Home Blog Page 8566

గాయ‌ని క‌నికాకు మూడోసారి పాజిటివ్‌

విదేశాల నుండి వచ్చి, చడీ చప్పుడు లేకుండా తిరుగుతూ, లక్నోలో విలాసవంతమైన దావత్ లో పాల్గొని, అక్కడ ఆమెను కలిసిన మాజీ సీఎం వస్టుంధార రాజేతో సహా పలువురు రాజకీయ ప్రముఖులను స్వీయనిర్బంధంలోకి పంపి పెను దుమారం రేపిన బాలీవుడ్ సింగర్ కనికాకపూర్‌కు మరోసారి కరోనా వైరస్ పాజిటివ్ అని వైద్యులు తేల్చారు.

ఇది వరుసగా ఆమెకు పాజిటివ్ రావడం మూడోసారి. ప్రస్తుతం లక్నోలోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఇంకా వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. ఆమె ఒక సెలబ్రెటీ వలే కాకుండా, ఒక రోగి వలే వ్యవహరిస్తూ, తమకు సహకరించాలి అంటూ వైద్యులు ఆమెపై చికాకు కనబరచడం తెలిసిందే. అయితే వైద్యులే తనను వేధిస్తున్నారని అంటూ ఆమె ఎదురు దాడికి పాల్పడ్డారు.

లండన్ నుంచి వచ్చిన కనికాకపూర్‌ కరోనావైరస్ బారిన పడ్డారు. ఆ తర్వాత రోగ లక్షణాలు గుర్తించిన వైద్యులు ఆమెకు మార్చి 20న, మార్చి 23న నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. తాజాగా మూడోసారి నిర్వహించిన పరీక్షల్లో కరోనావైరస్ ఆమెకు తీవ్రస్థాయిలో ఉన్నదనే విషయాన్ని వైద్యులు మరోసారి నిర్దారించారు.

కాగా ఆమెతో స‌న్నిహితంగా ఉన్న‌వారంద‌రి వివ‌రాల‌ను సేక‌రించారు. వారంద‌రికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 63మందికి నెగెటివ్ ఉన్న‌ట్లు వైద్యులు నిర్ధారించారు.

మరోవంక, క‌రోనా విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో కనికాకపూర్ బాధ్యతారాహిత్యంగా, నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించారనే ఆరోపణలపై ఆమెపై కేసు నమోదు చేశారు.

జవదేకర్‌పై మండిపడ్డ ప్రశాంత్‌ భూషణ్‌

కేంద్ర పర్యావరణ, సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌పై ప్రముఖ న్యాయవాది, సామాజిక కార్యకర్త ప్రశాంత్‌ భూషణ్‌ మండిపడ్డారు. ప్రజల డిమాండ్‌పై రామయణం సీరియల్‌ను శనివారం నుంచి దూరదర్శన్‌లో తిరిగి ప్రసారం చేస్తున్నట్లు జవదేకర్‌ ప్రకటించడంతో విరుచుకు పడ్డారు.

దేశం అంతటా ప్రజలు ఆకలితో, ఆవేదనతో, జీవన్మరణ సమస్యలలో ఉంటె మన మంత్రులు మాత్రం రామాయణ, మహాభారత వంటి మత్తుమందులను ప్రజలకు అందిస్తూ తాము సంబరాలు చేస్తుకుంటున్నారా అంటి ఎద్దేవా చేశారు. పైగా, హృదయం లేని మంత్రులు అంటూ అవహేళన చేశారు.

ఈ సీరియల్‌ ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి 10 వరకు ఒక ఎపిసోడ్‌, ఆ తర్వాత రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు మరో ఎపిసోడ్‌ను ప్రసారం చేస్తారు. తొలిసారి రామయణం సీరియస్‌ 1987 నుంచి 1988 మధ్య కాలంలో దూరదర్శన్‌లో ప్రసారం అయింది.

నేడు ప్రారంభమైన ఈ సీరియల్‌ను తాను చూస్తున్నట్లు మరి మీరు అని ప్రజలను అడుగుతూ ప్రకాశ్‌ జవదేకర్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. దీనిపై ప్రశాంత్‌ భూషన్‌ భగ్గుమన్నారు.

దేశవ్యాప్తంగా ప్రజలు తమ ఆరోగ్యం పట్ల ఆందోళనతో లాక్‌డౌన్‌ లో ఉన్న నేపథ్యంలో కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్నారని గుర్తు చేశారు. స్వస్థలాలకు చేరుకునేందుకు ప్రజలు వందల మైళ్లు కాలినడకన ప్రయాణిస్తున్నారని తెలిపారు.

ఇటువంటి పరిస్థితుల్లో మన కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ మాత్రం ప్రజలకు రామాయణ, మహాభారతాన్ని మత్తుమందు వలె ఎక్కిస్తున్నారని ధ్వజమెత్తారు.

కరోనా వైరస్ అంటే …ఏమిటో తెలుసా ?

కరోనా వైరస్ అనేది కొత్త గా వచ్చిన వైరస్ జాతి. ఇప్పటికే 6 రకాల కరోనా వైరస్ లకు సంబంధించిన సమాచారం మనకు వైద్య శాస్త్రం లో అందుబాటులో ఉన్నది. ఇప్పటి వైరస్ కరోనా జాతి లోని 7 రకంగా చెప్పుకోవాలి. అంతకుముందు లేని కొత్త జన్యు రూపంతో ఇది బయటపడింది కాబట్టి దీనికి నావెల్ కరోనా వైరస్ ( NOVEL CORONA VIRUS ) అని, 2019 లో కనుగొనబడింది కాబట్టి నావెల్ కరోనా వైరస్ -19 (NOVEL CORONA VIRUS- 19 ) అని నామకరణం చేశారు. అందుకే దీని ద్వారా వచ్చే జబ్బును COVID-19 గా వ్యవహరిస్తున్నారు. దీని జీన్ మ్యాపింగ్ ( GENE MAPPING )ను కూడా తెలుసుకున్నారు.

మిగతా వైరస్ ల లాగే ఇది కూడా ఒక వైరసే. కాకపోతే కొత్త జన్యు రూపంతో ఉన్నది కాబట్టి దీని గురించి ఎక్కువ విషయాలు మానవాళికి ఇంకాతెలియలేదు. అవి ఇంకా పరిశోధన దశలోనే ఉన్నాయి.

