Home Blog Page 8544

Sony Charishta Glamorous photo shoot stills

జగన్ గ్రామ కార్యదర్శుల వ్యవస్థ కుప్పకూలిందా!


దేశంలోని అతిపెద్ద ఉద్యోగ కల్పనగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం చేసుకొంటున్న గ్రామ కార్యదర్శుల వ్యవస్థ కీలకమైన కరోనా సంక్షోభం సమయంలో కుప్పకూలిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. లాక్ డౌన్ సమయంలో పేద ప్రజలకు రేషన్ ను వీరి ద్వారా ఇంటి వద్దకే పంపిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించినా ఆచరణలో ప్రభుత్వం నవ్వులపాలవుతున్నది.

అధికారంలోకి రాగానే సుమారు 4 లక్షల మంది గ్రామ కార్యదర్శులను ముఖ్యమంత్రి నీయయించారు. కరోనాను కట్టడి చేయడంలో వీరంతా క్షేత్రస్థాయిలో సైనికుల వలె అందుబాటులో ఉంటారని ప్రకటించారు. ఇతర రాష్ట్రాలు సహితం ఈ వ్యవస్థను చూసి ముచ్చట పడుతున్నట్లు చెప్పుకున్నారు.

అయితే గత రెండు నెలలుగా విదేశాల నుండి వచ్చిన వారిని గుర్తించి, వారికి కరోనా పరీక్షలు జరిపించడంలో వీరే క్కడ ఆరోగ్య అధికారులకు తగు సహకారం అందిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇటువంటి సంక్షోభ సమయంలో , ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండవలసిన వారి ఆచూకీ కనిపించడం లేదనే విమర్శలు చెలరేగుతున్నాయి. వారికి తగు శిక్షణ లేకపోవడమే అనుదుకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు.

పైగా, వారి నియామకం జరిగిన తీరు సహితం లోపబోయిష్టంగా ఉండడం గమనార్హం. ఈ వ్యవస్థ ఏర్పాటుకు తగు రూపకల్పన చేసిన మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కళ్లెంకు మినహా ప్రభుత్వంలో ఇతరులకు ఎవ్వరికీ తగు అవగాహన లేకపోవడంతో వారిని తగు రీతిలో ఉపయోగించుకోలేక పోతున్నట్లు తేటతెల్లం అవుతున్నది.

మరోవంక, నగదు పంపిణి, నిత్యావసర వస్తువుల పంపిణి వంటి పనులను వారు చేయకుండా స్థానిక వైసిపి కార్యకర్తలకు అప్పచెప్పడం, వారి స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ ప్రచారానికి వెళ్లిన్నట్లుగా గుంపులుగా వెళ్లి హడావుడి చేయడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం కన్నెర్ర చేయవలసి వచ్చింది.

వాస్తవానికి గ్రామా కార్యదర్శుల వ్యవస్థ ప్రభుత్వ సలహాదారుడు అజయ్ కళ్ళం ఆలోచనల నుండి వచ్చింది. ఆయన సలహాపై అధికారమలోకి రాగానే వారి నియామకం అయితే జగన్ చేశారు గాని, ఆ తర్వాత ఆ వ్యవస్థను సుస్థిరం చేయడం పట్ల ఎటువంటి శ్రద్ద చూపలేదు. కనీసం ఆ విషయం పట్టించుకోనని లేదు.

నాలుగు లక్షల మందిని నియమించడమే గొప్ప విజయంగా భావిస్తూ వచ్చారు. దానితో అసలు ఆలోచనకు, ఆచరణలో వారి పనితీరుకు సంబంధం లేకుండా పోతున్నది. పైగా, వారి గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో టిడిపి కమిటీలుగా పనిచేసి నవ్వులపాలైన జన్మభూమి కమిటీలను దృష్టిలో ఉంచుకొంటూ రావడంతో వీరు కూడా అదే బాటలో నడుస్తూ వస్తున్నారు.

పార్టీ కార్యకర్తల వలే కాకుండా, ప్రభుత్వ ప్రతినిధుల వలే వ్యవహరిస్తే గాని గ్రామీణ వ్యవస్థలో మౌలిక మార్పులకు వీరు సారధులు కాలేరు. ఏపీని చూసి ఇటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్న కేరళ, ఒడిస్సా ప్రభుత్వాలు చాలా తక్కువ వ్యవధిలో అద్భుతంగా ఉపయోగించుకోవడాన్ని ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం గమనించ వలసి ఉంది.

