Home Blog Page 8555

15 నుండి రైల్వే, విమాన బుకింగ్ లకు సంకేతాలు


ఒక వంక దేశంలో కరోనా కేసులు, మృతుల సంఖ్య పెరుగుతున్నా పరిష్టితులు అదుపు తప్పడం లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో భరోసా వ్యక్తం అవుతున్నట్లు కనిపిస్తున్నది. ఇప్పటికే ఈ నెల 14 తర్వాత లాక్ డౌన్ పొడిగించే ఆలోచన లేదని కేంద్ర ప్రస్తుతం స్పష్టం చేయడంతో తిరిగి జన జీవనం త్వరలో సాధారణ స్థితికి చేరుకోవచ్చనే భరోసా ఏర్పడుతున్నది.

అందుకు స్పష్టమైన సంకేతం ఇస్తూ ఈనెల 15 నుంచి రైల్వే, విమాన బుకింగ్‌లు తిరిగి ప్రారంభం కావచ్చనే సంకేతాలు ఇస్తున్నారు. ‘‘ఏప్రిల్ 15 నుంచి ఐఆర్‌సీటీసీ నుంచి టిక్కెట్ బుకింగ్స్ అనుమతిస్తాం. లాక్‌డౌన్ 14 వరకే ఉంది. అందుకే క్రమక్రమంగా తిరిగి పని ప్రారంభం చేయాల్సిన అవసరం ఉంది” అని రైల్వే సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

ముందుగా ప్యాసింజర్స్ రైళ్లను మెళ్లిగా ప్రారంభిస్తామని చెబుతున్నారు. అయితే ప్రయాణికుల ప్రయాణాలు మాత్రం ఏప్రిల్ 15 నుంచే ప్రారంభం కాకపోవచ్చని భావిస్తున్నారు. మరోవైపు విమాన సర్వీసుల బుకింగ్ కూడా ఏప్రిల్ 15 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తున్నది.

ఇండిగో, స్పైస్ జెట్, గో ఏయిర్ లాంటి సంస్థలు తమ బుకింగ్‌లను ప్రారంభించనున్నట్లు తెలుస్తున్నది. అయితే ఆ సంస్థలు మాత్రం అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు.

ఇప్పటి వరకు దేశం మొత్తం మీద 50 మృతులు నమోదు కాగా, మొత్తం కేసులు 1,764 నమోదయ్యాయి. నిజాముద్దీన్ కార్యక్రమంలో పాల్గొన్నవారికే ప్రస్తుతం ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

కరోనా విరాళం టాటా తరవాత అజీమ్ ప్రేమజీ


కరోనా వైరస్ ప్రపంచాన్ని కాటేస్తున్న సమయంలోమన దేశానికి చెందిన పలువురు ప్రముఖ వ్యాపార దిగ్గజాలు తమ వంతు ఆర్ధిక సాయం చేసి పెద్ద మనసు చాటుకుంటున్నారు. ఒక పక్క లాక్‌డౌన్ మరోవైపు ప్రజా రవాణా బంద్ చేయడంతో నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.రెక్కాడితేగాని డొక్కాడని శ్రామికులు ఎందరో రోడ్డున పడ్డారు. ఈ అత్యవసర సమయం లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ తో పాటు కొంత డబ్బు కూడా ఇవ్వడం కూడా జరుగుతోంది . అయితే ఈ క్రమంలో తమ వంతుగా సాయం చేయడానికి దేశానికి చెందిన రాజకీయ నేతలు, సినీ రంగపు వ్యక్తులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, క్రీడారంగపు ప్రముఖులు ఆర్ధిక సాయం చేసేందుకు ముందు కొస్తున్నారు.

ఇప్పటికే పలువురు తమ వంతుగా వివిధ రూపాల్లో సాయం ప్రకటించడ మైంది. ..దేశానికే తలమానికం అయిన టాటా సంస్థల అధినేత రూ.1500 కోట్లు విరాళం ప్రకటించి ఆ విషయంలో కూడా తానే ముందున్నానని నిరూపించాడు. టాటా అధినేత ఇంకా అవసరం అయితే దేశానికి తన యావదాస్థిని ఇచ్చేందుకు సిద్ధం అని కూడా వినమ్రంగా తెలిపారు. తాజాగా `విప్రో` అధినేత అజీం ప్రేమ్‌జీ ముందుకొచ్చారు. ఈయన కరోనా విపత్తు నివారణ క్రమంలో రూ. 1,125 కోట్ల సాయం చేయనున్నట్లు తెలిపారు. విప్రో లిమిటెడ్ రూ.100 కోట్లు, విప్రో ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ రూ. 25కోట్లు, అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్ రూ. 1000 కోట్లు ఇస్తున్నట్లు అజీం ప్రేమ్ జీ వెల్లడించారు. ఈ ఫౌండేషన్‌ తో సంబంధం లేకుండా ఫౌండేషన్‌ లో పనిచేసే సంస్థ ప్రతినిధులు కూడా అదనంగా విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. కాగా.. ఈ భారీ విరాళాలకు ముందుగా రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ రూ.500 కోట్లు మరియు ఇన్పోసిస్ సంస్థ రూ.100 కోట్లు విరాళం ప్రకటించడం జరిగింది..
Also Read: కరోనాపై పోరాటానికి గంభీర్ సాయం

ముంబయి ధారావికి సోకిన కరోనా…!

ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ముంబయిలోని ధారావి. కిక్కిరిసి ఉండే అగ్గిపెట్టెల్లాంటి ఇళ్ల మధ్య, ఇక్కడ లక్షల మంది పేద ప్రజలు నివాసం ఉంటుంటారు. ఇక్కడ జనసాంధ్రత అత్యధికం కాగా, పారిశుద్ధ్యం అంతంతమాత్రం. ధారావిలో ఓ యువకుడు కరోనా సోకి మరణించగా, మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తీవ్ర ఆందోళనలో ఉంది. ధారావి వంటి ప్రాంతంలో కరోనా ప్రబలితే, కరోనా వ్యాప్తిని అడ్డుకునే పరిస్థితి ఉండదని అధికారులు భయపడుతున్నారు.

ధారావిలో గురువారం నాడు తొలి మరణం నమోదైంది. కరోనా వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న ఓ యువకుడి రక్త నమూనాలను పరీక్షించగా, పాజిటివ్ వచ్చింది. అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా, అతను ఉంటున్న భవనంలోని అందరినీ, వైద్య పరీక్షల నిమిత్తం అధికారులు తరలించారు. కాగా, మహారాష్ట్రలో 2త 24 గంటల్లో 59 కరోనా కేసులు బయటపడగా, ఆరుగురు మరణించారు. ప్రస్తుతం ధారావి ప్రాంతంలో దాదాపు 16 లక్షల మంది నివాసం ఉంటున్నారు. ఇదే ఇప్పుడు ఉద్ధవ్ సర్కారు ముందు పెను సవాళ్లను నిలిపింది.

కరోనా.. నాలో మార్పు తీసుకు వచ్చిందంటున్న బ్యూటీ


దేశంలో కరోనా ఎంట్రీతో కేంద్రం లాక్డౌన్ చేపట్టింది. 21రోజులపాటు దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలుతో వ్యాపార, వాణిజ్య సంస్థలు బంద్ అయ్యాయి. సినిమా షూటింగ్ వాయిదాపడగా థియేటర్లను మూసివేశారు. దీంతో సినీ స్టారంతా ఇంటికే పరిమితమయ్యారు. పలువురు సెలబెట్రీలు సోషల్ మీడియాలో కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలువరు సెలబెట్రీలు విరాళాలను ప్రకటిస్తూ తమ మద్దతు ప్రకటిస్తున్నారు.

కరోనాతో ఇళ్లకే పరిమితమై సెలబెట్రీలు ఖాళీ టైమును ఉపయోగించుకుంటున్నారు. ముఖ్యంగా హీరోయిన్లు సోషల్ మీడియాలో కరోనా టైంలో వారి అప్డేట్స్ పెడుతూ అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటున్నారు. కాజల్ అగర్వాల్, నిధి అగర్వాల్ వంటింట్లో చేరి తమ పాక నైపుణ్యాన్ని ప్రదర్శించి అందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో పెడుతున్నారు. కొందరు హీరోయిన్లు ఫిట్ నెస్ పై దృష్టిపెడుతున్నారు. ఇటీవల మెగా కోడల ఉపాసన తన భర్త రాంచరణ్ పుట్టిన రోజు సందర్భంగా తానే స్వయంగా కేక్ తయారుచేసి చరణ్ గిప్ట్ ఇచ్చిన సంగతి తెల్సిందే.

తాజాగా అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కరోనా తనలో మార్పు తీసుకొచ్చిందని చెబుతోంది. ఖాళీగా ఉంటే తల్లి శ్రీదేవి గుర్తుకొస్తుందని వాపోయింది. అదేవిధంగా తినే ఆహారంతోపాటు ఇంట్లో వస్తువుల విలువ కూడా తనకు తెలిసొచ్చిందని చెబుతుంది. తనకు ఆహారం అవసరం ఎలా ఉంటుందో తెలియకుండా పెరిగానని.. అయితే గత వారంరోజుల్లో ఇంట్లోకి ఏమేమి అవసరం అవుతాయో తెలుసుకున్నాని జాన్వీ పేర్కొంది.

అదేవిధంగా ఇంట్లోని ప్రతీఒక్కరి గురించి పట్టించుకోవాలనే ఆలోచన కలిగిందని.. టైం విలువను ఇప్పుడిప్పుడే తెలుస్తుందని జాన్వీ కపూర్ అంటోంది. ఇదిలా ఉంటే టాలీవుడ్లో జాన్వీకపూర్ ఎంట్రీ ఎవరితో ఉంటుందనేది ఆసక్తికి రేపుతోంది. తాజాగా త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో తీసే మూవీలో జాన్వీ నటిస్తుందని ప్రచారం జరుగుతుంది. జాన్వీ ఈ మూవీలో నటిస్తుందో లేదా వేచి చూడాల్సిందే..
Also Read: చిన్న ఎన్టీఆర్ తో చిన్న శ్రీదేవి

మొత్తానికి ఇంకో సినిమా వచ్చింది

సినిమా రంగంలో రాణించాలంటే టాలెంట్ తో పాటు అదృష్టాన్ని కూడా వెంట తెచ్చుకోవాలి లేకపోతె ఇక్కడ సక్సెస్ దొరకదు. ఎందరో మేధావులు , ప్రతిభ కల ఆర్టిస్టులు అవకాశాలు లేక , రాక మరుగునపడి పోయారు. ఇపుడు అలాంటి పరిస్థితే మన తెలుగు అమ్మాయి ఎదుర్కొంటోంది .

ప్రముఖ నిర్మాణ సంస్థలు యు వి క్రియేషన్స్ , గీత ఆర్ట్స్2 బ్యానర్ వారు సంయుక్తంగా నిర్మించిన `టాక్సీవాలా’ మూవీతో మన అనంతపురం అమ్మాయి ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. తొలి ప్రయత్నం లోనే సక్సెస్ అయ్యింది. ఇక వరుసగా సినిమా ఆఫర్లు వస్తాయని ఊహించింది . ఈ మూవీ తర్వాత ప్రియాంక జువాల్కర్ స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందని అంతా భావించారు. కూడా … అయితే ఇందుకు భిన్నంగా ఈ సినిమా తర్వాత ప్రియాంక జువాల్కర్ కి అవకాశాలేమీ రాకపోవడం ఆమెతో పాటు, ఆ సినిమా చూసిన వారిని కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. కాగా ఇన్నాళ్లకు ప్రియాంక కి మరో సినిమా ఆఫర్ దక్కింది.

నూతన దర్శకుడు శ్రీధర్ గాదె తెరకెక్కించే మూవీలో ప్రియాంక జువాల్కర్ ఛాన్స్ దక్కించు కొంది. ఇక ఈ మూవీలో ‘రాజాగారు రాణివారు’ ఫేం కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్నాడు. కాగా ” ఎస్ఆర్ కల్యాణ మండపం ఈస్ట్-1975 ” అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కు తోంది. ‘టాక్సీవాలా’ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ప్రియాంక జవాల్కర్ ఈ మూవీతో మరోసారి తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతోంది.

చాలా గ్యాప్ తరవాత ఈ మూవీలో డైలాగ్ కింగ్ సాయికుమార్ కనిపించే నున్నాడు. అలాగే శంకరాభరణం తులసీ కూడా ప్రధాన పాత్రలో కనపడనుంది.రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో , కల్యాణ మండపం చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కే ఈ చిత్రాన్ని ఎలైట్ ఎంటటైన్మెంట్ బ్యానర్లో నిర్మిస్తుండగా , చేతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

రానున్న రోజుల్లో 10లక్షల కరోనా కేసులు


కరోనా మహమ్మరి పేరు వింటేనే ప్రపంచం బెంబేలెత్తిపోతుంది. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరిపై కరోనా ప్రభావం చూపుతోంది. కరోనా దాటికి పేద దేశాలే కాకుండా ధనిక దేశాలు సైతం అల్లాడిపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 8లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటికి పాకింది. చైనాలో కరోనా కట్టడి కొంతమేర జరిగిన మిగతా దేశాలు మాత్రం కరోనా దాటికి అతలాకుతలం అవుతున్నాయి.

అగ్రరాజ్యమైన అమెరికా కరోనా రాక్కసికి విలవిలలాడిపోతుంది. కరోనాతో దాదాపు 2లక్షల మంది చనిపోతారని అమెరికానే ప్రకటించడం కరోనా తీవ్రతకు అద్దంపడుతోంది. అగ్రరాజ్యమే కరోనా దాటికి దాసోమవుతున్న తరుణంలో మిగతా దేశాల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటలీ దేశంలో మరణ మృందంగా కొనసాగుతోంది. ఇక బ్రిటన్, స్పెయిన్ దేశాల్లో రాజ కుటుంబాలే కరోనాతో మృత్యువాత పడుతున్నారంటే సామాన్యుల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇండియాలోనూ కరోనా కేసులు 2వేలకు చేరువతుండటం ఆందోళన కలిగిస్తుంది. అయితే రానున్న రోజుల్లో 10లక్షలకు పైగా కరోనా కేసులు పెరిగిపోతాయని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తుంది.

కరోనా మహమ్మరి కట్టడికి కేంద్రం 21లాక్డౌన్ అమలు చేస్తుంది. దీనివల్ల మిగతా దేశాలతో పొలిస్తే భారత్ కరోనా కేసులు చేయిదాటకుండా కట్టడి చేయగలిగింది. అయితే గత రెండు మూడురోజులుగా కరోనా కేసులు అన్ని రాష్ట్రాల్లోనూ భారీగా పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తుంది. కరోనాకు ఢిల్లీ మర్కజ్ కు లింకు బయటపడటంతో దేశంలో కలవరం మొదలైంది. మర్కజ్ లో ప్రార్థనలకు వెళ్లిన వారి వివరాలను కేంద్రం ఆయా రాష్ట్రాలకు సమాచారం అందించారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మర్కజ్ కు వెళ్లొచ్చిన వారిలో పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో రెండు రాష్ట్రాలు అలర్ట్ అయ్యారు.

మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వివరాలను రెండు తెలుగు రాష్ట్రాలకు సేకరించి వారికి కరోనా టెస్టులను చేస్తున్నారు. తెలంగాణలో నిన్న ఒక్కరోజే 30పాజిటివ్ కేసులు నమోదుగా కాగా వీరిందరికీ మర్కజ్ లింకు ఉన్నట్లు తేలింది. దీంతో మర్కజ్ వెళ్లొచ్చిన వారికి ఐసోలేషన్ వార్డులకు తరలిస్తున్నారు. మరికొందరి వివరాలు తెలియాల్సి ఉండగా వీరికోసం ప్రత్యేక టీములు రంగంలోకి దిగి గాలింపు చేస్తున్నాయి.

