Home Blog Page 8556

లాక్ డౌన్ ఎత్తేసిన సినిమా వారి కష్టాలు తీరవు


కరోనా ఎఫెక్ట్ దేశ ఆర్ధిక వ్యవస్థని తీవ్ర ఇబ్బందుల్లో పడేయబోతోంది కరోనా లాక్ డౌన్ ఇతర ఇండస్ట్రీలపై ఎంతగా ప్రభావం చూపుతుందో తెలియదు కాని సినిమా ఇండస్ట్రీపై మాత్రం వెంటనే పడింది. ఒక పక్క థియేటర్లు బంద్.. మరో పక్క సినిమా నిర్మాణాలు ఆగిపోయాయి.. షూటింగ్స్ లేక లక్షలాది సినీ కార్మికులు రోడ్డున పడ్డారు. అదే టైం లో విడుదల అవ్వాల్సిన చాలా సినిమాలు ల్యాబ్ లో మూలుగుతున్నాయి. త్వరలో లాక్ డౌన్ ఎత్తివేసినా కూడా సినీ ఇండస్ట్రీలో ఇబ్బందులు తప్పవని సినీ విశ్లేషకులు అంటున్నారు.

మార్చ్15 న మూత పడిన సినిమా థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలీదు. ఒకవేళ ఏ రెండు నెలల తరవాతో ఓపెన్ అయితే ఇప్పటికే విడుదలకు సిద్దంగా ఉన్న సినిమాలను విడుదల చేసేందుకు నిర్మాతలు ఒక్కసారే థియేటర్ల మీద పడే అవకాశం ఉంది. ఈ క్లిష్ట సమయంలో ఎవరి చేతిలో సినిమా థియేటర్లు ఉన్నాయో ఆ నిర్మాతల సినిమాలు మాత్రమే బయటకు వచ్చే ఛాన్స్ ఉంది .ఆ పరిణామం చిన్న సినిమాలకు ఆత్మహత్యా సదృశ్యం..

టాలీవుడ్ సినిమాల విడుదలకే కష్టాలు పడే ఆ సమయం మరో పక్క డబ్బింగ్ సినిమాలు కూడా ఇబ్బంది పెడతాయి.. కానీ ఇప్పటి పరిస్థితుల్లో డబ్బింగ్ సినిమాలు విడుదల అవ్వడం కష్టం. ఒకవేళ విడుదల అయినా కూడా ఎక్కువ థియేటర్లు దొరక్కపోవచ్చు .మొత్తానికి లాక్ డౌన్ పూర్తి అయినా కూడా టాలీవుడ్ లో పరిస్థితి మాత్రం అంత సులభంగా ఒక కొలిక్కి వచ్చేలా లేదు .

ఈఎంఐల మారటోరియంతో ఒరిగేది ఏమీ ఉండదా!

లాక్ డౌన్ కాలనికి మధ్య తరగతి వారిని ఆడుకొంటున్నామంటూ ఆర్బీఐ ప్రకటించిన ఈఎంఐల మారటోరియంతో పెద్దగా ఒరిగే ప్రయోజనం అంటూ ఏమి ఉండబోదని, తడిసి మోపెడు అన్నట్లు వారిపై మరింత భారం పడుతుందని స్వయంగా బ్యాంకర్లే స్పష్టం చేస్తున్నారు.

ఈ మూడు నెలలు ఈఎంఐలు చెల్లించకపోతే ఆ తర్వాత వడ్డీతోసహా కట్టాల్సి ఉంటుందని తేల్చి చెప్తున్నారు. వెసులుబాటు ఉంటె ఇప్పుడే కట్టుకోవడం అత్యుత్తమం అని స్పష్టం చేస్తున్నారు.

గత నెల 27న ఆర్బీఐ ప్రకటించిన వివరాల ప్రకారం అన్ని టర్మ్‌ లోన్లపై మారటోరియం తీసుకునే అవకాశం రుణగ్రహీతలకు ఉంటుంది. మార్చి 1 నుంచి మే 31 వరకు ఉన్న కాలానికి సంబంధించిన ఈఎంఐలను వాయిదా వేసుకోవచ్చు. అంటే ఏప్రిల్‌, మే, జూన్‌ ఈఎంఐ చెల్లింపులకు దూరంగా ఉండొచ్చు.

అయితే ఈఎంఐలను వాయిదా వేసుకోవడం వల్ల రుణగ్రహీతలకు లాభమేమీ ఉండదని బ్యాంకర్లు చెబుతున్నారు. మారటోరియం వ్యవధి ముగిసిన తర్వాత ఈ మూడు నెలల విరామ కాలానికి వడ్డీ లెక్కించి వేస్తామని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్బీఐ స్పష్టం చేసింది. మారటోరియం తీసుకున్న కస్టమర్ల నుంచి ఈ వడ్డీని అదనపు ఈఎంఐల ద్వారా వసూలు చేస్తామని వెల్లడించింది.

ఉదాహరణకు 8.3 శాతం వడ్డీరేటుతో రూ.30 లక్షల గృహ రుణం తీసుకున్న వ్యక్తి 15 సంవత్సరాలు దాని ఈఎంఐలు చెల్లించాలనుకుందాం. వీరు ఈ మూడు నెలల మారటోరియం తీసుకుంటే మొత్తం రుణ కాలపరిమితిలో అదనంగా నికర వడ్డీ దాదాపు రూ 2.34 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.

