ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ముంబయిలోని ధారావి. కిక్కిరిసి ఉండే అగ్గిపెట్టెల్లాంటి ఇళ్ల మధ్య, ఇక్కడ లక్షల మంది పేద ప్రజలు నివాసం ఉంటుంటారు. ఇక్కడ జనసాంధ్రత అత్యధికం కాగా, పారిశుద్ధ్యం అంతంతమాత్రం. ధారావిలో ఓ యువకుడు కరోనా సోకి మరణించగా, మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తీవ్ర ఆందోళనలో ఉంది. ధారావి వంటి ప్రాంతంలో కరోనా ప్రబలితే, కరోనా వ్యాప్తిని అడ్డుకునే పరిస్థితి ఉండదని అధికారులు భయపడుతున్నారు.
ధారావిలో గురువారం నాడు తొలి మరణం నమోదైంది. కరోనా వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న ఓ యువకుడి రక్త నమూనాలను పరీక్షించగా, పాజిటివ్ వచ్చింది. అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా, అతను ఉంటున్న భవనంలోని అందరినీ, వైద్య పరీక్షల నిమిత్తం అధికారులు తరలించారు. కాగా, మహారాష్ట్రలో 2త 24 గంటల్లో 59 కరోనా కేసులు బయటపడగా, ఆరుగురు మరణించారు. ప్రస్తుతం ధారావి ప్రాంతంలో దాదాపు 16 లక్షల మంది నివాసం ఉంటున్నారు. ఇదే ఇప్పుడు ఉద్ధవ్ సర్కారు ముందు పెను సవాళ్లను నిలిపింది.