బన్నీకి ట్వీటర్లో విషెస్ చెప్పిన మెగాస్టార్


నేడు(ఏప్రిల్ 8) స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే. బన్నీ బర్త్ డే ను పురస్కరించుకొని మెగాస్టార్ చిరంజీవి ట్వీటర్లో విషెస్ తెలియజేశారు. బన్నీ చిన్ననాటికి ఫొటోను షేర్ చేస్తూ బన్నీతో తనకున్న అనుబంధాన్ని మెగాస్టార్ తెలియజేశారు. చిన్నతనం నుంచి బన్నీ డాన్సులోని కసి, కృషి తనకు ఇష్టమంటూ మెగాస్టార్ తెలిపారు. ‘హ్యపీ బర్త్ డే అల్లు అర్జున్.. నువ్వు బాగుండాలబ్బా’ అంటూ బన్నీ స్టైల్లోనే మెగాస్టార్ విసెస్ చేయడం అభిమానులను ఆకట్టుకుంది.

మెగా ఫ్యామిలీ నుంచి బన్నీ ‘గంగోత్రి’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైంది. తొలిచిత్రంతోనే అల్లు అర్జున్ మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ‘ఆర్య’, ‘హ్యాపీడేస్’, ‘రేసుగుర్రం’, ‘సరైనోడు’, ‘డీజే’ వంటి చిత్రాలతో అలరించాడు. రీసెంట్ గా ‘అల.. వైకుంఠపురములో’ మూవీతో ఇండస్ట్రీ హిట్టందుకున్నాడు. ఈ మూవీ అల్లు అర్జున్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. అల్లు అర్జున్ తెలుగుతోపాటు మలయాళంలో భారీ ఫ్యాన్ ఫాలోయింది. తెలుగులో విడుదలైన అల్లు అర్జున్ ప్రతీమూవీ కేరళ విడుదలై మంచి విజయాలు సాధించాయి.

బన్నీ-సుకుమార్ దర్శకత్వంలో తాజాగా తెరకెక్కుతున్న మూవీ ‘పుష్ప’. ఈ మూవీ ఫస్టు లుక్కును బన్నీ పుట్టిన రోజు కానుకగా చిత్రబృందం విడుదల చేసింది. ఈ మూవీ ఫస్టు లుక్ అభిమానులను ఆకట్టుకుంటుంది. బన్నీ పుట్టిన రోజు సందర్భంగా పలువురు సెలబ్రెటీలు ఆయన సోషల్ మీడియాలో విషెష్ చెబుతున్నారు. కరోనా ఎఫెక్ట్ తో బన్నీ పుట్టిన రోజు వేడుకలను వాయిదా వేసుకున్నారు.

అంబానీ నష్టం ఎంతో తెలిస్తే.. షాక్ అవుతారు!

కరోనా దెబ్బతో రోడ్డు పక్కన చిన్న బడ్డీ కొట్టు పెట్టెకున్న వ్యాపారి దగ్గర నుండి అతి పెద్ద బడా వ్యాపారుల వరకు అందరికి నష్టం వాటిల్లింది. మహమ్మారి కరోనా రక్కసి ఇటు చిరు వ్యాపారులకు నష్టం, అటు కుబేరుల ఆస్తులను ఆవిరి చేసింది. మొన్నటి వరకు ఆసియా ధనికుడు ముఖేష్ అంబానీ కొద్ది రోజుల క్రితమే రెండో స్థానానికి పడిపోయారు. ఈ రెండు నెలల్లో అతని ఆస్తులు భారీగా తగ్గిపోయాయి. ఈ వైరస్ వల్ల మార్కెట్లు కుప్పకూలడం, వ్యాపారాలు నష్టపోతున్న విషయం తెలిసిందే. దీంతో ముఖేష్ అంబానీయే కాదు దేశ, అంతర్జాతీయ కుబేరుల ఆస్తులు భారీగా ఆవిరయ్యాయి.

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సంపద, కరోనా వైరస్ కారణంగా గణనీయంగా తగ్గింది. ఆయన రోజుకు సగటున 300 మిలియన్ల డాలర్లు (రోజుకు రూ.2,200 కోట్లు) కోల్పోయారు. దీంతో కేవలం రెండు నెలల వ్యవధిలో దేశీయ ఈక్విటీ మార్కెట్లు గరిష్టాల నుంచి 35 శాతం పడిపోయాయి. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ముఖేష్ నికర విలువ 19 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.1.44 లక్షల కోట్లు) నష్టం వాటిల్లింది.

అంతర్జాతీయంగా కుబేరుల జాబితాలో ముఖేష్ అంబానీ ఎనిమిది స్థానాలు తగ్గి పదిహేడవ స్థానానికి వచ్చారు.