ఇది వీరిప్పుడు చెల్లిస్తున్న 8 నెలల ఈఎంఐలకు సమానమని ఎస్బీఐ తెలిపింది. అలాగే రూ.6 లక్షల వాహన రుణం 54 నెలల కాలవ్యవధితో తీసుకున్నవారు మారటోరియంను తీసుకుంటే రూ.19వేలు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇది వీరు సాధారణంగా చెల్లించే ఈఎంఐలకు ఒకటిన్నర రెట్లు అధికం. కాబట్టి నగదు కొరత లేనివారు మారటోరియానికి దూరంగా ఉండటమే ఉత్తమమని బ్యాంకులు చెప్తున్నాయి.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఇదే సూచిస్తున్నది. అదనపు వడ్డీ భారాన్ని, రుణ కాలపరిమితి పొడిగింపు నుంచి తప్పించుకోవాలని హితవు పలికింది. కాగా, కరోనా కారణంగా తమ ఆదాయం దెబ్బతిన్నవారే మారటోరియంను తీసుకోవాలని భారతీయ బ్యాంకింగ్‌ సంఘం రుణగ్రహీతలకు సూచించింది. దాదాపు వేతన జీవుల కంటే వ్యాపారులకు మారటోరియం ఇప్పుడు లాభదాయకమని అభిప్రాయపడింది.

తెలంగాణని దాటేసినా ఆంధ్రా కరోనా కేసులు!


ఏపీలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా 100 దాటింది.దీంతో ఆంధ్రలోని కరోనా కేసులు తెలంగాణాని దాటాయి.మంగళవారం రాత్రి వరకు 44 కరోనా కేసులు నమోదు కాగా మంగళవారం రాత్రి 9 గంటల నుంచి బుధవారం రాత్రి 10 గంటల వరకు కొత్తగా 67 కేసులు నమోదయ్యాయి. దింతో మొత్తం బాధితుల సంఖ్య 111కు చేరింది.

ఢిల్లీలో జరిగిన మతపరమైన సమావేశానికి హాజరై వచ్చినవారు, వారితో సన్నిహితంగా మెలిగిన వారి వల్లే కేసులు ఇంత భారీగా పెరిగినట్లు అధికారిక సమాచారం. అలాగే, విదేశాల నుంచి వచ్చినవారు, వారితో సన్నిహితంగా మెలిగినవారూ వీరిలో ఉన్నారు. ఇప్పటివరకు గుంటూరు జిల్లాలో అత్యధికంగా 20 మందికి వ్యాధి నిర్ధారణ కాగా.. కడప, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో 15 మంది చొప్పున, పశ్చిమగోదావరిలో 14 కేసులు నమోదయ్యాయి.

ఇప్పటివరకు మొత్తం 1313 మందికి పరీక్షలు నిర్వహించగా, 111 కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దిల్లీనుంచి తిరిగి వచ్చిన వారిలో 543 మందికి, వారి సన్నిహితులు 269 మందికి పరీక్షలు చేశారు. విదేశాల నుంచి వచ్చినవారు 218 మందికి, వారి సన్నిహితులు 140 మందికి పరీక్షలు నిర్వహించారు. వైరస్‌ లక్షణాలున్న మరో 143 మంది నమూనాలు సేకరించి, పరీక్షలు చేశారు.

హరీష్ అన్న నీ మీదే మా ఆశలు.. అంటున్న పీకే ఫాన్స్

రెండేళ్ల విరామం తరవాత పవన్ కళ్యాణ్ మళ్ళీ నటిస్తున్నాడన్న మాటకి ఆయన ఫాన్స్ ఎంతో ఆనందించారు. కానీ తీరా చూస్తే పవన్ కళ్యాణ్ కమిట్ అయిన రెండు సినిమాలు ఫాన్స్ కి హుషారు తేలేదు. ఒక సినిమా చూస్తే లేడీ ఓరియెంటెడ్ మూవీ , ఇంకోటి పిరియాడికల్ మూవీ కావడం తో ఫాన్స్ లో జోష్ నింపలేదు. అలాంటి మూమెంట్ లో మూడో సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. ఇంకా మొదలు కాని ఈ హరీష్ శంకర్ సినిమా మీదే ఫాన్స్ హోప్స్ ఒక్క సారిగా పెరిగి పోయాయి. పవన్ కళ్యాణ్ కి గబ్బర్ సింగ్ ఫేమ్ దర్శకుడు హరీష్ శంకర్ ఎంత పెద్ద ఫ్యాన్ అనేది పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి బాగా తెలుసు. అందుకే నిన్న హరీష్ శంకర్ పుట్టిన రోజు సందర్భంగా పీ కె అభిమానులు ఆయనకు ఒకే రకమైన అభ్యర్ధన తో ట్వీట్ లు పెట్టారట …

నిన్న హరీష్ శంకర్ బర్త్ డేని పురస్కరించు కొని ఫాన్స్ ఆయనకి ” పవన్ తో తీసే సినిమా అదిరిపోవాలన్నా, గబ్బర్ సింగ్ కి బాబులా ఉండాలన్నా” అంటూ ట్వీట్లతో ముంచెత్తారు. దానికి హరీష్ శంకర్ కూడా తనదైన శైలిలో `అలాంటి కథనే సిద్ధం చేస్తున్నా` అని రిప్లై ఇచ్చాడట ..

కాగా హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో తీసే సినిమా గబ్బర్ సింగ్ లా పవన్ ఫాన్స్ కి కావలసిన అన్ని మసాలాలు ఉంటూనే పవన్ ప్రజా జీవితానికి కూడా ఉపయోగపడేలా ఉండబోతుంది . అని హరీష్ సన్నిహితులు చెబుతున్నారు …

కరోనా, లాక్ డౌన్.. పేర్లు కూడా పెట్టేశారు…!

