Home Blog Page 8579

బాలయ్య తో ఆడిపాడనున్న పాయల్ రాజపుట్

తెలుగు చిత్ర రంగం లో హీరోయిన్ల కొరత బాగా వుంది. అందుకే చిన్న, చితక హీరోయిన్ లకు కూడా డిమాండ్ బాగానే ఉంది. ఆ క్రమం లోనే పాయల్ రాజపుట్ కి గోల్డెన్ ఛాన్స్ తగిలింది. ‘ ఆర్ ఎక్స్ 100’, ‘ఆర్డీఎక్స్ లవ్’, ‘ఎన్ టి ఆర్ కధానాయకుడు’ , ‘ వెంకీ మామ’ ,’ డిస్కో రాజా’ సినిమాలతో పాయల్ రాజపుట్ కి యూత్ లో విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. కథానాయిక .. లేదంటే ఐటమ్ సాంగుకైనా రెడీ అంటూ తన ఐడెంటిటీ పెంచుకొంటోంది.

ఈ నేపథ్యంలోనే పాయల్ రాజపుట్ కి బాలయ్య బాబు సినిమాలో ఛాన్స్ దక్కినట్టు తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ , బోయపాటి శ్రీను కాంబోలో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కుతోన్న కొత్త చిత్రం లో పాయల్ రాజపుట్ కి ఒకానొక హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది పారితోషికం తక్కువ ,అందాల ప్రదర్శన ఎక్కువ కనుక పాయల్ ను ఎంపిక చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. ఇక ఈ చిత్రం లో రెండో హీరోయిన్ గా అంజలి నటిస్తోంది.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఇటీవల రామోజీ ఫిలింసిటీలో స్టార్ట్ చేశారు. అక్కడ యాక్షన్ ఎపిసోడ్ తో పాటు కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. అయితే సెకండ్ షెడ్యూల్ వెంటనే స్టార్ట్ చేయాల్సింది కానీ కరోనా ప్రాబ్లెమ్ తో చేయలేదు. .

విశ్వసనీయంగా తెలుస్తున్న దాని బట్టి వచ్చే నెల మొదటి వారం నుండి ఈ చిత్రం యొక్క రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది. తొలి షెడ్యూల్ ని ఫైట్ తో ప్రారంభించిన బోయపాటి, బాలయ్య బాబు జోడీ తమ సెకండ్ షెడ్యూల్ ని పాటతో ప్రారంభించబోతున్నారట. నారి నారి నడుమ మురారి తరహా స్టైల్లో హీరో, ఇద్దరు నాయికల మధ్య ఈ పాట ఉంటుందట. కాగా సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో వస్తున్న ఈ హ్యాట్రిక్ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
Wait until your turn

Adah Sharma Latest Photos

నిశ్శబ్దం చిత్రం తీయడానికి ప్రేరణ ఆంగ్ల చిత్రమంటున్నారు


టాలీవుడ్ జేజెమ్మ స్వీటీ శెట్టి దాదాపు రెండేళ్ల తర్వాత `నిశ్శబ్దం` చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది యువ దర్శకుడు హేమంత్ మధుకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, కోనవెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.అన్నీ సవ్యంగా ఉంటే ఏప్రిల్ 2న ఈ సినిమాని విడుదల చేయాలనుకున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో సినిమా విడుదల ఆలస్యం అయ్యేలా ఉంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ నిశ్శబ్దం చిత్రం 2016 లో వచ్చిన అమెరికన్ మూవీ ‘హష్’ నుండి స్ఫూర్తిగా తీసుకుని తెరకెక్కించారని అంటున్నారు .

ఈ చిత్రంలో అనుష్క మూగ, చెవిటి అమ్మాయిగా ఒక విభిన్న పాత్ర పోషిస్తోంది. కాగా ఆ పాత్రలో పరిపూర్ణత కోసం మూకాభినయం విద్యను మూడు నెలల పాటు శిక్షణ తీసుకుని నేర్చు కుందట అనుష్క. అదే విధంగా కథ ప్రకారం డ్రాయింగ్ ఆర్టిస్ట్ గా నటించాల్సి రావడం తో పెయింటింగ్ కూడా నేర్చుకుందట. ఇక ఈ చిత్రం లో అనుష్కతో పాటు మాధవన్, మైకేల్ మ్యాడ్సన్, అంజలి, షాలిని పాండే తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కరోనా ప్రభావం తగ్గక ఒకేసారి విడుదల చేయబోతున్నారు.
Sweet are the uses of adversity

ఉపదేశాలు మినహా చర్యలు కనిపించని ప్రధాని ప్రసంగం

ప్రపంచ ప్రజలు అందరు ప్రాణాంతక కరోనా వైరస్ తో భయకంపితులై ఉన్న సమయంలో, మొత్తం ఆర్ధిక వ్యవస్థ చెల్లాచెదురైన పరిస్థితులలో జాతిని ఉద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం రాత్రి ప్రసంగిస్తున్నారంటే ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూసారు.

స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతకు ముందెన్నడూ ఎరుగని ఆరోగ్యపరంగా ఏర్పడిన ఈ అత్యవసర పరిస్థితులలో ప్రజలకు చేదోడుగా ఉండే విధంగా ప్రభుత్వ పరంగా ఆయన అనేక చర్యలు ప్రకటిస్తారని ఎదురు చూసారు.

అయితే ఆయన ప్రసంగం అన్ని ఉపదేశాలు పరిమితమై పోయింది. ఎవ్వరికి వారు జాగ్రత్త వహించి, స్వయం క్రమశిక్షణ ప్రదర్శించి ఈ ఉపద్రవం నుండి బైట పడాలని సూచించారు. అందుకు ఎన్నో హిత వచనాలు పలికారు.

ఒక పీఠాధిపతిగా చేసిన ఉపవచనాలు వలే ఉన్నాయి గాని, దేశాధినేతగా ఏమి చేయబోతున్నారో మాత్రం మాట్లాడక పోవడం గమనార్హం. ప్రపంచం అంతా ఖంగారు పడుతున్నా చైనా పక్కనే ఉన్న చిన్న దేశం తైవాన్ ఏ విధంగా విజయవంతంగా ఎదుర్కొందో వంటి అనుభవాలను చెప్పినా బాగుండేది.

