Home Blog Page 8553

పొలం దున్నుతుండగా బయటపడిన గుప్తనిధి


ఎంతోమంది గుప్తనిధుల ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు గుప్తనిధులు దొరకగాపోగా ఆర్థికంగా నష్టపోయిన సంఘటనలు అనేకం కన్పిస్తుంటాయి. అయితే ఓ వ్యక్తి వ్యవసాయ పనుల కోసం తన పొలం దున్నుతుండగా గుప్తనిధి బయటపడింది. అందులో పురాతనకాలం నాటి వెండి నాణేలు ఉండటంతో సదరు పొలం యజమానితోపాటు కొంతమంది సడిచప్పుడు చేయకుండా ఇంటికి పట్టుకెళ్లారు. ఇంకేముందే ఈ విషయం ఆ నోటా.. ఈనోటా పాకి చివరికీ రెవెన్యూ అధికారులకు చేరింది. దీంతో అధికారులు ఈ వెండి నాణేలను స్వాధీనం చేసుకొని వెళ్లిపోయారు.

తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ఈ సంఘటన ఆలస్యంగా చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్మకన్నె గ్రామానికి చెందిన పీఏసీఎస్ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి సోమవారం ఉదయం తన పొలాన్ని దున్నేందుకు సిద్ధమయ్యాడు. ఈక్రమంలోనే అతడికి పొలంలో వెండినాణేలు బయటపడ్డాయి. దీనిని గమనించిన వెంకట్రామిరెడ్డి, తన పొలంలో పని చేస్తున్ కొందరు బయటపడిన నాణేలను గుట్టుగా పంచుకొని అక్కడి నుంచి కామ్ గా వెళ్లిపోయారు. అయితే విషయం ఆ నోటా.. ఈనోటాపడటంతో రెవిన్యూ, పోలీసు అధికారులు రంగంలోకి దిగారు.

అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి గుప్తనిధి బయటపడినట్లు నిర్ధారించుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నాణేలను పట్టుకెళ్లిన వాళ్లు అధికారులకు తిరిగిచ్చేశారు. వీరి నుంచి 141వెండి నాణేలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. గుప్తనిధి బయటపడిన నాలుగైదు రోజులకుగానీ ఈ విషయంలో బయటికి పొక్కలేదు. చివరికీ ఈ విషయం అధికారులకు చేరడంతో గుప్తనిధి కథ కంచికి చేరింది. ఏదైనా అప్పనంగా వచ్చింది.. మనదగ్గర ఎక్కువ కాలం ఉండదని పెద్దలు చెప్పినమాట ఈ విషయం చూస్తే అర్థమవుతుంది.

తెలంగాణలోని కరోనా హాట్ స్పాట్ లు ఇవే..


దేశంలో కరోనా ఎంట్రీ కేంద్రం లాక్డౌన్ అమలు చేస్తుంది. 21రోజులపాటు లాక్డౌన్ కొనసాగనుంది. దీంతో కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యత్నిస్తున్నాయి. అయితే గత రెండు, మూడురోజులుగా దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ పాజిటివ్ కేసులన్నీంటికి ఢిల్లీ మర్కస్ ప్రార్థనలకు లింకు ఉండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలను ప్రభుత్వం కరోనా హాట్ స్పాట్ లుగా గుర్తించింది.

కరోనా సోకి కూడా ఇన్నాళ్లు బయటకు చెప్పని ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు ప్రభుత్వం హాట్ స్పాట్స్‌గా పేర్కొంటుంది. రాష్ట్రంలోని భైంసా, నిర్మల్, నిజామాబాద్, హైదరాబాద్ పాతబస్తీ, గద్వాల్, మిర్యాలగూడను హాట్ స్పాట్స్‌గా ప్రభుత్వం గుర్తించింది. ఈ ప్రాంతాల్లో మరింత కఠినంగా లాక్డౌన్ అమలు చేయనున్నారు. ఈ ప్రాంతాల నుంచి ఢిల్లీకి వెళ్లొచ్చిన వారు చాలా ప్రాంతాల్లో తిరిగినట్లు గుర్తించింది. వీరి వివరాలను సేకరించిన ప్రభుత్వం ఇప్పటికే వీరిని ఐసోలేషన్ కేంద్రాలకు తరలించింది.