సాధారణంగా ఏదైనా ఓ అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో పుట్టిన పిల్లకు అదే పేర్లు పెట్టడం ఎప్పటి నుంచో చూస్తున్నాం. తెలంగాణ ఉద్యమం సమయంలో పుట్టిన పిల్లలకు తెలంగాణ అని, సమైక్య ఆంధ్ర ఉద్యమం సమయంలో పుట్టినవారికి సమైక్య అని.. పేర్లు పెట్టడం విన్నాం.. ఇప్పుడు ప్రపంచాన్ని మొత్తం కలవర పెడుతోన్న కరోనాను కూడా విడవలేదు.. ఆ తర్వాత లాక్ డౌన్ ప్రకటించడంతో.. ఆ లాక్ డౌన్ ను కూడా మనోళ్లు.. పుట్టిన పిల్లలకు పేరుగా పెట్టారు. ఉత్తరప్రదేశ్ లో దియోరియా జిల్లాలో ఖుకుందు గ్రామంలో మార్చి 30వ తేదీన ఓ బాబు పుట్టాడు. ఆ పసిబిడ్డకు తల్లిదండ్రులు ‘లాక్ డౌన్’ అని పేరు పెట్టారు. ‘అతడు లాక్ డౌన్ సమయంలో పుట్టాడు అందుకే మా బాబుకు ఆ పేరు పెట్టాం అని చెబుతున్నారు ఆ బాలుడి పేరెంట్స్. మరోవైపు మార్చి 22న గోరఖ్‌పూర్‌లో ఓ ఆడపిల్ల పుట్టింది. దీంతో ఆ చిన్నారికి ఆ ‘కరోనా’ అని పేరు పెట్టినట్టు ఆ బాలిక మేనమామ నీతిష్ త్రిపాఠీ తెలిపారు. కరోనా అనే మహమ్మారి మీద పోరాటాన్ని ఈ బాలిక గుర్తు చేస్తుందని తాను భావిస్తున్నట్టు చెప్పాడు నితీష్. మొత్తానికి ఏ సీజన్ లో ఆ పేర్లు పెట్టడం మనవాళ్లకు అలవాటు. స్వాతంత్ర ఉద్యమం నుంచి ఇది కొనసాగుతూనే ఉన్నట్టు మన పెద్దల పేర్లు చుస్తే ఇట్టే అర్థం అవుతోంది.

స్మార్ట్ ఫోన్లపై కరోనా వైరస్ ఎన్నిరోజులు ఉంటుందో తెలుసా..?

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అందరి నోటా వినిపిస్తున్న పదం కరోనా వైరస్. ఈ వైరస్ కోవిడ్-19 వ్యాధిని కలగజేస్తూ ప్రప్రంచంలో 193 దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ జీవిత కాలం ఒక్కో ప్రదేశంలో ఒక్కోరకంగా ఉంటిది. మనం నిత్యం ఉపయోగించే స్మార్ట్ ఫోన్లు కూడా కరోనా వైరస్ వ్యాప్తికి కారణమవుతాయని నిపుణులు అంటున్నారు. ఫోన్ ను వాడినప్పుడు ఆ చేతులను ముఖానికి తాకించుకుంటే వైరస్ సోకే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. 2003లో వచ్చిన ‘సార్స్’ వైరస్ గ్లాస్ (గాజు) ఉపరితలంపై 4 రోజులు మనగలదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఓ అధ్యయనంలో తెలిపింది. తాజాగా, ‘ నావెల్ కరోనా’ (సార్స్ కొత్త వెర్షన్) వైరస్ పై అమెరికాలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధ్యయనం చేసి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న నావెల్ కరోనా వైరస్ ప్లాస్టిక్, స్టెయిన్ లెస్ స్టీల్ ఉపరితలాలపై 3 రోజుల వరకు సజీవంగా ఉండగలదని, కార్డు బోర్డు ఉపరితలాలపై 24 గంటలు ఉంటుందని పరిశోధకులు తెలిపారు. అయితే ప్రస్తుత కరోనా వైరస్ గాజు ఉపరితలంపై ఎంతకాలం బతకగలదన్న విషయం తాజా అధ్యయనంలో స్పష్టం కాకపోయినా, గత అధ్యయనాల ఆధారంగా నాలుగు రోజుల పాటు జీవించగలదని భావిస్తున్నారు. సాధారణంగా స్మార్ట్ ఫోన్ల స్క్రీన్లను గ్లాస్ లేదా ప్లాస్టిక్ తో తయారుచేస్తారన్న సంగతి తెలిసిందే.
Also Read: ఫోన్ పే ఉందా.? అయితే మీకే ఈ ‘కరోనా కేర్’ గుడ్ న్యూస్!

దేశమంతా కరోనాతో అల్లాడిపోతుంటే.. జగన్ ప్రభుత్వం మాత్రం..

ఒక పక్క దేశం మొత్తం కరోనా వైరస్ తో తీవ్రంగా పోరాడుతున్న సంగతి అందరికీ అర్థమవుతుంది. తగ్గినట్టే తగ్గి ఒక్కసారి మళ్ళీ విజృంభించడంతో ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, దేశ రాజధాని ఢిల్లీ ఇలా ఇప్పుడు దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా కరోనా వైరస్ దెబ్బకు వణికిపోతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రజలను ఏవిధంగా రక్షించుకోవాలని అర్థం కాక కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు కొత్తగా ఏం చేయాలా అనే దాని మీద ఇప్పుడు తీవ్రంగా కసరత్తులు చేస్తోంది.

ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న వ్యవహార శైలి మాత్రం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఒక పక్క దేశం కరోనా వైరస్ తో తీవ్రంగా పోరాడుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విషయంలో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇళ్ల పట్టాలను ఇళ్ల హామీ లేకుండా ఇవ్వలేదని ఇళ్ల పట్టాలు ఇచ్చిన ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం ఇళ్లను నిర్మిస్తుంది అని ఒక జీవోను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. జీవో నెంబర్ 99 తాజాగా విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది.

ఏ విధంగా అయినా ఇళ్ళ పట్టాలు పంపిణీ చేయాలని పట్టుదలగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకపక్క సుప్రీం కోర్టు కూడా కరోనా దెబ్బకు ఆన్ లైన్ లో కేసులను విచారిస్తుంది. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం అసలు అత్యవసరంగా అనే విషయం గురించి ఇప్పుడు సుప్రీంకోర్టు వెళ్లాలి అనుకోవడం మాత్రం నిజంగా విడ్డూరంగా మారింది. అత్యవసర కేసుల్లో అయితే మినహా విచారించే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు ఈ కేసు విషయం పై సుప్రీం కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.

