తెలంగాణలో తొలి కరోనా మృతి
తెలంగాణలో రాష్ట్రంలో కరోని నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 65 కరోనా పాజిటివ్ కేసులు కాగా ఒకరు మృతిచెందినట్లు తెలిపారు. ఖైరాతాబాద్ లో కరోనాతో 74 ఏళ్ల వృద్ధుడు వ్యక్తి మృతి చెందినట్లు తెలిపారు. ఈ వృద్ధుడు గ్లోబల్ ఆస్పత్రి లో ఇతర ఆరోగ్య సమస్యలతో చికిత్స చేయించుకున్నాడని.. అతడు చనిపోయాక కరోనా పాజిటివ్ అని తేలిందని చెప్పారు.
శనివారం కొత్తగా 6 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. కుత్బుల్లాపూర్ లో ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా వ్యాధి సోకిందని చెప్పారు. అదేవిధంగా ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్ చేసేవారికి కరోనా సోకిందని తెలిపారు. నాలుగు కుటుంబాలకు పాజిటివ్ వచ్చిందని తెలిపారు. అలాగే ప్రగతి నగర్ లో ఒక మహిళకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల్లో చాలామందికి చికిత్స అనంతరం నెగిటివ్ వచ్చిందన్నారు. వీరందరినీ త్వరలోనే వాళ్ల ఇళ్లకు పంపించడం జరుగుతుందని స్పష్టం చేశారు.
ఎవరికైనా కరోనా లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. వైద్యుల సూచనల మేరకు ఐసోలేషన్లో ఉండాలని సూచించారు. ప్రజలు స్వీయనియంత్రణ పాటించాలని కోరారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని ఆయన కోరారు. అదేవిధంగా ప్రార్థన మందిరాలు, చర్చిలు, ఆలయాలు కరోనా వ్యాప్తికి కారణం కావద్దని కోరారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులుపడే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం దేశంలో ఇప్పటివరకు 933 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 20మంది మృతి చెందినట్లు సమాచారం.
పండ్ల రైతుల పరిస్థితి భయానికం:జనసేన

పులివెందుల , తాడిపత్రి , శింగనమల ఈ మూడు నియోజకవర్గాలలో పండ్ల రైతుల కష్టాలకు జనసేన పార్టీ వైస్ చైర్మన్ పసుపులేటి పద్మావతి అండగా నిలిచారు.కరోన నేపథ్యంలో రాష్ట్రమంతా లాక్ డౌన్ కావడంతో ఆ రైతులు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు.
ఈ మూడు ప్రాంత రైతులు నిత్యం అరటి , మామిడి , చీని ( బత్తాయి ) కర్బూజ , కళింగర మొదలగు పంటలు పండిస్తారు .ప్రస్తుతం రైతుల చేతికి పంట అందుతోంది .సరిగ్గా ఈ కరోనా వైరస్ వల్ల దేశం మొత్తం లాక్డౌన్ అవ్వడం తో ఇక్కడి రైతుల పరిస్థితి చాల భయానక స్థితిలో ఉంది . ఎవ్వరికైనా చెబుధామంటే వినేవారు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు . ముఖ్యంగా పులివెందుల నియొజకవర్గం లింగాల మండలం మరియు సరిహద్దు ప్రాంతంలోని అరటి రైతుల పరిస్తితి చాల తీవ్ర ఇబ్బంది పరిస్థితిలో ఉంది అరటి గెలలు చెట్టు మీదె మాగిపోతున్నాయి . శింగనమల నియొజకవర్గం ఎల్లనూరు , పుట్లూరు మండలాలలో చీని ( బత్తాయి ) , అరటి ,కర్బూజ , బుక్కరాయసముద్రం , నార్పల , శింగనమల మండలాలలో కర్బూజ ,కలింగర పంట రైతుల పరిస్థితి బయాందోళన లో ఉంది .తాడిపత్రి నియొజకవర్గం లోని తాడిపత్రి రూరల్ , పెద్ద పప్పూరు , పెద్ద వడగూరు మండలాల్లో మామిడి మరియు పండ్ల తోటల రైతుల పరిస్థితి అయోమయంలో ఉంది. కనుక ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకి భరోసా కల్పించి న్యాయం చెయ్యాలని అంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరియు అనంతపురం జిల్లా కలెక్టరుకి మరియు వ్యవసాయశాఖ , మార్కెటింగ్ శాఖ అధికారులకి పులివెందుల వ్యవసాయశాఖ , మార్కెటింగ్ శాఖ అధికారులకి పద్మావతి వినతిపత్రం ద్వారా తెలియజేసారు.
