
రెండు రోజుల క్రితం తెలంగాణాలో వెలుగు చూసిన కరోనా కేసు ఇప్పుడు హైదరాబాద్ ని వణికిస్తోంది. హైటెక్ సిటీ లో ఉన్న మైండ్ స్పేస్ భవనం లో కరోనా వైరస్ సోకిన వ్యక్తులున్నారని వార్తలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ భవనం లో ఉన్న ఉద్యోగస్థులను ఖాళీ చేయిస్తున్నారు.
ఈ మైండ్ స్పేస్ భవనంలో 100కు పైగా సాఫ్ట్ వెర్ కంపెనీలలో ఉన్న ఉద్యోగస్థులందరిని వారి వారి గృహాలకు పంపిస్తున్నారు. ఇదే తరహాలో హై టెక్ సిటీలో ఉన్న మిగిలిన కంపెనీలలో ఉద్యోగస్తులను కూడా ఖాళీ చేయించే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పటివరకు భారత్ లో మొత్తం 28 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి హర్ష వర్ధన్ ప్రకటించారు. ఢిల్లీలో 6 కేసులు, జైపూర్‌లో ఒకటి, హైదరాబాద్ లో ఒకటి, కేరళలో 3 కేసులు నమోదైనట్లు మంత్రి తెలియజేసారు.