Home Blog Page 8567

ప్రభుత్వ నిర్లక్ష్యంలో అమెరికా ప్రజల జీవితాలు

Corona virus explored in USA to dangerous level
Pneumonia coronavirus
Corona virus explored in USA to dangerous level
Pneumonia coronavirus

కరోనా మహమ్మారి రోజు రోజు కు దాని విశ్వ రూపం, వికృత రూపం చూపిస్తూ వుంది. ఇప్పుడు దాని ప్రతాపం అమెరికాపై పూర్తి గా కేంద్రీకృతమయ్యింది. దాదాపు లక్షకు పైగా కరోనా కేసులు నమోదుకావటం కలవరం కలిగిస్తుంది. ఆరోగ్య నిపుణులు మొదట్నుంచి ఇటువంటి ఉపద్రవం తలెత్తబోతుందని హెచ్చరిస్తూనే వున్నారు. అయినా ప్రభుత్వం ముఖ్యంగా అధ్యక్షుడు ట్రంప్ ఈ హెచ్చరికలను కొట్టిపారేశాడు. చాలా తేలికగా తీసుకున్నాడు. ఇదంతా కట్టుకధలుగా కొట్టిపారేశాడు. గత రెండువారాలనుంచే దీని తీవ్రతను అర్ధంచేసుకోగలిగాడు. ఇటువంటి మహమ్మారి విషయంలో ఒక్కరోజు లేటయినా పెద్ద ప్రమాదమేనని గ్రహించలేకపోయాడు. ఇప్పుడు చేతులుకాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా హడావిడి చేయటం వలన వచ్చిన ఉపద్రవాన్ని ఆపలేరు. జరిగిన లోపం తన అధికారానికి ముప్పు వస్తుందేమోననే భయం తో ఈ నెపాన్ని చైనా పై నెట్టి తప్పించుకోవాలని చూస్తున్నాడు. చైనా తప్పు ఉన్నమాట నిజమైనా తను ముందస్తు చర్యలు తీసుకోవటం లో విఫలమయ్యాడనేది కూడా కఠోర సత్యం.

ప్రభుత్వ నిర్లక్ష్యమే కొంప ముంచింది 

అమెరికా లో మొట్టమొదటగా వుహాన్ నుంచి అమెరికా పశ్చిమతీర రాష్ట్రమైన వాషింగ్టన్ లోని సియాటిల్ కి జనవరి 21వ తేదీన వచ్చిన ప్రయాణీకుడికి ఈ వైరస్ లక్షణాలు కనబడ్డాయి. వెంటనే అక్కడి ఆరోగ్య నిపుణులు ప్రభుత్వాన్ని, ప్రజల్ని అప్రమత్తం చేశారు. తక్షణమే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టకపోతే పెను ప్రమాదం పొంచివుందని హెచ్చరించారు. దురదృష్టవశాత్తు ప్రతిస్పందన వేగంగా లేదు. ఈ లోపు చైనా నుంచి రాకపోకలు చేసేవాళ్ళు నిరభ్యంతరంగా దేశంలోపలికి వేలమంది వచ్చారు. గమనించిన వెంటనే కొన్ని ముందస్తు చర్యలు చేపట్టివుంటే పరిస్థితి అదుపులోనేఉండేది. టెస్టింగ్ ఎంత ప్రహసనం గా జరిగిందంటే సియాటిల్ లాంటి పెద్దనగరం వుండే వాషింగ్టన్ రాష్ట్రం మొత్తానికి రోజుకు 200 కన్నా టెస్టులు చేసే కెపాసిటీ లేదు. అదీ ఫలితం రావటానికి 24 గంటలు పైగా వేచివుండాల్సి వచ్చేది. ఈ టెస్ట్ కిట్లు ఇప్పటి అధునాతన సాంకేతికతకు పనికిరావని నెత్తి నోరు మొత్తుకున్నా, ప్రైవేటు లాబులు గంటలోపే ఇస్తామని చెప్పినా వినే నాధుడు లేడు. బయో సాంకేతికత లో ప్రపంచం లోనే మొదటి స్థానంలో వున్న అమెరికాలో ఇలాజరిగివుంటుందంటే ఎవరైనా నమ్ముతారా. కానీ నిజం. వయోవృద్ధులు వుండే లైఫ్ కేర్ సెంటర్లలో సియాటిల్ శివారు ప్రాంతం కిర్క్ ల్యాండ్ లో ఎక్కువ మరణాలు సంభవించాయి. కొన్నాళ్ళు దాని గవర్నర్ కి , ట్రంప్ కి నిధుల విషయం లో మాటల యుద్ధం జరిగింది. వాషింగ్టన్ రాష్ట్రం లో జరిగిన మరణాలతో వాషింగ్టన్ రాజధానిలో వుండే ట్రంప్ కి ఉలికిపాటు వచ్చింది. చివరకు తనపక్కన తిరిగిన వాళ్లకు వ్యాధి సోకిందని నిర్ధారణ అవటంతో అమెరికా మొత్తం కలవరపాటు కి గురయ్యింది. అప్పటికి గానీ ట్రంప్ కి పూర్తిగా తలకెక్కలేదు.

