Home Blog Page 8547

డాక్టర్లు,నర్సులను కూడా వదలని కరోనా!

ముంబైలోని వోక్‌ హార్ట్‌ హాస్పిటల్‌ లో పనిచేస్తున్న ముగ్గురు డాక్టర్లు, 26 మంది నర్సులకు కరోనా వైరస్‌ సోకింది. దీంతో ఆ ఆసుపత్రిని బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) సీజ్‌ చేసింది. వారందరికి టెస్టులు నిర్వహించి నెగెటివ్‌ వచ్చే దాకా ఎవరూ బయటకు రాకూడదని మున్సిపల్‌ అధికారులు ఆదేశాలు జారీచేశారు. హాస్పిటల్‌ యాజమాన్యం సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో ఆ దవాఖానకు చెందిన 300 మంది సిబ్బందిని ఇప్పటికే క్వారంటైన్‌ కు తరలించారు. మార్చి 20న ఇద్దరు కరోనా అనుమానితులను నగరంలోని కస్తూర్భా గాంధీ హాస్పిటల్‌ నుంచి వోక్‌హార్ట్‌ దవాఖానకు తరలించారు. అయితే వారిని సాధారణ ఐసీయూ వార్డులో ఉంచారు. సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో వారి బాగోగులను చూసుకుంటున్న ఇద్దరు నర్సులకు మార్చి 28న కరోనా పాజిటివ్‌ అని తేలింది. క్రమంగా 26 మంది నర్సులు, ముగ్గురు డాక్టర్లు ఈ వైరస్‌ బారిన పడ్డారు.

వైసీపీ నేతలకు దేవుడు మంచి బుద్ధిని ప్రసాదించాలి: కన్నా


వైసీపీ నేతలకు దేవుడు మంచి బుద్ధిని ప్రసాదించాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. ఏపీలో అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై ఆయన మరోసారి మండిపడ్డారు. గుంటూరులో సోమవారం జరిగిన పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు.

పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ సబ్ కా సాత్ సబ్ కా విశ్వాస్ తో ఏకాత్మతా మానవతావాదం తో, అంత్యోదయ సిద్ధాంతాలతో 1980 ఏప్రిల్ 6వ తేదీన భారతీయ జనతాపార్టీ ఆవిర్భవించిందని తెలిపారు.కరోనా కష్టకాలంలో కేంద్రం చేస్తున్న సాయాన్ని జగన్‌ ప్రభుత్వం తమదిగా చెప్పుకుని రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తోందని ఆక్షేపించారు. కరోనా విషయంలోనూ వాస్తవాలు దాచిపెడుతున్నారని, ప్రభుత్వం వెలువరిస్తున్న నివేదికల్లో వాస్తవం లేదని ధ్వజమెత్తారు. ఈ కష్ట సమయంలో పార్టీ కార్యకర్తలంతా ఐక్యంగా పోరాడాలని, ఒక పూట ఉపవాసం ఉండి, ఆహారాన్ని పేదలకు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రధాని మోదీ ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు నడవాలని పిలుపునిచ్చారు.

డాక్టర్ల రాజీనామాలపై కేసీఆర్ ను నిలదీసిన బండి సంజయ్


కరోనా రోగులకు వైద్య సేవలు అందిస్తున్న తమకు కేసీఆర్ ప్రభుత్వం అవసరమైన వ్యక్తిగత రక్షణ పరికరాలు అందించడం లేదని అంటూ తెలంగాణలో కొందరు ప్రభుత్వ వైద్యులు ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తున్నట్లు వార్తలు వస్తుండటం పట్ల కరీంనగర్ ఎంపీ, బిజెపి రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు.

మొత్తం దేశ ప్రజలు కరోనా వైరస్ కు వ్యతిరేకంగా జరుపుతున్న పోరాటంలో కీలకమైన ముందుండి నడిపిస్తున్న యోధులైన ప్రభుత్వ వైద్యులు కొందరు తెలంగాణలో ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తుండటం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కేసీర్ ప్రభుత్వం వారికి అవసరమైన వ్యక్తిగత రక్షణ పరికరాలు అందించక పోవడం వల్లననే ఈ విధంగా జరుగుతూ ఉండడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

అత్యవసర సమయంలో సేవలు అందిస్తున్న వారికి కనీసం కిట్స్ అందించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నదని ధ్వజమెత్తారు. ఇలా డాక్టర్లకు కిట్స్ అందించకుండా తత్సరం చేస్తే ప్రభుత్వానికి అప్రత్తిష్ఠ పాలు అవుతుందని కేసీఆర్ ప్రభుత్వాన్ని సంజయ్ హెచ్చరించారు.

