
ఊహించని విపత్తు , కరోనా మహమ్మారి ప్రపంచాన్నిఅతలాకుతలం చేసేస్తోంది. ఈ నరహంతక వ్యాధి రూపుమాపే నేపథ్యంలో పలువురు ప్రముఖులు సాయం చేసి పెద్ద మనసు చాటుకున్నారు. అలాంటి వారిలో తెలుగు సినీరంగానికి చెందిన పవన్ కళ్యాణ్ , ప్రభాస్ వంటి వారు ముందుకొచ్చి తమ వంతుగా ఆర్ధిక సాయం చేశారు. వీరిలో టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేసిన సాయం తెలుగు వారికి గుర్తుండి పోయింది. ప్రభాస్ , ప్రధాన మంత్రి సహాయ నిధికి రూ.3 కోట్లు.ఇవ్వడం అందర్నీ ఒకింత ఆశ్చర్య పరిచింది.అంతకు ముందు పవన్ కళ్యాణ్ ఒక కోటి రూపాయలు ఇవ్వడం జరిగినా , దాన్ని మించి ప్రభాస్ మూడు కోట్లు ఇవ్వడం అందరికీ విభ్రమం కలిగించింది.
ఆ క్రమం లో ప్రభాస్ ఇచ్చిన విరాళంపై నెల్లూరు జిల్లాకి చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సోషల్ మీడియా లో స్పందించడం జరిగింది. ఆయన ప్రభాస్ ఫై ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘బాహుబలి’ చిత్ర రికార్డుల్లోనే కాదు.. ‘కరోనా’ విరాళాల్లోనూ తెలుగు సినీ రంగంలో ప్రభాస్ ముందుండటం అభినందనీయం. చిన్నవయస్సులోనే పెద్ద మనస్సు చాటుకుంటూ ప్రధాన మంత్రి సహాయ నిధికి రూ.3 కోట్లు, ఏపీ, తెలంగాణల సీఎంల సహాయనిధికి కలిపి కోటి రూపాయలు ఇవ్వడం చాలా గొప్ప విషయం ” అని తన ట్విట్టర్ వేదికగా ప్రభాస్‌ను ప్రశంసించారు. కాగా మాజీ మంత్రి అయిన సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఈ సందర్భంగా ప్రభాస్ విరాళం ప్రకటించిన తాలుకూ ప్రకటన తో పాటు ప్రభాస్ ఫొటోను కూడా షేర్ చేశారు.