రాష్ట్రంలో గుర్తించిన హాట్ స్పాట్స్‌లో మూడు కిలోమీటర్ల ఏరియా వరకు ఎవరినీ అనుమతించరు. ఈ ప్రాంతం నుంచి ఎవరిరీన బయటికి వెళ్లకుండా కట్టడి చేయనున్నారు. అదేవిధంగా బయట నుంచి ఇతరులను ఈ ప్రాంతాలకు ఎవరినీ అనుమతించరు. కాగా తెలంగాణలో ఇప్పటివరకు 154కరోనా పాజిటివ్ కేసులు నమదయ్యాయి. వీరిలో 17మంది కోలుకున్నారు. తొమ్మిది మంది మృతిచెందారు. గత రెండు మూడురోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు బయటపడతుండంతో సర్కార్ అలర్ట్ అయింది. లాక్డౌన్ మరింత కఠినంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశాలను జారీ చేసింది.
Also Read: ఒవైసీ హాస్పిటల్‌‌ను ఐసోలేషన్ వార్డుగా చెయ్యరే!

అర్ధ నగ్నంగా నర్స్ లను వేధిస్తున్న మర్కజ్ రోగులు


ఇప్పటి వరకు దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చేస్తున్న వాహనాలుగా భావిస్తున్న మర్కజ్ జమాత్ సమ్మేళనంలో పాల్గొన్న వారిని గుర్తించి, వైద్య పరీక్షలకు పంపించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక విషమ పరీక్షగా మారగా, తాజాగా ఆసుపత్రులలో వారి విశృంఖల ప్రవర్తన, వైద్యులపై దాడులు, నర్స్ పట్ల అసభ్యంగా వ్యవహరిస్తూ ఉండడంతో పోలీస్ అధికారులకే దిక్కు తోచడం లేదు.

హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో ఒక వ్యక్తి మృతి చెందడంతో అతని బంధువులు డాక్టర్లపై దాడి జరిపిన వంటి సంఘటనలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఆ సంఘటనపై పోలీసులు, ప్రభుత్వం తీవ్రంగా స్పందించినా గాంధీ ఆసుపత్రిలోనే ఇంకా రోగులు, వారికి సహాయకులుగా వచ్చిన వారు నర్స్ లకు సహకరించకుండా, వారిని వేధిస్తున్నారని, అసభ్యంగా వారి పట్ల ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి.

గాంధీ ఆసుపత్రిలో ఇప్పుడు నర్సులు వార్డులకు వెళ్లేందుకు భయపడుతున్నారు. అక్కడ పనిచేస్తున్న వార్డు బాయిలు, సెక్యూరిటీగార్డులు సైతం భయం నీడలో డ్యూటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.గాంధీ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ చాంబర్‌లో జరిగిన అన్ని విభాగాల హెచ్‌ఓడీలతో అత్యవసర సమావేశంలో ఆస్పత్రిలో పరిస్థితి మరింత దారుణంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.

తాజాగా ఘజియాబాద్ ఎంఎంజీ జిల్లా ఆసుపత్రిలో వారి ప్రవర్తన అదుపు తప్పి అసహ్యకర రీతికి మారింది. అర్ధనగ్నంగా తిరుగుతూ, నర్స్ లను వేధిస్తున్నట్లు అక్కడి సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. తమ ఆసుపత్రిలో చేరిన చేరిన తబ్లిగ్ జమాత్ కార్యకర్తలపై ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ గురువారం రాత్రి పోలీసులకు ఈ విషయమై ఫిర్యాదు చేశారు.

ఆసుపత్రిలో చేరిన ఆరుగురు తబ్లిగ్ జమాత్ కార్యకర్తలు ప్యాంట్లు తీసివేసి అర్ద నగ్నంగా తిరుగుతూ నర్సులను వేధిస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఘజియాబాద్ ఎంఎంజీ జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ కొత్వాలీ ఘంటాఘర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరుగురు రోగులు సిగరెట్లు, బీడీలు కావాలని డాక్టర్లు, నర్సులను డిమాండ్ చేస్తున్నారని చీఫ్ మెడికల్ ఆఫీసర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆసుపత్రి ఐసోలేషన్ వార్డులో చేరిన ఆరుగురు కరోనా రోగులు తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఎంఎంజీ ఆసుపత్రి నర్సులు ఫిర్యాదు చేశారని చీఫ్ మెడికల్ ఆఫీసరు చెప్పారని ఘజియాబాద్ నగర ఎస్పీ చెప్పారు. ఇప్పటికే లాక్ డౌన్ నిబంధనలు పాటించని తబ్లిగ్ జమాత్ చీఫ్ మౌలానా ముహమ్మద్ సాద్ తో పాటు ఏడుగురికి ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.

వీరు ఆసుపత్రులలో శాంతి, భద్రతల సమస్యలు సృస్టిస్తున్నందున తగు పోలీస్ రక్షణ కోరుతూ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ కమీషనర్ కు లేఖ వ్రాసింది. తుగ్లకాబాద్ స్వీయ నిర్బంధానం కేంద్రములో ఉన్నవారు డాక్టర్లు, నర్స్ లపై ఉమ్మి వేస్తూ, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని అంటూ ఉత్తర రైల్వే సిపిఆర్ఓ దీపక్ కుమార్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసారు.

