
సాధారణ రోగాలకు వైద్యం చేయమంటూ రోగులను తిప్పి పంపిన ఘటన జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. జ్వరంతో బాధపడుతున్న తన కొడుకును జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వచ్చిన ధర్మవరం తండా మహిళకు అక్కడి వైద్యుల చెప్పిన సమాధానంతో ఆందోళనకు గురయ్యింది. స్థానికంగా కరోనా మాస్క్‌లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే సామినేని ఉదయభానును కలిసి తన గోడు వెళ్ళబోసుకుంది. తన బిడ్డకు వైద్యం చేయించాలని ఎమ్మెల్యేను కోరింది. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే ఆసుపత్రికి తల్లికొడుకులను తీసుకుని వెళ్లారు. ఎమ్మెల్యే చెప్పినా వైద్యం చేసేందుకు ఆసుపత్రి వైద్యులు డాక్టర్ విజయభాస్కర్ అంగీకరించలేదు. సాధారణ జ్వరాలకు వైద్యం చేయవద్దని తమకు ఆదేశాలు ఉన్నాయని ఎమ్మెల్యే చెప్పినా, ఎవరు చెప్పిన తాము వైద్యం చేయమని తెగేసి చెప్పారు. వైద్యుల మాటలతో ఎమ్మెల్యే ఉదయభాను ఖంగుతిన్నారు. దీంతో ఉన్నతాధికారులతో ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు.