
కరోనా మహమ్మరి పేరు చెబితేనే ప్రపంచం బెంబెలెత్తిపోతుంది. చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా ప్రస్తుతం ప్రపంచంలోని అన్నిదేశాలకు పాకింది. ఈ మహమ్మరి దాటికి అగ్రరాజ్యాలు సైతం విలవిలలాడిపోతున్నాయి. కరోనాను చైనా లాక్డౌన్ వంటి కఠిన చర్యలు అమలు చేయడం ద్వారా కట్టడి చేయగలిగింది. అయితే చైనేతర దేశాలు కరోనా దాటికి అతలాకుతలం అవుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 12లక్షల70వేలకు పైగా కరోనా పాజిటిల్ కేసులు నమోదుకాగా 69వేల మంది మృతిచెందినట్లు తెలుస్తోంది.
ప్రపంచ దేశాలతోపాటు పాకిస్తాన్లోనూ కరోనా కేసులు రోజులు పెరిగిపోతున్నాయి. పాకిస్తాన్ పక్కనే ఉన్న చైనా ఆ దేశంలో కరోనా కట్టడికి సహకరిస్తామని తాజాగా ప్రకటించింది. అయితే చైనా దేశం పాకిస్తాన్ కు అందించిన సాయంపై కొత్త దుమారాన్ని రేపుతోంది. కరోనాను ఎదుర్కొనేందుకు నాణ్యమైన ఎన్-95 మాస్కులు పంపుతామని చెప్పిన చైనా ఆ దేశానికి అండర్ వేర్లను పంపింది.
పాక్‌కు చైనా దాదాపు రెండు లక్షల సాధారణ మాస్కులు, రెండు వేల ఎన్-95మాస్కులు, ఐదు వెంటిలేటర్లు, రెండు వేల కరోనా టెస్టింగ్ కిట్లు, రెండు వేల మెడికల్ సూట్లను పంపింది. వీటిని ప్రభుత్వం యంత్రాంగం ఆసుపత్రులకు పంపిణీ చేసింది. అయితే వీటిని తెరిచి చూసిన సిబ్బంది అవాక్కాయ్యారు. నాణ్యమైన ఎన్-95మాస్కులను పంపుతామని చెప్పిన చైనా తీరా అండర్ వేర్ మాస్కులను పంపడంపై పాక్ మీడియా బయట పెట్టి చైనాపై నిప్పులు చెరిగింది. ఇదిలావుంటే చైనా పంపించిన అండర్ వేర్ మాస్కులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.