Home Blog Page 8546

డీలర్లకు తలనొప్పిగా మారిన రేషన్ పోర్టబిలిటీ!

దేశ వ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటి దగ్గరే ఉండే పేద ప్రజలకు రేషన్ బియ్యం ఇవ్వడానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రణాళికలు రచించారు. ఇందులో భాగంగా రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే బియ్యం చేస్తున్నారు. అయితే రేషన్‌ కోసం లబ్ధిదారులు ఎగబడటం, కనీసం మాస్క్‌ లు కూడా ధరించకపోవడంతో రేషన్ షాప్ డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దీనికి తోడు లబ్ధిదారులకు రేషన్‌ పోర్టబిలిటీ అవకాశం ఉండటంతో ఈ ముప్పు మరింత పెరిగింది. వివిధ జిల్లాలకు చెందినవారు సమీప నగరాలలో నివాసం ఉండటంతో ఆయా నగరాలలో పోర్టబిలిటీ ద్వారా రేషన్‌ తీసుకునే వెసులుబాటు ఉంది. కానీ ఈ–పాస్‌ డాటాలో సాంకేతిక సమస్యల కారణంగా పోర్టబిలిటీలో బయోమెట్రిక్‌ గుర్తింపు సమస్యగా తయారైంది. దీంతో లబ్ధిదారులకు నిరాశ తప్పడం లేదు. జిల్లా, రాష్ట్ర స్థాయి పోర్టబిలిటీ తీరు ఇలా ఉంటే జాతీయ పోర్టబిలిటీ అంటే ఒక రాష్ట్రం వారు మరో రాష్టంలో ఉండి రేషన్ తీసుకోవాలంటే పోర్టబిలిటీ వ్యవస్థ అసలుకే పనిచేయడం లేదు.

లాక్ డౌన్ పొడిగింపుకు రంగం సిద్ధం చేస్తున్న కేసీఆర్


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన మూడు వారల లాక్ డౌన్ గడువు మరో వారంలో ముగుస్తున్న సమయంలో దీనిని మరొకొన్ని రోజులు పొడిగించాలని సూచించడం ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు జాతీయ స్థాయిలో ప్రజాభిప్రాయం అందుకు అనుగుణంగా మలచడానికి కారణమవుతున్నారు.

గత వారం ముఖ్యమంత్రులతో జరిపిన వీడియో కాంఫరెన్సులో లాక్ డౌన్ తర్వాత తీసుకోవలసిన చర్యలపై దృష్టి సారించమని ప్రధాని, లాక్ డౌన్ సడలింపు గురించి కేంద్ర మంత్రుల బృందం సమాలోచనలు చేస్తున్నల్టు కధనాలు వెలువడుతూ ఉండడంతో ఏప్రిల్ 14న పరిస్థితులలో కొంత సడలింపు తధ్యం అని ప్రజలందరూ ఎదురు చూడడం ప్రారంభించారు.

అయితే ఇప్పుడు సడలిస్తే మూడు వారల లాక్ డౌన్ ద్వారా సాధించిన ఫలితాలు వృద్దాకాగలవని కేసీఆర్ హెచ్చరించడంతో దేశ ప్రజల దృష్టిని ఆ దిశలో మలిచిన్నట్లు అయింది. దానితో ఒక విధంగా ఇప్పుడు లాక్ డౌన్ పొడిగించక కేంద్రానికి తప్పని పరిస్థితి ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనీసం ఏప్రిల్ ఆఖరి వరకు పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రధాన మంత్రి మూడు వరాల లాక్ డౌన్ ను ప్రకటించడానికి ముందే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్ డౌన్ అమలులోకి తెచ్చారు. మొదట్లో లాక్ డౌన్ పట్ల ప్రజలు కొనసా అసహనంగా కనిపించినా ఐరోపా, అమెరికాలలో జరుగుతున్న విధ్వంసక పరిణామాలను చూస్తున్నప్పుడు ఇది సరైన చర్య అనే అభిప్రాయం బలపడింది. మరో వారం ముందే ప్రకటించి ఉంటె బాగుండేదిదని కూడా కొందరు చెప్పుకొంటూ వచ్చారు.

లాక్ డౌన్ అమలులోకి వచ్చాక మొదటి వారంలోనే దేశం కరోనా కట్టడిలో కీలకమైన అడుగు వేసిన్నట్లు అయింది. ఏప్రిల్ 7 తర్వాత తెల్నగణలో కరోనా వైరస్ ఉనికి ఉండబోదని అంటూ కేసీఆర్ ప్రకటించారు కూడా. అయితే ఇంతలో తబ్లిగ్ జమాత్ సదస్సు నుండి తిరిగి వచ్చిన వారు పెద్ద ఎత్తున వైరస్ ను దేశ వ్యాప్తంగా వ్యాప్తి చేయడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. గత వారం రోజులుగా దేశమో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు ఎక్కువగా వీరివి కావడం గమనార్హం.

పైగా, వీరు తగు పరీక్షలకు, చికిత్సలకు సహాయ నిరాకరణ ధోరణి అవలంభిస్తూ ఉండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో శ్రమ పడవలసి వస్తున్నది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొనే లాక్ డౌన్ పొడిగిపు గురించి కేసీఆర్ సూచించడం దేశ ప్రజలను ఆకట్టుకొంటున్నది.

ఇలా ఉండగా, లాక్‌డౌన్ ఎత్తివేతకు ఉత్తర ప్రభుత్వం కూడా విముఖంగా ఉంది. కోవిడ్-19 కేసులు ఉత్తరప్రదేశ్‌లో ఒక్కటి కూడా నమోదు కాని పక్షంలో మాత్రమే లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆయన యూపీ ప్రభుత్వ అదనపు చీఫ్ సెక్రటరీ అవనీష్ అవస్తి స్పష్టం చేశారు. యూపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో యోగి సర్కార్ లాక్‌డౌన్ ఎత్తివేతకు సిద్ధంగా లేదు.

పవన్ తో అనుష్క..


తాజాగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో ఒకటి `వకీల్ సాబ్ ` కాగా రెండోది ఒక పిరియాడికల్ మూవీ. . పంతొమ్మిదో శతాబ్దానికి చెందిన పండగ సాయన్న అనే ఒక పోరాటా యోధుడి కథ ఇది అని తెలుస్తోంది.
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నిర్మించ బడే ఈ పిరియాడికల్ మూవీని గౌతమీపుత్ర శాతకర్ణి ఫేమ్ క్రిష్ రూపొందించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. కాగా ఇది నిజాం కాలంతో ముడిపడిన కథ అని తెలుస్తోంది. ఇక ఈ చిత్రం లో పవర్ స్టార్ బందిపోటు గా నటిస్తాడని , రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవన్ కల్యాణ్ కనిపించనున్నాడని అంటున్నారు.