ప్రధాన మంత్రిగా రవీనా టాండన్

2011 లో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన పత్తర్ కె పూల్ చిత్రం తో హీరోయిన్ గా నటించి చిత్ర రంగ ప్రవేశం చేసిన రవీనా టాండన్ ఇప్పటివరకు 87 చిత్రాల్లో నటించింది. కాగా వాటిలో రధ సారధి , బంగారు బుల్లోడు , ఆకాశ వీధిలో , పాండవులు పాండవులు తుమ్మెద వంటి తెలుగు చిత్రాలు కూడా వున్నాయి. ఇక రవీనా టాండన్ తమిళం లో , కన్నడం లో కూడా కొన్ని చిత్రాలు చేసింది. కాగా చాలా కాలం తరవాత మళ్ళీ కన్నడం లో ఒక భారీ చిత్రం చేస్తోంది. విశేషం ఏమిటంటే ఈ సినిమాలో రవీనా టాండన్ చేసే పాత్రకి నెగటివ్ షేడ్స్ ఉంటాయట …

2018 లో పాన్ ఇండియా మూవీ గా వచ్చిన కన్నడ చిత్రం కె. జి. ఎఫ్. యశ్ హీరోగా వచ్చిన ఈ భారీ బడ్జట్ చిత్రం 80 కోట్ల వ్యయం తో రూపొంది దేశ వ్యాప్తంగా 250 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రానికి ఇపుడో సీక్వెల్ తయారు చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం భారీ అంచనాల నడుమ రూపొందే ఈ చిత్రం లో వివిధ భాషల తారలు నటిస్తున్నారు. వారిలో ప్రముఖ తెలుగు నటుడు రావు రమేష్ తో పాటు హిందీ హీరో సంజయ్ దత్ కూడా నటిస్తున్నాడు. అలాంటి కె. జి. ఎఫ్ 2 చిత్రం లో రవీనా టాండన్ ప్రధాన మంత్రి పాత్ర చేయ బోతోంది. 1981 కాలం నాటి ఈ ప్రైమ్ మినిస్టర్ పాత్రకు కొంత నెగటివ్ షేడ్ ఉండటం విశేషంగా చెప్పు కొంటున్నారు .
inventors are in gain

యూరప్ లో చిక్కుకుపోయిన మళయాళ స్టార్

కరోనా మహమ్మరితో ప్రపంచ దేశాలు బెంబేలెత్తిపోతున్నాయి. కరోనా దాటికి చాలా దేశాలు లాక్డౌన్ ప్రకటించాయి. దీంతో ఎక్కడికక్కడ రవాణా స్తంభించింది. దీంతో ఇతర దేశాలకు చెందిన వాళ్లు అవస్థలు పడుతున్నారు. ఇటీవల షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లిన మలయాళ స్టార్ యూరప్ లో చిక్కుకుపోవడం కలవరానికి గురిచేస్తుంది.

దేశంలో లాక్డౌన్ విధించక ముందే మలయాళ స్టార్ పృథ్వీరాజ్ అతడి తాజా చిత్రం షూటింగ్ కోసం యూరప్ లోని జోర్దాన్ దేశానికి వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లాక కరోనా ఎఫెక్ట్ కారణంగా యూరప్ దేశమంతా లాక్డౌన్ చేశారు. దీంతో వారు షూటింగ్ రద్దు చేసుకొని ఇండియాకు తిరిగి రావాలనుకున్నారు. లాక్డౌన్ కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించడంతో వారు తిరిగి రాలేని పరిస్థితి నెలకొంది. ఈ స్టార్ హీరోతోపాటు 58వరకు జోర్డాన్లో చిక్కుపోయినట్లు సమాచారం.

వీరందరికీ తిరిగి ఇండియాకు రప్పించేలా చూడాలని దర్శకుడు బ్లెస్సీ భారత ప్రభుత్వానికి, కేరళ ఫిల్మ్ ఛాంబర్ అసోసియేషన్ కు విజ్ఞప్తి చేశారు. వీరంతా అక్కడ బిక్కుబిక్కు మంటూ కాలం గడుపుతున్నారు. విదేశీయుల్లో షూటింగ్ చేద్దామనుకుంటే వాళ్లు అలా బుక్కపోయారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరుదేశాలు కూడా ఏమి చేయలేని ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయి. యూరప్ కరోనా విభృంబిస్తుండటంతో ఇప్పట్లో అక్కడ లాక్డౌన్ ఎత్తేసే పరిస్థితులు కన్పించడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వీరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే..

ఫోన్ పే ఉందా.? అయితే మీకే ఈ ‘కరోనా కేర్’ గుడ్ న్యూస్!

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తృతంగా విజ్రంభిస్తోన్న సమయంలో భారత ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. అయితే చాలామంది భారతీయులకు ఆరోగ్య బీమా సదుపాయం లేదు. ఇప్పటికే ఉన్నదానికి కరోనా చికిత్స మరో ఆర్థిక భారం కానుంది. సామాజిక ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని బజాజ్‌ అలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌తో కలిసి ఒక ఇన్సూరెన్స్ ప్లాన్ ను డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌ పే అందుబాటులోకి తెచ్చింది.

కరోనా బారిన పడి ఆసుపత్రిలో చేరిన వారి వైద్య ఖర్చులకు “కరోనా కేర్” బీమా ఆసరాగా ఉంటుందని వెల్లడించింది. దీనికింద ఒకేసారి రూ.156 చెల్లించి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.50,000 వరకు రక్షణ పొందవచ్చని తెలిపింది. ఆసుపత్రిలో చేరడానికి ముందు, తరవాత మొత్తం 30 రోజుల పాటు వైద్య పరీక్షలు, మందుల కొనుగోలుకు అయ్యే తదితర ఖర్చులను చెల్లించనుంది. ఫోన్‌ పే యాప్ ద్వారా చెల్లింపు చేయగానే ఈ డిజిటల్ పాలసీ వెంటనే జనరేట్ అవుతుందని తెలిపింది. అయితే ఆ బీమాను కొనుగోలు చేసిన దగ్గరి నుంచి 15 రోజుల్లోగా కొవిడ్ 19 లక్షణాలు ఉన్నట్లు గుర్తిస్తేనే ఇది చెల్లుబాటు అవుతుందని, అలాగే 55 సంవత్సరాల లోపు వయసు పరిమితిని విధించింది.
Also Read: స్మార్ట్ ఫోన్లపై కరోనా వైరస్ ఎన్నిరోజులు ఉంటుందో తెలుసా..?

