Home Blog Page 8577

Nandini Rai Hot Stills

కరోనాని ముందే ఊహించిన ఆ డైరెక్టర్!

2017 సెప్టెంబర్ 29 న శర్వానంద్ హీరో గా మారుతి దర్శకత్వం లో ‘మహానుభావుడు’ అనే సినిమా వచ్చింది. శర్వానంద్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణ కూడా పొందింది. కథ ప్రకారం ఈ సినిమాలో శర్వానంద్ అతి శుభ్రం పాటిస్తూ ఉంటాడు. ఎవరికీ షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం .. ఒకవేళ అవతలివారు ఇస్తే, వెంటనే శానిటైజర్ వాడటం .. హాస్పిటల్ కి వెళితే మాస్క్ ధరించడం .. ఎవరైనా తుమ్మబోతే వాళ్లకి ఆమడ దూరం పారిపోవడం .. హీరోయిన్ ను హత్తుకోవడానికి కూడా ఆలోచించడం వంటివి చూసి అంతా నవ్వుకున్నారు. ఆ టైం లో కొంతమంది విమర్శకులు అతి ఎక్కువైందని కూడా విమర్శించారు. కానీ ఇప్పుడు ప్రపంచ మంతా మహానుభావుడు సినిమాలో హీరో చెప్పినదాన్ని పాటిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అంతకు మించి శుభ్రత పాటిస్తున్నారు.

కాగా ఈ విషయాన్ని మారుతి ప్రస్తావిస్తూ కరోనా వైరస్ నేపథ్యంలో అంతా మా సినిమాను గుర్తు చేసుకోవడం .చాలా ఆశ్చర్యంగా వుంది. ప్రస్తుత పరిస్థితికి అన్వయిస్తూ కామెడీగా కామెంట్లు పెట్టడం అంతా వింతగా వుంది. అదే విషయంలో మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మహానుభావుడు సినిమాను ఇంకా బాగా తీసేవాడినని మారుతి తెలియజేశాడు.
He is the real creator

యుపి మంత్రులకు వర్క్ ఫ్రం హోమ్

ఇప్పుడు వరకు ఉద్యోగులకే పరిమితమైన వర్క్ ఫ్రం హోమ్ సదుపాయాన్ని ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో మంత్రులకు కూడా విస్తరిస్తున్నారు. కరోనా వైరస్ విస్తరిస్తూ ఉండడంతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రులంతా సచివాలయానికి రాకుండా… ఇంటి వద్ద నుంచే వర్క్ ఫ్రం హోమ్ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

మరోవైపు బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ లక్నోలో ఇచ్చిన పార్టీకి యూపీ వైద్యఆరోగ్య శాఖ మంత్రి జై ప్రతాప్ సింగ్ హాజరుకావడంతో… ఇప్పుడు ఆయన స్వయంగా సెల్ఫ్ క్వారంటైన్ విధించుకున్నారు. మరోవైపు, కరోనా విస్తరించకుండా యూపీ ప్రభుత్వం పలు చర్యలను చేపడుతోంది.

పేద ప్రజల బాధను అర్థం చేసుకొని వారికి నిత్యావసరాల కోసం రూ. 1000 సాయం ప్రకటించారు. యూపీలోని రోజువారీ కూలీలు, భవన నిర్మాణ కార్మికులకు రోజుకు రూ. 1000 ఆర్థిక సాయం చేయనున్నట్లు ఆదిత్యానాథ్ తెలిపారు. ఈ సాయం వల్ల దాదాపు 15 లక్షల మంది రోజువారి కార్మికులు, 20.37 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు లబ్ధి పొందుతారని ఆయన చెప్పారు.

అంతేకాకుండా.. 1.65 లక్షల కుటుంబాలకు ఒక నెల ధాన్యం ఉచితంగా ఇస్తామని ఆయన తెలిపారు. ఎంఎన్‌ఆర్‌ఇజిఎ కార్మికులకు వెంటనే వేతనాలు ఇస్తామని ఆయన ప్రకటించారు. పెన్షనర్లకు ఏప్రిల్ నెలలో ఒకేసారి రెండు నెలల పెన్షన్ ఇస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని బిపిఎల్ కుటుంబాలకు ప్రభుత్వం తరపున 20 కిలోల గోధుమలు, 15 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తామని ఆదిత్యనాథ్ తెలిపారు. రాష్ట్రంలో దేనికీ కొరత లేదని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు.

కరోనా వల్ల దేశవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల కోసం ఇప్పటివరకు ఏ రాష్ట్రం కూడా ఆర్థికసాయం ప్రకటించలేదు. కానీ.. యోగీ మాత్రం యూపీ ప్రజల కోసం ముందడుగు వేసి ఈ నిర్ణయం తీసుకున్నారు. యూపీలో ఇప్పటివరకు 23 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని.. అందులో 9మంది రికవరీ అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

మీకు అర్థమౌతుందా… కవితమ్మ మందు పార్టీ!

నిజామాబాద్ మాజీ ఎంపీ, కేసీఆర్ గారాల పట్టి కవితమ్మ ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు. తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్ ఒక వైపు కరోనా కట్టడి గూర్చి సమీక్షలు నిర్వహిస్తూ.., ప్రజలకు పలు సూచనలు, సలహాలు ఇస్తుంటే తెలంగాణ ఆడబిడ్డ మరో పనిలో బిజీగా ఉన్నారు.

