Home Blog Page 8554

ఫేక్ అలెర్ట్: కరోనా మరణాలపై ఇవే నిజాలు

దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య ఏ స్థాయిలో పెరుగుతున్నాయో.. అదే సమయంలో భారీ ఎత్తున ఫేక్ న్యూస్ కూడా విస్త్రతంగా ప్రచారం జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో, భారత దేశంలో, ప్రపంచంలో ఎక్కడ ఎన్ని కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి? అందులో ఎంతమంది చనిపోయారనే విషయాలపై కొన్ని ఫేక్ న్యూస్ వైరల్ అవుతున్నాయి.

అయితే ఈ క్రింది అధికారిక వెబ్ సైట్ల ద్వారా.. కరెక్ట్ సమాచారాన్ని పొందుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మీద అధికారిక సమాచారం కోసం http://hmfw.ap.gov.in/covid_dashboard.aspx చెక్ చేయండి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సమాచారం అందజేస్తుంది.

ఇక తెలంగాణ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఓ కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం రకరకాల ఫేక్ న్యూస్ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఓసారి అలాంటి వార్తలను ఇతరులకు ఫార్వార్డ్ చేసే ముందు ఇక్కడ చెక్ చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. https://factcheck.telangana.gov.in/

ఇవి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సమాచారం. అయితే, ఏపీ, తెలంగాణతో పాటు దేశంలోని మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన కరోనా సమాచారం https://www.mohfw.gov.in/ లో తెలుసుకోవచ్చు.

ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఎన్ని కరోనా కేసులు ఉన్నాయనే వివరాలను https://www.worldometers.info/coronavirus/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO దీన్ని నిర్వహిస్తోంది.

మోడీ వీడియో సందేశం పై సర్వత్రా ఆసక్తి!

“రేపు ఉదయం నా తోటి భారతీయులతో ఒక చిన్న వీడియో సందేశాన్ని పంచుకోబోతున్నా” అని ప్రధాని మోడీ చేసినా ట్వీట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. కరోనా కలకలం వల్ల గతంలో మార్చి 19న వీడియో కాన్ఫిరెన్సు పెట్టి 22 కర్ఫ్యూ అన్నారు. మరలా మరో కాన్ఫిరెన్సు పెట్టి 21రోజుల లాక్ డౌన్ అన్నారు. ఈ సారి ఎటువంటి నిర్ణయం తీసుకొనున్నారో.. అనే ఆసక్తి నెలకొన్నది.

ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తోన్న కరోనా దేశంలో రెండో దశలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా కరోనా కేసులు పెరిగిపోతుండడంతో మార్చి 21 నుంచి అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ను పొడిగిస్తారా లేక ముగిస్తారా అన్నది కీలకంగా మారింది. ఈ నేపథ్యంలోనే గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలతో పాటు, లాక్‌డౌన్‌ను మరింత పటిష్టంగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాల సీఎంలకు సూచించారు. ఈ నేపథ్యంలో ప్ర‌ధాని వీడియో సందేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

టీమిండియా ప్రపంచకప్ గెలిచి నేటికి తొమ్మిదేళ్లు


క్రికెట్ అభిమానులకు ఏప్రిల్ 2 గుర్తిండిపోయే రోజే. సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం అంటే 2011 ఏప్రిల్ 2న టీమిండియా రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో నిర్వహించిన ఫైనల్లో శ్రీలంకపై భారత్ విజయం సాధించి ప్రపంచకప్ గెలిచింది. ప్రపంచకప్ ఫైనల్లో కెప్టెన్ ధోని సిక్సర్ బాది టీమిండియాకు చిరకాల విజయం అందించాడు.

టీమిండియా తొలిసారి కపిల్ దేవ్ నాయకత్వంలో 1983 జూన్ 25న ప్రపంచ కప్ గెలిచింది. ఆ తర్వాత ప్రపంచ కప్ అందుకున్నందుకు చాలాకాలం పట్టింది. రెండోసారి ప్రపంచ కప్ అందుకునేందుకు 27సంవత్సరాల, 9నెలల, 7రోజుల సమయం పట్టింది. ధోని నాయకత్వంలో రెండోసారి టీమిండియా ఏప్రిల్ 2, 2011న రెండోసారి ప్రపంచకప్ అందుకుంది.

