థ్రిల్లర్ చిత్రాలకు, హారర్ చిత్రాలకు సీక్వెల్ చిత్రాలు తీయడం ఎప్పటినుంచో వస్తున్నదే …2015లో వచ్చిన రాజుగారి గది చిత్రానికి 2017 లోఒకటి , 2019 లో మరొకటి సీక్వెల్ చిత్రాలు వచ్చాయి. అలాగే 2018 లో అడవి శేష్ నటించిన గూఢచారి చిత్రానికి త్వరలో సీక్వెల్ రాబోతుంది ఇక రీసెంట్ గా వచ్చిన “హిట్ ” చిత్రానికి కూడా త్వరలో సీక్వెల్ రాబోతుంది. ఆ వరుసలో నాని నటిస్తున్న చిత్రానికి కూడా సీక్వెల్ రాబోతుంది. నాని హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ :” వి” రాబోతుంది . ఈ సినిమాలో నాని గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో నటించగా..సుధీర్ బాబు అతన్ని పట్టుకోవాలనుకునే ఐపీయస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నారు. దిల్ రాజు , శిరీష్ నిర్మాతలుగా రూపొందుతున్న ఈ చిత్రం లో నివేదా థామస్, అదితిరావు హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.నిజానికి ఈ సినిమాను ఉగాది సందర్భంగా మార్చి 25న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా ప్రభావం కారణంగా వాయిదా పడింది.
దరిమిలా ” వి ” చిత్రాన్ని ఏప్రిల్ నెలలో విడుదల చేయడానికి సమాయత్తమవుతున్నారు. కాగా. విశ్వసనీయ సమాచారం మేరకు నాని, దిల్ రాజు కలిసి ” వి” సినిమాకు సీక్వెల్ ని రెడీ చేయాలనుకుంటున్నారట. ” వి ” సినిమా క్లైమాక్స్ కూడా సీక్వెల్ ఉంటుందని చెబుతూ హింట్ ఇస్తూ ఎండ్ అవుతుందట ..అయితే ప్రస్తుతం నాని బిజీ కాబట్టి “వి ” సీక్వెల్ వచ్చే ఏడాదిలోనే ఉండే అవకాశాలు ఉన్నాయి .
Sequels are safe at box office
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Nanis v movie to have a sequel
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com