ఏపీలో 161కి పెరిగిన కరోనా కేసులు


ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 161కి పెరిగింది. వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం గురువారం రాత్రి పది గంటల అనంతరం 18 కొత్త కేసులు నమోదైనట్లు స్టేట్ కరోనా నోడల్ ఆఫీసర్ అర్జా శ్రీకాంత్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరు జిల్లాలో 20, నెల్లూరు జిల్లాలో 32, ప్రకాశం జిల్లాలో 17, కడప జిల్లాలో 19, కృష్ణా జిల్లాలో 23, పశ్చిమ గోదావరి జిల్లాలో 15, విశాఖపట్నం జిల్లాలో 14, తూర్పుగోదావరి జిల్లాలో 9, చిత్తూరు జిల్లాలో 9, అనంతపురం జిల్లాలో 2, కర్నూలు జిల్లాలో 1 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవగా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో శుక్రవారం నాటికి ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదు అయిన జిల్లాగా నెల్లూరు జిల్లా ఉంది. నిన్నటి వరకూ ఈ స్థానంలో కృష్ణా జిల్లా ఉంది.

ప్రధాని వీడియో సందేశమిదే…!

ఇళ్లలోని లైట్లను నిలిపివేసి, జ్యోతులు వెలిగించి సంకల్పాన్ని చాటాలని వీడియో సందేశంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. కరోనాపై పోరులో భారతజాతి మొత్తం ఏకతాటిపై ఉందన్న విషయాన్ని మరోసారి తెలియజేయాలని ప్రధాని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఉదయం వీడియో సందేశాన్ని ఇచ్చిన ఆయన, ఏప్రిల్ 5వ తేదీన ఆదివారం రాత్రి, 9 గంటల సమయంలో 9 నిమిషాల సమయాన్ని ప్రతి ఒక్కరూ కేటాయించాలని సూచించారు. ఇప్పటివరకూ 9 రోజుల పాటు విజయవంతంగా లాక్ డౌన్ ను సక్రమంగా అమలు చేశామని, మరో 11 రోజుల పాటు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు.

ఆదివారం రాత్రి 9 గంటలకు ఇళ్లలోని అన్ని లైట్లనూ ఆర్పివేయాలని, ఆపై వీధుల్లోకి రాకుండా, తలుపుల వద్ద నిలబడి, వీలైనన్ని ఎక్కువ దీపాలను, కవ్వోత్తులను వెలిగించాలని మోదీ కోరారు. సెల్ ఫోన్లలోని ఫ్లాష్ లైట్లను, టార్చి లైట్లను వెలిగించాలని, ఈ సమయంలో వీధుల్లోకి మాత్రం ఎవరూ రావద్దని ఆయన కోరారు. తద్వారా జాతి సంకల్పం ఒకటేనన్న సందేశాన్ని వినిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఇండియాలో అమలు అవుతున్న లాక్ డౌన్ ను ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా చూస్తున్నదని, వైరస్ వ్యాప్తిని అడ్డుకునే దిశగా, ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలను గమనిస్తోందని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఇండియాను ఎన్నో దేశాలు ఇప్పుడు అనుసరిస్తున్నాయని తెలిపారు. 130 కోట్ల మంది ఒకే పని చేస్తే, ప్రపంచానికి ఓ సంకేతం వెళుతుందని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ ఏప్రిల్ 9న జ్యోతులు వెలిగించి, మన సంకల్పాన్ని ప్రపంచానికి చాటాలని పిలుపునిచ్చారు.

బాలయ్య భారీ విరాళం!

దేశ వ్యాప్తంగా కరోనా రక్కసి చేస్తున్న హల్ చల్ కి ప్రజలు భయబ్రాంతులకు గురౌతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి అనేక మంది సినీతారలు, పారిశ్రామికవేత్తలు, వివిధ వర్గాలకేకు చెందిన వారు వారికి తోచిన సహాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే హిందూపూర్ శాసనసభ్యులు, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ చైర్మన్, నటసింహ నందమూరి బాలకృష్ణ 1 కోటి 25 లక్షల రూపాయలు విరాళంగా అందిస్తున్నట్టు ప్రకటించారు.

అందులో 50 లక్షలు ఆంధ్రప్రదేశ్ సీఎం సహయనిధికి, 50 లక్షలు తెలంగాణ సీఎం సహాయనిధికి అందజేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఎంతో ఇబ్బంది పడుతున్న తెలుగు సినీ కార్మికుల సహాయార్థం 25 లక్షల రూపాయల చెక్ ను కరోనా క్రైసిస్ ఛారిటీ (సి సి సి) ఎగ్జిక్యూటివ్ మెంబర్ సి కళ్యాణ్ కు అందించారు. కరోనా పై పోరాటానికి తన వంతు బాధ్యతగా 1 కోటి 25 లక్షల విరాళంగా అందిస్తున్నట్టు నందమూరి బాలకృష్ణ తెలిపారు. స్వయం నిబంధనలతో ఇంట్లోనే ఉండి ఈ విపత్తును ధైర్యంగా ఎదుర్కోవాలని, కరోనా ని అరికట్టడంలో మనందరం భాగస్తులం కావాలని పిలుపునిచ్చారు.