ముఖ్యంగా అంతా బంద్ పాటిస్తూ ఉండడంతో ఆదాయ వనరులు కోల్పోతున్న పేదలు, అణగారిన వర్గాలు, ముఖ్యంగా రోజువారీ వేతనాలపై ఆధారపడి ఉండేవారికి ప్రభుత్వ పక్షాన కొంత సహాయం అందించడం వంటి ప్రకటనలు అయినా చేయక పోవడం గమనార్హం. సాధారణంగా ఆయన ప్రసంగాలలో కనిపించే ఆవేశం, ప్రత్యర్థులను దూషించే దూకుడు కూడా కనిపించలేదు.

ఈ సవాల్ ను తన ప్రభుత్వం ఏ విధంగా ఎదుర్కోబోతున్నదో వివరించి ఉంటె సముచితంగా ఉండేది. కరోనా వైరస్ ను ఎదుర్కొనే బాధ్యతను మొత్తం ప్రజలపై నెట్టివేసి ధోరణిలో ప్రధాని ప్రసంగం ఉన్నదని సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి ఒకరి వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా వివిధ దేశాధినేతలు చేసిన ప్రకటనలను ఆమె గుర్తు చేశారు. ఫ్రాన్స్ గృహ వినియోగ బిల్లుల చెల్లింపును రద్దు చేయగా, స్పెయిన్ జాతీయ ఆరోగ్య సదుపాయం కల్పించింది. ఇటలీ, చైనా ఇంటివద్దే పలు సేవలు అందించే ఏర్పాట్లు చేశాయి. ఆర్ధికంగా అణగారిన వర్గాలను ఆదుకోవడంతో పాటు, అందరికి ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి తీసుకు వచ్చి ఉండవలసింది.

ఈ సందర్భంగా పలు దేశాలు ప్రకటించిన భారీ ఆర్థిక ప్యాకేజీలు గమనార్హం. యుకె 39 బిల్లియన్, అమెరికా 1.2 ట్రిలియన్, ఫ్రాన్స్ 45 బిలియన్, న్యూజీలాండ్ 8 బిల్లియన్, ఇటలీ 28 బిలియన్, కెనడా 56 బిలియన్, దక్షిణ కొరియా 10 బిలియన్ డాలర్ల ప్యాకేజీలను ప్రకటించాయి.

భారత దేశంలో ఇప్పటికే పలు ఆర్ధిక ప్యాకేజీలను ప్రకటించాయి. కానీ ప్రధాని మోదీ ఆదివారం నాడు జనతా కర్ఫ్యూ, ప్రజల తమ ఇళ్ల బాల్కనీల నుండి సాయంత్రం చప్పట్లు కొట్టడం మాత్రమే చేస్తున్నారు. అందరికన్నా ఎక్కువగా కేరళ ప్రభుత్వం రూ 20,000 కోట్ల ప్యాకేజి ప్రకటించింది.

ప్రభుత్వం వివిధ పథకాలకింద అందించే పింఛన్లు ఏమీ పొందని వారికి ఏప్రిల్‌ నెలకు వెయ్యి రూపాయల చొప్పున సామాజిక భద్రతా పింఛను అందించేందుకు రూ.1320 కోట్లను ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కేటాయించారు. పేదలకు ఉచితంగానే ఆహార పదార్థాలను అందజేస్తామని తెలిపారు. ఇందుకోసం రూ.50 కోట్లు కేటాయించారు.

ఉచిత ఆహార ధాన్యాలను అందజేసేందుకు వంద కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. ఉపాధి హామీ కోసం రూ.2 వేల కోట్లు కేటాయించారు.. ప్రయాణ వాహనాలకు పన్ను రాయితీ కల్పించనున్నారు.

ఆరు నెలలకు సరిపడిన రేషన్ లను ప్రజా పంపిణి వ్యవస్థ ద్వారా ఒకేసారి అందుబాటులోకి తెస్తున్నామని కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ప్రకటించారు. అయితే రోజువారీ ఆదాయాలు కోల్పోయిన ప్రజలు ఆరు నెలల రేషన్ ను ఒకే సారి కొనుగోలు చేయగలరా?

దేశంలో కారోన భయం, ఆ పార్టీలో వాయిదా భయం!

“ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. ఇంకేదో కాలి ఇంకొకడు ఏడ్చాడట..!” ప్రస్తుతం ఆంధ్రాలో వైసీపీ నేతల పరిస్థితి అలానే ఉంది. దేశవ్యాప్తంగా ప్రజలు కారోన వైరస్ భయంతో వాణికిపోతుంటే.. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతలు మాత్రం స్థానిక ఎన్నికల వాయిదా పడటంతో వణికిపోతున్నారు. ఆరు వారాల పాటు ఎన్నికలు వాయిదా పడటం వారికి తెలనొప్పిగా మారింది.

ఏపీలో 2020 స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే ఈ విషయంపై రాష్ట్రం లో పెద్ద దుమారమే రేగింది. చివరికి సుప్రీంకోర్టు జోక్యంతో గొడవ ముగిసింది. అంతే కాకుండా కారోనని కట్టడి చేయడంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. దీంతో అప్రమత్తమైన జగన్ సర్కార్ ఏపీని షట్ డౌన్ చేసింది.

అయితే కారోన వ్యాప్తితో ఎన్నికల వాయిదా, ఏపీని షట్ డౌన్ చేయడం వంటి కీలక నిర్ణయాలు వెంటవెంటనే జరిగిపోవడంతో అప్పటికే స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన వైసీపీ నేతల్లో ఆందోళనలు మొదలయ్యాయి.. ఎందుకంటే ఎన్నికలలో ఇతర పార్టీ వారిని భయభ్రాంతులకు గురిచేసి వారిని నామినేషన్లు వేయకుండా చేశారనే అప్రతిష్ట జగన్ సర్కార్ మూట కట్టుకొంది. ప్రస్తుతం టిడిపి, జనసేన, బీజేపీ పార్టీలు ఎన్నికలను మొదటినుంచి నిర్వహించాలని ఎన్నికల సంఘం పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. అంతేకాకుండా ఈ విషయం పై కోర్ట్ కి వెళ్లనున్నట్లు సమాచారం. ఒకవేళ తిరిగి ఎన్నికలు నిర్వహిస్తే ఆర్థికభారంతో పాటు పోటీ తీవ్రమయ్యే అవకాశం ఉందని ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా అభ్యర్థులకు కొత్త సమస్యను తెచ్చి పెట్టింది. ఆరు వారాల పాటు తమ అనుచరులను, పార్టీ కార్యకర్తలను పోషించడం కష్టమవుతోందని అధికార పార్టీ నేతలు వాపోతున్నారు.

