
క్రికెట్ అభిమానులకు ఏప్రిల్ 2 గుర్తిండిపోయే రోజే. సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం అంటే 2011 ఏప్రిల్ 2న టీమిండియా రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో నిర్వహించిన ఫైనల్లో శ్రీలంకపై భారత్ విజయం సాధించి ప్రపంచకప్ గెలిచింది. ప్రపంచకప్ ఫైనల్లో కెప్టెన్ ధోని సిక్సర్ బాది టీమిండియాకు చిరకాల విజయం అందించాడు.
టీమిండియా తొలిసారి కపిల్ దేవ్ నాయకత్వంలో 1983 జూన్ 25న ప్రపంచ కప్ గెలిచింది. ఆ తర్వాత ప్రపంచ కప్ అందుకున్నందుకు చాలాకాలం పట్టింది. రెండోసారి ప్రపంచ కప్ అందుకునేందుకు 27సంవత్సరాల, 9నెలల, 7రోజుల సమయం పట్టింది. ధోని నాయకత్వంలో రెండోసారి టీమిండియా ఏప్రిల్ 2, 2011న రెండోసారి ప్రపంచకప్ అందుకుంది.
2007 ప్రపంచకప్ లో టీమిండియా ప్రదర్శనపై పెద్దఎత్తున విమర్శలు రావడంతో బీసీసీఐ మార్పులు చేసింది. ఇంగ్లాడ్‌లో జరిగిన సిరీస్లో టీమిండియా ఓడిన తర్వాత రాహుల్ ద్రవిడ్ తన కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. ధోనీ కెప్టెన్సీలో దక్షిణాఫ్రికాలో జరిగిన టీ20 ప్రపంచకప్ లో భారత్ విజయం సాధించింది. దీంతో బీసీసీఐ ధోనీకి టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. 2011ప్రపంచకప్ స్వదేశంలో బీసీసీఐ నిర్వహించింది. టీమిండియాకు ప్రపంచకప్ అందించేందుకు ధోని టీంలో కొన్ని మార్పులు చేశారు. ధోని ఆట చివరలో సిక్సర్ బాది క్రికెట్ అభిమానులకు చిరస్మణీయంగా నిలిచిపోయేలా టీమిండియాకు విజయాన్ని అందించాడు.