ప్రభుత్వం ఆదేశాలకు భిన్నంగా కవిత వ్యహరించిన తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రపంచం మొత్తం కరోనా భయంతో అల్లాడుతుంటే.. సోషల్ డిస్టెన్స్ మెయింటేయిన్ చేస్తుంటే… కవితమ్మ భారీ విందును ఏర్పాటు చేసి విమర్శల పాలయ్యారు.

స్థానిక సంస్థల ఉప ఎన్నిక నేపథ్యంలో కవిత కి ఎమ్మెల్సీ టికెట్ ని కేటాయించిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో ఆమె పార్టీ నాయకులకు హైద్రాబాద్ శివారు ప్రాంతంలో విందు ఏర్పాటు చేసింది. ఆ విందుకు జడ్పిటిసి, ఎంపిటిసి, కార్పొరేటర్లును పెద్ద ఎత్తున ఆహ్వానించింది. వారు తాగుతూ, చిందులేస్తూ.. హల్ చల్ చేస్తున్న ఒక వీడియో లీక్ అయింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రజలను పరిపాలించే తాగుబోతుల బ్యాచ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తూ…కవితను విమర్శిస్తున్నారు.

రవిప్రకాశ్‌ ఇంట్లో వజ్రాల వ్యాపారి అరెస్ట్!

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ ఇంట్లో సీసీఎస్‌ పోలీసులు సోదాలు నిర్వహించి ఓ వజ్రాల వ్యాపారిని అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 14 బీఎన్‌రెడ్డి కాలనీలోని రవిప్రకాశ్‌ ఇంట్లో ముసద్దీలాల్‌ జ్యువెల్లరీస్‌ అధినేత సుకేశ్‌ గుప్తా తలదాచుకున్నట్లు అందిన సమాచారం మేరకు ఈ దాడులు జరిపారు.

సుకేశ్‌ గుప్తాపై ఎస్‌ఆర్‌ఈఐ ఎక్విప్‌మెంట్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ అసోసియేట్‌ వైస్‌ప్రెసిడెంట్‌ వేణుగోపాల్‌ ఫిర్యాదు చేశారు. దీంతో పక్కా సమాచారం మేరకు భారీ బందోబస్తు ఏర్పాటుచేసి సుకేశ్‌ గుప్తాను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తున్నది.

బషీర్‌బాగ్‌ కేంద్రంగా పనిచేసే ఆశీ రియల్టర్‌కు చెందిన సుకేశ్‌గుప్తా, నీతూగుప్తా, నిహారిక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సురేశ్‌కుమార్, రవిచంద్రన్‌లు ఎస్‌ఆర్‌ఈఐ వద్ద రూ.110 కోట్ల రుణం కోసం 2018 జూన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఆ ఏడాది అక్టోబర్‌ నుంచి ప్రతి 3 నెలలకు ఓ వాయిదా చొప్పున చెల్లిస్తూ మొత్తం 4 దఫాల్లో రుణం వడ్డీ సహా తీర్చాలన్నది ఒప్పందం.

ఈ రుణానికి సంబంధించి షూరిటీగా హఫీజ్‌పేటలో ఉన్న 8 ఎకరాల స్థలంతో పాటు, కింగ్‌కోఠిలో 28,106 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న నజ్రీబాగ్‌ ప్యాలెస్‌ను చూపిస్తూ ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఆ రుణం చెల్లించడంలో విఫలం కావడంతో గతేడాది డిసెంబర్‌లో హఫీజ్‌పేటలోని స్థలాన్ని వేలం వేసిన ఎస్‌ఆర్‌ఈఐ సంస్థ 102.6 కోట్లు రాబట్టుకుంది.

మిగిలిన మొత్తం రికవరీ కోసం నజ్రీబాగ్‌ ప్యాలెస్‌ వేలం వేయాలని ప్రయత్నించగా, నిందితులు అప్పటికే తమను మోసం చేస్తూ ఐరిస్‌ హాస్పిటాలిటీస్‌కు విక్రయించినట్లు గుర్తిం చింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుకేశ్‌ గుప్తా, నీతూ గుప్తా, రవీంద్రన్, సురేశ్‌కుమార్‌లపై కేసు నమోదు చేసి, వారి కోసం వెతుకుతున్నారు. తాజాగా రవిప్రకాశ్‌ ఇంట్లో ఉన్నట్లు తెలుసుకొని సుకేశ్‌గుప్తాను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

Megha Chowdary Photo Stills

రెండో తుపాకీ రెడీ చేస్తున్న విజయ్

తమిళ స్టార్ హీరో విజయ్ కథానాయకుడిగా మురుగదాస్ దర్శకత్వంలో గతంలో ‘కత్తి’ .. ‘తుపాకి’ .. ‘సర్కార్’ సినిమాలు తెరకెక్కాయి. అవన్నీ కూడా విభిన్నమైన కథా కథనాలతో రూపొంది సంచలన విజయాలు సాధించాయి . ఈ సినిమాలు విజయ్ కెరియర్లో చెప్పుకోదగినవిగా నిలిచిపోయాయి. అలాంటి సినిమాలు అందించిన ఈ ఇద్దరి కాంబినేషన్లో త్వరలో మరో సినిమా రాబోతుంది. అయితే ఆ చిత్రం ‘తుపాకి’ సీక్వెల్ గా రాబోతుంది అని తెలుస్తోంది .

