
కరోనా వైరస్ ను నియంత్రించేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అన్ని విద్యాసంస్థలను మూసివేసింది.
ఏప్రిల్ 14వరకు పరీక్షలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి లోపు విద్యార్థులకు వార్షిక పరీక్షలను రద్దు చేస్తున్నట్లు రెండు రాష్ట్రాలు ప్రకటించాయి. వార్షిక పరీక్షలు రాసే అవసరం లేకుండానే పై తరగతుల్లో చేరే వెసులుబాటును విద్యార్థులకు కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు.
అంతేకాదు, మార్చి 24న జరిగిన ప్లస్ 2 పరీక్షలు రాయలేకపోయిన విద్యార్థులకు మరో రోజు పరీక్ష నిర్వహించనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం తెలియజేసింది.