కరోనా కేసులు ప్రపంచ వ్యాప్తంగా 10లక్షలకు పైగా పెరుగుతుందని తాజాగా డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. కరోనా పట్ల ప్రజలు నిర్లక్ష్యంగా వ్యహరించొద్దని డబ్ల్యూహెచ్ఓ సూచిస్తుంది. ప్రభుత్వాలు ఇచ్చే సలహాలు, సూచనలు పాటించాని.. కరోనాకు స్వీయనియంత్రణే మందని చెబుతుంది. ప్రజలంతా ఈ నియమాలను పాటిస్తూ కరోనా కట్టడికి సహకరించాలని డబ్ల్యూహెచ్ఓ కోరుతుంది.

పద్మశ్రీ అవార్డు గ్రహీతను బలితీసుకున్న కరోనా


కరోనా వైరస్ మరో ప్రముఖుడి ప్రాణాలను బలితీసుకుంది. అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయ మాజీ హజూరీ రాగి, పద్మశ్రీ అవార్డు గ్రహీత నిర్మల్ సింగ్ ఖల్సా గురువారం ఉదయం కన్నుమూశారు. ఆయనకు కరోనా వైరస్ సోకినట్టు బుధవారమే తేలింది. అంతలోనే ఈ తెల్లవారుజామున 4:30 గంటలకు ఆయన గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయాన్ని అమృత్‌సర్ సివిల్ సర్జన్ తెలిపారు.

పంజాబ్‌లో ఇది రెండో కరోనా కేసు కాగా, జిల్లాలో మరణించిన తొలి వ్యక్తి ఖల్సాయే. అంతకుముందు హోషియార్‌పూర్‌కు చెందిన కరోనా పాజిటివ్ రోగి అమృత్‌సర్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 62 ఏళ్ల ఖల్సా 2009లో పద్మశ్రీ పౌర పురస్కారాన్ని అందుకున్నారు. ఇటీవలే విదేశాల నుంచి వచ్చిన సింగ్.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడంతో మార్చి 30న గురునానక్ దేవ్ ఆసుపత్రిలో చేరారు.

నిపుణుల బృందంతో ప్రధాని మోదీ కరోనాపై పోరాటం

కరోనా మహమ్మారిపై అలుపెరగని పోరాటం జరుపుతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అండగా వైద్యులు, శాస్త్రవేత్తలు, ఆర్ధికవేత్తలతో కూడిన 30 మంది నిపుణుల బృందం నిర్విరామంగా అవసరమైన సమాచారాన్ని సమకూరుస్తూ సహాయకారిగా ఉంటున్నది.

ప్రతి వారు ఒకొక్క ప్రత్యేక బృందానికి నేతృత్వం వహిస్తూ విధానాల రూపకల్పన, క్షేత్రస్థాయి వాస్తవాలను సమీకరించడంలో అండగా ఉంటున్నారు. వీరు ప్రధానంగా రెండు బృందాలుగా వ్యవహరిస్తున్నారు. తిరిగి ఇద్దరు, ముగ్గురు కలసి వేర్వేరు బృందాలుగా పనిచేస్తున్నారు.

మొదటి బృందానికి నీతి ఆయోగ్ సభ్యుడు డా. వి కె పౌల్ నేతృత్వం వహిస్తున్నారు. నిముషం, నిముషానికి ఈ బృందం అందించిన సాంకేతిక సమాచారంతో ప్రధాని కీలక నిర్ణయాలు తీసుకోవడంలో సహకరిస్తున్నారు. ప్రజలలో వైరస్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతున్నది, రాబోయే రోజులలో ఏమేరకు వ్యాప్తి చెంది అవకాశాలు ఉన్నాయి, రాగాల పరిణామాలు ఏమిటి వంటి అంశాలపై సమాచారం అందిస్తుంది.

కేంద్ర ఆరోగ్య కార్యదర్శి ప్రీతి సుడాన్, ఎఐఐఎంఎస్ డైరెక్టర్ డా. రణదీప్ గులేరియా, ఐసిఎంఆర్ డైరెక్టర్ డా. బలరాం భార్గవ్ వంటి వారు ఈ బృందంలో ఉన్నారు. వీరికి మద్దతుగా మైక్రో బయాలజీ నిపుణులు డా. రామన్ గంగఖాడేకర్, డా. నివేదిపై గుప్త వంటి వారు ఉన్నారు. ఇన్స్టిట్యూట్ అఫ్ ఎపిడెమియోలజీ ద్వారా ప్రతి రోజు ప్రధానికి వైరస్ గురించిన నివేదిక అందిస్తారు.

రెండు బృందంలో పది మంది నిపుణులు ఉన్నారు. వారికి ప్రధాని సాంకేతిక సలహాదారుడు కె విజయ్ రాఘవన్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ బృందాలను మార్చ్ మొదట్లోనే ఏర్పరిచారు. అప్పటి నుండే పనిచేస్తున్నాయి.