తమిళ స్టార్ హీరో విజయ్ – మురుగదాస్ కాంబినేషన్లో వచ్చిన ‘తుపాకి’ చిత్రం 2012లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ఆ సినిమా తెలుగులో అనువదించబడి ఇక్కడ కూడా మంచి విజయం సాధించింది. ఆ తరవాత హిందీలో రీమేక్ కాబడి అక్కడ కూడా ఘన విజయం సాధించింది అలా పలు సంచలనాలకు కారణమైన ఆ సినిమాకి సీక్వెల్ చేయడానికి మురుగదాస్ రంగం సిద్ధం చేస్తున్నాడు ఆ క్రమంలో ఆల్రెడీ విజయ్ తో కథా చర్చలు కూడా జరిగినట్టుగా తెలిసింది. గతంలో ‘తుపాకి’ సినిమాను నిర్మించిన ‘వి’ క్రియేషన్స్ వారే ఈ సీక్వెల్ చిత్రాన్ని కూడా నిర్మించనున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు తెలిసే అవకాశముంది.
Sequels are safe bets

కమల్‌నాథ్‌ పతనంకు దిగ్విజయ్ సింగ్‌ కారణమా!

మధ్యప్రదేశ్ లో కమల్‌నాథ్‌ ప్రభుత్వాన్ని కాపాడటం కోసం దిగ్విజయ్ సింగ్ విఫల ప్రయత్నం చేసిన్నట్లు కనబడింది. జ్యోతిరాదిత్య సింధియా శిబిరంపై చెందిన బెంగుళూరులో మకాం వేసిన ఎమ్యెల్యేలకు నచ్చచెప్పి తీసుకు రావడం కోసం అక్కడకు వెళ్లి అరెస్ట్ కూడా అయ్యారు. అయినా బిజెపి వ్యూహం ముందు నిలదొక్కుకోలేక పోయారు. అంటూ సర్వత్రా సానుభూతి వ్యక్తం అవుతున్నది.

అయితే కమల్‌నాథ్‌ ప్రభుత్వానికి మొదటి నుండి ముప్పు ఏర్పడిందే దిగ్విజయ్ సింగ్ నుండి అని వెల్లడి అవుతుంది. కర్ణాటకలో మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య వలె తాను కానీ పక్షంలో కాంగ్రెస్ అధికారమలో ఉండవలసిన అవసరం అనేరీతిలో దిగివజాయ్ సింగ్ కూడా వ్యవహరించినట్లు కనబడుతున్నది. కుమారస్వామి ప్రభుత్వం పడిపోవడానికి సిద్దరామయ్య కారణం అని అందరికి తెలిసిందే. బిజెపిలోకి ఫిరాయించిన వారంతా ఆయన మద్దతు దారులే.

మధ్యప్రదేశ్ లో పదేళ్ళపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన దిగ్విజయ్ సింగ్ సహితం ఆ పదవిపై మక్కువ పెంచుకున్నట్లు ఎన్నికల ముందే వెల్లడి అయింది. ఆయన నర్మదా పరిశ్రమ యాత్ర పేరుతో తన ప్రాబల్యాన్ని ఏర్పర్చుకోలెందుకు ప్రయత్నించారు. అయితే జ్యోతిరాదిత్య సింధియా బలమైన నాయకుడిగా ఉండడంతో ఆటలు సాగలేదు. రాహుల్ గాంధీ సహితం సింధుకు నాయకత్వం అప్పజెప్పినందుకు సిద్ధంగా ఉన్నారు.

అది గ్రహించిన దిగ్విజయసింగ్ మొదటగా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సింధియా నీయమకానికి అడ్డుపడ్డారు. తొలినుండి జాతీయ రాజకీయాలకు పరిమితమైన కమల్‌నాథ్‌ ను రంగంలోకి తీసుకు వచ్చారు. ఎన్నికల అనంతరం కూడా సింధియా ముఖ్యమంత్రి రాకుండా ఎక్కువగా అడ్డుపడింది దిగ్విజయ్ మాత్రమే.

రాజస్థాన్ లో తన తోటి నాయకుడైన సచిన్ పైలట్ ముఖ్యమంత్రి కాలేక పోయినా ఉపముఖ్యమంత్రిగా, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉంటూ ఉండగా, తనకు కనీసం ప్రభుత్వంలో గాని, రాష్ట్ర పార్టీలో గాని సంబంధం లేకుండా చేయడాన్ని సింధియా సహించలేక పోయారు.

మరోవంక కమల్‌నాథ్‌ ను సహితం స్వతంత్రంగా పాలన చేయనీయకుండా అడుగడుగునా జోక్యం చేసుకొంటూ అడ్డుపడుతూ వచ్చారు. దిగ్విజయ్ సింగ్ అడ్డు లేని పక్షంలో సింధియాతో సంధి చేసుకొని, పాలనా వ్యవహారాలలో కొంత ప్రాధాన్యత ఇవ్వడానికి కమల్‌నాథ్‌ సంసిద్ధత వ్యక్తం చేయడం అందరికి తెలిసిందే.

Casual clicks of Manjima Mohan

కారోన వ్యాక్సిన్ కి ఎంత దూరంలో ఉన్నాం?

ప్రపంచాన్ని వణికిస్తున్న కారోన వైరస్ ని నియంత్రానికి అవసరమైన వ్యాక్సిన్ కోసం యావత్ ప్రజానీకం ఎదురు చూస్తోంది. ఇదే అంశంపై స్పందించిన WHO చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ కొన్ని ఆశక్తికర విషయాలు వెల్లడించారు.

అన్ని అనుకున్నట్లు జరిగితే ఇంకో 12-18నెలల మధ్య కాలంలో కారోన ని నియంత్రించే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని స్వామినాథన్ తెలిపారు. కానీ వైరస్ భయానకరంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అందరికి కావలిసిన మందులు, టీకాలు అందుబాటులోకి రావాలంటే మరో ఆరునెలలు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు.