ఈ సినిమాలో కథానాయిక పాత్రకిగాను రక రకాల పేర్లు వినిపిస్తున్నాయి. ఒక దశలో కీర్తి సురేశ్ పేరు వినిపించింది. ఆ తరువాత బాలీవుడ్ నటి జాక్విలిన్ ఫెర్నాండేజ్ పేరు తెరపైకి వచ్చింది. ఇక జాక్విలిన్ ను ప్రత్యేకమైన పాట కోసం గానీ ..ప్రత్యేక పాత్ర కోసం గాని తీసుకున్నారేమో అంటున్నారు.అలాగే ఒక ప్రత్యేక పాటకోసం తెలుగమ్మాయి పూజిత పొన్నాడ ని కూడా తీసుకోవడం జరిగింది. ఆమెపై ఒక పాట కూడా చిత్రీకరించారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో కథానాయికగా తాజాగా అనుష్క పేరు వినిపిస్తోంది. గతంలో క్రిష్ దర్శకత్వంలో అనుష్క ‘వేదం’ సినిమా చేసింది. ఆ సినిమాలో ఆమె పోషించిన పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది. దాంతో పవన్ కళ్యాణ్ సినిమాలో అనుష్క అయితే సరిగ్గా సరిపోతుందనే ఉద్దేశంతో క్రిష్ ఆమెను తీసుకున్నాడని అంటున్నారు.

సిసిసి కి 3 లక్షలు ఇచ్చిన ఒరేయ్ బుజ్జిగా నిర్మాత


తెలుగు సినీ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ` కరోనా క్రైసిస్ చారిటీ `( సి సి సి ) కి విరాళాలు ఇంకా వస్తూనే ఉన్నాయి. తాజాగా ఒరేయ్ బుజ్జిగా నిర్మాత కె. కె. రాధా మోహన్ తన వంతుగా మూడు లక్షలు విరాళం ఇవ్వడం జరిగింది. కాగా సోమవారం నుంచి విరాళాల ద్వారా వచ్చిన డబ్బుతో సినీ కార్మికులకు నిత్యావసరాలు ఏర్పాటు చేసే కార్యక్రమం మొదలైంది. ఈ చారిటీ ద్వారా రోజువారీ వేతనం తో బతికే సినీ కార్మికులకు ఒక నెలకు సరిపడా సరుకులు అందజేయడం జరుగుతుంది.

అదలా ఉంటే యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా దర్శకుడు కొండా విజ‌య్‌కుమార్ దర్శకత్వంలో రాబోతున్న‘ఒరేయ్ బుజ్జిగా’ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్త్తి చేసుకొని విడుదలకు రెడీ అవుతోంది .కాగా కరోనా దెబ్బకు రిలీజ్ డేట్ ను పోస్ట్ ఫోన్ చేసుకున్న ఈ చిత్రాన్ని జూన్ ఫస్ట్ వీక్ లో విడుద‌ల‌ చేయాలని నిర్మాత కె. కె. రాధా మోహన్ .ప్లాన్ చేస్తున్నారు. కాగా ఈ చిత్రంలో హెబ్బా పటేల్‌, వాణీ విశ్వనాథ్‌సీనియర్ నరేష్‌, పోసాని కృష్ణమురళి వంటి తారలు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఇక ఈ చిత్ర నిర్మాత కె.కె. రాధామోహన్‌ గతంలో తన శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకం పై `ఏమైంది ఈ వేళ‌`, `బెంగాల్ టైగ‌ర్‌` వంటి హిట్ చిత్రాల‌ను నిర్మించడం జరిగింది. రీసెంట్‌ గా కార్తి నటించిన ” ఖైదీ ”చిత్రాన్ని తెలుగులో అనువదించి బ్లాక్‌ బ‌స్ట‌ర్ హిట్‌ అందుకున్నారు ఇక `ఒరేయ్ బుజ్జిగా ` చిత్ర దర్శకుడు

‘గుండె జారి గల్లంతయ్యిందే’, ‘ఒక లైలా కోసం’ వంటి రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్స్‌ను గతం లో అందించిన నేపధ్యం లో ఈ చిత్రాన్ని కూడా మంచి ఎంటర్టైనర్ గానే తీర్చి దిద్దాడని అంటున్నారు .

కరోనా మహమ్మారి వ్యాప్తి లో చైనా పై నీలి నీడలు

చైనా పై రోజు రోజు కీ ఆగ్రహం ప్రపంచమంతటా కట్టలు తెంచుకుంటుంది. ఇది ముందు ముందు ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో ఇప్పుడే చెప్పలేము. కాకపోతే ఈ కోపం ప్రజలనుంచి ప్రభుత్వాలకు కూడా పాకింది. చైనా పై ఇంతకుముందెన్నడూ ఇంతటి వ్యతిరేకతను చూడలేదు. భారత్ లో 1962 నుంచి చైనా పై ప్రజల్లో సదభిప్రాయంలేదు. ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. దీనికి కారణాలేమిటో ఒక్కసారి పరిశీలిద్దాం.

కరోనా మహమ్మారి విస్తరణలో చైనా పాత్రపై అనుమానాలు

చైనా లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న మానవ హననం అందర్నీ కలిచివేస్తుంది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా చైనా పై నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. కారణం ఇది చైనా లో పుట్టినందుకు కాదు. దాని పుట్టుక, విస్తరణ, ప్రభుత్వ గోప్యత ప్రధానంగా ఈ నిరసనలు రగులుతున్నాయి. ముందుగా ఈ వైరస్ చైనా ఊహాన్ తడి మార్కెట్టులో పుట్టటం పైనే అనేక అనుమానాలున్నాయి. కొంతమంది అసలు ఇది తడి మార్కెట్టులో పుట్టలేదని, ఊహాన్ ల్యాబ్ లో ప్రయోగాల విఫలంలో జన్మించిందని నమ్ముతున్నారు. మరికొంతమంది ఇది కెనడా ల్యాబ్ నుంచి ఊహాన్ ల్యాబ్ కి వచ్చిందని అక్కడినుంచి ప్రభుత్వ నియంత్రణలోనే పద్దతిగా విస్తరించిందని నమ్ముతున్నారు. ఆ ఆరోపణలతో అంతర్జాతీయ న్యాయ స్థానం లో కేసు దాఖలు చేయటం జరిగింది. దీని విస్తరణ పై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా ఇది హద్దులులేని పద్దతుల్లో వ్యాప్తి చెందేటట్లయితే చైనా లోని మిగతా ప్రాంతాలకు ఎందుకు విస్తరించలేదని కూడా ప్రశ్నిస్తున్నారు. జనవరి 21వ తేదీ ప్రపంచానికి తెలిసే లోపు కరోనా సోకిన వ్యక్తులు ఊహాన్ నుంచి ప్రపంచదేశాలకు ఎలా వెళ్ళారో అలానే చైనా లోని మిగతా ప్రాంతాలకు కూడా వెళ్ళారు కదా. అటువంటప్పుడు అతిపెద్ద నగరాలైన షాంఘై, బీజింగ్ లకు విస్తరించకుండా వుండే అవకాశాలు లేవు.