ప్రధాని ప్రిన్సిపాల్ కార్యదర్శి పి కె మిశ్ర ద్వారా వారు తమ సాంకేతిక నివేదికలను సమర్పిస్తుంటారు. ముఖ్యమైన అంశాలపై ప్రధాని నేరుగా వారిని సంప్రదించి వివరణలు కోరుతూ ఉంటారు. ఈ బృందంలోని ప్రతి వారితో అవసరాన్ని బట్టి ఆయన సంప్రదింపులు జరుపుతూ ఉంటారు.

21 రోజుల లాక్ డౌన్ ప్రకటనకు ముందు సమిష్టిగా పెద్ద ఎత్తున పరిశోధన చేశారు. మొదట 14 రోజులు మాత్రమే చేద్దామనుకున్నారు. అప్పటికే వైరస్ పూర్తిస్థాయిలో దేశంలోకి ప్రవేశించడంతో అది సరిపోదని నిర్ణయానికి వచ్చారు. మొదట్లో ఇతర దేశాల నుండి వచ్చిన వారికి మాత్రమే వైరస్ పరీక్షలు జరపాలి అనుకున్నారు. కానీ ఆ తర్వాత వారితో సంబంధం గల వారందరికీ కూడా జరపాలని ఐసిఎంఆర్ నిర్ణయించింది.

ఈ నిపుణుల బృందాలతో పాటు ప్రధాని ప్రతిష్టాకరమైన పరిశోధన సంస్థలు సిఎస్ఐఆర్, డిఆర్డిఓ, సిసిఎంబి, ఐసిఎంఆర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ వైరాలజీ, ఇంస్టిట్యూట్ట్ అఫ్ ఫిజిక్స్, ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంజనీరింగ్ వంటి సంస్థలతో సహితం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు.

ప్రతి కుటుంబంపై, ముఖ్యంగా పేదలు, చిన్న వ్యాపారులు, చిన్న పరిశ్రమలు. మధ్యతరగతి/జీతాలు పొందే వర్గాలుపై పడుతున్న ప్రభావాన్ని స్వయంగా అంచనా వేస్తూ ఇఎంఐ లకు వెసులుబాటు వంటి కీలక నిర్ణయాలు తీసుకొంటున్నారు. నిత్యం 18 గంటల పాటు పనిచేసే ఆయన ప్రస్తుత సమయంలో 22 గంటల వరకు పనిచేస్తున్నారు.

ఒక్కరోజే 30మందికి కరోనా పాజిటివ్.. ముగ్గురు మృతి

Corona death

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణ మృదంగం కొనసాగుతోంది. చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా మహమ్మరి క్రమంగా అన్నిదేశాలకు పాకింది. ప్రపంచ వ్యాప్తంగా 8లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇండియాలోనే కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా 1,998 కరోనా కేసులు నమోదుగా 58మంది చెందారు. 148మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు.

దేశంలో కరోనా కట్టడికి కేంద్రం 21రోజులపాటు లాక్డౌన్ అమలు చేస్తుంది. అయినప్పటికీ కరోనా కేసులు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తుంది. తెలంగాణలో బుధవారం ఒక్కరోజే 30మందికి పాజిటివ్ కేసులు నమోదుకాగా ముగ్గురు మృతిచెందారు. దీంతో తెలంగాణలో కరోనా మృతుల సంఖ్య తొమ్మిదికి పెరిగింది. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 127కు పెరిగింది.

ఢిల్లీ మర్కజ్ కు కరోనా లింకు ఉండటంతో దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తుంది. దీంతో తెలంగాణ నుంచి ఢిల్లీ మర్కజ్ వెళ్లిన వారి వివరాలను సేకరించి వారిని కరోనా ఆసుపత్రులకు తరలిస్తున్నారు. వీరిలో 30మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. మిగతా వారిని ఐసోలేషన్ వార్డులకు తరలిస్తున్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించి కరోనా కట్టడికి సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది.

మర్కజ్ ప్రార్థనలతో 9 వేల మందికి కరోనా ముప్పు..!

గత నెలలో న్యూఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ లో జరిగిన మత ప్రార్థనలకు 7,600 మంది భారతీయులు, 1,300 మంది విదేశీయులు హాజరైనట్టు గుర్తించామని, దీంతో దాదాపు 9 వేల మంది ఇప్పుడు కరోనా మహమ్మారి ప్రమాదం అంచున ఉన్నారని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ వ్యాఖ్యానించింది. ఇండియాలో అతిపెద్ద కరోనా హాట్ స్పాట్ ఈ ప్రార్థనలు జరిగిన మసీదేనని అభిప్రాయపడ్డ కేంద్రం, వైరస్ సోకిన వారి సంఖ్య 9 వేలకు మించే ఉండవచ్చని పేర్కొంది.

ఈ మత ప్రార్థనల్లో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన వారిని గుర్తించేందుకు 23 రాష్ట్రాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులు నిర్విరామంగా పని చేస్తున్నారని కేంద్రం పేర్కొంది. ఏప్రిల్ 1 వరకూ 1,051 మందిని క్వారంటైన్ చేయగా, వారిలో 21 మందికి ఇప్పటికే పాజిటివ్ వచ్చింది. ఇద్దరు వ్యక్తులు మరణించారు. అందుబాటులో ఉన్న అన్ని వనరులనూ ఉపయోగించి, తబ్లిగీ జమాత్ లో పనిచేసిన 7,688 మంది స్థానిక కార్యకర్తలను, వారు కలిసిన వారిని, వారి కుటుంబీకులను క్వారంటైన్ చేస్తామని తెలిపారు.

మర్కజ్ ప్రార్థనలతో సంబంధమున్న ప్రతి ఒక్కరినీ గుర్తించడం అధికారులకు కష్ట సాధ్యంగా మారిందని పీఎంఓ కార్యాలయ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అత్యధికులను గుర్తించినా, ఇంకా బయటకు రానివారి ద్వారా వ్యాధి ఎంతమందికి వ్యాపిస్తుందన్న అంశం ఆందోళన కలిగిస్తోందని అన్నారు.

కాగా, ఇప్పటివరకూ ఈ ప్రార్థనలతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధమున్న 400 మందికి పైగా ప్రజలు కరోనా వైరస్ బారిన పడ్డారు. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ప్రార్థనలతో సంబంధమున్న కేసులు తమిళనాడులో అత్యధికంగా 190 ఉండగా, ఆ తరువాతి స్థానంలో ఏపీ ఉంది. ఏపీలో 71, ఢిల్లీలో 28, తెలంగాణలో 28, ఆసోంలో 14, మహారాష్ట్రలో 12, అండమాన్ లో 10, జమ్మూ కశ్మీర్ లో 6, పుదుచ్చేరి, గుజరాత్ లో రెండేసి కేసులు పాజిటివ్ వచ్చాయి.

ఇండియాలోని వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మందితో పాటు మలేషియా, ఇండోనేషియా వంటి దేశాల నుంచి పలువురు తబ్లిగీ జమాత్ లో పాల్గొన్నారు. ఇక్కడి ఇరుకు వీధుల్లో వారంతా పలు దినాలు గడిపారు. ఆపై లాక్ డౌన్ అమలులోకి రాగా, దాదాపు 6,500 మంది తమతమ ప్రాంతాలకు వెళ్లిపోయారు.

సోమవారం ప్రారంభమై, దాదాపు 36 గంటల పాటు సాగిన ఆపరేషన్ అనంతరం తబ్లిగీ జమాత్ నుంచి 2,335 మందిని బయటకు తీసుకుని రాగా, వీరిలో ఎంతమందికి కరోనా సోకిందన్న విషయం తేలాల్సివుంది. వీరందరినీ ప్రస్తుతం క్వారంటైన్ సెంటర్లకు తరలించగా, కరోనా లక్షణాలు కనిపించిన వారిని అధికారులు ఆసుపత్రుల్లో చేర్చారు.

గంటల వ్యవధిలోనే పెరుగుతున్న కరోనా కేసులు!

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య గంట గంటకి పెరుగుతున్నాయి. మంగళవారం రాత్రికి 44 కరోనా కేసులు నమోదు కాగా బుధవారం రాత్రికి 111 కేసులు నమోదయ్యాయి. గురువారం ఉదయానికల్లా 132 కేసులను నిర్థారించింది.

రాష్ట్రంలోనే తొలికేసు నమోదైన నెల్లూరు జిల్లా.. ఇప్పుడు అత్యథిక కేసులున్న జిల్లాగా కూడా మారింది. నెల్లూరు జిల్లాతోపాటు, గుంటూరు జిల్లాలో కూడా 20 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 12గంటల వ్యవధిలో మరో 21 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రకాశంలో 17, కడపలో, కృష్ణా జిల్లాల్లో 15మంది చొప్పున బాధితులున్నారు.

మార్చి 13, 14, 15 తేదీలలో ఢిల్లీలోని నిజాముద్దీన్ మార్కజ్ లో జరిగిన మతపరమైన సమావేశానికి హాజరై వచ్చినవారు, వారితో సన్నిహితంగా మెలిగిన వారి వల్లే కేసులు ఇంత భారీగా పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే, విదేశాల నుంచి వచ్చినవారు, వారితో సన్నిహితంగా మెలిగినవారూ వీరిలో ఉన్నారు.

మాజీ సీఎం భార్య.. గ్లామర్ రూట్

కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి భార్య హీరోయిన్ రాధిక అన్న సంగతి అందరికీ తెల్సిందే. గతంలో పలు సినిమాల్లో గ్లామర్ పాత్రల్లో నటించి రాధిక హీరోయిన్ గా మెప్పించింది. అయితే కుమారస్వామితో పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంది. వీరిద్దరి ఓ పాప కూడా ఉంది. అయితే తాజాగా ఆమె మళ్లీ సినిమాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కుమారస్వామి సీఎంగా ఉన్న సమయంలోనే ఆమె మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ నేపథ్యంలో రాధిక నటించిన రెండు మూవీలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఆమె సినిమాలపై పూర్తిగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో యంగ్ హీరోలతో జతకట్టేందుకు సిద్ధమవుతోంది. గతంలోనే మాదిరిగానే గ్లామర్ పాత్రల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. హీరోయిన్ గానే కాకుండా కీలక పాత్రలో నటించేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టిన రాధిక హుందాగా ఉండే పాత్రల్లో నటిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మాజీ సీఎం భార్యగా, ఓ కూతురు తల్లి అయిన రాధిక గ్లామర్ పాత్రల్లో నటిస్తే ఆమె సినిమా కెరీర్ త్వరలోనే ముగిస్తుందని అంటున్నారు. అలా కాకుండా ఎక్కువ కాలం సినిమాల్లో ఉండాలంటే ఆమె గ్లామర్ పాత్రల్లో కాకుండా నటిగా పేరుతెచ్చే క్యారక్టర్లో నటించాలని పలువురు సూచిస్తున్నారు. అయితే రాధిక గ్లామర్ పాత్రలకే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. అయితే సెకండ్ ఇన్నింగ్ మొదలైట్టిన ఈ పెళ్లాయిన బ్యూటీకీ ఏమేరకు కలిసొస్తుందో చూడాలి మరీ.

ఏపీలో 132కు చేరిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 132 కు చేరింది. వైద్య ఆరోగ్య శాఖ గురువారం ఉదయం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం బుధవారం రాత్రి పది గంటల అనంతరం 21 కొత్త కేసులు నమోదైనట్లు స్టేట్ కరుణ నోడల్ ఆఫీసర్ అర్జా శ్రీకాంత్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరు జిల్లాలో 20, నెల్లూరు జిల్లాలో 20, ప్రకాశం జిల్లాలో 17, కడప జిల్లాలో 15, కృష్ణా జిల్లాలో 15, పశ్చిమ గోదావరి జిల్లాలో 14, విశాఖపట్నం జిల్లాలో 11, తూర్పుగోదావరి జిల్లాలో 9, చిత్తూరు జిల్లాలో 8, అనంతపురం జిల్లాలో 2, కర్నూలు జిల్లాలో 1 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవగా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. రాష్ట్రంలో కరోనా కారణంగా ఇంతవరకు మరణాలు లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

మరోవైపు వైరస్ వ్యాప్తి నివారణకు ప్రజలు సహకరించాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు, వారికి సన్నిహితంగా ఉన్న వారు ఉన్నవారు 104 కు ఫోన్ చేయడం లేక సమీపంలోని ఆశ వర్కర్లు, ఏఎన్ఎం, హెల్త్ అసిస్టెంట్ కు వారి సమాచారం ఇస్తే వైద్యులు ఇంటికి వచ్చే పరీక్షలు చేస్తారని చెప్పారు. సీఎస్ నీలం సాహ్ని గురువారం ఉదయం ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు.

‘నిధి’ హాట్ కేక్.. వైరల్

ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కు యూత్ లో ఫుల్ క్రేజ్ ఉంది. పూరి జగన్మాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీలో రామ్ సరసన నటించి మెప్పించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్టందుకోవడంతో టాలీవుడ్లో బీజీగా స్టార్ గా మారింది. తాజాగా కరోనా ఎఫెక్ట్ తో షూటింగ్ లన్నీ బంద్ అవడంతో ఈ ఇస్మార్ట్ బ్యూటీ ఇంటికే పరిమితమైంది. నిన్నటిదాకా హాట్ డ్యాన్సులతో కుర్రకారును ఆకట్టుకున్న ఈ బ్యూటీ తాజాగా కేకులు తయారు చేస్తూ ఆకట్టుకుంటోంది.

https://www.instagram.com/p/B-ZrdxuFMKg/

నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో ఎప్పుడూ ఆక్టివ్ ఉంటూ హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తుంటుంది. దీంతో యూత్లో ఈ భామకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కినేని నాగచైతన్య నటించిన ‘సవ్యసాచి’ మూవీతో నిధి అగర్వాల్ తెలుగు ప్రేక్షకులకు పరిచమైంది. ఇటీవల పూరీ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీలో నిధి అగర్వాల్ సూపర్ హిట్ అందుకుంది. తాజాగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైంది. ఇంట్లోనే ఉంటూ తనలోని టాలెంట్ బయటపెట్టింది. ఇంటో సరదాగా కేకులను తయారు చేసింది. ఈ కేకులను సోషల్ మీడియాలో పెట్టి అభిమానులతో పంచుకుంది. కేకంటే తింటే.. నిధి హాట్ కేకులనే తినాలంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం నిధి అగర్వాల్ హాట్ కేక్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నారు.

కరోనాకు మందు కనిపెట్టామంటున్న ‘డిస్ట్రిబ్యూటెడ్‌ బయో’

కరోనా వైరస్‌ నుంచి మానవాళిని కాపాడే ఔషదాన్ని తాము తయారు చేశామని అమెరికాలోని కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న ‘డిస్ట్రిబ్యూటెడ్‌ బయో’ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్‌ జాకబ్‌ గ్లాన్‌ విల్లె వెల్లడించారు. గతంలో సార్స్‌ వైరస్‌ ను నిర్వీర్యం చేసేందుకు ఉపయోగించిన యాంటీ బాడీస్‌ కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయని ఆయన అన్నారు. ఐదుగురితో కూడిన తన బృందం కరోనా వైరస్‌పై విజయం సాధించిందని, సార్స్‌ ను అంతం చేసిన యాంటీ బాడీస్ కరోనాపైనా పని చేశాయని, డాక్టర్‌ జాకబ్‌ పేర్కొన్నారు.

వాస్తవానికి కరోనా వైరస్‌ మానవ శరీరంలోని ఎస్‌ – ప్రొటీన్‌ కణాల ద్వారా ప్రవేశిస్తుందని, తాము ప్రయోగించిన యాంటీ బాడీస్, ఎస్‌ – ప్రొటీన్‌ ను నిర్వీర్యం చేస్తున్నాయని, తద్వారా కరోనా వైరస్‌ కూడా నాశనం అవుతోందని ఆయన అన్నారు. ప్రస్తుతం మనుషులపై క్లినికల్‌ ట్రయల్స్‌ దశలో ఉన్న వాక్సిన్, సెప్టెంబర్‌ నెలలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఆ దిశగా తమ ప్రయత్నాలను ముమ్మరం చేశామని వెల్లడించారు. తమ ప్రయోగ ఫలితాలను మరో రెండు ల్యాబ్స్ సాయంతో నిర్ధారించుకుంటున్నామని జాకబ్ వెల్లడించారు.

10, 12 తరగతుల పరీక్షలపై కీలక నిర్ణయం!

ప్రపంచవ్యాప్తంగా కరోనా కలకలం మరియు దేశవ్యాప్తంగా లాక్డౌన్ యొక్క అసాధారణ పరిస్థితుల దృష్ట్యా, మరియు విద్యార్థుల విద్యా భవిష్యత్తు దృష్ట్యా 10, 12 తరగతుల పరీక్షలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్యా సంస్థల్లో ప్రమోషన్ మరియు విశ్వవిద్యాలయ ప్రవేశానికి కీలకమైన 29 ప్రధాన సబ్జెక్టులకు మాత్రమే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్‌ఈ) 10, 12 తరగతుల పరీక్షలను నిర్వహిస్తుందని కేంద్ర హెచ్‌ఆర్‌డి మంత్రి రమేష్ పోఖ్రియాల్ ‘నిశాంక్’ బుధవారం ప్రకటించారు.
కరోనా తీవ్రత తగ్గిన తర్వాత సిబిఎస్ఈ బోర్డు పరీక్షలు నిర్వహించే స్థితిలో ఉన్నప్పుడు, తగిన నోటీసు ఇవ్వడం ద్వారా 29 సబ్జెక్టులకు మాత్రమే పరీక్షలు నిర్వహించబడతాయి. మిగిలిన సబ్జెక్టులకు పరీక్షలు ఉండవని, సిబిఎస్‌ఈ బోర్డువెల్లడించింది. దీనికి సంబంధించి అసెస్‌మెంట్ త్వరలో జారీ చేయబడుతుంది, ”అని హెచ్‌ఆర్‌డి మంత్రి ప్రకటించారు.

బోర్డు అనుబంధంగా ఉన్న అన్ని పాఠశాలలకు బోర్డు ఈ క్రింది విధంగా సలహా ఇచ్చింది

దేశ వ్యాప్తంగా కరోనా కలకలం పుట్టింస్తున్న సమయంలో 1 నుండి 8 తరగతులలో చదువుతున్న విద్యార్థులందరూ తదుపరి తరగతి / గ్రేడ్‌కు ప్రమోషన్ పొందవచ్చు. ఈ సలహా ఎన్‌సిఇఆర్‌టితో సంప్రదించి జారీ చేయబడుతోంది.

దేశ విదేశాలలో మిగిలిన అన్ని పాఠశాలు 9 మరియు 11 తరగతుల విద్యార్థులను ఇప్పటివరకు నిర్వహించిన ప్రాజెక్ట్ వర్క్, ఆవర్తన పరీక్షలు, టర్మ్ ఎగ్జామ్స్ మొదలైన పాఠశాల ఆధారిత అన్ని అంచనాలు తీసుకొని తదుపరి తరగతులకు ప్రమోషన్స్ ఇవ్వాలని సూచించారు.

టిక్‌టాక్‌ భారీ విరాళం…!

కరోనా వైరస్‌ కట్టడికి భారత్‌ చేస్తున్న ప్రయత్నాలకు టిక్‌టాక్‌ భారీ విరాళం ప్రకటించింది. కరోనా బాధితులకు సేవలందిస్తున్న వైద్యులకు సుమారు నాలుగు లక్షల హజ్మత్‌ సూట్‌లు, రెండు లక్షల మాస్కులు సమకూర్చేందుకు సిద్ధమైంది. వీటి విలువ సుమారు వంద కోట్ల రూపాయల వరకూ ఉంటుందని అంచనా. కరోనాను ఎదుర్కొనేం దుకు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పోరులో వైద్యులు ముందు వరుసలో ఉన్నారని, వారు సురక్షితంగా ఉండటం అత్యవసరమని టిక్‌టాక్‌ సంస్థ తెలిపింది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని నాలుగు లక్షల ప్రత్యేక హజ్మత్‌ సూట్లు, రెండు లక్షల మాస్కులు వైద్యులకు అందించాలని నిర్ణయిం చినట్లు తెలిపింది. కేంద్ర జౌళి శాఖ సహకారం తో తాము నిర్ణీత ప్రమాణాలతో కూడిన సూట్లు, మాస్కులు సిద్ధం చేశామని, వీటిని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు అందజేయను న్నామని టిక్‌టాక్‌ వివరించింది. ఇప్పటికే ఫేస్ బుక్, గూగుల్ వంటి సంస్థలు విరాళాలు ప్రకటించాయి. దీంతో టిక్ టాక్ భారీ విరాలన్ని దేశానికి అందించడానికి ముందుకు రావడం స్వాగతించాల్సిన విషయం.