Home Blog Page 8543

బాలయ్య సినిమాకి బుర్రాని వాడుతున్న గోపాల్


నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బి.గోపాల్ ల కాంబో సూపర్ హిట్ కాంబినేషన్.అనక తప్పదు. వీరిద్దరి కాంబినేషన్ లో అయిదు సినిమాలు రాగా వాటిలో నాలుగు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక బాలయ్య కెరీర్లోనే సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచిన ‘సమరసింహారెడ్డి, నరసింహనాయుడు’ సినిమాలు బి గోపాల్ దర్శకత్వంలో వచ్చినవే.

కాగా చానాళ్ల తరవాత మళ్లీయే వీరిద్దరి కలయికలో ఒక చిత్రం రాబోతుంది. ప్రస్తుతం దర్శకుడు బి. గోపాల్ ఫామ్ లో లేడు. పైగా అవుట్ డేటెడ్ డైరెక్టర్ అని ముద్ర కూడా ఆడింది. కానీ బాలయ్య మాత్రం ఇవేవి పట్టించు కోకుండా తన తరువాత సినిమాని బి గోపాలే డైరెక్ట్ చెయ్యాలని పట్టు బడుతున్నాడట… దాంతో బి. గోపాల్ ప్రస్తుతం ఫామ్ లో ఉన్న టాప్ రైటర్ బుర్రా సాయి మాధవ్ చేత స్క్రిప్ట్ రాయిస్తున్నాడు. కాగా బుర్రా సాయి మాధవ్ ఫుల్ యాక్షన్ తో కూడుకున్న ఎమోషనల్ ఎంటర్ టైనర్ కి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది.

కాగా ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ నెలలో ప్రారంభం అవుతుందట. ప్రస్తుతం బాలయ్య బాబు ఫార్మ్ మసక బారింది. ఈ మధ్య చెప్పుకో తగ్గ విజయాలు రాలేదు. అందుకే ఈ సూపర్ హిట్ కాంబో మళ్లీ సెట్ చేయడం జరిగింది. ప్రస్తుతం లెజెండ్ వంటి సూపర్ హిట్ మూవీ తీసిన ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య సినిమా చేస్తున్నాడు. దాని తరవాత ఈ బి గోపాల్, బాలయ్య బాబు చిత్రం పట్టాలెక్కుతోంది.

24 గంటల్లో 773 కొత్త కరోనా కేసులు!

దేశంలో గడిచిన 24గంటల్లో 773 కొత్త కరోనా కేసులు నమోదయినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లావ్ అగర్వాల్ స్పష్టం చేశారు. ఈ రోజు కరోనావైరస్ సంక్రమణ కేసుల సంఖ్య 5,194 గా, మరణాల సంఖ్య 149 గా ఉందని ఆయన తెలిపారు.

ఆసుపత్రులలో, ఆరోగ్య కార్యకర్తలు కోవిద్-19 బారిన పడకుండా సంక్రమణ నివారణ మరియు నియంత్రణ చర్యలను అనుసరిస్తారని అగర్వాల్ అన్నారు.

ఆసుపత్రులను నిర్మించడం, నిఘా మరియు కాంటాక్ట్ ట్రేసింగ్‌ పై దృష్టి సారించాలని కేంద్రం, రాష్ట్రాలకు చెప్పిందని ఆయన అన్నారు. దేశంలో తగినంత హైడ్రాక్సీక్లోరోక్విన్ నిల్వ ఉందని ఆయన అన్నారు.

దేశంలో ఇప్పటివరకు కోవిద్ 19 కోసం 1,21,271 పరీక్షలు జరిగాయని, అందులో ఈరోజు 773 కొత్త కేసులు మమొదయ్యాయి మరియు గత 24గంటల్లో 32మంది మరణించారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) అధికారి ఒకరు చెప్పారు.

ముగిసిన మోడీ అఖిలపక్ష సమావేశం…కీలక నిర్ణయం

ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ ఏకకాలంలో ఎత్తివేయబడదని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల వల్ల మోడీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. దేశంలో లాక్ డౌన్ గడువు పెంచాలని పిఎం మోడీ సమావేశంలో సూచించారు. ప్రధాని సమావేశంలో కాంగ్రెస్‌ తో సహా దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో, కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి ప్రధాని సంచారం ఇచ్చారు మరియు వివిధ రాజకీయ నాయకుల నుండి వారి వారి అభిప్రాయాన్ని కోరారు. అదే సమయంలో ఏప్రిల్ 11 న మళ్లీ అన్ని రాష్ట్రాల సిఎంలతో మాట్లాడతానని ప్రధాని చెప్పారు.