ఇక చైనా ప్రభుత్వ గోప్యతపై ఎంత తక్కువమాట్లాడితే అంత  మంచిది.కాకపోతే ఇప్పుడు జరుగుతున్న ఘోరకలిచూస్తూ కూడా మాట్లాడకపోతే ప్రపంచానికి, మానవాళికి అన్యాయం చేసిన వాళ్ళమవుతాం. ముందుగా ఈ వైరస్ విషయం లో చైనా ప్రభుత్వం ఎందుకంత రహస్యం గా వుంచిందనేది అంతుచిక్కని విషయం. మొట్టమొదటగా నవంబరులో బయటకు వచ్చిన తర్వాత డిసెంబరులో అనేక ప్రయోగశాలల్లో ఈ కొత్త వైరస్ గురించి వెలుగులోకి వచ్చింది. చైనా డాక్టర్ లి ఉదంతం అందరికీ తెలిసిందే. తను బయటపెట్టిన దగ్గర్నుంచి తన మీద ఎంతటి ఒత్తిడి తెచ్చారో చివరకి తను తప్పుచేసినట్లుగా బలవంతపు అఫ్ఫిడవిట్ఇప్పించారో కూడా ప్రపంచానికి తెలుసు. ఆ తర్వాత ౩ వారాల్లో అదే వైరస్ సోకి ఆయన మరణించటం తో చైనా లోనే నిరసనలు పెల్లుబికాయి. అయితే చైనా లో వున్నకేంద్రీకృత వ్యవస్థ వలన ప్రజలు స్వేచ్చగా అభిప్రాయాలు వ్యక్తపరచలేక పోవటం అందరికీ తెలిసిందే. ముందుగా సమాచారాన్ని నియంత్రించటం, నిరసనకారుల్ని నిర్బంధించటం, ఆ తర్వాత ప్రభుత్వ సమాచార వ్యవస్థ ద్వారా, పార్టీ ద్వారా సానుకూల వాతావరణాన్ని తయారు చేసుకోవటం చైనా చరిత్ర తెలిసిన ఎవరికీ ఆశ్చర్యాన్ని కలిగించదు. ఈ ఉదంతం లో చైనా కమ్యునిస్టు పార్టీ అధ్వర్యానే సమాచార నిర్బందాన్ని కొనసాగించటం అనేక అనుమానాలకు తావిస్తుంది. మిగతా ప్రయోగ శాలల్లో దొరికిన నమూనాలన్నీ నాశనం చేయమని చెప్పటంతో ఇందులో ఏదో జరగరానిది జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చివరకు ఊహాన్ లో మనుషులు రోడ్డు మీద పడిపోవటం చూపే వీడియో లు లీక్ అయ్యి తప్పనిపరిస్తితుల్లో చైనా ప్రభుత్వం ప్రకటన చేసేవరకు జరిగిన ప్రహసనం పై ఎన్నో కధనాలు ప్రపంచవ్యాప్తంగా వెలువడుతున్నాయి. వీటిపై ప్రపంచానికి చైనా వివరణ ఇవ్వాల్సి వుంది.

అసలు చైనా లో వ్యాధిసోకిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు ఎంతమంది అనేదాంట్లో కూడా ప్రపంచానికి సందేహాలున్నాయి. ఇటీవలే చైనా డాక్టర్ ఒకావిడ ఇచ్చిన సమాచారం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మాదగ్గర ఐ సి యు బెడ్లు లేక చనిపోయిన వాళ్ళు ఎక్కువమంది వున్నారని చెప్పింది. రెండోది, చనిపోయిన వాళ్ళ నందరినీ కరోనా వ్యాధి కి బయటచూపించటం వలన ప్రభుత్వ లెక్కలు నిజాన్ని బయటపెట్టటం లేదనే వార్తలు వస్తున్నాయి. అందుకనే హాస్పిటల్ వర్గాలు దీనిపై నోరువిప్పవద్దని హెచ్చరించింది. ప్రజాస్వామ్య దేశమైన  మనదగ్గరే పశ్చిమ బెంగాల్ లో ఇలా లెక్కలు మార్చి చూపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్న నేపధ్యం లో చైనా లాంటి నియంతృత్వ దేశం లో ఇటువంటివి జరగటం పెద్ద విశేషమేమీ కాదు. ఇంకొన్ని వార్తలు వింటే వెన్నులో వణుకు పుడుతుంది. స్మశానాల్లో పేరుకుపోయిన 40 వేలకుపైగా బూడిద పాత్రలు, ఒక్కసారి లక్షకుపైగా పడిపోయిన ఫోన్ల సంఖ్య వార్తల్లో నిజానిజాలు బయటకు రావాల్సిన అవసరం ఎంతయినా వుంది.

ప్రపంచవ్యాప్త నిరసనలు

ప్రపంచం మొత్తం ప్రస్తుతం కరోనా మహమ్మారి ని అరికట్టం లో నిమగ్నమై వుంది. ఈ పని పూర్తయిన తర్వాత చైనా చేసిన నిర్వాకంపై అన్ని దేశాలు విరుచుకుపడే అవకాశముంది. ఇప్పటికే ఎన్నో దేశాల్లో దీనిపై కార్యాచరణలు మొదలయ్యాయి. ఆస్ట్రేలియా ఇప్పటికే చైనా తడి మార్కెట్లపై ఐక్యరాజ్యసమితి కి కంప్లయింట్ ఇచ్చింది. జపాన్ ప్రభుత్వం ప్రపంచ ఆరోగ్య సంస్థపై విరుచుకు పడింది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ నా లేక చైనా ఆరోగ్యసంస్థ నా అని ఎద్దేవా చేసింది. ఇంతజరుగుతుంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాకు ఎందుకు కొమ్ము కాసిందో చెప్పాలని డిమాండ్ చేసింది. చివరివరకు చైనా ఏం చెబితే ఆ చిలక పలుకులే ఎందుకు మాట్లాడిందో వివరణ ఇవ్వాలని కోరింది. అమెరికా  అధ్యక్షుడయితే చైనా చరిత్రలో పెద్ద తప్పు చేసిందని వ్యాఖ్యానించాడు. బ్రిటన్ లో ప్రఖ్యాత చెందిన సంస్థ జి 7 దేశాలకు కంప్లయింట్ సమర్పించింది. అమెరికాలోని టెక్సాస్ జిల్లా కోర్టు లో దీనిపై కేసు వేసారు. చైనా పాత్రపై అనుమానాలున్నా ఏమి చేయాలో తెలియక ప్రజలు సతమతమవుతున్నారు. ఈ కరోనా మహమ్మారి సమసిపోయిన తర్వాత చైనా పై పరిణామాలు తీవ్రంగానే ఉంటాయనేది విశ్లేషకుల అంచనా.

