కరోనా వైరస్ సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థను, పారిశ్రామికరంగాన్ని ఆదుకొనేందుకు పన్నులను, వడ్డీరేట్లను తగ్గించడంతోపాటు రూ.2 లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపనలను ప్రకటించాలని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కరోనా వైరస్ వల్ల తలెత్తిన మందగమనం, సరఫరాల వ్యవస్థలో తలెత్తిన సమస్యలతో వ్యాపారాలకు భారీ విఘాతం కలిగిందని, రియల్ ఎస్టేట్, పౌరవిమానయానం, పర్యాటకం, ఆతిథ్యం లాంటి రంగాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు.
ఈ విపత్కర పరిస్థితి నుంచి ప్రజలను గట్టెక్కించేందుకు జీడీపీలో 1 శాతం (రూ.2 లక్షల కోట్ల) మొత్తాన్ని ఆధార్ ఆధారిత ప్రత్యక్ష లబ్ధి బదిలీ పథకం ద్వారా ఆర్థిక ఉద్దీపనల రూపంలో అందజేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలించాలని ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో సీఐఐ విజ్ఞప్తి చేసింది. దేశంలోని ప్రతి పౌరునికి రూ.5 వేలు, ప్రత్యేకించి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేదలకు రూ.10 వేల చొప్పున ఈ ఉద్దీపనలను అందజేయాలని సూచించింది.
‘ప్రజల్లో ఆర్థిక భయాలను తొలిగించాలన్న లక్ష్యంతో మేము ఈ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రత్యక్ష లబ్ధి బదిలీ పథకం ద్వారా ప్రజలకు డబ్బు అందజేయగలిగితే నిజంగా వారికి ఎంతో మేలుచేసినట్టే. ముఖ్యంగా దీనివల్ల సమాజంలోని అట్టడుగు వర్గాలవారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది’ అని బెనర్జీ తెలిపారు. దీర్ఘకాలిక మూలధన లాభాలపై వసూలు చేస్తున్న 10 శాతం పన్నును తొలిగించడంతోపాటు మొత్తం డివిడెండ్ పన్నును 25 శాతంగా ఖరారుచేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలించాలని ప్రధానికి రాసిన లేఖలో సీఐఐ కోరింది.
ఇలా ఉండగా, కరోనా కాటుతో కుదేలైన వివిధ రంగాలను ఆదుకొనేందుకు సాధ్యమైనంత త్వరలో ఆర్థిక ప్యాకేజీని ప్రకటించనున్నట్టు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తితో దేశంలో నెలకొన్న పరిస్థితిని సమీక్షించేందుకు ఆమె నాలుగు శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. నాలుగు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో పౌరవిమానయాన, పశుసంవర్ధక, పర్యాటక, ఎంఎస్‌ఎంఈ (సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల) శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ భేటీలో వివిధ అంశాలపై చర్చించామని, ఆయా శాఖల నుంచి తమకు వచ్చిన సూచనలను క్రోడీకరిస్తున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. కరోనా సంక్షోభాన్ని అధిగమించేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు ఆర్థికశాఖ శనివారం అంతర్గత సమావేశాన్ని నిర్వహించనున్నదని ఆమె చెప్పారు.
ఆర్థిక ప్యాకేజీని ఎప్పుడు ప్రకటిస్తారని విలేకర్లు ప్రశ్నించగా.. దీనికి గడువును నిర్దేశించడం కష్టమని, సాధ్యమైనంత త్వరలో ప్యాకేజీని ప్రకటిస్తామని తెలిపారు. ఈ టాస్క్‌ఫోర్స్‌ను ఇంకా ఏర్పాటుచేయలేదని, దీన్ని అత్యవసరంగా ఏర్పాటుచేయాల్సిన ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకొనే తాము సమావేశాన్ని నిర్వహించామని చెప్పారు.


మధ్య ప్రదేశ్ రాజకీయాలు ఇంకో కర్ణాటకని గుర్తుకుతెచ్చాయి. ఈ చదరంగంలో కాంగ్రెస్ ఓడి బీజేపీ గెలిచింది. రేపోమాపో తిరిగి శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి కావటం ఖాయం. ఈ సారి ఇందుకు ప్రధాన కారణం జ్యోతిరాదిత్య సింధియా. తిరిగి మధ్యప్రదేశ్ లో అధికారాన్ని దొడ్డిదారిన చేజిక్కించుకోవటానికి ఒక రాజ్య సభ సీటు, కేంద్రం లో మంత్రి పదవి ఇవ్వటానికి ఒప్పందం చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చటంతో బీజేపీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవటం మనం చూస్తున్నాము. వరసగా మహారాష్ట్ర, ఝార్ఖండ్, ఢిల్లీ ప్రభుత్వాలు పరుల పాలుకావటంతో డీలా పడిన శ్రేణులకు ఇది ఓ టానిక్కే . అంతవరకూ అధికారపు ఆటలో విజయంగానే చూడాలి. కాకపోతే మొదట్నుంచీ ఇటువంటి కాంగ్రెస్ రాజకీయాలను వ్యతిరేకించి మోడీకి మద్దతిచ్చిన వారిలో ఈ రాజకీయ క్రీడపై అంత ఉత్సాహం లేనిమాట నిజం.







ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కరోనా వైరస్ విపత్తు అరికట్టే క్రమం లో తెలంగాణ ప్రభుత్వం మార్చ్ 31 వరకు థియేటర్ల మూసివేతకు తీసుకొన్న నిర్ణయానికి సంసిద్ధత ని వ్యక్తం చేస్తూ మార్చ్ 15 వ తారీఖున హైదరాబాద్ లోని ఫిలిం నగర్ లోఉన్న ఫిలిం ఛాంబర్ లో టి ఎఫ్ సి సి సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ సమావేశం లో మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ) , నిర్మాతల మండలి మరియు సినీ రంగం లోని ఉద్యోగుల సమాఖ్య యొక్క 24 శాఖల ప్రతినిధులు కలిసి మార్చ్ 21 వ తారీకు వరకు తమ తమ షూటింగ్ లను నిలిపి వేసేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది .
స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవడం ద్వారా గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అవి వాయిదా పడటంతో ఆయన తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. ఎన్నికల కోసం క్షేత్ర స్థాయిలో ప్రణాళికలు రచించింది. అందులో భాగంగానే ఎన్నికల్లో విజయం సాధించని నియోజకవర్గాల మంత్రులు వెంటనే రాజీనామాలు చేయాల్సి ఉంటుందని సీఎం హుకుం జారీ చేశారు. ఎమ్మెల్యేలకు అయితే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. అధిష్టానం అలాంటి నిర్ణయం ప్రకటించడంతో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. యథేచ్ఛగా హింసకు తెర తీశారు. ఎక్కడికక్కడ అరాచకాలు సృష్టించడంతో జెడ్పీటీసీలు 652 స్థానాల్లో 126, 9, 696 ఎంపీటీసీల్లో 2, 362 స్థానాల్లో ఏకగ్రీవం చేయగలిగారు. ఒక్క కడప జిల్లానే తీసుకుంటే 50 జెడ్పీటీసీల్లో 38, 553 ఎంపీటీసీల్లో 439 స్థానాలు ఏకగ్రీవం కావడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ అంశాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా సీరియస్ గా తీసుకుంది. ఎన్నికల్లో ఓటింగ్ జరగక ముందే ఇన్ని స్థానాలను ఏకగ్రీవం చేసుకోవడంతో పాటు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంతో సిద్ధంగా ఉన్న వైసీపీకి ఎన్నికలు ఆరు వారాలు వాయిదా పడటం ఇబ్బంది కరంగా మారింది. అధికారం చేపట్టిన పది నెలల్లో ఎన్నో సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నా ఏనాడూ ప్రెస్ మీట్ పెట్టని ముఖ్యమంత్రి స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన వెంటనే నిర్వహించడం విశేషం.
రాష్ట్రంలో టిడిపికి గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వైసిపి అధికారం చేపట్టిన నాటి నుంచి టీడీపీ సీనియర్ నాయకులు ఒక్కొక్కరిగా ఆ పార్టీని విడిచి వెళ్లిపోవడంతో అధినేత చంద్రబాబు నాయుడులో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. బాబు ఒక నాయకుడు వెళితే వంద మంది నాయకులు తయారు చేస్తానని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. గత ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందే కొందరు టిడిపి నాయకులు వైసీపీ తీర్థం పుచ్చుకోగా, ఎన్నికల అనంతరం వైసీపీ అధికారంలోకి రావడంతో జంపు జిలానీల సంఖ్య మరింత పెరిగింది. వైసీపీ ప్రభుత్వం టిడిపి నేతలపై పెడుతున్న కేసులు, ఇతర వేధింపుల కారణంగా టిడిపి సీనియర్ నాయకుడు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరికొందరు నాయకులు జైలు జీవితాన్ని గడపాల్సి వచ్చింది. ఈ పరిస్థితిని చూసిన టిడిపిలోని ఇతర నాయకులు ఇబ్బందులను తెచ్చుకోవడం ఎందుకని వైసీపీ నేతలతో ముందే మంతనాలు జరిపి ఆ పార్టీలో చేరుతున్నారు.