కరోనా కోసం జెన్నిఫర్ త్యాగం అమోఘం

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న ఆపత్కర సమయంలో నివారణ మందులు లేక అనేక మంది ప్రాణాలు విడుస్తున్నారు. అలాంటి భయానక స్థితిలో నాపైన టెస్ట్ చేసి మందు కనిపెట్టండి.. ప్రపంచ ప్రజలు బాగుండాలి, వారి సంక్షేమం కోసం అవసరమైతే నా ప్రాణాలు పోయినా ఫర్లేదు.అంటూ జెన్నిఫర్ అనే ఓ 43 ఏళ్ళ మహిళ ముందుకొచ్చింది. ఈమె ఇప్పుడు కరోనాతో అల్లాడుతున్న ప్రపంచానికి ఓ వెలుగు రేఖ గా మారింది .

అమెరికాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్, మోడెర్నా సంస్థల శాస్త్రవేత్తలు ఎంఆర్ఎన్ఏఎన్ 1273 పేరుతో ఓ వ్యాక్సిన్ కనిపెట్టడం జరిగింది. ఆ క్రమం లో ఈ వ్యాక్సిన్ను నేరుగా మనుషులపై పరీక్షించాలని నిర్ణయించారు. అలాంటి తరుణంలో అమెరికాకు చెందిన 43 ఏళ్ళ జెన్నిఫర్ హాలెర్ స్వచ్ఛందం గా ముందుకొచ్చి కరోనాతో అల్లాడుతున్న ప్రపంచానికి వేగు చుక్క అయ్యారు.

ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్న జెన్నిఫర్ తన శరీరాన్ని ప్రయోగాలకు వేదికగా నివేదించ నున్నారు. అభివృద్ధి చెందిన అమెరికా దేశంలోకూడా కరోనా వైరస్ ప్రభావం వల్ల లక్షాలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయ్. ఆ సమయం లో కరోనా వ్యాక్సిన్ ప్రయోగంపై నోటిఫికేషన్ వచ్చింది. దీంతో జెన్నిఫర్ దరఖాస్తు చేసుకుని స్వచ్ఛందంగా ఆ ప్రయోగానికి సిద్దమై వెళ్లింది. కాగా.. ఈ కరోనా విరుగుడు టీకాను అమెరికాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్), మోడెర్నా సంస్థలు తయారుచేశాయి. దీని సాంకేతిక నామం ఎంఆర్ఎన్ఏఎన్ 1273. నిజానికి ఇప్పటి వరకు మనుషుల పై ప్రయోగించని ఈ ఔషధాన్ని తీసుకునేందుకు బోల్డంత ధైర్యం కావాలి. ఎందుకంటే శరీరంలోకి వెళ్లాక అది ఎలా పనిచేస్తుందో ఎవరికీ తెలియదు. ఈ పరీక్షలు విజయవంతమైతే ప్రపంచానికి ముచ్చెమటలు పట్టిస్తున్న ఈ మహమ్మారికి విరుగుడు దొరికినట్టే.

.ఈ టీకా విజయవంతమైనా.. అవ్వకపోయినా ప్రపంచ ప్రజల సంక్షేమం కోసం జెన్నిఫర్ చేస్తున్న త్యాగానికి ఓ సార్ధకత ఏర్పడింది. అందుకే ఆమె ధైర్యానికి, తెగువకు యావత్ ప్రపంచం జై కొడుతూ.. జేజేలు పలుకుతోంది .
Sacrificing a self is dedication to whole nation

144 సెక్షన్ పై కేసీఆర్ సమీక్ష

తెలంగాణలో కారోన వ్యాప్తి రోజు రోజుకి పెరుగుతన్న నేపథ్యంలో ప్రజలలో భయాందోళనలు తగ్గించడానికి, రాష్ట్రంలో144 సెక్షన్ పై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి అత్యవసర సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ.. ప్రజలకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. అన్ని సూపర్ మార్కెట్లు, కిరణాల దుకాణాలు తెరిచి ఉంటాయని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు.

మార్చి 31 వరకు వివిధ సంస్థలను మూసివేస్తున్నట్లు సిఎం ప్రకటించారు. “అన్ని సినిమా హాళ్ళు, జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్, క్లబ్బులు, పబ్బులు, ఫంక్షన్ హాల్స్, ర్యాలీలు మరియు సమావేశాలతో సహా బహిరంగ కార్యక్రమాలు, జూ, వినోదం ఉద్యానవనాలు మరియు అన్ని రకాల క్రీడా కార్యక్రమాలు మార్చి 31 వరకు మూసివేయబడతాయి. విద్యాసంస్థలు, కోచింగ్ క్లాస్ మరియు వేసవి శిబిరాలు ఇప్పటికే మార్చి 31 వరకు మూసివేయబడ్డాయి. మాల్స్, సూపర్ మార్కెట్లు మరియు కిరణా షాపులు తెరిచి ఉంటాయని సీఎం తెలిపారు.

ప్రగతి భవన్‌ లో కలెక్టర్లు, ఎస్పీలు, ఆరోగ్య అధికారులు, పంచాయతీ రాజ్, ఇతర శాఖలు, మంత్రులు పాల్గొన్న ఉన్నత స్థాయి అత్యవసర సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో సెక్షన్ 144 విధించాల్సిన అవసరం లేదని, అయితే ప్రజలు భారీ సంఖ్యలో గుమిగూడవద్దని కోరారు.

మార్చి 31 వరకు సందర్శకులు మరియు యాత్రికుల కోసం అన్ని మత ప్రదేశాలు మూసివేయబడతాయి. శ్రీరామ నవమి, ఉగాది వేడుకలను దేవాలయాలలో అనుమతించరు మరియు ప్రజలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఉగాదిపై పంచాంగం వంటి కార్యక్రమాలను చూడవచ్చు. కరోనావైరస్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని వివాహాలు మరియు కార్యక్రమాలపై, అన్ని ఫంక్షన్ హాల్స్ వెంటనే మూసివేయబడతాయి మరియు అంతకుముందు నిర్ణయించిన వివాహాలు మార్చి 31 వరకు అనుమతించబడతాయి, అయితే 200 మంది మరియు నిర్వాహకులు పరిమితంగా సమావేశమై రాత్రి 9 గంటలకు ముందే ఫంక్షన్ ముగించాలి.