అప్పటికి కూడా కాలం చెల్లిన టెస్టు కిట్లతోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనిపై దేశవ్యాప్తంగా వచ్చిన అలజడితో చివరకు పోయినవారం 45 నిముషాల్లోనే ఫలితం వచ్చే కిట్లు ప్రవేశపెట్టారు. ఈరోజు తాజాగా 15నిమషాల్లోనే ఫలితం వచ్చే కిట్లను ఎఫ్ డిఎ ఆమోదించింది. అలాగే ఒకేసారి ఎక్కువమందికి చేసే వెసులుబాటు కల్పించారు. దానితో ఈవారంలో ఒక్కసారి వ్యాధిసోకిన కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఇప్పటికి ఒక లక్షకు పైగా  చేరుకొని ప్రపంచంలోనే ఈ వ్యాధి సోకినవారిలో మొదటి స్థానం లో నిలిచింది. నిపుణుల అంచనాప్రకారం వచ్చే రెండు మూడు వారాలు ఇంకా ఈ సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం వుంది. ఇప్పటికీ దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించలేదు. అదేమంటే కొన్ని రాష్ట్రాల్లో ఈ వైరస్ ప్రభావం అంతగా లేదని మాట్లాడుతున్నారు. నిపుణుల అంచనా ప్రకారం న్యూయార్క్ లో వచ్చిన ఉపద్రవం ఇంకొన్ని నగరాల్లో కూడా వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. లూసియానాకి చెందిన న్యూ ఆర్లిన్స్ నగరానికి ఆ ముప్పు పొంచివుందని చెబుతున్నారు. అలాగే డల్లాస్ , అట్లాంటా , మియామీ,డిట్రాయిట్ , చికాగో, ఫిలడెల్ఫియా ల్లో కూడా ఈ వైరస్ ఉగ్రరూపం దాల్చే అవకాశాన్ని కొట్టిపారేయలేమని చెబుతున్నారు. విశేషమేమంటే ట్రంప్ అధికారం లోకి వచ్చిన తర్వాత జాతీయ అంటువ్యాధుల నివారణ వైట్ హౌస్ విభాగాన్ని ఎత్తివేశాడు. దీనిపై ఇప్పుడు పలు విమర్శలు తలెత్తుతున్నాయి.

న్యూయార్క్ లో ఇంత విస్ఫోటనం ఎందుకు జరిగింది?

న్యూయార్క్ సిటీ జనాభా 86 లక్షలు. అమెరికా మొత్తం మీద అతి జనసాంద్రత కలిగిన నగరం. చదరపు మైలుకి 27 వేలమంది నివసిస్తున్నారు. ప్రపంచం మొత్తం నుంచి టూరిస్టులు ఎక్కువగా వచ్చే నగరం కూడా అదే. ఇంకో విశేషమేమంటే న్యూయార్క్ నగరం లో ప్రజలు ఎక్కువమంది పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ నే ఉపయోగిస్తారు. అటువంటి నగరం లో ఈ వైరస్ అతివేగంగా వ్యాప్తి చెందే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తూనే వున్నారు. ఇప్పుడు ఎక్కువ టెస్టు కిట్లు అందుబాటులోకి రావటం, వెంటనే ఫలితం రావటం తో ఒక్కసారి కేసులు బయటకు వచ్చాయి. అయినా ముందస్తు చర్యలు, కఠిన చర్యలు తీసుకోవటంలో ఆ రాష్ట్ర గవర్నరు, న్యూయార్క్ మేయర్ మీనమేషాలు లెక్కిస్తూ వచ్చారు. దీనికి తోడు ట్రంప్ కి, వీరికి మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. విశేషమేమంటే ఈ చర్యలపై ఇప్పటికి చర్చ నడుస్తూనే వుంది. అసలు లాక్ డౌన్ వలన నష్టాలు కూడా ఉన్నాయని ఇప్పటికీ ఒకవర్గం వాదిస్తూనే వుంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అతి ప్రజాస్వామ్యం కూడా చేటు చేస్తుందనటానికి ఇంత కన్నా పెద్ద ఉదాహరణ ఎక్కడా ఉండదు.

ఇప్పటికే మొత్తం ఈ వైరస్ సోకిన వాళ్లలో మూడింట ఒక వంతు న్యూయార్క్ రాష్ట్రం నుంచే వున్నారు. అందులో మూడొంతులు న్యూయార్క్ నగరం లోనే వున్నారు. అలాగే చనిపోయినవాళ్లలో కూడా న్యూయార్క్ నగరవాసులు మూడింట ఒకవంతు వున్నారు. న్యూయార్క్ మేయర్ డి బ్లాసియో అంచనా ప్రకారం వచ్చే రెండు వారాల్లో న్యూయార్క్ నగరం లోని 86 లక్షలమందిలో సగం మందికి ఈ వైరస్ సోకే ప్రమాదముందని చెబుతున్నాడు. తాజాగా ప్రతి 3 రోజులకి వైరస్ సోకిన వాళ్ళ సంఖ్య రెట్టింపు అవుతుంది. న్యూయార్క్ గవర్నర్ క్యుమో అంచనా ప్రకారం ఒక్క న్యూయార్క్ రాష్ట్రానికే 30 వేల వెంటిలేటర్లు, 1,40,000 హాస్పిటల్ బెడ్లు కావలసి ఉంటుందని ప్రకటించాడు. అప్పటికీ ఒక వెంటిలేటర్ ఇద్దరు పేషెంట్లకు వాడితేనే అంత అవసరముందని , అర్జెంటుగా సప్లై చేయమని ట్రంప్ ని అర్ధించాడు. అయితే గవర్నర్ అంచనా అతిగా ఉందని అన్ని వెంటిలేటర్లు అవసరం లేదని ట్రంప్ ప్రకటించాడు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ఇలా పబ్లిక్ గా కొట్లాడుకోవటం చూస్తే ప్రజలకు రోత పుడుతుంది.

ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకుంటుందా?

