
వరుస విజయాలతో ఊపు మీదున్న మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంలో ఒక సినిమా చేస్తున్నాడు. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో నిర్మితమౌతున్న ఈ చిత్రం కోసం వరుణ్ తేజ్ చాలా శ్రమటోడుస్తున్నాడు .అందులో భాగంగా విదేశాల్లో బాక్సింగ్ శిక్షణ కూడా తీసుకున్నాడు. తన గత చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రం కోసం కొత్త మెకోవర్ కూడా చేసుకొంటున్నాడు. ఈ సినిమా అన్ని విధాల కొత్తగా ఉండాలని భావించిన దర్శక నిర్మాతలు హీరోయిన్ పాత్రలో కనబడబోయే అమ్మాయి కూడా కొత్త ఫేస్ అయితే బాగుంటుందని భావించారు. అందుకే బాలీవుడ్ దర్శక నటుడు మహేష్ మంజ్రేకర్ కూతురు సాయి మంజ్రేకర్ ను హీరోయిన్ గా ఎంచుకొన్నారు.
అయితే తాజాగా తెలిసిన దాన్ని బట్టి ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉండబోతుంది … కాకపోతే కేవలం చిన్న ప్లాష్ బ్యాక్ లో మాత్రమే ఈ పాత్ర పరిచయం ఉంటుందట. ఇప్పుడు ఆ పాత్ర కోసం అందాల రాక్షసి లావణ్య త్రిపాఠిను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గతంలో మిస్టర్ చిత్రం లో వరుణ్ తేజ్ తో కలిసి నటించిన ఈమెకు ఈ అవకాశం ఇవ్వాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు బాబీ , వరుణ్ తేజ్ దగ్గర బంధువు సిద్దు ముద్దలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తు ఉండటం తో సినిమా ఫై అంచనాలు భారీగానే ఉన్నాయి.”