మూడు దశలకు పైగా, ప్రోటోకాల్స్ ప్రకారం వ్యాక్సిన్ భద్రత మరియు సామర్థ్యాన్ని పరీక్షించాలి. నాల్గవ దశలో పోస్ట్ మార్కెటింగ్ డేటా సేకరణ మరియు విశ్లేషణ ఉంటుంది. జంతువులతో మొదటిగా పరీక్షించిన తర్వాత మనుషులపై ప్రయోగిస్తారు.

సార్స్, హెచ్ఐవి వంటి మందుల మిక్సర్ తో కారోన మందును తయారు చేస్తున్నట్లు సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ డైరెక్టర్ డాక్టర్ అనురాగ్ అగర్వాల్ అన్నారు

Aiswarya Rajesh Beautiful Pics

కాజల్ తగ్గిన కానీ రామ్ చరణ్ మాత్రం తగ్గనంటున్నాడు

సైరా చిత్రం తరవాత తన 152 వ చిత్రం గా చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్లో చేస్తున్న ‘ఆచార్య’ సినిమాలో హీరోయిన్ ఎంపిక పూర్తి అయ్యింది. తొలుత త్రిష కథానాయిక గా నటిస్తుంది వినోదానికి సందేశాన్ని మేళవించి కొరటాల శివ సిద్ధం చేసుకున్న ఈ కథలో తొలుత త్రిష కథానాయిక గా నటిస్తుంది అన్నారు. అనుకోని కారణాల వల్ల కథానాయికగా ఎన్నికైన ‘త్రిష’ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. తరవాత కాజల్ , అనుష్క పేర్లు బయటికి వచ్చాయి. చివరకి ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాను దృష్టిలో పెట్టుకుని, కాజల్ అయితే బాగుంటుందని భావించి ఆమెనే ఖరారు చేశారట…ఈ క్రమంలో కాజల్ పారితోషికంగా రెండున్నర కోట్లు అడిగిందట. చివరికి ఒకటిన్నర కోటికి చేయడానికి ఆమె అంగీకరించినట్టు తెలుస్తోంది . త్వరలోనే ఆమె షూటింగులో పాల్గొననున్నట్టు చెబుతున్నారు.

చిరంజీవి కథానాయకుడిగా మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారితో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ నటిస్తున్నట్టుగా మొదట్లో వార్తలు వచ్చాయి. ఆ తరువాత తెరపైకి మహేశ్ బాబు పేరు వచ్చింది. ఆ క్రమం లో ఈ సినిమా కోసం మహేశ్ బాబు రోజుకి కోటి రూపాయలు పారితోషికంగా అడిగినట్టు తెలిసింది. ఆ తరవాత ఏమయిందో గాని మళ్లీ రామ్ చరణ్ సీన్లో కి వచ్చాడు .. కానీ పారితోషకం విషయం లో డీల్ మారలేదు. చెర్రీ ఎన్ని రోజులు షూటింగులో పాల్గొంటే అన్ని కోట్లు ఇచ్చేలా మాట్లాడుకున్నారట. ఇక చిరంజీవికి పారితోషికంతో పాటు, లాభాల్లో వాటా కూడా ముట్టనుందని చెబుతున్నారు.
Remuneration is criteria for stardom

కరోనాకు సవాల్ చేస్తున్న తైవాన్!

ప్రపంచ ఆధిపత్యం కోసం అర్రులు చాస్తున్న ప్రపంచ జనాభాలోనే అతి పెద్దది కావడమే కాకుండా, సైనిక శక్తిలో సహితం అమెరికా తర్వాత పెద్దదైన చైనాకు పొరుగునే ఉన్న తైవాన్ తొలి నుండి ఆ దేశ ఆధిపత్యాన్ని అన్ని విధాలా సవాల్ చేస్తూ వస్తున్నది. తాజాగా కరోనా వ్యాధి వ్యాప్తి విషయంలో సహితం ఆ దేశాన్ని సవాల్ చేసే రీతిలో మొగ్గలోనే వైరస్ ను తుంచివేసి మొత్తం ప్రపంచాన్నే అబ్బుర పరుస్తున్నది.

చైనాలో పుట్టిన కరోనా వైరస్‌.. వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఖండాంతరాలకు విస్తరించింది. చైనా నుంచి 11,600 కి.మీ దూరంలో ఉన్న అగ్రరాజ్యం అమెరికాను సైతం చివురుటాకులా వణికిస్తున్నదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అమెరికాలో ఇప్పటివరకు 9,486 మందికి వైరస్‌ సోకగా, 174 మంది మరణించారు.

అయితే.. చైనాకు పక్కనే ఉన్న తైవాన్‌, వియత్నాం వంటి చిన్న దేశాలు మాత్రం కరోనాకు ఎదురునిలిచాయి. తమ దేశంలో వైరస్‌ విజృంభించకుండా అడ్డుకోవడంలో విజయం సాధించాయి.

ముఖ్యంగా తైవాన్‌ తీసుకున్న చర్యలు మొత్తం ప్రపంచాన్ని విస్మయ పరుస్తున్నాయి. చైనాలోని వుహాన్‌లో వైరస్‌ వ్యాప్తి చెందడం మొదలుకాగానే ఆ దేశం కన్నా ముందుగా తైవాన్‌కు చెందిన ‘సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌’ (సీడీసీ) అప్రమత్తమైంది. తైవాన్‌లో జనవరి 21న మొదటి కరోనా కేసు నమోదైంది.