వలస కూలీలను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు
వలస కూలీలను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. లాక్‌డౌన్‌ను ఎవరూ ఉల్లంఘించకుండా చర్యలు చేపడుతున్నాం. కరోనా చికిత్స కోసం డాక్టర్లకు ఆన్‌లైన్‌లో శిక్షణ ఇచ్చేందుకు ఎయిమ్స్ ముందుకొచ్చింది. ర్యాండమ్‌గా నమూనాలు సేకరించాల్సిన అవసరం లేదు. ఆరోగ్య రంగానికి సౌకర్యాల కల్పనపై దృష్టిసారించాం. కరోనా కేసుల చికిత్స కోసం ఆస్పత్రులను ఏర్పాటు చేస్తాం. కరోనా పాజిటివ్ ఉన్నవారికి చికిత్సపై మార్గదర్శకాలు విడుదల చేశాం.
అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న రాష్ట్రాలపై ప్రధానంగా దృష్టిసారించామని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. కరోనా కట్టడి చర్యలపై రాష్ట్రాలతో కలిసి పనిచేస్తున్నామని తెలిపింది. కరోనాపై కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 873 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కరోనా బారిన పడి 20 మంది మరణించారు. 24 గంటల్లో కొత్తగా 149 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
లాక్‌డౌన్ పరిస్థితులను రాష్ట్రాల వారీగా సమీక్షిస్తున్నాం. నిత్యావసరాల సరఫరాకు అనుమతించాలని రాష్ట్రాలకు సూచించాం. రాష్ట్రాల మధ్య సరకు రవాణాలో ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాం. నిత్యావసరాల ధరలు పెరగకుండా చూస్తున్నాం. అద్దె కట్టలేక, పలు సమస్యలతో రాష్ట్రాల్లో ప్రజలు వలస వెళ్తున్నారు. లాక్‌డౌన్, వైద్యపరమైన అంశాలపై అన్ని రాష్ట్రాల సీఎస్‌లతో మాట్లాడుతున్నాం. సామాజిక దూరం సరిగా అమలు చేయాలని సూచిస్తున్నామని. ఆరోగ్యశాఖ పేర్కొంది.
‘ఆచార్య’లో మెరవనున్న జబర్దస్ట్ బ్యూటీ!
కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి-152వ సినిమా తెరకెక్కుతుంది. ‘ఓ పిట్టకథ’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చిరంజీవి ఈ మూవీ టైటిల్ ‘ఆచార్య’గా ప్రకటించిన సంగతి తెల్సిందే. కరోనా ఎఫెక్ట్ తో ‘ఆచార్య’ మూవీ షూటింగ్ వాయిదా పడింది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. మెగాస్టార్ చిరంజీవి పక్కన జబర్దస్ట్ బ్యూటీ, రంగమ్మత్త అనసూయ ఓ స్పెషల్ సాంగ్ చేయనుందని ఫిల్మ్ నగర్లో టాక్ విన్పిస్తుంది. మెగా బ్రదర్ నాగబాబు రికమెండేషన్ తోనే అనసూయకు మెగా హీరోల పక్కన ఛాన్సులు దక్కుతున్నాయని ప్రచారం జరుగుతుంది.
‘ఆచార్య’ మూవీలో చిరంజీవి ద్విపాత్రభినయం చేస్తున్నాడు. అదేవిధంగా రాంచరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. పాత మెగాస్టార్ ను పూర్తిగా దింపేందుకు కొరటాల శివ ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగా చిరంజీవితో మాస్ సాంగ్స్, అదిరిపోయే ఫైట్స్ సినిమాలో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. మెగా అభిమానులకు కావాల్సిన అన్నిహంగులు ‘ఆచార్య’ ఉంటాయని కొరటాల శివ తెలిపారు. ఇందుకు తగ్గట్టుగానే చిరంజీవి-రెజీనా మధ్య ఓ స్పెషల్ ఐటమ్స్ ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో తెరకెక్కించారు. ఈ పాటలో చిరు-రెజీనాల స్టెప్స్ అదిరిపోనున్నట్లు సమాచారం. తాజాగా మరో స్పెషల్ సాంగ్ ఈ మూవీలో ఉండనుందని ప్రచారం జరుగుతుంది. రంగమ్మత్త అనసూయ ఈ స్పెషల్ సాంగ్లో మెగాస్టార్ తో ఆడిపాడనుందని తెలుస్తోంది. అయితే దీనిపై చిత్రబృందం అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.