2007 ప్రపంచకప్ లో టీమిండియా ప్రదర్శనపై పెద్దఎత్తున విమర్శలు రావడంతో బీసీసీఐ మార్పులు చేసింది. ఇంగ్లాడ్‌లో జరిగిన సిరీస్లో టీమిండియా ఓడిన తర్వాత రాహుల్ ద్రవిడ్ తన కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. ధోనీ కెప్టెన్సీలో దక్షిణాఫ్రికాలో జరిగిన టీ20 ప్రపంచకప్ లో భారత్ విజయం సాధించింది. దీంతో బీసీసీఐ ధోనీకి టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. 2011ప్రపంచకప్ స్వదేశంలో బీసీసీఐ నిర్వహించింది. టీమిండియాకు ప్రపంచకప్ అందించేందుకు ధోని టీంలో కొన్ని మార్పులు చేశారు. ధోని ఆట చివరలో సిక్సర్ బాది క్రికెట్ అభిమానులకు చిరస్మణీయంగా నిలిచిపోయేలా టీమిండియాకు విజయాన్ని అందించాడు.

కరోనా దెబ్బతో కొండెక్కిన ఫోన్ల ధరలు!

మొబైల్‌ ఫోన్లు మరియు వాటి విడి భాగాలపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను   12 శాతం నుంచి 18 శాతానికి పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

మార్చి 31తో గత ఆర్థిక సంవత్సరం ముగిసిపోవడంతో ఏప్రిల్‌ 1 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి.  దీంతో పెరిగిన పన్ను భారంతో మొబైల్‌ ఫోన్ల ధరలు కూడా పెరిగాయి. చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌ మి ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన రియల్‌ మి 6 స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలను మార్చి11 నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. రియల్‌ మి 6, రియల్‌ మి ఎక్స్‌2, రియల్‌ మి ఎక్స్‌టీ మోడళ్లపై ధరలు పెంచినట్లు రియల్‌ మి సంస్థ ప్రకటించింది.  భారత ప్రభుత్వం మొబైల్‌ ఫోన్లపై జీఎస్టీని పెంచడంతో తమ కంపెనీ స్మార్ట్‌ఫోన్ల ధరలు పెంచినట్లు రియల్‌ మి పేర్కొంది. పెరిగిన రేట్లు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది. రియల్‌ మి కంపెనీకి చెందిన మూడు మోడళ్లపై కనీసం రూ.1000 పెరిగింది.

కొత్త ధరలు ఇవే..

Realme 6 (4GB+64GB) మోడల్‌ ధర గతంలో 12,999 ఉండగా ప్రస్తుతం రూ. 13,999

Realme X2 (4GB+64GB) మోడల్‌ ధర గతంలో 16,999 ఉండగా ప్రస్తుతం రూ.17,999

Realme XT (4GB+64GB) మోడల్‌ ధర గతంలో 15,999 ఉండగా ప్రస్తుతం రూ.16,999

ఏపీలో 143కు చేరిన కరోనా బాధితుల సంఖ్య

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 143 కు చేరింది. వైద్య ఆరోగ్య శాఖ గురువారం ఉదయం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం గురువారం ఉదయం 9 గంటల సాయంత్రానికి 11 కొత్త కేసులు నమోదైనట్లు స్టేట్ కరుణ నోడల్ ఆఫీసర్ అర్జా శ్రీకాంత్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,321మంది కి పరీక్షలు నిర్వహించగా 1,171 మందికి కరోనా నెగిటివ్ అని, 143 కరోనా పాజిటివ్ గా రిపోర్టులు అందాయని అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఉన్న నాలుగు పరీక్షా కేంద్రాలకు అధనంగా గుంటూరు, కడపలో రెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

గుంటూరు జిల్లాలో 20, నెల్లూరు జిల్లాలో 21, ప్రకాశం జిల్లాలో 17, కడప జిల్లాలో 16, కృష్ణా జిల్లాలో 23, పశ్చిమ గోదావరి జిల్లాలో 14, విశాఖపట్నం జిల్లాలో 11, తూర్పుగోదావరి జిల్లాలో 9, చిత్తూరు జిల్లాలో 9, అనంతపురం జిల్లాలో 2, కర్నూలు జిల్లాలో 1 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