విద్యార్థులు పరీక్షలకు సిద్ధమైనందున, 2,500 కేంద్రాల్లో ఎస్‌ఎస్‌సి పరీక్ష కొనసాగుతుందని, ప్రజా రవాణా వాహనాలతో పాటు కేంద్రాలను పూర్తిగా శుభ్రపరచాలని కలెక్టర్లను కోరారు.

ఇతర దేశాల నుండి వచ్చే వారిని పూర్తిగా తనిఖీ చేయడానికి మరియు పొరుగు రాష్ట్రాల నుండి ప్రవేశించే వ్యక్తులను తనిఖీ చేయడానికి 18 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు, ”అని సిఎం చెప్పారు.

“గ్రామ కార్యదర్శులు మరియు మునిసిపల్ కమిషనర్లకు ప్రధాన పాత్ర ఉంది మరియు సామాజిక పరిశీలన ఉండాలి. ఎవరైనా విదేశాల నుండి వచ్చినట్లు మరియు లక్షణాలు ఉన్నట్లు ప్రజలు కనుగొంటే వారు ఆరోగ్య శాఖ అధికారికి తెలియజేయాలి లేదా 104 కు కాల్ చేయాలి ‘అని కెసిఆర్ చెప్పారు.

ఒకే సమయంలో 600 నమూనాలను పరీక్షించగలిగే హైదరాబాద్‌ లో సిసిఎంబి సదుపాయాలను ఉపయోగించుకోవాలని కేంద్రాన్ని అభ్యర్థిస్తున్నట్లు సిఎం చెప్పారు.

కరీంనగర్ లో ఇండోనేసియా బృందంతో హై అలెర్ట్!

ఒక వంక తెలంగాణలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య పెరుగుతూ గురువారం మరో మూడు కొత్త కేసులు నమోదుకావడంతో ఆ సంఖ్య 16కి చేరింది. ఇలా ఉండగా, కరీంనగర్ లో కరోనా వైరస్ సోకిన ఇండోనేసియా బృందం సంచరించినట్లు వెల్లడి కావడంతో సర్వత్రా కలకలం రేగుతున్నది. కరీంనగర్ జిల్లా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైనది.

ఇటీవల మతప్రచారం నిమిత్తం ఢిల్లీ నుంచి రామగుండంకి వచ్చిన 12 మంది సభ్యులు కరీంనగర్ పట్టణంలో సంచరించడంతో స్థానికులలో ఆందోళన వ్యక్తం అవుతున్నది. వీరిలో మొత్తం 8 మందికి కరోనా సోకడంతో అంతటా ఖంగారు వ్యాపిస్తుంది.

ఈ బృందం ఎక్కడెక్కడ తిరిగారు? ఎవరెవర్ని కలిశారు? ఎంత మందిని కలిశారు? అని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మరోవంక ఈ బృందం ఎందుకు వచ్చిందో వెల్లడి కావడం లేదు. పొంతనలేని మాటలు చెబుతూ ఉండడంతో మరిన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

వారిక్కడ నమాజ్ నేర్చుకోవడం కోసం వచ్చారనే కధనం ప్రచారంలో ఉంది. ఒక ముస్లిం దేశం నుండి ఇంత దూరం, మారుమూల ప్రాంతానికి నమాజ్ నేర్చుకోవడం కోసం రావడం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పైగా, లండన్ నుండి నేరుగా హైదరాబాద్ కు రాకుండా ఢిల్లీ వచ్చి, అక్కడి నుండి రైలులో రావడం ఏమిటనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.

ఇండోనేషియా నుంచి కరీంనగర్ వచ్చినవారు ఏ పని మీద వచ్చారో విచారణ జరిపించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. మత ప్రచారం కోసమే వచ్చారా..? వేరే ఏదైనా కారణం ఉందో తేల్చాలని స్పష్టం చేశారు. వారు ఎక్కడెక్కడ తిరిగారో తెలుసుకుని తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఎయిర్ పోర్టులో పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. రోడ్డు మార్గంలో చాలామంది విదేశీయులు రాష్ట్రానికి వస్తూనే ఉన్నారన్నారని రాజాసింగ్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఇప్పటికే కరీంనగర్ కలెక్టరేట్ సమీపంలో 3 కి.మీ పరిధిలో 100 మంది వైద్య బృందాలు ప్రతి ఇంట్లో వైద్య పరీక్షలు నిర్వహించాయి. అనుమానిత లక్షణాలు ఉన్న వారిని క్వారంటైన్ చేస్తున్నారు. ఈ ఇండోనేషియా బృందం దాదాపు 48 గంటలు పాటు కరీంనగర్ పట్టణంలో గడపడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.

కలెక్టరేట్ సమీపంలో ప్రజలెవ్వరినీ బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అక్కడ షాపులు, వాణిజ్య కార్యకలాపాలు స్తంభించిపోయి కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. ఇదిలా ఉండగా వీరు మదర్సాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సుమారు 150 మంది స్థానికులు వచ్చినట్లు తెలిసింది. వీరందరికి అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మరోవంక, లండన్ నుంచి హైదరాబాద్ కి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు, దుబాయ్ నుంచి హైదరాబాద్‌కి వచ్చిన మరోకరికి కరోనా సోకినట్లు తెలంగాణ వైద్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి.

పాజిటివ్ వచ్చిన వారంతా విదేశాల నుంచి వచ్చినవారే కావడం, వీరంతా నేరుగా రాష్ట్రానికి రోడ్, రైలు మార్గాల గుండా రావడంతో ఇటువంటి వారిని కట్టడి చేయడం పట్ల ప్రభుత్వ వర్గాలలో ఆందోళన వ్యక్తం అవుతున్నది.

వీరిలో కేవలం 7 మంది మాత్రమే శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాగా, మిగతా 9 మంది ఇతర ప్రాంతాల్లో విమానాలు దిగి, రోడ్డు, ట్రైన్ మార్గాల ద్వారా రాష్ట్రానికి వచ్చారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో నివసించే ఏ ఒక్కరికీ వైరస్ సోకకపోవడం గమనార్హం.

కరోనాతో రెక్కలు విరిగిన విమానయానం

కరోనా వైరస్‌ ప్రభావంతో అన్నింటికన్నా ముందుగా కీలకమైన విమానయాన రంగాన్ని దారుణంగా కుంగిపోతున్నది. ఈ మహమ్మారి ప్రభావంతో అతధికంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దవడం, దేశీయంగా కూడా గణనీయంగా ప్రయాణించే వారి సంఖ్య పడిపోతూ ఉండడంతో కోలుకోలేని విధంగా దెబ్బతింటున్నాయి.