అన్ని దేశాల కంటే ముందుగానే తైవాన్‌ ప్రభుత్వం.. డిసెంబర్‌ 31న వుహాన్‌ నుంచి వచ్చే ప్రయాణికులకు వైద్యపరీక్షలు తప్పనిసరి చేసింది. ఆ సమయంలో వుహాన్‌లో కేవలం 27 కేసులు మాత్రమే నమోదయ్యాయి.

వారికి సార్స్‌ వంటి 26 రకాల వైరల్‌ వ్యాధుల పరీక్షలు చేసింది. పాజిటివ్‌ వచ్చినవారిని వెంటనే క్వారంటైన్డ్‌ కేంద్రాలకు తరలించింది. జనవరి 20 నుంచి వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రచారం మొదలుపెట్టింది.

తైవాన్‌ ప్రభుత్వం జనవరి 20న మాస్కుల తయారీని వేగవంతం చేసింది. 24న మాస్కుల ఎగుమతిపై నిషేధం విధించింది. సైన్యాన్ని రంగంలోకి దింపి యుద్ధప్రాతిపదికన మాస్కుల తయారీ మొదలుపెట్టింది.

కొత్తగా 62 ఫ్యాక్టరీలను ప్రారంభించింది. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ప్రజలందరికీ పంపిణీ చేయడం మొదలుపెట్టింది. ఒకేసారి ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయకుండా ఆంక్షలు విధించింది. తద్వారా అందరికీ సరిపడా మాస్కులు అందాయి.

వైరస్‌ వ్యాప్తి చెందకుండా తైవాన్‌ ప్రభుత్వం ఫిబ్రవరి 2వ తేదీ నుంచి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. మొదటివారం నుంచే సానిటైజర్ల ఉత్పత్తిని రెట్టింపు చేసింది. 25న క్వారంటైన్డ్‌ దవాఖానను నెలకొల్పింది.

అన్ని దేశాలు స్టేజ్‌-1, స్టేజ్‌-2 హెచ్చరికలు జారీ చేస్తున్న సమయంలోనే తైవాన్‌ ఏకంగా స్టేజ్‌-3 హెచ్చరికలు జారీ చేసి ఆంక్షలను కఠిన తరం చేసింది.

మాస్కులు, గ్లౌజులు వంటివాటితోపాటు వైద్యసిబ్బందిని సిద్ధంగా ఉంచింది. ఫలితంగా చైనా పక్కనే ఉన్నా.. మొదటి కేసు నమోదై రెండు నెలలు దాటినా.. తైవాన్‌లో ఇప్పటికీ కేసుల సంఖ్య 108కే పరిమితమైంది. ఇందులో 26 మంది కోలుకోగా, ఒకరు మాత్రమే మరణించారు.

ఇలా ఉండగా, అన్ని ఖండాలకు ఈ వైరస్ వ్యాపించినా అంటార్కిటికాలో మాత్రం ఇంకా ఎటువంటి కేసు రిపోర్ట్ కాలేదు. అక్క‌డ ప‌లు దేశాల‌కు చెందిన అంత‌ర్జాతీయ ప‌రిశోధ‌కులు ఉన్నారు.

ఎటువంటి ఇన్ఫెక్ష‌న్లు కానీ క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్న కేసులు న‌మోదు కాలేదు. అంటార్కిటికా వెళ్లే బ్రిటీష్ ప‌రిశోధ‌కులు ఎవ‌రైనా 14 రోజుల‌ క్వారెంటైన్‌కు వెళ్లాల్సి ఉంటుంది.

లాయర్ గారి భార్యగా భాగ్యలక్ష్మి

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వకీల్ సాబ్’ చిత్రం 75 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకొంది. బాలీవుడ్ హిట్ చిత్రం “పింక్ ” రీమేక్ గా నిర్మించ బడుతున్నఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు తన సొంత బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఫై ఈ సినిమా నిర్మించడం జరుగుతోంది.

ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకొన్న ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలకిగాను, నివేదా థామస్ .. అంజలి .. మల్లేశం ఫేమ్ అనన్యలను ఎంపిక చేశారు. ఇక సినిమాలో మరో ముఖ్యమైన పాత్రకిగాను కొంతమంది కథానాయికల పేర్లను అనుకోవడం జరిగింది. ఆ క్రమంలో శృతి హాసన్ ,ఇలియానా, లావణ్య త్రిపాఠి పేర్లు బయటికి వచ్చాయి కానీ చివరికి శ్రుతి హాసన్ ను ఖరారు చేసినట్టు తెలుస్తోంది.
.
తమిళంలో పింక్ రీమేక్ చేసినపుడు ఇదే పాత్రకు విద్యాబాలన్ ఎంపిక చేశారు.అక్కడ ఆ పాత్రకు మంచి పేరు కూడా రావడం తో అదే పాత్రకి గాను తెలుగులో శ్రుతి హాసన్ ను తీసుకున్నారని తెలుస్తోంది.గతంలో పవన్ కళ్యాణ్ – శ్రుతి హాసన్ కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ వీరి జంటకి మంచి పేరు వచ్చి ఆ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. దాంతో మళ్లీ ఇంతకాలానికి ఈ కాంబినేషన్ సెట్ చేశారని తెలుస్తోంది . పవన్ కల్యాణ్ . శ్రుతి హాసన్ జోడీ మళ్లీ కాటమ రాయుడు చిత్రం లో కలిసి నటించగా ఆ చిత్రం పెద్ద సక్సెస్ సాధించాక పోయినా జంటకి మాత్రం మంచి పేరు వచ్చింది .
A hit pair is hit forever

