
“రేపు ఉదయం నా తోటి భారతీయులతో ఒక చిన్న వీడియో సందేశాన్ని పంచుకోబోతున్నా” అని ప్రధాని మోడీ చేసినా ట్వీట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. కరోనా కలకలం వల్ల గతంలో మార్చి 19న వీడియో కాన్ఫిరెన్సు పెట్టి 22 కర్ఫ్యూ అన్నారు. మరలా మరో కాన్ఫిరెన్సు పెట్టి 21రోజుల లాక్ డౌన్ అన్నారు. ఈ సారి ఎటువంటి నిర్ణయం తీసుకొనున్నారో.. అనే ఆసక్తి నెలకొన్నది.
ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తోన్న కరోనా దేశంలో రెండో దశలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా కరోనా కేసులు పెరిగిపోతుండడంతో మార్చి 21 నుంచి అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ను పొడిగిస్తారా లేక ముగిస్తారా అన్నది కీలకంగా మారింది. ఈ నేపథ్యంలోనే గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలతో పాటు, లాక్‌డౌన్‌ను మరింత పటిష్టంగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాల సీఎంలకు సూచించారు. ఈ నేపథ్యంలో ప్రధాని వీడియో సందేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.