ఎంపీలతో సంభాషణ సందర్భంగా పిఎం మోడీ మాట్లాడుతూ దేశంలో పరిస్థితి ‘సామాజిక అత్యవసర పరిస్థితి’తో సమానమని, దీని కోసం కఠినమైన నిర్ణయాలు అవసరమని, మేము అప్రమత్తంగా ఉండాలని ప్రధాని తెలిపారు. వైరస్ వ్యాప్తిని నివారించడానికి లాక్డౌన్ ను మరింత ప్రోత్సహించాలని సూచించారు.

లాక్‌డౌన్ పొడిగింపు తధ్యం… ప్రధాని మోదీ సంకేతం

ఈ నెల 14తో ముగియనున్న లాక్‌డౌన్ ను పొడిగించడం అనివార్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టమైన సంకేతం ఇచ్చారు. ఇప్పటి వరకు దీనిని తొలగించమని తనకు ఎవ్వరు సూచించలేదని చెబుతూ ఒకే సారి తొలగించడం కూడా జరగదని కూడా స్పష్టం చేశారు. దశల వారీగా సడలించే అవకాశం ఉంటుందని సూచించారు.

పార్లమెంట్ లోని వివిధ పక్షాల నేతలతో బుధవారం జరిపిన వీడియో కాన్ఫరెన్స్ లో ఈ నెల 11న ముఖ్యమంత్రులతో జరుపనున్న వీడియో కాన్ఫరెన్స్ లో ఈ విషయమై ఒక నిర్ణయం తీసుకోవచ్చని సంకేతం ఇచ్చారు. ప్రజల ప్రాణాలను కాపాడుకోవాలంటే లాక్‌డౌన్ ఒక్కటే ఏకైక పరిష్కారమని మోదీ స్పష్ట చేసిన్నట్లు తెలుస్తుంది.

‘‘ప్రజల ప్రాణ రక్షణకై లాక్‌డౌనే పరిష్కారం. నేను ప్రతిరోజూ అన్ని రాష్ట్రాల సీఎంలతో, నిపుణులతో చర్చిస్తూనే ఉన్నా. లాక్‌డౌన్ ఎత్తివేయాలని ఏ ఒక్కరూ అభిప్రాయపడలేదు. మరోసారి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడతా. ఇప్పటి వరకైతే మొత్తానికి మొత్తం లాక్‌డౌన్ ఎత్తేయడం సాధ్యం కాకపోవచ్చు” అని చెప్పారు.

“జిల్లా అధికారులతో కూడా మాట్లాడుతున్నాము. సామాజిక దూరం పాటించే విషయంలో మనం మరింత కఠినంగా ఉండాల్సిందే. మున్ముందు మరిన్ని ఊహించని నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు’’ అని మోదీ సూచించారు.

కాగా వనరుల విషయంలో తీవ్రమైన వత్తిడులు ఉన్నప్పటికీ కరోనా వ్యాప్తిని కట్టడి చేసిన దేశాలలో భారత్ ఒకటని ఈ సందర్భంగా ప్రధాని చెప్పారు. రాజకీయ పక్షాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, భారత ప్రజల సహకారంతో ఈ ప్రాణాంతక వైరస్ పై దేశం విజయవంతంగా పోరాటం జరపగలదని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ప్రతిపక్షాలు ప్రభుత్వానికి అందిస్తున్న సహకారం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఈ సహకారం ఎంతగానో ఉపయోగపడుతుందని, ఈ సవాల్ ను ఎదుర్కోవడానికి చాలా అవసరమని కూడా పేర్కొన్నారు.

దేశంలో పరిస్థితి సామాజిక అత్యవసర పరిస్థితికి సమానంగా కనిపిస్తోందని, మరిన్ని కఠిన నిర్ణయాలు అవసరమని, మరింత జాగరూకతతో వ్యవహారించాల్సి ఉందని అఖిలపక్ష నేతలో మోదీ పేర్కొన్నట్లు తెలుస్తున్నది.

ఏప్రిల్ 14 తర్వాత లాక్‌డౌన్ ఎత్తేసే అవకాశాలు కనిపించడం లేదని, కరోనాకు ముందు పరిస్థితి, తర్వాత పరిస్థితి అన్నట్లుగా మారుతుందని ఫ్లోర్ లీడర్లతో ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.