‘డార్లింగ్’కు ఫిదా అయిన ‘చెర్రీ’ భామ


మెగాపవర్ స్టార్ రాంచరణ్ దర్శకదిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్నాడు. ఈ మూవీలో రాంచరణ్ అల్లూరి సీతరామరాజు పాత్రలో నటిస్తున్న సంగతి తెల్సిందే. ఇందులో రాంచరణ్ కు జోడీగా సీత పాత్రలో బాలీవుడ్ భామ అలియాభట్ నటిస్తుంది. అయితే తాజాగా ఆమెకు టాలీవుడ్ నుంచి మీకు ఏ హీరో అంటే ఇష్టమనే ప్రశ్న ఎదురుకాగా ఆసక్తికరంగా సమాధానం ఇచ్చింది. తనకు ‘బాహుబలి’ ప్రభాస్ అంటే ఇష్టమంటూ తన మనస్సులోని మాటను ఏమాత్రం సంకోచించకుండా బయటపెట్టేసింది ఈ బాలీవుడ్ బ్యూటీ.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ మూవీ చూశాక అతనికి అభిమానిగా మారనని అలియాభట్ తెలిపింది. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిన సంగతి తెల్సిందే. ‘బాహుబలి’ సీరిస్ లతో ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే ‘బాహుబలి’ తర్వాత వచ్చిన ‘సాహో’ మూవీకి మిక్సడ్ రిజల్ట్ వచ్చింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ‘సాహో’ తెలుగులో అనుకున్నంత విజయం సాధించలేదు. బాలీవుడ్లో మాత్రం ‘సాహో’ భారీ విజయం సాధించింది. దీంతో బాలీవుడ్లో ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగింది. ప్రభాస్ యాక్షన్ సన్నివేశాలకు బాలీవుడ్ ప్రేక్షకులకు ఫిదా అయ్యారు.

అలియా భట్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ లో చెర్రీకి జోడీగా నటిస్తుంది. అదేవిధంగా బాలీవుడ్లో సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ‘గంగూభాయి’ మూవీలో నటిస్తుంది. అదేవిధంగా రన్బీర్ కపూర్ కు జోడీగా ‘బ్రహ్మాస్త్ర’ మూవీ ఈ భామ నటిస్తుంది. ‘డార్లింగ్’కు ఇప్పటికే మహిళల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక హీరోయిన్లయితే ఒక్కసారైనా ‘డార్లింగ్’ కలిసి నటించడానికి ఇంట్రెస్ట్ చూపుతుంటారు. ఈ లిస్టులో తాజాగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ చేరడం ఆసక్తికరంగా మారింది.

లాక్ డౌన్ కొనసాగించక పోవచ్చని ప్రధాని మోదీ సంకేతం


కరోనా వైరస్ కట్టడికి మూడు వారాలపాటు అమలు చేస్తున్న లాక్ డౌన్ ను మరింతగా పొడిగించే అవకాశం లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు స్పష్టమైన సంకేతం ఇచ్చారు.

అయితే దీనిని ఎత్తివేసిన తర్వాత తిరిగి ప్రజలంతా యధావిధింగా వీధులలోకి వస్తే తిరిగి వైరస్ విజృభించే అవకాశం ఉన్నందున చేపట్టే చర్యల గురించి ముఖ్యమంత్రులు సమిష్టిగా ఒక కార్యాచరణను రూపొందించాలని కోరారు.

కరోనా వైరస్ కట్టడి గురించి రెండు వరాల కాలంలో రెండో సారి ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంప్రదించులు జరుపుతూ క్ డౌన్ ఎత్తివేత సందర్బంగా ప్రజలు ఒకేసారి పెద్ద యెత్తున బయటకు రాకుండా చూడాలని ప్రధాని సూచించారు.

లాక్ డౌన్ ఎత్తివేత తర్వాత ఎదురయ్యే పరిస్థితుల గురించి ఆయన సీఎంలతో చర్చిస్తూ లాక్ డౌన్ ఎత్తివేత తర్వాత అనుసరించాల్సిన వ్యూహంపై రోడ్ మ్యాప్ తయారు చేయాలని సూచించారు.