మగువ మగువా పాటతో మరోసారి విజయ బావుటా ఎగరేసిన గాయకుడు సిద్ శ్రీరామ్ పరిస్థితి పట్టిందల్లా బంగారం లా తయారైంది . ఈ మధ్య కాలంలో సింగర్ గా సిద్ శ్రీరామ్ పాడిన ప్రతి పాట సంచలనం గా మారుతోంది రీసెంట్ గా ఈ గాయకుడు పాడిన . ‘ఉండిపోరాదే ..’ .. ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే .. ‘ .. ‘సామజ వర గమన’ .. ‘నీలి నీలి ఆకాశం .. ‘ వంటి పాటలు ఆయన స్థాయిని ఆకాశానికి పెంచుతూ వచ్చాయి. సిద్ శ్రీరామ్ గాత్రంలో ఉన్న ప్రత్యేకత ఆయనకి యూత్ లో అభిమానుల సంఖ్యను పెంచుతూ వస్తోంది. ఆయన పాడిన పాటలు హిట్ కావడం .. అలాగే ఆయా సినిమాల్లో సక్సెస్ శాతం ఎక్కువ ఉండటం శ్రీరామ్ కి కలిసొచ్చే అంశాలుగా మారిపోయాయి.
మిలీనియం ప్రారంభం లో ‘యువకుడు’ చిత్రం తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన భూమిక చావ్లా చాలా తక్కువ టైం లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పు పొందింది.. 2001 లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన “ఖుషీ ” చిత్రం లో నటించిన భూమిక చావ్లా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపొయింది ఆ తరవాత మహేష్ బాబు తో ఒక్కడు చిత్రం , వెంకటేష్ తో వాసు , జూనియర్ ఎన్ టి ఆర్ తో సింహాద్రి సినిమాల్లో నటించి సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకొంది. అదే సమయంలో ‘తకిట తకిట ‘ చిత్రం తో నిర్మాతగా మారింది. తర్వాత వ్యక్తిగత కారణాలతో సినిమాలకు దూరమైంది. ఈ మధ్య రీ ఎంట్రీ ఇచ్చింది. నాని హీరో గా నటించిన “ఎంసీఏ” చిత్రంలో నాని వదిన పాత్రలో నటించి మెప్పించిన భూమిక ఆ తర్వాత యు టర్న్ ,సవ్యసాచి , రూలర్ చిత్రాల్లో నటించింది. అలా అడపాదడపా పాత్రలను అందిపుచ్చుకుంటున్న భూమిక ఇప్పుడు నెగెటివ్ టచ్ ఉన్నపాత్రలో నటించనుంది.
వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనకు హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. కర్నూలుకు కార్యాలయాలు తరలింపుపై ప్రభుత్వానికి కోర్టు షాకిచ్చింది. కర్నూలుకు కార్యాలయాలు తరలింపు జీవోను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు ఈ జీవోను ధర్మాసనం సస్పెండ్ చేసింది.
థ్రిల్లర్ చిత్రాలకు, హారర్ చిత్రాలకు సీక్వెల్ చిత్రాలు తీయడం ఎప్పటినుంచో వస్తున్నదే …2015లో వచ్చిన రాజుగారి గది చిత్రానికి 2017 లోఒకటి , 2019 లో మరొకటి సీక్వెల్ చిత్రాలు వచ్చాయి. అలాగే 2018 లో అడవి శేష్ నటించిన గూఢచారి చిత్రానికి త్వరలో సీక్వెల్ రాబోతుంది ఇక రీసెంట్ గా వచ్చిన “హిట్ ” చిత్రానికి కూడా త్వరలో సీక్వెల్ రాబోతుంది. ఆ వరుసలో నాని నటిస్తున్న చిత్రానికి కూడా సీక్వెల్ రాబోతుంది. నాని హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ :” వి” రాబోతుంది . ఈ సినిమాలో నాని గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో నటించగా..సుధీర్ బాబు అతన్ని పట్టుకోవాలనుకునే ఐపీయస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నారు. దిల్ రాజు , శిరీష్ నిర్మాతలుగా రూపొందుతున్న ఈ చిత్రం లో నివేదా థామస్, అదితిరావు హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.నిజానికి ఈ సినిమాను ఉగాది సందర్భంగా మార్చి 25న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా ప్రభావం కారణంగా వాయిదా పడింది.


మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి కమల్‌నాథ్ ఎట్టకేలకు రాజీనామా చేశారు. దానితో గత నెలరోజులుగా జరుగుతున్న రాజకీయ డ్రామాకు తెరపడిన్నట్లు అయింది. గవర్నర్ లాల్జి టాండన్‌ను కమల్‌నాథ్ రాజ్‌భవన్‌లో కలిసి రాజీనామా సమర్పించారు.