పలు దేశీయ విమానయాన సంస్థలు తమ నిర్వహణ ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధిస్తున్నాయి. మార్కెట్‌ వాటాపరంగా దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థగా కొనసాగుతున్న ఇండిగో ఎయిర్‌లైన్స్‌ తమ ఉద్యోగుల వేతనాల్లో భారీ కోత విధిస్తున్నట్టు ప్రకటించింది.

వ్యక్తిగతంగా తన జీతంలో 25 శాతం కోత విధించుకొంటున్నట్టు ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సీఈవో రోనో దత్తా గురువారం తమ ఉద్యోగులకు పంపిన లేఖలో తెలిపారు. సీనియర్‌ వైస్‌ప్రెసిడెండ్‌, అంతకంటే పైస్థాయి అధికారుల వేతనాల్లో 20 శాతం, వైస్‌ ప్రెసిడెండ్‌, కాక్‌పిట్‌ సిబ్బంది వేతనాల్లో 15 శాతం, బ్యాండ్‌ డీ సిబ్బందితోపాటు క్యాబిన్‌ సిబ్బంది వేతనాల్లో 10 శాతం, బ్యాండ్‌ సీ సిబ్బంది వేతనాల్లో 5 శాతం కోత విధిస్తున్నట్టు ఆయన వివరించారు.

ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధిస్తే వారి కుటుంబాలకు ఎంత ఇబ్బందికరమో తమకు తెలుసని, కానీ ప్రస్తుత ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించి సంస్థ ముందుకు సాగాలంటే మనమంతా కొన్ని త్యాగాలు చేయక తప్పదని రోనో దత్తా ఆ లేఖలో స్పష్టం చేశారు. బ్యాండ్‌ ఏ, బ్యాండ్‌ బీ సిబ్బందికి మినహా ఉద్యోగులందరికీ ఏప్రిల్‌ 1 నుంచి వేతన కోతలు అమలవుతాయన్నారు.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల ప్రభుత్వాలు ట్రావెల్‌ అడ్వైజరీలు జారీచేయడంతో మన అంతర్జాతీయ విమాన సర్వీసులన్నింటినీ నిలిపివేయాల్సి వచ్చింది. ప్రస్తుతం డొమెస్టిక్‌ బుకింగ్స్‌ కూడా 20 శాతం మేరకు తగ్గాయి. మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో స్పష్టంగా తెలియడంలేదు’ అని రోనో దత్తా తెలిపారు.

ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా కూడా ‘ఇండిగో’ బాటలోనే నడుస్తున్నది. ఇప్పటికే పీకల్లోతున ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఎయిర్‌ ఇండియాపై కరోనా ప్రభావం ‘మూలిగే నక్కపై తాటిపండు పడిన’ చందంలా మారింది. దీంతో ఎయిర్‌ ఇండియా కూడా తమ ఉద్యోగుల వేతనాల్లో స్వల్పంగా కోత విధించే అవకాశాలున్నాయి. ఈ కోత 5 శాతం మేరకు ఉండవచ్చని ఎయిర్‌ ఇండియా వర్గాలు చెప్తున్నాయి.

తీవ్రమైన ఆర్థిక నష్టాలతో సతమతమవుతున్న ఎయిర్‌ ఇండియాను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు పదేపదే విఫలమవుతున్న విషయం తెలిసిందే. ఎయిర్‌ ఇండియాను కొనుగోలు చేసేందుకు దాదాపు రెండేండ్ల నుంచి సింగిల్‌ బయ్యర్‌ ముందుకు రాకపోవడమే ఇందుకు కారణం.

ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఎయిర్‌ ఇండియా ఇప్పటికే తమ క్యాబిన్‌ సిబ్బందికి ఫ్లయింగ్‌ అలవెన్సులను తగ్గించడంతోపాటు పైలెట్లు, ఇతర సిబ్బందికి వినోద అలవెన్సును ఉపసంహరించింది.

ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో అమెరికా, కెనడా తదితర దేశాలకు ఎయిర్‌ ఇండియా అంతర్జాతీయ సర్వీసులన్నీ దాదాపు పూర్తిగా ఆగిపోవడంతో తమ ఉద్యోగుల వేతనాల్లో 5 శాతం కోత విధించాలని యోచిస్తున్నట్టు ఓ అధికారి ఓ వార్తా సంస్థకు తెలిపారు.

మరోవైపు కరోనా వైరస్‌ ప్రభావాన్ని నిరోధించేందుకు ‘గోఎయిర్‌’ సంస్థ కూడా తమ నిర్వహణ ఖర్చులను తగ్గించుకొనేందుకు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా తమ ఉద్యోగులకు స్వల్పకాలంపాటు వేతనరహిత సెలవు ఇవ్వనున్నట్టు ‘గోఎయిర్‌’ ప్రకటించింది.

కరోనా వైరస్‌ వ్యాప్తి వల్ల ప్రపంచవ్యాప్తంగా అనూహ్య పరిస్థితి నెలకొనడంతో ‘స్పైస్‌జెట్‌’ విమానయాన సంస్థ శనివారం (ఈ నెల 21) నుంచి ఏప్రిల్‌ 30 వరకు తమ అంతర్జాతీయ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్టు ప్రకటించింది. పరిస్థితులు సాధారణస్థాయికి చేరుకున్నాక సాధ్యమైనంత త్వరగా ఆ సర్వీసులను పునఃప్రారంభిస్తామని తెలిపింది.

భారత్‌ సహా పలు దేశాలపై కరోనా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా పలు పెద్ద విమానయాన సంస్థలు ఇప్పటికే తమ సర్వీసులను గణనీయంగా తగ్గించిన విషయం తెలిసిందే.

నిర్భయ కేసుపై కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు

నిర్భయ నిందితులను ఈ రోజు ఉదయం 5గంటల 30నిమిషాలకు ఉరితీశారు. అనంతరం వారి మృతదేహాలను  పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి పంపారు. అయితే వారిని ఉరి తీసిన అనంతరం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేస్తూ.. ఒక ట్వీట్ చేశారు. దేశ రాజధానిలో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూస్తానని ప్రతిజ్ఞ చేశారు. “ఏ కుమార్తెకైనా” మరలా జరగకుండా చూసేందుకు పోలీసులు, కోర్టులు, రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రభుత్వం సమిష్టిగా కృషిచేయలని ఆయన పిలుపునిచ్చారు.

