
మొబైల్ ఫోన్లు మరియు వాటి విడి భాగాలపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను 12 శాతం నుంచి 18 శాతానికి పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
మార్చి 31తో గత ఆర్థిక సంవత్సరం ముగిసిపోవడంతో ఏప్రిల్ 1 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. దీంతో పెరిగిన పన్ను భారంతో మొబైల్ ఫోన్ల ధరలు కూడా పెరిగాయి. చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్ మి ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన రియల్ మి 6 స్మార్ట్‌ఫోన్ అమ్మకాలను మార్చి11 నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. రియల్ మి 6, రియల్ మి ఎక్స్2, రియల్ మి ఎక్స్‌టీ మోడళ్లపై ధరలు పెంచినట్లు రియల్ మి సంస్థ ప్రకటించింది. భారత ప్రభుత్వం మొబైల్ ఫోన్లపై జీఎస్టీని పెంచడంతో తమ కంపెనీ స్మార్ట్‌ఫోన్ల ధరలు పెంచినట్లు రియల్ మి పేర్కొంది. పెరిగిన రేట్లు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది. రియల్ మి కంపెనీకి చెందిన మూడు మోడళ్లపై కనీసం రూ.1000 పెరిగింది.
కొత్త ధరలు ఇవే..
Realme 6 (4GB+64GB) మోడల్ ధర గతంలో 12,999 ఉండగా ప్రస్తుతం రూ. 13,999
Realme X2 (4GB+64GB) మోడల్ ధర గతంలో 16,999 ఉండగా ప్రస్తుతం రూ.17,999
Realme XT (4GB+64GB) మోడల్ ధర గతంలో 15,999 ఉండగా ప్రస్తుతం రూ.16,999