ఏపీలో 70 కేసులు మర్కజ్ నుండి వచ్చిన వారివే

రెండు రోజులుగా కరోనా కేసులు గణనీయంగా పెరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ఏపీలో నమోదైన 87 కేసుల్లో 70 కేసులు ఢిల్లీ లోని మర్కజ్ నుంచి వచ్చినవారికే పాజిటివ్‌ వచ్చిందని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. మర్కజ్ కు ఏపీ నుంచి 1,085మంది వెళ్లి రాగా, మొత్తం 585మందికి పరీక్షలు జరిపితే 70 కేసుల్లో పాజిటివ్‌ వచ్చిందని చెప్పారు. మరో 500 కేసుల నివేదికలు రావాల్సి ఉందని పేర్కొన్నారు.

ఢిల్లీ వెళ్లి వచ్చిన మరో 21మంది కోసం గాలింపు చేపట్టామని చెబుతూ 104కు ఫోన్‌ చేసి స్వచ్ఛందంగా పరీక్షలు చేసుకోవాలని కోరారు. ఢిల్లీకి వెళ్లిన ప్రతి ఒక్కరినీ, వారితో కాంటాక్టులో ఉన్నవారినీ గుర్తిస్తున్నామని స్పష్టం చేశారు.

ఢిల్లీ సదస్సుకు వెళ్లిన ప్రతి ఒక్కరినీ గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని చెబుతూ ఎవచెప్పారూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. వైరస్‌ వస్తే ఏదో జరిగిపోతుందని అనుకోవద్దని అంటూ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వైరస్‌ను అరికట్టవచ్చని తెలిపారు. అయితే వయసు మళ్లినవారిలో ఈ వైరస్‌ ప్రభావం కొంత తీవ్రంగా ఉందని పేర్కొన్నారు.

కరోనా వైరస్ అనేది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించేదని ప్రజలు గుర్తించాలని కోరారు. కొన్నిచోట్ల దేశ ప్రధానులకు కూడా కరోనా వచ్చిందని గుర్తుచేశారు. వైరస్‌వచ్చిన వ్యక్తుల పట్ల వ్యతిరేకభావం చూపొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో ప్రతి ఇంటిని సర్వే చేయిస్తున్నామని గుర్తుచేశారు. వాలంటీర్లు, ఆశావర్కర్లు, సచివాలయ సిబ్బందితో సర్వే జరుగుతోందని చెప్పారు. ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్నా ప్రజలు వారికి తెలియజేయాలని కోరారు. ఏదైనా సమస్య ఉంటే చికిత్స చేయించుకుని స్వీయ నిర్బంధంలో ఉండాలని కోరారు. ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు, ప్రైవేట్‌ ఆస్పత్రులు ఇలాంటి సమయంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

కాగా,కరోనా నియంత్రణ చర్యల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భారం పడిందని సీఎం జగన్‌ తెలిపారు. భారమైనప్పటికీ వేతనాలు వాయిదా వేసే అవకాశం ఇచ్చి ప్రభుత్వానికి సహకరించిన ప్రజా ప్రతినిధులు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతోపాటు ఇతర అధికారులు, పెన్షనర్లకు ఈ సందర్భంగా సీఎం జగన్‌ కృతజ్ఞతలు తెలిపారు.

ఏపీలో 93 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి

వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీకి ప్రస్తుతం అమలు అవుతున్న కరోనా నియంత్రణ నిబంధనల వల్ల ఇబ్బంది లేకుండా సామాజిక దూరాన్ని పాటిస్తూ… కరోనా వైరస్ కు సంబంధించిన జాగ్రత్తలను పాటిస్తూ… ప్రభుత్వ యంత్రాంగం 1వ తేదీ సాయంత్రానికి 93 శాతంకు పైగా పెన్షన్లను లబ్ధిదారుల చేతికే అందించేశారు. ఈ ప్రక్రియలో సచివాలయంలోని సీనియర్ ఐఎఎస్ అధికారుల నుంచి గ్రామ స్థాయిలోని సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల వరకు భాగస్వాములయ్యారు.
ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి పెన్షన్ల పంపిణీకి ఇబ్బందులు కలిగించకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. పెన్షన్ డబ్బును లబ్దిదారుల చేతికే అందించే క్రమంలో వారి నుంచి తీసుకునే బయో మెట్రిక్ వల్ల కూడా కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదంను నివారించేందుకు చర్యలు తీసుకుంది. అందుకోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్ ను రూపొందించింది. దానిలో లబ్ధిదారుల ఫోటో ఐడెంటిఫికేషన్ ను వాలంటీర్లు నిర్ధారించడం, జియోగ్యాగింగ్ తో లబ్ధిదారుల ఫోటోను యాప్ లో అక్కడికక్కడే తీసుకోవడం ద్వారా పెన్షన్ల పంపిణీని సులభతరం చేశారు. ఎక్కడా లబ్దిదారులను నేరుగా తాకకుండా, అందరికీ ఉపయోగించే బయోమెట్రిక్ ను వాడకుండానే ఈ యాప్ తో పెన్షన్ల పంపిణీని మరింత పారదర్శకంగా నిర్వహించినట్లు సెర్ఫ్ సిఇఓ రాజాబాబు తెలిపారు.