‘ఆచార్య’ మూవీలో చిరంజీవికి జోడీగా తొలుత త్రిషను ఎంపిక చేశారు. అయితే చివరి నిమిషంలో త్రిష ఈ మూవీని నుంచి తప్పుకోవడంతో ఈ అవకాశం చందమామ కాజల్ అగర్వాల్ కు దక్కింది. చిరు రీఎంట్రీ మూవీ ‘ఖైదీ-150’లో కాజల్ నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్టుగా నిలిచింది. తాజాగా మరోసారి చిరంజీవితో రోమాన్స్ చేసేందుకు చందమామ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక రాంచరణ్ సరసన నటించే హీరోయిన్ల విషయంలో కొంత క్లారిటీ రావాల్సింది. బాలీవుడ్ నటి కియారా అడ్వాణీ, రష్మిక మందన్న పేర్లు విన్పిస్తున్నాయి. ఈ మూవీని రాంచరణ్ మ్యాట్నీ ఎంటటైన్మెంట్ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. మ్యూజికల్ బ్రహ్మ మణిశర్మ అదిరిపోయే సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.
కోవిద్19 కట్టడికి టాటా ట్రస్ట్ భారీ విరాళం!

దేశంలో కరోనా నియంత్రణ కోసం పలువురు రాజకీయ, పారిశ్రామిక, సినీ రంగ ప్రముఖులు సహాయ నిధులకు తమవంతుగా ఆర్థిక సాయం ప్రకటిస్తున్నారు. తాజాగా వ్యాపార వేత్త రతన్ టాటా ముందుకు వచ్చారు. కరొనాను ఎదుర్కొనడానికి తన వంతు సహాయంగా రూ.500 కోట్ల రూపాయలు సహాయం అందించారు. ప్రధాన మంత్రి సహాయ నిధికి ఆయన ఈ మొత్తాన్ని అందజేశారు.
ఈ సందర్బంగా రతన్ టాటా ట్వీట్ చేశారు. అందులో కరోనా వైరస్ సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన అత్యవసర వనరులను సమకూర్చుకోవలసిన అవసరం ఉందని ఆయన చెప్పారు. గతంలో దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉన్న సమయంలో మేము అండగా నిలిచాం. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లోనూ గతంలో కన్నా ఎక్కువగా మద్దతుగా నిలవాల్సి ఉందని రతన్ టాటా ట్వీట్ చేశారు. ఈ నిధులను వైద్యులకు అవసరమైన పీపీఈలు, కరోనా కేసులు పెరిగితే చికిత్స కోసం వినియోగించే శ్వాససంబంధ పరికరాలు, టెస్టింగ్ కిట్ల కొనుగోలు, హెల్త్ వర్కర్ల శిక్షణ కోసం ఉపయోగిస్తామన్నారు.
ఇండియాలో ఇప్పటి వరకు 933 కరోనా కేసులు నమోదయ్యాయి. 20 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం ఇండియా రెండో స్టేజ్ లో ఉన్నది. మూడో స్టేజ్ లోకి వెళ్ళకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు పోరాటం చేస్తున్నాయి. ఎలాగైనా సరే వైరస్ కు చెక్ పెట్టె దిశగా ప్రభుత్వాలు కలిసికట్టుగా పోరాటం చేస్తున్నాయి. భారత ప్రభుత్వం తీసుకున్న లాక్ డౌన్ కార్యక్రమం విజయవంతం అయ్యే దిశగా అడుగులు వేస్తుండటం విశేషం.