నిపుణుల అంచనా ప్రకారం అమెరికాలో వైరస్ ఇంకా పీక్ స్టేజి కి రాలేదని ఇంకా రెండు , మూడు వారాలు కర్వ్ పైపైకి వెళుతూనేవుంటుందని చెబుతున్నారు. ఇలా పెరుగుకుంటూ పోతే ఈ సంఖ్య ఎంత అవుతుందోనని ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ లోపల ట్రంప్ ఒక ప్రకటన ఇస్తూ ఈస్టర్ ఆదివారం ఏప్రిల్ 12వ తేదీకి సాధారణ స్థితికి కొంత భాగం వస్తుందని , నిర్బంధాలు తొలగించి వ్యాపార కార్యకలాపాలు ప్రారంభిస్తానని చెప్పాడు. దానిపై నిపుణులు తీవ్రంగా విభేదిస్తున్నారు. తొందరపడి అటువంటి నిర్ణయం తీసుకొంటే పరిస్థితులు దారుణంగా వుంటాయని హెచ్చరిస్తున్నారు. పూర్తిగా నియంత్రణలోకి రావటానికి ఇంకా ఎక్కువ సమయం పడుతుందని ఎటువంటి తొందరపాటు నిర్ణయం తీసుకున్నా ఈ మహమ్మారి దుష్పరిణామాలు దారుణంగా వుంటాయని చెబుతున్నారు. భారత దేశం ఇప్పటికే దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించి కఠిన చర్యలు తీసుకుంటే లక్ష కేసులు వుండి కూడా అమెరికా ఇలా తటపటాయిస్తుంటే ప్రజల జీవితాలు ఏమి కావాలి? అందులో ఇటీవలి కాలంలో భారతీయులు ఎక్కువమంది స్థిర నివాసాలు ఏర్పరుచుకోవడం, లక్షలాది మంది విద్యార్థులు చదువులకోసం అమెరికా వెళ్ళటం తెలిసిందే. భారతీయుల్లో కూడా మన తెలుగు వాళ్ళు గణనీయమైన సంఖ్య లో వున్నారు. మన రెండు రాష్ట్రాల్లోని చాలా కుటుంబాల పిల్లలు ఎవరో ఒకరు అమెరికాలో ఉండటంతో అమెరికాలో పరిస్థితులపై ఆందోళన చెందుతున్నారు. పరిస్థితులు ఎలా మార్పుచెందుతాయోనని ఇక్కడి వాళ్ళు టెన్షన్ తోనే కాలం గడుపుతున్నారు. తాజాగా అందిన వార్తల ప్రకారం 2లక్షల కోట్ల డాలర్ల బిల్లుపై ట్రంప్ సంతకం చేసాడు. దీని ప్రకారం చాలా మందికి 1200 డాలర్లు చొప్పున చెల్లిస్తారు. అమెరికా లో పరిస్థితులు త్వరలో సాధారణ స్థితికి రావాలని కోరుకుందాం.

పవన్ సినిమాపై స్పందించిన రేణుదేశాయ్

Renu Desai

Renu Desai
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెల్సిందే. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’ తెలుగులో ‘వకీల్ సాబ్’గా తెరకెక్కుతుంది. ఈ మూవీలో పవన్ మాజీ భార్య రేణుదేశాయ్ నటిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నట్లు గతకొంతకాలంగా సోషల్ మీడియాలో గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై తాజాగా రేణుదేశాయ్ స్పందించారు.

కల్యాణ్‌గారి సినిమాలో తాను నటిస్తున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఇలాంటి రూమర్లను దయచేసి ఎవరూ నమ్మవద్దన్నారు. కరోనా లాంటి మహమ్మరి ప్రజలను బెంబెలెత్తిస్తున్న సమయంలోనూ ఇలాంటి రూమర్లను కొందరు ప్రచారం చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుందని తెలిపారు. దయచేసి ఇలాంటి రూమర్స్ పుట్టించొద్దని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా కరోనా వైరస్ విషయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతీఒక్కరూ స్వీయనియంత్రణ పాటించి కరోనా మహమ్మరిని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సూచనలు పాటించాలని రేణుదేశాయ్ కోరారు.

‘వకీల్ సాబ్’ మూవీని వేణు శ్రీరామ్ తెరెక్కిస్తున్నాడు. ఈ మూవీలో నివేథా థామస్, అంజలి, అనన్య కీలక పాత్రలో నటిస్తున్నారు. పవన్ జోడీగా లావణ్య త్రిపాఠిని ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ మూవీని దిల్ రాజు, బోనీకపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘వకీల్ సాబ్’ మూవీకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

తుపాకీ సీక్వెల్లో కాజల్‌?

kajal in tupaki movie

kajal in tupaki movie
టాలీవుడ్ భామ కాజల్ అగర్వాల్ వరుస ఆఫర్లుతో దూసుకుపోతుంది. గత దశాబ్దకాలంగా తెలుగు, తమిళం, బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బీజీగా మారింది. ఇటీవల కొత్త భామ రాకతో కాజల్ అగర్వాల్ హవా తగ్గింది. అంతేకాకుండా వయస్సు పైబడటంతో కేవలం సీనియర్ హీరో పక్కనే అవకాశాలు వస్తున్నాయి. అయినప్పటికీ ఈ భామ అందాల ఆరబోతలో ఎక్కడ తగ్గకపోవడంతో మంచి ఆఫర్లు దక్కించుకుంటుంది. తాజాగా తమిళ హీరో విజయ్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లలో పలు సినిమాలు వచ్చాయి.