2012 డిసెంబర్ 16 న కదులుతున్న బస్సులో ఆరుగురు వ్యక్తులు అతికిరాతకంగా ప్రవర్తిస్తూ.. నిర్భయ అనే వైద్య విద్యార్థుని అత్యాచారం చేసి బుస్సులో నుండి బయటకు విసిరేశారు. 12రోజుల పాటు మృతువుతో పోరాడి ఆమె తుది శ్వాస విడిచారు. ఆరుగురులో ఒక దోషి జైలులో ఉరి వేసుకొని చనిపోగా మరో వ్యక్తి మైనర్ కావడంతో మూడు సంవత్సరాల జైలు జీవితం అనంతరం విడిచిపెట్టారు. మిగిలిన నలుగుర్ని ఈ రోజు ఉరితీశారు.

A బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్ళకి కరోనా ముప్పు

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు  ఈ వైరస్  బారిన పడి (ఈ వ్యాసం రాసే సమయానికి) 9802  మంది చనిపోగా.. లక్షలాది మంది  ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక కోవిడ్ 19  విశ్వ వ్యాప్తంగా 177 దేశాల్లో తన కోరలు సాచి వికటాట్టహాసం చేస్తోంది .   భారత దేశం లోకూడా కరోనా పీడితుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది.  ఇప్పటివరకు తేలిన లెక్కల ప్రకారం భారత దేశంలో 194  మంది కోవిడ్ 19 భాదితులు ఉన్నారు .ఈ సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది ఈ విపత్తు ఏర్పడిన నాటి నుండి ఇప్పటిదాకా కరోనా బారిన పడి  ఇండియా లో మృతి చెందిన వారి సంఖ్య.నాలుగు కి మించక పోవడం కొంచెం ఆనందించ దగ్గ విషయమే …ఎందుకంటె అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా , జర్మనీ , ఫ్రాన్స్ వంటివి కూడా ఈ కరోనా దెబ్బకి విల విల్లాడి   పోతున్నాయి .అక్కడ మరణాల సంఖ్య వందలు ,వేలల్లో ఉంది

ఇలా ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో కోవిడ్ 19 నివారణకు అనేక దేశాలు తమ వంతు పరిశోధనలు విస్తృతం చేశాయి.ఆ క్రమంలో మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో పలు అనుమానాలు ఉద్భవిస్తున్నాయి. అసలు ఎవరికి ఈ కరోనా వస్తుంది..? ఏ వయసు వారికి ఎక్కువగా సోకే అవకాశం ఉంది..? ఏ బ్లడ్ గ్రూప్ వారికి  కరోనా వల్ల ముప్పు    అన్న అనుమానాలు మనలో ఉన్నాయి.  ఈ క్రమంలో చైనాకు చెందిన వైద్య పరిశోధకులు కొంత సమాచారాన్ని ప్రపంచానికి అందించారు .

వీరి సమాచారం ప్రకారం ‘ఏ’ (A) బ్లడ్ గ్రూప్ కలిగినవారికి కరోనా వైరస్ త్వరగా సంక్రమిస్తుందని తేలింది. ఇక మిగతా గ్రూపుల విషయానికొస్తే.. ‘ఓ’ బ్లడ్ గ్రూప్ కలిగిన వారిపై  కాస్త నెమ్మదిగా.. కరోనా వైరస్ ప్రభావాన్ని చూపుతుందని తేల్చారు. గత కొన్నిరోజులుగా చైనా వైద్యులు ఈ అధ్యయనాన్ని ఉహాన్లో చేపట్టి ఈ విషయాలను మనకు తెలియ జేశారు.  కరోనా సోకిన  వారి ఫై పరిశోధనలు జరపగా.. వారిలో అధికులు  ‘ఏ’ బ్లడ్ గ్రూప్ కలిగినవారు ఉండటం  ఆ తరువాతి స్థానంలో ‘ఓ’ బ్లడ్ గ్రూప్ వారు ఉన్నారు. అంతేకాదు.. కరోనా సోకి ‘ఏ’ బ్లడ్ గ్రూపు వారే అధికంగా మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు. సో.. ఏ బ్లడ్ గ్రూప్ వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుస్తోంది.
Prevention is better than cure

ఏపీలో మూడుకు చేరిన కరోనా కేసులు

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా వైరస్‌ కోరలు చాస్తోంది. రెండో పాజిటివ్‌ కేసు నమోదై 24 గంటలైనా గడవక ముందే మరో కేసు వెలుగుచూసింది. విశాఖపట్నంలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. అయితే ఈ విషయాన్ని వైద్యాధికారులు ధ్రువీకరించాల్సి ఉంది.

అధికారికంగా నిర్ధారణ అయితే రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య మూడుకి చేరినట్టవుతుంది. కరోనా అనుమానిత లక్షణాలతో ఇటీవల నలుగురు వ్యక్తులు విశాఖలోని ఛాతీ ఆస్పత్రిలో చేరారు. వారి నుంచి సేకరించిన నమూనాలను ల్యాబ్‌కు పంపగా.. ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు తెలిసింది.

విశాఖకు చెందిన ఆ వ్యక్తి (50) ఇటీవల మక్కాకు వెళ్లి వారం క్రితం నగరానికి తిరిగొచ్చారు. మూడు రోజుల నుంచి జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతూ ఛాతీ ఆస్పత్రిలో చేరారు. అలాంటి లక్షణాలతోనే విదేశాల నుంచి వచ్చిన మరో ముగ్గురు కూడా ఆస్పత్రిలో చేరారు. వారి నమూనాలు సేకరించి హైదరాబాద్‌కు పంపించారు.

తొలి కేసు నెల్లూరులో నమోదు కాగా, ఆ యువకుడు పూర్తిగా కోలుకున్నాడు. ఒంగోలుకు చెందిన యువకుడు ఐదు రోజుల క్రితం లండన్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చాడు.. అక్కడ స్నేహితుడి ఇంట్లో నాలుగు రోజులు ఉన్నాడు.

ఈ నెల 15న ఒంగోలుకు చేరుకున్నాడు. 16న కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు అతన్ని ఒంగోలు జీజీహెచ్‌లోని ఐసోలేషన్‌ వార్డులో చేర్చి శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపారు.

రమేష్ కుమార్ లేఖతో జగన్ ప్రభుత్వం ఖంగారు!