ఉదయం నుంచే ప్రారంభమైన పెన్షన్ల పంపిణీ:

ఉదయం ఆరుగంటల నుంచి ప్రారంభమైన వైఎస్ఆర్ పెన్షన్ కానుకను ఉదయం ఎనిమిదిన్నర గంటలకే 53శాతం పూర్తి చేశారు. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల సహకారంతో ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ దారులకు డబ్బులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా కరోనా నియంత్రణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వృద్దులకు, వివిద వ్యాధులతో బాధపడుతున్న వారికి వివరించారు. ఉదయం పదిగంటలకే 77శాతం పెన్షన్లను పంపిణీ చేశారు. మధ్యాహ్నం రెండు గంటల కల్లా 88.27 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేశారు. సాయంత్రం అయిదు గంటల వరకు 93శాతం పెన్షన్లను లబ్ధిదారులకు అందించారు. మొత్తం 58,08,404 మంది పెన్షన్లకు గానూ ( సాయంత్రం 5గంటల వరకు) 52,49,802 మందికి పెన్షన్లను అందచేశారు. ఈనెలలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కోసం ప్రభుత్వం 1395.75 కోట్ల రూపాయలను కేటాయించింది. దీనిలో 93శాతం వరకు సాయంత్రంలోగానే పంపిణీ చేయడం విశేషం.

జిల్లా          మొత్తం పెన్షన్లు       పంపిణీచేసినవి
కడప                 329194                310768
చిత్తూరు            495769                458811
విజయనగరం    326524               300138
అనంతపురం     510975                471418
కర్నూలు            422547                389296
శ్రీకాకుళం           367360                338168
తూ.గో.జిల్లా        638763                 571765
నెల్లూరు             343856                 314993
కృష్ణా                 481502                  435178
విశాఖపట్నం    451359                  383978
ప.గో.జిల్లా         474658                   420994
ప్రకాశం             411285                  363181
గుంటూరు         554612                  491114

కరోనా బాధితుల పట్ల వివక్ష చూపకండి

కరోనా వైరస్‌ లక్షణాలు గుర్తించి వైద్యం అందించడంలో సమగ్ర విధానం అవలంభిస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. రెండు రోజులుగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరగడం బాధ కలిగిస్తోందన్నారు. ఢిల్లీకి వెళ్లిన ప్రతి ఒక్కరినీ, వారితో కాంటాక్టులో ఉన్నవారినీ గుర్తిస్తున్నామని చెప్పారు. సీఎం వైఎస్‌ జగన్‌ బుధవారం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. వైరస్‌ వస్తే ఏదో జరిగిపోతుందని అనుకోవద్దన్నారు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వైరస్‌ను అరికట్టవచ్చని చెప్పారు. వయసు మళ్లినవారిలో ఈ వైరస్‌ ప్రభావం కొంత తీవ్రంగా ఉందని తెలిపారు.

కరోనా వైరస్‌ అనేది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించేదని ప్రజలు గుర్తించాలని కోరారు. కొన్నిచోట్ల దేశ ప్రధానులకు కూడా కరోనా వచ్చిందని గుర్తుచేశారు. వైరస్‌వచ్చిన వ్యక్తుల పట్ల వ్యతిరేకభావం చూపొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ఒక మీటింగ్‌కు వెళ్లి వచ్చినవారిలో పలువురికి కరోనా వచ్చినట్టుగా గుర్తించామన్నారు. ఏపీలో నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో 70 శాతం ఢిలీ​ మీటింగ్‌కు వెళ్లినవారే ఉన్నారని తెలిపారు. ఏపీ నుంచి మొత్తం 1085 మంది ఢిల్లీ మీటింగ్‌కు వెళ్లారని తెలిపారు. వారిని గుర్తించి వైద్య పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 585 మందికి వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు.అనుమానితులుంటే ప్రజలు దగ్గరలో ఉన్న అధికారులు సమాచారమివ్వాలని సూచించారు.

ఢిలీ​ నుంచి వచ్చినవారు ఎవరైనా వైద్య పరీక్షలు చేయించుకోవకపోతే వెంటనే దగ్గరలో ఉన్న వైద్యులను సంప్రదించాలని సీఎం వైఎస్‌ జగన్‌ సూచించారు. 104కు ఫోన్‌ చేస్తే వైద్య సాయం అందిస్తారని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఇంటిని సర్వే చేయిస్తున్నామని గుర్తుచేశారు. వాలంటీర్లు, ఆశావర్కర్లు, సచివాలయ సిబ్బందితో సర్వే జరుగుతోందని చెప్పారు. ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్నా ప్రజలు వారికి తెలియజేయాలని కోరారు. ఏదైనా సమస్య ఉంటే చికిత్స చేయించుకుని స్వీయ నిర్బంధంలో ఉండాలని కోరారు. ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు, ప్రైవేట్‌ ఆస్పత్రులు ఇలాంటి సమయంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కరోనా నియంత్రణ చర్యల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భారం పడిందని సీఎం జగన్‌ తెలిపారు. భారమైనప్పటికీ వేతనాలు వాయిదా వేసే అవకాశం ఇచ్చి ప్రభుత్వానికి సహకరించిన ప్రజా ప్రతినిధులు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతోపాటు ఇతర అధికారులు, పెన్షనర్లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో వీరి సహకారం మరిచిపోలేనిదని కొనియాడారు. రైతులు, రైతు కూలీలు మధ్యాహ్నం ఒంటి గంట వరకు వ్యవసాయ పనులకు వెళ్లవచ్చన్నారు. కరోనాపై ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు

రీచార్జ్ ప్లాన్ అయిపోయిన కస్టమర్లకు శుభవార్త!