మురగదాస్ దర్శకత్వంలో విజయ్ నటించే ‘తుపాకీ’ సిక్వెల్లో తొలి పార్ట్ లో నటించే కాజల్ నే తీసుకునేందుకు చిత్రబృందం మొగ్గుచూపుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఈ సినిమా కథకు సంబంధించిన పనులు జరుగుతున్నాయ. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ సినిమాతోపాటు కాజల్ అగర్వాల్ మెగాస్టార్ సరసన ‘ఆచార్య’ మూవీలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గతంలోనూ కాజల్ అగర్వాల్ చిరంజీవి నటించిన ‘ఖైదీ-150’ మూవీలో నటించి మెప్పించింది. ఈ మూవీ అప్పట్లో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది.

దర్శకుడు కొరటాల శివ ‘ఆచార్య’ని తెరకెక్కిస్తున్నాడు. చిరంజీవి ఇందులో డ్యుయల్ రోల్స్ చేస్తుండగా రాంచరణ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. రాంచరణ్ సరసన రష్మిక మందన్న నటిస్తుండగా చిరంజీవికి జోడి కాజల్ అగర్వాల్ నటిస్తుంది. కాజల్-చెర్రీ కాంబినేషన్లోనూ సూపర్ హిట్టు చిత్రాలున్నాయి. కాజల్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిన ‘మగధీర’లో రాంచరణ్ కు జోడీ కాజల్ అగర్వాల్ నటించింది. ‘ఆచార్య’ మూవీని రాంచరణ్ మ్యాట్నీ ఎంటటైన్మెంట్ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. ‘ఆచార్య’ మూవీకి మ్యూజికల్ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నాడు.

శృతిమించిన లాక్ డౌన్ డ్యూటీ.. ఎస్ఐ సస్పెండ్

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్‌ డౌన్‌ ను విధించిన సంగతి తెలిసిందే. లాక్‌ డౌన్‌ ను సంపూర్ణంగా అమలు చేయడంలో భాగంగా ఓ ఎస్ఐ ఇద్దరు యువకులపై విచక్షణ రహితంగా లాఠీ ఛార్జీ చేశాడు. దీంతో ఉన్నతాధికారులు సదరు ఎస్ఐ ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. రాయచోటి పట్టణంలో వరప్రసాద్ ట్రాఫిక్ ఎస్ఐ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కరోనా లాక్‌ డౌన్ విధుల్లో భాగంగా రాయచోటి పట్టణంలో బైక్‌ పై తిరుగుతున్న సమయంలో ఓ ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై ఎదురుపడడంతో సదరు ఎస్ఐ వరప్రసాద్ లాఠీ ఛార్జీ చేయడంతో పాటు వాహనాన్ని ధ్వంసం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు.. ఘటనపై ప్రాథమికంగా విచారణ జరిపేందుకు ఎస్ఐ వరప్రసాద్ను కడపకు పిలిచి విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఎస్పీ అన్బురాజన్ ప్రకటించారు.

తారక్ దుమ్ములేపాడంటున్న మెగాస్టార్

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇచ్చిన గిఫ్ట్ పై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు రాజమౌళి, ‘ఆర్ఆర్ఆర్’ టీంను మెగాస్టార్ ప్రశంసించారు. తారక్ ట్వీటర్లో విడుదల చేసిన వీడియో మెగాస్టార్ ను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో ఆయన ట్వీటర్లో తారక్ నువ్వు చెర్రీకి ఇచ్చిన గిఫ్ట్ ‘మా అందరిలో ఉత్సాహన్ని నింపింది.. తారక్ అమోఘం’ అంటూ ట్వీట్ చేశారు.

అలాగే దర్శకుడు రాజమౌళిపై ట్వీటర్లో మెగాస్టార్ ప్రశంసలు కురించారు. ‘అదిరింది రాజమౌళి.. మీ అంబులపొది లోంచి వదిలిన రామబాణం ఈ సీతారామరాజు.. అమోఘం తారక్.. దుమ్ము లేపారు.. మాలో ఉత్సాహాన్ని నింపారు.. చరణ్‌కి ఎప్పటికీ గుర్తుండిపోయే బర్త్‌డే సర్‌ప్రైజ్ ఇచ్చారు తారక్.’ అని చిరు తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు.

నిజంగా తారక్ పోస్టు చేసిన వీడియో మెగాస్టార్ నే కాకుండా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం వెయిట్ చేస్తున్న అభిమానులందరిని మెస్మరైజ్ చేసేలా ఉంది. చెర్రీ అద్భుత నటనకు యంగ్ టైగర్ వాయిస్ తోడవడంతో డైలాగులు డైనమైట్ లా పేలాయి. ఈ వీడియో అటూ నందమూరి అభిమానులతోపాటు ఇటూ మెగా అభిమానులను అలరించిందనే చెప్పాలి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవిని ఆకట్టుందనే చెప్పాలి. ఎన్టీఆర్ చెప్పిన టైమ్‌కి విడుదల చేయలేకపోయినా, విడుదలైన తర్వాత మాత్రం సర్ ప్రైజ్ అదిరిపోయింది.

‘ఆర్ఆర్ఆర్’లో మలయాళ సూపర్ స్టార్..

దర్శక దిగ్గజం రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ మూవీని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ అప్డేట్స్ కోసం అభిమానులు కొన్నిరోజులుగా ఎంతో అత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఉగాది నుంచి ‘ఆర్ఆర్ఆర్’కు సంబంధించిన వరుస అప్డేట్స్ ను దర్శకుడు రాజమౌళి విడుదల చేస్తూ మూవీపై భారీ అంచనాలను పెంచేస్తున్నాడు. ఉగాది రోజున ‘ఆర్ఆర్ఆర్’ మోషన్ పోస్టర్ విడుదల చేసిన సంగతి తెల్సిందే. ఈ మోషన్ పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులోనే ‘ఆర్ఆర్ఆర్’ టైటిల్ ‘రౌద్రం రణం రధిరం’గా ప్రకటించారు.