ఈ సమయంలో డాక్టర్లకు రక్షణ, సౌకర్యాలు అంధించి వారికి మనో ధైర్యం అందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కిట్స్ పంపిణిలో అలసత్వం వహించడం పట్ల విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రతిపాధికాన రాష్ట్రంలో ఐసీయూ, ఐసోలాషన్ తో పాటు అన్ని ప్రభుత్వ హాస్పిటల్ లో పని చేస్తున్న డాక్టర్లకు, వైద్యులకు కిట్స్ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.

కొందరు అధికారులు ప్రపంచ ఆరోగ్య సంస్థ సాకుతో కిట్స్ అందరికి అందించడం సాధ్యంకాదని చెప్పడం పట్ల విషయం వ్యక్తం చేశారు. నిబంధనల పేరుతో వైద్యులకు కనీస సౌకర్యాలు అంధించకపోవడం దురదృష్టకరం అన్నారు. రాష్ట్రంలో సేవలు అందిస్తున్న డాక్టర్లను కాపాడుకోవాల్సిన బాధ్యత కేసీఆర్ ప్రభుత్వంపై ఉన్నదని స్పష్టం చేశారు.

ఎంపీల వేతనాల్లో 30 శాతం కోత


కరోనా వైరస్ దేశ ఆర్ధిక వ్యవస్థపై చూపనున్న దుష్ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర మంత్రి వర్గం రెండు కీలక నిర్ణయాలు తీసుకోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ రూపంలో నేడు జరిగిన సమావేశంలో పార్లమెంట్ సభ్యుల వేతనాలు, బత్యాలలో ఏడాది పాటు 30 శాతం మేరకు కొత్త విధించాలని నిర్ణయించారు.

ఎంపీల వేతనాలు, అలవెన్సులు, పెన్షన్లలో ఈ కోతను వర్తింప చేస్తూ పార్ల‌మెంటు స‌భ్యుల జీతాలు, పెన్ష‌న్ల చ‌ట్టం-1954కు సవరణ తీసుకొస్తూ ఒక ఆర్డినెన్సు ను మంత్రివర్గం ఆమోదించింది.

అదే విధంగా పార్లమెంట్ సభ్యులకు తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఇస్తున్న ఎంపీ లాడ్స్ నిధులను (రూ.7900 కోట్లు) రెండేళ్ల పాటు నిలిపేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ మొత్తం సొమ్మును క‌న్సాలిడేటెడ్ ఫండ్ కు బ‌దిలీ చేయ‌నున్నామ‌న్నారు.

మరోవంక, కరోనా నేపథ్యంలో ప్రస్తుత స్థితిని ఒక సామాజిక బాధ్యతగా భావిస్తూ తమ వేతనాల్లో కూడా 30 శాతం కోతకు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, అన్ని రాష్ట్రాల గవర్నర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు.

భారత్‌లో కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తుండటంతో కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నది. గడచిన 24 గంటల్లో కొత్తగా 693 మందికి కోవిడ్‌-19 సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో దేశవ్యాప్తంగా 4067 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్‌ సెక్రటరీ లవ్‌ అగర్వాల్‌ తెలిపారు.

కాగా, 291 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. గత 24 గంటల్లో 30 మంది మహమ్మారి కారణంగా చనిపోవడంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 109కు చేరింది. మొత్తం బాధితుల్లో 1445 కరోనా కేసులు మర్కజ్‌కు వెళ్లి వచ్చినవారివే.

కరోనా బాధితుల్లో 76శాతం పురుషులు ఉండగా..24శాతం మంది మహిళలు ఉన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద ఇప్పటికే రూ.1100 కోట్లు విడదల చేయగా.. అదనంగా మరో రూ 3,000 కోట్లను ఇవాళ రాష్ట్రాలకు విడుదల చేశామని అగర్వాల్ వెల్లడించారు.

రచయిత మారిన ప్రముఖ హీరోయిన్


లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లు వాయిదా పడటంతో సినీ సెలబ్రెటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. హీరోయిన్లు వాళ్లకు అమ్మలకు వంటింట్లో సాయం చేస్తున్నారు. మరికొందరు కొత్తకొత్త వంటకాలను తయారుచేసే పనిలో పడ్డారు. పలువురు హీరోయిన్లు సోషల్ మీడియాలో తమ హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ వేసవిలో మరింత హీట్ ను పెంచుతున్నారు. పలువురు హీరోయిన్లు ఫిటెనెస్, యెగా వంటిపై దృష్టిసారిస్తున్నారు. ఇక హీరోలైతే తమ ఫ్యామిలీ, పిల్లలతో కాలక్షేమం చేస్తూ అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ పోస్టు చేస్తుండటం చూస్తున్నాం.