కరోనా అన్ని సేవలు బంద్ అయిన వేళ వొడాఫోన్, ఐడియా వినియగదారులకు శుభవార్త. తన సబ్‌స్క్రైబర్లకు ప్రిపెయిడ్ ప్లాన్ వ్యాలిడిటీని పెంచుతున్నట్లు ఆయా కంపెనీల యాజమాన్యాలు ప్రకటించాయి. అయితే ఈ ఫెసిలిటీ అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. ఫీచర్ ఫోన్ ఉపయోగిస్తున్న అల్పాదాయ కస్టమర్లకు మాత్రమే ఈ బెనిఫిట్ లభిస్తుంది. ఫీచర్ ఫోన్ ఉపయోగిస్తున్న అల్పాదాయ కస్టమర్లకు ప్రిపెయిడ్ రీచార్జ్ వ్యాలిడిటీని పొడిగిస్తున్నామని వోడాఫోన్ ఐడియా తెలిపింది. ఏప్రిల్ 17 వరకు ఈ సౌకర్యం కల్పిస్తున్నామని పేర్కొంది.

దీంతో రీచార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ అయిపోయినా కూడా కస్టమర్లకు ఇన్‌కమింగ్ కాల్స్ పొందొచ్చు. సాధారణంగా ప్లాన్ వ్యాలిడిటీ అయిపోతే ఇన్‌కమింగ్ కాల్స్ రావు. అంతేకాకుండా వొడాఫోన్ ఐడియా మరో ఆఫర్ కూడా కస్టమర్లకు అందుబాటులో ఉంచింది. వీరికి రూ.10 ఉచిత టాక్‌టైమ్ ఆఫర్ చేస్తున్నట్లు పేర్కొంది. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ పరిస్థితుల్లో కస్టమర్లకు ఈ ఉచిత టాక్ టైమ్ అందిస్తున్నామని, వారు వారి కుటుంబ సభ్యులతో అనుసంధానమై ఉండొచ్చని కంపెనీ వివరించింది.

కాగా వొడాఫోన్ ఐడియా దారిలోనే ఎయిర్‌టెల్ కూడా నడిచింది. ఎయిర్టెల్ కూడా తన కస్టమర్లకు ఇలాంటి బెనిఫిట్స్‌నే అందించింది. 8 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లకు ప్రయోజనం కలుగుతుందని ఎయిర్‌టెల్ తెలిపింది. అలాగే ప్రభుత్వ రంగ టెలికం కంపెనీలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ కూడా ఇలాంటి ఆఫర్లనే అందించాయి. ఏప్రిల్ 20 వరకు ఈ వాలిడిటీని పొడిగించాయి. రూ.10 ఉచిత టాక్‌టైమ్ ఆఫర్ చేస్తున్నాయి. జియో కూడా ఇదే బాట పట్టింది.

సీనియర్ హీరోకి లేట్ వయసులో రేట్ పెరిగింది

సీనియర్ తెలుగు హీరోలలో విక్టరీ వెంకటేష్ కి సక్సెస్ రేట్ బాగా ఉందని చెప్పక తప్పదు .అందుకు కారణం లేకపోలేదు వెంకీ ఎక్కువగా రీమేక్ చిత్రాలు , మరీ ముఖ్యంగా కుటుంబ కదా చిత్రాలు చేయడం ఆయనకీ ప్లస్ పాయింట్ అయ్యింది. అదే ఇప్పటికీ కంటిన్యూ అవుతూ వస్తోంది. ఆ రకంగా మినిమమ్ గ్యారంటీ హీరోలలో వెంకటేష్ ఒకడయ్యాడు వెంకటేష్ ఈ మధ్య తనకంటే యంగ్ హీరోలతో మల్టీ స్టారర్ లు చేస్తున్నాడు. మధ్యలో ` దృశ్యం ` లాంటి చిత్రాల్లో వయసుకు దగ్గ పాత్రలు కూడా చేస్తున్నాడు. ఇక గత ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ” ఎఫ్ 2 ” చిత్రం లో వరుణ్ తేజ్ తో కలిసి నటిస్తే ఆ చిత్రం సూపర్ హిట్ అయ్యింది.

కాగా ఆ సూపర్ హిట్ చిత్రానికి దర్శకుడు అనిల్ రావిపూడి సీక్వెల్ గా “ఎఫ్ 3 ” చిత్రం ప్లాన్ చేసున్నాడు. ఇక ఈ చిత్రం లో వరుణ్ తేజ్ , వెంకటేష్ కాంబో మళ్ళీ రిపీట్ కాబోతుంది . ఐతే ఈ చిత్రం కొరకు
వెంకటేష్ తన రెమ్యూనరేషన్ డబుల్ చేసాడని తెలుస్తోంది. వెంకీ నటించిన గత రెండు చిత్రాలు “ఎఫ్ 2, వెంకీ మామ ” సూపర్ హిట్స్ కావడం తో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. demand and supply

మర్కజ్ విదేశీయులపై వీసా ఉల్లంఘన చర్యలు

కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేయడంలో విజయం సాధించామని అనుకొంటున్న సమయంలో ఢిల్లీలోని మర్కజ్ సంఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది.

ఇక్కడ పాల్గొన్న వారిలో పలువురికి కోరిన వైరస్ పాజిటివ్ రావడంతో దేశంలో సుమారు 20 రాష్త్ర ప్రభుత్వాలు మిగిలిన వారి ఆచూకీ కోసం జల్లెడ పడుతున్నాయి.

నిజాముద్దీన్ మర్కజ్ లోని ఉన్న వ్యక్తులను క్వారంటైన్‌కు తరలించేందుకు తబ్లిగ్ జమాత్ నేత మౌలానా సాద్ మొదట నిరాకరించడంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ ను రంగంలోకి దిగి దానిని ఖాళీ చేయించారు. మొత్తంమీద 2300 మందిని మర్కజ్ నుంచి భద్రతాధికారులు ఖాళీ చేయించి ఆసుపత్రులకు పంపారు.