చైనా పాత చరిత్ర కూడా ఇటువంటిదే

చైనా ను గురించి బయట ప్రపంచానికి తెలిసింది తక్కువ. ఆధునిక చైనా నిర్మాత సన్ యట్ సేన్ గొప్ప దేశ భక్తుడు, ప్రజాస్వామ్యవాది కూడా. చాంగై షేక్ చేతిలోకి పార్టీ వచ్చిన తర్వాత అది పూర్తి గా దిగజారింది. జపాన్ సామ్రాజ్యవాదం తో మిలాఖతయ్యింది. ఆ దశలో చైనా కమ్యూనిస్టు పార్టీ మావో సే టుంగ్ నాయకత్వాన స్వాతంత్ర  పోరాటం చేసి అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇందుకు రష్యా తనవంతు పాత్ర పోషించింది. ఆ తర్వాత అదే రష్యా కి వ్యతిరేకంగా కమ్యునిస్టు ఉద్యమం లో చీలిక తీసుకొచ్చింది. మావో సే టుంగ్ అధ్వర్యంలో తీసుకున్న “గొప్ప ముందడుగు (Great Leap Forward)”   కార్యక్రమం లో ఎన్నో లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. గొప్ప ముందడుగల్లా  గొప్ప దుందుడుకు గా చరిత్రలో నిలిచి పోయింది. అయినా దానిపై సానుకూల వార్తలే ప్రచారం లో పెట్టగలిగారు. జరిగిన మానవ ఘోరకలి క్రమ క్రమేనా నే ప్రపంచానికి తెలిసింది.

అసలు చైనా ని అమెరికా కమ్యునిస్టు రష్యా ని దెబ్బతీయటానికి దగ్గరకు తీసింది. రష్యా కి వ్యతిరేకంగా చైనా ని దువ్వి ఆ రెండింటి మధ్య చీలికని ప్రోత్సహించింది. రష్యా లో కమ్యునిస్టు వ్యవస్థ కుప్పకూలేవరకు చైనా రష్యా కి వ్యతిరేకంగానే వుంది. అంటే తన స్వంత ప్రయోజనాలకోసం అమెరికా పంచన చేరి రష్యా ని , దాని ప్రభావాన్ని తగ్గించటానికి పరోక్షంగా సాయ పడింది. ఇది చరిత్ర. అలాగే తోటి కమ్యూనిస్టు దేశమైన వియత్నాం పై యుద్దం చేసింది. చైనా ని గురించి చెప్పాల్సి వస్తే అది అంతర్జాతీయ దృక్పధం కన్నా జాతీయ వాదం తోనే నడుస్తూ వచ్చింది. జాతీయ వాదం పేరుతో స్వతంత్ర దేశమైన టిబెట్టు ని బలవంతంగా ఆక్రమించింది. వాయవ్య సరిహద్దు లోని జింజియంగ్ ప్రావిన్సు లోని ముస్లింలు చైనా సంస్కృతి ని పాటించటం లేదని వారి మసీదులపై నియంత్రణ పేరుతో వారి రోజువారి వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుంది. చివరకు పేర్లు కూడా వాళ్ళ ఇష్ట ప్రకారం పెట్టుకోకుండా చేసింది. పది లక్షల మందిని  శిబిరాలకి తరలించి పునర్విద్య పేరుతో వాళ్ళను , వాళ్ళ మతం నుంచి వేరుచేసే ప్రయత్నం చేస్తుంది. అయినా బయట ప్రజలకు మానవ హక్కుల గురించి నీతులు వల్లిస్తూనే వుంది.

ఇక భారత్ విషయాని కొస్తే మొదట్నుంచీ భారత్ వ్యతిరేక ధోరణి నే కొనసాగిస్తుంది. దక్షిణాషియా లో భారత వ్యతిరేక కూటమి ని ప్రధాన ఇరుసు గా రాజకీయాలు చేస్తుంది. జమ్మూ-కాశ్మీర్ లోని 20 శాతం భూభాగాన్ని ఆక్రమించుకుంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగం గుండా చైనా-పాకిస్తాన్ ఆర్ధిక నడవా నిర్మిస్తుంది.  విశేషమేమంటే ఐక్యరాజ్యసమితి లో చైనా శాశ్వత సభ్యత్వం కోసం భారత్ తనవంతు పాత్ర పోషిస్తే ఇప్పుడు భారత్ కి అందులో స్థానం రాకుండా మొకాలడ్డుకుంటుంది. చైనా తో స్నేహం కోసం నెహ్రు పరితపించేవాడు. డాక్టర్ రామ్ మనోహర్ లోహియా మొదట్నుంచీ చైనా వైఖరి పై హెచ్చరిస్తూనే వచ్చాడు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే చైనా ఈ రోజేకాదు మొదట్నుంచీ పైకి చెప్పేదానికి లోపల చేసే దానికీ పొంతన వుండేది కాదని చరిత్ర చెబుతుంది.

మరి ఇప్పుడు ఏం జరగబోతుంది?

కరోనా మహమ్మారి తదనంతర పరిస్థితుల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. అవి ఏ దిశగా ఉంటాయనేది ఇప్పుడే చెప్పటం కష్టం. కొంతమంది చైనా అమెరికా స్థానం లో ప్రపంచ నాయకత్వ స్థానానికి ఎదుగుతుందని అంచనా వేస్తున్నారు. మరికొంతమంది చైనా కి వ్యతిరేకంగా అన్ని దేశాలు ఏకమవుతాయని చెబుతున్నారు. కానీ ఇప్పటికే చాలా మందికి భారతదేశం లో అర్ధంకాని విషయం చైనా ఇప్పటికే అమెరికా స్థానాన్ని చాలా విషయాల్లో భర్తీ చేస్తూ వెళ్తుందని. మొత్తం ఆఫ్రికా దేశాల్లో చైనా ఈ రోజు అత్యంత ప్రభావిత దేశం. యూరోప్ లో కూడా చాలా ముందుకు చొచ్చుకు పోయింది. అతెందుకు భారత్ పొరుగు దేశాల్లో చైనా చాలా లోతైన సంబంధాలు పెట్టుకోగలిగింది. అమెరికా నయా వలస వాద ధోరణులను వ్యతిరేకించే మిత్రులు గ్రహించాల్సింది ఏమిటంటే చైనా ఈ రోజు అమెరికా స్థానాన్ని భర్తీ చేసి అతిపెద్ద నయా వలసవాద దేశంగా తయారయ్యిందనేది. మారుతున్న ప్రపంచ రాజకీయ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పసిగట్టకపోతే అంచనాలలో, ఆలోచనల్లో తప్పటడుగులు వేయటం సహజం. ఇప్పుడు భారత దేశం లోని చైనా మిత్రుల పరిస్థితి అదే. వచ్చే కొద్ది నెలల్లో ఏమి జరుగుతుందో వేచి చూద్దాం.