నేడు(శుక్రవారం) చెర్రీ పుట్టిన రోజును పురస్కరించుకొని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ నుంచి సర్ ప్రైజ్ గిప్ట్ అందించారు. కొద్ది క్షణాల కిందటే ‘ఆర్ఆర్ఆర్’లో రాంచరణ్ పాత్రకు సంబంధించిన వీడియోను ఎన్టీఆర్ ట్వీటర్లో రిలీజ్ చేశారు. ‘అల్లూరి సీతారామరాజు’గా చెర్రీ అద్భుత నటనతోడుగా బ్యాగౌండ్లో ఎన్టీఆర్ వాయిస్ తోడవడం మరింత బలాన్నిచ్చింది. ఎన్టీఆర్ చెప్పిన ఒక్కో డైలాగ్ డైనమైట్ లా పేలాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

 

తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ‘ఆర్ఆర్ఆర్’లో కీలక రోల్ చేయనున్నట్లు ఫీల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. ఇందుకు సంబంధించిన కథను రాజమౌళి మోహన్ లాల్ కు చెప్పగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీలో ఇప్పటికే పలువురు హాలీవుడ్, బాలీవుడ్ స్టార్లు నటిస్తున్నారు. అజయ్ దేవగణ్, సీనియర్ నటి శ్రియ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

రాంచరణ్ సరసన బాలీవుడ్ భామ అలియా భట్, ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ఒలీవియా నటిస్తుంది. తాజాగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ కీలక పాత్రలో నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీని దాదాపు 300కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మాత దానయ్య నిర్మిస్తుండగా కీరవాణి అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నాడు.

RRR Posters: Ram Charan as Alluri Seeta Rama Raju

బ్రిటన్ ప్రధానికి బోరిస్ జాన్సన్‌కు కరోనా పాజిటీవ్

బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు కరోనా పాజిటీవ్ వచ్చింది. కరోనా వైరస్ టెస్ట్ చేయించుకోగా ఆయనకు పాజిటీవ్ అని తేలిందని ఆయనే స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం బ్రిటన్‌లో కరోనా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశాధినేతనే కరోనా బారిన పడటం ప్రజలను దిగ్భ్రాంతిలోకి నెట్టేసింది.

‘‘నాకు కరోనా తేలికపాటి లక్షణాలు ఉన్నాయి’’ అని బోరిస్ పేర్కొన్నారు. ఇంగ్లాండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ప్రొఫెసర్ క్రిస్ విట్టి వ్యక్తిగత సలహా మేరకు ప్రధానమంత్రిని కరోనావైరస్ కోసం పరీక్షించారని డౌనింగ్ స్ట్రీట్ ప్రతినిధి తెలిపారు. ఈ పరీక్ష ఎన్‌హెచ్ఎస్ సిబ్బంది నిర్వహించారని ఆయన తెలిపారు.

గ‌త 24 గంట‌ల్లో శ‌రీరంలో కొద్దిగా టెంప‌రేచ‌ర్ పెరిగింద‌ని, ప‌దేప‌దే ద‌గ్గు రావ‌డం వ‌ల్ల‌.. డాక్ట‌ర్ల‌ను సంప్ర‌దించిన‌ట్లు ఆయ‌న చెప్పారు. కాగా, బ్రిటన్ యువరాజు చార్లెస్ కు రెండు రోజులక్రితమే వైరస్ పాజిటివ్ వెల్లడి కావడం తెలిసిందే.

మొన్నటి వరకు క‌రోనా మ‌హ‌మ్మారికి నీవంటే నీవే కారణం అంటూ పరస్పరం నిందించుకున్న చైనా, అమెరికా ప్రభుత్వాలు ఇప్పుడు సమాలోచనలు ప్రారంభించాయి. చైనా అధ్య‌క్షుడు జి జిన్‌పింగ్‌కు శుక్ర‌వారం ఫోన్‌చేసి క‌రోనా అంశంతోపాటు రెండు దేశాల మ‌ధ్య ఇటీవ‌లే కుదిరిన నూత‌న వాణిజ్య విధానంపై కూడా చ‌ర్చించిన‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు.

కోవిడ్ 19 వైర‌స్ స‌మాచారాన్ని చైనా స‌రైన స‌మ‌యంలో ప్ర‌పంచంతో పంచుకోలేద‌ని, ఆ వైర‌స్ చైనా సృష్టేన‌ని ఇటీవ‌ల ట్రంప్ ఇంతకు ముందు ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. చైనా కూడా ఎదురుదాడి చేస్తూ అమెరికా సైన్య‌మే త‌మ‌దేశంలో ఈ వైర‌స్‌ను వ‌దిలింద‌ని ఆరోపించింది.

శుక్ర‌వారం నాటికి ప్రపంచంలోనే అత్య‌ధిక క‌రోనా కేసులు న‌మోదైన దేశంగా అమెరికా నిలువ‌టంతో రెండు దేశాలు విమ‌ర్శ‌లు మాని చ‌ర్చ‌ల బాట ప‌ట్టాయి.

క‌రోనాను చైనా విజ‌య‌వంతంగా నియంత్రించ‌టంతో ఈ మ‌హ‌మ్మారిని ఎదుర్కోవ‌టంలో ప్ర‌పంచానికి ఇప్ప‌డు ఆ దేశ‌మే మార్గ‌ద‌ర్శ‌మైంది. కరోనాను ఎదుర్కోవ‌టంలో అమెరికాకు స‌హ‌కారం అందివ్వ‌గ‌ల‌మ‌ని జిన్‌పింగ్ హామీ ఇచ్చార‌ని చైనా విదేశాంగశాఖ తెలిపింది.

ఎన్టీఆర్ గిప్ట్ కు మెగా ఫ్యాన్స్ ఫిదా

మెగా పవర్ స్టార్ రాంచరణ్ పుట్టిన రోజును పురస్కరించుకొని యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ఎన్టీఆర్ ఇచ్చిన గిఫ్ట్ కు రాంచరణ్ తోపాటు మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా, జూనియర్ ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో నటిస్తున్న సంగతి తెల్సిందే.

చెర్రీ పుట్టిన రోజు కానుకగా ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రాంచరణ్ వీడియోను విడుదల చేశాడు. ‘భీమ్ ఫర్ రామరాజు’ పేరుతో విడుదలైన ఈ వీడియో సీనిప్రియులను విశేషంగా ఆకట్టుకుంటుంది.‘ఆడు కనబడితే నిప్పు కణం నిలబడినట్లుంటది.. కలబడితే యేగు సుక్క ఎగబడినట్లుంటది.. ఎదురుబడితే సావుకైనా చెమట ధార కడతది..’ అంటూ యంగ్ టైగర్ బ్యాగ్రౌండ్లో చెప్పిన డైలాగులు మతబుల్లా పేలాయి. రాంచరణ్ సిక్స్ ప్యాక్ బాడీతో ఆకట్టుకున్నాడు. రాంచరణ్ ను దర్శకుడు రాజమౌళి అద్భుతంగా చూపించాడు. రాంచరణ్ నటన అద్భుతంగా ఉంది. ఎప్పటి నుంచి ‘ఆర్ఆర్ఆర్’ అప్డేట్ కోసం అభిమానులకు ఒకేసారి ఆ లోటు తీర్చినట్టు కన్పిస్తుంది. ఈ వీడియోను చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అఅవుతున్నారు.

‘ఆర్ఆర్ఆర్’ మూవీని రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురంభీం పాత్రల్లో నటిస్తున్నారు. రాంచరణ్ సరసన బాలీవుడ్ భామ అలియా భట్, ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఒలీవియా నటిస్తుంది. ఎప్పటిలాగే రాజమౌళి సినిమాలకు అద్భుతంగా మ్యూజిక్ అందించే కీరవాణి ‘ఆర్ఆర్ఆర్’ కు కూడా అదే రేంజ్లో మ్యూజిక్ అందించాడు. దాదాపు 300కోట్ల భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య ‘ఆర్ఆర్ఆర్’ మూవీని నిర్మిస్తున్నాడు. 2021 సంక్రాంతి కానుకగా జనవరి 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తోంది.

చికెన్ తింటే కరోనా రాదు:కేసీఆర్

తెలంగాణలో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు 10 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. దీంతో ఇప్పటి వరకు 59 మందికి కరోన పాజిటివ్ అని తేలింది. అందులో ఒకరు కోలుకొని ఇంటికి వెళ్లగా 58 మందికి చికిత్స కొనసాగిస్తున్నామన్నారు.హోం క్వారంటైన్‌తో పాటు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్లలో సుమారు 25వేల మంది పర్యవేక్షణలో ఉన్నారని సీఎం తెలిపారు.కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ కి ప్రజలు సహకరిస్తున్నారు… మరింత సహకారం కావాలిని కేసీఆర్ అన్నారు.

ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. లాక్‌ డౌన్‌ కి సహకరిస్తోన్న ప్రజలకు సీఎం ధన్యవాదాలు చెప్పారు.”రాష్ట్రంలో లాక్ డౌన్ చేయకుండా ఉంటే భయంకర పరిస్థితులుండేవి. మన చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం సామాజిక దూరం. ఉదయం ప్రధాని మోదీతో మాట్లాడాను.. అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఐసోలేషన్‌ వార్డుల్లో 11వేల మందికి చికిత్స అందే ఏర్పాట్లు చేశాము. 1400 ఐసీయూ బెడ్స్‌ సిద్ధం చేస్తున్నాము. 60వేల మందికి వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేశాం. రిటైర్‌ అయిన వైద్యులు, మెడికల్‌ సిబ్బందిని వినియోగించుకుంటాం. యుద్ధం చేసే సమయంలో నిర్లక్ష్యం, అలసత్వం పనికిరాదు. వైద్యులు, అధికారులు, పోలీసు సిబ్బందికి ప్రజలు సహకరించాలి’ అని కేసీఆర్‌ అన్నారు.

నిత్యావసరాలు, కూరగాయల కోసం ఇంటి నుంచి ఒక్కరే వెళ్లాలి. ఇతర రాష్ట్రాల వలస కార్మికులకు ఆహార వసతి కల్పించి.. వైద్య సేవలు అందించాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చాము. నిరాశ్రయులకు ఆహార వసతి కల్పిస్తాం. పశుగ్రాసం రవాణా చేసే వాహనాలకు అనుమతి ఉంది. చికెన్‌, గుడ్లు తింటే కరోనా వస్తుందనేది అవాస్తవం” అని కేసీఆర్‌ అన్నారు.