ప్రయాణికులు లేక బోసిపోతున్న శంషాబాద్‌‌ ఎయిర్‌‌పోర్టు

కరోనా వైరస్ భయంతో విమానప్రయాణం కుదించుకు పోవడంతో విమానాల రాకపోకలు కూడా గణనీయంగా పడిపోయాయి. దానితో దేశంలోనే ఎక్కువగా రద్దీగా ఉండే విమానాశ్రయాలలో ఒకటైన శంషాబాద్‌‌ ఎయిర్‌‌పోర్టులో ఇప్పుడు బంద్ వాతావరణం నెలకొంటున్నది. ఇంతకుముందు ఎయిర్‌‌‌‌పోర్టుకు ప్రతిరోజు 60వేలకు పైగా వచ్చే ప్రయాణికుల సంఖ్య ఇప్పుడు వరకు నాలుగైదు వేలకు పడిపోయింది. రాత్రిపూట ఎవరైనా వచ్చినా మరో వెయ్యి మందికి మించరు.

పైగా, ఈ నెల 22 నుంచి 29 వరకు ఇంటర్నేషనల్ ఫ్లైట్లకు అనుమతి లేదని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇంటర్నేషనల్‌‌ ఫ్లైట్లు రద్దవుతున్నాయి. కొన్ని దేశాల నుంచి కనెక్టింగ్‌‌ ఫ్లైట్లు వారం క్రితమే ఆగిపోయాయి. డొమెస్టిక్‌‌ విమానాలు కూడా బాగా తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో ఎప్పుడూ వేలాది మంది ప్రయాణికులతో రద్దీగా ఉండే శంషాబాద్‌‌ ఎయిర్‌‌పోర్టు బోసిపోయి కనిపిస్తోంది. క్యాబ్‌‌లకు గిరాకీ లేకపోవడంతో ఎయిర్‌‌పోర్టుకు రావడం తగ్గిపోయింది.

ట్రావెల్‌‌ కంపెనీలు ఇప్పటికే వందలాది క్యాబ్‌‌లను ఉపసంహరించుకున్నాయి. డ్రైవర్లకు సెలవులు ఇచ్చేశాయి. ప్రస్తుతం ఎయిర్‌‌పోర్టుకు పోయిన వారికి బయట బారులు తీరి ఉన్న అంబులెన్సులు దర్శనమిస్తున్నాయి. బయట దేశాల నుంచి వచ్చే కరోనా అనుమానితులను టెస్టులకు తీసుకెళ్లేందుకు వీటిని ఏర్పాటు చేశారు. ఆరు వజ్రా బస్సులను కూడా అందుబాటులో ఉంచారు.

ఇంటర్నేషనల్‌‌ ప్యాసింజర్లకు థర్మల్‌‌ స్ర్కీనింగ్ నిర్వహించేందుకు రెండు వందల మందిని సిద్ధంగా ఉంచారు. ఇక విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు 14 రోజుల పాటు స్వీయనిర్బంధంలోనే ఉండాలని సూచిస్తూ హోమ్ క్వారంటైన్ స్టాంప్ వేస్తున్నారు.

బ్రిటన్‌‌, టర్కీ, యూరప్ దేశాల నుంచి వచ్చే ఫ్లైట్లను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిషేధించింది. కరోనా ప్రభావం ఎక్కువున్న ఏడు దేశాల (చైనా, సౌత్‌‌కొరియా, ఇరాన్‌‌, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్‌‌, స్పెయిన్‌‌) నుంచి వచ్చే ప్రయాణికులకు 14 రోజుల క్వారంటైన్‌‌ విధించింది. ప్యాసింజర్లు ఈ దేశాల నుంచి దుబాయ్, ఖతార్‌‌, ఒమన్‌‌, కువైట్‌‌ల నుంచి వచ్చే కనెక్టింగ్‌‌ ఫ్లైట్లలో శంషాబాద్‌‌కు వస్తారు. ప్రయాణికులు తగ్గిపోవడానికి ఇది కూడా కారణమవుతోంది.

దీనికితోడు పలు ఏవియేషన్‌‌ కంపెనీలు తమ విమానాలను రద్దు చేసుకున్నాయి. వీలైనంత వరకు ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం చేస్తున్న ప్రచారం, ఆఫీసుల క్లోజ్‌‌ డౌన్‌‌, వర్క్‌‌ఫ్రమ్‌‌ హోమ్ తోనూ ప్రయాణికుల సంఖ్య బాగా పడిపోతున్నది. ఎమర్జెన్సీ ఉన్నవాళ్లు తప్ప టికెట్‌‌ బుకింగ్‌‌కు రావడం లేదని, తాము కూడా నష్టాలను తట్టుకునేందుకు చార్జీలు పెంచాల్సి వస్తోందని చెబుతున్నారు. వచ్చే వారం శంషాబాద్‌‌ ఎయిర్‌‌పోర్టుకు వచ్చే ఫ్లైట్ల సంఖ్య పదుల సంఖ్యకే పడిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

కరీంనగర్ లో ఇండోనేసియా బృందాల రాకపై పోలీసుల కన్ను!

కరీంనగర్ సంచరించిన ఒక ఇండోనేసియా మతప్రచారకుల బృందంలోని 10 మొత్తం మంది కూడా కరోనా వైరస్ కు గురికావడంతో ఆ దేశం నుండి తరచుగా ఈ ప్రాంతంలో పర్యటిస్తున్న బృందాలు రహస్య పర్యటనల గుట్టు రట్టయింది. గత నాలుగు నెలలోనే కనీసం నాలుగు బృందాలు ఆ విధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో పర్యటనలు జరిపినట్లు పోలీసుల దర్యాప్తులో నిర్ధారణ అయింది.