వీరిందరిని తలదెన్నేలా మలయాళ భామ నిత్యామీనన్ తన టాలెంట్ తో మరోసారి ఆకట్టుకుంది. లాక్ డౌన్ వల్ల ఖాళీగా దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనలోని మరో టాలెంట్ కు పదునుపెడుతోంది. బహుభాషా నటిగా, సింగర్ గా అలరించిన నిత్యామినస్ తాజాగా రచయితగా మారింది. తనలోని వచ్చే ఆలోచనలను స్క్రీప్ట్ రూపంలో బయటికి తీసుకొస్తుంది. అలాగే కొత్త భాషను, మ్యూజిక్ నేర్చుకుంటున్నట్లు నిత్య తెలిపింది.

కరోనా మహమ్మరి వల్ల ప్రస్తుతం అందరం ఇంట్లో ఉండం అవసరమని నిత్య మీనన్ తెలిపింది. దేశంలో లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా మనం మన పనుల్లో బీజీగా అవడానికి కొంత సమయం పడుతుందని చెప్పింది. ఈ ఖాళీ సమయాన్ని తాను పెన్ను పెట్టి ఇలా కథలు రాయడానికి వాడుకుంటున్నానని తెలిపింది. ఇప్పటివరకు అందం, అభినయంతో అలరించిన నిత్యమీనన్ రానున్న రోజుల్లో రచయితగా కూడా అలరించనుంది. మరోసారి నిత్య మీనన్ మల్టిటాలెంటెడ్ అని మరోసారి నిరూపించింది.

వైసీపీ నాయకులపై ఈసీ సీరియస్

కరోనా ప్రత్యేక సాయాన్ని ప్రభుత్వం సిబ్బంది కాకుండా వైసిపి అభ్యర్థులు పంపిణీ చేయడాన్ని ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. ఈ అంశంపై ఇప్పటికే బిజెపి, సిపిఐ పార్టీలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖలు రాశాయి. ఈ లేఖలను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ విచారణకు ఆదేశించారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. కొన్నిచోట్ల అధికార పార్టీకి చెందిన, స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు పంపిణీ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారని, రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అధికార పార్టీకి చెందిన అభ్యర్థులు నగదు సాయం పంపిణీ చేస్తూ ఎన్నికల ప్రచారానికి పాల్పడుతున్నట్లు పేర్కొన్నారని ఇందుకు సంబంధించి కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు, వీడియోలు సమర్పించినట్లు వాటిని పరిశీలించి నివేదిక ఇవ్వాల్సిందిగా కోరింది. ప్రస్తుతానికి ఎన్నికల కోడ్ అమలులో లేదని, ఎన్నికలలో వాయిదా వేయడం వల్ల ప్రస్తుతం ప్రచారానికి అనుమతి లేదని తెలిపింది. నిబంధనలను ఉల్లంగించి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తే నివేదికలు రూపొందించే రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందించాల్సిందిగా కలెక్టర్లకు సూచించారు

వాలంటీర్ దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి


రాష్ట్రంలో వాలంటీర్ల దాడులు అడ్డు ఆపు లేకుండా ఉంది. రెండు రోజుల కిందట గుంటూరు నగరంలోని ఒక వ్యక్తిపై స్థానిక వాలంటీర్ దాడి చేసిన సంఘటన మరువక ముందే చిత్తూరు జిల్లాలో ఒక వ్యక్తిపై వాలంటీర్ కత్తితో దాడి చేసిన తీవ్రంగా గాయపరిచిన సంఘటన చేసుకుంది.

కోవిడ్-19 బాధితుల కోసం ప్రభుత్వం అందజేస్తున్న ప్రత్యేక సాయం రూ. వెయ్యి పంపిణీలో జరుగుతున్న అసమానతలకు పాల్పడుతున్న వాలంటీర్‌ను ఓ వ్యక్తి ప్రశ్నించాడు. దీంతో నన్నే ప్రశ్నిస్తావా? అంటూ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన వాలంటీర్ ఆ వ్యక్తిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. చిత్తూరు జిల్లాలోని కేవీ పల్లి మండలం బండ వడ్డిపల్లి వాలంటీర్ శ్రీనివాసులు రూ.1000 పంపిణీలో అసమానతలు పాటిస్తుండటం గమనించిన ఆ గ్రామానికి చెందిన విశ్వనాధ రాజు వాలంటీర్ ను ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో వాలంటీరు తీవ్ర ఆగ్రహంతో ఆ వ్యక్తిపై కత్తితో మెడను నరికి కడుపు పైన రెండు కత్తిపోట్లు పొడిచి తీవ్రంగా గాయపరచాడు. అప్రమత్తమైన కుటుంబీకులు, స్థానికులు ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు తెలుస్తోంది.