అసలు వైరస్ అనేది జీవి కాదు. కొవ్వు కణాలతో ఆవరించబడివున్న ఒక ప్రోటీన్ అణువు (DNA) మాత్రమే.
ఇది ఒక నిర్జీవి అంటే ప్రాణం లేనిది. ఇది కంటి, ముక్కు, గొంతు లోని కణాలతో కలిసినప్పుడు తన యొక్క జన్యు కోడ్ ను మార్చుకొని, కన్ను, ముక్కు, గొంతు కణాలను చైతన్య వంతమైనవిగా చేయడమే కాక అవి సంఖ్య పరంగా వృద్ధి అయ్యే విధంగా చేస్తుంది. దాంతో మనకు అనారోగ్యం వస్తుంది .

వైరస్ అనేది జీవి కాదు కాబట్టి, దీనిని చంపడం అనేది జరగని పని .. దానంతట అదే నాశనం మవుతుంది వైరస్ క్షయం (నాశనం ) అయ్యే సమయం మన చుట్టూ ఉన్న ఉష్ణోగ్రత, గాలిలో తేమ మరియు అది (వైరస్ ) ఉన్న ప్రదేశాలపై ఆధారపడి ఉంటుంది.

వాస్తవానికి వైరస్ చాలా బలహీనమైనది. తేలికగా విచ్చిన్నమయ్యే గుణం కలిగినది. కానీ దానికి రక్షణ కవచంగా ఉన్న కొవ్వు కణాల వలన అది బలం సంతరించుకుంటుంది. అందుకే సబ్బు, డిటర్జెంట్స్ వాడటం వలన, వాటినుండి వచ్చే నురగ కొవ్వు కణాలను విచ్చిన్నం చేస్తుంది. అందుకే సబ్బు తదితర పదార్థాలతో కనీసం 20 సెకండ్లు గట్టిగా రుద్దమని చెబుతారు. అట్లా చేయడం వలన కొవ్వు కణాలు విచ్చిన్నమై, లోపల వున్న వైరస్ ( ప్రోటీన్ అణువు ) దానంతట అదే విచ్చన్నమౌతుంది.

సహజం గా మన నిత్యజీవితం లో వేడి కొవ్వును కరిగిస్తుందన్న విషయం మనకు తెలుసు. అందుకే 25 డిగ్రీల కంటే ఎక్కువ వేడి వున్న నీటితో చేతులు, బట్టలు, ఇతరాలను శుభ్రపరచుకోవాలి. వేడి నీటికి ఎక్కువ నురగ నిచ్చే లక్షణం కూడా ఉన్నది. నురగ ఎంత ఎక్కువగా ఉంటే, అంత త్వరగా మరియు సులభంగా వైరస్ ను కరిగించగలం.
ఇంకో విషయం కొవ్వులు ఆల్కహాల్‌ లో బాగా కరుగుతాయి. అందుకే 65% తగ్గని ఆల్కహాల్ లేదా ఆల్కహాల్‌ మిశ్రమాలు ఉపయోగించడం ద్వారా వైరస్ ను నిర్వీర్యం చేయవచ్చు.

ఒకవంతు బ్లీచింగ్ పౌడర్, 5 వంతుల నీరు కలిపిన మిశ్రమాన్ని ఉపయోగించనా కూడా వైరస్ లోని ప్రోటీన్ అణువులను విచ్ఛిన్నం చేసి, వైరస్ ను నిర్వీర్యం చేయవచ్చు.

హైడ్రోజన్ పెరాక్సైడ్ కు ప్రోటీన్ ( వైరస్) అణువులను విచ్చిన్నం చేసే శక్తి ఉన్నది. అందుకే చేతులు శుభ్రం చేసుకునే శానిటైజర్స్ లో హైడ్రోజన్ పెరాక్సైడ్ ను ఉపయోగిస్తారు.

వైరస్ నిర్జీవి కనుక దానిని యాంటీబయాటిక్స్ నిర్వీర్యం చేయలేవు. కానీ వాటి నిర్మాణాన్ని కొంతమేరకు కుదించగలవు. నిజానికి యాంటీ బయాటిక్స్ బాక్టీరియా జీవులను మాత్రమే చంపగలవు. నిజానికి మనం
ఉపయోగించిన లేదా ఉపయోగించని బట్టలను దులపడం లేదా విదిలించడం చేయరాదు. ఎందుకంటే వాటిలో వైరస్ ఉంటుంది కాబట్టి అది మనకు హాని చేసే అవకాశం ఉంది.
వైరస్ బట్టలపై 3 గంటల వరకూ, సహజసిద్ధమైన యాంటీ సెప్టిక్ అయిన రాగిపై 4 గంటలు, చెక్కపై 4 గంటలు, కార్డ్ బోర్డు పై 24 గంటలు, లోహాలపై 42 గంటలు మరియు ప్లాస్టిక్ పై 72 గంటలు నిర్వీర్యం కాకుండా ఉంటుంది. వైరస్ ఉన్న బట్టలు, ఇతరాలను మనం దులిపినపుడు వైరస్ గాలిలో కలసి సుమారు మూడుగంటలు ఉండే అవకాశం ఉంది.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే వైరస్ లు చల్లని వాతావరణం లో, ఎయిర్ కండిషనర్ల కారణంగా ఏర్పడే కృత్రిమ చల్లదనంలో మరియు చీకటిలో వైరస్ లు వాటి అస్తిత్వాన్ని నిలకడగా కొనసాగిస్తాయి. అందుకే మన పరిసరాలను తేమ లేకుండా, పొడిగా, వెచ్చగా, వెలుతురు తో వుండేలా చూసుకోవాలి.

ఆరోగ్య వంతమైన మానవుని చర్మం ద్వారా ఈ వైరస్ లు శరీరం లోకి ప్రవేశించలేవు. అలాగే వెనిగర్ వలన ఉపయోగంలేదు ఎందుకంటే వెనిగర్ కు కొవ్వు లను కరిగించే శక్తి లేదు. స్పిరిట్, వోడ్కా లవలన కూడా వైరస్‌ను కట్టడి చేయలేం. ఎందుకంటే వాటిలో 40% కన్నా తక్కువ ఆల్కహాల్ ఉంటుంది. వైరస్ నిర్వీర్యం కావాలంటే 65% ఆల్కహాల్ కావాలి. అందుకే 65% ఆల్కహాల్ కలిగిన లిస్టరిన్ వలన కొంత ఉపయోగం ఉంటుంది.

తక్కువ వెలుతురు, గాలి కలిగిన ప్రదేశంలో, తక్కువ ఏరియాలో వైరస్ ఉధృతి ఎక్కువగా ఉంటుంది. విశాల మైన ప్రదేశం, గాలి, వెలుతురు ధారాళంగా ఉంటే వైరస్ తీవ్రత తక్కువగా ఉంటుంది.