Nikita Sharma Latest Photos

రాష్ట్రానికి వచ్చే వారిని అనుమతించండి: ఏపీ హైకోర్టు

ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి వచ్చేవారి విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. తెలంగాణ సహా ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి వచ్చేవారు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రంలోకి అనుమతించాలని, లేనిపక్షంలో క్వారంటైన్ కు పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. తెలంగాణ ఇచ్చిన ఎన్‌వోసీని ఎంట్రీ పాయింట్‌లోనే పరిశీలించాలని, ఆరోగ్యపరంగా బాగుంటేనే అనుమతించాలని స్పష్టం చేసింది

ఒకవేళ ఆరోగ్యంగా లేకపోతే ఆ వ్యక్తి ని క్వారంటైన్‌కు తరలించాలని సూచించింది. అదేవిధంగా క్వారంటైన్‌ అవసరం లేకపోతే గృహనిర్బంధంలో ఉంచి ఎప్పటికప్పుడు డాక్టర్లను పర్యవేక్షించేలా చూడాలని సర్కార్‌కు హైకోర్టు తెలిపింది. ఇతర రాష్ట్రాల నుంచి తమ రాష్ట్రానికి రావడానికి జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుడటం, మరోవైపు రాష్ట్ర సరిహద్దుల్లో నిలిచిపోతుండటంతో బీజేపీ నేత వెలగపూడి గోపాలకృష్ణ హైకోర్టు పిటిషన్‌ వేశారు. దీనిపై శుక్రవారం నాడు హైకోర్టు విచారించి పైన చెప్పిన విధంగా ఉత్తర్వులు జారీ చేసింది

క్వారంటైన్ నుంచి బయటకు వచ్చిన వారిపై కేసులు

ప్రపంచ మహమ్మారి కరోనా విస్తరణను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రబుత్వాలు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటున్నప్పటికీ, కొందరు చదువుకున్న మేధావులు మాత్రం వాటికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తున్నారు. కనీస బాధ్యతను కూడా మరిచి ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనే ఏపీలో తాజాగా చోటు చేసుకుంది. ఈ నెల 16న అమెరికాలోని డల్లాస్ నుంచి ఒక యువకుడు విజయవాడకు వచ్చాడు. అతడిని పరీక్షించిన వైద్యులు హోం క్వారంటైన్ లో ఉండాలని సూచిస్తూ… చేతికి ట్యాగ్ వేశారు. అయితే, ఇవేవీ పట్టించుకోని అతగాడు రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వచ్చాడు. మచిలీపట్నం, పెదపారుపూడి మండలం భూషణగుల్లలోని తన బంధువుల ఇళ్లకు వెళ్లాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. మరో ఘటనలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డులో ఉన్న కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన యువకుడు ఆసుపత్రి సిబ్బంది కళ్లుగప్పి తప్పించుకుని పారిపోయాడు. ఆసుపత్రి ఆర్.ఎం.ఓ ఆదినారాయణ పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఎస్.హెచ్.ఓ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ యువకుడు కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరగా, వైద్యులు అతని ఐసోలేషన్ వార్డులో ఉంచి పరీక్షిస్తున్నారు. ఇతనికి కరోనా సోకిందా అనే విషయాన్ని తెలుసుకునేందుకు నమూనాలు సేకరించి పరీక్ష కోసం ల్యాబ్ కు పంపగా ఫలితాలు ఇంకా రాలేదని వైద్యులు తెలిపారు.

పెద్ద మనసు చాటుకున్న ‘బన్నీ’

కరోనా వైరస్ బాధితుల సహాయార్థం తెలుగు సినిమా రంగ ప్రముఖులు ఒక్కొక్కరుగా భారీ విరాళాలు ప్రాతిస్తున్నారు. హీరో నితిన్ తో మొదలైన ఆర్థిక సాయం ఇప్పుడు ఊపందుకుంది. పవన్ కళ్యాణ్ ఇచ్చిన రెండు కోట్ల తో మొదలైన ఈ వితరణ మెగా ఫామిలీ లో మరింత మందికి స్ఫూర్తి అయ్యింది ఆ ఇంటి నుంచి ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ , సాయి ధరమ్ తేజ్ విడివిడిగా ఒక కోటి ,70 లక్షలు , 10 లక్షలు ఇచ్చి తమ దానగుణం చాటు కొన్నారు ఇపుడు తాజాగా అల్లు అర్జున్ కూడా వాళ్ళ సరసన చేరాడు. బన్నీ తన వంతుగా 1 కోటి ౨౫ లక్షలు విరాళం ప్రకటించాడు. దీనిలో 50 లక్షలు చొప్పున రెండు తెలుగు రాష్ట్రాలకు ఇస్తుండగా మిగతా 25లక్షలు కేరళ రాష్ట్రానికి ఇవ్వ నిశ్చయించాడు .

ఇక ఇదే క్రమంలో మరో దర్శకుడు సుకుమార్ కూడా ముందుకు వచ్చి 10. లక్షలు విరాళం ప్రకటించడం జరిగింది . ఇక బన్నీ , సుకుమార్ కలయిక లో సినిమా నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు కూడా
రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో 10 లక్షలు చొప్పున విరాళం ప్రకటించడం జరిగింది .

కేంద్ర మంత్రులకు రాష్ట్రాలతో సయోధ్య బాధ్యత!

కరోనా మహమ్మారి విస్తరించకుండా కట్టడి చేయడం కోసం వరుసగా తీవ్రమైన చర్యలు తీసుకొంటున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా వ్యవహరించే విధంగా చూడడంకోసం జాగ్రత్త పడుతున్నారు. అందుకనే తరచూ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఆరోగ్య కార్యదర్శులు, డిజిపిలతో కేంద్ర ప్రభుత్వం అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు.