కరోనా దెబ్బ.. నిధుల కొరతలో కేసీఆర్


ఆర్ధిక సంవత్సరం చివరిలో కరోనా దెబ్బ వేయడంతో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వసూలు కావలసిన పన్నులు వసూలు కాకపోవడం, అత్యవసరమైన పనుల కోసం నిధులు అవసరం అవుతూ ఉండడంతో ఉద్యోగులు, ప్రజా ప్రతినిధుల జీత, భత్యాలలో కొత్త విధించినా పెద్దగా ఉపయోగం ఉండడం లేదు.

ప్రభుత్వనాయికి ఏప్రిల్‌ మాసంలో ఇప్పటి వరకు సుమారు రూ. 2,400 కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా, వచ్చిన ఆదాయం రూ. 6 కోట్లు మాత్రమేనని స్వయంగా సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. సరిగ్గా ఆర్థిక సంవత్సరం చివర్లో కరోనా పంజా విసరడంతో కేవలం మర్చి చివరి వారంలోనే రూ.5,000 కోట్ల నష్టం వాటిల్లిందని చెబుతున్నారు.

ఏప్రిల్‌ మొదటి వారం నుంచి పరిస్థితి మరింత విషమించడంతో తెలంగాణ ఆదాయం 95 శాతానికిపైగా పడిపోయింది. ఈ నేపథ్యంలో ప్రజల ప్రాణాలను, వారి సంక్షేమాన్ని కాపాడేందుకు పెద్ద యుద్ధమే చేయవలసి వస్తున్నది. ఆస్తి పన్ను దగ్గర నుండి అన్ని రకాల పన్నుల చెల్లింపులను వాయిదా వేయడంతో పాటు విద్యుత్ బిల్లుల వసూళ్లు సహితం వాయిదా పడింది. దానితో ఆదాయ వనరులు దాదాపు సూన్యం అని చెప్పవచ్చు.

కేంద్రం నుంచి పన్నుల వాటా తగ్గినా.. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) బకాయిలు సకాలంలో సర్దుబాటుకాకపోయినా సొంత రాబడులతో నెట్టుకు వస్తున్న కేసీఆర్ కు ఈ పరిస్థితిని ఎదుర్కోవడం ఇబ్బందికరంగానే మారుతున్నది. మరోవంక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హిత వచనాలు చెప్పడమే గాని కేంద్రం నుండి ఆర్ధికంగా చెప్పుకోదగిన సహకారం అందించడం లేదు.

లాక్‌డౌన్‌ వల్ల ఆర్థిక కార్యకలాపాలన్నీ స్తంభించడంతో జీఎస్టీతోపాటు విలువ ఆధారిత పన్ను (వ్యాట్‌), స్టాంపుల అమ్మకాలు, స్థిరాస్థి రిజిస్ట్రేషన్లు, వాహన రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయంలో భారీగా కోత పడింది.

దానితో వివిధ ప్రభుత్వ శాఖల పేరిట బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. శాఖలకు సంబంధించి వివిధ బ్యాంకుల్లో ఉన్న అన్ని రకాల డిపాజిట్లకు సంబంధించిన వివరాలన్నీ ఇవ్వాల్సిందిగా ఆయా శాఖల ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది. సుమారు రూ 2,000 కోట్ల మేరకు ఉన్నట్లు తేలింది.

మరోవంక, రాష్ట్రం చెల్లించాల్సిన అన్ని రకాల రుణాల చెల్లింపు ప్రక్రియను వాయిదా వేసే విధంగా చర్యల్ని తీసుకోవాలని ఆర్‌బిఐని కోరాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. లాక్‌డౌన్‌ ప్రభావం వచ్చే 6 నెలల పాటు ఉండే అవకాశం ఉన్నందున రుణాల చెల్లింపు వాయిదాకు అనుమతిని ఇవ్వాలని ఆర్బీఐని కోరే అవకాశం ఉంది.

10రోజుల్లోనే టెస్ట్ కిట్స్‌ సిద్ధం!

ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ లక్షణాలను గుర్తించడానికి ఉద్దేశించిన టెస్ట్ కిట్స్‌ ను రాష్ట్రంలోనే తయారవుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలోనే ఈ కిట్స్‌ ను ఆవిష్కరించనున్నారు. విశాఖపట్నంలోని మెడ్‌ టెక్ జోన్‌ లో కరోనా కిట్స్ తయారీని రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ప్రారంభించింది. ప్రస్తుతం ఈ కిట్స్ తయారీ ఊపందుకున్నాయని. మరో 10 రోజుల్లో అందుబాటులోకి తీసుకొస్తామని పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 19వ తేదీన తొలి కిట్‌ ను సీఎం ఆవిష్కరించే అవకాశం ఉంది.