ఆహార పదార్థాలు, తాళాలు, తలుపుల నాబ్స్, స్విచ్ లు, రిమోట్స్, సెల్ ఫోన్, వాచీలు, కంప్యూటర్ లు, డెస్కులు, టివిలు ముట్టుకున్నప్పుడు, బాత్రూమ్ కు వెళ్ళినప్పుడు తప్పక చేతులు సబ్బులు ఉపయోగించి 20 సెకన్ల కు తగ్గకుండా శుభ్రం చేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే చేతులు ఎప్పుడూ తడిగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఎండిన చేతుల్లోని పగుళ్ళలో వైరస్ దాక్కొనే అవకాశం ఉంటుంది. మనం ఉపయోగించే మాయిస్చరైజర్ ఎంత చిక్కగా ఉంటే అంత త్వరగా వైరస్ ను విచ్చిన్నం చేయడానికి ఉపయోగపడుతుంది. చివరగా గోళ్ళ సందుల్లో వైరస్ ఉండకుండా చూసుకోవాలి . ఆ క్రమంలో గోళ్ళ పరిమాణం యెంత తక్కువగా ఉంటే అంత మంచిది .
Knowing a thing prevents danger

కరోనాకు భాషలేదంటున్న త్రిష

కరోనా(కోవిడ్-19) వైరస్ కు భాష, ప్రాంతం, పేద, ధనిక తేడా లేదని వెటరన్ బ్యూటీ త్రిష తెలిపారు. ఈ వైరస్ ఎవరైనా ఈజీగా సోకుతుందని త్రిష అన్నారు. కరోనా నివారణకు స్వీయ నియంత్రణే పాటించడమే అందరికీ మంచిదని పేర్కొన్నారు. కరోనా మహమ్మరిపై ప్రజలకు అవగాహన కల్పించేలా పలు జాగ్రత్తలతో కూడిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో విడుదల చేశారు.

దేశంలో ప్రస్తుతం కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తుందన్నారు. కరోనా నివారణకు ప్రతీఒక్కరూ ఇంట్లోనే ఉండాలని త్రిష కోరారు. ఇంట్లో ఉండటం కొంచెం ఇబ్బందే అయినప్పటకీ సమాజం కోసం.. మన కుటుంబాల కోసం కొన్ని రోజులు ఇంట్లో ఉండక తప్పదని ఆమె అన్నారు. కరోనా నివారణకు ప్రజలంతా ఐక్యంగా ఉంటే అరికట్టవచ్చని పేర్కొన్నారు.

త్రిషతోపాటు పలువురు సెలబ్రెటీలు కరోనా నివారణపై సోషల్ మీడియాలో అవగాహన కల్పిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు తదితరులు కూడా కరోనాపై పలు జాగ్రత్తలను వివరిస్తూ వీడియోలను విడుదల చేసిన సంగతి తెల్సిందే. త్రిష కరోనాపై జాగ్రత్తలను వివరిస్తూ వీడియో చేయడంపై ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ఆధ్వ‌ర్యంలో సి. సి. సి.

కరోనా మహమ్మారి ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడింది. దీని బారి నుంచి ప్రజలను కాపాడటానికి ఇప్పటికే హీరోల నుంచి సినీ నిర్మాతల నుంచి , దర్శకుల నుంచి విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు కంకణం కట్టుకున్నారు. నిర్మాణాత్మక కార్యక్రమాల వైపు దృష్టి సారించారు.

ఈ సి. సి. సి. మ‌న‌కోసం సంబంధించిన వివరాలను ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మరియు దర్శకుడు, దర్శకుల సంఘం అద్యక్షుడు ఎన్. శంకర్, ఈ విధంగా తెలియజేశారు.

మొదటగా ప్ర‌ముఖ నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ మాట్లాడుతూ.. అంద‌రికీ న‌మ‌స్కారం.. క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా సృష్టిస్తున్న క‌ల‌క‌లం మ‌నంద‌రం ప్ర‌త్య‌క్షంగా చూస్తున్నాం. ఈ స‌మ‌యంలో సినిమా ప‌రిశ్ర‌మలో ఉన్న కార్మికులు చాలా మంది చాలా ఇబ్బందులకు లోన‌వుతున్నారు. ఎలాంటి విప‌త్తులు సంభ‌వించినా స‌హాయం చేయ‌డంలో సినిమా ఇండ‌స్ర్ట్రీ ముందుంటుంది. ఇప్పుడు కూడా సోద‌ర న‌టీన‌టులు విరాళాలు ప్ర‌క‌టించి త‌మ గొప్ప మ‌న‌సును చాటుకున్నారు. అయితే మ‌న సోద‌ర కార్మికుల‌కి మ‌నం ఏం చేయ‌గ‌లం అని చిరంజీవిగారు త‌న ఆలోచ‌న‌తో ముందుకు వ‌చ్చారు. చిరంజీవిగారి ఆధర్యంలో సురేష్ బాబు గారు, నేను, ఎన్‌.శంక‌ర్ గారు, క‌ల్యాణ్ గారు, దాము గారు అంద‌రం క‌లిసి చిన్న క‌మిటీగా ఏర్పాట‌య్యి సీసీసీ అనే సంస్థ ద్వారా చిత్ర ప‌రిశ్ర‌మ కార్మికుల సంక్షేమార్థం ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించాం.. దీనికి నాందిగా మొద‌ట చిరంజీవి గారు కోటి రూపాయ‌లను ప్ర‌క‌టించారు. నాగార్జున గారు కోటి రూపాయ‌లు, ఎన్టీఆర్ 25ల‌క్ష‌లు ఇలా విరాళాలు ప్ర‌క‌టించారు. వీరే కాకుండా ఎవ‌రైనా సినిమా ప‌రిశ్ర‌మ కార్మికుల‌ను ఆదుకోవ‌చ్చు.. క‌రోనా మ‌హమ్మారి వ‌ల్ల ప‌లు స‌మ‌స్య‌ల‌కు లోన‌వుతున్న సినీ కార్మికుల సంక్షేమ‌మే ఈ సంస్థ ముఖ్య ఆశ‌యం. ఇందుకు ప్ర‌తి ఒక్క‌రూ స‌హ‌క‌రించాలి.. అంద‌రం క‌లిస్తేనే కరోనాను, అది తెచ్చిన ఇబ్బందుల‌ను పార‌ద్రోల‌గ‌లం.. అన్నారు.

