
విశాఖపట్నంలో ఒక చికెన్ వ్యాపారికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ ఘటనతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సదరు వ్యాపారి చికెన్ అమ్మినట్టు గుర్తించిన అధికారులు.. అతడి దగ్గర చికెన్ కొనుగోలు చేసిన వారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే అతడి దగ్గర చికెన్ కొనుగోలు చేసిన దాదాపు 14 మంది వివరాలను కనుగొన్నట్టు తెలుస్తోంది. మిగతా వారిని కూడా ట్రేస్ చేసేందుకు ప్రయత్నాలు వేగవంతం చేశారు. చికెన్ వ్యాపారి నుంచి మరికొందరికి కరోనా సోకకుండా అధికారుల చర్యలు తీసుకుంటున్నారు.
ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే వాదన వినిపిస్తోంది. కరోనా లక్షణాలతో ఎవరైనా వస్తే…వారి నుంచి నమూనాలు సేకరించి, నివేదిక వచ్చేంత వరకు ఐసోలేషన్ వార్డులోనో, క్వారంటైన్ సెంటర్ లోనో ఉంచాలి. ఈలోగా లక్షణాలను బట్టి చికిత్స అందించాలి. అదే నెగెటివ్ వస్తే జాగ్రత్తలు చెప్పి ఇంటికి పంపించాలి. కానీ గాజువాక యువకుడి నుంచి నమూనాలు సేకరించిన అనంతరం హోమ్ క్వారంటైన్ అని చెప్పి పంపించేశారు. దాంతో ఆ యువకుడు ఎప్పటిలాగే వ్యాపారం చేసుకున్నాడని తెలుస్తోంది..