
టాలీవుడ్ లో అగ్ర నిర్మాతలుగా కొనసాగుతూ సినిమా పంపిణీ రంగంలో కోట్లాది రూపాయాలు ఆర్జిస్తున్న వారిలో అల్లు అరవింద్ దిల్ రాజు.. సురేష్ బాబు పేర్లు మనకు తెలుసు. సినిమా వ్యాపారం ఈ ముగ్గురికి తెలిసినంతగా మరో నిర్మాత కు తెలియదనడంలో అతిశయోక్తి లేదు.
ఇక ఈ ముగ్గురి లో గీతా ఆర్స్ట్ అల్లు అరవింద్ గురించి చెప్పాల్సిన పనిలేదు.పంపిణీ రంగంలో మిగతా ఇద్దరి కంటే అల్లు అరవింద్ ఐడియాలజీ కాస్త యూనిక్ గా ఉంటుంది. ఈ మధ్యనే గీతా ఆర్ట్స్ సంస్థకు అనుబంధంగా జీఏ-2 పిక్సర్స్ ని కూడా ఏర్పాటు చేసి అందులోనూ తనదే పైచేయి అనిపించుకొంటున్నాడు. అల్లు అరవింద్ .. తాజాగా గీత ఆర్స్ట్ కి పోటీగా అదే ఫ్యామిలీలో మరో హీరో సినీ డిస్ట్రిబ్యూషన్ కి తెర తీయడంపై సర్వత్రా ఆసక్తి రేపుతోంది .
అల్లు అరవింద్ మేనల్లుడు.. మెగాపర్ స్టార్ రామ్ చరణ్ త్వరలో సినీ పంపిణీ రంగంలోకి అడుగు పెట్టనున్నాడు ఇప్పటికే వైజాగ్., తూర్పుగోదావరి , పశ్చిమ గోదావరి ఏరియాల్లో రామ్ చరణ్ కి మంచి పట్టు ఉంది. దాన్ని ఇపుడు అన్ని జిల్లాలకు వ్యాపింపజేయాలనుకొంటున్నాడు.
సినిమా రంగంలో ఒక్కసారి ఫేమ్ వచ్చిందంటే వద్దనుకున్నా కోట్లాది రూపాయలు వచ్చి పడుతుంటాయి. రంగస్థలం చిత్రం అఖండ విజయం తర్వాత రామ్ చరణ్ మార్కెట్ అమాంతం పెరిగింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద 210 కోట్ల వసూళ్లను సాధించి సంచలనం రేపింది. ఇక ఆ సినిమా పంపిణీ దారులకు భారీ లాభాలొచ్చాయి. సో చెర్రీ సినీ పంపిణీ రంగంలో దిగటానికి ఎటువంటి సంకోచం అక్కర లేదు.
ఇప్పటికే రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ స్థాపించి సొంతంగా సినిమాలు నిర్మిస్తున్నాడు..ఇప్పుడు సొంతంగా డిస్ట్రిబ్యూషన్ రంగం లోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల స్టార్ హీరోల మార్కెట్ రెట్టింపు అయింది. దాంతో తొలివారం వసూళ్లకు ఢోకా లేకుండా పోతోంది. దానికి సాక్ష్యం చెర్రీ నటించిన వినయ విధేయ రామ చిత్రం ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకొన్నాగాని సుమారు 70 కోట్లు షేర్ వసూలు చేయడమే …