భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను తూచతప్పకుండా పాటిస్తే కరోనా(కొవిడ్-19) నివారించవచ్చు. భారతదేశం పల్లెలకు పుట్టినిల్లు. పల్లెల్లోని పరిశుభ్రత వాతావరణం, అక్కడి ఆచారాలు ఈ వైరస్ ను గ్రామాల్లోకి రానివ్వకుండా చేయగలవు అనేది తాజాగా వెల్లడైంది. ప్రపంచ దేశాలు వైరస్ నివారణ చేపడున్న చర్యలు గమనించినట్లయితే ఈ చర్యలన్నీ భారతీయులు నిత్యం పాటించే అలవాట్లేనని చెప్పక తప్పదు. అయితే భారతదేశం పాశ్చత్య ధోరణిలో పడిపోవడంతో గతంలో పెద్దలు ఆచరించిన అలవాట్లను మరిచిపోయి కొత్త అలవాట్లను నేర్చుకుంటున్నారు. ఈ పాశ్చత్య అలవాట్లే భారతదేశంలోకి కరోనా ఎంట్రీ మార్గం సుగమం చేశాయి.
భారతదేశం కర్మభూమిగా పేరొందింది. అయితే కొన్ని సంవత్సరాల నుంచి పాశ్చత్య సంప్రదాయ మోజులో భారతీయులు పడిపోయారు. వివిధ దేశాల సంస్కృతిని అరువు తెచ్చుకొని మరీ జబ్బులు తెచ్చుకోవాల్సిన కర్మ పట్టింది. భారతదేశంలోని పల్లెల సంస్కృతి మాయమై పట్టణీకరణ దిశగా పరుగులు పెడుతుంది. పట్టణీకరణ పేరుతో పచ్చని చెట్లను నాశనం చేస్తున్నారు. పారిశ్రామీకీకరణ పేరుతో పొగ గొట్టాలను ప్రజల మధ్యల్లో పెట్టి కాలుష్యాన్ని పెంచి పోషిస్తున్నారు. ప్లాస్టిక్ ను, రకరకాలైన రసాయానలతో చేసే వస్తువులను, పదార్ధాలను విచ్చలవిడిగా వాడటం వలన కూడా ప్రజలు కొత్తకొత్త వైరస్ ల వలన జబ్బులు బారిన పడటానికి కారణమవుతున్నాయి.
ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా తాజాగా ఇండియాకు చేరుకుంది. ఇప్పటికే భారతదేశంలో 18 కరోనా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. చైనాలో ముగ్గురు కేరళ వైద్య విద్యార్థులకు కరోనా వైరస్ సోకగా వారిని తిరిగి భారత్ కు పంపించారు. అయితే వీరిని కేరళ వైద్యబృందం ప్రత్యేక వైద్యం అందించింది. తాజాగా వీరు కరోనా వైరస్ నుంచి కోలుకున్నట్లు ప్రకటించింది. కేరళ వైద్యం కరోనాను కట్టడి చేసినట్లయింది.
భారతీయ సంస్కృతిని ప్రతీఒక్కరూ అలవాటు చేసుకుంటే కరోనా మహమ్మారి నుంచి బయటపడవచ్చు. భారతీయులు ఎవరైన పలకరించేటప్పుడు రెండు చేతుల నమస్కారం పెట్టడం అలవాటు. కరోనా నివారణకు ఒకరి నుంచి మరొకరికి సోకకుండా ఉండేందుకు ఈ అలవాటు దోహదపడుతుంది. అలాగే ఏవరైనా ఇంటికి మన ఇంటికి వచ్చినపుడు కాళ్లు కడుక్కునేందుకు నీళ్ల ఇస్తాం. వాళ్లు ఇంటి బయటనే కాళ్లు, చేతులు కడుక్కొని ఇంట్లోకి వస్తారు. ఈ అలవాటు వల్ల కరోనా వైరస్ ఇంటి లోపలికి వచ్చే అవకాశం లేదు. అలాగే ఇంటి ముందే మహిళలు కల్లకు చల్లి, ముగ్గులు పెడుతుంటారు. వీటివల్ల సూక్ష్మ క్రిములు ఇంటి బయటే నాశిస్తాయి.
అలాగే మన ఆహార అలవాట్లలో పసుపును వాడుతుంటారు. పసుపు లేకుండా ఏ వంటను భారతీయులు వాడరు. ఇది మన శరీరానికి యాంటీ బయోటిక్ గా పని చేస్తుంది. అలాగే మన వంటల్లో అల్లం, మిరియాలు వాడుతుంటారు. ఇవి కూడా కరోనాకు మంచి యాంటీ బయోటిక్ గా పనిచేస్తాయని వెల్లడైంది. భారతీయలు దేవుడిని ఎక్కువగా నమ్ముతుంటారు. దీంతో వ్యక్తిగతంగా పరిశుభ్రతను పాటిస్తుంటారు. ఇవన్నీ కూడా కరోనా కట్టడికి ఎంతగానో దోహదపడుతాయి. అయితే గత కొన్నాళ్లుగా మనం పాశ్చత్య ముసుగులో పడిపోవడంతో కరోనాకు భారతదేశంలోకి ఎంట్రీ దొరికింది.
కరోనా లాంటి మహమ్మరిని తరిమివేయడం భారతీయులకు ఎంతో తేలిక. మన ఆచారాలను తూచ తప్పకుండా పాటిస్తే కరోనా వైరసే కాదు.. ఎలాంటి వైరస్ అయిన భారతీయులను ఏమి చేయలేదనేది అక్షర సత్యం. భారతీయులు మరోక్కసారి ప్రపంచానికి మన సంస్కృతి గొప్పతనం గురించి తెలియజేయాల్సిన సమయం వచ్చింది. ఎప్పటి నుంచో మన పూర్వీకులు ఆచరిస్తున్న ఆచారాలను మన భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనపైనే ఉంది.