
మెగాపవర్ స్టార్ రాంచరణ్ బర్త్ డేకు మెగా కోడలు ఉపాసన స్వీట్ గిప్ట్ ఇచ్చారు. చెర్రీ పుట్టిన రోజున సందర్భంగా ఉపాసన తానే స్వయంగా చేసిన బర్త్‌డే కేక్ ను ప్రిపేర్ చేశారు. ఈ కేకునే చెర్రీ కట్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఉపాసన సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ‘హ్యాపీ బర్త్‌డే రామ్‌చరణ్.. బర్త్ డే కేక్‌ను ఎంజాయ్ చేశావని అనుకుంటున్నా’ అని ట్వీటర్లో పోస్టు చేయడం అభిమానులను ఆకట్టుకుంది.
కరోనా వైరస్ కారణంగా అన్ని సెలబ్రెషన్లకు అందరూ దూరం పాటిస్తున్నారు. కొందరు ఏకంగా పెళ్లిళ్లు, ఇతర వేడుకలను అందరూ రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన బర్త్ డే సెలబ్రెషన్స్ కు దూరంగా ఉన్న సంగతి తెల్సిందే. లాక్డౌన్ నేపథ్యంలో బయటికి వెళ్లే వీలులేకపోవడంతో చెర్రీ సతీమణి ఉపాసన తానే స్వయంగా బర్త్ కేకును తయారు చేశారు. ఈ కేకునే రాంచరణ్ కట్ చేసి బర్త్ డే వేడుకలను జరుపుకున్నాడు. ప్రియమైన శ్రీమతి భర్త కోసం కేక్ చేస్తే ఆ మాజానే వేరుగా ఉంటుందని పలువురు కామెంట్లు చేస్తున్నారు.
అదేవిధంగా తారక్, ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ చెర్రీకి, మెగా అభిమానులకు అదిరిపోయే గిప్ట్ అందించింది. ‘ఆర్ఆర్ఆర్’లో రాంచరణ్ కు సంబంధించిన పాత్రకు సంబంధించిన వీడియోను ఎన్టీఆర్ సోషల్ మీడియాలో విడుదల చేయగా వైరల్ గా మారింది. అల్లూరి సీతారామారాజుగా చెర్రీ అద్భుతంగా నటించాడు. చెర్రీ నటనకు బ్యాగౌండ్లో ఎన్టీఆర్ వాయిస్ తోడవడంతో డైలాగులు మతాబుల్లా పేలాయి. ఈ వీడియోను చూసిన మెగాస్టార్ ‘ఆర్ఆర్ఆర్’టీమ్, తారక్ ను అభినందించారు.