ఏపీలో ఆక్వా ఉత్పత్తుల ధరలు స్థిరంగా ఉండేలా చర్యలు
ఉత్పత్తుల ధరలు ఏప్రిల్ 14వ తేదీ వరకు స్థిరంగా ఉండేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నారని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలోని నాల్గవ బ్లాక్ ప్రచార విభాగం ఎదురుగా ఉన్న ఆవరణలో మంత్రి మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ వల్ల ప్రజలకు ప్రాణనష్టం కలగకూడదని ఒకవైపు, నిత్యావసర ధరలు పెరగకుండా చర్యలు తీసుకుంటూ మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. కరోనా ప్రభావం వల్ల ఆక్వా రంగంతో పాటు పౌల్ట్రీ రంగం కొంత ఇబ్బందులకు గురి అవుతున్న మాట వాస్తవమన్నారు. అంతేతప్ప కరోన వైరస్ వలన ఆక్వారంగ పరిశ్రమలు మూతపడతాయని వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి వ్యవసాయ,అనుబంధ రంగాలకు పెద్దపీట వేస్తూ వస్తున్న విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఆక్వా సాగుకు ఏప్రిల్, మే, జూన్ నెలలు చాలా కీలకమైన నేపథ్యంలో ఆక్వా రంగం దెబ్బతినకూడదని సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక చర్యలు తీసుకుంటున్నారని మంత్రి వివరించారు. అందులో భాగంగా ఆక్వా ఉత్పత్తుల ఎగుమతి దారులతో సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు తానూ చర్చలు జరిపామన్నారు. ఆక్వా ఎగుమతిదారులు, సంబంధిత శాఖాధికారుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించామన్నారు. రాష్ట్రంలోని 7 జిల్లాల్లో రెండు లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతోందని, మన రాష్ట్రంలోని ఆక్వా ఉత్పత్తులకు నాణ్యత విషయంలో మంచి పేరుందని మంత్రి తెలిపారు. 90 శాతం ఉత్పత్తులు అమెరికా, చైనా, యూరోపియన్ దేశాలకు ఎగుమతవుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్రం ఉలో ఆక్వా అత్యంత ప్రధానమైన, ఆదాయం అర్జించే రంగమని చెబుతూ ఆక్వా రైతుల పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా చూస్తున్నామన్నారు. దేశంలో 47 శాతం ఆదాయం, రాష్రం యలో ప్రధానంగా అత్యధిక ఆదాయం ఆక్వా రంగం నుండి వస్తుండటంతో రొయ్యల రైతులు నష్టపోకుండా ఏప్రిల్ 14 వరకు ఆక్వా ఉత్పత్తుల ధరలు స్థిరంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 30 కౌంట్ నుంచి 100 కౌంట్ వరకు రొయ్యల ధర నిర్ణయించామన్నారు. ఈ సందర్భంగా ధరల పట్టికను మంత్రి చదివి వినిపించారు. 30 కౌంట్ కేజీ ధర రూ.430 కాగా, 40 కౌంట్ ధర రూ.310, 50 కౌంట్ ధర రూ.260, 60 కౌంట్ ధర రూ.240, 70 కౌంట్ ధర రూ.220, 80 కౌంట్ ధర రూ.200, 90 కౌంట్ ధర రూ.190, 100 కౌంట్ ధర 180 రూపాయలుగా నిర్ణయించామన్నారు. మార్కెట్ హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ ఇలా ముందే స్థిరమైన ధరలు నిర్ణయించడం దేశంలోనే మొదటిసారి అని మంత్రి తెలిపారు. ఆక్వా రైతుల కోసం ఏ రాష్ట్రం కూడా ఇలాంటి చర్యలు తీసుకోలేదని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో ఆక్వా ఉత్పత్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎగుమతులు ఆగడానికి వీలులేదన్నారు. 5,6 రోజులుగా ఇదే విషయమై జిల్లా యంత్రాంగం, ఆక్వా రైతు సంఘాలు, ఎగుమతిదారులతో చర్చలు జరిపుతున్నామన్నారు. కరోనాతో సంబంధం లేకుండా రైతు పండించిన పంటను ఏ ప్రాంతంలో అయినా కొనుగోలు చేయడానికి ఎగుమతిదారులు ముందుకు వచ్చిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ఇది స్వాగతించాల్సిన అంశమని కొనియాడారు. ఆక్వా రైతులకు అండగా ఉంటామని మంత్రి భరోసానిచ్చారు.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వల్ల అన్ని వ్యవస్థలు కుదేలయ్యాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఆసరా చేసుకొని కరోనా వైరస్ పేరుతో దళారుల మాటలను నమ్మి ఆక్వారంగం రైతులు మోసపోవద్దని సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే తక్కువ ధరకు అమ్మేందుకు వీలు లేదని ఆక్వా రైతులకు సూచించారు. హడావిడిగా సాగుచేసిన ఉత్పత్తులను అమ్ముకోవద్దని రైతులను అభ్యర్థించారు. రైతులకు నష్టం కలిగించే దళారులు, వ్యాపారులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు నష్టం కలిగిస్తే దుకాణాల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా నోడల్ ఏజెన్సీగా ఉన్న ఎంపెడా కు అధికారాలు ఇస్తున్నామని తెలిపారు. ఆక్వాకు సంబంధించిన ఉత్పత్తులు సీడ్ వేయడం, ఫీడ్ ను అందించడం, ప్రాసెసింగ్ నిర్వహణ, రవాణాలో ఎలాంటి అడ్డంకులు ఉండబోవన్నారు. ఈ విషయంలో పోలీస్, రెవెన్యూ, వాలంటీర్లు సహకరించాలన్నారు. ఎగుమతిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో అత్యుత్సాహం ప్రదర్శించే వారిపై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
వారిని కొట్టకుండా ఉంటే చాలు…!

ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారికి మంచి సదుపాయాలు కల్పిస్తూ.. వారికి సరిహద్దుల్లో భోజనం, వసతులు ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశంపై భిన్న స్వరాలూ వినిపిస్తున్నాయి. ఇటీవల వసతి గృహాలు మూసివేయడంతో జంట నగరాల నుండి అనేక వందలమంది విద్యార్థులు ఏపీకి వస్తున్న దారిలో జగ్గయ్యపేటకి దగ్గర్లోవున్న గరికపాడు చెక్ పోస్ట్ వద్ద వారిని కొన్ని గంటల పాటు ఆపి నరకం చూపించిన విషయం తెలిసిందే.. ఆ తర్వాత 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండటానికి ఒప్పుకుంటేనే ఏపిలోకి అనుమతిస్తారనే కొత్త రూల్ తీసుకొచ్చారు.
కరోనా నియంత్రణ చర్యలపై తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి 14 రోజులు క్వారంటైన్ కు సిద్ధపడే వారికి ఏపీలోకి అనుమతి ఇవ్వాలని, వారికి మంచి సదుపాయాలు కల్పించాలని చెప్పడం గమనార్హం.
ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న వేళ బయటకు వచ్చే వారి పట్ల పోలీసులు చాలా దురుసుగా వ్యవహరిస్తున్నారు. అనేక చోట్ల ఆడా, మగా తేడా లేకుండా విచ్చల విడిగా కొడుతూ దుర్భాషలాడుతున్నారు. ఎందుకలా చేస్తున్నారంటే.. మీ మంచి కోసమే అనే సమాధానాలు చెబుతున్నారు. కరోనా సోకి పోయి విషయం దేవుడెరుగు.. ఈ పోలీసులు కొట్టే దెబ్బలకే పోయేలా ఉన్నామని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చే వారికి మంచి సదుపాయాలు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ కనీసం తిట్టకుండా, కొట్టకుండా ఉంటె చాలనేది అనేక మంది అభిప్రాయం.
ట్వీటర్ లో అలరిస్తున్న చిరు, మోహన్ బాబు
ఇటీవల మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చారు. ఉగాది రోజున ఆయన సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వడంతో పలువురు సెలబ్రెటీలు ‘వెల్ టు సోషల్ మీడియా’ అంటూ స్వాగతించారు. రాజమౌళి, మహేష్ బాబు, ఎన్టీఆర్ తదితరులు ఆయనకు ట్వీటర్లో ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా కలెక్షన్ మోహన్ బాబు చిరు ట్విట్టర్ ఎంట్రీని స్వాగతించారు. ‘మిత్రమా స్వాగతం అంటూ ట్వీట్ చేశారు. దీనికి మెగాస్టార్ స్పందిస్తూ ‘ధన్యవాదాలు మిత్రమా.. రాననుకున్నావా.. రాలేననుకున్నావా..?’ అంటూ చమత్కరించిన సంగతి తెల్సిందే.
కరోనా విజృంభిస్తున్న తరుణంలోనూ వీరద్దరు ట్వీటర్లో అభిమానులు అలరిస్తున్నారు. చిరు ట్వీట్ కు ప్రతీగా మోహన్ బాబు మరోసారి ట్వీట్ చేశారు. ‘ఈసారి హగ్ చేసుకున్నప్పుడు చెబుతాను..’ అంటూ మోహన్ బాబు చమత్కరించాడు. మోహన్ బాబు ‘హగ్’ కు చిరు తాజాగా రిప్లయ్ ఇచ్చాడు. ‘మిత్రమా.. కరోనా రక్కసి కోరలు చాస్తున్న ఈ తరుణంలో, మనలో మార్పు రావాలి.. నో హగ్స్, నో షేక్ హ్యాండ్స్.. ఓన్లీ నమస్తే.. సామాజిక దూరం తప్పనిసరి’ అంటూ రిప్లయ్ ఇచ్చాడు.