అనంతరం ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ ఎన్‌.శంక‌ర్ మాట్లాడుతూ.. క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేస్తున్న ఈ సంద‌ర్భంలో తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన వేలాది మంది కార్మికుల‌కు అండ‌గా నిల‌బ‌డాల‌నే సంక‌ల్పంతో చిరంజీవి గారి ఆధ్వ‌ర్యంలో సి. సి. సి. (క‌రోనా క్రైసిస్ చారిటీ మ‌న‌కోసం) అనే సంస్థ‌ని ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. ఈ సంస్థ‌కి ఛైర్మ‌న్‌గా మెగాస్టార్ చిరంజీవి గారు ఉంటారు. అలాగే స‌భ్యులుగా త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌గారు, సురేష్ బాబు గారు, సి.కల్యాణ్ గారు, దాము గారు, బెన‌ర్జీ గారు, నేను స‌భ్యులుగా ఉంటాము. సి. సి. సి. మ‌న‌కోసం క‌మిటీతో పాటు డైరెక్ట‌ర్ మెహ‌ర్ ర‌మేష్ గారు, గీతా ఆర్ట్స్ బాబు గారు, కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు గారు, ప‌రుచూరి గోపాల‌కృష్ణ గారు, కొమరం వెంక‌టేష్ గారు, ఫెడ‌రేష‌న్‌కు సంబంధించి అన్ని కార్మిక సంఘాల నాయ‌కులు అంద‌రూ కూడా ఈ సేవా కార్య‌క్ర‌మంలో భాగ‌స్వాములు అవుతున్నారు. ప్ర‌జ‌లంద‌రూ కూడా స్వ‌యంగా ఇంట్లోనే క‌రోనా వైర‌స్ తో సైనికుల్లా పోరాడుతున్న సంద‌ర్భంలో మ‌న గౌర‌వ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో అద్భుత‌మైన పోరాటం జ‌రుగుతోంది ఈ క‌రోనా వైర‌స్ మీద‌. క‌రోనా ను అంత‌మొందించే ప్ర‌య‌త్నంలో ప్ర‌జ‌లంద‌రూ కూడా భాగస్వాములు కావాలి. మీ ఇళ్ళలోనే ఉంటూ క‌న‌బ‌డ‌ని శ‌త్రువుతో పోరాడండి. విజ‌యం సాధిద్దాం.. సాధిస్తాం.. ఈ సేవా కార్య‌క్ర‌మానికి మ‌న గౌర‌వ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులు, మ‌న పుర‌పాల‌క ఐటీ శాఖామంత్రి కేటీఆర్ గారి అండ‌దండ‌లు, అధికారుల‌, పోలీస్ శాఖ వారి స‌హాయ‌స‌హ‌కారాలు కావాల‌ని కోరుతున్నాం.. అన్నారు.

సాధారణ అనారోగ్యానికి చికిత్స చేయని వైద్యులు

సాధారణ రోగాలకు వైద్యం చేయమంటూ రోగులను తిప్పి పంపిన ఘటన జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. జ్వరంతో బాధపడుతున్న తన కొడుకును జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వచ్చిన ధర్మవరం తండా మహిళకు  అక్కడి వైద్యుల చెప్పిన సమాధానంతో ఆందోళనకు గురయ్యింది. స్థానికంగా కరోనా మాస్క్‌లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే సామినేని ఉదయభానును కలిసి తన గోడు వెళ్ళబోసుకుంది. తన బిడ్డకు వైద్యం చేయించాలని ఎమ్మెల్యేను కోరింది. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే ఆసుపత్రికి తల్లికొడుకులను తీసుకుని వెళ్లారు. ఎమ్మెల్యే చెప్పినా వైద్యం చేసేందుకు ఆసుపత్రి వైద్యులు డాక్టర్‌ విజయభాస్కర్‌ అంగీకరించలేదు. సాధారణ జ్వరాలకు వైద్యం చేయవద్దని తమకు ఆదేశాలు ఉన్నాయని ఎమ్మెల్యే చెప్పినా, ఎవరు చెప్పిన తాము వైద్యం చేయమని తెగేసి చెప్పారు. వైద్యుల మాటలతో ఎమ్మెల్యే ఉదయభాను ఖంగుతిన్నారు. దీంతో ఉన్నతాధికారులతో ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు.

కరోనా గురించి తెలియాలంటే ఆ సినిమా చూడండి: వరలక్ష్మి

కరోనా మహమ్మరిని నివారణకు పలువురు సెలబెట్రీలు తమవంతు సహకారం అందుకున్నారు. కొందరు సెలబెట్రీలు కేంద, రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాలు అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. మరికొందరు సోషల్ మీడియాలో కరోనా వైరస్ నుంచి కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు. తాజాగా తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ సోషల్ మీడియాలో కరోనాపై స్పందించారు. 2011లో విడుదలైన ‘కాంటాజియన్’ మూవీ చేస్తే వైరస్ ఎలా విజృంభిస్తుందో పూర్తిగా అర్థమవుతుందని పేర్కొన్నారు. ప్రతీఒక్కరూ ఈ మూవీని చూడాలని కోరారు.

కరోనా వైరస్ లాంటి కథాంశంతోనే 2011లో ‘కాంటాజియన్’ మూవీ విడుదలైంది. ఈ సినిమా నిండా ఇలాంటి వైరస్ సోకి ప్రజలు ఇబ్బందులు పడ్డారో ఉంటుందని పేర్కొంది. ఈ మూవీ రిలీజ్ అయినపుడు పెద్దగా ఆడలేదని వరలక్ష్మి తెలిపింది. దేశంలో ప్రస్తుత కరోనా పరిస్థితులకు ఈ మూవీకి కొంత అవినాభావ సంబంధం ఉండటంతో ప్రేక్షకులను ఈ మూవీని చూసేందుకే ఆసక్తి చూపుతున్నారని చెబుతుంది. ప్రస్తుతం ఈ మూవీ సోషల్ మీడియాలో విశేష ఆదరణ పొందుతుందని తెలిపింది. ఈ మూవీ చూస్తే వైరస్ ఎంత త్వరగా వ్యాపిస్తుందో అర్థమవుతుందని ఆమె పేర్కొంది.

కరోనా మహమ్మరి దేశంలో విజృంభిస్తున్నందున అందరూ ఇళ్లకే పరిమితమవ్వాలని వరలక్ష్మి సూచించింది. అందరూ సామాజిక దూరం పాటించాలని.. స్వీయనియంత్రణ పాటించాలని సూచించింది. వైరస్ ఒకరి నుంచి ఒకరికి ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వరలక్ష్మి కోరింది.