రాష్ట్ర అవసరాల కోసం ప్రస్తుత వాటి తయారీ కొనసాగుతోందని, వచ్చే వారం నుంచి కమర్షియల్ ప్రొడక్షన్‌ ను ప్రారంభించబోతున్నట్టు చెప్పారు. టెస్ట్ కిట్స్‌ తో పాటు వెంటిలేటర్లను కూడా పెద్ద సంఖ్యలో తయారు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. టెస్ట్ కిట్లు, వెంటిలేటర్లు తయారు చేసే కంపెనీలకు ప్రభుత్వం ఇదివరకే 30 కోట్ల రూపాయలను విడుదల చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన సాంకేతికత, మార్గనిర్దేశకాల ఆధారంగా టెస్టింగ్, డయాగ్నసిస్ ఎక్విప్‌ మెంట్‌ ను రూపొందిస్తున్నాయి ఆ కంపెనీలు.

ప్రతినెలా ఆరువేల వెంటిలేటర్లను కొనుగోలు చేయడానికి అవసరమైన ఆర్డర్ విశాఖపట్నానికి చెందిన ఏఎంటీజెడ్ మెడికల్ సర్వీసెస్ సంస్థ నుంచి అందినట్లు పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు. ఈ టెస్టింగ్ కిట్స్, వెంటిలేటర్లను ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పరిశీలించాల్సి ఉంటుందని, దాని తరువాతే వినియోగంలోకి తీసుకొస్తామని తెలిపారు.

ఇండియా టాప్ ఐపీఎస్ లిస్టులో డీజీపీ మహేందర్ రెడ్డి

ఇండియాలోని టాప్ 25ఐపీఎస్ అధికారుల జాబితాలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి చోటు దక్కించుకున్నారు. దేశవ్యాప్తంగా ఉత్తమ ప్రతిభచూపిన ఐపీఎస్ లపై ఫేమ్ ఇండియా, పీఎస్ యూ వాచ్, ఆసియా పోస్ట్ సంస్థలు సర్వే నిర్వహించాయి. ఏజెన్సీ, మీడియా నివేదికల ఆధారంగా చేపట్టిన సర్వే వివరాలను మంగళవారం ప్రకటించగా ఇందులో ఎం.మహేందర్ రెడ్డికి చోటు దక్కింది. 1986 ఐపీఎస్ బ్యాచ్‌‌‌‌కు చెందిన మహేందర్ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వం నవంబర్ 12, 2017న డీజీపీగా నియమించింది. మహేందర్ రెడ్డి గతంలో గోదావరిఖని అసిస్టెంట్ ఎస్పీగా విధులు నిర్వహించారు. ఆ తర్వాత నిజామాబాద్, కర్నూలు జిల్లాల ఎస్పీగా, హైదరాబాద్ సీపీగా పని చేశారు.

ఈ సర్వేలో నక్సలిజం, టెర్రరిజం, మాదకద్రవ్యాలు, మానవ అక్రమ రవాణ వంటి అంతర్జాతీయ నేరాలను పరిగణలోకి తీసుకున్నట్లు పీఎస్ యూ వాచ్ మేనేజింగ్ డైరెక్టర్ వివేక్ శుక్లా తెలిపారు. నేరాలను నియంత్రించే సామర్థ్యం, నిజాయితీ, ఫ్రెండ్లీ పోలీసింగ్లో లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేసే వారికి ప్రాధాన్యం ఇచ్చినట్లు పేర్కొన్నారు. టాప్ 25ఐపీఎస్ అధికారుల్లో రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డికి చోటు దక్కడంతో ఆయనను ఐజీ విమెన్ సేఫ్టీ వింగ్ స్వాతి లక్రా అభినందించారు.

లాక్ డౌన్ ఎత్తేయడం ఆ రాష్ట్రాలకు ఇష్టం లేదు!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య తగ్గుమొహం పట్టినా.. భారత్ లో మాత్రం వైరస్‌ కేసులు, మరణాల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నాయి. దింతో లాక్‌ డౌన్‌ ను పొడిగించాలంటూ తెలంగాణ, మధ్యప్రదేశ్‌, కర్ణాటక వంటి ఏడు రాష్ర్టాల సీఎంలతోపాటు కొందరు నిఫుణులు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం దీనిపై సమాలోచనలు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ఇప్పటి వరకు ఎలాంటి తుదినిర్ణయం తీసుకోలేదని, ఎలాంటి వదంతులను నమ్మవద్దని పేర్కొన్నాయి.