మిత్రమా, మహమ్మారి తాత్కాలికం. మన స్నేహం శాశ్వతం. @KChiruTweets https://t.co/7u5N2S6gOZ
— Mohan Babu M (@themohanbabu) March 28, 2020
అదేవిధంగా కరోనాను ఎలా ఎదుర్కోవాలో.. మనకు దగ్గరగా ఉండేవారి నుంచి, మన బంధువుల నుంచి ఎలా రక్షణ పొందాలో మన మంచు లక్ష్మీ ప్రసన్న చేసిన వీడియో చూడు.. అంటూ మోహన్ బాబు చిరు ట్వీట్ చేశారు. దీనికీ మోహన్ బాబు స్పందిస్తూ ‘మిత్రమా.. కరోనా మహమ్మారి తాత్కాలికం.. మన స్నేహం శాశ్వతం’ అంటూ ట్వీట్ చేశాడు. ట్వీటర్లో వీరి సంభాషణ చూసిన నెటిజన్లు ఇలాంటి ట్వీట్స్ నెవ్వర్ బీఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ అంటూ కామెంట్స్ చేస్తుండటం విశేషం. మీడియాలో తరుచూ వీరిమధ్య గొడవలు కేవలం సృష్టేనని.. చిరు-మంచు కుటుంబాల మధ్య మంచి సన్నిహిత్యం ఉందని వీరి సంభాషణ చూస్తే ఇట్టే అర్థమవుతోంది. సినిమాలు రిలీజుకు నోచుకోని సమయంలో వీరద్దరు సినీప్రియులను సోషల్ మీడియాలో అలరిస్తుండటంతో అభిమానులు కాస్త సేదతీరుతున్నారు.
‘సీసీసీ’కి నాగార్జున భారీ విరాళం
కరోనాతో ఇబ్బందులు పడుతున్న సీని కార్మికులను ఆదుకునేందుకు టాలీవుడ్ చిత్రపరిశ్రమ ముందుకొచ్చింది. మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో సీసీసీ(కరోనా క్రైసిస్ చారిటీ మనకోసం) కమిటీ ఏర్పడింది. ఈ కమిటీలో చిరంజీవితోపాటు సురేష్ బాబు, ఎన్.శంకర్, కల్యాణ్, దాము ఉంటారు. ఈ సంస్థ ద్వారా చిత్ర పరిశ్రమలోని కార్మికుల ఆదుకునేందుకు పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.
‘సీసీసీ మనకోసం’ కమిటీకి చిరంజీవి మొదటగా కోటి రూపాయలను ప్రకటించారు. టాలీవుడ్ అగ్రనటుడు కింగ్ నాగార్జున కోటి రూపాయలు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ 25లక్షలు, మహేష్ బాబు 25లక్షలు విరాళాలను ప్రకటించారు. ఈ ఛారిటీ ద్వారా కార్మికులను ఆదుకునేందుకు తగిన చర్యలను చేపడుతున్నారు. కరోనా నివారణ కోసం ఇప్పటికే మహేష్ రెండు తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయలు, జూనియర్ ఎన్టీఆర్ 75లక్షల విరాళాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించారు. తాజాగా సీనీ కార్మికుల కోసం మహేష్ బాబు, ఎన్టీఆర్ 25లక్షలు చొప్పున ఇచ్చి కార్మికులకు అండగా ఉంటామని ప్రకటించారు.
కరోనా ప్రభావంతో చిత్రపరిశ్రమ తీవ్రంగా దెబ్బతింటుంది. ఇప్పటికే సినిమా షూటింగ్, థియేటర్ల బంద్ అయ్యాయి. దీంతో చిత్ర పరిశ్రమ రోజు కోట్లలో నష్టపోతుంది. అదేవిధంగా రోజువారి సీని కార్మికులకు ఉపాధిలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి ఆధ్వర్యంలో ‘సీసీసీ మనకోసం’ సంస్థ ఆవిర్భావించింది. దీని ద్వారా కార్మికులను ఆదుకునేందుకు చర్యలు చేపడుతున్నారు.
ఆసుప్రతిలో బాలయ్య హీరోయిన్
బాలీవుడ్ భామ రాధిక అప్టే ఆసుపత్రిలో చేరారు. దీంతో ఆమెకు కరోనా వైరస్ సోకిందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిపై ఆమె స్పందిస్తూ తనకు కరోనా సోకలేదని.. తాను ఆరోగ్యంగానే ఉన్నానంటూ పోస్టు చేసింది. కరోనా విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అయితే తాను ఎందుకు ఆసుపత్రికి వెళ్లిందో మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో అమ్మడికి కరోనా సోకిందా? అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రాధిక అప్టే బాలీవుడ్‌తోపాటు పలు తెలుగు సినిమాల్లో నటించింది. బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’ మూవీలో నటించింది. బాలయ్యకు జోడీగా మెప్పించింది. అలాగే రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘రక్తచరిత్ర’ మూవీలో నటించింది. అయితే ఆమె ముఖానికి మాస్క్ ధరించి హాస్పిటల్లో కూర్చున్న ఫొటోను రాధిక తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్లో పోస్టు చేసింది.