చెర్రీకి ఉపాసన ‘స్వీట్’ గిఫ్ట్

మెగాపవర్ స్టార్ రాంచరణ్ బర్త్ డేకు మెగా కోడలు ఉపాసన స్వీట్ గిప్ట్ ఇచ్చారు. చెర్రీ పుట్టిన రోజున సందర్భంగా ఉపాసన తానే స్వయంగా చేసిన బర్త్‌డే కేక్ ను ప్రిపేర్ చేశారు. ఈ కేకునే చెర్రీ కట్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఉపాసన సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ‘హ్యాపీ బర్త్‌డే రామ్‌చరణ్.. బర్త్ డే కేక్‌ను ఎంజాయ్ చేశావని అనుకుంటున్నా’ అని ట్వీటర్లో పోస్టు చేయడం అభిమానులను ఆకట్టుకుంది.

కరోనా వైరస్ కారణంగా అన్ని సెలబ్రెషన్లకు అందరూ దూరం పాటిస్తున్నారు. కొందరు ఏకంగా పెళ్లిళ్లు, ఇతర వేడుకలను అందరూ రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన బర్త్ డే సెలబ్రెషన్స్ కు దూరంగా ఉన్న సంగతి తెల్సిందే. లాక్డౌన్ నేపథ్యంలో బయటికి వెళ్లే వీలులేకపోవడంతో చెర్రీ సతీమణి ఉపాసన తానే స్వయంగా బర్త్ కేకును తయారు చేశారు. ఈ కేకునే రాంచరణ్ కట్ చేసి బర్త్ డే వేడుకలను జరుపుకున్నాడు. ప్రియమైన శ్రీమతి భర్త కోసం కేక్ చేస్తే ఆ మాజానే వేరుగా ఉంటుందని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

అదేవిధంగా తారక్, ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ చెర్రీకి, మెగా అభిమానులకు అదిరిపోయే గిప్ట్ అందించింది. ‘ఆర్ఆర్ఆర్’లో రాంచరణ్ కు సంబంధించిన పాత్రకు సంబంధించిన వీడియోను ఎన్టీఆర్ సోషల్ మీడియాలో విడుదల చేయగా వైరల్ గా మారింది. అల్లూరి సీతారామారాజుగా చెర్రీ అద్భుతంగా నటించాడు. చెర్రీ నటనకు బ్యాగౌండ్లో ఎన్టీఆర్ వాయిస్ తోడవడంతో డైలాగులు మతాబుల్లా పేలాయి. ఈ వీడియోను చూసిన మెగాస్టార్ ‘ఆర్ఆర్ఆర్’టీమ్, తారక్ ను అభినందించారు.

కరోనా నుండి బైట పడకపోతే ఆర్ధికంగా దుర్భరం

వెంటనే కరోనా వైరస్ నుండి బైటపడలేని పక్షంలో ప్రపంచ ఆర్ధిక పరిస్థితులు దుర్భరంగా మారే అవకాశం ఉన్నదని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నేడు హెచ్చరించింది. కరోనా దెబ్బకు యావత్ ప్రపంచం ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలోకి అడుగుపెట్టిన్నట్లు నేడు అధికారికంగా ప్రకటించింది.

కరోనా ప్రభావం యావత్ ప్రపంచంపై తీవ్ర స్థాయిలో ఉందని, దీని కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని, రానున్న రోజుల్లో దీని ప్రభావం భారీగా ఉండబోతోందని ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టాలినా జార్జీవా వెల్లడించారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక వృద్ధిని తాము మరోసారి సమీక్షించామని ఆమె తెలిపారు.

మనం ఆర్థిక సంక్షోభంలోకి అడుగుపెట్టేశామని… ఇది క్లియర్ అని ఆమె స్పష్టం చేశారు. కరోనా నేపథ్యంలో 189 దేశాలకు చెందిన ఐఎంఎఫ్ ప్రతినిధులతో సమావేశానంతరం క్రిస్టాలినా ఈ మేరకు ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రపంచ దేశాలన్నీ కరోనాను కట్టడి చేయాలని… వ్యవస్థలో నిధుల కొరత లేకుండా చూసుకోవాలని, అప్పుడే 2021లో ఈ మాంద్యం నుంచి మనం బయటపడే అవకాశాలు ఉన్నాయని క్రిస్టాలినా తెలిపారు. ప్రపంచంలోని పెద్ద ఆర్థిక వ్యవస్థలతో పాటు అమెరికా కూడా మాంద్యంలో ఉందని ఆమె స్పష్టం చేశారు.

అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఈ ఏడాది మాంద్యం ప్రభావం ఏ మేరకు ఉండబోతోందో అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. వైరస్ ను అదుపుచేయడం ఒక్కటే ప్రస్తుత పరిస్థితుల్లో దీని నుంచి బయటపడే మార్గమని చెప్పారు. లేని పక్షంలో తీవ్ర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఆర్థిక మాంద్యం కారణంగా దివాళాలు ఎక్కువ అవుతాయని, భారీ సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోతారని క్రిస్టాలినా ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక సాయం కోసం 81 దేశాల నుంచి తమకు ఎమర్జెన్సీ రిక్వెస్ట్ లు ఉన్నాయని, వీటిలో 50 పేద దేశాలని చెప్పారు.

ప్రస్తుత పరిస్థితుల్లో 2.5 ట్రిలియన్ డాలర్లు అవసరం కావచ్చని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో, సంక్షోభం నుంచి బయట పడేందుకు అన్ని దేశాలు కరోనా కట్టడికి కృషి చేయాలని విన్నవించారు.

ఆ 15 లక్షల మంది సంగతి తేల్చవలసిందే!

ప్రస్తుతం దేశీయ, అంతర్జాతీయ రవాణా వ్యవస్థలు దిగ్బంధనం కావడంతో కొత్తగా దేశంలోకి కరోనా వైరస్ కేసులు వచ్చే అవకాశం దాదాపుగా లేదు. దేశంలోపల సహితం ఈ వ్యాధి ఉద్భవించిన దాఖలాలు కూడా లేవు. కేవలం విదేశాల నుండి వచ్చిన వారికి సోకడం, అది బయటపడక వారు యధావిధిగా తిరుగుతూ ఉండడంతో వారి కుటుంభం సభ్యులకు, వారికి సన్నిహితంగా వచ్చిన వారే రోజు రోజుకు పాజిటివ్ కేసులుగా బయటపడుతున్నాయి.