వారెందుకు వస్తున్నారు? వారి కార్యకలాపాలు ఏమిటి? అనే అంశాలపై ఇప్పుడు కూపీ లాగే ప్రయత్నం చేస్తున్నారు. వీరు ఒక నిషేధిత సంస్థ కార్యకలాపాల విస్తరణకు, తీవ్రవాద ఇస్లామిక్ ప్రచారం కోసమే వస్తున్నట్లు భావిస్తున్నారు. ఈ నెల 14న ఢిల్లీ నుంచి రామగుండం రైల్వేస్టేషన్‌కు వచ్చి.. అక్కడి నుంచి ఆటోలో కరీంనగర్‌ వచ్చిన 10 మందితో కూడిన ఈ బృందం కలెక్టరేట్‌ ఎదురుగా ఉన్న ఓ ప్రార్థనా మందిరంలో బస చేసింది.

పైగా వీరు వీసాలను ఏ కారణం చూపి తీసుకున్నారు? ఢిల్లీకి చేరుకొని, అక్కడి నుండి రైలులో కరీంనగర్ జిల్లాకు రావడానికి కారణం ఏమిటి? వీసా నిబంధనలను ఉల్లంఘిస్తూ తప్పుడు కారణాలు చూపడం కోసమే ముందు ఢిల్లీ చేరుకొని, తర్వాత ఇక్కడకు వస్తున్నారా? వీరి పర్యటనలు, కార్యక్రమాలను ఇక్కడ ఎవ్వరు పర్యవేక్షిస్తున్నారు? …. పోలీసుల దర్యాప్తులో ఈ అంశాలను వెలుగులోకి రావాల్సి ఉంది.

వీరిలో 10 మందికి కరోనా పాజిటివ్‌ రావడంతో పోలీస్‌ యంత్రాంగం అప్రమత్తమైంది. వీరి గురించి ఆరా తీసినప్పుడు ఇండోనేషియా బృందాలు కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాల్లో పర్యటించడం సర్వసాధారణమని తేలింది. మత ప్రచారం కోసం వచ్చినట్లు చెబుతుండగా… ప్రార్థనా మందిరాల్లో సమావేశాలు నిర్వహించి అదే మతానికి చెందిన వారికి ఏం బోధిస్తారు? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

ప్రార్థనా మందిరాలలో, స్థానికులను విచారించినప్పుడు ‘ఇండోనేషియా నుంచి ఢిల్లీకి వచ్చి… అక్కడి మత పెద్దల సూచనల మేరకు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి మత ప్రచారం సాగిస్తారని’ చెబుతున్నారు. గత నాలుగు నెలలుగా కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇండోనేషియా సభ్యులు బృందాలుగా విడిపోయి ఒక్కో ప్రార్థనా మందిరంలో రెండు మూడు రోజులు గడుపుతూ వస్తున్నట్లు తేలింది.

రామగుండం నుంచి కరీంనగర్‌కు వచ్చిన ఇండోనేషియా బృందం ప్రార్థనా మందిరంలో బస చేసిన రోజులకు ఒకట్రెండు రోజుల ముందు మరో బృందం కరీంనగర్‌ రూరల్‌ ఏరియాలోని రేకుర్తి, సాలెహ్‌నగర్, గుంటూరుపల్లిలో తిరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం వీరు ఎక్కడికెళ్లారనే విషయంలో స్పష్టత లేదు.

గత నెల 17న జగిత్యాలలో ఓ నిషేధిత సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాను ఎగరవేసింది. ఈ కార్యక్రమానికి ఇండోనేషియాకే చెందిన బృందం హాజరైనట్లు సమాచారం. భార్యాభర్తలుగా దేశంలోకి వచ్చిన నాలుగు జంటలు ఫిబ్రవరి 8న ఢిల్లీ నుంచి రామగుండం చేరుకొని అక్కడి నుంచి జగిత్యాల ప్రాంతానికి చేరినట్లు తెలిసింది.

వీరు జగిత్యాలతోపాటు సిరిసిల్ల జిల్లాలో పర్యటించినట్లు తెలుస్తోంది. కోరుట్ల, మెట్‌పల్లి, నిజామాబాద్‌లలోని ప్రార్థనా మందిరాల్లో తిరిగిన వీరు అదే నెల 17న జగిత్యాలలో ఓ నిషేధిత మత సంస్థ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నట్లు పోలీసుల వద్ద పక్కా సమాచారం ఉంది. అక్కడి నుంచి రామగుండం, పెద్దపల్లి ప్రాంతాల్లోని ప్రార్థనా మందిరాలను కూడా సందర్శించి 18న తిరిగి ఢిల్లీకి వెళ్లినట్లు చెబుతున్నారు.

జగిత్యాలకు వచ్చిన నాలుగు జంటల్లో మహిళలు మత పెద్దల ఇళ్లల్లో ఉండగా, పురుషులే ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు సమాచారం. జగిత్యాల ఎస్‌పీ సింధూశర్మ దీనిపై ప్రత్యేకంగా విచారణ చేస్తున్నట్లు తెలిసింది. కాగా తాజాగా హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్‌లో నాలుగు జంటల బృందం పర్యటిస్తుండగా, స్థానికుల సమాచారంతో వారిని నల్లకుంట ఫీవర్‌ ఆసుపత్రి క్వారంటైన్‌కు తీసుకెళ్లి పరీక్షలు జరిపారు. వీరు ఫిబ్రవరిలోనే కరీంనగర్‌ వచ్చినట్లు ఒప్పుకున్నారు.