దేశంలో మార్చి 25న విధించిన 21 రోజుల లాక్‌ డౌన్‌ ఏప్రిల్‌14తో ముగియనున్నది. కాగా, కరోనాపై దీర్ఘకాల పోరాటానికి సిద్ధం కావాలని ఇటీవల ప్రధాని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. అలిసిపోయామని లేదా ఓడిపోయామని ఎవరూ భావించవద్దన్న ఆయన.. ఈ మహమ్మారిపై దేశం తప్పక విజయం సాధిస్తుందన్న నమ్మకం కలిగి ఉండాలన్నారు. దీంతో లాక్‌ డౌన్‌ ను కేంద్రం మరికొంత కాలం కొనసాగించే అవకాశమున్నదన్న ప్రచారం జరుగుతున్నది.

కాగా, రక్షణ మంత్రి రాజ్‌ నాథ్‌ నేతృత్వంలో కేంద్ర మంత్రుల బృందం సమావేశం జరిగింది. మే 15 వరకు విద్యాసంస్థలు, షాపింగ్‌ మాల్స్‌ మూసివేత కొనసాగించాలని, మతపరమైన కార్యక్రమాలపై ఆంక్షలు విధించాలని ఈ బృందం సూచించింది. కాగా, భారత్‌లో లాక్‌ డౌన్‌ వల్ల అసంఘటిత రంగాలకు చెందిన 40 కోట్ల కార్మికుల జీవితాలు ప్రమాదంలో పడ్డాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ తెలిపింది

లక్షణాలు లేవు.. కానీ కరోనా పాజిటివ్!


ఖమ్మం జిల్లాలోని పెద్దతండాలో ఒక వ్యక్తికి కరోనా సోకినా వ్యాధి లక్షణాలు లేకపోయినా కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ కావడం కలకలం రేపుతోంది. అతడు కూడా ఢిల్లీలోని మర్కజ్ సమావేశాలకు వెళ్లొచ్చినట్లు తెలుస్తోంది. అతడిలో ఎలాంటి లక్షణాలు లేకపోయినా కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు. దగ్గు, జలుబు, జ్వరం లాంటి లక్షణాలేవీ అతడికి లేవని తెలిపారు. బాధితుడు టీబీ పేషెంట్‌ కావడంతో వైద్యులు అప్రమత్తంగా ఉండి చికిత్స చేస్తున్నట్లు చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

తెలంగాణలోని 29 జిల్లాల్లో మూలాలు కనిపించాయి. కానీ, ఆ జిల్లాలో మాత్రం నిన్నటిదాకా ఒక్క కేసూ నమోదు కాలేదు. కానీ జిల్లాలో తొలి కేసు నమోదైన నేపథ్యంలో మరింత అప్రమత్తమైనట్లు మంత్రి పువ్వాడ తెలిపారు. ఢిల్లీ మర్కజ్‌ కు వెళ్లొచ్చిన వారిని ఐసోలేషన్‌ లో వైద్య అధికారుల పర్యవేక్షణలో ఉంచామని వెల్లడించారు. ఖమ్మం జిల్లాలో లాక్‌ డౌన్‌ మరింత పకడ్బంధీగా అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటివరకూ ఇతర ప్రాంతాలకు వెళ్లొచ్చిన వ్యక్తుల ద్వారానే కరోనా సోకిందని ఆయన వివరించారు. కరోనా కట్టడికి ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని మంత్రి కోరారు.

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 364కి చేరింది. వీరిలో 45 మంది పూర్తిగా కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. 11 మంది చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 308 యాక్టివ్ కేసులున్నాయి. మరో రెండు రోజుల్లో మర్కజ్ కేసులతో లింకున్న వారందరికీ పరీక్షలు పూర్తవుతాయని సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. మరో 110 వరకు పాజిటివ్ కేసులు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాంటాక్ట్ కేసులు పెరిగితే కొంచెం అటు ఇటుగా పెరుగవచ్చని తెలిపారు.