వచ్చే కొద్దీ వారాలలో మన దృష్టి అంతా వైరస్ గురైన వారిని గుర్తించడం, వారిని ఇసోలాటిన్ లేదా స్వీయ నిర్బంధం గురించి ఉండాలని స్పష్టం చేశారు. ప్రతి చోటా వైరస్ తీవ్రంగా ఉన్న హాట్ స్పాట్స్ ను గురించి, వాటిని చుట్టుముట్టాలని, తద్వారా వాటి వ్యాప్తిని నిరోధించాలని కోరారు.

డాక్టర్లను, వైద్య సిబ్బందిని పెంచుకోవాలని సూచిస్తూ అత్యవసర మందుల కొరత లేకుండా, మందుల తయారీకి అవసరమైన ముడిపదార్ధాలు అందుబాటులో ఉండేవిధంగా, అవసరమైన వైద్య పరికరాలు లభించే విధంగా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.

ఆయన సీఎంలకు సూచించారు. ప్రతి జిల్లాలో నిఘా అధికారులను నియమించాలని ఆనయ చెప్పారు. లాక్ డౌన్ తర్వాత మునుపటిలాగా సాధారణంగా ఉండడానికి లేదని, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.

సీఎంగా మారనున్న ‘శివగామి’


‘ప్రస్థానం’ మూవీతో దర్శకుడు దేవాకట్టా టాలీవుడ్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ దర్శకుడి మూవీలపై అభిమానుల్లో చాలా అంచనాలు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే దేవాకట్టా తదుపరి మూవీపై ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. సాయిధరమ్ తేజ్ హీరోగా దేవాకట్టా తాజాగా మూవీని తెరకెక్కించేందుకు సన్నహాలు చేస్తున్నారు. ఈ మూవీలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించనున్నారు. ‘బాహబలి’లో శివగామిగా అలరించిన రమ్యకృష్ణ ఈ మూవీలో సీఎం పాత్రలో నెగిటివ్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ మూవీలో సాయిధరమ్ స్టూడెంట్ లీడర్ గా కనిపించబోతున్నారు. పూర్తిగా పొలిటికల్ బ్యాక్ డ్రామాతో తెరకెక్కుతున్న సినిమాలో రమ్యకృష్ణ సీఎంగా నటించనున్నారని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుత విద్యా వ్యవస్థలోని లొసుగులను ఎత్తిచూపే యువకుడి పాత్రలో సాయితేజ్ కనిపించబోతున్నాడు. సాయితేజ్ రమ్యకృష్ణ ఢీకొట్టే సన్నివేశాలుంటాయని తెలుస్తోంది. ఇటీవలే ‘ప్రతిరోజు పండగే’ పండుగ మూవీతో హిట్టందుకున్నాడు. రీసెంట్ గా కొత్త దర్శకుడు సుబ్బుతో ‘సోలో బతుకే సో బెటర్’ మూవీని చేశాడు. ఈ మూవీని మేలో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తుంది.

లాక్‌డౌన్ ఉల్లంఘిస్తే రెండేళ్ల జైలు


కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తుండటంతో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది. లాక్‌డౌన్‌ నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే రెండేళ్ల వరకూ జైలు శిక్ష విధించవచ్చని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా సూచించారు.

ప్రాణాంతక వైరస్‌ విస్తృతంగా ప్రబలకుండా అడ్డుకట్ట వేసేందుకు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. లాక్‌డౌన్‌ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రోడ్లపైకి వచ్చే వారికి చెక్‌ పెట్టాలని కోరారు.

డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ కింద లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు స్పష్టం చేశారు.

ఏ నిబంధన ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు చేపట్టవచ్చనే పూర్తి వివరాలతో కూడిన జాబితాను కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు పంపింది.ఇక దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1965కు చేరగా వీరిలో 151 మంది కోలుకోగా 50 మంది మరణించారు.