దీపం పిలుపుపై వర్మ రూటే వేరు..!

కరోనా మహామ్మారిని దేశం నుండి పారద్రోలడానికి కేంద్రం తన వంతు చర్యలను ముమ్మురం చేసింది. ఈ వైరస్ నివారణ కోసం దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 21 రోజుల పాటు దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే కరోనాపై పోరాటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు తమవంతు సాయం చేయడంలో నిమగ్నమయ్యాయి. మరోవైపు ప్రధాని పిలుపు మేరకు ఇప్పటికే దేశ ప్రజలు చప్పట్లతో  మొదటిసారి సంఘీభావం తెలిపారు. నిన్న ఆదివారం రాత్రి 9 గంటల 9 నిమిషాలకు దేశ ప్రజలు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు   దీపాలు వెలిగించి కరోనా పై పోరులో దేశ ప్రజలంతా ఒక్కటే అని నిరూపించారు. పేదా, గొప్ప తేడా లేకుండా అందరు దీపాలు వెలిగించి దేశం విపత్కర పరిస్థితుల్లో మేమంతా ఒకటే అని పిలుపునిచ్చాయి.

అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ రాజకీయ నాయకులు, పలు సినీ, వాణిజ్య, క్రీడా ప్రముఖులు కూడా దీపాలు వెలిగించి తమ ఐక్యతను చాటారు. ఇక ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. మాత్రం వెరైటీగా స్పందించారు. ఐతే.. ఊరందరి  ఓ దారైతే.. తన రూటే సపరేటు అనేలా రామ్ గోపాల్ వర్మ ప్రవర్తించాడు. అందరూ ఇంట్లో దీపాలు వెలిగిస్తూ.. క్యాండిల్స్  వెలిగిస్తూ. టార్చిలైట్స్ ద్వారా తమ సంఘీభావం ప్రకటించారు. ఆ ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు. అయితే రామ్ గోపాల్ వర్మ మాత్రం లైటర్ ద్వారా సిగరెట్‌ ను వెలిగించుకున్న వీడియోను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.

దీంతో అటు మోడీ అభిమానులు, ఇటు వర్మ అభిమానులు అవాక్ అయ్యారు.

మాస్కూలు, రక్షణ కిట్లు కొట్టేస్తున్న వైసిపి నాయకులు


దాతలు ముందుకొచ్చి మాస్కులు, రక్షణ కిట్లు అందించాలి అని డాక్టర్లు లేఖలు రాసే పరిస్థితి రాష్ట్రంలో రావడానికి వైసిపి నాయకులు కారణమని టిడిపి అధికార ప్రతినిధి బుద్ధ వెంకన్న పేర్కొన్నారు. డాక్టర్లకు ఇవ్వాల్సిన మాస్కులు, రక్షణ కిట్లు వైకాపా నాయకులు కొట్టేస్తున్నారు అని పేపర్ లో చదివి ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి నెలకొందని ట్వీట్ చేశారు. ఏ 2 బుద్దులు ఎక్కడికి పోతాయి ఆ పార్టీ నాయకులు ఆఖరికి మాస్కులు, గ్లౌజులు కొట్టేసే స్థితికి దిగజారిపోయారని ఎద్దేవాచేశారు. కరోనా నియంత్రణకు ముందుండి పోరాడుతున్న డాక్టర్లకు, ఆసుపత్రి సిబ్బందికి మాస్కులు, వ్యక్తిగత రక్షణ కిట్లు లేకపోవడం దారుణమని తెలిపారు.

కరోనా అంత పెద్ద విషయం కాదు, పేరాసిట్మాల్ టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది, బ్లీచింగ్ వేస్తే వైరస్ చచ్చిపోతుందని అని ముఖ్యమంత్రి జగన్ చెబుతుంటే ఏ2, ఇతర వైసీపీ నాయకులు మాత్రం ఇన్ని జాగ్రత్తలు ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. దీనర్థం ప్రజలు ప్రాణాలు ఎలా పోయినా పర్వాలేదు మీరు మాత్రం బాగుంటే చాలు అనుకుంటున్నారని తెలిపారు.

ఐసోలేషన్‌ కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించండి


క్వారంటైన్లు, ఐసోలేషన్‌ కేంద్రాల్లో సదుపాయాలకు ఎలాంటి లోటు రాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం కరోనపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల్లో సరిపడా టెస్టు కిట్లు తెప్పించుకోవాలని సూచించారు.

