిలీజ్ డేట్ ఫిక్స్ !

వరుస సినిమాలతో బిజీ ఉన్న హీరో నిఖిల్ ప్రస్తుతం చందు మెుండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ’ సినిమాకు సీక్వెల్ కార్తికేయ2 సినిమా తెరకెక్కనుంది. ఇటీవలే ఈ సినిమా తిరుమ‌ల తిరుప‌తి లో పూజాకార్య‌క్ర‌మాల‌తో లాంఛనంగా ప్రారంభించారు. ఇక షూటింగ్ ఉగాది నుంచి మొదలవతుంది. ఫస్ట్ షెడ్యూల్ తిరుపతిలో ప్రారంభిస్తున్నారు.

ఇక ఇప్పుడు మరో సినిమాకు సంబంధించి అప్ డేట్ వచ్చేసింది. ‘కుమారి 21ఎఫ్’ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా టైటిల్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. రేపు ఉదయం (మర్చి 5) 9 గంటలకు ఈ సినిమా టైటిల్ ను ప్రకటించనున్నారు.

నగరంలో తెరలేచిన మాస్కుల దందా

కరోనా వైరస్ ప్రభావంతో ప్రజలు ఓ వైపు బెంబేలెత్తిపోతుంటే.. సందట్లో సడేమియాగా మరోవైపు మాస్కులు దందా మొదలైంది. చైనా సోకిన కరోనా వైరస్(కోడ్-19) క్రమంగా అన్నిదేశాలకు విస్తరిస్తుంది. ఇప్పటికే 60దేశాల్లో కరోనా కేసులు నమోదైనట్లు సమాచారం. కరోనా వైరస్ ప్రభావంతో ఇప్పటికే 3వేల మంది మృత్యువాతపడ్డారు. 90వేలపైగా కరోనా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మహ్మమ్మరి ఇండియాలోకి ప్రవేశించడంతో భారతీయులు ఆందోళన చెందుతున్నారు.

కరోనా వైరస్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ నగరానికి చేరుకుంది. సికింద్రాబాద్‌లోని మహేంద్రహిల్స్‌కు చెందిన ఓ వ్యక్తి కరోనా సోకి బాధపడుతున్నాడు. దీంతో ఆ కాలనీలో ఉన్న స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ అధికారులు మహేంద్రహిల్స్‌లో ముమ్మరంగా పారిశుధ్య పనులు చేపట్టారు. అయినప్పటకీ కాలనీ వాసులు భయాందోళన చెందుతున్నారు. ఇదే అదునుగా భావించిన నగరంలోని కొన్ని మెడికల్‌ షాపుల నిర్వాహకులు మాస్కుల దందాకు తెరలేపినట్లు తెలుస్తోంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మాస్కులు ధరించాలని సూచిస్తుంటంతో ప్రజలు మాస్కులు కొనేందుకు ఇంట్రస్ట్ చూపుతున్నారు. దీంతో సాధారణంగా రూ.5 ఉండే మాస్కులను రూ.20కి విక్రయిస్తున్నారట. కొందరు మెడికల్ షాపుల నిర్వాహకులు మాస్కులు, శానిటైజర్‌లు ఉంచుకొని కూడా అమ్మడం లేదని సమాచారం. ఇదిలా ఉండగా నగరంలోని ఒమెగా ఆస్పత్రి మెడికల్‌ షాపులో ఓ వ్యక్తి మాస్క్‌ కావాలని అడగగా ప్రిస్ర్కిప్షన్‌ లేనిది ఇవ్వబోమని చెప్పడం గమనార్హం. ఓవైపు కరోనా వైరస్ సోకుతుందని భయాందోళన చెందుతుంటే నగరంలో పలు మెడికల్‌ షాపుల్లో అధిక ధరలకు మాస్కులు విక్రయించడం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోని ప్రజలందరికీ ఉచితంగా మాస్కులు పంపిణీ చేయాలని కోరుతున్నారు.

వ్యభిచార గృహంలో పట్టుబడ్డ జబర్దస్త్ కమెడియన్స్

ఈటీవీలో వచ్చే ‘జబర్దస్త్’ ప్రోగ్రామ్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇక ముఖ్యంగా హైపర్ ఆది టీమ్ కు అయితే విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. యూట్యూబ్ లో ఎక్కువ వ్యూస్ సంపాదించే వారిలో హైపర్ ఆది ముందు వరుసలో ఉంటారు. ఇప్పుడు హైపర్ ఆది టీమ్ కు చెందిన ఇద్దరు “జబర్దస్త్” ఆర్టిస్ట్ లు దొరబాబు, పరదేశిలు ఒక వ్యభిచార గృహంలో పట్టుబడ్డారు.

విశాఖపట్నం మాధవధారలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతుందన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించగా ఈ దాడుల్లో దొరబాబు, పరదేశి పట్టుబడ్డారు. వీరితో పాటు మరొక ఏడుగురిని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టినట్లు తెలుస్తుంది.