కరోనాపై పోరాటానికి గంభీర్ సాయం


దేశంలో కరోనా కట్టడికి కేంద్రం లాక్డౌన్ అమలు చేస్తుంది. 21రోజులపాటు లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ఇప్పటికే ప్రకటించారు. దీంతో వ్యాపార, వాణ్యిజ్య సంస్థలు మూతపడగా ప్రజారవాణా స్తంభించిపోయింది. లాక్డౌన్ అమలు చేస్తున్నప్పటికీ దేశంలో కరోనా కేసులు పాజిటివ్ కేసులు తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 2,100కుపైగా కరోనా కేసులు నమోదుగా 50మంది మృతిచెందారు. కరోనా కట్టడికి సెలబ్రెటీలు తమవంతు సాయంగా విరాళాలు ప్రకటిస్తున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే పలువురు సెలబెట్రీలు పీఎం, సీఎం సహాయనిధులకు విరాళాలను ప్రకటించారు.

తాజాగా కరోనా నివారణ కోసం బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తన రెండేళ్ల జీతాన్ని పీఎం కేర్స్‌ ఫండ్‌కు విరాళం అందజేస్తున్నట్లు ప్రకటించారు. కరోనా మహమ్మారిపై ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి ప్రతీఒక్కరూ సాయం అందజేయాలని గంభీర్ తన ట్విట్టర్లో కోరారు. ఎవరికీ తోచినంత వారు పీఎం సహాయనిధికి విరాళాలను ఇవ్వాలని కోరారు. అలాగే ఢిల్లీ ప్రభుత్వాసుపత్రుల్లో కరోనాకు చికిత్స అందించే వైద్య సామగ్రి కోసం తన ఎంపీ నిధుల నుంచి 50లక్షల నిధులను విడుదల చేశారు. కరోనా పోరాటానికి గంభీర్ చేస్తున్న కృషిని పలువురు ప్రశంసిస్తున్నారు.
Also Read: కరోనా విరాళం టాటా తరవాత అజీమ్ ప్రేమజీ

‘ఆర్ ఆర్ ఆర్’ మీద అప్పుడే విమర్శలు మొదలయ్యాయి

rrr shooting

మైటీ డైరెక్టర్ రాజ‌మౌళి ప్ర‌స్తుతం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌తో ‘రౌద్రం ర‌ణం రుధిరం’ సినిమాను తనదైన శైలిలో తెర‌కెక్కిస్తున్నాడు. రీసెంట్‌గా విడుద‌లైన మోష‌న్ పోస్ట‌ర్‌, రామ్‌చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే వీడియో ప్రోమోకు ప్రేక్ష‌కుల నుండి అద్భుత స్పంద‌న వచ్చింది. అయితే సినీ విమర్శకులు మాత్రం రాజ‌మౌళి మోష‌న్ పోస్ట‌ర్‌ను కాపీ కొట్టాడ‌ని గగ్గోలు పెడుతున్నారు. గతంలో కూడా బాహుబలి 2 చిత్రం యొక్క `చేతిలో బిడ్డ పోస్టర్ ` విడుదల అయినపుడు కూడా ఇలాంటి కామెంట్స్ వచ్చాయి. అయినా వాటిని రాజమౌళి కేర్ చేయలేదు.

ఇక ఇప్పటి విషయానికి వస్తే రాజ‌మౌళి ‘‘రౌద్రం ర‌ణం రుధిరం’’ ను మూడు ద‌శాబ్దాల క్రింద‌ట వ‌చ్చిన ఓ హాలీవుడ్ సినిమా ‘ఫైర్ అండ్ ఐస్‌’కు లింకు పెట్టి మాట్లాడుతున్నారు. 1983లో విడుద‌లైన ఫాంట‌సీ మూవీ “‘ఫైర్ అండ్ ఐస్‌”కు ఆర్ ఆర్ ఆర్ సినిమా కాపీ అని తమకున్న సినీ పరిజ్ఞానాన్నిబయట పెడుతున్నారు

నిజానికి 1983 లో వచ్చిన ఫైర్ అండ్ ఐస్ మూవీ యానిమేటెడ్ చిత్రం. పైగా అందులో సోషల్ స్ట్రక్చర్ ఉన్న పాత్రలు అసలే లేవు. కానీ ఆర్ ఆర్ ఆర్ చిత్రం అలా కాదు ఎమోష‌న్స్‌ను, హీరోయిజాన్ని మిక్స్ చేసి తీస్తున్న చిత్రం. ఇలాంటి చిత్రాలను అద్భుతంగా తెర‌కెక్కించ‌డంలో రాజ‌మౌళి దిట్ట‌. అందుకే రాజమౌళి కి అపజయం ఆమడ దూరంలోనే ఆగిపోయింది.