ఐసీయూ బెడ్లకు సరిపడా వైద్య సిబ్బందిని నియమించాలన్నారు. రాష్ట్రంలో నమోదైన 266 కేసుల్లో 243 ఢిల్లీకి వెళ్లినవారు, వారి సన్నిహితులవని అధికారులు సీఎంకు వివరించారు. ఢిల్లీ వెళ్లిన వారు, వారి ప్రైమరీ కాంటాక్టులకు దాదాపు పరీక్షలు పూర్తయ్యాయన్నారు. దీని తర్వాత ఇంటింటి సర్వే ద్వారా లక్షణాలు ఉన్న వారికి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.

మరిన్నీ పరీక్షలు నిర్వహించేలా పరీక్షా కేంద్రాల సామర్థ్యాన్ని పెంచుకుంటామని అధికారులు తెలిపారు. రెడ్‌జోన్ల వారీగా క్లస్టర్లు విభజించి అక్కడ ర్యాండమ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

కరోనా విపత్తు వల్ల చీనీ, బత్తాయి, అరటి, టమోటా రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి నిధుల రూపంలో, ఇతరత్రా రూపంలో నూటికి నూరుపాళ్లు సహకారం అందిస్తానని అధికారులకు స్పష్టం చేశారు.

1092కు వచ్చే కాల్స్‌ పరిష్కారంపై దృషిపెట్టాలని, సంబంధిత అధికారులు పూర్తి బాధ్యత తీసుకోవాలన్నారు.

ఈ సమీక్షలో పాల్గొన్న మంత్రి మోపిదేవి వెంకటరమణ, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నితిన్ కి కోట్లు నష్టం చేసిన కరోనా


”లై , చల్ మోహన్ రంగ , శ్రీనివాస కళ్యాణం” వంటి మూడు వరుస అపజయాల తర్వాత `భీష్మ` చిత్రం తో బాక్సాఫీస్ దగ్గర బిగ్ హిట్ అందుకొని జోరు మీదున్న నితిన్ ఒకేసారి నాలుగు సినిమాలను లైన్లో పెట్టాడు.వాటిల్లో ఒకటి నితిన్ తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం బాలీవుడ్ `అంధాదున్ `చిత్రానికి రీమేక్. కాగా ఈ సినిమాకు సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. ఇకపోతే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ థ్రిల్లర్ చిత్రంలోనూ నటించబోతున్నాడు . ఇవీ రెండు కాకుండా కృష్ణ చైతన్య దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయాల్సి ఉంది. అలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న నితిన్ , మహమ్మారి కరోనా కారణం గా కోట్లు నష్ట పోయాడని తెలుస్తోంది. త్వరలో విడుదల కావాల్సిన తన కొత్త చిత్రం విషయం లో అలా జరిగిందట ..

ఇంతకీ అసలి విషయం ఏమిటంటే రాబోయే నితిన్ చిత్రాల్లో మొదటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తోన్న `రంగ్ దే` చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతోంది. కీర్తిసురేశ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం భీష్మ వంటి హిట్ సినిమా తరవాతి చిత్రం కావడంతో `రంగ్ దే ` కు మంచి బిజినెస్ ఆఫర్స్ వచ్చాయి. మరీ ముఖ్యంగా శాటిలైట్, డిజిటల్ హక్కులకు గాను ప్రముఖ జీ ఛానెల్ 10 కోట్ల రూపాయలను ఇవ్వడానికి రెడీ అయ్యింది. అయితే నిర్మాత సూర్యదేవర నాగవంశీ రూ.12 కోట్లు అడగడం, చివరకు డీల్ 11 కోట్లకు ఓకే అవ్వడం జరిగింది. అయితే కరోనా ఎఫెక్ట్ తో ఈ డీల్ అర్ధాంతరంగా ఆగి పోయింది . దరిమిలా నితిన్ ` రంగ్ దే `చిత్రం కోట్లు నష్ట పోయింది.

సీఎం జగన్ పై బీజేపీ నేతల ఆరోపణలు కరెక్టు కాదు

లాక్ డౌన్ ప్రభావంతో సామాన్యుడు బయటకు రాలేని పరిస్థితుల్లో ఉండటంతో పేదలకు నిత్యావసరాలతో పాటు వెయ్యి రూపాయలు చొప్పున ఆర్థిక సాయం పంపిణీ చేస్తున్న ఏపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సరికాదని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు హితవు పలికారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్టుగా సీఎం జగన్ చెప్పుకుంటున్నారంటూ బీజేపీ నేతలు ఆరోపణలు చేయడం కరెక్టు కాదని అన్నారు.

తెల్లరేషన్ కార్దుదారులకు వెయ్యి రూపాయల చొప్పున ఇస్తున్న డబ్బులు రాష్ట్ర ప్రభుత్వానివేనని, ఇందుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు కూడా ఇటీవల విడుదలయ్యాయని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనని భావిస్తున్న ప్రతిపక్షాలు ఇలాంటి బురదజల్లే కార్యక్రమాలు చేస్తున్నాయని మండిపడ్డారు. గ్రామ వాలంటీర్లు అవినీతికి పాల్పడ్డారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను రుజువు చేయాలని డిమాండ్ చేశారు. తెల్లరేషన్ కార్డుదారులకు వెయ్యి రూపాయలు పంపిణీ చేసే సమయంలో ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని వాలంటీర్లు చెబుతున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు.

పెద్దపులిని కూడా వదలని కరోనా!


చైనాలోని సోకిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. ఈ మహమ్మరి ఇప్పటివరకు మనుషులకు మాత్రమే సోకింది. తాజాగా జంతువుల్లోనూ కరోనా సోకుతున్నట్లు నిర్ధారణ అయింది. ఏకంగా కరోనా బారిన పెద్దపులి పడటం చర్చనీయాంశంగా మారింది. ప్రపంచంలో ఇప్పటివరకు 12లక్షల70వేలకు పైగా కరోనా కేసులు నమోదుకాగా 69వేలమంది మృతిచెందారు. ప్రస్తుతం కరోనా దాటికి అగ్రరాజ్యం అమెరికా విలవిలాడుతుంది. అమెరికాలో 3లక్షల కరోనా కేసులు నమోదుగా ఒక్క న్యూయార్క్ లోనే లక్ష పాజిటివ్ కేసులు దాటాయి.

న్యూయార్క్ లోని బ్రోంక్స్ జూలోని పెద్దపులికి కరోనా సోకింది. మలయన్ జాతికి చెందిన 4 ఏళ్ల ‘నదియా’ అనే ఆడ పులికి ఈ వైరస్ సోకినట్లు వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ అధికారులు పేర్కొన్నారు. ఈ నదియా దగ్గుతో బాధపడుతండటం చూసి అనుమానంతో టెస్టులు చేయగా కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. ఈ జూలోని మరో మూడు పులులు, మూడు ఆఫ్రికన్ సింహాలకు కూడా ఈ లక్షణాలు ఉన్నట్లు వారు గుర్తించారు.

కరోనా సోకిన పులులు, సింహాలు ఇప్పటికైతే బాగానే ఉన్నాయని.. అయితే తినడం బాగా తగ్గించినట్లు జూ అధికారులు తెలిపారు. జంతువుల ఆలనాపాలనా చూసే జూ ఉద్యోగి నుంచి వీటికి కరోనా సోకినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. న్యూయార్క్ లో వైరస్ వ్యాప్తి ఎక్కవగా ఉండటంతో బ్రోంక్స్ జూను మార్చి 16నుంచి మూసివేసినట్లు జూ అధికారులు తెలిపారు. జంతువులు కూడా కరోనా బారిన పడుతాయని అయితే వాటి నుంచి మనుషులు సోకడం తక్కవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

చెంచులకు చేయూతనిచ్చిన మంత్రి


ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం పరిధిలో నల్లమల అడవిలో రవాణా సౌకర్యం లేని చెంచు గూడేల లోని చెంచు కుటుంబాలకు పచ్చళ్ళు అందజేస్తున్నారు. ప్రతి కుటుంబానికి 500 గ్రాముల టమోటా, 500 గ్రాముల మామిడి పచ్చడి ని సరఫరా చేస్తున్నారు. యర్రగొండపాలెం లో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ క్యాంప్ కార్యాలయం లో వీటిని పంపిణీ చేశారు. గూడేల్లో తిరిగి అన్ని కుటుంబాలకు వీటిని పంపిణీ చేస్తామని మంత్రి సురేష్ కు అధికారులు తెలిపారు. గిరిజనులు ఆకలితో ఇబ్బంది పడకూడదని, ఇంకా అవసరమైన ఆహార పదార్దాలు సరఫరాకు చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు.

యర్రగొండపాలెం నియోజకవర్గం పరిధిలోని 5 మండలాల్లో (యర్రగొండపాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం, పెద్దారవీడు, పెద్ద దోర్నాల) మొత్తం 130 మంది ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి 25 కిలోల బియ్యం, 2 కిలోల కందిపప్పు, 1కిలో చెక్కర, 1లీటర్ నూనె అందజేశారు. జర్నలిస్టుల సమస్యల పరిస్కారంలో ముందుంటానని మంత్రి హామీ ఇచ్చారు. యర్రగొండపాలెం లో ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు స్థలం కేటాయింపుతో పాటు భవన నిర్మాణానికి అవసరమైన నిధులు కూడా మంజూరు కు కృషి చేస్తామని మంత్రి చెప్పారు.

ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సోమవారం పర్యటించారు. పారిశుధ్య కార్మికులకు గ్లౌజు లు, మాస్కులు, శానిటైజర్ లను పంపిణీ చేశారు. కూరగాయల అమ్మకాలు, ధరల వివరాలు పరిశీలించారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుందన్నారు.

పాకిస్తాన్ లో చైనా అండర్ వేర్ మాస్కులు!


కరోనా మహమ్మరి పేరు చెబితేనే ప్రపంచం బెంబెలెత్తిపోతుంది. చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా ప్రస్తుతం ప్రపంచంలోని అన్నిదేశాలకు పాకింది. ఈ మహమ్మరి దాటికి అగ్రరాజ్యాలు సైతం విలవిలలాడిపోతున్నాయి. కరోనాను చైనా లాక్డౌన్ వంటి కఠిన చర్యలు అమలు చేయడం ద్వారా కట్టడి చేయగలిగింది. అయితే చైనేతర దేశాలు కరోనా దాటికి అతలాకుతలం అవుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 12లక్షల70వేలకు పైగా కరోనా పాజిటిల్ కేసులు నమోదుకాగా 69వేల మంది మృతిచెందినట్లు తెలుస్తోంది.

ప్రపంచ దేశాలతోపాటు పాకిస్తాన్లోనూ కరోనా కేసులు రోజులు పెరిగిపోతున్నాయి. పాకిస్తాన్ పక్కనే ఉన్న చైనా ఆ దేశంలో కరోనా కట్టడికి సహకరిస్తామని తాజాగా ప్రకటించింది. అయితే చైనా దేశం పాకిస్తాన్ కు అందించిన సాయంపై కొత్త దుమారాన్ని రేపుతోంది. కరోనాను ఎదుర్కొనేందుకు నాణ్యమైన ఎన్-95 మాస్కులు పంపుతామని చెప్పిన చైనా ఆ దేశానికి అండర్ వేర్లను పంపింది.

పాక్‌కు చైనా దాదాపు రెండు లక్షల సాధారణ మాస్కులు, రెండు వేల ఎన్‌-95మాస్కులు, ఐదు వెంటిలేటర్లు, రెండు వేల కరోనా టెస్టింగ్ కిట్లు, రెండు వేల మెడికల్ సూట్లను పంపింది. వీటిని ప్రభుత్వం యంత్రాంగం ఆసుపత్రులకు పంపిణీ చేసింది. అయితే వీటిని తెరిచి చూసిన సిబ్బంది అవాక్కాయ్యారు. నాణ్యమైన ఎన్-95మాస్కులను పంపుతామని చెప్పిన చైనా తీరా అండర్ వేర్ మాస్కులను పంపడంపై పాక్ మీడియా బయట పెట్టి చైనాపై నిప్పులు చెరిగింది. ఇదిలావుంటే చైనా పంపించిన అండర్ వేర్ మాస్కులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పక్కా ప్లానింగ్ తో రెండో దశ లాక్ డౌన్?!

ప్రపంచాన్ని చుట్టేస్తున్న కరోనా ఒక్కసారిగా భారత్ పై పడి, అటు అధికారులను, ఇటు ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేయడంతో.. ఏమి పాలుపోని భారత్ యంత్రాంగం ఎటువంటి ముందస్తు ప్రణాళికలు లేకుండానే 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించడం జరిగింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిని గుర్తించిన ప్రభుత్వం అనుకున్నట్టుగానే ఏప్రిల్ 14న లాక్ డౌన్ ఎత్తేసి మరలా మే లో రెండో దశ లాక్ డౌన్ ను అమలు పరిచే సూచనలు కనిపిస్తున్నాయి.

ఈ విషయంపైనే ఏప్రిల్ 3న 16 మందితో కూడిన ‘గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్’ సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. దీనికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించగా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తదితరులు పాల్గొన్నారు.

