
ప్రపంచ వ్యాప్తంగా కారోన వైరస్ ప్రకంపనలు మిన్నంటాయి. దాదాపు రెండువందలకు పైగా దేశాలు ఈ కారోన భయంతో వణికిపోతున్నారు. అందులో భారతదేశం కూడా ఉంది. మన దేశంలో కారోన వైరస్ పాజిటివ్ కేసులు రెండు వారాల వ్యవధిలోనే 3రేట్లు అయ్యాయి. దీంతో దేశంలో కారోన కట్టడికి 21రోజులు సంపూర్ణ లాక్ డౌన్ అమలుపరుస్తున్నారు. ఈ మూడు వారాలు ప్రజలు ఇళ్లలోనే ఉండే విధంగా ప్రభుత్వం కఠిన చర్యలను అమలుపరుస్తోంది.
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలౌతున్న నేపథ్యంలో ప్రజలు బయటకు వచ్చే అవకాశాలు 90% కోల్పోతున్నారు. ఈ సమయంలో ఆహార పదార్ధాల వనరులను చాలా పొదుపుగా వాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. ప్రతి వనరును కాపాడుకుంటూ.. అవసరమైన మేరకు ఉపయోగించుకుంటూ.. వృధా కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈ మూడు వారాల్లో ఆహార పదార్ధాల ఉత్పత్తి కూడా తగ్గిపోనుంది కాబట్టి అవసరానికి మించి ఎక్కువగా పొదుపు చేసుకోకుండా ఉన్నట్లయితే మరి కొంతమందికి ఈ వనరులు అందే వెసులుబాటు ఉంటుంది.వీలైనంత తక్కువగా వనరులను ఉపయోగించు” అనే ప్రకృతి నియమాన్ని పాటిస్తూ.. సాధారణ రోజులకు కాస్త భిన్నంగా ఈ లాక్ డౌన్ రోజుల్లో దిన చర్యలో ఏర్పాటు చేసుకునే మెనూ ను కూడా తగ్గించుకుంటే.. మంచిదని కొందరు సలహా ఇస్తున్నారు.
ప్రస్తుత సమాజంలో కడుపు నిండా ఆహారంతినని పేదలు ఎంతో మంది ఉన్నారు. ఒక పూట ఆహారంకోసం ప్రయసపడే నిరు పేదలు అనేకమంది ఉన్నారు. కానీ మూడు పూటలు తృప్తిగా తినేవారు ఇలాంటి విపత్తు సమయంలో సమయమనం పాటించి ఆహార వనరులను పొదుపు చేయగలిగితే ఈ సమాజానికి మేలు చేసినవారౌతారు. “ఆర్థిక సంపద నీదే కానీ ప్రకృతి వనరులు సమాజానివి” ఈ విపత్తు సమయంలో సమాజానికి ప్రత్యక్షంగా సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ పరోక్షంగా కీడు చేయకుండా మనవంతు సహకారాన్ని అందిస్తే మంచిది.