ప్రభాస్ కి మాజీ మంత్రి ప్రశంసలు


ఊహించని విపత్తు , కరోనా మహమ్మారి ప్రపంచాన్నిఅతలాకుతలం చేసేస్తోంది. ఈ నరహంతక వ్యాధి రూపుమాపే నేపథ్యంలో పలువురు ప్రముఖులు సాయం చేసి పెద్ద మనసు చాటుకున్నారు. అలాంటి వారిలో తెలుగు సినీరంగానికి చెందిన పవన్ కళ్యాణ్ , ప్రభాస్ వంటి వారు ముందుకొచ్చి తమ వంతుగా ఆర్ధిక సాయం చేశారు. వీరిలో టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేసిన సాయం తెలుగు వారికి గుర్తుండి పోయింది. ప్రభాస్ , ప్రధాన మంత్రి సహాయ నిధికి రూ.3 కోట్లు.ఇవ్వడం అందర్నీ ఒకింత ఆశ్చర్య పరిచింది.అంతకు ముందు పవన్ కళ్యాణ్ ఒక కోటి రూపాయలు ఇవ్వడం జరిగినా , దాన్ని మించి ప్రభాస్ మూడు కోట్లు ఇవ్వడం అందరికీ విభ్రమం కలిగించింది.

ఆ క్రమం లో ప్రభాస్ ఇచ్చిన విరాళంపై నెల్లూరు జిల్లాకి చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సోషల్ మీడియా లో స్పందించడం జరిగింది. ఆయన ప్రభాస్ ఫై ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘బాహుబలి’ చిత్ర రికార్డుల్లోనే కాదు.. ‘కరోనా’ విరాళాల్లోనూ తెలుగు సినీ రంగంలో ప్రభాస్ ముందుండటం అభినందనీయం. చిన్నవయస్సులోనే పెద్ద మనస్సు చాటుకుంటూ ప్రధాన మంత్రి సహాయ నిధికి రూ.3 కోట్లు, ఏపీ, తెలంగాణల సీఎంల సహాయనిధికి కలిపి కోటి రూపాయలు ఇవ్వడం చాలా గొప్ప విషయం ” అని తన ట్విట్టర్ వేదికగా ప్రభాస్‌ను ప్రశంసించారు. కాగా మాజీ మంత్రి అయిన సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఈ సందర్భంగా ప్రభాస్ విరాళం ప్రకటించిన తాలుకూ ప్రకటన తో పాటు ప్రభాస్ ఫొటోను కూడా షేర్ చేశారు.

మసీదులు మూసేయమని వీహెచ్‌పీ పిలుపు

నిజాముద్దీన్ వద్ద జరిగిన ముస్లింల సదస్సు కారణంగా దేశ వ్యాప్తంగా కట్టడి అవుతుందనుకొంటున్న సమయంలో కరొనవైరస్ తిరిగి ఉధృతంగా వ్యాపిస్తూ ఉండడం పట్ల తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తూ తక్షణం దేశంలోని మసీదులు అన్నింటిని ముస్లింలే మూసివేయాలని వీహెచ్‌పీ పిలుపిచ్చింది.

దేశ శ్రేయస్సు దృష్ట్యా మసీదులను మూసివేయాలని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాందే ముస్లింలను కోరారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

‘‘దురదృష్ట వశాత్తు నిజాముద్దీన్ ఘటన వెలుగులోకి వచ్చింది. సమాజ శ్రేయస్సు దృష్ట్యా స్వచ్ఛందంగా మసీదులను మూసేయండి. మతాన్ని పక్కనపెట్టి సమాజ శ్రేయస్సు గురించి ఆలోచించండి. ఎందుకంటే కరోనా మహమ్మారిని తరిమి కొట్టాల్సిన అవసరం అందరి మీదా ఉంది.’’ అని మిలింద్ పిలుపునిచ్చారు.

ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించని వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. వీటిని ఉల్లంఘించే మౌల్వీల వీసాలను రద్దు చేయడమే కాకుండా వారిని బ్లాక్‌లిస్టులో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

రామ మందిరానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన తర్వాత జరిగే మొదటి రామ నవమి వేడుకలని, అయినా సరే, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా హడావుడి లేకుండా నవమిని జరుపుకున్నామని ఆయన గుర్తు చేశారు. జాతికి ఎలాంటి హాని కలగకుండా చేయడమే ప్రస్తుతం అత్యుత్తమ ధర్మమని మిలింద్ పరాందే హితవు చెప్పారు.

సెలెబ్రేషన్స్ కేన్సిల్ చేసిన బన్నీ


మార్చ్ 28 వ తారీకు బన్నీ కెరీర్ లో ఒక ప్రాముఖ్యం ఉన్న రోజు. సరిగ్గా 17 ఏళ్ళ క్రితం బన్నీ నటించిన తొలి చిత్రం ” గంగోత్రి ” ( మార్చ్ 28, 2003 ) విడుదల అయ్యింది. ఆనాటి నుచి మొదలైన అల్లు అర్జున్ కెరీర్ ఇప్పటికి 20 సినిమాలకు చేరింది వాటిలో 14 సినిమాలు హిట్ మెట్లెక్కాయి. కేవలం ఆరు సినిమాలు జస్ట్ యావరేజ్ దగ్గర ఆగిపోయాయి . కానీ బన్నీచిరకాల వాంఛ అయిన ఇండస్ట్రీ హిట్ ఈ ఏడాది వచ్చింది.

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా అల్లు అర్జున్ , త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ” అల వైకుంఠ‌పుర‌ములో” మూవీ అల్లు వారి వారసుడి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఈ సినిమా స‌క్సెస్‌ను బ‌న్నీ వీలైన ప్ర‌తి సంద‌ర్భంలో బాగా సెల‌బ్రేట్ చేసుకున్నాడు. అంతే కాకుండా ఈ ఏడాది బ‌న్నీ హీరోగా కెరీర్‌ను స్టార్ట్ చేసి 17 సంవత్స‌రాలు పూర్త‌య్యాయి. దీన్ని అల్లు అర్జున్ తండ్రి ప్ర‌ముఖ నిర్మాత అయిన అల్లు అర‌వింద్ గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేయాల‌ని అనుకున్నాడు. అందుకోసం బ‌న్నీతో సినిమాలు చేసిన ద‌ర్శ‌కులు, నిర్మాత‌ల‌కు ఆహ్వానం పంపారు కూడా. అయితే ఊహించని రీతిలో క‌రోనా ప్ర‌భావంతో సినిమా ఫంక్షన్స్ అన్నీ ఆగిపోయాయి. అంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు. ఈ సంద‌ర్భంలో వేడుక‌లు జరిపితే బాగుండదని బ‌న్నీ 17 ఇయ‌ర్స్ సెల‌బ్రేష‌న్స్‌ను క్యాన్సిల్ చేసేశారు.

అయితే బ‌న్నీ త‌న 17 ఇయ‌ర్స్ ఆప్ కెరీర్ సెల‌బ్రేష‌న్స్‌ను తన కుటుంబానికి పరిమితం చేసి త‌న కుమారుడు అయాన్‌, కూతురు అర్హ‌తో క‌ల‌సి కేక్ క‌టింగ్ చేసుకొని సెలబ్రేష‌న్స్ చేసుకున్నాడ‌ట‌. ఆ ఫొటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది .

ఆ సంఘటనల పై కేటీఆర్ సీరియస్

కరోనా వైరస్‌ పై చేస్తున్న యుద్దంలో బాధితులను కాపాడేందుకు ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పని చేస్తున్న వైద్య సిబ్బందిపై కొంతమంది దాడులకు పాల్పడుతున్నారు. మరికొందరు వారి విధులకు అడ్డు పడుతున్నారు. అలాంటి వారిని ఉపేక్షించేది లేదని తెలంగాణ ఐటీ, ముస్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బందిపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. అలాగే నిజామాబాద్‌లో వైద్య సిబ్బందిని అడ్డుకోవడంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఘటనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని గురువారం ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ‘గాంధీ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బందిపై దాడి, నిజామాబాద్‌లో వైద్య సిబ్బందిని అడ్డుకున్న ఘటనలను సహించేది లేదు. తెలంగాణ ప్రభుత్వం ఈ ఘటనలను తీవ్రంగా పరిగణిస్తోంది. ఇలాంటి పనులు చేసే వ్యక్తులు అజ్ఞానులే కాదు, వారివల్ల ఇతరులకు కూడా ప్రమాదమే’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