రెడ్ జోన్ అంటే తెలుసా…?


దేశంలో కరోనా కేసులు వెలుగు చూసినప్పటి నుండి రెడ్ జోన్ అనే పదం తరుచుగా వింటున్నాం. రెడ్ జోన్ అంటే ఏమిటనే ప్రశ్న అందరిలోను తలెత్తుతుంది. ప్రభుత్వ సూచనల ప్రకారం కరోనా బాధితుడిని గుర్తించిన మూడు కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాన్ని రెడ్ జోన్ గా పరిగణిస్తారు. ఈ రెడ్ జోన్ లో మూడు విభాగాలు ఉంటాయి. కరోనా బాధితుడు గుర్తించబడిన 150 మీటర్ల పరిధిని అతి తీవ్రమైన ప్రాంతంగా పరిగణిస్తారు.

అక్కడి నుండి ఒకటిన్నర కిలోమీటర్ పరిధిని అతి సున్నితమైన ప్రదేశంగా గుర్తిస్తారు. మిగిలిన ఒకటిన్నర కిలో మీటర్ల ప్రాంతాన్ని కూడా హై అలెర్ట్ జోన్ గా నిర్దేశిస్తారు. మొదటి 150 మీటర్ల పరిధిలో ఉన్న ప్రతీ ఒక్కరికీ పరీక్షలు చేస్తారు.
సెకండ్, థర్డ్ జోన్ లో ఉన్న వారికి ప్రతీ రోజు రెండు పూటలా ఇంటింటా సర్వే చేస్తారు.

ఎవరైనా జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కలిగి ఉంటే వారికి నమూనా పరీక్షలు చేస్తారు. ఈ మూడు జోన్లలో ప్రతీ రోజు మూడు పూటలా శానిటేషన్ మెరుగుపరిచి బ్లీచింగ్ చల్లుతారు. ఇతర ప్రాంతాల వారిని ఈ రెడ్ జోన్ పరిధిలోకి రానివ్వరు. రెడ్ జోన్ పరిధిలో ఉన్నవారిని ఇతర ప్రాంతాలకు వెళ్ళనివ్వరు.

ఆ 9 వేల మంది దొరికారు


భారత్ లో కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరగడం కలవరపెడుతోంది. సరైన సమయంలో లాక్ డౌన్ విధించడంతో పాటు కట్టుదిట్టంగా లాక్ డౌన్ అమలు చేయడంతో చాలావరకు కరోనా కంట్రోల్ లో ఉందని అంతా భావించారు. మరో రెండు వారాల్లో అనుకున్న విధంగానే లాక్ డౌన్ ఎత్తివేస్తారని దేశ ప్రజలంతా అనుకున్నారు. అనూహ్యంగా ఢిల్లీలోని మర్కస్ లో జరిగిన సదస్సు కేంద్రంగా కరోనా కేసులు పెరిగిపోవడంతో దేశ ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఆ సదస్సుకు పలువురు విదేశీయులు హాజరవడం, దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి హాజరైన వారు తిరిగి వారి రాష్ట్రాలకు తరలి వెళ్లడంతో దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ కేసులను ట్రాక్ చేసేందుకు కేంద్రం యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగింది. మర్కస్ సదస్సుతో సంబంధం ఉన్న 9 వేల మందిని గుర్తించామని కేంద్ర హోం శాఖ కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీ శ్రీ వాస్తవ వెల్లడించారు. వారిలో 1306 మంది విదేశీయులని మిగతా వారంతా భారత్ లోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారని తెలిపారు. ఢిల్లీలోనే 2వేల మందిని గుర్తించామని వారిలో 250 మంది విదేశీయులని మిగతా 1804 మందిని క్వారంటైన్ కు తరలించామని 334 మందిని ఆసుపత్రుల్లో చేర్పించామని ఆమె తెలిపారు.

వారందరినీ క్వారంటైన్ లో ఉంచి టెస్ట్ చేస్తున్నామన్నారు. సదస్సుకు హాజరైన వారిలో 275 మంది విదేశీయులు మర్కస్ లో కాకుండా నిజాముద్దీన్ ప్రాంతంలోని వివిధ మసీదులలో ఉన్నారని వారిని గుర్తించి క్వారంటైన్ కు తరలించామన్నారు. ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పోలీసుల సాయంతో 9 వేల మందిని అతి తక్కువ సమయంలోనే గుర్తించగలిగామని అందుకోసం కేంద్ర హోంశాఖ ఆయా రాష్ట్రాల పోలీసు శాఖలు తీవ్రంగా శ్రమించాయని తెలిపారు. లాక్ డౌన్ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా అమలు చేయాలని నిబంధనలు ఉల్లంఘిస్తే రెండేళ్ల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించాలని అన్నారు. ఈ విపత్కర సమయంలో సరైన సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం చాలా ముఖ్యమని అందుకోసం ఓ ప్రత్యేక వెబ్ పోర్టల్ రూపొందించాల్సిందిగా కేంద్ర సమాచార ప్రసార శాఖను శ్రీవాత్సవ కోరారు. చాలామంది సోషల్ మీడియాలో కరోనా కేసుల గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రెస్ ఇన్ ఫర్మేషన్ బ్యూరో వారు రూపొందించిన ఫ్యాక్ట్ చెక్ యూనిట్ గురువారం నుంచి ప్రారంభమైందని కరోనాపై వాస్తవాల నిర్ధారణ కోసం pibfactcheck@gmail.com కు ప్రజలు మెయిల్ చేయవచ్చని తెలిపారు.

వివాదం రేపుతున్న సింగరేణి కార్మికుల జీతాల కోత


తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సింగరేణి కార్మికులకు సహితం లాక్ డౌన్ కారణంగా సగం మేరకు జీతాలకు కొత్త విధిస్తూ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆదేశాలు జారీచేయడం పెను వివాదంగా మారుతున్నది. అక్కడున్న గుర్తింపు పొందిన కార్మిక సంఘం అధికార పార్టీకి చెందినది కావడంతో అధికారికంగా వారు నోరు మెదపడం లేదు. అయితే మిగిలిన కోరిక సంఘాలు ఈ విషయమై ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేస్తున్నాయి.

సింగరేణి కాలరీస్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కార్పొరేషన్ కాదని, స్వతంత్ర ప్రతిపత్తి గల కార్పొరేట్ సంస్థ అని, దీని ఉద్యోగుల జీతాలతో కొత్త విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడిదని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై రాజ్యాంగ సంస్థలలో ఫిర్యాదు చేయడం ద్వారా ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం ఒక వంక చేస్తున్నారు. మరో వంక సమ్మె నోటీసు ఇవ్వడానికి కూడా సిద్దపడుతున్నారు.

120 సంవత్సర సింగరేణి చరిత్రలో మొదటిసారిగా ఇటువంటి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం సంస్థలో చీకటి రోజని

సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (బిఎంఎస్) విమర్శించింది. తమ కార్మికుల జీతభత్యాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం సంబంధం లేదని, సంస్థకు రాష్ట్ర బడ్జెట్ తో కూడా సంబంధం లేదని కార్మిక సంఘ్ ప్రధాన కార్యదర్శి పి మాధవ్ నాయక్ స్పష్టం చేశారు.

పైగా, రాష్ట్ర ప్రభుత్వానికి కోట్ల రూపాయలు సింగరేణి సంస్థనే రాయల్టీ టాక్స్ పేరుతో చెలిస్తుందని చెబుతూ సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం మెప్పు పొందడానికే సింగరేణి కార్మికుల జీవితంతో ఆటలు ఆడుతుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసు, వైద్య శాఖలకు పూర్తిగా జితం ఇస్తూ, ప్రోత్సాహాలు కూడా ఇస్తామని ప్రకటించి తమ జీతాలతో కొత్త విధించడం ఏమిటని విస్మయం వ్యక్తం చేశారు..

వేతనాలు తగ్గించడం లేదా తక్కువ ఇచ్చే పరిస్థితి నిజంగా కంపెనీకి ఉంటే ముందుగా గుర్తింపు యూనియన్, రిప్రజెంటేటివ్ యూనియన్ లతో యజమాన్యము మాట్లాడి, తగు కారణాలు చెప్పి, వాళ్ళ తో ఒక ఒప్పందం చేసుకోవాలని ఈ సందర్భంగా కార్మిక సంఘాలు గుర్తు చేస్తున్నాయి. కార్మిక చట్టం ప్రకారం సగం జీతాలు ఇవ్వడం నేరం కాగలదని హెచ్చరిస్తున్నాయి.