సి సి సి ద్వారా సినీ కార్మికులకు గుర్తింపు కార్డులు


కరోనా వైరస్ ప్రభావం తో మొత్తం సినిమా రంగం అంతా కుదేలు అయిపోవడంతో, సినీ కార్మికులు నానా అవస్థలు పడుతున్నారని గ్రహించి, వారికి ఎంతో కొంత మేలు చేయాలని తెలుగు సినీ రంగానికి చెందిన పెద్దలు నడుం బిగించారు. ఈ విషయంలో దేశంలోని మిగతా భాషల తారలతో పోలిస్తే తెలుగు హీరోలు సహాయం చెయ్యడం విషయంలో కొంచెం ముందే ఉన్నారు. సినీ కార్మికుల కోసం పెద్ద ఎత్తున విరాళాలు సేకరించడం మొదలెట్టారు. `కరోనా క్రైసిస్ చారిటీ ` ( సి సి సి ) అనే నిధిని ఏర్పాటు చేశారు. మెగాస్టార్ చిరంజీవి అద్వర్యంలో ఈ సేవా కార్యక్రమాల్ని నడిపిస్తున్నారు. ఇప్పటిదాకా టాలీవుడ్ కార్మికుల కోసం రూ.7 కోట్లకు పైగానే విరాళాలు వసూలైనట్లు తెలుస్తోంది.

ఈ విరాళాల నుంచి సాయం కావాల్సిన కార్మికులందరూ తమ పేర్లను ఫిలిం ఛాంబర్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసి యేషన్ , 24 క్రాఫ్ట్స్ కి చెందిన సినీ సంస్థల వద్ద నమోదు చేసుకోవాలి. అలా అన్నిసినీ క్రాఫ్ట్స్ కి చెందిన కార్మికుల వివరాలు సేకరించి.. వారికి ఎలక్ట్రానికి గుర్తింపు కార్డులు ఇస్తున్నారు.

ఈ ఎలక్ట్రానిక్ గుర్తింపు కార్డుల్ని సినీ కార్మికులకు అందజేసి తద్వారా ఒక నెలకు సరిపడా 2250 రూపాయల విలువైన నిత్యావసర సరకులు ఇవ్వబోతున్నారు. దీంతో పాటు కొంత ఆర్థిక సాయం కూడా ఇవ్వనున్నారు .. ఈ కార్డుల్ని మొబైల్ నంబర్ తో అనుసంధానం చేయడం జరుగుతుంది తద్వారా ప్రతి ఒక్క కార్మికుడికీ సాయం అందుతోందా లేదా అన్నది పర్యవేక్షణ చేయడం కూడా జరుగుతుంది. ఒకవేళ లాక్ డౌన్ పొడిగిస్తే ఇంకో నెల కూడా ఇలాగే సాయం అందిస్తారు.

అదలా ఉంటే ఈ ఎలక్ట్రానిక్ కార్డు తో పాటు మందుల చీటీ పట్టుకుని అపోలో మెడికల్ షాప్ కి వెళ్తే రూ.500 మొత్తానికి సరిపడా మెడిసిన్స్ ఉచితంగా ఇవ్వబడతాయి. రామ్ చరణ్ సతిమని , చిరంజీవి కోడలు అయిన ఉపాసన కొణెదల ఈ ఉచిత మందుల పంపిణీ కి పూనుకోవడం విశేషం .

కరోనా పేషంట్లకు మిస్ ఇంగ్లండ్ ట్రీట్మెంట్


కరోనా.. కరోనా.. కరోనా.. ఎక్కడ చూసినా కరోనానే. ఈ పేరు వింటనే ప్రపంచ దేశాలు బెంబెలెత్తిపోతున్నాయి. చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచంలోని అన్నిదేశాలకు పాకింది. కరోనా మహమ్మరి ధాటికి అగ్రరాజ్యాలు సైతం చేతులేత్తిసున్నాయి. అమెరికా, ఇటలీ, బ్రిటన్, స్పెయిన్ దేశాల్లో కరోనా విలయతాండవం చేస్తుంది. ఈ దేశాల్లో కరోనా మృతుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఇక బ్రిటన్లో ప్రధాని బోరిస్ కే కు కరోనా సోకిందంటే అక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

బ్రిటన్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో వైద్యుల కొరత ఏర్పడింది. ఈనేపథ్యంలో కరోనా బాధితులకు వైద్య సేవలందించేందుకు మిస్ ఇంగ్లండ్ ముందుకొచ్చి మానవత్వాన్ని చాటుకుంది. మిస్ ఇంగ్లండ్ కిరీటాన్ని గెలుపొందిన భాషా ముఖర్జీ తన మోడలింగ్ ను కూడా పక్కన పెట్టి డాక్టర్ అవతారమెత్తారు. దేశంలో నెలకొన్న సంక్షోభం దృష్ట్యా ఆమె మళ్లీ వైద్య వృత్తిలోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఆమె శ్వాసకోశ వైద్యంలో ఎంఎస్ చేశారు. అయితే మోడలింగ్ రంగంపై ఆసక్తితో వైద్య వృత్తి వదిలి మిస్ ఇంగ్లండ్ గా కిరీటం గెలిచింది.