తెలంగాణ ప్రభుత్వానికి ఆదిత్య మ్యూజిక్ విరాళం


తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా ప్ర‌భావం రోజు రోజుకి తీవ్రమౌతోంది. అందుకు తగ్గట్టుగానే తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు సైతం నివార‌ణ కార్య‌క్ర‌మాలు చేపడుతున్నాయి. ప్ర‌‌భుత్వం తీసుకుంటున్న నివార‌ణ చ‌ర్య‌ల‌కు మ‌ద్ధ‌త్తుగా ప‌లువురు పారిశ్రామికవెత్త‌లు, సినీ ప్ర‌ముఖులు భారీ ఎత్తున ఆర్ధిక స‌హకారం అందిస్తున్నారు. ఆ క్రమంలో ప్ర‌ముఖ సంగీత సంస్థ `ఆదిత్య మ్యూజిక్ ` క‌రోనా నివార‌ణ‌కు త‌మ వంతుగా ఆర్ధిక స‌హ‌కారం అందించడం జరిగింది .

ఆదిత్య మ్యూజిక్ అధినేత‌లు ఉమేశ్ గుప్త‌, సుభాష్ గుప్త‌, దినేశ్ గుప్త‌, ఆదిత్య గుప్త‌లు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి క‌ల్వ‌కుంట్ల తారక‌ రామారావు గారిని క‌లిసి సీఎం రిలీఫ్ ఫండ్ కు 31 లక్షలు విరాళం అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో వీరితో పాటు తెలంగాణ సినిమాటోగ్రాఫి శాఖ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాదవ్ కూడా పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఆదిత్య మ్యూజిక్ మేనెజింగ్ డైరెక్ట‌ర్ ఉమేశ్ గుప్తా మాట్లాడుతూ క‌రోనా కార‌ణంగా యావ‌త్ మాన‌‌వాళి ఇబ్బందుల్లో ప‌డింది. కరోనా మ‌హ‌మ్మారి నివార‌ణ‌కు రాష్ట్ర ప్ర‌భుత్వాలు తీసుకుంటున్న నివార‌ణ చ‌ర్య‌లు చాలా అభినంద‌నీయం. ‌ఇలాంటి క్లిష్ట స‌మ‌యంలో తమ ప్రాణాల్ని లెక్క చేయ‌కుండా పోలీసులు, వైద్య, శానిట‌రీ సిబ్బంది నిరంత‌రం శ్ర‌మిస్తున్నారు. వారిని కాపాడుకోవడం మ‌నంద‌రి బాధ్య‌త‌ అని చెబుతూ తొంద‌ర్లోనే సంపూర్ణంగా కరోనా నివార‌ణ జరగాలని ఆ విధంగా దేవుడిని కోరుకుంటున్నట్టు తెలిపారు.

మాస్క్ ని 15 రోజులు వాడమంటున్నారు


రాష్ట్రంలో వైద్యులకు కూడా మాస్కులు అందని పరిస్థితి నెలకొందని, ఒక్క మాస్క్ ని ఇచ్చి 15 రోజులు వాడమంటున్నారని నర్సీపట్నం సీనియర్ వైద్యుడు సుధాకర్‌ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో సోమవారం మాట్లాడారు.

నర్సీపట్నం మొత్తం పాజిటివ్ కేసులు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని, పరిస్థితి అంత విషయంగా ఉందని తెలిపారు. ఇక్కడి ప్రభుత్వ ఆసుపత్రి పేరుకే 150 పడకల ఆసుపత్రి అని, కనీస సౌకర్యాలు కరువయ్యాయని చెప్పారు. ఒక్క మాస్కు ఇచ్చి దానికి మళ్లీ సంతకం కూడా తీసుకుంటున్నారని తెలిపారు. ఒక ఎమ్మెల్యే గానీ, మంత్రి గానీ ఆస్పత్రిని విజిట్ చేయరన్నారు. ఆసుపత్రి పరిస్థితులపై జిల్లా కో-ఆర్డినేటర్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. గైనకాలిజిస్ట్ కావాలని ఎప్పటి నుంచో అడుగుతున్నామని, అనుభవం లేని జూనియర్ వైద్యురాలితో ఆపరేషన్లు చేయిస్తున్నారని చెప్పారు. ఇక్కడి పరిస్థితిని ముఖ్యమంత్రి చూడాలని కోరారు. కరోనా విజృంభనపై అవసరమైతే ప్రధానికి ఫిర్యాదు చేస్తానన్నారు.

లాక్ డౌన్ పై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు!

కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణపై ప్రగతిభవన్‌ లో అధికారులతో సమీక్ష చేపట్టిన సీఎం కేసీఆర్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ… కరోనా వైరస్‌ మానవజాతికి వచ్చిన అతిపెద్ద సంక్షోభమని వ్యాఖ్యానించారు. ఈ రోజుకి 364 కరోనా వైరస్ పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయని సీఎం తెలిపారు.  భారత్‌ లాంటి  ఎక్కువ జనాభా గల దేశంలో లాక్‌ డౌన్‌ విధించడం తప్ప మరో గత్యంతరంలేదని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌ డౌన్‌ ను కొనసాగించాలని  ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చెప్పినట్లు కేసీఆర్‌ స్పష్టం చేశారు.

కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 90 దేశాలు లాక్‌ డౌన్‌ ప్రకటించాయని, తెలంగాణలో లాక్‌ డౌన్‌ కు ప్రజలు అద్భుతంగా సహకరిస్తున్నారని కొనియాడారు. లాక్‌ డౌన్‌ కారణంగా తెలంగాణ ఆదాయం గణనీయంగా పడిపోయిందన్నారు. ఢిల్లీలో నిర్వహించిన మర్కజ్‌ మత  ప్రార్థనలకు వెళ్లిన 1089 మందిని గుర్తించామన్నారు.