సింగరేణి యాజమాన్యం, యాజమాన్య సంఘం ఇద్దరు కలిసి ఈరోజు కార్మికులకు అన్యాయం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. సింగరేణిలో లే ఆఫ్ బదులు లాక్ డౌన్ ప్రకటించాలని, కార్మికులకు పూర్తి వేతనం చెల్లించాలని జాతీయ కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ నెల 14లోగా సమస్యలను పరిష్కరించని పక్షంలో 15 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించాయి. ఈ మేరకు సింగరేణి సీఎండీకి సమ్మె నోటీస్ ఇచ్చినట్లు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూ ప్రకటించాయి

కొత్త రాజ్యసభ సభ్యులకు లాక్‌డౌన్‌ గండం


రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన సభ్యులకు లాక్‌డౌన్‌ గండం ఏర్పడింది. మొత్తం 17 రాష్ట్రాల నుండి 55 మంది సభ్యులకు ఎన్నికలు జరుగగా, వారిలో 37 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సాధారణంగా వారు ఈ రోజు ప్రమాణస్వీకారం చేయవలసి ఉంది.

అయితే లాక్‌డౌన్‌ కారణంగా ఈ కార్యక్రమాన్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు సభ చైర్మన్, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ప్రకటించారు. లాక్‌డౌన్‌ పూర్తయితే గాని వారి ప్రమాణస్వీకారం ఉండబోదని సంకేతం ఇచ్చారు.

‘ప్రమాణస్వీకారానికి గాను నూతనంగా ఎన్నికైన సభ్యులను లాక్‌డౌన్‌ ఎత్తివేసే వరకు వేచి ఉండాల్సిందిగా కోరుతున్నాం’ అని రాజ్యసభ చైర్మన్‌ ఒక అడ్వైజరీలో సూచించారు.

మరోవంక, పోటీ ఏర్పడిన మిగిలిన 18 మంది సభ్యుల కోసం గత నెల 26న జరుగ వలసిన ఎన్నికలను సహితం ఇదే కారణంతో ఎన్నికల కమీషన్ వాయిదా వేయడం తెలిసింది. ఈ ఎన్నికలు సహితం లాక్‌డౌన్‌ సంగతి తేలితే గాని జరిగే అవకాశం లేదు.

అయితే కొత్తగా ఎన్నికైన వారికి ప్రభుత్వ పరంగా అందాల్సిన జీతభత్యాలన్నీ వారు ఎన్నికైనట్లు ప్రకటించిన నాటి నుంచి వర్తిస్తాయని అధికారులు తెలపడంతో వారికి కొంత ఉపశమనం కలిగిన్నట్లు అయింది.

వారం రోజులకే చేతులెత్తేసిన జగన్: లోకేష్


కరోనా వైరస్ వ్యాప్తి నివారించేందుకు లాక్ డౌన్ ప్రకటించిన వారం రోజులకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతులెత్తేశారని పేర్కొన్నారు. ప్రధానితో సీఎం వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై లోకేష్ ట్విట్టర్లో గాటుగా స్పందించారు. బాగోనిది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కాదు, జగన్ గారి మానసిక పరిస్థితి అని పేర్కొన్నారు. జగన్ బీద అరుపులు విచిత్రంగా ఉన్నాయని తెలిపారు. ఇసుక, మట్టి దోపిడీ పై జగన్ కు ఉన్న శ్రద్ధ లో 10 శాతం కరోనా నివారణ పై పెట్టినా రాష్ట్రంలో ఇంత దారుణమైన పరిస్థితి ఉండేది కాదన్నారు. ఇప్పటికైనా జగన్ గారు మొద్దు నిద్ర,నిర్లక్ష్య ధోరణి పక్కనపెట్టి కరోనా నివారణ కు చర్యలు తీసుకోవాలని కోరారు.

కరోనా ఎఫెక్ట్ తో కష్టాల్లో కూరుకుపోయిన పేద వాళ్లకు 5 వేల ఆర్థిక సహాయం అందించడానికి జగన్ కు మనస్సు ఒప్పడం లేదన్నారు. పండించిన పంటకి గిట్టుబాటు ధర లేక, రవాణా సౌకర్యం లేక కన్నీరు పెడుతున్న రైతన్నని ఆదుకోవడం లేదని విమర్శించారు. ఉపాధి లేక, మూడు నెలల వేతన బకాయిలు విడుదల అవ్వక పోవడంతో ఉపాధి హామీ వేతనదారులు ఇబ్బందులు పడుతుంటే జగన్ గుండె చలించలేదని, కానీ ఉపాధి హామీ పధకంలో పనులు చేసిన వైకాపా కార్యకర్తలకు 961 కోట్లు బిల్లులు విడుదల చేశారని ఎద్దేవ చేశారు.\
Also Read: జగన్ కు కాంట్రాక్టర్ల పై ఉన్న ప్రేమ ప్రజలపై లేదు: లోకేష్

మద్యం వ్యాపారుల దొంగ దందా..!