ఢిల్లీలోని మర్కజ్ ప్రాంతంలోనే 216 మంది విదేశీయులున్నారు. దీంతోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లోని మసీదుల్లో 800 మంది ఇండోనేషియా, మలేషియా, బంగ్లాదేశ్ లకు చెందిన వారున్నారని తేలడంతో వారందరికీ వైద్యపరీక్షలు చేయించి, వీసా నిబంధనల ఉల్లంఘనపై వారిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ నిర్ణయించింది. టూరిస్టు వీసాలపై వచ్చిన విదేశీయులు వీసా నిబంధనలను ఉల్లంఘించారని హోంశాఖ అధికారులు చెప్పారు.

ఇట్లా ఉండగా, వైరస్ దేశ వ్యాప్తి చెందడానికి కారణంగా అపాల్గొన్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న విదేశీయులపై కేంద్రం కన్నేసింది. వీసా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తగు చర్యలు తీసుకోవడానికి సమాయత్తం అవుతున్నది.

పైగా వీరిలో అంతకు ముందు కోలంపూర్ ఇటువంటి సమావేశానికి కూడా హాజరై వచ్చారని, ఆ దేశంతో పాటు పలు ఇతర దేశాలలో ఈ వైరస్ వ్యాప్తికి వీరే కారకులని ప్రచారం జరుగుతున్నది.

కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి నేడు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డిజిపిలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వీసా నిబంధనల ఉల్లంఘనను తీవ్ర అంశంగా పరిగణించాలని స్పష్టం చేశారు.

వారిలో చాలామంది ఇప్పుడు దేశంలో వివిధ ప్రదేశాలలో ఉన్నట్లు తెలుస్తున్నందున వారందరి ఆచూకీ కనిపెట్టి మొదటగా వారికి వైద్య పరీక్షలు జరిపించాలని, తర్వాత చట్టప్రకారం వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వీసా నిబంధనలను ఉల్లంఘించిన విదేశీయులపైనా, తబ్లిగి జమాత్ నిర్వాహకులపైనా చట్టపరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కోరింది. తబ్లిగి జమాత్‌లో పాల్గొన్నవారిని గుర్తించడం చాలా ముఖ్యమని తెలియజేసినట్లు పేర్కొంది.

కోవిడ్-19 మహమ్మారిని నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారి వల్ల ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇలా ఉండగా, ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజనను వచ్చే వారంలోగా అమలు చేయాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. ఈ పథకం లబ్ధిదారులకు నగదు బదిలీ జరుగుతుందని పేర్కొంది. సామాజిక దూరాన్ని పాటిస్తూ, దీనిని అమలు చేయాలని తెలిపింది.

రాష్ట్రంలోపల సరుకు రవాణాను అనుమతించాలని, అయితే సామాజిక దూరాన్ని పాటించాలని చెప్పినట్లు వివరించింది. దేశవ్యాప్తంగా అష్ట దిగ్బంధనం సమగ్రంగా అమలవుతోందని ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు.

ముస్లిం సోదరులకు తెలుగు సోదరుల విన్నపం!

ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో జరిగిన ప్రార్ధనలకు వెళ్లొచ్చిన ముస్లిం సోదరుల పట్ల తెలుగు సోదరులు సానుకూలంగా స్పందిస్తున్నారు. తెలంగాణ నుండి దాదాపు1030 మంది, ఆంధ్ర నుండి 720 మంది ఈ ప్రార్ధనలకు వెళ్లొచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులకు విన్నపాలు అందుతున్నాయి.

తెలుగు సోదరుల స్పందన

” ముస్లిం సోదరులారా..మీరేమీ తప్పుచేయలేదు కదా.. మతం రీత్యా ప్రార్థనలకు వెళ్లారు.. హ్యాపీగా ఇంటికి వచ్చారు , కాని మీకు తెలియకుండా, కరోనా మహమ్మారి మీ వెంట వచ్చిందేమో చెక్ చేయించుకోండి.. మీ ఫ్యామిలీని సేవ్ చేసుకుంటారు.. మన ఇండియా ని కూడా సేవ్ చేస్తారు.. అందరం హ్యాపీగా ఉందాం..దయచేసి జస్ట్ మెడికల్ చెకప్ చేయించుకోండి.. పోయేదేముంది.. పాజిటివ్ వస్తె ట్రీట్మెంట్ తీసుకుంటారు, నెగిటివ్ వస్తే హ్యాపీగా ఇంటికెళ్ళి ఫ్యామిలీ హ్యాపీగా వుంటారు” అన్ని పొన్ని రెడ్డి సోమేశ్ అన్నారు.

“మీనుంచి. ఎంతమందికి అంటుకుంటుందో ….. జరిగిందేదో జరిగింది. మీరు వచ్చి మీ కుటుంబాన్ని. మీ చుట్టుపక్కల ఉండే వారికి. వైరస్ సోకకుండా మిమట్టుకు మీరే… హాస్పటల్ కి వెళ్లి వైద్యం చేయించుకుంటే…. మంచిదే కదా లేదంటే.. మీతో పాటు. మీ చుటటుపక్కల వారిని కూడా. ప్రమాదం లో పడటానికి. కరణం మీరే అవుతారు
….. కానీ ఒకటి మాత్రం నిజం…. మీరు బ్రతికున్న ప్రతి రోజు మీరు మీ కుటంబీకులు. మీ విదిలో తలెత్తుకొని తిరగలేరు… చాలా బాధ పడతారు. మీరు ప్రభుత్వం నికి సహకరించాలి….” అని రవి అనే వ్యక్తి అన్నారు.

“సమాజానికి మనము చేసేది ఏమి లేదు. నిజాన్ని ఒప్పుకుని మన దేశముముని కాపాడుదాo. అందరు సహకరించడి…….” అని బాలు అనే వ్యక్తి స్పందించారు.

 

ఇప్పటికే అనేకమంది ముస్లిం సోదరులు స్వచ్చందంగా వచ్చి టెస్టులు చేయించుకున్నారు. అనేకమందికి నెగటివ్ రావడంతో 14 వారిని ఇంటికి పంపించారు. మిగిలినవారు కూడా వచ్చి కరోనా టెస్టులు చేయించుకుంటే మంచిదని తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు.