ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణ మృదంగం కొనసాగుతోంది. చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా మహమ్మరి క్రమంగా అన్నిదేశాలకు పాకింది. ప్రపంచ వ్యాప్తంగా 8లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇండియాలోనే కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా 1,998 కరోనా కేసులు నమోదుగా 58మంది చెందారు. 148మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు.
దేశంలో కరోనా కట్టడికి కేంద్రం 21రోజులపాటు లాక్డౌన్ అమలు చేస్తుంది. అయినప్పటికీ కరోనా కేసులు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తుంది. తెలంగాణలో బుధవారం ఒక్కరోజే 30మందికి పాజిటివ్ కేసులు నమోదుకాగా ముగ్గురు మృతిచెందారు. దీంతో తెలంగాణలో కరోనా మృతుల సంఖ్య తొమ్మిదికి పెరిగింది. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 127కు పెరిగింది.
ఢిల్లీ మర్కజ్ కు కరోనా లింకు ఉండటంతో దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తుంది. దీంతో తెలంగాణ నుంచి ఢిల్లీ మర్కజ్ వెళ్లిన వారి వివరాలను సేకరించి వారిని కరోనా ఆసుపత్రులకు తరలిస్తున్నారు. వీరిలో 30మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. మిగతా వారిని ఐసోలేషన్ వార్డులకు తరలిస్తున్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించి కరోనా కట్టడికి సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది.