కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం కోసం మూడు వారల పాటు దేశవ్యాప్తంగా దిగ్బందనం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం 80 కోట్ల మందికి ప్రత్యేక రేషన్ ద్వారా రూ 3 కే కిలో బియ్యం, రూ 2 కే కిలో గోధుమలు సరఫరా చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయన అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది.
అదే విధంగా, లాక్‌డౌన్ నేపథ్యంలో కార్మికులకు ఆయా సంస్థలు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని ఆదేశించించింది. మహమ్మారికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా త్వరలో జిల్లాల వారీగా హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేయనున్నారు. దేశంలో నిత్యావసర సరుకులకు ఎలాంటి ఇబ్బంది లేదని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది.
ప్రజలకు అన్ని సౌకర్యాలూ అందుబాటులో ఉంటాయని, పాలు నిత్యావసర దుకాణాలు నిర్ణీత సమయంలో తెరిచిఉంటాయని సమావేశం అనంతరం కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. ప్రజలంతా క్రమశిక్షణతో మెలుగుతూ సామాజిక దూరాన్ని చెప్పారు. పాటించాలని కోరారు.
కాంట్రాక్టు కార్మికులకు జీతాలు చెల్లిస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ భరోసా ఇచ్చారు.
కాగా, సామాజిక దూరమే ఈ వైరస్ విరుగుడుకు మార్గమని దేశ ప్రజలకు చెప్పిన ప్రధాని, మంత్రివర్గ సమావేశాన్ని సహితం ఆ రీతిలో జరిపి ప్రజల ముందు ఆదర్శంగా నిలిచారు. సాధారణంగా ఒక బల్ల చుట్టూ మంత్రులు, అధికారులు కూర్చునేవారు. కానీ ఈ రోజు ఒక పెద్ద హాలులో కుర్చీలలో ఒకరికి మరొకరు కనీసం మూడు మీటర్ల దూరంలో కూర్చున్నారు.
ఈ సమావేశంలో కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, ప్రస్తుత పరిస్థితి, దేశ వ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ పై చర్చించారు.