దీంతో ఈ భామకు కరోనా సోకిందని వదంతులు వ్యాపించాయి. పలువురు సీని ప్రముఖులు ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెట్టడంతో ఆమె స్పందించింది. తాను కరోనా వైరస్ బారిన పడలేదని స్పష్టం చేసింది. కాగా తాను ఆసుపత్రికి ఎందుకు వెళ్లిందో మాత్రం రాధిక క్లారిటీ ఇవ్వలేదు. దీంతో రాధిక అప్టే అబద్ధం చెబుతోందంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
భారత్ లో కరోనా కౌంట్ 873, మరణాలు 20
దేశంలో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగింది. ఇప్పటివరకు 873 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు దేశంలో 79 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దేశంలో 24 గంటల్లో కొత్తగా 149 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం వివిధ హాస్పటల్స్ లో 794 మంది చికిత్స పొందుతున్నారు.
ఇక దేశం మొత్తం మీద 20 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కాగా, కేరళలో కరోనా కేసుల సంఖ్య 176కు చేరింది. మహారాష్ట్రలో 162, కర్ణాటకలో 64, తెలంగాణలో 59 మందికి కరోనా సోకింది. ఆంధ్రప్రదేశ్‌లో 13 మంది కరోనా బాధితులున్నారు. శనివారం కొచ్చి హాస్పటల్ లో చికిత్ప పొందుతూ ఎకరు మరణించారు. కేరళలో ఇది మొదటి మరణం కావడం గమనార్హం.
రాష్ట్రాల వారీగా కేసులు:
అండమాన్ నికోబార్ 2, ఆంధ్రపదేశ్ 15, బీహార్ 9, చండీగడ్ – 7, చత్తీసగడ్ – 6, ఢిల్లీ 45, గోవా 3, గుజరాత్ 45, హర్యానా 44, హిమచల్ ప్రదేశ్ 3, జమ్మూ – కాశ్మీర్ 19, కర్నాటక 58, కేరళ 184, లడక్ 16, మధ్య ప్రదేశ్ 30, మహారాష్ట్ర 205, మణిపూర్ 1, మిజోరం 1, ఒడిశా 3, పంజాబ్ 39, పాండీచేరి 1, రాజస్థాన్ 51, తమిళనాడు 40, తెలంగాణ 59, ఉత్తరాఖండ్ 5, ఉత్తర ప్రదేశ్ – 56, పశ్చిమ బెంగాల్ – 15 ఇలా ఉండగా,కోవిడ్-19 బారిన పడి బాధపడుతున్న వారిని ఉంచడానికి కావలసినన్ని వార్డులు ఆసుపత్రుల్లో అందుబాటులో లేకపోవడంతో బాధితులతో పాటు వారికి చికిత్స అందిస్తున్న డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది కూడా అవస్థలు అనుభవిస్తున్నారు. ఈ ఇబ్బందిని తొలగించేందుకు రైల్వే శాఖ నూతన ఆలోచన చేసింది. రైలు బోగీలనే ఐసొలేషన్ వార్డులుగా మలిచింది.
అంతేకాకుండా అందులో కరోనా బాధితులకు చికిత్స చేసే విధంగా అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేసింది. దీనికోసం బోగీల్లోని ప్రతి క్యాబిన్‌లో మధ్య బెర్త్‌లతో పాటు ఒకవైపు బెర్త్‌లను తొలగించింది. అలాగే పై బెర్త్‌లను కూడా తీసేయించింది. ప్రస్తుతం ప్రతి క్యాబిన్‌లో ఒకరిని ఉంచే విధంగా రూపొందించినట్లు రైల్వే శాఖ వెల్లడించింది.