ఈ మీటింగ్ అనంతరం కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఏప్రిల్ 14 న లాక్‌ డౌన్ ఎత్తేసిన తర్వాత…. మే 15 నుంచి రెండో దశ లాక్‌ డౌన్ విధిస్తే ఎలా ఉంటుందని కేంద్ర మంత్రుల మధ్య చర్చ వచ్చినట్లు సమాచారం. అయితే మొదటి దశ లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత ఏ దుకాణాలు తెరవాలి? ఏ దుకాణాలు మూసి ఉంచాలన్నది కూడా మంత్రులు మాట్లాడుకున్నారు. లాక్‌ డౌన్ ఎత్తేసినా సరే… నిత్యావసర సరుకుల దుకాణాలు తెరిచే ఉంచాలని,  అయితే ప్రజలు గుమిగూడటంపై మాత్రం నిషేధం కొనసాగించాలని వారు భావించినట్లు సమాచారం. సినిమా థియేటర్లు, ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు, ప్రార్థనా మందిరాలను మాత్రం తెరవకూడదన్న నిబంధన విధించాలని భావించారు

అయితే నిత్యావసరాలను అమ్మే మాల్స్‌కు, విమాన సర్వీసులకు అనుమతి ఇచ్చి, ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే విదేశీయులకు అనుమతులిస్తే ఎలా ఉంటుందన్న దానిపై కూడా చర్చ జరిగింది.  అయితే కరోనా వైరస్‌ తో బాగా ప్రభావితమైన ప్రాంతాల్లో మాత్రం వారం వారం సంతలకు అనుమతి ఇవ్వకూడదని, రాష్ట్రమంతటా కోవిడ్ – 19 పై అవగాహన కల్పించేందుకు అన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక అధికారులను నియమించాలని మంత్రులు భావించారు.

మరోవైపు క్వారంటైన్‌ లో ఉంటున్న వారిని జీపీఎస్ ట్రాకర్స్ ద్వారా ఎప్పటికప్పుడు అధికారులు, బాధ్యులు పర్యవేక్షించాలని, అయితే ఇది ఎంత వరకు సాధ్యమనేది మంత్రులు చర్చించారు.

ఇకపోతే ‘వర్క్ ఫ్రం హోం’ చేసే ఉద్యోగులకు మరో నెల పాటు ఇదే వసతి కొనసాగిస్తే బాగుంటుందని మంత్రులు అభిప్రాయపడినట్లు సమాచారం. ఇక ఆసుపత్రుల్లో కూడా అత్యధికంగా రద్దీ లేకుండా ఆయా యాజమాన్యాలే బాధ్యత వహించేలా చూడాలని మంత్రుల బృందం భావించినట్లు సమాచారం.

చిరంజీవిని తప్పు పట్టొద్దు అన్న తమ్మారెడ్డి


ఒక్కోసారి మంచి పనులు చేస్తూ కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రసుతం మెగా స్టార్ చిరంజీవి అలాంటి పరిస్థితే పేస్ చేసాడు. కరోనా ఎఫెక్ట్ తో లాక్ డౌన్ అమలు అవుతున్న కారణంగా తెలుగు సినీ పరిశ్రమ స్తంభించి పోయింది. దాంతో షూటింగ్ లతో పాటు చిత్ర రంగానికి చెందిన కార్యకలాపాలన్నీ ఆగిపోయాయి. ఆ క్రమంలో తీవ్ర ఇబ్బందుల పాలవుతున్న సినీ కార్మికులను ఆదుకోవడానికి చిరంజీవి నేతృత్వంలో విరాళాల సేకరణ మొదలుపెట్టడం జరిగింది. ” కరోనా క్రైసిస్ చారిటీ” పేరుతో జరుగుతున్న ఈ కార్యక్రమం కోసం చిరంజీవి చారిటబుల్ ట్రస్టు విరాళాలు సేకరించడం జరిగింది.

తెలుగు సినీ పరిశ్రమ తరఫున జరుగుతున్న కార్యక్రమానికి చిరంజీవి ట్రస్టు ద్వారా విరాళాలు సేకరించడం ఏంటి అని కొందరు విమర్శించారు. ఆ క్రమంలో నందమూరి బాలకృష్ణ కూడా నొచ్చుకున్నట్లు తెలిసింది.

ఐతే దీని వెనుక ఉన్న అసలు కారణం సినీ పెద్దల్లో ఒకరైన తమ్మారెడ్డి భరద్వాజ విపులంగా చెప్పారు. ప్రస్తుతం ఉన్న లాక్ డౌన్ కారణంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పాక్షికంగా పని చేస్తున్నాయని.. ఈ సమయంలో కొత్తగా కరోనా చారిటీ కోసం ట్రస్టు పెట్టడం సాధ్యం కాలేదని.. దీంతో చిరంజీవి ట్రస్టు ద్వారా విరాళాల సేకరణ జరుగుతోందని సవివరంగా తెలిపారు.