కరీంనగర్‌కు వచ్చి కరోనా బారిన పడ్డ ఇండోనేషియా బృందం కన్నా ముందు కరీంనగర్‌ రూరల్‌ ప్రాంతంలో మరో బృందం పర్యటించింది. 8 మందితో కూడిన ఈ బృందం ఈ నెల 10 తరువాత కరీంనగర్‌లో పర్యటించినట్లు ఆనవాళ్లు లభించాయి. రేకుర్తి, సాలేహ్‌ నగర్, బొమ్మకల్, గుంటూరుపల్లిలలో ఈ బృందం తిరిగినట్లు పోలీసులు కూడా ధ్రువీకరిస్తున్నారు. ఇదే బృందం రామగుండం, పెద్దపల్లి ప్రాంతాల్లోని ఎంపిక చేసిన ప్రార్థనా మందిరాల్లో బస చేసినట్లు సమాచారం.

ఈ లెక్కన రెండు నెలల వ్యవధిలో మూడు నుంచి నాలుగు బృందాలు కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో పర్యటించినట్లు తెలుస్తోంది. నాలుగు నెలలుగా ఇండోనేషియాకు చెందిన మత ప్రచారకులు బృందాలుగా కరీంనగర్‌కు వస్తుండగా, అదే సమయంలో అతివాద భావాలు గల ఓ మత సంస్థ తన కార్యకలాపాలను ఉధృతం చేసింది.

జగిత్యాల, నిజామాబాద్‌లలో ఇప్పటికే ఒక వర్గంలో విద్యార్థులు, యువకులను భారీగా రిక్రూట్‌ చేసుకొని తన కార్యకలాపాలను విస్తృతం చేస్తున్న ఈ సంస్థ నాలుగు నెలలుగా కరీంనగర్‌పై దృష్టి పెట్టింది. తాజాగా ఈ నెల 17న కరోనాపై ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ వందలాది మంది విద్యార్థులతో ఆ సంస్థ నాయకుడు సమావేశం ఏర్పాటు చేయగా, పోలీసులు భగ్నం చేశారు. నాయకుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ అరెస్టుకు ఒకరోజు ముందు ఇండోనేషియా నుంచి కరోనా లక్షణాలతో వచ్చిన 10 మందిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

కరోనా ఖర్చు ఎంతో తెలుసా ?

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మన దేశంలోనూ విజృంభిస్తోంది. భారత్ లో కరోనా సోకిన వారి సంఖ్య రెండొందల అరవై మందికి చేరింది.అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా అనుమానితుల సంఖ్య ఇప్పటికే 23 మందికి చేరింది ఇంకా వేల మందికి కరోనా వైరస్ పరీక్షలు చేశారు. చేస్తున్నారు కూడా ..కరోనా ప్రపంచ విపత్తు గనుక కేంద్రం, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కరోనా అనుమానితులకు ఉచితంగానే వైద్య పరీక్షలు చేస్తున్నాయి.ఇదంతా ప్రభుత్వానికి ఖర్చుతో కూడుకొన్న విషయం అయినా ఎంతో ఓపికతో చేస్తోంది.ఒక్కో కరోనా నిర్ధారణ పరీక్షకు ఒక్కో వ్యక్తి ఫై సుమారు రూ. 4500 నుంచి 5000 వరకు మన ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్నాయి.

భారత వైద్య పరిశోధన మండలి (ఐ సి ఎం ఆర్ ) ప్రకారం కరోనా వైరస్ ప్రాథమిక పరీక్షకు రూ. 1500 ఖర్చు అవుతుండగా అనంతరం జరిగే నిర్ధారణ పరీక్షకు రూ. 3500 ఖర్చు అవుతాయి.

ఇక కరోనా పరీక్షలకు అవసరమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్నిమనం కలిగి ఉండక పోవడంతో మన దేశంలోని ల్యాబ్ లు జర్మనీ, అమెరికా నుంచి వాటిని దిగుమతి చేసుకుంటున్నాయని తెలుస్తోంది . … మన దేశ వ్యాప్తంగా డయాగ్నోస్టిక్ ల్యాబ్ ల నెట్ వర్క్ నిర్వహిస్తున్న ‘ట్రివిట్రాన్ న్యూబర్గ్ డయాగ్నోస్టిక్స్’ సంస్థ చైర్మన్ జీ .ఎస్. కె. వేలు తెలిపారు. అందుకే మన దగ్గర ఒక్కో కరోనా నిర్ధారణ పరీక్షకు రూ. ఐదు వేల వరకూ ఖర్చు అవుతోందని చెప్పారు. అయితే, ఈ పరిజ్ఞానాన్ని మన దేశంలోనే అభివృద్ధి చేసుకున్నట్లయితే కరోనా పరీక్ష ఖర్చు రూ. 500లకు మించబోదన్నారు.

దేశంలో ఇప్పటిదాకా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను ప్రభుత్వ అసుపత్రులు, ప్రభుత్వ ల్యాబ్ లు మాత్రమే నిర్వహిస్తున్నాయి. ఇక పై ప్రైవేటు అసుపత్రులు కూడా ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహించాలని భారత వైద్య పరిశోధన మండలి పిలుపునిచ్చింది. అయితే, దేశంలో వందలోపు ప్రైవేటు ల్యాబ్ లకు మాత్రమే కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే సామర్థ్యం ఉందని తెలుస్తోంది. ఇది ఒకింత భయాన్ని కలిగించే విషయమే …