భాషా ముఖర్జీ ప్రవాస భారతీయురాలు కావడం విశేషం. 2019లో జూనియర్ వైద్య వృత్తినుంచి విరామం తీసుకున్నారు. తాజాగా బ్రిటన్లో పరిస్థితి దిగజారడంతో డాక్టర్ గా విధులు నిర్వహిస్తూ కరోనా బాధితులకు వైద్యం అందిస్తోంది. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన సేవలను దేశానికి అందించడం గర్వంగా ఉందని ఆమె చెబుతోంది. మిస్ ఇంగ్లండ్ కీరిటాన్ని గెలుపొందిన భాషా ముఖర్జీ వైద్యురాలిగా సేవలందిస్తుండటంతో ఆమెపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

రూ.5000 గ్రాంట్ ప్రకటించిన జగన్ సర్కార్!

ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దింతో లాక్ డౌన్ ఎత్తివేసే ఆలోచనలో జగన్ సర్కార్ సిద్ధంగా లేదు. అయితే లాక్ డౌన్ సమయంలో ఇబ్బంది పడుతున్న పలు వర్గాలను ఆదుకోవాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం… ఈ క్రమంలో ఇప్పటికే పేదలకు ఉచిత రేషన్ బియ్యంతో పాటు ఒక్కో కుటుంబానికి ₹.1000 ఇస్తున్న విషయం తెలిసిందే.. అదేవిధంగా అర్చకులను ఆదుకునేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న దేవాలయాలలో పనిచేసే అర్చకుల కోసం ఒక్కొక్కరికి ₹.5000 గ్రాంటు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు.

కరోనా తీవ్రత దృష్ట్యా ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ఏప్రిల్ 14 వరకు దేవాలయాలలో భక్తులకు అనుమతి నిరాకరించడం జరిగింది. కేవలం అర్చకులు మాత్రమే నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. చిన్న దేవాలయాలలో అర్చకులు ఎటువంటి ఆదాయ వనరులు లేని కారణంగా అర్చకుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. దీంతో వారికి “ధూప దీప నైవేద్యం” మరియు “అర్చక వెల్ఫేర్ ఫండ్” ద్వారా 2800 పైగా అర్చకులకు లబ్ది చేకూరుతుంది. ఈ రెండు పథకాల్లో లేని వారు రాష్ట్ర వ్యాప్తంగా 2500 మంది దాకా ఉంటారని ప్రభుత్వం అంచనాకు వచ్చింది. వారిని దృష్టిలో పెట్టుకొని సీఎం జగన్ ఆదేశాల మేరకు ఈ ప్రతిపాదన చేశామని ఆయన తెలిపారు. ఏ పథకం క్రింద లబ్దిచేకూరని అర్చకులకు “అర్చక వెల్ఫేర్ ఫండ్” ద్వారా ఒక్కొక్కరికి ₹. 5000 గ్రాంటు మంజూరు చేయబడుతుందని ఆయన వివరించారు. దీని వల్ల ప్రభుత్వంపై కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల భారం పడుతుందని అధికారులు అంచనా వేశారు.

Sakshi Agarwal Stunning Pictures

Parul Yadav Latest Photo Stills

యూనియన్ కోవిడ్-19 సువిధ లోన్ ఆఫర్


కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా రిజర్వ్ బాంక్ విధించిన మరిటోరియం నిబంధనలకు కట్టుబడి ఉన్నామని యూనియన్ బ్యాంక్ పేర్కొంది. 2020 మార్చి 1 నుండి మే 31 వరకు రుణాలు చెల్లించాలని స్వయం సహాయక సంఘాల సభ్యులపై ఒత్తిడి తీసుకురామని తెలిపింది. ప్రతి స్వయం ఉపాధి గ్రూపులోని సభ్యురాలు యూనియన్ కోవిడ్-19 సువిధ లోన్ కింద రూ. 5000 కరోన సహాయక లోన్ పొందవచ్చని పేర్కొంది. ఆంధ్రాబ్యాంక్ పార్వతీపురం శాఖ అధికారులు స్వయం ఉపాధి సంఘాల మహిళలను లోన్స్ బకాయిలు చెల్లించమని ఒత్తిడి చేస్తున్న విషయాన్ని ఎం.సింహాచలం అనే వ్యక్తి ట్విట్టర్ ద్వారా ఎంపీ కేశినేని నాని గారి దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశంపై కేశినేని నాని కేంద్ర ప్రభుత్వం లోన్స్ చెల్లింపుకు గడువు పొడిగించామని మోరటోరియం జారీచేసిన విషయాన్ని ప్రస్తుతం ఆంధ్రా బ్యాంక్ యూనియన్ బ్యాంక్ లో వీలీనమైన కారణంగా, యూనియన్ బ్యాంక్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరాగా యూనియన్ బ్యాంక్ అధికారులు ట్విట్టర్ లో ఈ విషయాన్ని వెల్లడించారు.