దుమారం రేగిన.. ఎమ్మెల్యే సైకిల్ యాత్ర!

ఆంద్రప్రదేశ్ లో ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఇతర రాష్ట్రాలతో ఉన్న సరిహద్దులతో పాటు జిల్లాల, పట్టణాలు, గ్రామాల మధ్య ఉన్న సరిహద్దుల్లోనూ పోలీసులు లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో రైతుల సమస్యల పరిష్కారం పేరుతో పశ్చిమగోదావరి జిల్లాలో ఓ టీడీపీ ఎమ్మెల్యే సైకిల్ పై యాత్ర చేపట్టారు. రైతు సమస్యలపై కలెక్టర్ కు ఫిర్యాదు పేరుతో ఆయన చేపట్టిన యాత్ర ఇప్పుడు వివాదాస్పదమవుతోంది.

వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తన నియోజకవర్గంలోని రైతు సమస్యలపై దృష్టిసారించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తన నియోజకవర్గంలోని రైతులు ఇబ్బందులు పడుతున్నందున కలెక్టర్ కు సమస్యలు విన్నవించాలని భావించారు. కానీ కరోనా సహాయక చర్యల్లో బిజీగా ఉన్న కలెక్టర్ ఫోన్ తీయలేదు. పలుమార్లు ప్రయత్నించి విఫలమైన ఎమ్మెల్యే కమిషనర్ కు ఫోన్ చేశారు. ఆయన కూడా ఫోన్ తీయలేదు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఎమ్మెల్యే రామానాయుడు ఈ వ్యవహారంలో అటో ఇటో తేల్చుకోవాలని భావించి సైకిల్ పై పాలకొల్లు నుంచి ఏలూరుకు బయలుదేరారు.ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..
తన నియోజక వర్గ ప్రజలందరినీ తన కుటుంబంగానే భావిస్తున్నానన్నారు. మాట్లాదామంటే కలెక్టర్ , ఎస్పీ వంటి జిల్లా అధికారులు కనీసం ఫోన్‌ లో అందుబాటులో ఉండటం లేదన్నారు.

ప్రజా ప్రతినిధితో మాట్లాడటం కంటే ఇంకా ఎక్కువ ముఖ్యమైన పనులు అధికారులకు ఏమున్నాయో తనకు తెలియడం లేదన్నారు. ఆక్వా ఉత్పత్తులను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని రామానాయుడు డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధరలు, బకాయిలు, సాగునీరు అందించాలన్నారు.

ఏపీలో 300 దాటిన కరోనా బాధితుల సంఖ్య!


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 303 కి చేరింది. వైద్య ఆరోగ్య శాఖ సోమవారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 37 మందికి కరోనా పాజిటివ్ నమోదైనట్లు స్టేట్ కరోనా నోడల్ ఆఫీసర్ అర్జా శ్రీకాంత్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరు జిల్లాలో 32, నెల్లూరు జిల్లాలో 42, ప్రకాశం జిల్లాలో 24, కడప జిల్లాలో 27, కృష్ణా జిల్లాలో 29, పశ్చిమ గోదావరి జిల్లాలో 21, విశాఖపట్నం జిల్లాలో 20, తూర్పుగోదావరి జిల్లాలో 11, చిత్తూరు జిల్లాలో 17, అనంతపురం జిల్లాలో 6, కర్నూలు జిల్లాలో 74 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవగా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో నేటికీ ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 74 నమోదై కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉంది. నిన్నటి వరకు ఒక్క అంకెకే పరిమితమైన కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగి పోయింది. వీరిలో ఢిల్లీ నుంచి వచ్చిన వారే అధికంగా ఉన్నారని సమాచారం. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని జిల్లాలో ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అధికారులకు తగిన ఆదేశాలు ఇస్తున్నారు. తరువాతి స్థానంలో నెల్లూరు జిల్లాలో 42 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో కరోనాతో ముగ్గురు మృతి చెందగా, ఆరుగురు కోలుకుని ఆసుపత్రి నుంచి ఇళ్లకు వెళ్లారని అధికారులు చెప్పారు.

ప్రధాని గర్ల్ ఫ్రెండ్ ను వదలని కరోనా!


కరోనాకు మహమ్మరి ఎవరినీ వదిలిపెట్టడం లేదు. సామాన్యుల నుంచి దేశ ప్రధానుల వరకు కరోనా బారినపడి మృత్యువాతపడుతున్నారు. కరోనా బాధితుల్లో సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు చాలామందే ఉన్నారు. ఈ లిస్టులో యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ పదిరోజులుగా క్రితమే చేరారు. ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో హోం క్వారంటైన్లో చికిత్స చేయించుకుంటున్నారు. ఈయనతోపాటు పలు స్పెయిన్, యూకే దేశాల రాజకుటుంబీకులు, వివిధ అధిపతులు కూడా కరోనా బారినపడిన సంగతి తెల్సిందే.

తాజాగా బోరిస్ జాన్సస్ గర్ల్ ఫ్రెండ్ తనకు కరోనా లక్షణాలు ఉన్నట్లు ప్రకటించింది. కేరీ సైమండ్స్ అనే మహిళతో బోరిస్ జాన్సన్ సహజీవనం చేస్తున్నాడు. గతంలోనే ఈ విషయాన్ని వీరిద్దరూ ప్రకటించారు. ప్రస్తుతం ఆమె గర్భవతి. కాగా పదిరోజుల కిందట తను జాన్సన్ తో బెడ్ ను పంచుకున్నట్టుగా కేరీ సైమండ్స్ తెలిపింది. తనలోనూ కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని ప్రకటించడంతో వైద్యులు ఆమెకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె గర్భవతి కావడంతో ఆమె ఆందోళన చెందుతున్నారు.

‘కరోనా’ సమయంలోను రాజకీయాలు చేస్తున్న టీడీపీ


టిడిపి నేతలు కరోనా సమయంలోనూ రాజకీయాలను విడిచిపెట్టడం లేదని మున్సిపల్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ అన్నారు. విశాఖపట్నం లో సోమవారం మీడియాతో మాట్లాడుతూ అర్ధంలేని ఆరోపణలతో గవర్నర్ కు టీడీపీ నాయకులు లేఖ రాశారన్నారు. ప్రభుత్వం పేదలకు ఉచితంగా రేషన్, రూ. వెయ్యి సాయం అందిస్తోందని, పంపిణీని ఎమ్మెల్యేలు పర్యవేక్షించడాన్ని రాజకీయం చేస్తారా అని ప్రశ్నించారు. వాలంటర్లు చేసే వెయ్యి రూపాయల పంపిణీని ఎమ్మెల్యేలు పర్యవేక్షిస్తే తప్పు ఎలా అవుతుందన్నారు. రాజకీయ విమర్శలు చేసే సమయం ఇది కాదని హితవు పలికారు. పేదలకు ప్రభుత్వం అందించే సాయం సక్రమంగా అందుతుందా లేదా అని పర్యవేక్షించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేదే కాదు, సాధారణ కార్యకర్తలది కూడా ఉందన్నారు.

ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో పేదలకు సాయం అందిస్తూ మాకే ఓటు వేయమని ఎవరైనా ప్రచారం చేస్తారా…ఇది ధర్మమా… ఎక్కడైనా ఇలా జరిగితే ఆధారాలతో నిరూపించాలని కోరారు. టిడిపి సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను రాయించి, వాటిని చూపి విమర్శలు చేస్తున్నారని, ఇటువంటి విమర్శలు చేయడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.

కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో ప్రజలకు అండగా వుండాల్సిన ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎక్కడ వున్నాడని ప్రశ్నించారు. ఆయనకు ఒక్కడికే కుటుంబం వుందా? మాకు మాత్రం కుటుంబాలు, బంధువులు లేరా? మేం అన్ని ప్రాంతాలకు తిరుగుతూ ప్రజలకు అండగా వుంటున్నాం. కానీ చంద్రబాబు హైదరాబాద్ లో వుంటూ… బాధ్యతారహితంగా విమర్శలు చేయడం సరికాదన్నారు.

చంద్రబాబు అంటే వృద్ధుడు అని అనుకోవచ్చని, ఆయన కుమారుడు లోకేష్ యువకుడు కాదా, ఆయన ఎందుకు బయటకు రావడం లేదు, ప్రజలకు అండగా నిలవడం లేదనే విషయాన్ని ప్రజలకు చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సాయంపై బిజెపి నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని చెప్పారు. కేంద్రం జన్ ధన్ ఖాతాల్లో రూ. 500 నేరుగా వేస్తోందని, రేషన్ కేవలం 90 లక్షల మందికే ఇస్తున్నారు. మిగిలిన యాబై లక్షల మందికి రాష్ట్రప్రభుత్వమే ఇస్తోందని ఇది తెలియక బిజెపి నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని చెప్పారు.

కేంద్రం ప్రకటించకముందే బియ్యంకార్డు దారులకు వెయ్యి రూపాయల సాయంను సీఎం జగన్ గారు ప్రకటించినట్లు తెలిపారు.

కరోనా నుంచి ప్రజలను రక్షించుకోవాలనే దానిపైనే మేం దృష్టి సారిస్తున్నామని, సీఎంగారు ఇచ్చిన లాక్ డౌన్ పిలుపును ప్రజలు సానుకూలంగా తీసుకుని విజయవంతం చేయాలని కోరుతున్నానట్లు చెప్పారు. ఢిల్లీ మార్కజ్ నుంచి మొత్తం 1,085 మంది వచ్చారని, వారికి అన్ని పరీక్షలు చేయడం జరిగిందన్నారు. వారితో వున్న వారికి కూడా పరీక్షలు చేస్తున్నామని, రాష్ట్రంలో 30 వేల పడకలను సిద్దం చేసినట్లు, ఎలాంటి విపత్కర పరిస్థితులను అయినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్దంగా వుందన్నారు. ప్రైవేటు మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులను కూడా అందుకు అనుగుణంగా సిద్దంగా చేశామన్నారు.

మీడియా కూడా పాజిటీవ్ గా వ్యవహరించాలని కోరుతున్నామని, కరోనా నియంత్రణ, ప్రజలకు సాయం చేసే కార్యక్రమాలకు వక్రభాష్యం చెప్పవద్దని కోరారు. ప్రభుత్వ చర్యల్లో ఎక్కడైనా లోపం వుంటే… వాటిని మా దృష్టికి తీసుకురండి, వెంటనే స్పందిస్తామని చెప్పారు. వందేళ్ల తరువాత ఇటువంటి సంక్షోభం వచ్చింది. దీనిని కట్టడి చేసేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. సీఎం జగన్ చేతులు జోడించి మరీ ప్రజలకు విజ్ఞప్తి చేశారని, ప్రజలు భౌతిక దూరంను పాటించడం ద్వారా కరోనాను అడ్డుకోవాలన్నారు.

మూడోదశకు కరోనా చేరుకుందా!


ఒకవంక కరోనా కట్టడిలో భారత్ చెప్పుకోదగిన విజయాలు సాధిస్తున్నామని, తీవ్రత తగ్గుముఖం పట్టినదని చెప్పుకొంటున్న తరుణంలో, మరో వారం రోజులలో లాక్ డౌన్ ను సడలించవచ్చని భావిస్తున్న సమయంలో దేశంలో కరోనా మూడో దశకు చేరుకుందన్న కధనం ఆందోళన కలిగిస్తున్నది. అయితే ఈ పరిస్థితి కొన్ని ప్రాంతాలకు పరిమితమైన్నట్లు చెబుతున్నారు.

కరోనా కట్టడిలో ప్రధానమంత్రికి సహకారం అందిస్తున్న కీలకమైన నిపుణుల బృందం సభ్యుడైన ఢిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా నుండే ఈ అంశం వ్యక్తం కావడం గమనార్హం. దేశంలో పలు ప్రాంతాల్లో కరోనా వైరస్‌ రెండో దశను దాటి మూడో దశకు చేరుకుందని ఆయన ప్రకటించారు. అయితే మూడో దశ దేశ వ్యాప్తంగా కేవలం కొన్ని ప్రాంతాల్లోనే మాత్రమే ఉందని తెలిపారు.

సోమవారం ఢిల్లీలో ఓ కార్యక్రమంలో డాక్టర్‌ రణ్‌దీప్‌ మాట్లాడుతూ.. ‘దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి రోజురోజుకూ పెరగడం ఆందోళనకరం. పలు ప్రాంతాల్లో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ (లోకల్‌ కాంటాక్ట్‌) ద్వారా వైరస్‌ సోకడాన్ని గుర్తించాం. దీనిని వైరస్‌ మూడోదశగా చెప్పుకోవచ్చు. అయితే ఈ దశ దేశంలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే విస్తరించింది’ అని చెప్పారు.

అయితే దేశ వ్యాప్తంగా అత్యధిక భాగం కేవలం రెండోదశలో ఉండంటం కొంత ఉపశమనం కలిగించే అంశమని తెలిపారు. కాగా, మూడోదశ అనేది మన దేశంలో ప్రస్తుతం ప్రారంభదశలోనే ఉందని, దానిని అదుపుచేయడానికి ఇప్పటికే తగిన చర్యలు తీసుకుంటున్నామని భరోసా ఇచ్చారు. దానిని ఎంత త్వరగా అరికడితే అంతమంచిందని చెబుతూ లేకపోతే మూడోదశ ఉధృతమైతే తీవ్ర పరిణామాలను ఎదుర్కొక తప్పదని హెచ్చరించారు.