మరోవంక రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో కేంద్ర ఆరోగ్యమంత్రి డా. హర్ష వర్ధన్ తరచూ మాట్లాడుతున్నారు. ప్రధాని స్వయంగా ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పుడు మంత్రులకు ఒకొక్క రాష్ట్రంలో నిత్యం జరుగుతున్న పరిస్థితులపై, అమలవుతున్న చర్యలపై పర్యవేక్షించే బాధ్యతలను అప్పజెప్పారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు రాష్ట్రాలలో అమలయ్యే టట్లు చూడడం మంత్రుల విధి అని ప్రధాన మంత్రి తన మంత్రివర్గ సహచరులకు స్పష్టం చేసిన్నట్లు తెలిసింది. ప్రతి రాష్ట్రానికి ఒక్కరిద్దరు మంత్రులను కేంద్రప్రభుత్వం ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. ఈ వారంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సామాజిక దూరం పాటిస్తున్న విధానం, కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు, మాస్క్‌లు, శానిటైజర్ల కొరత తదితర అంశాలపైపర్యవేక్షణ చేసే బాధ్యతలను వీరికి అప్పజెప్పారు. ఇందులో భాగంగా చిన్న రాష్ట్రాలకు ఒక మంత్రిని, కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు, పెద్ద రాష్ట్రాలకు ఇద్దరు మంత్రులను ఇన్‌చార్జ్‌లుగా నియమించారు.

వీరు ప్రతిరోజు నమోదవుతున్న కరోనా కేసులు, కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, సామాజిక దూరం, కార్వంటైన్‌లో ఉన్న వారికి కల్పిస్తున్న సదుపాయాలు, అవసరం ఉన్న వారికి అందుబాటులో ఉన్న కమ్యూనిటీ కిచెన్‌లు, ఇతర పరిస్థితులు అన్నింటికి సంబంధించిన సమాచారాన్ని ప్రధాని కార్యాలయానికి ఎప్పటికప్పుడు పంపించవలసి ఉంటుంది. జిల్లా మేజిస్ట్రేట్‌లు, జిల్లా కలెక్టర్‌లను అడిగి ప్రాథమిక స్థాయిలో సమాచారాన్ని తీసుకొని నివేదించమని మంత్రులకు సూచించారు.

లాక్ డౌన్ వల్ల కరోనా కేసులు తగ్గాయా..?

కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 21 రోజులు లాక్‌ డౌన్ ప్రకటించింది. దీంతో దేశంలోని ప్రజలందరూ తమ నివాసాలకే పరిమితమయ్యారు. అయినప్పటికీ దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. నిన్న (గురువారం) ఒక్కరోజే 90 కేసులు కేసులు నమోదు కావడం గమనార్హం. ఈ రోజు నాలుగు మరణాలతో కలుపుకొని దేశంలో ఇప్పటివరకు 20 మంది ప్రాణాలు కోల్పోగా, 764 మంది కరోనాతో బాధపడుతున్నారు.

అయితే, దేశ వ్యాప్తంగా అమలవుతున్న లాక్‌ డౌన్‌ పై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పాజిటివ్ గా స్పందించింది. ఈ లాక్‌డౌన్ ఫలాలు కనిపిస్తున్నాయని, ప్రజలు పాటిస్తున్న సామాజిక దూరం వల్ల రోగుల సంఖ్య తగ్గకపోయినా, పెరుగుదల నిష్పత్తి మాత్రం తగ్గుతోందని వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. .

దేశంలో కొందరు రోగులకు ఆ వైరస్ ఎక్కడి నుంచి సోకిందో తెలియడం లేదని, అంతమాత్రాన దానిని సామాజిక వ్యాప్తిగా ప్రచారం చేయడం తగదని అన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను అమలు చేయకుంటే మాత్రం సామాజిక వ్యాప్తి తప్పదని హెచ్చరించారు.

క్వారంటైన్ నుండి పారిపోయిన ఐఎఎస్ అధికారి!

కరోనావైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్నందున ఇతర దేశాల నుండి వచ్చిన వారిని 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచే నిబంధనను ఉల్లంఘించినందుకు సబ్ కలెక్టర్ అనుపమ్ మిశ్రాపై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. 2016 బ్యాచ్ ఐఎఎస్ అధికారిని క్వారంటైన్ నిర్బంధంలో ఉంచారు, కాని అతను దిగ్బంధం కోడ్‌ ను ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా ఉత్తర ప్రదేశ్‌ లోని కాన్పూర్‌ లోని తన ఇంటికి పారిపోయాడు.

క్వారంటైన్ లోని పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సబ్ కలెక్టర్ అనుపమ్ మిశ్రా ఇటీవల తన ఇంటి నుండి తిరిగి వచ్చారు, తరువాత అతను విహారయాత్ర కోసం సింగపూర్ సందర్శించారు. తిరిగి వచ్చిన తరువాత, జిల్లా యంత్రాంగం తన అధికారిక నివాసంలో 14 రోజులు నిర్బంధంలో ఉండాలని ఆదేశించింది. ఈ ఆదేశాన్ని మార్చి 19 న జారీ చేశారు. అయితే, దిగ్బంధం కోడ్‌ ను అనుసరించే బదులు, ఐఎఎస్ అధికారి కాన్పూర్‌ లోని తన ఇంటికి పారిపోయారు.

మార్చి 23 అర్ధరాత్రి కేరళ లాక్ డౌన్ విధించే ముందు అతను ఇంటికి బయలుదేరినట్లు ఒప్పుకున్నాడని క్వారంటైన్ లోని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఇంటి నిర్బంధంలో ఉంచిన మరియు క్వారంటైన్ కోడ్‌ ను ఉల్లంఘించిన వ్యక్తులపై ఇప్పటివరకు కేరళలో 12 కేసులు నమోదయ్యాయి.