ట్రంప్ భారత్ ను హెచ్చరించారా!


మలేరియా చికిత్సకు ఉపయోగించే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ (హెచ్‌సీక్యూ) ఎగుమతులపై భారత్ విధించిన నిషేధాన్ని సడలించి అమెరికాకు సరఫరా చేయక పోతే ప్రతీకార చర్యలు ఉండగలవని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని హెచ్చరించారంటూ భారత దేశంలోని మీడియా మంగళవారం కధనాలు వెలువరించింది. .

పైగా, కొద్దీ గంటలలో ఎగుమతులపై నిషేధాన్ని భారత్ సడలించడంతో ట్రంప్ భయపడే ఆ విధంగా చేసిన్నట్లు కూడా అర్ధం వచ్చే విధంగా వ్యవహరించారు. అయితే అమెరికాతో పాటు మొత్తం 30 దేశాలకు ఎగుమతులు చేయడానికి భారత్ సడలించడం గమనార్హం.

అయితే భారత్ ను ట్రంప్ హెచ్చరించారని అంటూ అమెరికా మీడియాలో గాని, అంతర్జాతీయ మీడియాలో గాని ఎటువంటి కధనాలు రాలేదు. వైట్ హౌస్ లో జరిగిన మీడియా సమావేశాన్ని పూర్తిగా పరిశీలించిన వారికి ఇదంతా అభూత కల్పన అని స్పష్టం అవుతుంది. ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు ట్రంప్ ఇచ్చిన సమాధానాన్ని వక్రీకరించి వైనం స్పష్టం అవుతుంది.

ఒక మీడియా ప్రతినిధి భారత్ నిషేధం ఎత్తివేయని పక్షంలో ప్రతీకార చర్యలు ఉంటాయా అని అడిగితే “అట్లా ఎందుకు జరుగుతుంది? నేను ప్రధాని మోదీతో మాట్లాడాను” అంటూ ట్రంప్ స్పష్టంగా చెప్పారు. పైగా, మీడియా సమావేశంలో పలు సందర్భాలలో అమెరికాకు భారత్ చాలాముఖ్యమైన భాగస్వామి అంటూ, భారత్ వాటిని సరఫరా చేస్తుందని ఆశిస్తున్నట్లు కూడా స్పష్టం చేశారు.

అయితే చివరిలో అమెరికా వైద్య పరికరాల ఎగుమతులను నిషేధించినందుకు ప్రతీకారంగా భారత్ ఈ మందులను నిషేధించిందా అని అడిగితే “ఎందుకు కాకూడదు” అంటూ యధాలాపంగా ట్రంప్ అన్నారు. అయితే వెంటనే భారత్ అమెరికాకు మాత్రమే నిషేధింపలేదని, అనేక దేశాలకు కూడా నిషేధించిందని చెప్పడం గమనార్హం.

పైగా, ఇదంతా ఒక మీడియా వ్యక్తికి, ట్రంప్ కు మధ్య జరిగిన సంభాషణ మాత్రమే. ట్రంప్ ప్రకటన కానేకాదు. భారత్ ప్రతీకారాన్ని దిగే అవకాశం గురించి ట్రంప్ ప్రస్తావించారు గాని, ఆయన ఎక్కడ భారత్ కు హెచ్చరిక చేయలేదు. పైగా తన కోర్కెను మోదీ మన్నిస్తారని కూడా విశ్వాసం వ్యక్తం చేశారు.

ట్విట్టర్ సీఈఓ భారీ విరాళం

కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ట్విటర్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో జాక్‌ డోర్సే ఒక బిలియన్ డాలర్ల భారీ విరాళం ప్రకటించారు. డిజిటల్‌ పేమెంట్‌ గ్రూప్‌ నకు సంబంధించిన తన వాటా నుంచి ఈ మొత్తాన్ని బదిలీ చేస్తున్నట్లు తెలిపారు. ఫోర్బ్స్ అంచనా ప్రకారం జాక్ డోర్సీ ఆదాయం 3.3 బిలియన్ డాలర్లు. తన సంపదలో నాలుగింట ఒక వంతు మొత్తాన్ని అతని ఛారిటీ ఫండ్‌ కు విరాళంగా ఇస్తానని, అన్ని విరాళాల వివరాలు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో వుంటాంటూ దీనికి సంబంధించిన లింక్ ను కూడా షేర్ చేశారు జాక్ డేర్సే. కరోనా కట్టడి, ఇతర సహాయక చర్యల కోసం ఈ నిధులను వెచ్చించనున్నట్టు ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు. తన ఆధ్వర్యంలోని స్వచ్ఛంధ సంస్థ స్టార్ట్ స్మాల్ ఎల్‌ ఎల్‌ సీ ద్వారా ఈ నిధులను కొవిడ్-19 కట్టడికి వినియోగాస్తానని తెలిపారు. భూమ్మిద నుంచి కరోనా పారిపోయాకు..తాను బాలిక విద్య, ఆరోగ్యం, కనీస ఆదాయం వంటి సంక్షేమ కార్యక్రమాలవైపు దృష్టిపెడతానన్నారు.

మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. జాక్ డోర్సీ.. తన దాతృత్వానికి సంబంధించిన వివరాలను ఇంతకాలం గోప్యంగా ఉంచారు. కానీ ఇకపై స్వచ్చంధ సంస్థ ద్వారా చేయబోయే వ్యయాలన్ని ప్రజలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. కాగా.. ఈ నిధులను సమకూర్చేందుకు జాక్ డార్సీ ట్విటర్‌లో తనకున్న వాటాలపై ఆధారపడలేదు. అందుకు బదులుగా.. స్కేర్ ఐఎన్‌సీలో అనే పేమెంట్ ప్రోసెసింగ్ సంస్థలో తనపేర ఉన్న షేర్లు విక్రయించడం ద్వారా ఆయన నిధులను సేకరించనున్నారు. స్కేర్‌ ఐఎన్‌సీలో ఎక్కువ వాటా ఉండటమే ఈ నిర్ణయానికి కారణమని జాక్ డోర్సీ వెల్లడించారు.

సంచలన వ్యాఖ్యలు చేసిన డాక్టర్ సస్పెన్షన్

నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రి ఎనస్ధిషియన్ డాక్టర్ కె. సుధాకర రావు సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు వైద్య విధాన పరిషత్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే తగిన రక్షణ సామగ్రి లేకుండా కరోనా వైరస్‌ అనుమానిత లక్షణాలు ఉన్న వారికి వైద్యం చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారంటూ డాక్టర్ సుధాకర్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కరోనా కట్టడి విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటూ, ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆయన చేసిన ఆరోపణలు రాజకీయంగా తీవ్ర దుమారం లేపాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి.

సోమవారం సాయంత్రం మునిసిపల్‌ కార్యాలయంలో అధికారుల సమీక్షా సమావేశం జరుగుతున్న సమయంలో అక్కడకు వచ్చిన డాక్టర్‌ సుధాకర రావు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపైనా, వివిధ శాఖల ఉన్నతాధికారులపైనా తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు మంగళవారం పత్రికల్లో రావడం, వార్తా ఛానెళ్లలో ప్రసారం కావడంతో ప్రభుత్వం స్పందించింది. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు వివిధ శాఖల ఉన్నతాధికారులు మంగళవారం ప్రాంతీయ ఆస్పత్రికి వచ్చి విచారణ జరిపారు. మరోవైపు నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌ విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి డాక్టర్‌ చేసిన ఆరోపణలను ప్రతిపక్ష టీడీపీ కుట్ర అంటూ విమర్శించారు. డాక్టర్‌ సుధాకర్‌ మునిసిపల్‌ కార్యాలయానికి వచ్చే ముందు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి ఇంటికి వెళ్లివచ్చినట్టు చెబుతూ, ఇందుకు సంబంధించిన వీడియాను తన ట్యాబ్‌లో ప్రదర్శించారు.

ఆ ఘటన వల్ల ఏపి లో శాంతించని కరోనా!


గత పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో కరోనా బాధితుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మార్చ్ 29 వ తేదీన రాష్ట్రంలో కేవలం కోవిడ్ – 19 పాజిటివ్ కేసులు కేవలం 21 ఉండగా ప్రస్తుతం వీటి సంఖ్య 329కి చేరింది. ఈ కొద్ది రోజుల్లో ఈ స్థాయిలో కరోనా వైరస్ దానికి ప్రధాన కారణాలు పరిశీలిస్తే తబ్లిగీ జమాత్ సదస్సులకు ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతానికి రాష్ట్రంలోని చాలా బ్లూ ఫిలింజిల్లాల నుంచి వందల సంఖ్యలో ఒక మతస్తులు వెళ్లి రావటమేనని స్పష్టమవుతుంది. తబ్లిగీ జమాత్ కు వెళ్లి వచ్చిన వారు 1,085 మంది ఉండగా, వీరి వల్ల ఇప్పటి వరకు రాష్ట్రంలో 280 కేసులు నమోదైనట్లు అధికారులు గుర్తించారు. ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో 997 మందికి పరీక్షలు, ఇందులో 196 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. వీరితో కాంటాక్ట్‌ అయిన వారు, కలిసి ప్రయాణించిన వారు, కనీసం 3–4 గంటలు వారితో ఉన్నవారిలో 2,400 మందికి పరీక్షలు నిర్వహించగా, 84 మందికి కోవిడ్‌ –19 పాజిటివ్‌గా తేలింది. విదేశాల నుంచి 29 వేలమంది రాష్టానికి రాగా వారికి 205 మందికి పరీక్షల నిర్వహించగా, ఇందులో 11 మందికి కరోనా పాజిటివ్‌ విదేశాల నుంచి వచ్చిన వారితో కాంటాక్టు అయిన 120 మందికి పరీక్షలు నిర్వహించగా వీరిలో ఆరుగురికి పాజిటివ్‌ వచ్చింది. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారి సంఖ్య భారీగా ఉన్న వారిలో కరోనా వైరస్ బారిన పడిన వారు తక్కువ మంది ఉన్నట్లు స్పష్టమౌతుంది.