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా అధికార పక్షం పెద్ద ఎత్తున హింసాయుత చర్యలకు దిగడాన్ని ప్రస్దావిసిట్ తనకు రక్షణ లేదంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కేంద్ర హోంశాఖకు లేఖ రాశారంటూ వచ్చిన వార్త ఏకధానాలు జగన్ ప్రభుత్వాన్ని ఖంగారులో పడవేస్తున్నాయి.

హడావుడిగా ఒక వంక ముఖ్యమంత్రి, మరో వంక గవర్నర్ ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమావేశాలు జరపడం గమనిస్తే శాంతిభద్రతల అంశంపై కేంద్రం ఎక్కడ జోక్యం చేసుకొంటుందో అన్న ఆందోళలన ప్రభుత్వ వర్గాలలో వ్యక్తం అవుతున్నది.

పైగా ఆ లేఖ గురించి రమేష్ కుమారు మౌనంగా ఉండడంతో తొలుత ఆయన వ్రాసిన లేఖ కాదని, టిడిపి వారు సృష్టించిన లేఖ అంటూ ప్రచారం చేశారు. కానీ పరిస్థితుల తీవ్రతను గమనించిన ప్రభుత్వ పెద్దలు ఆ లేక తీవ్రతను అర్ధం చేసుకోవడం ప్రారంభించారు. ఈ లేఖను రమేష్ కుమార్ ఇప్పటివరకు బాహాటంగా ఖండించకపోవడంతోనే అర్ధమవుతోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

నిజానిజాలను తేల్చాలని పోలీసు ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించినట్లు తెలిసింది. ఎన్నికల కమిషనర్‌ లేఖ అంశం రాజకీయ దుమారం సృష్టించడం, తెలుగుదేశం పార్టీ విమర్శల వర్షం కురిపిస్తుండటంతో ఆయన ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకున్నట్లు సమాచారం.

రమేష్‌కుమార్‌ రాసినట్టుగా చెబుతున్న లేఖ ఎక్కడినుండి వచ్చింది? ఎవరు రాశారు? ఎవరు సోషల్‌ మీడియాలో పెట్టారు? తదితర అంశాలపై సమగ్ర దర్యాప్తు చేసి వాస్తవాలను బయటపెట్టాలని పోలీసు ఉన్నతధారులను సిఎం గురువారం ఉదయం కోరినట్లు తెలిసింది.

మరోవైపు ఇదే అంశంపై వైసిపి చీఫ్‌విప్‌ శ్రీకాంత్‌రెడ్డి, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, అంబటి రాంబాబు, మల్లాది విష్ణు, జోగి రమేష్‌, కె.అనిల్‌, సుధాకర్‌బాబు తదితరులు డిజిపిని కలిసి ఫిర్యాదు చేశారు. లేఖ ఎవరు రాశారు ? లేఖ ఎవరు రాశారు? ఎవరు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు తదితర అంశాలతో పాటు, ఈ వ్యవహారంలో కొందరు జర్నలిస్టుల పాత్ర కూడా ఉందని, విచారణలో తేలితే వారిపైనా చర్యలు తీసుకోవాలని కోరారు.

మరోవంక, గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ రంగంలోకి దిగారు. రాష్ట్రంలోని పరిస్థితులపై ‘సంపూర్ణ సమాచారాన్ని’ కేంద్రం ముందు పెట్టడమే లక్ష్యంగా అడుగులు వేశారు. గురువారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌, సీఎంవో ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌లను రాజ్‌ భవన్‌కు పిలిపించి గంటకు పైగా చర్చలు జరిపారు.

ముఖ్యంగా ఎస్‌ఈసీ తన లేఖలో ప్రస్తావించిన ఘటనలు, వాటితో ముడిపడిన అంశాలపై పూర్తిగా ఆరా తీసినట్లు తెలిసింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి, ఇప్పటి వరకూ స్థానిక ఎన్నికల్లో జరిగిన హింస, నమోదైన కేసులు తదితర అంశాలపై గవర్నర్‌ ఆరా తీశారు. కరోనా వైరస్‌ విజృంభన తీవ్రంగా ఉన్నప్పటికీ, స్థానిక ఎన్నికలను యథాతధంగా నిర్వహించాలంటూ ఎస్‌ఈసీకి ఎందుకు లేఖ రాశారని సీఎస్‌ నీలం సాహ్నిని గవర్నర్‌ ప్రశ్నించినట్లు తెలిసింది.

ఆ లేఖతో సంబంధం లేకుండా ఏపీలో షిఫ్టుకు నలుగురు చొప్పున సాయుధ గన్‌మెన్‌ను కేటాయించామని, తెలంగాణ డీజీపీతో మాట్లాడి హైదరాబాద్‌లోని రమేశ్‌ కుమార్‌ నివాసం వద్ద ఏపీ పోలీసులతోపాటు తెలంగాణ పోలీసులను కూడా రక్షణగా నియమించామని డిజిపి గవర్నర్ కు వివరించారు. కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి ఈసీ కార్యాలయానికి సీఆర్పీఎఫ్‌ బలగాలతో భద్రత కల్పించామని చెప్పారు.

ఎన్నికల కమిషనర్‌కు భద్రత పెంచడంతోపాటు, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను మొదటి నుండి నిర్వహించాలని గవర్నర్‌కు పలు పార్టీల నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు టిడిపి, కాంగ్రెస్‌, సిపిఐ, ఆమ్‌ ఆద్మీ, ఫార్వర్‌బ్లాక్‌ పార్టీ నేతలు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు

తిరిగి తెరపైకి రాజధాని తరలింపు అంశం!

స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడడంతో పరిపాలన కార్యాలయాలను విశాఖపట్నంకు తరలించే అంశం తిరిగి తెరపైకి వచ్చింది. ఉగాది నాటికే కొన్ని కార్యాలయాలను తరలించాలని భావించినప్పయిటీకి ఎన్నికల కారణంగా కుదరలేదు. ఇప్పుడు ఎన్నికల కోడ్ సడలింపు వంటి కారణాలతో పాలనా రాజధాని తరలింపు పై దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.

దీనిలో భాగంగానే ఉద్యోగులనూ మానసికంగా సిద్ధం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికి అనుగుణంగానే సచివాలయ ఉద్యోగ సంఘం మే చివరి నాటికి విశాఖకు వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటించింది. తరలింపు ప్రక్రియను ఉగాదికి ప్రారంభించి మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం తొలుత భావించింది. అయితే, పదో తరగతి పరీక్షలు ఈ నెల 31 నుంచి ఏప్రిల్‌ 15వ తేదీ వరకు జగరనుండటంతో ఆ తరువాతే తరలింపు ప్రక్రియ ప్రారంభం కానుంది.