కాగా, గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా వైరస్‌ బాధితుడు బుధవారం బాత్‌ రూమ్‌లో జారిపడి మృతి చెందిన సంగతి తెలిసిందే.. అయితే అతడి చావుకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బాధితుడి బంధువులు డ్యూటీలో ఉన్న జూనియర్‌ డాక్టర్లపై, సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి దిగారు. ఐసోలేషన్‌ వార్డులోని కిటికి అద్దాలు ధ్వంసం చేశారు. కుర్చీలు, ఇతర ఫర్నిచర్‌ ను చెల్లాచెదురు చేశారు.

ఏప్రిల్‌ 15న లాక్ డౌన్ ఎత్తివేత..

దేశంలో కరోనా ఎంట్రీతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై లాక్ డౌన్ చేపట్టింది. 21రోజులపాటు లాక్ డౌన్ కొనసాగుతుందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన సంగతి తెల్సిందే. అయితే దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా లాక్డౌన్ కాలం పెరుగుతుందని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. అయితే వీటన్నింటిని కేంద్ర ప్రభుత్వం ఖండిస్తుంది. ఈ నేపథ్యంలో అరుణాచల్ సీఎం పేమా ఖండూ చేసిన ట్వీట్ తో లాక్ డౌన్ పై క్లారిటీ వచ్చింది.

దేశంలో కరోనా నివారణపై గురువారం ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కరోనాపై పలు సూచనలు చేశారు. ఈ సమావేశం అనంతరం అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పేమా ఖండూ చేసిన ట్వీట్‌ ఆసక్తికరంగా మారింది. ఏప్రిల్‌ 15న లాక్ డౌన్ ఎత్తివేయనున్నట్లు ఆయన తన ట్వీటర్లో పోస్టు చేశారు. అయితే ప్రజలు బయటికి రావడానికి కొన్ని షరతులతో కూడిన అనుమతులుంటాయని స్పష్టం చేశారు. లాక్ డౌన్ ఎత్తివేసినప్పటికీ ప్రజలు సామాజిక దూరంతో మాత్రమే నివారించగలమని ఆయన పేర్కొంది. దీంతో లాక్డౌన్ మరిన్ని రోజులు కొనసాగుతుందనే ప్రచారానికి సీఎం ట్వీట్‌తో తెరపడినట్లయింది.
Also Read: 15 నుండి రైల్వే, విమాన బుకింగ్ లకు సంకేతాలు

కరోనా కారణంగా దెబ్బతిన్న ఆదాయం


కరోనా కారణంగా ఆంధ్ర ప్రదేశ్ ఆదాయం బాగా తగ్గిపోయిందని ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఢిల్లీ నుంచి ప్రధాని గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జగన్ మాట్లాడుతూ గడచిన రెండు రోజుల్లో రాష్ట్రంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరిగిందని చెప్పారు. వైరస్ వ్యాప్తిని నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం సెక్స్ వీడియోస్ తీసుకుంటున్న చర్యలు ప్రధానమంత్రి వివరించారు. నమోదైన కేసుల్లో 111 జమాత్‌ కు వెళ్లినవారు, వారితో సన్నిహితంగా ఉన్నవారేనని చెప్పారు. కుటుంబం వారీగా చేస్తున్న సర్వే అంశాలను ప్రధానికి వివరించారు. వీరిని క్వారంటైన్, ఐసోలేషన్‌కు తరలించి వారికి వైద్య సదుపాయాలు అందిస్తున్నామన్న తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో అవసరమైన వైద్య పరికరాలను తగిన సంఖ్యలో అందించాలని కోరారు. ఆదాయం కోల్పోయిన రాష్ట్రానికి ఇతోధికంగా నిధులు ఇచ్చి ఆదుకోవాలని ప్రధానిని కోరారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఢిల్లీ నుంచి తిరిగివచ్చిన వారినందరిని వీలైనంత త్వరగా గుర్తించి తరలించి వైద్య సహాయం అందించాల్సిందిగా సూచించారు.