కర్నూలు జిల్లాలో ఢిల్లీ వెళ్లి వచ్చిన 250 నమూనాలు సేకరించి పరీక్షలకు పంపగా 70 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. దేశవ్యాప్తంగా కరోనా కల్లోలానికి మార్కజ్ సదస్సులే కారణమని కేంద్ర హోం శాఖ ఇప్పటికే ప్రకటించింది. మన రాష్ట్రంలో పరిస్థితి ఎందుకేమీ భిన్నంగా లేదు. కరోనా కేసుల్లో 290 వరకూ ఢిల్లీ వెళ్లి వచ్చిన వారివే. రాష్ట్రంలో కరోనా కేసులన్నీ ఢిల్లీలోని మార్కస్ సంఘటనకు లింగయ్య ఉన్నవే. దీంతో ఢిల్లీ వెళ్లి వచ్చిన వారి కుటుంబ సభ్యులను, సన్నిహితులకు పూర్తిస్థాయిలో కరోనా టెస్టులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మోదీ నిర్ణయంపై ప్రపంచ దేశాల హర్షం


ప్రపంచ దేశాలకు హైడ్రాక్సీ క్లోరోక్వీన్ మందును సరఫరా చేయనున్నట్లు భారత్ ప్రకటించడంపై ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో భారత ప్రధాని మోదీని ఏకంగా హనుమంతుడితో పొల్చారు. కరోనా మహమ్మరికి హైడ్రాక్సీ క్లోరోక్వీన్ మందును నివారణ కోసం ఉపయోగిస్తున్నారు. ఈ మందును భారత్ అత్యధికంగా తయారు చేస్తుంది. ఇటీవల ఈ మందును కరోనా పేషంట్లు మోతాదుకు మించి వాడుతుండటంతో మృత్యువాతపడ్డారు. దీంతో భారత్ ఈ హైడ్రాక్సీ క్లోరోక్వీన్ మందు ఎగుమతులపై నిషేధం విధించింది. దీంతో ఈ డ్రగ్ సరఫరా నిలిచిపోయింది.

తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ దేశానికి హైడ్రాక్సీ క్లోరోక్వీన్ మందు సరఫరా చేయాలని కోరారు. దీనిపై ప్రధాని మోదీ మౌనం వహించారు. దీంతో ట్రంప్ బెదిరింపు ధోరణికి దిగారు. అమెరికా అధ్యక్షుడు ఈ డ్రగ్ సరఫరా చేయాలని కోరడంతో ఈ మందుకు ఫుల్ డిమాండ్ పెరిగింది. కరోనా మహమ్మరి నివారణలో ఈ మందు పని చేస్తుందని శాస్త్రీయంగా నిరూపణ కాకపోయినప్పటికీ మానవతా దృక్పథంతో ఈ డ్రగ్ సరఫరాకు భారత్ అంగీకరించింది. హైడ్రాక్సీ క్లోరోక్వీన్ మందుపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించడంతోపాటు అవసరమైన దేశాలకు ఈ డ్రగ్ సరఫరా చేస్తామని మోదీ ప్రకటించారు. దీంతో మోడీ నిర్ణయంపై ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో భారత ప్రధాని మోదీ ప్రపంచ దేశాలకు సంజీవని లాంటి హైడ్రాక్సీ క్లోరోక్వీన్ మందు అందజేస్తున్నారని బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో కొనియాడారు. భారత్ నిర్ణయంపై ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి వరకు బెదిరింపులకు దిగిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం మోదీ మహానీయుడంటూ కీర్తిస్తున్నాడు. బ్రెజిల్ అధ్యక్షుడు మోదీని హనుమంతుడితో పొల్చుతూ ప్రధానికి లేఖ రాశారు. నేడు హనుమన్ జయంతి కావడంతో ఆయన చెప్పిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