వైజాగ్ లో చికెన్ వ్యాపారికి కరోనా పాజిటివ్

విశాఖపట్నంలో ఒక చికెన్ వ్యాపారికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ ఘటనతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సదరు వ్యాపారి చికెన్ అమ్మినట్టు గుర్తించిన అధికారులు.. అతడి దగ్గర చికెన్ కొనుగోలు చేసిన వారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే అతడి దగ్గర చికెన్ కొనుగోలు చేసిన దాదాపు 14 మంది వివరాలను కనుగొన్నట్టు తెలుస్తోంది. మిగతా వారిని కూడా ట్రేస్ చేసేందుకు ప్రయత్నాలు వేగవంతం చేశారు. చికెన్ వ్యాపారి నుంచి మరికొందరికి కరోనా సోకకుండా అధికారుల చర్యలు తీసుకుంటున్నారు.

ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే వాదన వినిపిస్తోంది. కరోనా లక్షణాలతో ఎవరైనా వస్తే…వారి నుంచి నమూనాలు సేకరించి, నివేదిక వచ్చేంత వరకు ఐసోలేషన్‌ వార్డులోనో, క్వారంటైన్‌ సెంటర్‌ లోనో ఉంచాలి. ఈలోగా లక్షణాలను బట్టి చికిత్స అందించాలి. అదే నెగెటివ్‌ వస్తే జాగ్రత్తలు చెప్పి ఇంటికి పంపించాలి. కానీ గాజువాక యువకుడి నుంచి నమూనాలు సేకరించిన అనంతరం హోమ్‌ క్వారంటైన్‌ అని చెప్పి పంపించేశారు. దాంతో ఆ యువకుడు ఎప్పటిలాగే వ్యాపారం చేసుకున్నాడని తెలుస్తోంది..

Sakshi Dwivedi Photo Stills

Urvashi Rautela Latest Hot Stills

SR Kalyanamandapam Movie Stills

నాగ చైతన్య బ్యానర్ మార్చాడు


‘మజిలీ , వెంకీ మామ’ చిత్రాల విజయం తో నాగ చైతన్య సినీ నిర్మాతల దృష్టిని బాగా ఆకర్షించాడు. ఇపుడు పెద్ద పెద్ద నిర్మాతలు అక్కినేని నాగచైతన్య కాల్ షీట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ నాగ చైతన్య మాత్రం తొందర పడకుండా ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. ఆ క్రమంలో ఇప్పుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో `లవ్ స్టోరీ ` అనే చక్కటి ప్రేమ కథా చిత్రం చేస్తున్నాడు.దాదాపు షూటింగ్ మొత్తం ఫినిష్ చేసుకొన్న ఈ చిత్రం కరోనా వైరస్ హడావిడి తగ్గిన తర్వాత విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం తరవాత నాగ చైతన్య పరుశురామ్ దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్ ఫై సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. కాగా ఈ సినిమాకు ” నాగేశ్వరరావు” అనే టైటిల్ కూడా పెట్టారు. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి. అంతా ఓకే అనుకుంటోన్న తరుణంలో ప్రిన్స్ మహేష్ బాబు నుంచి పిలుపు రావడంతో దర్శకుడు పరుశురామ్ ప్రిన్స్ తో సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. దీంతో `నాగేశ్వరరావు ` మూవీ నిర్మాణం సందిగ్ధం లో పడింది.

అయితే నాగచైతన్య తమకు కేటాయించిన డేట్స్ 14 రీల్స్ ప్లస్ బ్యానర్ వేస్ట్ చేయదలుచుకోలేదు. ఆ కాల్ షీట్స్ ని దిల్ రాజు కి ఇచ్చేందుకు రెడీ అయ్యింది . ఆ క్రమంలో దిల్ రాజు బ్యానర్లో సినిమా చేయడానికి నాగచైతన్య కూడా ఆసక్తి గా ఉన్నాడట. ఆ క్రమంలో రైటర్ కం డైరెక్టర్ బీవీఎస్ రవి చెప్పిన ఓ కథను నాగచైతన్య ఓకే చేసాడట …కాగా ఆ చిత్రాన్నిమనం ఫేమ్ విక్రమ్ కుమార్ తెరకెక్కించనున్నాడని తెలుస్తోంది.

ఆల వైకుంఠపురంలో మంచి రేటుకి అమ్ముడుపోయింది


బన్నీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ” ఆల వైకుంఠపురం లో ” చిత్రం యొక్క హిందీ రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో రూపొందిన ఈ చిత్రం సంచలన వసూళ్లు రాబట్టింది. దాంతో హిందీ నిర్మాతల చూపు ఈ సినిమా ఫై పడింది . త్రివిక్రమ్ , బన్నీ కాంబో లో వచ్చిన ఈ చిత్రం వారికి ఈ హ్యాట్రిక్ మూవీ కాగా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రూ.220 కోట్ల పైగా వసూళ్లను సాధించి నాన్ బాహుబలి రికార్డులను సొంతం చేసుకుంది.

‘అల వైకుంఠపుములో’ సక్సెస్ చూసిన బాలీవుడ్ మేకర్ అశ్విన్ వర్దే ఈ సినిమా రీమేక్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకున్నాడట. సుమారు 8 కోట్లతో అశ్విన్ వర్దే ఈ చిత్రం యొక్క రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నాడట. నిజానికి ఈ చిత్రాన్ని అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ హిందీ లో రీమేక్ చేస్తే బాగుంటుందని అనుకున్నాడట..కానీ లేటెస్ట్ సమాచారం మేరకు అల వైకుంఠపురములో బాలీవుడ్ రీమేక్ హక్కులు కబీర్ సింగ్ ( హిందీ అర్జున్ రెడ్డి) నిర్మాత అయిన అశ్విన్ వర్దే దక్కించు కొన్నాడని తెలిసింది. కాగా హిందీ వెర్షన్ లో బన్నీ పాత్రని అక్షయ్ కుమార్ పోషించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. remaes are safe bets

వాట్సాప్ కొత్త రూల్!

దేశంలో కరోనా పై వైరల్ గా మారిన అసత్య, నకిలీ వార్తలకు, వదంతులకు చెక్ పెట్టేందుకు వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి తరుచుగా షేర్ చేసిన సందేశాన్ని లేదా, వీడియోను ఒకసారి ఒక చాట్ కు మాత్రమే ఫార్వార్డ్ చేసేలా వాట్సాప్ ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో మెసేజ్ షేరింగ్ యాప్ వాట్సాప్ లో ఆన్‌ లైన్‌ లో తప్పుడు సమాచారాన్ని తెలుసుకునే వాట్సాప్ కొత్త ఆంక్షలను విధించింది. ఇక మీద తరుచుగా షేర్ చేసిన సందేశాన్ని లేదా, వీడియోను ఒక చాట్ కు ఒక్కసారి మాత్రమే ఫార్వార్డ్ చేసేలా పరిమితి విధించింది. ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ వినియోగదారులకు ఈ రోజునుంచే ఈ కొత్త నిబంధన వర్తించనుంది. అలాగే తరచుగా ఫార్వార్డ్ చేయబడిన సందేశాలను వాట్సాప్‌ లో డబుల్ టిక్‌ ద్వారా సూచిస్తుంది.

వాట్సాప్ లో ఐదుసార్లు లేదా అంతకంటే ఎక్కువసార్లు షేర్ చేయబడిన సందేశాలను ఒక చాట్‌ కు మాత్రమే ఫార్వార్డ్ చేయగలం. అలాగే తరచుగా ఫార్వార్డ్ చేసిన వాటిని యూజర్లు గుర్తించేలా డబుల్ టిక్ తో హైలైట్ చేస్తుంది. గతంలో నకిలీ వార్తలను అడ్డుకునే నేపథ్యంలో ఐదుసార్లకు మించి ఫార్వార్డ్ చేయకుండా పరిమితి విధించడంతో 25 శాతం ఫేక్ న్యూస్ బెడద తప్పిందని వాట్సాప్ తెలిపింది. ఈ నేపథ్యంలోనే తాజా నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.

కేసీఆర్ ఏలుబడి ప్రభుత్వ ఆసుపత్రులకు మహర్దశ!


గతంలో మంచి వైద్య నిపుణుల సేవలు ప్రభుత్వ ఆసుపత్రులలో మాత్రమే లభిస్తూ ఉండెడివి. కానీ ఆర్ధిక సంస్కరణల నేపథ్యంలో అవి పడక వేస్తుండగా, కార్పొరేట్ ఆసుపత్రులు విజృంభించి, ప్రజలను రోగాల పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నాయి.

అయితే కరోనా మహమ్మారి కట్టడిలో కేవలం ప్రభుత్వ ఆసుపత్రులను మాత్రమే ఉపయోగించుకోవడం ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి చందద్రశేఖరరావు వాటికి మహర్దశ కలిగిస్తున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రులు ఇంతటి ఉత్తమ వైద్య సేవలు అందించగలవా అంటూ ప్రజలు అచ్చెరువు పోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న పరీక్షలు, చికిత్సలు ప్రజల్లో వాటి పట్ల విశ్వాసాన్ని పెంపొందిస్తున్నాయి.