అందుకనే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. గత రెండు నెలల్లో, జనవరి 18 నుండి మార్చ్ 23 వరకు, విదేశాల నుంచి దేశంలోకి 15 లక్షల మంది వచ్చారని గుర్తించింది. కాబట్టి వారందరిని గుర్తించి, వారందరికీ వైరస్ నిర్ధారణ పరీక్షలు జరపడం ద్వారా దీనిని కట్టడి చేయవచ్చని నిర్ణయానికి వచ్చింది.

అయితే వీరిలో పది శాతం మందికి కూడా ఇప్పటి వరకు పరీక్షలు జరపలేదు. పరీక్షలు జరిపిన వారిలో సహితం చాల తక్కువ మందిని మాత్రమే స్వీయ దిగ్బంధనంలో ఉంచారు. దానితో వీరందరిని గుర్తించి కోవిద్-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్రాలను కోరుతూ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్‌ గౌబా లేఖలు వ్రాసారు.

కరోనా వైరస్‌ మరింత వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఈ 15 లక్షల మందిపై గట్టి నిఘా ఉంచాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు. అయితే వారితో పాటు వారి కుటుంభం సభ్యులు, వారి ఈ రెండు నెలల్లో వారితో సన్నిహితంగా తిరిగిన వారిపై నిఘా ఉంచవలసిన అవసరం ఉంది. అంతటి సార్ధ్యం మన వైద్య వ్యవస్థకు ఉన్నదా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

కేంద్ర ఆరోగ్య శాఖ సహితం విదేశాల నుంచి వచ్చిన వారిపై నిఘా ఉంచాలని రాష్ట్రాలను ఆదేశించింది . కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అదనపు ఆస్పత్రులు సిద్ధంగా ఉంచాలని కోరింది.

మరోవంక, మూడు వారాల లాక్‌డౌన్‌తో అసంఘటిత రంగం ఎదుర్కొనే ఇబ్బందులు కేంద్ర, రాష్ట్రాలకు ఆందోళన కలిగిస్తున్నాయి. వీరి సంఖ్య కోట్ల సంఖ్యలో ఉండే అవకాశం ఉంది. పనుల్లేక పస్తులుండాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్న వ్యవసాయ కూలీలు, కార్మికులు, ఫ్యాక్టరీ కార్మికులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాల్సి ఉంది.

వ్యవసాయ కూలీలు, వలస కార్మికులు, ఫ్యాక్టరీ వర్కర్లు, అసంఘటిత రంగ కార్మికుల భారీ వలసలను అడ్డుకోవాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు సూచించింది. లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన కార్మికులకు ఉచితంగా ఆహారం అందేలా చూడాలని కోరింది. హాస్టళ్లు, పేయింగ్ గెస్ట్, అద్దె వసతి గృహాలకు నిత్యావసరాలు అందేలా చూడాలని సూచించింది. విద్యార్థులు, వర్కింగ్ వుమెన్‌కి నిత్యావసరాలు నిరాటంకంగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర హోంశాఖ కోరింది.

ఈ దిశలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు క్రియాశీల పాత్ర వహించేందుకు అడుగులు వేస్తున్నప్పటికీ ఆచరణలో ఏ మేరకు ఫలితం ఇస్తుందో చూడవలసి ఉంది.

హౌస్ క్వారంటైన్ యాప్ ప్రవేశపెట్టిన ఏపీ పోలీసులు

క్వారంటైన్లో ఉన్నవారి కదలికల పై నిఘా కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం హౌస్ క్వారంటైన్ యాప్ పేరుతో సరికొత్త మొబైల్ యాప్ ను అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఒక్కరోజులోనే హౌస్ క్వారంటైన్ అప్లికేషన్ లో విదేశాల నుండి ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన ఐదు వేల మంది వివరాలను పోలీసులు పొందుపరచారు. మరో 24 గంటల్లో 20 వేల మంది వివరాలను నమోదు చేయనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. అప్లికేషన్ లో నమోదైన వివరాలు జియో ట్యాగింగ్ తో అనుసంధానం చేస్తారు. వారి కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతారు.

క్వారంటైన్ నుండి 50 మీటర్ల జియో ట్యాగింగ్ పరిధి దాటి బయటకు వస్తే తక్షణమే పోలీస్ కంట్రోల్ కు ఆటో మ్యాటిక్ గా అలారం మోగడంతో సమాచారం తెలుస్తుంది. దీంతో నిమిషాల వ్యవధిలోనే అక్కడికి చేరుకునే విధంగా పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మొక్కవోని ధైర్యంతో తన మేధస్సును నిబద్ధతను చాటి చెబుతూ దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు. ఇది ఒక రకంగా విదేశాల నుండి ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన వారికి లక్ష్మణరేఖగా భావించవచ్చంటున్నారు.

కరోన ఫేక్ అలెర్ట్… ఈ వార్తలను నమ్మకండి!

కరోనా వ్యాప్తి చెందడంతో పాటు సోషల్ మీడియా లో దానిపై వదంతులు కూడా అదే మొత్తంలో వ్యాప్తి చెందాయి. దేశంలో వైరస్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్న వేళ దానిపై అసత్యపు పోస్టులు కూడా అదే స్థాయిలో పెరిగాయి. ఇతరులకు అవగాహన ముసుగులో కొందరు ఫేక్‌ న్యూస్‌ ను ప్రచారం చేస్తుండడం బాధాకరం.

ఇటీవల కాలంలో కొన్ని ఫేక్ న్యూస్ బాగా వైరల్
అయ్యాయి. రష్యాలో సింహాలను వీధుల్లోకి వదిలారని,ఇటలీలో కుప్పలు తెప్పలుగా శవాలను పూడ్చిపెడుతున్నారని, జియో సంస్థ లైఫ్‌ టైమ్‌ ప్లాన్‌ ను కేవలం రూ.498కే అందిస్తోందని, మొదలైన వార్తలు బాగా వైరల్ అయ్యాయి.

సోషల్ మీడియా లో వైరల్ అయిన ఈ వార్తలు ఏవీ కూడా నిజం కాదని తేలాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రాకుండా రష్యా ప్రభుత్వం సుమారు 500 సింహాలను రోడ్లపైకి విడిచిపెట్టారంటూ చేసిన ప్రచారం అవాస్తవం. అది 2016లో దక్షిణాఫ్రికాలో ఓ సినిమా చిత్రీకరణలో భాగంగా తీసిన చిత్రమిది.

అలాగే కరోనా కారణంగా ఇటలీలో చనిపోయిన వారిని పెద్ద ఎత్తున వాహనాల్లో తరలించి గుట్టలుగా పోస్తున్నారన్నది కూడా అవాస్తవం. అది కూడా ఒక థ్రిల్లర్‌ చిత్రంలోని వీడియో.

