
రాజీవ్ కనకాల సుమ దంపతుల ఇంట ఊహించని విషాదం నెలకొంది. రాజీవ్ కనకాల సోదరి శ్రీ లక్ష్మి నేడు అనారోగ్య కారణాలతో మృతి చెందారు దీంతో వరుసగా మూడు సంవత్సరాల్లో ముగ్గురు ఇంటి సభ్యులను రాజీవ్ కనకాల కోల్పోయి నట్లయింది. 2018 ఫిబ్రవరి 3 వ తారీకున తల్లి లక్ష్మి కనకాల మృతి చెందగా , 2019 ఆగష్టు 2వ తారీఖున తండ్రి దేవదాస్ కనకాల మృతిచెందడం జరిగింది . ఇపుడు మూడో వ్యక్తి శ్రీ లక్ష్మి ఈ రోజు ( ఏప్రిల్ 6 ) అనారోగ్య కారణాలతో హఠాన్మరణం చెందింది .
రాజీవ్ కనకాల తల్లిదండ్రులు ఇద్దరు కూడా నటన రంగంలో ఉండటంతో చెల్లి శ్రీలక్ష్మి కూడా నటన రంగంలోనే అడుగు పెట్టింది. నటిగా దూర దర్శన్ నుండే శ్రీలక్ష్మి తన నటనకు శ్రీకారం చుట్టడం జరిగింది. దూర దర్శన్ లో వచ్చిన పలు కార్యక్రమాలు ,ఇంకా సీరియల్స్ లో శ్రీలక్ష్మి నటిగా ప్రతిభ చాటుకొంది. సోదరుడు రాజీవ్ కనకాలతో పాటు శ్రీలక్ష్మి కూడా బుల్లి తెరపై పలు సీరియల్స్ లో నటిస్తూనే వచ్చింది.
శ్రీలక్ష్మి మరణ వార్తను కనకాల ఫ్యామిలీకి చెందిన వారు ఒకరు వీడియో సందేశం ద్వారా ఈ వార్తను బయటకు తెలియజేశారు. ఈ సంఘటన చాలా దురదృష్టకరంగా పేర్కొంటూ అనేక మంది మీడియాకు తమ సందేశం తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శ్రీలక్ష్మికి శ్రద్దాంజలి ఘటించేందుకు ఎవరు రావద్దంటూ ఫామిలీ మెంబెర్స్ తమ వీడియోలో పేర్కొనడం జరిగింది. అతి కొద్ది మంది సమక్షంలో శ్రీలక్ష్మి అంత్యక్రియు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీలక్ష్మి జర్నలిస్ట్ రామారావును వివాహం చేసుకోగా వారికి ఇద్దరు కూతుళ్లు పుట్టారు.
శ్రీలక్ష్మి మరణ వార్త తెలిసిన బుల్లి తెర ప్రముఖులు, నటీనటులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆమెను కడసారి కూడా చూడలేక పోతున్నామనే బాధ వ్యక్తం చేస్తున్నారు.