
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన మూడు వారల లాక్ డౌన్ గడువు మరో వారంలో ముగుస్తున్న సమయంలో దీనిని మరొకొన్ని రోజులు పొడిగించాలని సూచించడం ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు జాతీయ స్థాయిలో ప్రజాభిప్రాయం అందుకు అనుగుణంగా మలచడానికి కారణమవుతున్నారు.
గత వారం ముఖ్యమంత్రులతో జరిపిన వీడియో కాంఫరెన్సులో లాక్ డౌన్ తర్వాత తీసుకోవలసిన చర్యలపై దృష్టి సారించమని ప్రధాని, లాక్ డౌన్ సడలింపు గురించి కేంద్ర మంత్రుల బృందం సమాలోచనలు చేస్తున్నల్టు కధనాలు వెలువడుతూ ఉండడంతో ఏప్రిల్ 14న పరిస్థితులలో కొంత సడలింపు తధ్యం అని ప్రజలందరూ ఎదురు చూడడం ప్రారంభించారు.
అయితే ఇప్పుడు సడలిస్తే మూడు వారల లాక్ డౌన్ ద్వారా సాధించిన ఫలితాలు వృద్దాకాగలవని కేసీఆర్ హెచ్చరించడంతో దేశ ప్రజల దృష్టిని ఆ దిశలో మలిచిన్నట్లు అయింది. దానితో ఒక విధంగా ఇప్పుడు లాక్ డౌన్ పొడిగించక కేంద్రానికి తప్పని పరిస్థితి ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనీసం ఏప్రిల్ ఆఖరి వరకు పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రధాన మంత్రి మూడు వరాల లాక్ డౌన్ ను ప్రకటించడానికి ముందే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్ డౌన్ అమలులోకి తెచ్చారు. మొదట్లో లాక్ డౌన్ పట్ల ప్రజలు కొనసా అసహనంగా కనిపించినా ఐరోపా, అమెరికాలలో జరుగుతున్న విధ్వంసక పరిణామాలను చూస్తున్నప్పుడు ఇది సరైన చర్య అనే అభిప్రాయం బలపడింది. మరో వారం ముందే ప్రకటించి ఉంటె బాగుండేదిదని కూడా కొందరు చెప్పుకొంటూ వచ్చారు.
లాక్ డౌన్ అమలులోకి వచ్చాక మొదటి వారంలోనే దేశం కరోనా కట్టడిలో కీలకమైన అడుగు వేసిన్నట్లు అయింది. ఏప్రిల్ 7 తర్వాత తెల్నగణలో కరోనా వైరస్ ఉనికి ఉండబోదని అంటూ కేసీఆర్ ప్రకటించారు కూడా. అయితే ఇంతలో తబ్లిగ్ జమాత్ సదస్సు నుండి తిరిగి వచ్చిన వారు పెద్ద ఎత్తున వైరస్ ను దేశ వ్యాప్తంగా వ్యాప్తి చేయడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. గత వారం రోజులుగా దేశమో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు ఎక్కువగా వీరివి కావడం గమనార్హం.
పైగా, వీరు తగు పరీక్షలకు, చికిత్సలకు సహాయ నిరాకరణ ధోరణి అవలంభిస్తూ ఉండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో శ్రమ పడవలసి వస్తున్నది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొనే లాక్ డౌన్ పొడిగిపు గురించి కేసీఆర్ సూచించడం దేశ ప్రజలను ఆకట్టుకొంటున్నది.
ఇలా ఉండగా, లాక్‌డౌన్ ఎత్తివేతకు ఉత్తర ప్రభుత్వం కూడా విముఖంగా ఉంది. కోవిడ్-19 కేసులు ఉత్తరప్రదేశ్‌లో ఒక్కటి కూడా నమోదు కాని పక్షంలో మాత్రమే లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆయన యూపీ ప్రభుత్వ అదనపు చీఫ్ సెక్రటరీ అవనీష్ అవస్తి స్పష్టం చేశారు. యూపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో యోగి సర్కార్ లాక్‌డౌన్ ఎత్తివేతకు సిద్ధంగా లేదు.