కరోనా వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఇది బాగా వైరల్‌ అయ్యింది. భారత్ లో జియో కొత్త లైఫ్ టైం ప్లాన్ కేవలం రూ.498కే అందిస్తోందని, అందుకోసం ఈ లింక్‌ క్లిక్‌ చేయండి అంటూ ఓ పోస్ట్‌ సర్క్యులేట్‌ అయింది. ఇది సైబర్‌ నేరగాళ్ల పని అని జియో సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

తెలుగు సినిమా వాళ్ళే అందరి కన్నా ‘టాప్’

తెలుగు సినిమా రంగం ఇప్పుడు భారత దేశంలో అందరికీ ఆదర్శం గా నిలుస్తోంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ తెలుగు సినీ తారలు , నిర్మాతలు దర్శకులు సాయం అందించడం లో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఊహించని రీతిలో ముందుకొచ్చి ఆర్ధికంగా విరాళాలు ఇస్తున్నారు. వీరి వితరణ చూసి దేశమంతా ప్రశంసిస్తున్నారు. తెలుగు సినీ రంగం నుంచి ఇప్పటివరకు సుమారు 13 కోట్ల రూపాయలు పైగానే ఆర్ధిక విరాళాలు వచ్చాయి. ఇంకా వచ్చే అవకాశం ఉంది. ఇది నిజంగా అభినందించ తగ్గ విషయం. తెలుగు ప్రేక్షకులు గర్వించ తగ్గ విశేషం.

కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ సరైన సమయంలో ప్రభుత్వానికి చేయూత అందిస్తున్న తెలుగు సినీ రంగం దేశం మొత్తానికి ఒక కొత్త దారి చూపించింది. దేశం మొత్తంలో తెలుగు హీరోల మాదిరి స్పందిస్తున్న హీరోలు మరే ఇండస్ట్రీలోనూ లేరు. తమిళ స్టార్లు కూడా ముందుకొచ్చారు కానీ.. మన వాళ్ల ముందు వాళ్ల విరాళాలు చాలా స్వల్పమే …

ఇక హిందీ చిత్ర రంగం వాళ్లయితే తమ దాతృత్వాన్ని చాటుకోవాల్సిన వేళ తేలు కుట్టిన దొంగల్లా మిన్నకున్నారు. అందుకే టాలీవుడ్ స్టార్ల విరాళాల గురించి జాతీయ స్థాయిలో గొప్పగా చెప్పుకొంటున్నారు. మన వాళ్ళను రియల్ హీరోలుగా పొగుడుతున్న సోషల్ మీడియా.. బాలీవుడ్ హీరోలను విమర్శిస్తూ ఈ సమయంలో కూడా మీరు స్పందించరా అంటూ నిలదీస్తోంది.

కరోనా నివారణకు సితార టిప్స్..

చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా(కోవిడ్-19) వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తోంది. ఇండియాలోనూ కరోనా కేసులు పెరిగిపోతుండటంతో కేంద్రం దేశవ్యాప్తంగా 21రోజులు లాక్డౌన్ చర్యలు చేపట్టిన సంగతి తెల్సిందే. అయితే కరోనా మహమ్మరిని ఎదుర్కొనేందుకు పలువురు సెలబ్రెటీలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ప్రముఖంగా మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా కోడలు ఉపాసన ఎప్పటికప్పుడు కరోనాపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

తాజాగా మహేష్ బాబు స్వీట్ డాటర్ సితార కరోనాపై నివారణపై సోషల్ మీడియాలో టిప్స్ వివరిస్తూ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో మహేష్ బాబు తన ట్వీటర్లో అకౌంట్లో పోస్టు చేశారు. ‘బాలవాక్కు బ్రహ్మ వాక్కని.. పిల్లలు చెప్పినవి విని కరోనా మహమ్మరికి దూరంగా ఉండాలని మహేష్ ట్వీట్ చేశారు. ఈ వీడియోలో సితార కరోనాను ఎదుర్కొనేందుకు ముఖ్యమైన ఐదు టిప్స్ వివరించింది. అవేంటో చూద్దాం.

-ఇంట్లో ఉండి, సామాజిక దూరం త‌ప్ప‌క పాటించాలి.
-చేతుల‌ను సబ్బునీళ్లతో 20నుంచి 30సెక‌న్ల పాటు త‌ర‌చుగా శుభ్ర‌ప‌ర‌చుకోవాలి.
-ద‌గ్గు లేదా తుమ్ములు వ‌స్తున్నప్పుడు అరచేతిని కాకుండా మోచేతిని అడ్డుపెట్టుకోవాలి.
– మీ చుట్టూరా ఉన్నవారికి సుమారు మూడు మీట‌ర్ల దూరాన్ని పాటించాలి.
-మీ చేతులతో క‌ళ్లు, నోరు, అలాగే ముక్కును తాకద్దు.
ఈ ఐదింటిని పాటిస్తూ.. ఇంట్లోనే ఉంటూ క‌రోనాను దగ్గరకు రానివ్వకండి అంటూ సూచించింది.

ఇటీవల మహేష్ బాబు కరోనా నివారణకు ఆరు సూత్రాలను వివరించగా మహేష్ కూతురు మాత్రం ఐదు టిప్స్ పాటించి కరోనాకు దూరంగా ఉండొచ్చని చెబుతుంది. ఏదిఏమైనా తండ్రి కూతుళ్లు కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పిస్తుండటంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

https://www.instagram.com/p/B-Pbq2CjZAK/

https://www.instagram.com/p/B-OWAAdDRkI/

చెర్రీ చాలా తెలివైనోడు అనిపిస్తోంది

టాలీవుడ్ లో అగ్ర నిర్మాతలుగా కొనసాగుతూ సినిమా పంపిణీ రంగంలో కోట్లాది రూపాయాలు ఆర్జిస్తున్న వారిలో అల్లు అరవింద్ దిల్ రాజు.. సురేష్ బాబు పేర్లు మనకు తెలుసు. సినిమా వ్యాపారం ఈ ముగ్గురికి తెలిసినంతగా మరో నిర్మాత కు తెలియదనడంలో అతిశయోక్తి లేదు.