దేశ వ్యాప్తంగా కరోనా లాక్‌ డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో మద్యం వ్యాపారులు రెచ్చిపోతున్నారు. దొంగ చాటుగా మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. ఎమ్మార్పీకి రెట్టింపు రేట్లకు విక్రయాలు జరుపుతున్నారు. బార్‌ అండ్‌ రెస్టారెంట్లవారు నిబంధనలు ఉల్లంఘించి బయటి వ్యక్తులకు మద్యాన్ని అమ్ముతున్నారు.

లాక్‌ డౌన్‌ సమయంలో నేరుగా మద్యం దొరకని పరిస్థితి ఏర్పడింది. దాంతో మందుబాబులు మద్యం కోసం వైన్‌ షాపులు, బార్లు, బెల్టు షాపుల్లో ఆరా తీయడం మొదలు పెట్టారు. ఇదే అదనుగా భావించిన వ్యాపారులు దొంగచాటు విక్రయాలకు తెరలేపారు. మద్యాన్ని రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు. టీచర్స్‌ ఫుల్‌ బాటిల్‌ ధర రూ.1840  కాగా.. దాన్ని రూ.3000కు విక్రయిస్తున్నారు. మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా వినియోగించే బ్లెండర్స్‌ ప్రైడ్‌ ఫుల్‌బాటిల్‌ ఎమ్మార్పీ రూ.1080కాగా.. రూ.3000కు, సిగ్నేచర్‌ ఎమ్మార్పీ రూ.1060కుగాను రూ.2800కు విక్రయిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌, వరంగల్‌, మెదక్‌ జిల్లాల్లో ఈ దొంగచాటు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. బ్లాక్‌ లేబుల్‌, రెడ్‌ లేబుల్‌, బ్లూ లేబుల్‌, జానీ వాకర్‌ వంటి ఫారెన్‌ లిక్కర్‌ను మూడు రెట్లు పెంచి అమ్ముతున్నారు. వారు ఇప్పటికే సగం స్టాకును అమ్మేశారని, మిగతా రూ. 1,000 కోట్ల విలువైన మద్యాన్ని రెండుమూడు రోజుల్లో అమ్మేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

వ్యాపారులు తెలివిగా మద్యం విక్రయాలను పాత తేదీల్లో రికార్డు చేస్తున్నారు. మార్చి 21, అంతకుముందు లిఫ్ట్‌ చేసిన మద్యం పాత తేదీల్లోనే విక్రయించినట్లు రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. ఏ షాపునకు ఎంత మద్యం వెళ్లింది, ఏ తేదీన వెళ్లింది అన్నది రికార్డ్‌ అవుతుంది. అందుకే లాక్‌డౌన్‌ తేదీల్లో విక్రయించినట్లు కాకుండా.. ముందే సరుకు మొత్తం అమ్ముడుపోయినట్లుగా రికార్డులు సృష్టిస్తున్నారు

లాక్‌డౌన్‌ తో భారత్ కు రూ.7.44 లక్షల కోట్ల నష్టం


కరోనా మహమ్మారిని కట్టడి చేయడం కోసం భారత ప్రభుత్వం ప్రకటించిన మూడు వరాల లాక్‌డౌన్‌ తో భారత్ ఆర్ధిక వ్యవస్థకు రోజుకు రూ 35,400 కోట్ల మేరకు నష్టం వాటిల్లుతుందని అక్యూట్‌ రేటింగ్స్‌ అండ్‌ రిసెర్చ్‌ అంచనా వేసింది. మొత్తం ఈ 21 రోజుల లాక్‌డౌన్‌ కాలంలో రూ.7.44 లక్షల కోట్ల (దాదాపు 98 బిలియన్‌ డాలర్లు) నష్టం వాటిల్లవచ్చని చెప్పింది.

కరోనా దెబ్బకు మునుపెన్నడూలేని విపత్కర పరిస్థితులు చోటుచేసుకోగా.. వ్యాపారాలు, పారిశ్రామికోత్పత్తి, రవాణా వ్యవస్థ స్తంభించిన విషయం తెలిసిందే. దీంతో ఆర్థిక వ్యవస్థకు పెను నష్టం వచ్చిపడిందని క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ అక్యూట్‌ తెలిపింది. ఈ పరిస్థితి భారత్‌తోపాటు మొత్తం ప్రపంచ దేశాలన్నింటిపైనా ఉందన్నది.

కాగా, ఈ ఆర్థిక సంవత్సరం (2020-21) ఏప్రిల్‌-జూన్‌ జీడీపీపై కరోనా ప్రభావం ఉంటుందని, జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికంపైనా కనిపిస్తుందని అంచనా వేసింది. మొత్తానికి ఇప్పటికే ఆర్థిక మందగమనంతో సతమతమవుతున్న భారత్‌ను కరోనా పెద్ద దెబ్బే కొట్టింది.