సచివాలయ ఉద్యోగ సంఘం కార్యనిర్వాహక వర్గ సమావేశం సైతం మే నెలాఖరు నాటికి విశాఖకు వెళ్లేందుకు అభ్యంతరం లేదని ప్రకటించారు. అదే సమయంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం. కావాల్సిన సౌకర్యాలపై ప్రభుత్వంతో చర్చిస్తామని చెప్పారు.

ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు పూర్తిగా ఎంతమంది అమరావతికి తరలివచ్చారు, వారి పిల్లల్లో ఎంతమంది ఇక్కడ చదువుకుంటున్నారు, ఉద్యోగుల్లో ఎంతమంది ఇక్కడ సొంత ఇళ్లు నిర్మించుకున్నారు, ఎంతమంది అద్దె ఇళ్లలో నివాసముంటున్నారు, ఎంతమంది ప్రభుత్వం సమకూర్చిన నివాసాల్లో ఉంటున్నారు అనే వివరాలనూ ఉద్యోగ సంఘ నేతలు సేకరిస్తున్నారు.

విశాఖకు వెళ్లేందుకు సిబ్బందికి ఉన్న సమస్యలు పరిష్కరించాలని, సౌకర్యాలను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరామని, ప్రభుత్వం దీనిపై సానుకూలత వ్యక్తం చేసిందని ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఉద్యోగుల పిల్లలకు స్కూల్‌ అడ్మిషన్లు, తాత్కాలిక ఉచిత వసతి ప్రభుత్వమే చూసుకోవాలని కోరామని, నూతన విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోపు ఉద్యోగుల తరలింపు ప్రక్రియను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు.

ఉద్యోగుల డిమాండ్ లలో కొత్తగా ఇళ్ల స్థలాలు, పాత ఇళ్ల స్థలాలకు వడ్డీ లేని రుణాలు, స్పౌస్‌ బదిలీ అవకాశాలు (కేంద్ర ప్రభుత్వం, బ్యాంకులు, అంతర్‌రాష్ట్ర అవకాశాలు, స్థానికత కూడా), తరలింపు అలవెన్స్‌, అమరావతిలో ఇల్లు, ఇళ్ల స్థలాలు తీసుకోనివారికి ప్రత్యేక రుణాలు, 30 శాతం ఇంటి అద్దె అలవెన్స్‌, విశాఖకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం వంటివి ఉన్నాయి.

ఆ నలుగురి కథ ముగిసింది

2012 నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషులుగా తేలిన నలుగురిని ఈ ఉదయం 5.30గంటలకు ఉరితీశారు. అర్ధరాత్రి విచారణ తరువాత, మరణశిక్షను సమీక్షించాలని కోరుతూ దోషుల్లో ఒకరు దాఖలు చేసిన చివరి నిమిషంలో చేసిన పిటిషన్‌ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అక్షయ్ కుమార్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముఖేష్ సింగ్ అనే నలుగురిని తెల్లవారుజామున 5:30 గంటలకు ఢిల్లీ తీహార్ జైలులో ఉరితీశారు.

ఉరి తీసిన తర్వాత వారి మృతదేహాలను అంబులెన్సులలో దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించారు, అక్కడ వైద్యుల బృందం పోస్ట్ మార్టం పరీక్షలు నిర్వహించనుంది.

2012 డిసెంబర్‌లో ఢిల్లీ కదిలే బస్సులో నిర్భయ అని పిలవబడే 23 ఏళ్ల వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం, హత్య చేసినందుకు ఈ నలుగురు దోషులుగా నిర్ధారించారు. ఆమె గాయాలతో హాస్పిటల్ లో మరణించారు.

Amyra Dastur Latest Photo Shoot Stills

ఆ లాయర్ ని కఠినంగా శిక్షించాలని డిమాండ్!

నిర్భయ దోషుల లాయర్ ఏపీ సింగ్ ను కూడా కఠినంగా శిక్షించాలనే వార్త దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. నిర్భయ ఘటన జరిగిన సమయంలో దోషులను సమర్థించిన ఏపీ సింగ్‌.. రాత్రిపూట అమ్మాయిలు బయట తిరిగితే ఇలాంటి ఘటనలే జరుగుతాయని… తన కూతురు ఇలా బాయ్‌ ఫ్రెండ్‌ తో తిరిగితే చంపేసే వాడినంటూ లింగవివక్ష పూరిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.. ఇదే విషయాన్నీ ఉటంకింస్తూ..ఆయనను కూడా కఠినంగా శిక్షించాలని సోషల్ మీడియా వేదికగా అనేకమంది ట్వీట్లు చేస్తున్నారు.

ఇప్పటివరకు చట్టంలో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ దోషులను శిక్ష నుంచి తప్పించేందుకు అన్నివిధాలుగా ప్రయత్నిస్తున్న ఏపీ సింగ్‌.. వరుస పిటిషన్లు, రివ్యూ పిటిషన్లు వేయిస్తూ వారికి అండగా నిలిచారు. ఇక తాజాగా దోషులకు ఎటువంటి చట్టపరమైన అవకాశాలు లేవంటూ ఢిల్లీ కోర్టు పేర్కొనగా.. ఉరిశిక్షపై స్టే విధించాలంటూ దాఖలైన పిటిషన్లను పటియాలా హౌజ్‌ కోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలో కోర్టు ప్రాంగణంలో ఏపీ సింగ్‌ మాట్లాడుతూ.. నిర్భయ దోషులు సైనికుల్లా పనిచేస్తారని.. వారికి దేశ సేవ చేసే భాగ్యం కల్పించాలని కోరడం విశేషం. కాగా అదే విధంగా నిర్భయ దోషులు ఉగ్రవాదులు కాదని.. వారిని క్రూరమైన నేరస్తులుగా చిత్రీకరించి ఎప్పుడో చంపేశారని మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదే విషయాన్ని ప్రముఖ ఇంగ్లిష్ పత్రిక ట్వీట్ చేయగా.. అనేకమంది రీట్వీట్ చేస్తూ, కామెంట్స్ పెడుతూ నిర్భయను అతి ధారుణంగా హతమార్చిన వారికి ఏపీ సింగ్ అండగా నిలబడాన్ని తప్పుబడుతూ ఆయన కూడా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయడం గమనార్హం.