ఇక ఈ ముగ్గురి లో గీతా ఆర్స్ట్ అల్లు అరవింద్ గురించి చెప్పాల్సిన పనిలేదు.పంపిణీ రంగంలో మిగతా ఇద్దరి కంటే అల్లు అరవింద్ ఐడియాలజీ కాస్త యూనిక్ గా ఉంటుంది. ఈ మధ్యనే గీతా ఆర్ట్స్ సంస్థకు అనుబంధంగా జీఏ-2 పిక్సర్స్ ని కూడా ఏర్పాటు చేసి అందులోనూ తనదే పైచేయి అనిపించుకొంటున్నాడు. అల్లు అరవింద్ .. తాజాగా గీత ఆర్స్ట్ కి పోటీగా అదే ఫ్యామిలీలో మరో హీరో సినీ డిస్ట్రిబ్యూషన్ కి తెర తీయడంపై సర్వత్రా ఆసక్తి రేపుతోంది .

అల్లు అరవింద్ మేనల్లుడు.. మెగాపర్ స్టార్ రామ్ చరణ్ త్వరలో సినీ పంపిణీ రంగంలోకి అడుగు పెట్టనున్నాడు ఇప్పటికే వైజాగ్., తూర్పుగోదావరి , పశ్చిమ గోదావరి ఏరియాల్లో రామ్ చరణ్ కి మంచి పట్టు ఉంది. దాన్ని ఇపుడు అన్ని జిల్లాలకు వ్యాపింపజేయాలనుకొంటున్నాడు.

సినిమా రంగంలో ఒక్కసారి ఫేమ్ వచ్చిందంటే వద్దనుకున్నా కోట్లాది రూపాయలు వచ్చి పడుతుంటాయి. రంగస్థలం చిత్రం అఖండ విజయం తర్వాత రామ్ చరణ్ మార్కెట్ అమాంతం పెరిగింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద 210 కోట్ల వసూళ్లను సాధించి సంచలనం రేపింది. ఇక ఆ సినిమా పంపిణీ దారులకు భారీ లాభాలొచ్చాయి. సో చెర్రీ సినీ పంపిణీ రంగంలో దిగటానికి ఎటువంటి సంకోచం అక్కర లేదు.

ఇప్పటికే రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ స్థాపించి సొంతంగా సినిమాలు నిర్మిస్తున్నాడు..ఇప్పుడు సొంతంగా డిస్ట్రిబ్యూషన్ రంగం లోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల స్టార్ హీరోల మార్కెట్ రెట్టింపు అయింది. దాంతో తొలివారం వసూళ్లకు ఢోకా లేకుండా పోతోంది. దానికి సాక్ష్యం చెర్రీ నటించిన వినయ విధేయ రామ చిత్రం ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకొన్నాగాని సుమారు 70 కోట్లు షేర్ వసూలు చేయడమే …

వరుణ్ సరసన లావణ్య

Boxer Movie

Boxer Movie

వరుస విజయాలతో ఊపు మీదున్న మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంలో ఒక సినిమా చేస్తున్నాడు. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో నిర్మితమౌతున్న ఈ చిత్రం కోసం వరుణ్ తేజ్ చాలా శ్రమటోడుస్తున్నాడు .అందులో భాగంగా విదేశాల్లో బాక్సింగ్ శిక్షణ కూడా తీసుకున్నాడు. తన గత చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రం కోసం కొత్త మెకోవర్ కూడా చేసుకొంటున్నాడు. ఈ సినిమా అన్ని విధాల కొత్తగా ఉండాలని భావించిన దర్శక నిర్మాతలు హీరోయిన్ పాత్రలో కనబడబోయే అమ్మాయి కూడా కొత్త ఫేస్ అయితే బాగుంటుందని భావించారు. అందుకే బాలీవుడ్ దర్శక నటుడు మహేష్ మంజ్రేకర్ కూతురు సాయి మంజ్రేకర్ ను హీరోయిన్ గా ఎంచుకొన్నారు.

అయితే తాజాగా తెలిసిన దాన్ని బట్టి ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉండబోతుంది … కాకపోతే కేవలం చిన్న ప్లాష్ బ్యాక్ లో మాత్రమే ఈ పాత్ర పరిచయం ఉంటుందట. ఇప్పుడు ఆ పాత్ర కోసం అందాల రాక్షసి లావణ్య త్రిపాఠిను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గతంలో మిస్టర్ చిత్రం లో వరుణ్ తేజ్ తో కలిసి నటించిన ఈమెకు ఈ అవకాశం ఇవ్వాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు బాబీ , వరుణ్ తేజ్ దగ్గర బంధువు సిద్దు ముద్దలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తు ఉండటం తో సినిమా ఫై అంచనాలు భారీగానే ఉన్నాయి.”

కరోనా నివారణకు విరాళం ప్రకటించిన అశ్వినీ దత్

Ashwini Dutt

Ashwini Dutt

కరోనా వైరస్ చేస్తున్న విలయ తాండవానికి తెలుగు చలన చిత్ర పరిశ్రమ కూడా బాగానే స్పందిస్తోంది. పలువురు నిర్మాతలు , దర్శకులు , హీరోలు తమ వంతుగా ఎంతో కొంత ఆర్ధిక సాయం చేస్తున్నారు.

ఆ క్రమంలో కోవిడ్-19 నివారణ కోసం ప్రముఖ నిర్మాత, వైజయంతీ మూవీస్ అధినేత సి. అశ్వినీదత్ రూ. 20 లక్షలు విరాళంగా ప్రకటించారు.

ఈ విరాళాన్ని రెండు భాగాలుగా విభజించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 10 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 10 లక్షలు అందజేస్తున్నట్లు తెలిసింది. కరోనా వ్యాప్తి నిరోధం విషయంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు బాగా కృషి చేస్తున్నాయని ప్రశంసించిన అశ్వినీదత్.. ప్రభుత్వాల సలహాలు, సూచనలు ప్రజలందరూ తూ.చ. తప్పకుండా పాటించాలని ప్రజలను కోరారు. పోలీసులు, వైద్య సిబ్బంది అలుపనేది లేకుండా ప్రజలకు సేవ చేస్తున్నారని , వాళ్ల శ్రమ వృథా కాకుండా ఉండాలంటే.. ఈ విపత్కర పరిస్థితిని సమష్టిగా ఎదుర్కోవాలనీ, ఆ క్రమంలో అందరూ ఇళ్లల్లోనే ఉండాలనీ ఆశించారు.

ఈ వైరస్ కారణంగా షూటింగ్ జరుపుకోవాల్సిన పలు సినిమాలు తమ షూటింగ్ షెడ్యూల్స్ వాయిదా వేసుకున్నాయి. కాగా సామాజిక దూరంను దృష్టిలో పెట్టుకుని షూటింగ్ లను మరో నెల పోస్ట్ ఫోన్ చేయాల్సిందిగా గవర్నమెంట్ కోరుతోంది.