బుట్టబొమ్మ పాటకు మరో అరుదైన రికార్డు


ఈ దశాబ్దం లో విడుదలైన తెలుగు చిత్రాల్లోని పాటల్లో అల వైకుంఠ పురములో పాటలకు వచ్చినంత ఆదరణ మరే సినిమాకు రాలేదు అనడం లో అతిశయోక్తి లేదు. అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం పాటల వల్లే బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఇక ఈ చిత్రం లోని పాటల విషయానికి వస్తే. సినిమా విడుదలకు ముందే లిరికల్ వీడియో సాంగ్స్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ‘సామజవరగమన..’, ‘రాములో రాముల …’, ‘బుట్టబొమ్మ..’ వంటి సాంగ్స్ కి విపరీతమైన క్రేజ్ దక్కింది. కాగా ఒక్కొక్క సాంగ్ ఇపుడు వంద మిలియన్ మార్కును అలవోకగా చేరుకున్నాయి.

ఇక సినిమా విడుదల తర్వాత ` బుట్టబొమ్మ` సాంగ్ టాప్ సాంగ్ గా నిలిచింది. ఆ పాటలో మంచి ట్యూన్తో పాటు బన్నీ డాన్స్ కూడా పెద్ద అడ్వాంటేజ్ కావడంతో శిల్పాశెట్టి, దిశా పటానీ వంటి బాలీవుడ్ హీరోయిన్ లకు కూడా ఆ పాట పిచ్చ పిచ్చగా నచ్చింది. తాజాగా ఈ సాంగ్ ఓ కొత్త రికార్డ్ ని క్రియేట్ చేసింది. వంద మిలియన్ వ్యూస్ తో పాటు.. వన్ మిలియన్ లైకులను కూడా సంపాదించుకుంది. వన్ మిలియన్ అంటే పది లక్షల లైకులను సంపాదించుకున్న తెలుగు పాటగా ఒక అనితర రికార్డ్ సాధించింది. ‘”బుట్టబొమ్మ.” పాట…..

‘అకీరా’కు అదిరిపోయే విషెస్ చెప్పిన మెగాస్టార్


పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ కు మెగాస్టార్ చిరంజీవి అదిరిపోయేలా విషెస్ చెప్పారు. అకీరా చిన్నతనంలో మెగాస్టార్ ఎత్తుకొని దిగిన ఫొటోను అభిమానులకు షేర్ చేస్తూ విషెస్ చెప్పడం ఆకట్టుకుంది. ‘మన బిడ్డ మనకంటే ఎత్తుకు ఎదగాలని కోరుకుంటాం.. నా చేతిలో ఒదిగిపోయిన ఈ బిడ్డ, ఎత్తులో అందరికంటే ఎదిగిపోయాడు(6’4). అన్ని విషయాల్లోనూ అందరిని ఇలానే మించిపోవాలని కోరుకుంటున్నా.. విష్ యూ ఏ ‘పవర్`ఫుల్ ఫ్యూచర్. హ్యాపీ బర్త్‌డే అకీరా’ అంటూ మెగాస్టార్ తన ట్వీటర్లో ట్వీట్ చేశాడు.

అదేవిధంగా నేడు మెగా ఫ్యామిలీ చెందిన మరో హీరో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే. ‘బన్నీ.. నీవు బాగుండలబ్బా’ అంటూ మెగాస్టార్ అల్లు అర్జున్ కు విషెస్ చెప్పడం అభిమానులను ఆకట్టుకుంది. అల్లు అర్జున్ తో తనకున్న అనుబంధాన్ని అభిమానులతో పంచుకున్నారు. చిన్నతనం నుంచి డాన్స్ లో అల్లు అర్జున్ లో కసి, కృషి అంటే తనకిష్టమని ట్వీటర్లో ట్వీట్ చేసి విషెస్ చెప్పారు. అల్లు అర్జున్, అకీరాతోపాటు మరో హీరో అఖిల్ పుట్టిన రోజు ఈరోజే కావడం విశేషం.

మెగాస్టార్ ఆరాధ్య దైవమైన ఆంజనేయ స్వామి బర్త్ డే కూడా ఈ రోజే. హనుమంతుడికి తనకుగల అనుబంధాన్ని చిరంజీవి ఓ మధురానుభూతి ద్వారా అభిమానులను వివరించారు. చిరంజీవికి చిన్నతనంలో లాటరీలో హనుమంతుడి బొమ్మ వచ్చింది. అది ఇప్పటికీ తానే దగ్గరే ఉందని చెప్పుకొచ్చారు. తన చేతిలో ఉన్న హనుమంతుడి బొమ్మను చూసి తన తండ్రి అచ్చు తనలాగే ఉందని చెప్పాడని అప్పటి నుంచి ఆ బొమ్మను భద్రంగా దాచుకున్నట్లు ట్వీటర్లో తెలిపారు.