కరోనా వైరస్‌ ఉధృతి కారణంగా ఈ ఏడాది ప్రపంచ జీడీపీ దాదాపు 1 శాతం పడిపోవచ్చని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. ఇంతకుముందు 2020లో గ్లోబల్‌ జీడీపీ 2.5 శాతంగా నమోదు కావచ్చని పేర్కొన్నది. అయితే వైరస్‌ విజృంభణ నేపథ్యంలో ఆ అంచనాను ఇప్పుడు 0.9 శాతం తగ్గించింది. 1.6 శాతానికి పరిమితం చేసింది.

అంతర్జాతీయ వాణిజ్యాన్ని, రవాణా వ్యవస్థను ఈ విశ్వమారి దారుణంగా దెబ్బతీసిందని వెల్లడించింది. 2009లో ప్రపంచ ఆర్థిక మాంద్యం సమయంలో గ్లోబల్‌ జీడీపీ 1.7 శాతంగా ఉండగా, ఇప్పుడు అంతకంటే తక్కువకు చేరవచ్చన్న అంచనాలు వినిపిస్తుండటం గమనార్హం.

ట్రంప్‌కు రెండోసారి కరోనా పరీక్షలు…!


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు రెండోసారి నిర్వహించిన కరోనా పరీక్షల్లోనూ నెగటివ్ రిపోర్టులు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తనకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా సోకలేదని తేలిందని ట్రంప్ స్వయంగా వెల్లడించారు. ట్రంప్ ఈసారి ర్యాపిడ్ విధానంలో పరీక్షలు చేయించుకున్నారు. ఈ విధానంలో పరీక్ష నిమిషంలోనే పూర్తవుతుంది. పావుగంటలో ఫలితం వస్తుంది. ఇది ఎంతో బాగుందని, చాలా సులభతరమని ఈ సందర్భంగా ట్రంప్ పేర్కొన్నారు. కాగా, ట్రంప్ తొలిసారి గత నెల రెండోవారంలో ఇన్వాసిస్ పద్ధతిలో కరోనా పరీక్షలు చేయించుకోగా రిపోర్టు కోసం పది గంటలు వేచి చూశారు.

దీంతో ఈసారి ఇన్వాసిస్ పద్ధతిలో చేయించుకుని పావుగంటలోనే రిపోర్టు అందుకున్నారు. అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. చైనాను మించి ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది కరోనా బాధితులు ఉన్న దేశంగా పరిణమించిన నేపథ్యంలో అక్కడి నాయకులు ఈ వ్యాధి నుంచి రక్షణ పొందేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ దేశంలో ఇప్పటి వరకు 2,36,221 మంది కరోనా భారిన పడగా, 5, 780 మంది మృతి చెందారు. సుమారు రోజుకు 20 వేల మందికిపైగా వైరస్ భారిన పడుతున్నారు.

రీమేక్ లు వద్దు.. ఒరిజినల్ కధలే ముద్దు


2013 లో ` దిల్ ` చిత్రం తో నిర్మాతగా మారిన దిల్ రాజు ఇప్పటివరకు 30 చిత్రాలు నిర్మిస్తే వాటిలో ఒక్కటి కూడా రీమేక్ చిత్రం లేదు. దిల్ రాజు ఎక్కువగా స్ట్రెయిట్ సినిమాలే చేస్తుంటాడు. వాటినే ఎక్కువగా నమ్ముతాడు. కూడా … కానీ మొదటి సారిగా దిల్ రాజు ` జాను ` చిత్రాన్ని ముచ్చట పడి రీమేక్ చేసాడు. తమిళం లో సూపర్ హిట్ అయిన `96 ` ఆధారంగా నిర్మించబడ్డ ఈ చిత్రం వల్ల నిర్మాతగా నష్ట పోయాడు.

అదలా ఉంటే దిల్ రాజు “బదాయి హో” అనే హిందీ చిత్రం రీమేక్ రైట్స్ తీసుకున్నాడు. 2018 లో విడుదలైన ఈ హిట్ చిత్రాన్ని ముందు అక్కినేని నాగ చైతన్యతో రీమేక్ చేద్దాం అనుకున్నాడు. కానీ నాగ చైతన్య ఆసక్తి చూపించక పోవడంతో మరో యువ హీరో శర్వానంద్ తో చేద్దామని అనుకొన్నాడు. కానీ `జాను`చిత్రం ఫెయిల్ అవడంతో శర్వానంద్ తోనే కాదు, ఇంకెవరితో నైనా ఆ చిత్రాన్నే రీమేక్ చేయకూడదని ఫిక్స్ అయ్యాడు. “బదాయి హో” రీమేక్ హక్కుల కోసం పెట్టిన డబ్బులు పోయినా ఫర్లేదు కానీ మరో ఫెయిల్యూర్ రాకూడదు అనుకొన్నాడట …prevention is better than cure