ఇక ఢిల్లీలోని మర్కజ్‌ మత ప్రార్థనాల కారణంగానే దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగాయని రణ్‌దీప్‌ స్పష్టం చేశారు. ప్రార్థనల్లో పాల్గొన్న వారిని గుర్తించడం కష్టతరమైనప్పటికీ.. ప్రభుత్వాలు చర్యలు సఫలమైయ్యాయని కొనియాడారు. వైరస్‌ కట్టడికి వైద్యులకు ప్రజలు సహకరించాలని కోరారు.

మరోవైపు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లాక్ డౌన్ ఎత్తివేయడం గురించి సరైన నిర్ణయం చెప్పలేమని, ఏప్రిల్‌ 10 తరువాత పరిస్థితులను బట్టి కేంద్ర ప్రభుత్వానికి తుది నివేదికను సమర్పిస్తామని వెల్లడించారు.

ఫోన్‌లో తమ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌ను పరామర్శించిన చిరంజీవి


ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ మాతృమూర్తి కృష్ణ‌వేణి (94) సోమ‌వారం మృతి చెందారు. ఆమె గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. త‌మ్మారెడ్డి భ‌రద్వాజ తండ్రి కృష్ణ‌మూర్తి కూడా చిత్ర నిర్మాతే. ఆయ‌న ర‌వీంద్ర ఆర్ట్స్ ప‌తాకంపై ల‌క్షాధికారి, జ‌మీందారు, బంగారు గాజులు, ధ‌ర్మ‌ధాత‌, ద‌త్త పుత్రుడు, డాక్ట‌ర్ బాబు త‌దిత‌ర అనేక విజ‌య‌వంత‌మైన చిత్రాలు నిర్మించారు. ఈ దంపతుల‌కు ఇద్ద‌రు కుమారులు. పెద్ద కుమారుడు లెనిన్ బాబు కూడా చ‌నిపోయారు. చిన్న కుమారుడు భ‌రద్వాజ నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా అనేక విజ‌య‌వంతమైన చిత్రాలు అందించారు. మొద‌టి నుంచి వీరిది వామ‌ప‌క్ష భావాలున్న కుటుంబం. ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ మాట్లాడుతూ.. అనారోగ్యంతో త‌న త‌ల్లి రెండు నెల‌లుగా ఇబ్బంది ప‌డుతున్నార‌ని తెలిపారు. త‌న మిత్రులు, శ్రేయోభిలాషులు చాలా మంది ఫోన్లు చేస్తున్నార‌ని, క‌రోనా తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్నందున త‌న‌ను ప‌రామ‌ర్శించ‌డానికి ఎవ‌రూ ఇంటికి రావ‌ద్ద‌ని ఆయ‌న కోరారు.

కృష్ణ‌వేణి మ‌ర‌ణ వార్త తెలిసిన వెంట‌నే. మెగాస్టార్ చిరంజీవి ఫోన్‌లో భ‌ర‌ద్వాజ‌ను ప‌రామ‌ర్శించారు, ఆమె ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని సంతాప సందేశాన్ని తెలియ‌జేశారు. సినిమా ఒక మ‌జిలీ.. స‌మ స‌మాజం నా అంతిమ ల‌క్ష్యం అనే కృష్ణ‌మూర్తి తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌కు ఇతోదిక సేవ‌లందించారని గుర్తుచేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.

యాంకర్ సుమ ఇంట్లో విషాదం

రాజీవ్ కనకాల సుమ దంపతుల ఇంట ఊహించని విషాదం నెలకొంది. రాజీవ్ కనకాల సోదరి శ్రీ లక్ష్మి నేడు అనారోగ్య కారణాలతో మృతి చెందారు దీంతో వరుసగా మూడు సంవత్సరాల్లో ముగ్గురు ఇంటి సభ్యులను రాజీవ్ కనకాల కోల్పోయి నట్లయింది. 2018 ఫిబ్రవరి 3 వ తారీకున తల్లి లక్ష్మి కనకాల మృతి చెందగా , 2019 ఆగష్టు 2వ తారీఖున తండ్రి దేవదాస్ కనకాల మృతిచెందడం జరిగింది . ఇపుడు మూడో వ్యక్తి శ్రీ లక్ష్మి ఈ రోజు ( ఏప్రిల్ 6 ) అనారోగ్య కారణాలతో హఠాన్మరణం చెందింది .

రాజీవ్ కనకాల తల్లిదండ్రులు ఇద్దరు కూడా నటన రంగంలో ఉండటంతో చెల్లి శ్రీలక్ష్మి కూడా నటన రంగంలోనే అడుగు పెట్టింది. నటిగా దూర దర్శన్ నుండే శ్రీలక్ష్మి తన నటనకు శ్రీకారం చుట్టడం జరిగింది. దూర దర్శన్ లో వచ్చిన పలు కార్యక్రమాలు ,ఇంకా సీరియల్స్ లో శ్రీలక్ష్మి నటిగా ప్రతిభ చాటుకొంది. సోదరుడు రాజీవ్ కనకాలతో పాటు శ్రీలక్ష్మి కూడా బుల్లి తెరపై పలు సీరియల్స్ లో నటిస్తూనే వచ్చింది.

శ్రీలక్ష్మి మరణ వార్తను కనకాల ఫ్యామిలీకి చెందిన వారు ఒకరు వీడియో సందేశం ద్వారా ఈ వార్తను బయటకు తెలియజేశారు. ఈ సంఘటన చాలా దురదృష్టకరంగా పేర్కొంటూ అనేక మంది మీడియాకు తమ సందేశం తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శ్రీలక్ష్మికి శ్రద్దాంజలి ఘటించేందుకు ఎవరు రావద్దంటూ ఫామిలీ మెంబెర్స్ తమ వీడియోలో పేర్కొనడం జరిగింది. అతి కొద్ది మంది సమక్షంలో శ్రీలక్ష్మి అంత్యక్రియు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీలక్ష్మి జర్నలిస్ట్ రామారావును వివాహం చేసుకోగా వారికి ఇద్దరు కూతుళ్లు పుట్టారు.

శ్రీలక్ష్మి మరణ వార్త తెలిసిన బుల్లి తెర ప్రముఖులు, నటీనటులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆమెను కడసారి కూడా చూడలేక పోతున్నామనే బాధ వ్యక్తం చేస్తున్నారు.

Devika Singh Stuninng Pictures