కరోనా నుండి బైట పడినవారు ప్రభుత్వ ఆసుపత్రుల గురించి చెబుతున్న అనుభవాలు ప్రజలకు విస్మయం కలిగిస్తున్నాయి.
గతంలో సాధారణ ప్రజలు సహితం ప్రభుత్వ ఆసుపత్రులు అంటే భయపడేవారు. భారమైనా, అప్పు చేసైనా ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్యానికి సిద్ధమయ్యేవారు.

కరోనా టెస్ట్ ల నుండి వైద్యం దాకా ఇప్పటి దాకా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించకుండా ప్రభుత్వ ఆసుపత్రులతోనే కరోనాను ఎదుర్కొనే విధంగా ధృడ సంకల్పం చూపుతున్నది. అందుకు అవసరమైన సదుపాయాలు, మందుల సరఫరా చేస్తున్నది.

ఎంత మందికి కరోనా పాజిటివ్ వచ్చినా చికిత్స సంపూర్ణంగా అందించడానికి వైద్య ఆరోగ్య యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తున్నట్లు కేసీఆర్ భరోసా ఇస్తున్నారు. అత్యవసరం ఎదురైతే సేవలు అందించే విధంగా 25,000 మంది వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిని కూడా అందుబాటులో సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు.

దేశంలోనే ప్రసిద్ధి చెందిన ప్రైవేట్/కార్పొరేట్ ఆసుపత్రులు హైదరాబాద్ లో ఉన్నాయి. వారెంత ఒత్తిడి తెచ్చినా, కరోనా టెస్ట్ లు జరిపేందుకు ఐసిఎంఆర్ నుండి అనుమతులు తెచ్చుకున్నా కేసీఆర్ అనుమతించడం లేదు. దానితో కార్పొరేట్ ఆసుపత్రులు అన్ని రోగులు లేక ఈగలు తోలుకొని పరిస్థితుల్లో ఉన్నాయి.

ప్రభుత్వాసుపత్రులు కరోనాను ఎదుర్కోవడంలో చతికిలపడితే తప్ప తాను ప్రైవేటు ఆసుపత్రుల సేవలకు అంగీకరించే ప్రసక్తి లేడనై కేసీఆర్ స్పష్టం చేస్తున్నారు. పైగా ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిని ప్రోత్సహించడం కోసం వారికి ఈ నెల వారి మూలా వేతనంలో 15 శాతం అదనంగా చెల్లిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.

రూ. 12 కోట్లతో కరోనా రోగులకు చికిత్స అందించే వైద్యులకు, సిబ్బందికి ఇవ్వడానికి లక్ష పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్‌ను, చికిత్సలో కీలకమైన 2200 వెంటిలేటర్లను కూడా సిద్ధం చేశారు. కరోనాలో ప్రధాన సమస్యగా మారిన వ్యాధిని నిర్ధారించే 500 టెస్టు కిట్లను తీసుకు రాబోతున్నారు. వీటితో 50,000 మందికిపైగా కొన్ని గంటల్లో చికిత్స ఉందా లేదా అని నిర్ధారించవచ్చు.

అలాగే ఈ వ్యాధి నిర్ధారణ అయిన వారికి కాస్తో కూస్తో ఉపశమనం కలిగిస్తుందని చెపుతున్న హైడ్రాక్సి క్లోరో క్వీన్ మాత్రలను 50 లక్షల దాకా అప్పుడే సమకూర్చుకున్నారు. ఇంకా 20 లక్షల ఐవి ఫ్లూయిడ్స్, 50 లక్షల శానిటైజర్లు, మాస్కు లు, శ్వాస సంబంధ పరికరాలను అందుబాటులో పెట్టారు. ఎలాంటి ఎమర్జెన్సీ వచ్చినా తట్టుకోడానికి 8 దాకా ప్రభుత్వాసుపత్రులను నోటిఫై చేశారు.

గతంలో అంతగా సౌకర్యాలు లేని కింగ్ కోఠి ఆసుపత్రిని యుద్ధ ప్రాతిపదికన కరోనాకు అనుగుణంగా సదుపాయాలు సమకూర్చారు. గచ్చిబౌలి లాంటి ప్రాంతాల ప్రభుత్వ ప్రాంగణాలను సకల సౌకర్యాల కరోనా ఆసుపత్రులుగా మార్చారు. ముందే ఉపద్రవా న్ని దృష్టిలో పెట్టుకొని, కేసీఆర్ స్వయంగా ప్రధాని మోదీని అభ్యర్ధించి, దేశీయంగా పేరు ప్రతిష్ఠలున్న సిసిఎంబిని తగిన సౌకర్యాలతో త్వరితగతిన కరోనా పరీక్షలకు సిద్ధం చేసింది.