చిరు, మోహన్ బాబుల మధ్య ట్వీట్ల జోక్స్..వైరల్

“కొత్త భిక్షగాడు పొద్దెరగడని” తెలుగులో ఒక సామెత ఉండేదిలే.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి పరిస్థితి కూడా అలానే ఉంది. ఇటీవలే ట్విట్టర్ లో కొత్త అకౌంట్ ఓపెన్ చేసుకున్న చిరు, పోస్టులతో హల్ చల్ చేస్తున్నాడు. లాక్ డౌన్ పుణ్యమా అని ఇంట్లో ఉన్న చిరు ఎక్కువ సమయం ఆన్ లైన్ లోనే సమయం గడుపుతున్నట్లు ఉన్నారు.చిరు ట్విట్టర్ ఎంట్రీ పై అభిమానులు, ప్రముఖ సినీ హీరోలు హర్షం వ్యక్తం చేస్తూ..ఆయనకు స్వాగతం పలుకుతున్నారు. అలాంటి వారందరికీ చిరు తీరికగా రిప్లై లు ఇస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, చిరంజీవికి స్వాగతం పలికారు.. మిత్రమా స్వాగతం అంటూ ట్వీట్ చేశారు. దీనికి మెగాస్టార్ స్పందిస్తూ . “రాననుకున్నావా, రాలేననుకున్నావా” అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కి రిప్లై ఇచ్చిన మోహన్ బాబు .. ఈ సారి హగ్ చేసుకున్నప్పుడు చెబుతాను అని అన్నారు. దీంతో ఆ ట్వీట్ కు చిరంజీవి కౌంటర్ ఇస్తూ.. కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే హగ్స్, షేక్ హాండ్స్ ఇచ్చుకోకూడదు, సోషల్ డిస్టెన్స్ అవసరం అంటూ అదరగొట్టారు. అంతేకాదు ఆయన ట్వీట్ లో రాస్తూ.. కరోనా పై అవగాహన కోసమే కాకుండా మన చుట్టుపక్కల వారిని ఎలా కాపాడోలో తెలియాలంటే లక్ష్మీ రూపొందించిన వీడియో చూడాలని మోహన్ బాబును కోరారు చిరంజీవి. వీరిద్దరి మధ్య జరుగుతున్న ఈ సరదా సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ నటిస్తుండగా.. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. చరణ్, నిరంజన్ రెడ్డిలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.








ఒక సినిమా ప్రేక్షకులకు చేరువ కావాలంటే దాని టైటిల్ కూడా పబ్లిక్ కి కనెక్ట్ కావాలి అప్పుడే ఆ సినిమాకి ఆడియన్స్ రీచ్ బాగా ఉంటుంది. `బాహుబలి ` చిత్రానికి మరియు ` కె జి ఎఫ్ ` వంటి చిత్రాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడానికి వాటి టైటిల్స్ బాగా ఉపయోగ పడ్డాయి. అదలావుంటే ఇపుడు ‘బాహుబలి’ తర్వాత దర్శకుడు రాజమౌళి నిర్మిస్తున్న కొత్త సినిమా గురించి జాతీయ స్థాయిలో భారీ అంచనా లున్నాయి. ఈ సినిమాను ముందు నుంచి ‘ఆర్ఆర్ఆర్’ అనే వర్కింగ్ టైటిల్ తో పిలవడం జరిగింది ఐతే ఉగాది కానుకగా ” రౌద్రం రణం రుధిరం ” అనేది ఈ సినిమా ఒరిజినల్ టైటిల్ అని లోగో లాంచ్ చేశారు. అన్ని భాషల్లోనూ టైటిళ్లను రివీల్ చేశారు.







నాకివుంటే చాలు…:రేణుదేశాయ్
నటి రేణుదేశాయ్ తన ఇన్ స్ట్రాగ్రామ్ లో ఒక పోస్ట్ షేర్ చేశారు. ఆ పోస్ట్ లో ఆమె చిన్న పిల్లలతో బాబా ఫోజ్ పెట్టిస్తున్నారు. ఆవులు, మేకలు, కాకులు, కొంగల వీడియోలను తన ఇన్ స్ట్రా గ్రామ్ లో పోస్ట్ పెట్టారు. తన పిల్లలు కాలేజీలో చేరిన తర్వాత మిగిలిన జీవితాన్ని కూరగాయలు పండిస్తూ మారుమూల గ్రామంలో గడపాలని బలంగా కోరుకుంటున్నానని తెలిపారు.
” భారీ మొత్తంలో మూగజీవాలు, లెక్కలేనన్ని పుస్తకాలు, ఇవి ఉంటే నాకు స్వర్గంలో ఉన్నట్టే ఉంటుంది” అంటూ పోస్ట్ పెట్టారు. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో బయట తిరగొద్దు అంటూ ఓ అభిమాని చేసిన కామెంట్‌కి బదులిస్తూ… ఇవి ఇంతకు ముందు తీసిన వీడియోలని క్యాప్షన్ చూసి కామెంట్లు పెట్టాలని రేణుదేశాయ్ చురకలంటించారు.